హీనయానులని మహాయానులని రెండు తెగలు. హీనయానులు విగ్రహారాధన చేయరు. మహాయానులు విగ్రహారాధన, ఉత్సవములు చేయుదురు. బుద్ధుని ప్రతిమతోబాటు హిందూ దైవత విగ్రహములనుకూడ పూజింతురు. నాగార్జునుడు మహాయానశాఖను నిర్మించెను. ఇతనికి యజ్ఞశ్రీశాతకర్ణి యను యాంధ్రప్రభువు పోషకుడుగ నుండెను.

నందికొండ

నందికొండ యనుచోట కృష్ణానదికి యానకట్టకట్టుటకు కేంద్ర ప్రభుత్వము నియమించిన ఖోస్లా కమిటీ సూచించినది. ఈ స్థలము మాచర్లకు 12 మైళ్ల దూరమునను నాగార్జునకొండ కైదుమైళ్లదిగువను, నాగులవరమను గ్రామమునకు దగ్గరగాను నుండును. ఇచ్చట కృష్ణకావలి యొడ్డున నందికొండయను గ్రామముండుటచే దీనికాపేరు వచ్చినది. కృష్ణానదికి రెండువైపుల రెండుకొండలు పెట్టనిగోడలవలె నుండును. నదీగర్భము శిలామయమగుటచే పునాగులకు నెక్కువఖర్చు లేదు. కృష్ణకు రేడువైపుల రెండులోయలు ప్రకృతిసిద్ధముగా నుండుటచే కాలువలుత్రవ్వుట సులభము, ఇచ్చట ఆనకట్టకట్టి యెడమ వైపు కాలువ త్రవ్వుటకు నైజాము ప్రభుత్వ మిదివఱకే పూను కొనినది. కుడివైపున కాలువలు త్రవ్వినయెడల గుంటూరు, కర్నూలు నెల్లూరుజిల్లాలు సాగయి చెన్న పట్టణమునకు నీటి సప్లయి చేయవచ్చునని అంచనా వేయబడినది. ఇది ఆనకట్ట కట్టుటకు ప్రకృతిసిద్ధముగ తగిన స్తలము, తక్కువఖర్చుతో శీఘ్రఫలితములనిచ్చి యెక్కువభూమి సాగుబడి యీ ప్రాజెక్టు వలన కాగలదు. ఇప్పటి యంచనాల ప్రకారము ఈ ప్రాజెక్టు వలన 70 లక్షలయకరముల భూములు సాగగును. 2 లక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి యుత్పత్తికాగలదు. 35 లక్షల టన్నుల ధాన్యమధికముగా నుత్పత్తికాగలదు. అదిగాక ఈ ప్రాజెక్టుకు నగు ఖర్చులో కొంత భాగమును నైజాము ప్రభుత్వము భరించును గనుక మితవ్యయముతో నిది పూర్తికాగలదు.

రామరాజు మంత్రప్పదేశాయి

'అబుల్ హసన్' అనునతకుడు గోల్కొండ రాజ్యమును క్రీ. శ. 1672 నుండి 1687 వఱకు పాలించెను. ఇతడు హిందువులను మహమ్మదీయులను సమానముగా జూచెను. ఇతనికి తానీషాయను బిరుదుకలదు . ఇతనికాలముననే భద్రాద్రి రామదాసుకధ జరిగినది. అదివఱకు మంత్రిగానుండిన ముజాఫరును దొలగించి పింగళి మాదన్నను క్రీ.శ. 1673 లో మంత్రి కానియమింను పింగిళి మాదన్నకు సూర్యప్రకాశరావను బిరుదముకూడ పిచ్చెను. మాదన్నకు సోదరుడగు అక్కన్న యితనివద్ద సేనాపతిగానుండెను. అప్పుడు పల్నాడు గోల్కొండ నవాబు క్రింద నుండెను. అర్జీపెట్టి రామరాజు మంత్రప్పదేశాయి యనునతడు తానీషానుండి, మాచర్ల, తుచ్చుకోడు కారెంపూడి, గురజాల తంగెడ యను అయిదుపరగణాలను మహసూళ్ల చౌదరితనము (శిస్తు వసూలు చేయు నధికారముగల సీమ పెత్తనము) పుత్రపౌత్ర పారంపర్యముగా నుండు నట్లు