ఉపోద్ఘాతము

పారసీక సాహిత్యము: చారిత్రక సింహావలోకనము

ప్రపంచ వాఙ్మయములయందు పారసీక సాహిత్యము చుక్కలలో శుక్రుఁడట్లు కనుతగులుచున్నది. మృదుమధుర శబ్ద సారస్యము గలిగి శ్రుతిహితముగనుండు ప్రాచ్యభాషలలో పారసీకభాష యొకటియని నిస్సంశయముగఁ జెప్పవచ్చును. ఛందస్సులోని వివిధగతుల వలన పాదాంతార నియమమువలన పారసీక పద్యములు, గేయములు చదువునపుడు, వినునపుడు మనోహరముగ నుండును.

పారసీక నాగరికత యెట్లు రెండు శాఖలుగ విభక్తమైయున్నదో అట్లే వాఙ్మయముకూడా పురాతనమనియు, ఆధునికమనియు ప్రస్ఫుట భేదములతో రెండుపాయలుగ చీలియున్నది. అరబ్బులు పారశీకమును జయించి, మహమ్మదీయ మతమును వ్యాపింపఁజేయుటకు పూర్వముండిన వాఙ్మయమువేఱు; అటవెనుకపుట్టిన వాఙ్మయము మఱొకతీరు.

పారసీకు లార్యులు; అగ్ని పూజకులు. హిందువులకు వేదములవలె వారికి `అవెస్తా' యను పవిత్ర మతగ్రంథము గలదు. ఆ గ్రంథము పురాతన పారసీక భాషయగు `జెందు' నందు వ్రాయఁబడి యున్నది. జెందు భాషలో మతసంబంధములగు రచనలు తప్ప లౌకికమలగు కావ్యములగపడుటలేదు.

పూర్వమొకప్పుడు పారసీకము నాగరికత, శూరత్వము, సంగర కళాకౌశలము అత్యున్నత దశయందుండినవి. దేరియసువంటి మహా వీరులచ్చట నుద్భవించి పరాక్రమనంతులకు గ్రీకులకు ప్రతిస్పర్డులై నిలచిరి. నేఁటికిని భగ్నా వశిష్ట రాజప్రాసాదములు, మంటపములు 1[1]సూస, పెర్సిపోలిసు, బెహిస్తూనులయందు పారసీకనాగరకతను,ప్రాభవమును వేయినోళ్ళ చాటించు చున్నవి.

ఆరవ శతాబ్దియందు మహమ్మద్ ప్రవక్త అరబ్బీ దేశమునందవతరించెను. ఏడవ శతాబ్ది ప్రారంభమున అరబ్బులు పొరసీకమును పరిపాలనముతోడ మహమ్మదీయ మతమును ప్రవేశ పెట్టిరి. భిన్న నాగరికతలుగల రెండు జాతులకు రాజకీయ సాంఘిక సంబంధ మొనగూడినపుడు అజ్ఞాతముగ కొన్ని మార్పులు ఇరుతెగల యందును పొడకట్టుచుండును. అయినను బలవీర్యములుగల జాతి ఆచారవ్యవహారములు బలహీనులకు అనుకరణీయములగు చుండును. నిర్జితులైన పారసీకులు మహమ్మదీయ మతమును స్వీకరించిరి. సమ్మ తింపనివారు ఇతరదేశములకు వలసపోయిరి. ఇప్పటి మన పార్సీలు అట్లు వలస వచ్చినవారే.


అరబ్బీ రాజభాషయైనది. పండిత సభలయందు, రాజాస్థానము లయందు అరబ్బీ వ్యవహరింపఁబడుచుండెను. అరబ్బీ , కవిత్వము, శాస్త్ర గ్రంథములు క్రొంక్రొత్త లగుటవలన పారసీకుల చిత్తముల సాక ర్షించినవి. "అచిరకాలముననే పారసీక కులీనులు అరబ్బీ పాండిత్యము నలవటించికొని రాజాస్థానమునందు ఉన్నతోద్యోగముల నిర్వహింప సాగిరి.విజయగర్వ ప్రమత్తులగు అరబ్బులకు పారసీకుల విజృం భణముపై అసూయపుట్టి వారిని నీచముగ చూచుచు సమయము దొరికినపుడెల్ల నిరుత్సాహపఱచుచుండిరి. అట్లయ్యు పొరసీకుల విజ్ఞాన తృష్ణను పొరరికట్టజూలకుండిరి. క్రీ.వె. 715 వ సంవత్సరమునందె ఉమయ్యద్ వంశీయుఁడైన కరీఫా' సులేమాను ఇట్లు వెఱగుపడెనట. “పారసీకుల విజృంభణము నాకు ఆశ్చర్యము గోలుపుచున్నది.


1 పదములుండును. వారు వేయి సంవత్సరములు రాజ్యపరిపాలన మొనరించినను ఒక్క క్షణమైన మనతో వారికక్క ఱపడి యుండినదిలేదు. కాని, మనము నూరు సంవత్సరములనుండి రాజ్యము చేయుచున్నను ఒక్కక్షణమైన వారి సొహాయ్యము పొందక తప్పినదికాదు."

బాగదాదు. కలీపు'ల రాజ్యపరిపాలనమున చక్కని అరబ్బీ కవి త్వము చెప్పినవాఱందరు పారసీకులే. కాలక్రమముగ అరబ్బీ పదములు పొరసీక భాషలోనికి యథేచ్ఛముగ ప్రవేశించినవి. ఇప్పుడేదైన నొక పొరసీ నిఘంటువెత్తి చూచినయెడల ఒకటికి మూడుపాళ్ళు అరబ్బీ పదములు పారశీక భాషలోనికి యదేచ్చచ్చగ ప్రవేశించినవి. ఇప్పుడేదైన నొక పారశీ నిఘంటువెత్తి చూచిన యెడల ఒకటికి మూడు పాళ్లు ఆరబ్బీ పదములుండును. ఈ విషయమునందు పారసీకిని తెలుగునకును సొమ్యము గోచరించుచున్నది. గ్రాంథికాంధ్రము, సంస్కృత పురా ణముల యాంద్రీకరణముతో ప్రారంభమైనందున నిరంతరాయముగ సంస్కృత పదజాలము తెలుఁగున ప్రవేశించెను. అట్లే అరబ్బీ పొండి త్యముగల పారసీక విద్వాంసులు కవిత్వపల్లుటవలన అరబ్బీ పదములు విచ్చలవిడిగ పారసీక కావ్యముల నాటుకొనిపోయినవి. పాదాంతాక్షర నియమముగల పారసీక కవిత్వమునకు అరబ్బీ పదజాలము మఱింత సౌలభ్యము చేకూర్చినది.

అరబ్బీ దండయాత్రకు పూర్వము పారసీకమున కవిత్వములే దని చెప్పుదురు. వాల్మీకి మహాకవికి పూర్వము సంస్కృతమునను, నన్నయకు ముందు తెలుఁగునను కవిత్వములేదని చెప్పునట్లు ఇదియు నొక వివాదాంశము. ఈ విషయమున పారసీక వాజ్మయ చరిత్ర కారులు భిన్నాభిప్రాయముల వెలిపుచ్చియున్నారు. కొందఱు క్రీ.వె. అయిదవ శతాబ్దియందు పంచము బహ్రాము ఛందోబద్ధమగు కావ్యము రచించెనని చెప్పుదురు. మఱి కొందరు అబుల్ హాఫ్'స్ ఆదికవి యని యందురు. మెర్వు పట్టణమున అబ్బాసనునతఁడు మామూనును కీర్తించుచు క్రీ. వె. 809 వ సంవత్సరమున ప్రథమ పారసీ కావ్యము రచించెనని మహమ్మద్ ఊఫి' వ్రాసియున్నాడు.

కాలక్రమముగ క్షీరనీరములట్టు ఆర్య, ఇస్లాము నాగరకతలు 10 సమ్మిళితములైనవి.పారసీక జాతీయజీవన ప్రభాతము దేశ మునావరించి యున్న గాఢాంధకారమును పటాపంచలు గావించెను. ఖురాసాను రాష్ట్రమున జాతీయోద్యమము తలచూపి నలుదిక్కులకు ప్రసరించెను. కాలార తిరుగనేర్చిన బిడ్డ యెంతకాలము దాది నిర్బం ధమునకు లోంగియుండును? పరాయి రాచకము జాతీయజీవన వికాసమునకు ప్రతిబంధకమని పారసీకులు తెలిసికొనిరి. అరబ్బుల పై ద్వేషము ప్రజ్వలించెను. రహస్యముగ సంభాషించుచున్నపుడు మహమ్మదును సైతము "అరబ్బీ ప్రవక్త" యని కేరడించునంతటి నిర్లక్ష్యము జనించినది. పారసీకులకు పలుకుబడి హెచ్చినది. ఉమ య్యద్వంశీయ కరీలీఫా'లకు ప్రతిస్పర్థులైన అబ్బాసీదులకు పారసీకులు సర్వవిధ సాహాయ్యములొనర్చి అరబ్బీ పరిపాలనము నామమాత్రా వశిష్టము గావించిరి.'

మెసపొటేమియా, ఆఫ్ఘనిస్థానము, ఖురాసాను రాష్ట్రము అందు పూర్వము బౌద్ధులు, హిందువులు నివసించుచుండిరి. ఇప్పటికిని అచ్చట శిథిలములైన బౌద్ధవిహారములు, విగ్రహములు కనుపట్టు చున్నవి. హిందూ బౌద్ధ మతభావములు అచ్చటచ్చట వ్యాపించి యుండెను. మానవుని సుఖదుఃఖములు విధినిర్ణీతములనియు పునరా వృత్తి, అవతారములు, ఈశ్వరుని సర్వవ్యాపకత్వము, సర్వాంతర్యామి త్వము, అగ్ని నుండి విస్ఫులింగములు బయలు వెడలినట్లు ప్రాణికోట్లు సర్వేశ్వరు నుండి వెలికుతికి యెప్పుడైన నొకప్పుడు నైక్యమగునను నిట్టిభావములు, విశ్వాసములు పూర్వ పారసీకులందు వేళ్లు కొనియుండినవి. పారసీకమున ఇస్లాముమత మిట్టి యన్యభావములతో సమ్మేళించి నూతనాకారముఁ దాల్చెను. ఇట్టి పరస్పర సమ్మేళనము నకు ప్రతిఫలముగ తొమ్మిదవ శతాబ్దియందు2[2] వేదాంతము {సూఫీ '

2

మతము) తలచూపినది. భావికవితా విజృంభణమునకు పోషకములగు పరిస్థితులు, సన్ని వేశములు ఈ శతాబ్దియం దొనగూడినవి.

పదియవ శతాబ్ది పారసీక కవితాలతకు వసంత సమయము. జాతీయ జీవనమున నూతన ఘట్టము. మహమ్మదు గజ్నవి రాజ్య పరిపాలనమున లలిత కళలు, శాస్త్రములు, భోగభాగ్యములు సర్వతో ముఖముగ వ్యాపించినవి. స్వభాషపై అరబ్బీ భాషకుగల ప్రభుత్వము జాతీయాత్మ గౌరవమునకు లోపమని దీర్ఘ దృష్టులగు కొందరు పండి తులకు, కవులకు తోచినది. మృదుమధుర శబ్దసంపన్నమగు పారసీ పదజాలమడుగంటి అరబ్బీ పదములు వాని స్థానము నాక్రమించుట అసహ్యముగ కనుపట్టెను. మణిప్రవాళ భాషను త్యజించి పరిశుద్ధమగు తమిళ్ భాష నుద్ధరించవలయునను ఉద్యమ మిప్పుడుదక్షిణదేశమున పొడచూపినట్లు “శుద్ధపారశీ” యుద్యమము బయలు దేరినది. పూర్వ పొరశీక ముపై కవుల దృష్టి మరలినది. పూర్వవీరులుజాతీయజీవన హృద్దర్పణమున ప్రతిఫలించిరి. ఫిర్ దౌసి మహాకవి యీయుద్యమమునకు నాయకుడు. స్వభాషాభిమానముతో “జాత్యముగామి నొప్పయిన సంస్కృత మెయ్యడఁజోన్స" నని తిక్కనమహాకవి నిర్ణయించుకొని ఆ దృష్టితోనే భారతమంతటి గొప్ప యితిహాస ప్రబంధము నిర్వహించి ఆంధ్రుల కృతజ్ఞతకు పాత్రుఁడయ్యెను.[3] ఫిర్ దౌసి యింతకంటెను దారుణమైన దీక్షవహించి శుద్ధపారసీ భాషలో షానామావంటి బృహదితిహాస ప్రబంధమును రచించి పారసీక జాతిని ఋణబద్ధము గావించుకొనెను.


