పాలయమాం రుక్మిణీ నాయక
శ్రీరాగం ఆది తాళం
ప: పాలయమాం రుక్మిణీ నాయక - భక్త కామితదాయక
నీలవర్ణ తులసీ వనమాల - నిరుపమశీల బృందావనలోల || పాలయమాం ||
చ 1: కనకాంబరధ్అర కమనీయ విగ్రహ - కాళీయ మదనిగ్రహ
సనకాది సన్నుత చరణారవింద - సచ్చిదానంద గోవింద ముకుంద || పాలయమాం ||
చ 2: గోపవేషధర గోవర్ధనోద్ధార - గోకులకలహంస
పాపాంధకార దివాకర శ్రీకర - తాపసమానస సారస హంస || పాలయమాం ||
చ 3: నీలాంబరధర నిత్య నిర్వికార - నిగమాంత సంచార
బాలార్కకోటి ప్రకాశావిలాస - రామదాస హృదయాజ్ఞ నివాస || పాలయమాం ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.