చాటుపద్యరత్నాకరము

కలానిధి గ్రంథమాల—1.

చాటుపద్యరత్నాకరము


ఇది

దీపాల పిచ్చయ్య శాస్త్రిచే

సంపాదితము—బ్రకటితమును

ద్వితీయ ముద్రణము


చెన్నపురి:

ఆంధ్రపత్రికాముద్రాలయమున

ముద్రితము.

1927

కాపీరైటు రిజిస్టర్డు

వెల 1-4-0.

రాజపోషకులు

మ. రా రా. శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డిగారు బి. ఏ., బుచ్చిరెడ్డిపాలెము
మ. రా రా. శ్రీ పొణకా గోవిందరెడ్డిగారు, అల్లూరు.
మ. రా రా. శ్రీ పర్వతరెడ్డి రామచంద్రారెడ్డిగారు, అల్లూరు.
మ. రా రా. శ్రీ ఈపూరు బలరామిరెడ్డిగారు, ఈపూరు.
మ. రా రా. శ్రీ వాకాటి సంజీవిశెట్టిగారు, నెల్లూరు.
మ. రా రా. శ్రీ సి. బి. మైసూరురెడ్డిగారు, చెరువు బెడగల్లు, కర్నూలు జిల్లా.
మ. రా రా. శ్రీ ఆర్. రామారెడ్డి గారు, దైవందిన్నె, బళ్లారిజిల్లా
మ. రా రా. శ్రీ చావలి కృష్ణయ్యపంతులుగారు, బి. యే. బి. యల్. నర్సరావుపేట.

ఉద్ధారకులు

మ. రా రా. శ్రీ చిల్లకూరు సుబ్బరామిరెడ్డిగారు, కలివెలపాలెము.
మ. రా రా. శ్రీ కాకుటూరు లింగారెడ్డిగారు, మైపాడు.
మ. రా రా. శ్రీ డాక్టరు. యం. సి. సుబ్బారావుగారు, హెచ్. యమ్. బి., నెల్లూరు.
మ. రా రా. శ్రీ అడ్డాడ సిద్ధేశ్వరశర్మగారు, మడమనూరు.

కలానిధి గ్రంథమాల


ఈకాలమున నెన్నియో గ్రంథమాలలు బయలువెడలి యెన్నోవిధముల భాషాసేవ సేయుచున్నవి. అయినను భాషా యెన్నోవిధముల భాషాసేవ సేయుచున్నవి. అయినను భాషా సతీవరివస్య యెందఱెన్ని తెఱఁగుల నొనరించినను, అతిమాత్రము కాదన్న నమ్మకమున మేమీయుద్యమమునకుఁ బూనుకొంటిమి.

సాధారణముగా గ్రంథమాలలన్నియు నవలా రచనమునకే తనశక్తిని ధారవోయుచున్న వనుట సత్యమునకు దూరముకానిమాట. కథాకల్పనా చమత్కారకలితమగునవల ఆనందప్రదముకాదని నేననుగాని అందు బాషావధూటి సంధులు వదలి, ధాతువులుచెడి, ధ్వనిసన్నగిల్లి, తొట్రుపాటు లేక చక్కఁగా నొక్కపదమైనఁ బెట్టఁజాలని నీరసస్థితిలోనుండునని మాత్రమనక తప్పదు. ఇఁక నలంకారములమాట అడుగవలయునా? ఇట్లనుటచే భాషాసౌష్ఠవముగల నవలలులేవని మా యభిప్రాయము కాదు. అవి వ్రేళ్లపై లెక్కపెట్టఁ దగినన్నిగా నుండును. కల్పనాసౌందర్యమునకుఁదోడు భాషాచాతుర్యము గల నవల సౌందర్యముతోడి సంభాషణ చతురిమగల నవలా వలె రసికుల నలరింపఁజాలునుగదా? ఏమయినను, రుచ్యంతరములేని కేవల మధురపదార్ధభక్షణము మొగము మొత్తుపగిది రచనావిభేదములేని నవలాపఠనమును విసువుపుట్టింపకపోదు. కావుననే మే మీ గ్రంథమాలయందు సకలజన సుబోధములును సరసకర్ణ రసాయనములును నగు ఖండకావ్యములు, (ప్రాచీన) ప్రబంధములు, నాటకములు, నవలలు, గద్యప్రబంధములు, ఆంధ్రీకరణములు మున్నగు వివిధ గ్రంథములను నాలుగుమాసముల కొకటి వంతునఁ బ్రకటించి పాఠకులకందింపఁ దలఁచి యున్నారము. మఱియు విద్యార్థులమేలు నర్థించి కాళిదాసాదిమహాకవుల కావ్యములను వచనరూపమున నాంధ్రీకరించి యిందుఁ బ్రకటింప సమకట్టియున్నాము.

కావున భాషాభిమానులెల్లరును మా యుద్యమమునకుఁ దోడుపడి లోకకల్యాణసంధాయకు లగుదురు గాక.

చాటుపద్యరత్నాకరము ముద్రితపూర్వమైనను ప్రతులెచ్చటను దొరకమిచే బలువురికోరికపై నిందు ప్రథమకుసుమముగా వెలువరించితిమి.

సంపాదకుఁడు.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2025, prior to 1 January 1965) after the death of the author.