ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నంతవరకు ఈ గుహల నిర్మాత ఎవరైనది తెలియుటలేదు. కాని స్థపకుల, శిలాచ్ఛిద్రకుల, పర్వతక్షకుల పేర్లును, ఎవరి పేరిట ప్రతిష్ఠ గావింపబడినదియును తెలియుచున్నది. రెండవ గుహయందు క్రిందివిధముగా భావము విచ్చెడి శాసనమున్నది. కులీనుడగు దామోదరేశ్వరుని గుడియనియు, వైభవోపేతమగు బ్రహ్మేశ్వర విలయమనియు, దీనిని మలచినది చామాచారి (ధీరుకమతి) అనియు కలదు. ఇచటి అష్టగుహ 'దేవయాతనము'లందు పెక్కు భక్తుల జ్ఞాపక చిహ్నములు గలవు.

మొదటి గుహాలయము

ఈ గుహాలయము ఉత్తర(దిక్కు) ముఖముగా తొలచబడియున్నది (చిత్రపటములు 13. 14 చూడుము). మిగిలినవన్నియు తూర్పు ముఖములు. ఇది ఒక చిన్న గుహాలయము. సుమారు 5 ½అ॥ చతురస్రాకారముగానున్నది. 6 అ॥ఎత్తుగల గర్భగృహ (shrine cell) ఇందు గలదు ఇందు మెరుపుగల నల్లరాతి శివలింగమున్నది. గుహ ముందు 11½అ॥పొడవు. 5½వెడల్పు గల ప్రాంగణము(open terrace) కలదు. గర్భగృహ ద్వారమునకు ఇరువైపులా వెలుపలి కుఢ్యభాగాన చట్రరూవణయందు ద్వారపాలకులు గదలు ధరించిన ప్రతిమలుగా చెక్కబడియున్నారు (చిత్రపటములు 13,14, 12 చూడుము). వీరు పల్లవరీతిలో గదలమీద వాలినట్లు చెక్కబడియున్నారు. పశ్చిమ భాగమందలి ద్వారపాలకునకు శృంగయుత శిరోవేష్టనము కలదు. ఇందు శాసనము లేదు. ఇది క్రీ.శ. 7వ శతాబ్ద పూర్వార్ధమునకు చెందినదని కొందరి అభిప్రాయము. క్రీ.శ. 8వ శతాబ్దము మధ్య భాగానికి చెందినదని మరికొందరి అభిప్రాయము.

ఈ గుహాలయ ముఖభాగాన రెండువైపులా కొనలందు ద్వారపాలకుల ప్రక్కగా బ్రహ్మ, విష్ణువుల అర్ధ శిల్పములున్నవి. గుహాలయ ప్రాంగణమున రెండువైపులా గణేశ, చండేశ అర్ధశిల్పములున్నవి. గుహాలయ 'కపోత' విభాగము సరిగా రూపొందింపబడలేదు. 'కపోత' మొరటుగా తయారయినటువంటి 'కూడు' డిజైన్లలో రూపొందింపబడియున్నది గర్భగృహలోని శివలింగానికి ఎదురుగా వెలుపల ప్రాంగణంలో నంది ప్రతిమ గలదు (చిత్రపటములు 13,14, 33,35 చూడుము).

ఈ గుహాలయమందు శిల్పుల చాతుర్య మగుపడదు. దీనినిబట్టికూడ ఇది ప్రాచీనమైనదని భావించవచ్చును. సారళ్యాన్నిబట్టి, ద్వారపాలకుని కొమ్ము కిరీటాన్నిబట్టీ ఇదే అతి ప్రాచీనమనిపిస్తుంది.

రెండవ గుహాలయము

తొలిదానికి తూర్పుభాగమున కొంత ఎత్తులో సెలయేటి దరిన ఈ గుహాలయము గలదు (చిత్రపటములు 15,16, 33,35 చూడుము). మొదటిదాని కాలముననే ఇదికూడ నిర్మింపబడినది. గర్భగుడి 4 ½ అడుగుల చతురస్రాకారముగా నున్నది. ఇందు మొదటి గుహలోని దానికన్నా సన్నటిది. కొంత పొడవైనదైన నల్లరాతి శివలింగమున్నది. ద్వారమున కిరువైపులా ద్వారపాలకులున్నారు ( 15,16 చిత్రపటములు చూడుము) కాని వీరికి శృంగయుతోష్ణీషములు (horned headgear) లేవు. ఈ గుహ ముందుభాగాన గల ప్రాంగణము 8 అ॥ చతురస్రముగా యున్నది. ఇచట భక్తులమొక్క, పోషకులయొక్క జ్ఞాపకచిహ్నములు గల శాసనములను లాంగ్ హర్ట్స్ కనుగొనిరి.

శిల్పచాతుర్యమునందు మొదటి గుహకు, దీనికి తేడా ఏమియు లేనట్లు అగుపడుచున్నది. ఇది శిధిలమైన పల్లవరీతి నంది ప్రతిమను ప్రాంగణమునందు కలిగియున్నది. ప్రాంగణమునందు రెండువైపులా చండేశ, గణేశ