పల్లెపదాలు/బరువులు లాగే పాట

బరువులు లాగే పాట


——చిన్న చిన్న పనులలో పాటలోని స్వర ప్రవాహమున్నూ లయయున్నూ పనివాళ్ల దృష్టిని మార్చి పని కష్టమును మరుగు పరచగలవు. పెద్ద పెద్ద బరువులను తోయునప్పుడు పాటకులిబిడో తోడుకావాలె, కూడు తప్పితే కామమేకదా పాటక జనానికి సుభదాయకము? బోయిలర్లను దూలాలమీద నడిపే కూలీల పాట వినండి.

జంబయిలే జోరు లంగరు
అవుర, అవుర, మన్నోళ్లబ్బయి ౹౹జం౹౹
నీకు బారులేదు | జోరులేదు "
నీకు రోసంలేదు ! మీసంలేదు "
నా! చల్ల నీళ్లు | మల్లి మొగ్గ "
నా ఉడుకు నీళ్లు | ఉల్లి పువ్వు "
కడవమీద ౹ కడవబెట్టి "
కాకినాడ ! రేవు కెళితే "
కాకినాడ | కలకటేరు "
కడవదింపి | కౌగలించె "
బిందిమీద | బింది పెట్టి "
భీముడు పట్నం ! రేవు కెళితే "
భీముడు పట్నం ! కలకటేరు "
బింది దింపి | ప్రియములాడె "
ముంతమిద ! ముంతబెట్టి "
కళింగ పట్నం | రేవు కెళితే "
కళింగ పట్నం | కలకటేరు "
ముంత దింపి | ముద్దులాడె "
ఎవరొ ? ఎవరొ ? మన్నోళ్లబ్బి "

ఓచిన్నదాన

"జంబైలే జోరులంగరు" అన్నదితుమ్మెదా, వెన్నేలా, గునాసారి గున్నమ్మా వంటి పాదాంత పదావళే (పల్లవికాదు), ఈ పాదాంత పదావళితో ఎన్ని పాటలైనా వినబడుతాయి. జంబైలే జోరులంగరు "కొండామిదా కోడిపెట్ట" అన్న ఇంకొక పాట పూర్తిగా దొరికినది కాదు. కూలివారందరూ "జంబైలే జోరులంగరు" అని కలిసిపాడుతారు. కల్పనా కారుడొకడు మాటలు అల్లుతాడు. ఈ అల్లిలసోగసును బట్టి వారప్పుడప్పుడు గొల్లుమంటుంటారు కూడా.

——రోడ్డురోలరు లాగుకుంటూపోయే కూలీలపాట చూడండి. లిఒడో ఇంకొక అడుగు వేస్తుంది.

       ఓచిన్నదానా విడువ నెచెంగు
       ఓచిన్నదానా వదలనెకొంగు
బందారు చిన్నదాన బాజాబందూలదాన
బాజా బందూలమీద మోజేలలేదే ౹౹ ఓ చిన్నదాన ౹౹
గుంటూరు చిన్నదాన గుళ్ళా పేరులదాన
గుళ్ళా పేరులమీద కళ్ళూపోలేదే ౹౹ చిన్నదాన ౹౹
కాకినాడ చిన్నదాన కాసూల్ కంటేలదాన
కాసూల్ కంటేల మీద మనసేలలేదే ౹౹ ఓచిన్నదాన ౹౹
అర్ధారూపాయి పెట్టి అద్దాల రయికకొంటె
అద్దాలరయిక మీద బుద్దేలలేదే ౹౹ ఓచిన్నదాన ౹౹
నల్లానల్లానిదాన నడుమూ సన్నానిదాన
తళుకూ సేపలమల్లె కులుకూసూపులదాన ౹౹ ఓ చిన్నదాన ౹౹
నిన్ను సూసీ మనసు నులువకున్నదోలె ౹౹ ఓ చిన్న దాన ౹౹

ఈ పాటలోని దీర్ఘాలూ, యతి ప్రాసలూన్నూ బృందగానమున్నూ దారినిపోయే బాటసారులు నెందరినో పట్టి అలరించవలవు. ఆలగించును గూడ. పాడుకుంటూ రోటరులాగే జట్లు నేటికి సుందర సామగ్రియే. కనుక నే కవికొండల వేంకటరావుగారు కూలీ యన్నల (ఈ) కుతుకమును ఒక ఖండకావ్యములో ఇమిడ్చినారు.