ఫిర్ దౌసీచే ప్రారంభింపఁబడిన శుభాషోద్యమము కొంతకాలమునకు నశించెను. ఇందుకు ప్రబలకారణము గలదు. పారసీకులు మహమ్మదీయులైరి. వారి ముఖ్య మత గ్రంథమగు ఖురాను అరబ్బీ '

యందు వ్రాయంజడియున్నది. ప్రతి మహమ్మదీయునకును ఖురాను అవస్యవతనీయము; కావున పారసీక పండితులకు అరబ్బీ పొండిత్యము అనివార్యమైనది. ఫిర్ దౌసీ కాలఘుననే తక్కిన కవులందఱు మిశ్రమ భాషనే ప్రయోగించిరి.

సెల్జూకు వంశీయులవంటి తురుష్క ప్రభువులు అన్యులయ్యును స్వజాతీయ ప్రత్యేకత నుద్దరింపక పారసీకులలో కలిసిపోయి వారి జాతీయతనే స్వీకరించి పోషించిరి. అరబ్బుల పలుకుబడి అడంచుట కీ రాజకీయనీతి యావశ్యకమై యుండెను. తురుష్క పరిపాలనము పరాయి రాచకమయ్యు స్వదేశీయముగనే పఱిగణింపఁబడెను. పదియవ శతాబ్ది ప్రారంభమున అవతరించిన కవితావల్లి తురుష్క పరిపాలనమున జాతీయజీవన మహావృక్షమున కల్లుకొని కొంచెమించు మించు ఏడువందల సంవత్సరములవలకు పూవులుపూచి కాయలు కాచెను. ఫీర్ దౌసీ షానామా, ఉమ్రఖయ్యాము రుబాయతు, జామి యూసఫ్' వజులైక, సాదీ గులిస్తాను, రూమి మస్నవి, హఫీజు గేయసంపుటము, నిజామి పంచకావ్యములు పారసీక సరస్వతికి రత్నభూషణములై యలరారుచున్నవి.'

మూస:Centerకావ్యభేదములు

పారసీక ఛందస్సు మాత్రాగణబద్ధము. మస్నవి, కసీదా, గజల్, రుబాయ్ నాలుగు కావ్యభేదములు ప్రసిద్ధములైయున్నవి. సంస్కృత రూపకములందు రసము, నాయికా నాయకులు, పూర్వము నిర్ణయింపఁబడి స్వతంత్ర రచనలకట్టి నిబంధనములు ప్రతి బంధకములని క్రమక్రమముగ నిరాదరింపఁబడినట్లు, పౌరసీక కావ్యము లందును కావ్యభేదము ననుసరించి వస్తుభేదము నిర్ణయింపఁబడియు వాడుకయందు అట్టి నియమములు పొటింపఁబడకుండినవి.


మస్నవి:- ఇది మంజరీ ద్విపదకు సరిపోలును. ఈ ఛందస్సు మన ద్విపదవలె “ఎల్లమరాజునడక యేక నడక" అను సామెత

యట్లుగాక గణభేదమువలనను పాడాంతాక్షర నియమమువలనను వివిధ గతులతో నొప్పియుండును. ఈ కావ్యమున వీరరసము ప్రధానము; తరువాతిది శాంతరసము. క్రమక్రమముగా ఈ నియమము నశించినది ఫిర్దోసీ షానామా, రూమీ మస్నవీ ఛందస్సునకు ఉత్త మోదాహరణములు.


కసీదా:- విషయమునుబట్టి దీనిని స్తోత్రపాఠములకు సరిపోల్ప వచ్చును. పాదుషాలు, పెద్ద మనుష్యులు, ప్రవక్తలు, మున్నగువారిని స్తుతించుట ఈ కావ్యమున ప్రధానాంశము. సాధారణముగా అర్ధా వేక్ష గల కవులు పొదుషాలను పొగడిన పొగడ్తలే ఈ కావ్యమున నిండి యుండును. దీని నే ఛందస్సులోనైన వ్రాయవచ్చును. అయినను మస్నవీ ఛందస్సులో వ్రాయుట ఆచారమైయున్నది. పదునేడు పాద ములకంటె తక్కువగను నూటయిరువది పాదములకంటె హెచ్చుగను ఈ కావ్యమును రచింపకూడదను నియమము గలదు. పాదాంతము అన్నియు సమాన శబ్దాక్షర నిబద్ధములై యుండవలయును. ఈ కావ్యము ప్రకృతి ప్రియావసంతములలో నేదైన నొకదాని వర్ణనముతో ప్రారంభమయి కవి స్తుతింపఁదలఁచుకొన్న పొదుషా వర్ణనములోనికి దిగును. సాధారణముగ స్తుతులన్నియు కవి సమయ బద్ధములై ప్రబంధకవులు కృతినాధుల వర్ణించిన విధముగ నుండును. ఈ తెగ కావ్యములు రచించినవారిలో అన్వరి, కాఖాని, జహీర్ ఫా'ర్యాబి సుప్రసిద్ధులు.

గజల్ :- దీనికిని మన సీసమాలికకును కొంత సొదృశ్యము గోచరించును. కవికి కంసాలికి సీసము తేలిక" అన్నట్లు విద్యార్థులు మొదలు పండితులవఱకును కవులైనవారును కానివారును ఈ గేయముల నల్లుచుందురు. “గజల్ వ్రాయనివాడు ఖమర్ త్రాపనివాఁడు పొరసీ వేరు పెట్టుకొనఁడ”మ సామెతయే ఈ రచనయొక్క సౌలభ్యమును దెలుపుచున్నది. ఒక తెగ గజలులో ప్రియావిరహాము, వసంతము, ద్రాక్షారసము, ఉద్యానవనము, గులాబి, బుల్బులి, ప్రియుని త్యాగము, ప్రియురాలి సౌందర్యవర్ణనము మున్నగు శృంగార విషయములు వర్ణింపఁబడియుండును. మఱికొన్నిట సూఫీ' మతతత్త్వములు, నీతులు ప్రకటింపబడియుండును. ఈ కావ్యమున ఐదు మొదలు ఇటువది పొదములవర కుండవచ్చును. కసీదాకువలె పొదాంత నియమము కలదు.షం ంతబ్రీజ్, , సాది, హఫీ 'జ్ , గజలు కావ్య రచనమునందు ప్రముఖులు.

రుబాయి:- ఇది మన తేటగీతికి సరిపోలును. తేటగీతివలె ఇదియు దేశ్యచ్ఛందస్సని చెప్పుదురు. దీని పుట్టుకను గుఱించి దౌలత్ షాహసమర్ఖండి ఇట్లు వ్రాసియున్నాఁడు: “పారసీకమున యాకుబ్ బిన్ లై సఫా'రను పాదుషా యుండెను. అతనికొక చిన్నకుమా రుడుండెను. వానిని చాల గారాబముతో పెంచుకొనుచుండెను, ఈద్ పండుగనాఁడు ఆ బాలుఁడు తోడిబాలురతో కలసి గింజలాట ఆడుచుండెను. వినోదము చూచుట కొఱకు తండ్రియు అచ్చటకు వచ్చి నిలఁబడెను. ఇతర బాలురవలెనే రాజుకుమారుఁడును గింజలను దొరలించెను. ఏడు గింజలు చెండును ముట్టినవి; ఒకటి తప్పిపోయి బాలుఁడు హతాశుఁడయి మఱియొకతూరి గింజను దొరలింపఁగా అది చెండు దగ్గరకు దొరలిపోయెను. సంతోషముపట్టలేక ఆ రాజకుమారుడిట్లనియెను: “ఘల్తాన్ ఘల్తాన్ హమిర్ వద్ తా లబెగో" అనగా దొరలుచు దొరలుచు (ఆ గింజ) చెండు అంచునకు పోవుచున్నదని అర్థము. పొదుషాకీమాటలు వినసొంపుగా నుండెను. అంతట ఆయన ఆస్థాన సచివులను రావించి ఆ వాక్యమును విని పించెను. అది కవిత్వమని వారు చెప్పిరి. అట్టి పాదమె మఱియొ కటి వ్రాయఁబడినది. అది కొన్నాళ్ళ వఱకు ద్విపదగనే వాడుకలో నుండినది. కాని భావము లిముడ్చుటకు రెండు పాదములు చాలవని రెండు ద్విపదల నొకటిగా చేర్చిరి. అదియే రుబోయి యైనది.”


రుబాయికి నాలుగు పాదములుండెను. (పారసీకలాక్షణికులు అర్ధపాదములని అందురు). ఒకటి, రెండు, నాలుగవ పాదములకు నది. అందుకా అంత్యనియమము కలదు. వేమన గీతములందువలె రుబాయిలలో తత్త్వములు, నీతులు సంక్షేపించి చెప్పుటకు అనువుగా నుండును. ఖయ్యాము రుబాయతు హఫీజు సాబైనామా యీ తెగ కావ్యములలో గణ్యములైనవి.

ప్రబంధకవుల పోకడలు

ప్రపంచమందంతటను మానవస్వభావ మొకేతీరుగ నున్నది. అరిషడ్వర్గములనంబడు కామ క్రోధ లోభ మోహ మద మాత్స ర్యములు జగదేకములై సృష్టి స్థితి లయములకు బాహ్య పాతువులై బ్రాణికోట్లను ఐహికమార్గమున నడువుచున్నవి. ఇట్టి ప్రకృతిని ఆశ్ర యించిన కవిత్వముకూడ అన్ని దేశములందు ఒకే విధముగ నుండును. అయినను దేశకాల భేదములు ప్రత్యేక జాతీయశీలము, భిన్నా చార వ్యవహారములు ఆయాదేశీయ కవిత్వములకు అనితరసాధ్యమును అనను కరణీయమునగు విశిష్టతను చేకూర్చును. పారసీ సాహిత్యముకూడ ఈ న్యాయమునకు బాహ్యముకాదు.


పారసీ కావ్యములందు సున్నితమైన శృంగారము కలదు. ఆ కవుల దృష్టి ప్రియురాలి ముంగురులను, చెంప జుల్పాలను, నర్గిస్ పూలవంటి కన్నులను, గులాబిరంగు చెక్కిళ్ళను, తేనెయూరు వాతెఱును, కపోల తిలకమును, నవ్వునపుడు చెక్కిళ్ళపై నేర్పడు పల్లమునుదాఁటి క్రిందికి ప్రసరింపలేదు; దగ్గరున్న పాలిండ్లపై దుము కలేదు; అటనుండి నున్నవి నూగారు వై జారి పొక్కిలిలో పడలేదు; సాధారణముగా పారసీక విలాసవతులు కుడితినీ తోడుగుకోని గాగరా కట్టుకొనియుండుటయే దీనికి కారణమైయుండును.

ప్రబంధ యుగమునాంటి ఇతరదేశముల కవులందటీవలే పార సీక కవులును కవిసమయ సంప్రదాయ బద్ధులు. మన ప్రబంధకవుల నాయిక నడుము మొట్టమొదట పంచానన మధ్యమయి, కృశించి, పసచెడి, సన్నగిల్లి అస్తి నానీ విచికిత్సకు లోనయి తుట్టతుదకు గగనము వలె సూస్యమైనట్లు పొరసీక కవుల సాయిక 3[4] నోరు మొట్టమొదట ఇందుపంతయలు క్రమముగా పూడుకొనివచ్చి, చీమ హృదయ మంత యయి, నూదిమొనయంతయయి. కడపటికి అర్థముగాని సూక్తి లో దాగియున్న భావమువలె శూన్యమగును! ప్రణయ కలహముచే మాట లాడకున్న నాయికనుంచి నాయకుఁడు “నీనోరు చీమహృదయమంత చిన్నదైనందున మాటలాడఁజాల కున్నావని” వ్యాజస్తుతి చేయును.


వెదవి వైని పుట్టుమచ్చను వర్ణించునపుడు “హిందు” అను పద మును శ్లేషించి చమత్కరింతురు. (హిందు దొంగ, నల్లని బానిస, విగ్రహారాధకుఁడు అని అర్థము) “నీ పెదవి పై నిరవుకొన్న తిలక మును దప్ప కౌసరు నదీతీరమున హిందువు నెవరుచూచిరి. (సర్ కుష్ నామా). కొసరు స్వర్గమున ప్రవహించు తేనెవాఁగు, పొరసీ యందు “లబ్” అను పదమునకు వాతెజయనియు, ఏటిగట్టనియు, అనియు అర్థములు కలవు. ఇచ్చట వెదవి కౌసరునకు, పుట్టుమచ్చ హిందువునకు పోల్పఁబడినది. మహమ్మదీయుల స్వర్గ మునందు హిందువు ఉండడనియు ధ్వనించును. “ఓ ప్రేయసీ, నీ చెక్కుల పై నుండునది పుట్టుమచ్చకాదు; సూర్యోపాసకుఁడగు హిందూబాలుఁడు," అని మఱియొక కవి వ్రాసెను. పుట్టుమచ్చ యను హిందూబాలుఁడు ముఖమను సూర్యుని అర్చించుచున్నాఁడని భావము, విరహ విహ్వలుఁడగు కాముకుని దీపమునంబడి మాడిపోవు మిడుతకు సరిపోల్తురు, ప్రేయసీ కొరకు ప్రియుఁడు నిశ్చింతముగ ప్రాణ పరిత్యాగము చేయును. ప్రణయ సాహిత్యమునందు లైలామజ్నూనుల కథయు, షీరీను ఫర్హాదుల కథయు కఠిన చిత్తుని హృదయమునైన కరఁగింపఁజాలినంత కరుణరస భరితములుగ నున్నవి. షానామావంటి రాజచరిత్రలు, షీరీసుఫర్హాదులవంటి కథాకావ్య ములు తప్ప తక్కిన గజలు వాజ్మయమున భావనవ్యత యగపడదు.


