పల్నాటి చరిత్ర/నాగార్జునకొండ
నాగార్జునకొండ
మాచర్ల రైలు స్టేషనునుండి 14 మైళ్ల దూరమున నిది కలదు. మాచర్లనుండి యిచటకు రోడ్డుకలదు. ఇది పర్వతములమధ్య కృష్ణానదీ తీరమున నున్నది. దీనిదగ్గర పుల్లారెడ్డిగూడెమను గ్రామమున్నది. 25 సంవత్సరముల క్రింద నిచట త్రవ్వగా కొన్ని బౌద్ధవిగ్రహములు బయల్పడినవి. వానినన్నిటి నొక చోట చేర్చి యొక శిల్పవస్తు ప్రదర్శనశాల (మ్యూజియమును) గవర్నమెంటువారు కట్టిరి. చూడవచ్చు యాత్రికుల సౌకర్యార్ధ మొక బంగళానుకట్టిరి. ఇచట కొన్ని బౌద్ధవిగ్రహ ములు, స్తూపములు, శైత్యములు, విహారములు, సంఘారామములు బయల్పడినవి. శిధిలమైన యిచటిస్తూపమునందలి పునాదులును ప్రదక్షిణాపధమును మిగిలియున్నవి. ఈ స్తూప వృత్తముయొక్క వ్యాసము 102 అడుగులు. ఇందుకుపయోగించిన యిటుకల పరిమాణము 20" X 10" X 3" . ఈస్తూపము చుట్టు 5 అడుగులయెత్తున ప్రదక్షిణ పధమున్నది. బ్రాహ్మిభాషలోని కొన్ని శిలాశాసనములును, కొన్ని రోమీయ నాణెములు, ఇక్ష్వాకు నాణెములు దొరకినవి. అనేక రత్నములతోగూడి జాగ్రత్తగా భద్రపరచబడి యొక బంగారు బరిణలో బుద్ధుని యెముక దొరికినది. గోళకారమగు మొక పెద్ద కుండ దొరికినది. దానివ్యాసము 6 అడుగులు . అది సమానమగు రెండు డిప్పలు కలిగియున్నది. రెంటిని కలిపిన పెద్ద బంతివలె నొకకుండ యగును. నాగార్జునకొండవద్ద విజయపురియను పట్టణముండెడిది. ఆ పట్ట ణమందలి గృహములపునాడు లిప్పటికిని కన్పించు చున్నవి. కృష్ణానదినుండి పట్టణములోనికి పోవుటకుగల కాలువజాడ లిప్పటికినున్నవి. ఇచటనొక విశ్వవిద్యాలయముండెడిది. బౌద్ధ సన్యాసులు నివసించుగదుల పునాదులు గన్పించుచున్నవి. వారు మూత్ర విసర్జన చేయుటకు వీలగు సన్నని (రాతితో చేయ బడిన) కాలువలిప్పటికి స్పష్టముగా గన్పించుచున్నవి. మొత్తముమీద నాగార్జునకొండవద్ద మూడు సంఘారామములు, ఆఱు బౌద్ధాలయములు 14 స్తూపములు బయల్పడినవి. ఇందలి దృశ్యముల ఫొటోలనుగల్గిన పురాతత్వశాఖ వారి పుస్తక మిచ్చటొకటి కలదు. యాత్రికులా పుస్తకమును జూడవచ్చును. కాకతీయుల కాలమును కట్టబడిన కోటకోడలు ప్రాకారములు, దేవాలయములు, పెద్దదిగుడుబావి, కొండమీద కలవు. నాగార్జునుడను బౌద్ధసన్యాసి రెండవ శతాబ్దాంతమున నిక్కడ నివసించెరు. ఇతనిని బట్టియే దీనికీపేరు వచ్చెను. ఇతడాంధ్రుడు, బ్రాహ్మణుడు. హిందూదేశమంతయు తిరిగిన వాడు. శాతవాహనవంశపు రాజుల అంతఃపురస్త్రీలకు బౌద్ధ మతము బోధించెను. సుహృల్లేఖ మొదలగు కావ్యముల రచించెను. రసాయనిక శాస్త్రమందును, వైద్య శాస్త్రమందును ప్రవీణుడు, ప్రజ్ఞాపరిమితములు మొదలగు మహాయానసూత్రములను రచించెను ఇతని గ్రంధములన్నియు సంస్కృతభాషలో ఉన్నవి. చీనాటిబెట్టులలో నితడు ప్రసిద్ధుడు. ఇప్పటికి నా దేశ ప్రజల చేత పూజింపబడుచున్నాడు. బౌద్ధమతములో హీనయానులని మహాయానులని రెండు తెగలు. హీనయానులు విగ్రహారాధన చేయరు. మహాయానులు విగ్రహారాధన, ఉత్సవములు చేయుదురు. బుద్ధుని ప్రతిమతోబాటు హిందూ దైవత విగ్రహములనుకూడ పూజింతురు. నాగార్జునుడు మహాయానశాఖను నిర్మించెను. ఇతనికి యజ్ఞశ్రీశాతకర్ణి యను యాంధ్రప్రభువు పోషకుడుగ నుండెను.
నందికొండ
నందికొండ యనుచోట కృష్ణానదికి యానకట్టకట్టుటకు కేంద్ర ప్రభుత్వము నియమించిన ఖోస్లా కమిటీ సూచించినది. ఈ స్థలము మాచర్లకు 12 మైళ్ల దూరమునను నాగార్జునకొండ కైదుమైళ్లదిగువను, నాగులవరమను గ్రామమునకు దగ్గరగాను నుండును. ఇచ్చట కృష్ణకావలి యొడ్డున నందికొండయను గ్రామముండుటచే దీనికాపేరు వచ్చినది. కృష్ణానదికి రెండువైపుల రెండుకొండలు పెట్టనిగోడలవలె నుండును. నదీగర్భము శిలామయమగుటచే పునాగులకు నెక్కువఖర్చు లేదు. కృష్ణకు రేడువైపుల రెండులోయలు ప్రకృతిసిద్ధముగా నుండుటచే కాలువలుత్రవ్వుట సులభము, ఇచ్చట ఆనకట్టకట్టి యెడమ వైపు కాలువ త్రవ్వుటకు నైజాము ప్రభుత్వ మిదివఱకే పూను కొనినది. కుడివైపున కాలువలు త్రవ్వినయెడల గుంటూరు, కర్నూలు నెల్లూరుజిల్లాలు సాగయి చెన్న పట్టణమునకు నీటి సప్లయి చేయవచ్చునని అంచనా వేయబడినది. ఇది ఆనకట్ట కట్టుటకు ప్రకృతిసిద్ధముగ తగిన స్తలము, తక్కువఖర్చుతో