జాజారమ్మ తోట


——లయబద్ధములైన పనులకు లయబద్ధమైన పాటలతో మైత్రి చక్కగా కుదురును. ఈ పాట 'కిటతక కిటతక' అన్న ఎనిమిది అక్షరాల ఆవ్రుతాలు నాలుగేసి చేరి ఏర్పడిన పాదాలది. మొక్కలను గానీ, నీటికుండలను గానీ, వరసగానిల్చి ఒకరి నుంచి ఇంకొకరికి అందించుకునే జట్లు ఈపాట పాడుతారు. మొదటి అవ్రుతము కుండనందుకోటానికి తరవాతిది కుండను పక్కవారికి అందించటానికి ఊత అవుతుంది.

నాటేరమ్మా నాటేరు, ఏమీ మొక్క నాటేరు
జాబారమ్మా పూలతోటలో,జాజీ మొక్కనాటేరు
సాగేనమ్మా సాగేను, ఏమి తీగ సాగేను
జాజారమ్మా పూలతోటలో, సన్నా జాజీ సాగేను
యేసేనమ్మా యేసేను యేమిసిగురు యేసేను
జాజారమ్మా తోటలోను చేమంతులు సిగురేసేను
తొడిగేనమ్మా తొడిగేను ఏమి మొగ్గలు తొడిగేను
జాజారమ్మా తోటలోను రోజా మొగ్గలు తొడిగేను
విచ్చేనమ్మా విచ్చేను ఏమిపూలు విచ్చేను
జాజారమ్మా పూలతోటలో సంపెంగలూ విచ్చేను ||

పూలతోట పనిలోనే కాదు.. ఇటికెలు అందించుకుంటు గుట్ట వేసేటప్పుడుకూడా ఈ పాట పాడటము కద్దు.

ఎయ్ రాసిన్నో డెయ్ రా

——ఇలాటిదే మరోకటి. అది ఒక గుట్ట దగ్గర వినబడే పాట. ఇవన్నీ 'కిటతక కిటతక ' ఆవ్రుతాలదే. కాని రెండు ఆవ్రుత రాగానే ఒక పాదము ఆగిపోయి ఇంకోకపాదమారంభిస్తుంది.

ఎయ్ రా సిన్నా డెయ్ రా
ఎయ్ రా జోరు గేయ్ రా
దిక్కులు చూడక పక్కలొంచి
మక్కువతో పని చెయ్ రా
ఎయ్ రా సిన్నోడెయ్ రా
ఇంటపుట్టిన యెద్దుల్లాగు
మొద్దుకింద వుండకుర
ఎయ్ రా నీజోరుగాల ౹౹ ఎయ్ రా౹౹

29 బాపనయ్య బండి

— బండి! మానవకోటిలో అనిర్వచనీయానందాన్ని ఱేపే ప్రయాణమునకు తొలియుగాలనుంచి నేటిదాకా ఆధారమైనది బండి. బండిచుట్టూ చాలా జానపదగేయా లున్నవి. ఇది ఒకటి. ఇది పరమార్ధగేయము కాదు.

భలేభలే బాపనయ్య బండికట్టాడు
చల్లపల్లిరోడ్డుమీద చతికిలపడ్డాడు
బోడిపాలెంరోడ్డుమీద బోల్తాకొట్టాడు
బండి కట్టి రోడ్డుమీద మొండి కెత్తాడు.

———

గడ్డి పాట


——రైతునకు ఏరువాకమ్మ, జూలేతం. . ! ఈ సమీ: మోస్: పరు, భూమి మీద మోసగించని పంట, సర్వవ్యాపి అయిన ఆ పెట్టపంట, గడ్డిపంటయే. ఈ లెక్కన అభిమానము గమనించండి.

కడుపు చల్లనితల్లి
గడ్డి మాతల్లి
పిడికిటికి రావమ్మ
గడ్జికూడే తింటూ
గడ్డితోనే ఉంటూ
గడ్డిలో పాణమొదలి
కైలాసం సూత్తాము

|