పదబంధ పారిజాతము/కుంటెన ముడి
కీలు____కీలె 477 కీల్కొ___కీ. శే.
- 2. చెప్పిన ట్లాడువాడు.
- నేటివాడుకలో కీలు గల బొమ్మ అన్న అర్థంపై వాడి చేతిలో కీలుబొమ్మ అనగా చెప్పినట్లు ఆడువాడు అన్న అర్థంలోనే ఎక్కువగా విన వస్తుంది.
- "ఆ సరు కంతా రెడ్డిగారిచేతిలో కీలు బొమ్మలే. అందుకే అత నేదన్నా సరే అంటారు." వా.
కీలు మలగు
- వెనుకకు తిరుగు. సాంబో. 3. 29.
కీలుముడి
- కీలుకొప్పు.
- చూ. కీలుకొప్పు.
కీలుసంకెళ్లు
- బేడీలు.
- "కీలుసంకెల నేల గీలించి వీపు వ్రీలంగ గొట్టుదు..." గౌర. హరి. ద్వి. 884, 885.
కీలూడగా తన్ను
- కీళ్లు ఊడునట్లు కొట్టు.
- "బండి రాకాసి గీలూడగా దన్నియున్." పారి. 3. 37.
- ఇచ్చట శ్లేష.
కీ లెడలిన జంత్రము
- బిస చెడిన యంత్రము. కవిక. 2. 197.
కీలెఱుగు
- కిటుకు తెలియు.
- "లోకంబున నాకీటం, బాకైటభవైరి యెల్ల యాత్మలకు నభీ,ష్టాకాంక్ష యొక్క చందమ,యీకి లెఱుగంగ వలదె హృదయములోనన్." శృం. నైష. 3.
కీల్కొనజేయు
- లగ్నము చేయు.
- "హనుమంతు మాట యందు గీల్కొన జేయు." వర. రా. కిష్కి. పు. 476. పం. 5.
కీల్కొలుపు
- లగ్నము చేయు.
- "పాదపద్మముల్ మనములయందు గీల్కొలిపి." భాగ. స్క. 3. 542.
- రూ. కీల్కొల్పు.
కీల్గంటు
- చూ. కీలుగంటు.
కీల్బొమ్మ
- చూ. కీలుబొమ్మ.
కీల్బొమ్మరము
- మరతో తిరిగేబంగరము.
కీల్ముడి
- చూ. కీలుముడి.
కీ. శే.
- చనిపోయిన అన్న అర్థంలో మృతు లైనవారి పేరు నుదహరించే ముందు వ్రాసే పొడి అక్షరాలు.
- కీర్తిశేషు లనుమాటకు సంక్షిప్తసంకేతరూపం.
- "కీ. శే. రామమూర్తిగారు...." వా. కుంటె____కుండ 480 కుండ____కుండ
- న్నీలాలకభ్రాంతి గుం,టెన పొమ్మంటినొ." కాళ. శ. 16.
- చూ. కుంటెనలు వహించు.
కుంటెన ముడి
- తాటాకుల కట్ట కట్టే తాటిముడి. శ. ర.
కుంటెనలు వహించు
- తార్చు.
- ఒక నాయికదగ్గఱకు గానీ, ఒక నాయకునిదగ్గఱకు గానీ అందులో ఒకరి పక్షంగా వెళ్లి దౌత్యము నడుపు.
- "తనసరి బాలెత ల్తనకు దాపుగ వారల కెల్ల దాను గుం,టెనలు వహించు కొంచు నెఱటెక్కులు నిండు." శుక. 3. 109.
- చూ. కుంటెనకత్తె.
కుంటెన వుచ్చు
- తార్చుటకై పంపు. పండితా. మహిమ.
కుండ కర్ర చేతి కిచ్చు
- చిప్ప చేతి కిచ్చు వంటిది.
- "కలుషము ఘటించు గుండయు గర్రయు దన, చేతి కొనగూర్చు నది గాన జెప్ప నగునె." శ్రవ. 2. 54.
కుండకూల్చిన భంగి
- కుంభవృష్టిగా, కుండపోతగా.