3 ఇతరులకు అనగా మననంటివారికి కొన్ని గజలులు చదువునుపునప్పటికి విసుగుపుట్టును. ఒకే విధమైన భావములుప్రకటింపబడియుండును. పారశీక కావులు పునరుక్తిని దోషముగ పరిగణింపరు. ప్రబందకవులు పోకడ ఇంకొన్ని దిక్ ప్రదర్శనము చూపించితిని.మొత్తముమీద పౌరసీక సాహిత్యము: గుణమునందునురాసి యందును ఏ సాహిత్యమునకు తీసిపోదు. పారతంత్ర్యమువదలి పారసీక జాతీయజీవనము పూర్ణవికాసము చెందియున్న కాలమున, ఉమ్రఖయ్యాము నిషాపూరున జన్మించెను. అప్పటి నిషాపూరు శిథిలమైనది. ఇప్పటి నిషాపూరు వేఱు. ఈతని జన్మసంవత్సరము ఫలానీదని నిర్ణయించుటకు తగిన సాధకములు లేవు.1[5] క్రీ.వే. 1015 మొదలు 1035 లోపల నేదియైన

1 నొక సంవత్సరముగ నుండవచ్చును. ఖయ్యాము సంపూర్ణనామము గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఉమ్రాబిన్ ఇబ్రాహిమ్. తఖల్లున్ నామము (Pen-name) ఖయ్యాము. పారసీకులు తమ పేరులకు తండ్రి పేరును జోడించుకొందురు. అందువలన ఖయ్యాము తండ్రి పేరు ఇబ్రహీమని తెలిసికొన వీలైనది.


పారసీక కవులందఱును తఖల్లున్ నామము పెట్టుకొనుట సామా న్యాచారమై యుండినది, ఫి'ర్ దౌసి, హాఫిజ్, అతారి, సోది, జామి అనునవి యిట్టి మారు పేరులే. సంస్కృత కవులలోకూడ రత్నఖేటుఁడు, కోటిసారుఁడు, భవభూతి అను మారు పేరులుగల కవు లుండిరి. ఇటువంటి లాంఛనములనుబట్టి వారివారి వృత్తులు నిర్ణయింప సాహసించుట చూడ బేకర్, బార్బర్, స్మిత్ అను పేరులుగల ఆంగ్లే యులందఱు ఆయావృత్తులకు సంబంధించినవారని చెప్పినట్లుండును. అయినను పారసీకపోజ్మయ చరిత్రకారులు కొందఱు, అతారి అత్త రమ్ము చుండెననియు, ఖయ్యాము.2 [6]డేరాలుకుట్టుచుండెననియు,


దొరకినది. దానిని బట్టి రోతారుగారు ఖయ్యాము జన్మదినము నిర్ణయిం చుటయేగాక, లగ్నకోటినిగూడ తయారుచేసిరి.

1048 మే నెల 18 వ తేదీన సూర్యోదయ కాలమున జన్మము. లగ్నము మిధునము. రవి, బుధ, శుక్రులు లగ్నమందున్నారు. ద్వితీయ మున చంద్రుడు. పంచమమున రాహువు. అష్టమమున శని. నవమమున గురువు. ఏకదశమున కేతువు. ద్వాదశమున అంగారకుడు. జన్మాది 1064-2- 24 తేది వఱకు గురుదశ,


ఇంతకన్నను ప్రబలమైన ఆధారము దొరకువఱకు ఈ నిర్ణయమె సత్యమని తలంపవచ్చును. సర్, ఇ.డి, రాస్ మహాశయుడు ఖయ్యాము జన్మ సంవత్సరము 1040 అనియు, సయ్యద్ సులేమాన్ నద్విగారు 1048 అనియు ఇదివరకు నిర్ణయించి యుండిరి.


2 న న మరు ను చిత్రము వున్నది. ఇట్టి పటాలు మమ్ము నొడి వసును జయము నేడు ముభావులు Bము చెప్పు ని ముందు 1:7 - ములు కట్టి జీవించు వీడు ఆ కాలమున సుప్రసిద్ధ విశ్వ విద్యాలయమున పారంగతుడము పాపాలుతోసు వజీరుకుతోను కలసి - జన ఆచార్య స్థానము: లంకనంత వీలుండి ముండునా నును సందేహము పుట్టుక నూనడు.

సాధారణముగ పూర్వకవుల కిత్రములపలె మామ చరి త్రను కూడ కాలగర్భమున దాగియున్నది. అతని గార్తవ్య జీవిత ముపు గుంచి తెలిసికొనుట నుధారములు లేవు, హోషే కుకు ఒక భార్య తల్లిగారింటికి పోయినప్పుడు తాను అనుభవించిన విరహ వేదనను, తనువు మరణంచి నప్పుడు ను పొందిన దుఃఖమును కొన్ని గుణములలో జాలి పుట్టునట్లు వర్ణించి యున్నాడు. కాని 3 ఖయ్యూము


1.ఎటులలో జాలు పుచ్చునట్లు సంకన్నాడు. కాని, గాం (జువారా), అబ్దుల్లా మహా మ్మూర్ ఖయ్యాం. ముదహలుద్దీన్ ముహమ్మద్ జిన్ ఆఫ్ అల్ {A} ఈ ఖండము వలన కుటుటవలన ఏప్పడిన కొక, ఈ వసు - వచ్చు. నుండి వేరు నొకటి. 3 ఇయామి . రును ప్రభువును రజాయుడు ఈ అంది నటులు - వికీ ఈము సుమ నది, 30 ను ఎంత పలుముకుగా, వీలైనయెడల, - నాలు గాని నము: 7ను. మన ముందైనను ... కుటుంబ ముందు. కంచు దంచు విష్యులును. ఈ ముద్దు పడి పడు తలు. తలను వాసం -- ఉమ ఖయ్యాము వికారంగా కోలముల కొక చిత్రమైన కవ ఇడు, నిజాముల్ ములు, మును పొడిపిక ప్రభువున హోసన సంకును సంహము, సల అనుపదిని పుచున్నాను. " నిషాపూరునందు: సుప్రసిద్ధ - శ్రీ వేత్తలను అమణం ముసఫిక్ అను ఆచార్యుడుండెను. ఆయన మొడ్డ చడువుకొన్నవారు అదృష్టవంతుల గుడు రను పరంబ్ కమున వ్యాపించియుండును. నేను తూప్ వYడము నుండి విషాపూచునకు మనకు మామున గారికడ విద్యానగ చేరితిని. ఆయన నన్ను చాలాడుతో హరవించుచుండెను. శాకను వయనపై నికి ఉద్దలు కుదు. నాలుగు సంవత్సరములుక్కు నాయనవద్ద ఉడితిని. నేను పూర్థిగా చేరిన వెనుక కొంతకాలమునకు ఉపముఖయాము, హెసన్ ఆస్ సబాస్ అను ఇద్దరు విద్యార్థులు ఇస్తూ సముహార్ ము చదువవచ్చును. ఈ ముఖహ్యము, బుడుపుచుండుము విషయగ్రహణ శక్తి యుండును. కలలు మిన్నకనుండెను. నేను రువుగము ప్రియ స్నేహితుల మైన ... సబాహు నాతోడను ఖర్యముతోడను ఇట్లు చెప్పెను. “ఇమం సొ హేజు దగ్గరకు చదువుకొన్న వారు అదృష్టవంతులు గుషుడని లోకులు చెప్పుకొందురు. ఆధమవక్షము మన ముద్దులకీలో వండై ననొకండు ఉన్నత స్థితికి రావచ్చును. అట్లు ప్రాభవము సంపాదించినవారు తక్కిన ఇద్దఱిని తనతో సమానులనుగ నొనర్పవలయునను ఒప్పుడు, మనము చేసికొనవలయును.' ఈ మాటలకు మేము సమ్మతించి మువ్వురమును అదే విధముగ ఎమరు బద్దులమైతిమి. చాలా కొంతకాలము జరిగిన వెనుక నేను నిషాపూరునుండి వెడలిపోయి అల్ ప్ అర్చలాన్ ప్రభువునొద్ద మంత్రిత్వము నిర్వహించుచుంటిని. హకీం ఉమఖయ్యాము నా యొద్దకు వచ్చెను. మేముపూర్వము కావించుకొన్న యొప్పదలను నాచేతనై సంతవఱకు నెర వేర్పతలంచి గౌరవ పురస్సరముగ నిట్లంటిని: 'మీరు మేధావంతులు, మీరేదియైనా నొక రాజోద్యోగము నిర్వహింపవలయునని నాకు కోరికగనున్నది. ఏలన, ఇమాంమువఫిక్ గారీ యొద్ద విద్యార్థులమై యుండినపుడు మనము ఇటువంటి షరత్తు చేసికొని యున్నాము. మీ పొండిత్యమును ప్రతిభను గుఱించి పాదుషాకడ విన్నవించెదను. తరువాత మీరును నావలెనే యున్నత స్థితికి రావచ్చును.' ఈ మాట లకు ఖయ్యామిట్లు చెవ్పెను: “మీరాడిన మాటలు మీకులీనతకును హృదయ కారుణ్యమునకు, గొప్పతనమునకు తార్కాణముగ నున్నవి,అయినను పూర్వ పశ్చిమరాష్ట్రముల వజీరులు మీవలెనే నాబోటి యల్పుని గురించి తలపోయుదురని ఏమి నమ్మకము కలదు. ఎట్లయి నను తమవంటి గొప్పవారికి అసాధ్యమగునది యేదియులేదు. నాబోటి సొమాన్యునిపై తమరింతటి శ్రద్ధ వహించినందుకు యావజ్జీవము నేను మీకు కృతజ్ఞుఁడను. తమ కరుణ యున్నయెడల నేనొక మూల కూర్చుండి గ్రంథకాలక్షేపము చేయుచు విద్యార్థులకు పాఠము చెప్పుచు తమరీ ఆయురారోగ్వైశ్వర్యములు ఇతోధికముగ అభివృద్ధి చెందునటుల దేవుని ప్రార్థించుచుండెదను. "హకీము గారికి ఉద్యోగా వేక్ష లేదని నిశ్చితముగ నెఱింగి సాలీనా 1200 తోమానులు ఆదా యమువచ్చు జాగీరును నిషాపూరున నొసంగితిని. అంతట హకీం ఉమఖయ్యాము ప్రకృతి శాస్త్రములు, కళలు మున్నగువానియందు ప్రావీణ్యము సంపాదించుచుండెను.

“హసన్ బిన్ సబాహు ఆల్ ఏ అర్సలాన్ రాజ్యకాలమున నెచ్చట నుండినదియు నెవ రెఱుంగరు. అర్సలాన్ మరణానంతరము నేను మలిక్ షా ప్రభుత్వమున మంత్రినిగా నున్నపుడు అతఁడు సందర్శించి యొప్పదలను జ్ఞప్తి పఱచెను. నేను పొదుషా యొద్దకు తీసుకోనిపోయి రాజాస్థానమున నొక యుద్యోగ మిప్పించితిని. కొన్ని దినముల కతఁడు పాదుషాకు స్నేహపాత్రుఁడయి ఆయన బుద్ధిని తప్పుదారులకు లాగుచుండెను. పాదుషా ఆ సవ్వడి కనిపెట్టి అతని పదభ్రష్టుని గావించెను."


నిజాముల్ ముల్కు వ్రాతనుబట్టి ఖయ్యాము ఉద్యోగా పేక్ష, లేనివాఁడనియు విజ్ఞానసంపాదనమునందె నిమగ్నుఁడయి శాంత ముగ కాలము గడుపుచుండెననియు తెలియవచ్చుచున్నది.

ఖయ్యాము బాల్యయౌవనములనాంటి కాలపరిస్థితులు.

