పుట:Shathaka-Kavula-Charitramu.pdf/278

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణవరపు వేంకటకవి.

195

14 పద్యములు చిక్కినవి. ఇందలి "బిజనవేముల చెన్నా!" యను పై 12వ పద్యమునందలి విశేషణ మాతనిగ్రామనామమా? యని నేను సందేహించితిని గాని చాటుపద్యరత్నాకరములో నిది "వేముల చిన్నారాయుఁడు” అను శీర్షికక్రింద బ్రకటిచిరి. కారణము చింత్యము. గున్వల చెన్నఁడు మహాదాతగాఁ గీర్తి నొంది మృతజీవుఁడై యున్నాఁడు. సంపగిమన్న, చౌడప్ప, వేమన్న, సుమతి, గువ్వల చెన్న శతకముల లోని పద్యములు కొందఱు జ్ఞప్తిలేక యొకరిమకుట మింకొకరిదిగా జేర్చి చదువుదురు. కాకినాడ గ్రంథాలయమువా రీశతకము శీఘ్రముగఁ బ్రకటించుట ధర్మము. ఈపట్టాభిరామకవి భట్రాజని మాత్రము తెలియును. వివరములు తెలియవు. ఇతని యితరగ థములును జిక్కుట లేదు.


గణపవరపు వేంకటకవి.


ఈతనిచరిత్రము కవులచరిత్రమున వర్ణితము. ఈతనిగ్రంథములు కొన్ని పరిషత్తువారికి నూతనముగ దొరికినవి. ఈతఁడు గుంటూరుమండలము నందలికామెపల్లెసీమవాసుఁడు. అప్పకవికిఁ బొరుగువాడు. బాలసరస్వతి, అప్పకవి, ఈవేంకటకవి, అహోబలపండితుఁడు మొదలగు లాక్షణికు లండఱును గుంటూరుమండలము నందలి కామెపల్లిసీమ లోనివా రగుటయేగాక కొంచె మించుమించుగా సమకాలీకులు. ఈశతాబ్దము లాక్షణికశతాబ్దము. కవిత్వము తగ్గి, పాండిత్యము హెచ్చి, తెలుగుకావ్యయుగము క్షీణించుటకు వీలైనలక్షణ వాజ్మయ ముద్భవించినకాలము. ఈశతాబ్దవులక్షణము పూర్వప్రసిద్ధ కావ్యములఁ జదివి, వానీనుండి లక్ష్యములు సేకరించుట, వ్యాఖ్యానములు వ్రాయట, వర్ణనముల సంఫుటీకరణ మొనర్చుట, ప్రయోగములఁ బ్రోగుచేయుట, ప్రబంధము వ్రాయవలసినమార్గములను గజముబద్దలతోఁ గొలిచి నియమములచేఁ గావ్యకర్తల బంధించుటయు