పల్నాటి చరిత్ర/పల్నాటి వీరగాధ


                     వాగ్రణియై|

సీ॥ పెందోట పురవరమందు గాపురముండు
          విశ్వకర్మాన్వయ విబుధవరులు |
    నగ్రహారాది సమగ్రసుస్థ్వాదిక
          ములును గల్గుటచేత గలిమిగాంచి |
    వేదశాస్త్రాదిక విద్యల జదివి ది
           వ్యజ్ఞాన సంపత్తినతిశయిల్లి
    సకలయజ్ఞంబులు సరవితో గావించి
           నిత్యాగ్నిహోత్రులై నెగడుచుండి
           
గీ॥ సుర పితామహునిని శతాధ్వరుని గురుని |
   ధిక్కరించియు నిరతవితీర్ణ మహిమ |
   ధైర్యమున వారిదాద్రుల దలకునటుల |
   జేసి బ్రహ్మణ్యులైరి యీస్థిరను స్థిరత.
  

పల్నాటి వీరగాధ

12 వ శతాబ్దమున గురజాల రాజధానిగ పల్నాటిని అలుగురా జేలుచుండెను. అతనికి మైలమ్మయందు నలగామ రాజు, విజ్జల దేవియందు మలిదేవాదులు భూరమాదేవియందు నరసింగరాజు జన్మించిరి . అతనివద్ద బ్రహ్మనాయుడు మంత్రిగా నుండెను. అలుగురాజుపిమ్మట నలగామరాజు రాజయ్యెను. జిట్టగామాలపాటిలో నాయకురాలను పేర వ్యవహరింపబడు నాగమ్మయను వితంతువు లౌకిక వ్యవహారములందు ప్రజ్ఞగలిగి యుండెను. ఆమె రాజును 'మెప్పించి మంత్రిణి యయ్యెను. బ్రహ్మనాయనియం దసూయ కలిగి యతనికిని యతని యను చరులగు మలిదేవాదులకును నపకారములు చేయుచుండెను. అంతట బ్రహ్మనాయుడు రాజుననుజ్ఞ ముపొంది మలిదేవాదు లతో మాచర్లకుపోయి యా ప్రాంతమును మలిదేవాదుల పేర నేలుచుండెను. కోడిపోరు పందెములకని బ్రహ్మనాయని గుర జాలకు పిలిపించి మాయచేతను మోసముచేతను నతనిని నాయకురాలు కోడిపందెములందు గెలిచెను. ఏర్పఱచుకొన్న సమయము ప్రకారము మాచర్ల సీమను నలగామరాజునకు వదలి సపరివారముగా వెడలిపోయి యేడు సంవత్సరము లడ వులందు బ్రహ్మనాయుడు గడపెను. నలగామరాజు నల్లుడు యలరాచమల్లు యనువాడు బ్రహ్మనాయునివద్ద నుండెను. తమ మాచర్లసీమను మరల తమకిమ్మని నలగామరాజు వద్దకు అలరాచమల్లుకు బ్రహ్మనాయుడు రాయబార మంపెను. కాని నలగామరాజు వినలేదు. తిరిగి బ్రహ్మనాయనివద్దకు బోవుచుం డగా అలరాచమల్లును నాయకురాలు విషప్రయోగముచే చంపించెను. అదివిని బ్రహ్మనాయుడు నలగామునిపై దండెత్తి మేడపినుండి కారెమపూడివచ్చెను. నలగాముడును తన సైన్య ముతో వచ్చి కారెమపూడివద్దవిడిసి సంధికై బ్రహ్మనాయని వద్దకు రాయబార మంపెను. సంధి కుదురు నట్లుండెను. బ్రహ్మనాయని కుమారుడు బాలచంద్రుడు యుద్ధము సంగతి తెలియక మేడపిలో బొంగరము లాడుచుండెను. బొంగరము కాలికి తగిలిన యొకకోమటి స్త్రీవలన యుద్ధవిషయము తెలిసికొని యుద్దమునకుపోవ నిశ్చయించుకొని సెలవునకై భార్యయగు మాంచాలయింటికి పోయెను. భార్య మోహమున బడి యుద్దవిషయము మఱచెను. అది గ్రహించి వీరపత్నియగు మాంచాల యేదియోయొక నెపముతో నా రాత్రిగడిపి నాడు దీవించి యతనిని యుద్ధభూమికి బంపెను. బాలచంద్రుని వెంట బ్రాహ్మణుడగు యనపోతు ఉండెను. అతడు యుద్ధమున చనిపోయినచో బ్రహ్మహత్యాపాతకము తనకువచ్చునని భయపడి యేదియోయొక నెపముతో నింటికిబంపెను. తన యానగా యుద్ధభూమికి రావద్దని చీటి చెట్టుకు కట్టి యుద్ధభూ మికి బాలచంద్రుడేగెను. అనపోతు తిరిగివచ్చి చీటిచూచుకొని బాలుని యానదాటలేక సమరోత్సాహము భంగమయినందులకు వ గచి, పొడుచుకొని చచ్చెను. అతని రక్తపుజందెమును మాడచి యనునామె కారెంపూడిలోనున్న బాలచంద్రుని కందజేసెను. స్నేహితుడుగు ననపోతు మరణమునకు వగచి బాలచంద్రుడు సమరోత్సాహ మినుమడింప యుద్ధమును నిశ్చయించెను. సైనికులు సంధి ప్రయత్నమున గుడుచు యన్నమును నాగులేటిలో పాఱవేసి వారలను యుద్ధమునకు ప్రోత్సహించి సంధిచెడగొట్టెను. అభిమన్యునివలె యుద్ధములో బోరెను. నాయకురాలి దుశ్చేష్టలకు తోడుగానున్న నరసింగరాజు తలనుగోసి బ్రహ్మనాయని ముందట వైచెను. మరల యుద్ధము నకు బోయి చాలమందిని జంపి తానుజచ్చెను. యుద్ధము సందు మలిదేవాదులుకూడ చనిపోయిరి. నాయకురాలు బందికాబడెను. స్త్రీని చంపకూడదుగనుక దేశమునుండి వెడల గొట్టబడెను. నాయకురాలి మైకమునుండి నలగామరాజు విముక్తుడై పశ్చాత్తాపపడి హతశేషులతో రాజ్యమేలెను. ఈ యుద్ధము క్రీ. శ. 1180 ప్రాంతమున జరిగెను.

_____________