మత నిర్బంధములు, ఆచారముల కట్టుంబాటులు, ఇహలోక ద్వేషము, వైరాగ్యము పెచ్చు పెరిగి మానవజీవితము యంత్ర ప్రాయమైనపుడు తిరుగుఁబాటుకూడ తలచూపుచుండును. పారసీ కమున ఇట్టి తిరుగుబాటు పదియవ శతాబ్ది ప్రారంభమున పొడకట్టి నది. గ్రీకు అరబ్బీ ప్రకృతిశాస్త్ర గ్రంథముల మూలమున భౌతికవిజ్ఞు నము విద్యావంతులలో క్రమక్రమముగ వ్యాపించివది. మూడ భక్తియు అర్థములేని మతాచారముల పైని విశ్వాసమును సన్నగిల్లఁ జొచ్చినది. స్వాభావికముగ హేతువాదవరమైన ఖయ్యాము మనస్తత్వమునకు ఈ పరిస్థితులనుకూలమై యుండినవి.


ఖయ్యాము జన్మించిన సంవత్సరముననో లేక యొక సంవత్స రము ముందుగనో ఇబిన్ సీనా మరణించెను.అతడు మహాప్రతిభాశాలి; కవి;

పండితుఁడు; విజ్ఞానశాస్త్రవేత్త ; గణితశాస్త్రజ్ఞుడు; జ్యోతిష్కుఁడు; వైద్యుఁడు; రాజకార్యనిర్వాహకుఁడు; భోగప్రియుండు. ఇబిన్ సీనా రసాయన శాస్త్రమునందు పరిశోధనలు కావించెను.ఒక ప్రసిద్ధ వైద్యగ్రంథమును, ఆత్మావతరణమను ఖండకావ్యమును,అషఫా అను తత్త్వశాస్త్రమును రచించెను. దేవుఁడద్వయుఁడనియు, ఇండియగోచరుఁడు కాండనియు, ఇట్టివాఁడని నిరూపించుటకు వీలు

కానివాఁడనియు, సృష్టికి హేతుభూతుడనియు, అతఁడు తన తత్త్వ

  • శాస్త్రమున వ్రాసియున్నాడు. ఆత్మ మబ్బులో మెఱుపుతీగవలె

ప్రజ్వలించి అంతర్హితమౌనని ఆల్మోనతరణమను కావ్యమునందు వ్రాసియున్నాఁడు.


ఒకరాత్రి భోగానుభవమునందు, మఱియొక రాత్రి విజ్ఞానార్జనము నందు ఇబిస్సీనా కాలము గడుపుచుండెనని యొక లోకవాదము కలదు. రాజ్యకార్య లంపటత్వమునతప్ప ఇబిన్ సీనాకును ఉమ్రఖయ్యా మునకును భావములందు, మనఃప్రవృత్తులందు ఏమియు భేదములు గోచరింపవు, ఖయ్యాము యౌవనకాలమునాఁటికి ఇజిన్ సీనా తత్త్వ ములు, బోధలు, భావములు కజకుమాయుకుండెను.ఖయ్యాము అతనిని ఆదర్శవ్యక్తిగా గ్రహించియుండవచ్చును.


ఇంక అప్పటి రాజకీయ పరిస్థితుల సరయుదము; సుల్తాను మహా మ్ముదు గజ్నవి క్రీ. వె. 1030 వ సంవత్సరమున కీర్తి శేషుఁడాయెను. ఆతని పుత్రుండు మాసూదు సింహాసనమధిష్టించెను. నాలుగు సంవత్సరములు గడచిన వేనుక 'నెల్జూరు వంశీయులగు త్రోగుల్, బేగ్, చకిర్ బేగ్ అను యిరువురు తురుష్క నాయకులు అతని నోడించిరి. అది మొదలు ఇరువది సంవత్సరములవలకు సెల్జూకుల విజయధ్వజము అప్రతిహతముగ పౌరసీకమున సమరయాత్ర సలుపు చుండెను. దేశమున శాంతి యంతరించెను. మెర్వు, నిషాపూరు, పౌరాత్, సేస్తాన్ , బాగదాదు మున్నగు ముఖ్యపట్టణములు ఆ బురువురు తురుష్క నాయకుల వశమైనవి. వీరి మరణానంతరము అల్ప్ అర్సలాన్ పొరసీక సామ్రాజ్య సింహాసన మధిష్ఠ్మించెను. తొమ్మిది సంవత్సరములు గడచిన వెనుక అత్యడు విప్లవకారులచే హత్యకోవింపఁబడెను. అటు తర్వాత మలిక్ షా రాజ్యభారము వహిం చెను. అల్ప్ అర్సలాన్ కు మంత్రిగ నుండిన నిజాముల్ ముల్కు మలిక్ షాకును మంత్రియాయెను. మలిక్ షా పొరశీక చరిత్రమున ప్రసిద్ధుడు. అతనికి జలాలుద్దీన్ అని మఱియొక పేరుండెను. జలాలీశకము అతని రాజ్యకాలమున, అనగా క్రీ. వె. 1079 మార్చి 15 వ తేదీన ప్రారంభింపంబడెను, ఉమర్ ఖయ్యాము మలిక్ షాచే స్థాపియబడిన జ్యోతిషాలయము నందు ప్రధాన జ్యోతిష్కుడైయుండి పంచాంగమును సంస్కరించెను. నిజూముల్ ముల్కు గొప్ప విద్వాంసుఁడు; నీతివేత్త. ఈతఁడు మలిక్ షా కొరకు 'సియాసత్ నామా' యను ప్రసిద్ధమైన పాలసా శాస్త్రమును రచించి పాదుషా పేరు ప్రతిష్ఠల చిరంజీవము కావించెను. నిజాముల్ ముల్కు మంత్రిత్వ కాలమున క్రొత్త పట్ట ణములు నిర్మింపబడినవి. ప్రాంత పట్టణములు శృంగారింపబడినవి.. కళాశాలలు నెలకొల్పఁబడినవి. వేయేల, ప్రజలు సంపన్నులై అభివృద్ధి నొందిరి. భోగములు, కళలుపెంపొందెను. భావస్వాతంత్ర్యము ప్రజలెను. మఱియొకమాటు పొరసి రాజభాషయైనది. దేశమున శాంతి నెలకొనినది. ఇట్టి అనుకూల పరిస్థితులలో ఈ ఉమర్ ఖయ్యాము బాల్యయౌవనములు సుఖముగా గడచిపోయెను.

ఖయ్యాము పాండిత్య విశేషములు

ఖయ్యాము బాల్యము బల్షలో గడచెను.ఆతనికి బాల్యము నుండియు గణితశాస్త్రమునందు ప్రీతియు, నైపుణ్యము హెచ్చుగ నుండెను. జ్యామితి, అక్షరగణితములందు ప్రవీణుఁడయి జ్యోతి శ్శాస్త్రము నభ్యసించెను. ఈ శాస్త్రమునందు సమకాలికులలో ఎవ్వరును ఖయ్యామును మించినవారు లేరంట! పంచాంగమును సంస్కరించుటకు మలిక్ షా ప్రసిద్ధ జ్యోతిష్కులను సమావేశపర చినపుడు ఖయ్యాము వారికి నాయకుండయి ప్రశంసనీయముగ ఆ కార్యము నెరవేర్చెను.


ఖయ్యాము అరబ్బీ భాషలో అక్షరగణితమును రచించెను.ఆ గణితము చాలాకాలము వఱకు , ప్రమాణగ్రంథముగ పరిగణింపఁబడు

పటి


చుండెను. పూర్వ మీ అరబ్బీ గ్రంథము ఫ్రెంచి భాషలోని కను వదింపఁబడినది. ఇదికాక, ధాతురసాయన శాస్త్రము, యూక్లిడ్ జామెట్రీకి వ్యాఖ్యానము, ఒక తత్త్వశాస్త్రము, రుబాయతు, అన్నియు కలసి తొమ్మిది గ్రంథములను అతఁడు రచించెను. అక్షరగణితము, రసాయనశాస్త్రము, జ్యామెట్రీ వ్యాఖ్యానముల మాతృకలు ప్యారిన్, లండన్ , ఇండియా ఆఫీసు లయిబ్రరీలయందు భద్రము చేయబడి యున్నవి. తక్కినవి (రుబాయతు తప్ప) నామమాత్రావశిష్టములు. గ్రహగతులననుసరించి వాయు వర్షముల ముందుగ తెలిసికొను శక్తి కూడ ఖయ్యామున కుండినదని నిజామి ఉరూజి సమర్ఖండి ఇట్లు వ్రాసియున్నాఁడు: “సదరుద్దీన్ మహమ్మద్ బిన్ ఉల్ మజఫర్ పాదుషా, తాను వేటాడఁబోవలయుననియు వర్షముకాని మంచుకాని కురువని యొకదినము నిర్ణయించి తెలుపవలయుననియు మెర్వు పట్టణమునుండి ఖయ్యామునకు చెప్పివంపెను. అంతట ఆయన రెండుదివములు గ్రహగతులు లెక్కించి ముహూర్తము నిర్ణయించి స్వయముగా పాదుషా యొద్దకుపోయి ఫలానిదినము బాగుగయున్న దని తెలిపెను. పొదుషా వేఁటకు ప్రయాణమగుచుండగనే నలుదెసల మబ్బులు క్రమ్ముకొని మంచు కురవనారంభించెను. లోకులు హకీం సాషాబును నిందించిరి. పాదుషాయును వెనుకకు మరలం దలంచుకొ నెను. అంతట ఖయ్యాము “నిర్భయముగ ప్రయాణముకండు. మబ్బు విచ్చిపోవును; అయిదు దీనముల వఱకు నేలచెమ్మ యైనకాదు" అని చెప్పెను. అట్లే పొదుషా ప్రయాణము సాగించెను. కొన్ని నిము షములకు గాలివీచి మబ్బు చెల్లాచెదరైపోయెను. మంచుపడుటయు నిలిచెను. అయిదు దినముల వఱుకు చినుకు చిటుక్కుమని పడలేదు.” ఖయ్యాము జ్ఞప్తికూడ చాల అద్భుతమైనదని చెప్పుకొందురు. అతఁడు ఇస్పపోన్ మఖాము నందు విడిసియుండగా ఒక పుస్తక మును ఏడుమాఱులు చదివెను. నిషాపూరునకు వచ్చిన వెనుక తాను చదివిన పుస్తకమును జ్ఞప్తి పెట్టుకొని తిరుగ ప్రాసెను. తరువాత కొన్ని దినములకు మాతృకతో ఆ పుస్తకమును పోల్చిచూడ ఏవో కొన్నిమాటలు తప్ప గ్రంథమంతయు మాతృకకు సరియైన నఖలుగ నుండెనంట.

ఖయ్యాము మధ్యవయస్సు


నిజాముల్ ముల్కు ప్రసాదించిన జాగీరులవలనను, మలిక్ షా ఆదరణమువలనను ఖయ్యాము మధ్యవయస్సు సుఖముగ గడచెను. రాజస్థానమునందు, పండితగోష్ఠులందు సరస సల్లాపములాడుచు, శిష్యులకు పాఠము చెప్పుచు, ప్రకృతి రమణీయకమును తనివార క్రోలుచు, ఇష్టమున్నపుడు ఒక్కొక్క రుబాయి శిష్యులయెదుట ఆశు వుగ చెప్పుచు, సాఖియందియిచ్చు ద్రాక్షాసవమానుచు, పచ్చ బయ ళుల విహరించుచు, సెలయేటిపాటల నాలకించుచు, వనభోజనము లారగించుచు, వెన్నెలగోష్ఠులు సలుపుచు ఖయ్యాము నిర్విచారము గను, శాంతముగను జీవితము గడుపుచుండెను. మెర్వుపట్టణ పాలకుడగు సదరుద్దీన్ మహమ్మదు అతనిని హెచ్చుగ నాదరించు చుండెను; సంజరు షాహి అర్ధాసనమిచ్చి గౌరవించుచుండెను. ఈ విధముగ ఖయ్యాము జీవితము కొంచెమించుమించు ఏబదిసంవత్సరముల వయస్సువరకు వేరుప్రతిష్ఠలతోను, భోగభాగ్యములతోను పెంపొందు చుండెను. “భోగముల ననుభవింపుము. మధువానుము. గతముగతంబే; భవిష్యదర్థము సంశయాంధ సంవృతము;వర్తమానమొక్కటే అనుభావ్యము. జీవితము వాతూలములోని దివ్వె.ప్రాయము ప్రతిక్షణము గతించిపోవుచున్నది. రాలినపూపులు మరలవికసింపవు. త్వరపడుము" అను నట్టి భావములుగల రుబాయీలు ఖయ్యాము మధ్యవయస్సునను, తత్ పూర్వమును రచింపఁబడినవని మనమూహింపవచ్చును. ఆనాఁటి జీవితము ఈ క్రింది పద్యమున మూర్తి భవించి యున్నది.

32 మన ప్రియజీవితంబు కుసుమంబుల పోలికలకుం జంచలంబు గావున బువులట్లు కాలమును బుత్తము నవ్వుట పాటలన్ గొనగొనంబాటు కాలువల కోవలుం దియ్యని పానమూని జీవన భరణ ప్రయాస మొక దక్కరు యిప్పుడనే మోస్ ప్రేయసీ.

ఖయ్యూము అపర వయస్సు

ఈ లోకమున నెవ్వనికిని కాల మొక్కరీతిగ గడవంబోదు" మానవుని యుదృష్టము. చక్రనేమి క్రమముగా . తిరుచుండును; హెచ్చుతొచ్చులు మానవ జీవితమునకు సహజములు, పండితులు, పామరులు, రాజులు, రయితులు, కలవారు లేని వారు, అందరును, ఈ న్యాయమునకు బద్దులై యుందురు. ఖయ్యాము సుఖము స్వచ్చము భగ్నమైనది.


ఖయ్యామునకు మిత్రుడును ప్రధానామాత్యుండునగు నిజుముల్ ముల్కు క్రీ. 3. 1092 వ సంవత్సరమున “ఇస్మయీలియాలచే 4[7] హత్య కావింపబడెను. తర్వాత కొలంది కాలమునకే చులక్ షాహియు భూగర్భమున పవళించెను. రాజ్యమున అంతఃకలహములు, పిప్లవములు చెలరేఁగినవి, సెల్ జూకు సామ్రాజ్యము విచ్ఛిన్నమైనది. ఖురాసాను, ఈరాకు విభక్త మైనవి. సిరియా, కెర్మన్ రాష్ట్రములు సామ్రా జ్యము నుండి విడిపడినవి. పుట్టగొడుగులవలె ఊరు వేరులేని రాజులు బయలుదేరిరి. అన్ని విధములైన స్వాతంత్ర్యములు అడుగంటినవి. ఇస్మయీలియాల దౌర్జన్యము నానాటికి హెచ్చుచుండెను. సెల్ జూకు రాజ్యమున దాగియుండిన మూఢభక్తి, అజ్ఞానము, మతపాషం డత్వము, నేఁడు మరల తల చూపినవి. ఖురాను ధర్మములు తు.చ.


. తప్పకుండ కావ్యమునకు అనుసరణీయములైనవి. ఖయ్యామునంటి స్వతంత్రభావులు, హేతువాదులు ప్రాణాపాయ స్థితియందుండిరి. ఖయ్యాము తన అపర వయస్సును ఇట్టి మతసాంఘిక రాజకీయ దుఃస్థితిలో గడుపవలసి వచ్చెను. వీరభ డ్రా చెడ్డి స్వర్గస్థులయి రెడ్డిరాజుల యాశ్రయము తొలఁగిన వెనుక కవిసార్వభౌముడు శ్రీనాథుడు "కాశికాచిశ్వేశుఁగలసె వీరారెడ్డి రత్నాం బరంబునే రాయుండిచ్చు సను పద్యమున తన హృదయ తాపమును వెలిపుచ్చినట్లు ఖయ్యాము కూడ తన దుస్థితి నిట్లు చెప్పుకొనెను.


మనమున కెక్కినట్టి యజమానులు మిత్రులు, జెల్లినారు;యౌ
వనమధుమాసముం గుసుసభారమురాలిచిపోయె జీవితం
బను సరకంబునందు నడుగంటే మధూళియు నేదినంబు ప
చ్చెనొ మఱియెప్పుడేంగెనో. దీపింపడు హర్షమిహంగ మిప్పుడున్

.

పూవులకారు. రాకలకుం బోయెడి సీతులకున్ రసోజ్జ్వల
జీవిత కావ్యషత్రములు తెచ్చెఱంద్రిప్పితి శోకస్ర్పద
ష్టావిలమౌ హృదంతరము నాసవమున్ బ్రతియోగ మొక్కటే
కావ సమర్థ; మింక ముది కాయము బేతగిలంగ ద్రావెదన్

.

అయ్యో ఖయ్యాము ము తన దుఃఖమును పానపాత్రయందు ముంచి వేయ దలంచెను, అతడు పూర్వాచార పరాయణుఁడుకాఁడనియు, మహమ్మదీయు మతాచారముల పాటించుట లేదనియు ఒక పదంతి ప్రజలలో వ్యాపించెను. ఇస్మాలియాలు తన ప్రాణమున కెప్పుడు ఎసరు పెట్టెదరో యుని తలచి ‘హాజీ' యనిపించుకున్న ఇట్టి యాపద తప్పించుకొన వచ్చునని ఖయ్యాము మక్కా యాత్ర చేసెను. కాని పవిత్రమైన 'కాబా' ఆతని భక్తి వినమ్రుని కావింపలేదు. తిరిగి వచ్చినప్పుడు ఇట్లు చెప్పెను:

కలపయు మట్టిఱాలనిడి కట్టిన దేవళమందు నీకు నే
ఫలము లభించు? ప్రేమరస భావయుతుండవయేని కొమినిన్
వలవుము; ప్రాణహీనమగు బండలు వేయిటికన్న శ్రేష్ఠమై
యలరుఁగదా మనుష్యహృదయంబు ప్రతి ప్రణయానురక్తులన్.


స్వప్రయత్నము విఫలమైనపుడు, కష్టములు తలతాకినపుడు ధీమంతులు సైతము ఒక్కొక్కప్పుడు ఆత్మ విశ్వాసము కోలుపోయి నిరుత్సాహవంతులగుచుందురు. ఖయ్యాము హృదయముకూడ కాల సర్పదంష్ట్రాదష్టమైనది. జీవితములోని లోతుపాతులు కొనవచ్చినవి. కవితా విహంగము భావసౌకల్పిత ప్రపంచమున నక్షత్రమండలమున ఎగురుట మాని భూమిపైనున్న గూటియందు కూలఁబడెను. “కాలశరాసనోత్పతిత కాండముతీక్షాణ" మని తెలిసినది. ఈ ప్రపం చము నందనవనమయ్యు ధనములేనివారికి బంధనమగునను సత్యము గోచరించినది. మరణ భయముకంటే జీవసంభరణభయమె మిక్కు టమని తోచినది. "కోరికలన్నియుం గుడుపుగూరవు సౌఖ్యము దుఃఖ మెప్పుడంగూరురసంబు చేఁదటులు కూడియెయుండు” నను జీవితరహస్యము బోధపడినది.విధి యనివార్యమను భావమువలన తృప్తియలవడినది. ఖయ్యాము సహజముగ ధీమంతుఁడు కావున నిరు త్సాహపడక ఇట్లు చెప్పెను:

విధి నిబద్ధము వచ్చు వెడలిపోవు
నఖిల సుఖదుఃఖములు నీ కయాచితముగ;
జడియఁబోకు రుస్తుముజాలు శత్రుఁడైన;
తాయి సఖుఁడైన విందులఁ దలఁపఁబోకు.


ఈనాఁటి ఖయ్యాము జీవితము ఈ క్రింది పద్యమున ప్రతి ఫలించుచున్నది,

జ్ఞానపటాలయమ్ము నొడికమ్ముగఁగుట్టు ఖయామున్నేడు దుః
ఖానల దగ్ధుడయ్యె; యముఁడ , బైనుకత్తెర జీవితంపు బి



ర్రాను గుడారుమోకుఁ దెగనొత్తె; బ్రపంచపు సంతలోన దు
గానికి నమ్మెనిన్నుఁ బలుగాకి దలాలి విధాయి యయ్యెయో!


ఖయ్యామునకు శిష్య ప్రాయుఁడైన నిజామి ఉరూజి యిట్లు వ్రాసెను “ఇమాం ఉమ్రఖయ్యాము బల్బు బట్టణమున అమీర్ అబూసాద్ గృహమున అతిథిగనుండినపుడు నే నాయనను సంద ర్శించితిని. ఒకనాఁటి సాయంకాలము తోటలో విహరించుచుండి నాతోడ నిట్లనియేను:“ఇటువంటి స్థలములో నాగోరియుండును. సంవత్సరమునకు రెండు మాఱులు వృక్షములు లతలునాగోరిపై పువ్వులు, ఆకులను రాల్చును.' ఈ మాటలలోని భావము నాకు బోధపడినది. అయినను యిటువంటి శాస్త్రవేత్త నిరర్థకముగ నేదియు మాట్లాడడని నేను తలంచితిని.తర్వాత కొంతకాలమునకు నేను నిషాపూరునకు పోయి ర్యున్నపుడు హాకీం ఉమ్రఖయ్యాము కీర్తి శేషుఁడాయెనని విని ఆయన సమాధిని దర్శించుటకు వెళ్ళియుంటిని. ఒకతోఁట గోడప్రక్క, చల్లని చెట్లనీడ ఆగోరి కట్టబడియుండెను. గాలి వీచినప్పుడెల్ల పువ్వులు, ఆకులు దానిపై పడుచుండెను. పూర్వము ఇమాం ఉమ్రఖయ్యాము చెప్పి యుండిన మాటలు నాకు జ్ఞప్తికివచ్చి అకాంక్షితముగ సా కన్నులు చెమ్మగిల్లెను.” ఉమఖయ్యాము క్రీ. 3. 1123 వ సంవత్సరమున నిషాపూరున భూగర్భము నలంకరించెను.



36 ఖయ్యాము ఇతర పారసీక కవులవలె గొప్పకావ్యమేదియు వ్రాయ లేదు. అరబ్బీ కవిత్వము కూడ కొంత వ్రాసియుండెను; కాని, ఏవో కొన్ని పద్యములు తప్ప మిగతవి కాలగర్భమున జీర్ణించిపోయెను. ఖయ్యాము శాస్త్రపరిశ్రమయందు విసుగెత్తిన మనస్సుకు వినోదము కల్పించుటుకొలుకు అప్పుడప్పుడు పద్యములు రచించి శిష్యులదగ్గరనో, మిత్రులకడనో లేక చండేశ గోష్ఠులందో చదువుచుండెను. ప్రత్యేకగుణ విశిష్టములును అంతస్సారయుతములునైన ఆ పద్యములు ప్రజల హృద తములందు నాటుకొనిపోయినవి. అయినను పారసీక పండితులు ఖయ్యామును గొప్ప కవిగా పరిగణింపలేదు. పారసీక వాజ్మయ చరి త్రమును వ్రాసిన బ్రౌనుగారును ఆ. పండితుల యభిప్రాయమునే గైకొని ఖయ్యామును మూడవతరగతి కవులలో చేర్చుట ఎంతయు విమర్శనీయము.


హిమాలయ పర్వతమునకున్న గంభీరసౌందర్యము, వైశాల్యము సానతీరిన వజ్రఖండమునకు లేకపోవచ్చును. అందుచేతనే అది గర్హ్య ముకాదు. కాళిదాసు మేఘసందేశము, వాల్మీకి రామాయణమంతటి బృహత్ ప్రబంధముకాదను కారణమువలననే ఆ కావ్యము నిరాద రణీయము కానేరదు. కళాసృష్టులను ఒకదానితో నొకటి సరిపోల్చి హెచ్చుతొచ్చుల నిర్ణయించుట తగదు. ఒక్కొక్క దానికిని ప్రత్యేకస్థా సము కలదు. “నిగ్గుగల్లు జాతినీల మొక్కటిచాలు తమకుబెళుకుఱాలు తట్టెడేల" అనునట్లు రాశికంటె గుణమే ప్రధానము. గుణము కలిగి రాశియు 'హెచ్చగునేని అది యింకను శ్రేష్ఠమే. ఒక శతకమును రచించి మయూరుఁడు గొప్ప కవియని అని పించుకొనెను. ఒక 'యెలిజి' వల్లనే థామస్ గ్రే యను ఆంగ్లేయకవి ప్రఖ్యాతుఁడయ్యెను. 'భాషో' అను జపానుకవి కొన్ని 'హోక్కు' పద్యములను (మన ద్విపదకంటెను చిన్నవి) వ్రాసి ప్రసిద్ధుఁడాయెను. ఖయ్యాము ఒక పద్యము వ్రాయకుండినను తనకీర్తి విజ్ఞాన ప్రపంచమున శాశ్వతముగ నుండదగియు నేఁడు అతని కీర్తి యంతయు రుబా యతు వై నాధారపడియున్నది. 'సత్కవితా యద్యస్తి రాజ్యేన కిమ్మ సెడు భర్తృహరిసుభాషితమున ఎంత గభీరసత్యమిమిడియున్నది! పురా తన పాంథశాలయగు నీ ప్రపంచమున బహరాం జమిషీడులవంటి పాదుషా లెందతో కొన్ని యేండ్లు కాలూని, గతించిరి. రాజ్యముల హద్దులు మాటనవి, ప్రపంచ బహిఃస్వరూపమే మాఱినది. అట్ల య్యును కవితాను ప్రాణితమైన ఖయ్యాము యశశ్చంద్రికలు నేఁడు నానాదేశముల వ్యాపించి హృదయాహ్లాదకరములై విలసిల్లుచున్నవి.


ఒకటి రెండు విషయములఁదప్ప తక్కిన యన్నిటియందు ఖయ్యా ముతో సరిపోల్చతగినవాఁడు ఆంధ్రకవులలో ఒక్క వేమనయే యగపడుచున్నాఁడు. ఖయ్యాము భోగి, వేమన యోగి. ఖయ్యాము శాస్త్రోపాసకుఁడు, వేమన ఆత్మసాధకుఁడు. ఆయనది రక్తి మార్గము, ఈయనది విరక్తి మార్గము.


పారసీ పండితులు ఖయ్యాము నవగణించినట్లే ఆంధ్ర పండితు లును వేమన్నను కవిగ లెక్కింపలేదు. ఏలయన, వేమన అష్టాదశ వర్ణనములు గలిగినాయికానాయకుల శృంగారచేష్టలకు ఆకరమైన యొక ప్రబంధమును వ్రాసియుండలేదు. రసహీనమైన శబ్దాలంకార భూయిష్ఠమయి బంధగర్భ కవిత్వములతో బచ్చెన బొమ్మలవలె కను పట్టు నిర్జీవకావ్యము రచించినవానిని సైతము గొప్పకవియని పండి తులు సన్మానింతురు; కాని, నిరాడంబరమయి సహజసౌందర్యము కలిగి సూటిగా ప్రజల హృదయములోనికి ప్రవేశింపఁగల ముచ్చట రామబాణముల యైన పద్యములు చెప్పిన కవి వారి దృష్టికి తాళఁడు! ఐననేమి? పూర్వము ప్రబంధకవులు రచించిన కావ్యములెన్నియో విస్మృత ములయి పోయినవి పోగా మిగిలినవి యెన్నియో పుస్తకభాండాగారము లందు పాతఁబడి అర్థానర్థ రూపములతో కోనయూపిరితో బ్రతికి యుండగా వేమనపద్యములు సజీవములై ఆంధ్రుల హృదయపీఠ మునధిష్టించి ప్రమాణీకరింపఁదగిన సూక్తులై సామెతలై వాడుకలో నుండుటయే వాని యోగ్యతకు ప్రబల నిదర్శనము,సాంఘిక దురా చారములను, కపట గురువుల మతవ్యాపారములను, భక్తుల వేష ధారిత్వమును నిర్భయముగఖండించుటయందు యిరువురును మోమోట లేనివారు.


వేమన విరాగియగుటవలన ప్రకృతి సౌందర్యమును వర్ణింపలేదు. ఖయ్యాము భోగలాలసుండును రసార్ద్రహృదయుడునగుటచేత ప్రకృతి రామణీయకమును అద్భుతముగ వర్ణించెను. “రమణీయార్థ ప్రతిపా దక శబ్దము" కావ్యమను సూత్రమున కీతని కవిత్వము ఉదాహరణ ప్రొయముగ నుండును. ఒక్కొక్కప్పుడు అలంకార ప్రియులకు “ఇదియు ఒక కవిత్వమా?” అను సందేహము పొడమునటు “ప్రొద్దు పొడిచినది. ఒక పూఱేకుల మంచు బొట్లు రాలుచున్నవి” అని పొడిమాటలతో నిరలంకృతముగ ఉన్నది ఉన్నట్లుగా చెప్పును. ఈ నిరాడంబరత్వమె ఖయ్యాము కవిత్వమున నొక విశిష్ట గుణమై యలరారుచున్నది. వేమనయందు గోచరింపని హాస్యప్రియత్వము ఖయ్యామునం దగువడుచున్నది. ఈ గుణమువలననే జీవితభారము తేలికయయి, దుఃఖము చులకనయి. జీవనప్రయాసము భరించుట సులభమగు చున్నది. సాధారణముగా ఖయ్యాము అందటి మహ్మదీయులవలె మసీదుకు పోయి నమాజుచేసి యెఱుఁగఁడు. ఒకనాఁడు వినోదా ర్థము మసీదుకు పోయెను. “నమాజు చేయుటకు రండు' అని ఒక స్నేహితుఁడు పిలిచెను. అందుకు - ఖయ్యామిట్లు బదులు చెప్పెను:

మునుపు మసీదువాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతపై
చినిఁగెను; నేఁడునున్ మరల జెప్పులకోసము వచ్చినాఁడ; నె

మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపంగనాను; నీవు చ చ్చినయెడ వీడిపోయెదవు చెపలువోలె నమాజు సై తమున్ . ఖయ్యాము చమత్కారమును హాస్య ప్రియత్వమును తెలిసికొను టకు 28, 30, 47, 81, 96, 11వ సంఖ్యలుగల పద్యములు చదువుండు. ఖయ్యాము గతించిన వెనుక ఆయన పద్యములు క్రమక్రమముగ ప్రజలలో వ్యాపించినవి. కొంతకాలమునకు సంపుటముగ కూర్పఁబడినవి. ఖయ్యాము పద్యములను గుఱించి అక్బరు పొదుషా యిట్లు చెన్నెనని 'అబుని ఆగ్బరి' అను గ్రంథ వ్రాయబడియున్నది: ఖాజా హఫీ జు యొక్క ప్రతి గజలు క్రిందను ఉమఖయ్యాము రుబాయి వ్రాయఁబడవలయును; అట్లు కాని (హఫీ 'జు గజలుతో కూడ ఖయ్యాము రుబాబు చచువ మేని) రుచి ననుభవింపకుండ ద్రాక్షాసవమానినట్లుండును.” ఈ మాటలను బట్టి ఖయ్యాము రుబాయతు ఎంత ప్రజానురంజకమైయుండినదో మన మూహింపవచ్చును. వేమన పద్యముల సంపుటమువలె రుబాయతుకూడ గలగూర Kంవ. కథయుండదు. విషయైక్యముండదు. ప్రతిపద్యమును పూర్వో త్తర నిరపేక్షకమై స్వతంత్రముగ నుండును. ఇందలి పద్యములు విషయమును బట్టి కాక, పొదాంతాక్షరముల ననుసరించి ఆకారాదిగా కూర్పబడియుండును. శిష్యులు, ప్రశిష్యులు, అభిమానులు రచిం చీన పద్యములు కాలానుసారముగ వేమన పద్యములలో చేరి షుమారు ఇన్నూటినుండి మూడు వేల వజకు పెరిగినటుల ఖయ్యాము రుబా యీలుకూడ నూటయేబది మొదలు వేయివఱకు పెరిగినవి. రుబా యతు యొక్క పురాతనమైన వ్రాతప్రతి ఆక్సుఫదులో బోడ్లియన్ పుస్తక భాండాగారమున నున్నది. ఆ ప్రతి క్రీ.వె. 1460 లో అనగా ఖయ్యాము మరణానంతరము 337 సంవత్సరములకు షిరాజు పట్టణమున వ్రాయఁబడినది. దానిలో 158 రుబాయీలు మాత్రమె కలవు. 1528 లో అనగా ఖయ్యాము గతించిన 404 సంవత్సరము లకు వ్రాయఁబడిన మఱియొక ప్రతి ప్యారిసు నగరమునందలి బిబ్లి యోతికే నాసియోనాల్ (Bibliotheque Nationale) అను పుస్తక భాండాగారమున నున్నది. దానియందు 349 రుబాయీలు కలవు. ఖయ్యాము మరణానంతరము 500 సంవత్సరములకు వ్రాయంబడిన మఱియొక ప్రతి బ్రిటిష్ మ్యూజియము లయిబ్రరీలో నున్నది. దానియందు 540 రుబాయీలు కలవు. హిందూదేశమున వ్యాప్తిలో నున్న ప్రతులలో 700 మొదలు 900 రుబాయీలు వఱకుండును. నావద్దనున్న రెండు ప్రతులలో హైదరాబాదులో ప్రకటితమైన దాని యందు 692 ను, లాహోరు ప్రతియందు 800 రుబాయీలును కలవు. కొలము గడచుకొలఁది రుబాయీల మొత్త మెట్లు పెరుగుచూ వచ్చినదో పై సంఖ్యలవలన మనము తెలిసికొనవచ్చును. కనుగొ నెను. యుండెను. రుబాయతు ఆవిష్కరణము. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయమున చరిత్రాధ్యాపకుఁడుగా నుండిన ఇ. బి. కోవెల్ అనునతఁడు బోడ్లీయన్ లయిబ్రరీలో ఖయ్యాము రుబాయతు ఉన్నదని 1856 లో దానిని గుఱించి 1858 లో 'కలకత్తా రెవ్యూ' యందొక వ్యాసమును ప్రకటించి తరువాత ఒక సంవత్సరమునకు ఎడ్వర్డుఫిట్ థైరాక్టు (Edward Fitz Gerald) బోడ్లీయన్ లయిబ్రరీలోని రుబాయతును డెబ్బదియైదు పద్యములుగా ఇంగ్లీషులోనికి తర్జుమా చేసెను. 1867 లో పారసీక రాజాస్థానమున ఫ్రెంచి రాయబారికి ద్విభాషిగా నుండిన జె.బి. నికోల రుబాయతును ఫ్రెంచి భాషలోనికి తర్జుమా చేసెను. తరువాత మఱియొక సంవత్సరమునకు ఫి'ట్ జెరాల్డు ఇంకకొన్ని రుబాయీలను ఆంగీకరించి నూటొక్క పద్యములు గల ద్వితీయ సంస్కరణమును ప్రకటించెను. మొట్టమొదట ముద్రింప బడిన తర్జుమా ఎక్కుడు వ్యాప్తిలోనికి రాలేదు. ఖరీదు ఒక అణావలకు తగ్గింపఁబడినది. అప్పటికిని కొన్ని పుస్తకములు మాత్రమే నాగర పోయినవి. ద్వితీయ సంస్కరణము ప్రకటింపఁబడునప్పటికి ఖయ్యాము పేరు పాశ్చాత్య దేశములలో అందు ముఖ్యముగా ఇంగ్లాండున ప్రతిధ్వనింపసాగెను. అణావరకు ఖరీదు తగ్గింపబడిన 36 పుటల గ్రంథము తుట్టతుదకు 16 రూపాయలకు వెలపోయినది. అమెరికా దేశమందు ఈ తర్జుమాను మొరాకోచర్మముతో బైండుచే యించి బైబిలు గ్రంథమువలె నారాధించుచుండిరి. ఉమ్రఖయ్యాము సంఘములు స్థాపింపఁబడినవి. రుబాయతు చదువుట యొక కొచారమైనది. ఖయ్యామె బ్రతికి యుండినయెడల తన రుబాయ తుకు కలిగిన లోకవ్యాప్తికి తానే ఆశ్యర్యపడి యుండునేమో! ఫిట్ థైరాల్డు తర్జుమా ప్రజాదరణ పొత్రమలు లక్షలకొలది పుస్తకములు వెలపోవుచుండుటవలన మణికొందరు ఆంగ్లేయులు రుబాయతును ఆంగ్లీకరించిరి. కాని కళానైపుణ్యమునందును కవితా మాధుర్యము నందును అవి ఫిట్ బ్లెరాల్డు తర్జుమాకు సరిరావు. ఆతని కృతి మక్కికి మక్కి అనువాదముకొక మాతృకయందలి రమణీయములును సున్నితములునునైన భావములను ఏర్పరచి -స్వతం త్రముగ సృజింపఁబడిన మనోహర పద్యకావ్యము. కావుననే ఆ పద్యములలో చాలవజకు, మాతృకలలో ఏ రుబాయీకి, ఏ పర్యము వ్రాయఁబడినదో తెలిసికొనుటకు వీలుకాకయున్నది. కొన్ని రుబాయీ లలోని భావములను ఏర్చి కూర్చి యొక పద్యముగా వ్రాసితినని ఫిట్స్ఆరాలు తన జాబులలో తెలిపియున్నాఁడు. పారసీక కావ్య ములలో పునరుక్తులు కుప్పతిప్పలుగనుండును. ఈ దోషము “సెమి టిక్' భాషాకావ్యములకు సహజముగనున్నది. ఖురాను ఆంగ్లీకృతికి ఉపోద్ఘాతము రచించిన మార్గోలియత్ (Margoliouth) అను ప్రాచ్య భాషా పండితుఁడు ఇట్లు వ్రాసెను: “సెమెటిక్ మనస్తత్వమునకు సహజమగు పునరుక్తి దోషము ఖురానునందు ఉత్ప్రేక్షించంబడినది.” ఖయ్యాము రుబాయతునందుకూడ ఈ దోషము విచ్చలవిడిగ వ్యాపిం చినది. కాని, యిందుకు కారణము కలదు. రుబాయతు ఏకధారగా నారయుదము, వ్రాయఁబడిన కావ్యముకాదు. అప్పుడప్పుడు వివిధ మనఃస్థితులలో వ్రాయంబడిన పద్యసముదాయమందు భావసామ్యముగల పద్యము లుండుట అసహజముకాదు, భాషాంతరీకరించువారు ఈ లోపమును గుర్తించి భావములను ఏర్చి కూర్చుట అత్యావశ్యకము. ఖయ్యాము రుబాయతు తేనెతెట్టె. ఫిట్ థైరాలు ఆంధీకరణము తేనెనింపిన గిన్నె. ఖయ్యాము - యూరపు పాశ్చాత్యదేశములలో, అందు ముఖ్యముగా ఇంగ్లీషు మాతృ భాషగానుండు దేశములలో ఖయ్యాము రుబోడుతు ఇంతటి అపూర్వ వ్యాప్తినొందుటకు హేతుభూతములైన పరిస్థితుల పదునెనిమిదవ శతాబ్దిని పాశ్చాత్య దేశములందు విజ్ఞాన ప్రబోధమంకురిం చినది. శాస్త్రవ్యాసంగమును పరిశ్రమలకృషియు ప్రారంభమాయెను. ఆవిరియంత్రము నిర్మింపబడిన వెంటనే పారిశ్రామిక యుగము అవ తరించినది. ఫా'రడి (Farady) అను విద్యుత్తత్వ శాస్త్రజ్ఞుడు ఈ శతాబ్ది అంతమున జన్మించెను. పంతొమ్మిదవ శతాబ్దియందు విద్యుచ్ఛక్తి యంత్రములు నిర్మింపఁబడినవి. వానిమూలమున పరి ప్రవర్థమానములగు చుండెను. డార్విన్, పాక్ స్లీ, సైన్ సరు మున్నగు శాస్త్రజ్ఞులుద్భవించి సృష్టితత్త్వ విచారముగావించి పరిణామ సిద్ధాంతమును వెల్లడించిరి. ప్రజలయందు పరచింతకంటే ఐహిక చింతయే హెచ్చినది. హేతువాదము ప్రబలినతోడనే విశ్వాసము నశింపఁజొచ్చెను. ప్రకృతి శాస్త్రములకు విరుద్ధములైన పురాణమతముల పునాదులు సడలనారంభించినవి. సృష్టికర్త యీ విశ్వమును ఆరుదినములలో సృజించి ఏడవనాఁడు విశ్రాంతిగానే నను బైబిలుసూక్తి హాస్యాస్పదమాయెను. క్రైస్తవమతముపై విశ్వా సన్నగిల్లుచుండెను. విద్యావంతులకు ప్రకృతిశాస్త్రముల పై ఆదరణము హెచ్చుచుండెను. స్వర్గనరకములు భావనాకల్పితముల నియు భౌతికశాస్త్రము నశించిన వెనుక ఆత్మ శేషించునని చెప్పుట ఉత్త కల్లయనియు, దైవమున కారోపింపఁబడిన శక్తులన్నియు ప్రకృతివే శ్రమలు దినదిన సము యనియు, పరిణామవాదులు బోధించుచుండిరి. ఇట్టి క్రొత్త ప్రాంతల సంధి సమయమున విద్యావంతుల చిత్తములు సంశయగ్రస్తములయి చంచలములయి అభినవ సందేశము కొఱకు నిరీక్షించుచుండినవి. ఇట్టి అనుకూల సమయమున ఖయ్యాము రుబాయతు పాశ్చాత్యవాజ్మ యమున నవతరించినది. దానీయందు అభినవ వైజ్ఞానిక భావములు ప్రతిఫలించునట్లు పొడకట్టినవి. కోవుననే రుబాయతు కంతటి వ్యాప్తి కలిగినది. యందు అను మానవులందు జ్ఞానమంకురించినది మొదలు “నేనెవ్వఁడను? ఎచ్చటనుండి వచ్చితిని? ఎచ్చటకు పోవుచున్నాను? మరణమే నా స్థితికి అంత్యమా లేక మరణానంతర జీవితముకలడా? మానవకోటి ఇట్టి వివిధత్వమునకు వివర్యాసమునకు కారణములేమి? సృష్టికర్త యొకఁడున్నాఁడా? ఉండిన యేయుద్దేశ్యముతో నిట్టి విచిత్రమైన సృష్టిని గావించుచున్నాఁడు. ఒకడు సుఖింప నేల, మఱి యొక్కడు దుఃఖింపనేల?” నిట్టి ప్రశ్నలు, విచారములు, సంశయములు పొటమరించుచుండెను. నాఁటినుండి నేఁటివలకు ఇట్టి ప్రశ్నలడుగఁబడుచున్నవి. సమాధానములు చెప్పఁబడుచున్నవి. ఒక్కొక్క దేశమున ఒక్కొక్క కాలమున ఒక్కొక్క మతమును ఇటువంటి సమస్యల చిక్కు విడదీయ ప్రయత్నించినది. అయినను ఈ ప్రశ్నలు సందేహములు అనుదిననవ్యములై చిరంతనములై వివేక వంతుల బుద్ధిపరిశ్రమకు హేతువులై, నీకృత్తములయ్యు రావణుని శిర స్సులవలె మరల మరల పుట్టుచున్నవి. తన పుట్టుపూర్వోత్తరములు దెలిసికొను నిచ్చ ప్రతి మానవునకును సహజముగ నుండును. ఇట్టి విషయములనే ఖయ్యాము తన రుబాయతున చర్చించియున్నాండు. ఇయ్యాము మత విశ్వాసములు. సూఫీ మత పరిభాషలో ద్రాక్షాసవము బ్రహ్మానందమునకు సంకే తము, ఖయ్యాము కొలమునాఁటికి సూఫీ మతము బాగుగ వ్యాపించి యుండెను. సూఫీ'లు లౌకిక భోగములు త్యజించి దారిద్ర్యము నను భవించుచు నిరంతరము దైవధ్యాన లగ్నచిత్తులయి ఆత్మ పరమాత్మల ఐక్యముకొఱకు పాటుపడుచుందురు. ఎట్టిమతమైనను కొంతకాలము నకు కరుడుగట్టి ఆచారబద్ధమయి అనేక విధములగు కపట వ్యాపార ముల కాలవాలమగుచుండును; ఆధ్యాత్మిక సమస్య ఆర్థిక సమస్యగా పరిణమించును. ఖయ్యాము కాలమునాఁటికి సూఫీ' సమాజమునందు చేషధారులు బయలుదేరిరి. వారి స్వయమారోపిత పావనత్వము, వైరాగ్యము వేషధారిత్వముగ మాఱినది. ఖయ్యాము సూఫీ'లను ఎగతాళి చేయుటకోయనునట్లు వారి మత పరిభాషనే గ్రహించి సౌంప్రదాయిక సంకేతములను లౌకికార్థమున ప్రయోగించేను. దీనిని తెలిసికొనక కొందఱు ఖయ్యాము రూమీవలే సూఫీ 'యని పొరబడిరి. అయిదారు రుబాయీలు చదువగనే ఆతడు వర్ణించిన ద్రాక్షాసవము సాంకేతికము కోదని మనకు స్ఫురించును. పాశ్చాత్య విమర్శకులు కొందఱు ఖయ్యామును ఎపిక్యూర్ (Epicure) అని పేర్కొనిరి. వాడుకలో ఎపిక్యూర్. అనఁగా పరచిం తలేని భోగలాలసుఁడు. ఎపిక్యూరస్ సిద్ధాంతములు ఒకటి రెండు విష యములలో తప్ప ఖయ్యాము నమ్మకములకంటె భిన్నముగ నుండును; “శరీరము భౌతికము. ఆత్మ భౌతికమైన సూక్ష్మ శరీరము. నీటిలో ఉప్పు నీటియందంతయు వ్యాపించియుండునటుల సూక్ష్మ శరీరము (ఆత్మ) దేహమున. వ్యాపించియుండును. దేహముతోడ ఆత్మయు నశించును. మరణానంతర జీవితములేదు, సంతోషమె జీవిత ప్రయోజనము. ఇంద్రియగోచరమగు ప్రపంచమె యథార్థమైనది. ప్రత్యక్ష ప్రమాణమే గ్రాహ్యము. మనశ్శరీరములకు ప్రతికూలము లైన విషయములను తొలగించుటయే సంతోషము. సృష్టి ప్రకృతి కార్యము. విధియనునది లేదు. మానవుని యదృష్టము తనచేతిలో నున్నది" అని ఎపిక్యూరన్ చెప్పేను. అతఁడు అనుమాన ప్రమాణము నమ్మునందువలన జ్యోతిశ్శాస్త్రము (Astronomy) అబద్ధమని భ్రమ పడెను. కరఁగిన 45 ఎపిక్యూరసు, ఖయ్యాముల భావములు చాలవజకు పరస్పర విరుద్ధములు. ఎపిక్యూరసు నిరీశ్వరవాది, ఖయ్యాము ఈశ్వరవాది. అతఁడు విధిలేదని చెప్పను, ఇతఁడు మన సుఖదుఃఖములు విధినిర్ణీత ములని సిద్ధాంతీకరించును. అతఁడు ఖగోళశాస్త్రము కల్పితమనుసు, ఇతఁడు గొప్ప జ్యోతిశ్శాస్త్రజ్ఞుఁడు. మరణానంతర జీవితములేదను విశ్వాసము ఇరువురకు సమానమే. ఖయ్యాము ఎపిక్యూరస్ సిద్ధాంత ముల నొకటి రెండు తప్ప అన్నింటిని అంగీకరింపలేదు. ఒక్క ఈశ్వరుని విషయమందు తప్ప చార్వాక మతమున కును, ఖయ్యాము మతమునకును ఏలాటి భేదముండదు. ప్రబోధ చంద్రోదయ నాటకమున ద్వితీయాంక అంకమున మహామోహునకు చార్వా కునకు జరిగిన సంభాషణమునందు చార్వాకమతము వివరింపఁబడి నది. బ్రహ్మశ్రీ వడ్డాది ' సుబ్బరాయకవిగారి ఆంద్రీకరణమునుండి ఉదాహరణ గ్రహించంబడినది. "సర్వదా లోకాయతమే మనందగినది; దానియందు బ్రత్యక్ష మొక్కటియే ప్రమాణము. పృథివ్యత్తేజో వాయువులె తత్త్వములని, అర్థకామములే పురుషార్ధము లని, భూతములే జ్ఞానజనకములని, పరలోకమన్నది. సున్నయని, మరణమే మోక్షమని........... వాచస్పతి............ తచ్ఛా స్త్ర మును........... రచించిన పోఁడయ్యెను.” చార్వాకుల అభిప్రాయ ములతో సరిపోవు భావములుగల పద్యములెన్నియో “పానశాల” యందున్నవి. ఖయ్యాము మతము చిత్రమైనది. ఆత్మ ఈశ్వరాంశము కావున ఈశ్వరవాదులందలు ఆత్మయున్నదని నమ్ముదురు. నిరీశ్వరవా దులు ఆత్మశరీరమువలె నశించునని చెప్పుదురు; ఖయ్యాము మాత్రమె ఈశ్వరుఁడున్నాఁడనియు, ఆత్మలేదనియు చెప్పియున్నాఁడు. “దేవుడే సృష్టి కర్త, కుమ్మరి కుండలు చేయునట్లు ఈశ్వరుఁడు లోకమును సృజించును. కుండపగిలిన వెనుక మన్ను మంటిలో కలసిపోవునట్లు ప్రాణముపోయిన వెనుక శరీరము భూమిలో జీర్ణించును. మృత్తిక మరల వేటొక శరీర నిర్మాణమునకు వినియోగపడును. ఆత్మ కలడను నమ్మకము లేదు. కావున ఖయ్యాము భౌతిక పునరా వృత్తిని మాత్ర మీట్లు చెవ్పెను. జలజల మంజులార్భటుల జోల్కొను నీ సెలయేటి కోవలన్ మొలచినలేతపచ్చికల మోటుగం”లిడఁబోకు, దేవదూ తల రుచిరాధర ప్రకృతి దాల్చెనొ సుందర మందగామినీ లలిత శరీరమృత్కణములం జిగిరించెనో యేమొ కోమలీ ఇట్టి నమ్మకము ఆంగ్లేయ కవియగు షెల్లీకి కూడ ఉండినట్లు తోఁచుచున్నది. There is not one atom of you earth But once was living man, Nor the minutest drop of rain That hangeth in its thinnesi cloud, But flowed in human vein. మానవులోనరించు కార్యములకు తాము బాధ్యులుకారు. ఏల యన దేవుఁడే శరీరమును, మనస్సును సృజించెను. మనమొనర్చు ప్రతి కార్యమునకును మనస్సే చేరకము. కావున, పాపకార్యము లొనర్చితిమని దేవుఁడు మనల నెట్లు శిక్షించగలడు? అట్టి మనస్సు నాతఁడేల సృజింపవలయును? కుండ సొట్టపోయిన తప్పెవరిది? కుమ్మరిదా, కుండదా? అని ఖయ్యాము ప్రశ్నించును. పాపము చేసితినని అనుతాపము నొందకుము. దేవుఁడు తన తప్పును తానే దిద్దుకొని నన్ను మన్నించునని ధైర్యము చెప్పి యూరడించును. సృష్టి కొలబద్ధము. విధి యనివార్యము. గతము కన్నులఁగట్టదు. భవిష్యదర్ధము సంశయాంధసంవృతము. వర్తమానకాల మొక్కటియే అవశ్యభోగ్యము కావున, ఆమని లేతమబ్బులు ప్రియంబుగ రాగవతీకపోలముల్ తేమగిలంగఁ దుంపురిలు తియ్యని వేళల లేచిరమ్ము వానిని యగు నా, మధురాసవంబుఁ దమినానఁగ; నేడు విహారభూమి శో భామయమైన యోగళిక పచ్చగిలుంగద రేపు నీపయిన్ . అనియు “మిత్రా, రారమ్ము, సుఖింపు, మీయదను వ్యర్థంబైన దెన్నడున్" అనియు మనల ప్రబోధించును. స్వర్గనరకములు లేవు; మనుష్యునకు ఆనందదాయకములగు వస్తు స్వర్గముననుండునట్లు ఊహింపఁబడుచున్నవి. లోకమునందే యనుభవింపుము, అని ఖయ్యాము చెప్పును. సృష్టికర్త దేవుఁడు కరుణామయుండా? అట్లయిన లోకమునకనుపట్టు మఃఖమునకు, దౌర్జన్యమునకు, విపర్యాసమునకు కారణమేమి? తన చేచేతనొనర్చినట్టి యొకపాత్ర భగ్నముంజేయ నే మనుజుండైనందలంపఁ; డంగములు నిర్మాణంబుగావించి మో హనరూపంబులు మో-దేవే యెదలో నత్యంతరాగంబు గూ ర్చిన దేవుండు మడేలయిట్లు నిజసృష్టింగూల్చు నున్మత్తుఁడై? అకారణ ధ్వంసమునకు దేవుఁడేల పూనుకొనును? ఈ సందేహము ఖయ్యామును బాధించుచుండెను. అతనికి సందేహము కలిగిననే గాని తన్ని వృత్తి గోచరింపదు. ధారుణినుండి యుచ్చశని దాలకు గలట్టి కడింది చిక్కులం బూరితిగా సడల్చితిని; మోసపుటక్కుల బందెగాను; దు ర్వారనిరోధముల్ గడచివచ్చితి; నయ్యును సాయశక్తులం బోరి వదల్ప కే విసిగిపోయితి మృత్యురహస్య బంధమున్. అనుతాపము వలన నేమియు ప్రయోజనము లేదు. పూజలు నమాజులవలన నీ కష్టములు తొలగిపోవు. ఏలయన:- విషము నమృతంపు మసిబుడ్ల విధికలంబు ముంచి లోకులనుదుట లిఖించు మొదటం; గరగ దఱుఁబేద కన్నీటి కాల్వనదియుఁ, బరమభక్తుని అనుతాపవహ్నిః జెడదు. కాన, నెది ప్రాప్త మైనను గౌరవించు, వలయు వలదని యేర్పఱుపంగలేవు. విధి యనివార్యమని ఖయ్యాము మాటిమాటికి హెచ్చరించు చుండును. ఖయ్యాము జీవితములోని దుఃఖాంశమునే యూది చెప్పెనని కొందరు ఆయనను Pessimist అని పేర్కొనిరి. జీవితము సుఖదుఃఖ మిశ్రమము, వీలైనంతవఱకు సంతోషము ననుభవింపుము. మరణమనివార్యము; దానికిగా చింతపడకుము. దుఃఖములు కూడ విధి నిబద్ధములు గావున ధైర్యముతో ననుభవింపుము అని ఖయ్యాము చెప్పెను. ప్రకృతి తత్త్వమును . గుఱించి తలపోసినవారు లోకము లోని దుఃఖమును మానవ జీవితము యొక్క అస్థిరత్వమును ఎట్లు గుర్తెఱుఁగకుందురు? కారేరాజులు, రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం జెందరే వారేరీ సిరిమూటగట్టుకొని పోవంజాలిరే, యుర్విపై వేరై నంగలదే అని పోతన పొకొనెను. The boast of heraldry, the pomp of power, And all that beauty, all that wealth e'er gave Await alike th' inevitable hour The paths of glory lead but to the grave. అని థామస్ గ్రే వచించెను. అంతములేని యీభువనమంత పురాతన పొంథశాల; వి శ్రాంతిగృహంబు; నందు నిరుసంజలు రంగులవాకిళుల్ ; ధరా క్రాంతులు' పాదుషాలు బహరామ్ జమిషీడులు వేనవేలుగాఁ గొంతసుఖించి పోయిరెటకో పెరవారికి జోటొసంగుచుక. అని ఖయ్యాము కూడ వచించెను. ఇందు సత్యములేదని యెవరు చెప్పఁగలరు? పానశాల చదువునపుడు జీవితము దుఃఖభాజక మనితోఁచుట కంటే సంతోషమయమనియే స్ఫురించును. పూర్వము ప్రియా వియోగదుఃఖ సమ్మూర్చితమైన సచిత్త మును కాళిదాసుని మేఘసందేశము, ఖయ్యాము రుబాయతు సంజీవ నౌషధములవలె పునరుజ్జీవింపజేసినవి. నా మిత్రుఁడు పిశుపాటి వేణుగోపాలు (ఇప్పుడు స్వర్గస్థుడు) హైదరాబాదు నుండి ఖయ్యాము రుబాయతును నాకు పంపెను. ఆ కాలమున వివక్త మైన సౌధోపరి స్థలము, రుబాయతు నాకు ఏడుగడగనుండినవి. 1926 అక్టోబరు నెల 10వ తేదీనాంటి రాత్రి ఒంటిఘంట గడచినను నిద్రపట్టక యుండెను. ఏ పుస్తకమును చదువఁబోయినను మనస్సు దాని వై లగ్నమగుటలేదు. హృదయము కలకపాటి నిరయ సదృశ్యమయి హేయ ములును ఘోరములునగు భావములకు ఆలవాలమై యుండెను. నా హృదయముతో సరిపోలుటకో అనునట్లు ఆకాశము కూడ మేఘా చ్ఛన్నమై యుండెను. వై మేడమీఁది బయలులో కూర్చుండి దీపము పెట్టుకొని రుబాయతు చదువుచుంటిని; రుబాయతును ఆంద్రీకరించిన బాగుగనుండునను ఉద్దేశము కలిగినది. ఒకటి రెండు రుబాయీలు అంతలో వానచినుకులు పడనారంభించెను. పడుకగదిలోనికిపోయి తలుపు వేసుకొని నిదురపోప ప్రయత్నించితిని. ప్రయత్నించుకోలంది నిదుర దూరమగుచుండెను. ఏమి చేయునది లేక ప్రొద్దుపొడుచువఱకు రుబాయతు తర్జుమా చేయుచుంటిని. తరు వాత రెండుదినములలో నేను గుర్తు పెట్టిన రుబాయీలన్నియు ఆంద్రీకరించితిని. పానశాల భారతిలో ప్రకటింపఁబడిన. యనంత రము మఱికొన్ని రుబాయీల నాంద్రీకరించి ఇటీవలనే భారతిలో ప్రకటించితిని, నావద్దనున్న రుబాయతునందు 692 రుబాయీలు కలవు. వానినన్నిటిని తర్జుమా చేయుట అనావశక్యము, ఏలయన ఒకే భావము వివిధములుగా పది, లేక ఇరువది. రుబాయీలలో టింపఁబడి యుండును, అవి 5యన్నియు ఖయ్యాము వ్రాసినవి తర్జుమా జేసితిని. ఒకటి కావు. ఖయ్యామును అనుకరించి వ్రాసినవారి పద్యములు అందు చేరియున్నవి. అందువలన నేనొక పద్ధతి నవలంబించితిని. ఒకే విధ మైన రుబాయీలను కొన్నిటి నేర్పరిచి, వానిలో మనోహరములైన రెంటిని మాత్రము గ్రహించితిని; మఱికొన్ని రుబాయీలలో ఒక పాదము మాత్రము క్రొత్త భావమును వెల్లడించును. తక్కిన మూడుపాదములు చర్విత చర్వణముగ నుండును. అట్టియెడ రెండు మూడు రుబాయీలు కలిపి ఒక పద్యముగ వ్రాసితిని, అట్లు వ్రాసి సుమారు అయిదారు పద్యములు మాత్రమే యుండును. నా ఆంద్రీకరణము మూలమునకు టీకవ లేనుండదు. తిక్కన, శ్రీనాథుఁడు మున్నగు అనువక్తలు వహించిన స్వాతంత్ర్యమును నేనును వహించితిని. అట్లనుటవలన నా తర్జుమా మూలమునకంటె భిన్నముగ నుండునని చెప్పుటకాదు. పారసీక జాతీయములలో ప్రటింప బడిన భావము తెలుఁగులో అథ్లె స్ఫురించుటకు ఆవశ్యకములైన మార్పులను, రసపోషణమునకు వలయు కూర్పులను కావించితిని. సహృదయులు నా సేవను ఆదరింతురుగాక! తెలుఁగుందోఁటల బచ్చబీళ్ళ ననురక్తిం బానశాలాప్రతి పలుగావించి ఖయాము కావ్యరసభాండంబుల్ గులాబీలు బు ల్బులిపిట్టల్ మధుపానపాత్రికలు సొంపుల్ గుల్కు సాఖీయు, భూ తల నాకం బొనరింప నిల్పి రసికాంధ్రప్రీతి గావించితిన్. వెమ్మారెడ్డి పాళెము, 10-8-1934. . దువ్వూరి రామిరెడ్డి 51

  1. వెర్సిపోలీసునందలి సుప్రసిద్ధ శతస్తంభ రాజప్రాసాదమును అలెగ్జాండరుతగులఁబెట్టించెను.
  2. *That Sufism proper, as it finds expression in the different Dervish orders (which I sharply distinguish from the simple ascetic aim which already appeared in the earliest Christianity, whenceit passed over to Islam) arose essentially from Indian ideas and
  3. in particular from that school of Indian philosophy known by the name of Vedanta" Von Kremer, (Literary History of Persia by E.G. Brown)
  4. నోరు చిన్నదిగ నుండిన చాల రమణీయమని మంగోలియన్ జాతులఅభిప్రాయము.
  5. హైదరాబాదు దొరతనమునందు ఆర్థికశాఖలో ఉద్యోగిగా నుండిన వి.యం, దాతారుగారు. (ఇప్పుడు సన్యసించి గోవిందతీర్థ స్వాములవారని పేరు పెట్టుకున్నారు.) కొంతకాలము ఉమ్రఖయ్యాము జీవితమును గురిం చియు అతని కృతులను గురించియు పరిశోధన సలిపిరి. అట్లే జర్మనీలో ఖయ్యాము కృతులను గురించి పరిశోధన చేయుచున్న డాక్టరు రెంపి సుగారితో ఉత్తరప్రత్యుత్తరములు జరిపిరి.పరిశోధనకు ఫలితముగా వారు 1941 వ సంవత్సరమున "The Nectar of Grace" అను పేరుతో 1030 పద్యములుగల రుబాయతును, ఒక పెద్ద యుపోద్ఘాతముతోడ ప్రకటించిరి. ఈ పద్యములలో షుమారు 700 పద్యములు ఇతర పారకవుల గ్రంథములలో కానవచ్చుచున్నవనీ దాతారుగారును ఇతర పరిశోధకులును నిర్ణయించిరి. ఆ యుపోద్ఘాతమునందు విడదీయబడిన చిక్కులలో ఖయ్యాము జన్మదిన నిర్ణయము ముఖ్యమైనది. జహరుద్దీన్ అబుల్ హసన్ బైపాకీ రచించిన “పారసీక తత్త్వవేత్తల జీవిత చరిత్రములు" అను గ్రంథ మునందు ఖయ్యాము జన్మదినమును తెలిసికొనుట కొక యాధారము
  6. ఖయ్యామునకు పూర్వమె ఖయ్యామను పేరుగల కవులు పండితులు
  7. 4 నిజాముల్ ముక్కునకును ఉమఖయ్యామునకును సతీర్థ్యుఁడయి వారితో ఒప్పుదల కాచించుకోన్న సన్ బెన్ సబాహు ఇస్మయీలియాల సంఘమునకు నాయకుండు. ఇది యొకమత రాజకీయ సంఘము. ఇస్మయాలి యాలను "హంతకు” అని చరిత్రకారులు పేర్కొనియున్నారు