- "కుండగూల్చినభంగి, వారక వర్షంబు వఱుగొని కురియ." పండితా. ప్రథ. దీక్షా. పుట. 146.
- చూ. కుండపోత, కుంభవృష్టి, తాడిపోత.
కుండగోకరి
- వంటవాడు; కుండలు కడిగేవాడు.
- "కుండగోకరి జేసి కువలయేశులకు, వండి పెట్టగ జేసి వాని నీరీతి, చీకాకుపడ మాయ సేయక యున్న, నాకేశ! వినుము నే నలునికి బంట." నలచ. 2. 700.
కుండజల జనించు
- ఆర్ద్రత కలుగు; నీరూరు.
- "మనసు దీరగ నొక్క మాఱు చూచిన గండ,శిలల కైనను గుండజల జనించు." పాణి. 2. 71.
కుండ పగుల గొట్టినట్లు
- ఖరాఖండిగా.
- "వా డేంం మాట్లాడినా కుండ పగల గొట్టినట్లు మాట్లాడతాడు." వా.
- చూ. కుండ పగుల వేసినట్లు.
కుండ పగుల వేసినట్లు
- వాడుకలో ఇది కుండ పగలేసినట్లు అన్నట్లు వినబడుతుంది.
- చూ. కుండ పగుల గొట్టినట్లు.
కుండ పట్టే వాళ్లు
- కర్మ చేసే వాళ్లు.
- 'తల కొరివి పెట్టే దిక్కు', 'కొరివి పెట్టేవాళ్లు ఇత్యాదుల' వంటిది. అంత్యక్రియలలో పీనుగుతో పాటు ఒక కొత్త కుండలో నిప్పులు వేసుకుని కుండ____కుండ 481 కుండ____కుంద
- పెద్ద కొడుకో, మరొక కర్మాధికారో కూడా వెళ్లడం అలవాటు. అందుపై యేర్పడినది.
- "అంత సంపాయించి యేం లాభం? ఆఖరికి కుండ పట్టేవా ళ్లయినా లేరు." వా.
కుండపోతగా
- ఎక్కువగా. వానవిషయంలోనే దీన్ని ఉపయోగిస్తారు.
- "రెండు రోజులనుండీ మా ఊళ్లో కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది. ఇంకా వెలియ లేదు." వా.
- చూ. కుంభవృష్టి.
కుండమార్పు
- ఒక టిచ్చి మరొకటి తీసుకొనుట.
- "చండాంశు సుతుపోల్కి గుండ మార్పులు గాక." నరసభూ. 5. తె.జా.
కుండలలో గుఱ్ఱాలు తోలు
- పని లేక పోవు. పనికి మాలిన పని చేయు.
- నిష్ప్రయోజన మైనపని చేతుటపై వచ్చినపలుకుబడి.
- "వాడు చేసే దేముంది? కుండలలో గుఱ్ఱాలు తోలుతూ కూర్చుంటాడు." వా.
కుండలలో దేవుకొని తిను
- నీచపుతిండికి పాల్పడు.
- కుండలు ఖాళీ చేసి నీళ్లు పోయగా అందులో మెతుకుల కోసం దేవుకొనడం నీచ మనుటపై యేర్పడినది.
- "వాని కేం? కుండలలో దేవుకుని తినే రకం. ఏలాగో బతుకుతాడు." వా.
కుండలు గోకు
- అర్హ మైనపని చేయక నీచమైన పనికి పాల్పడు. పనిమాలి యుండు.
- "వా డంత చదువూ చదువుకొని కుండలు గోకుతూ కూర్చున్నాడు." వా.
కుండలు తొంగుంటాయి
- తిండికి లేక పోతుంది.
- కుండలలో ఏమీ లేకపోవడం తిండికి లేక పోవడం. ఇది కొన్ని వర్గాలలోనే వినిపించే పలుకుబడి.
- "పొద్దున పనికి పోక పోతే కుండలు తొంగుంటాయి." వా.
కుండలు నాకు
- నీచానికి పాల్పడు.
- "వాడి కేం? పనా పాటా? కుండలు నాకుతూ బతుకుతున్నాడు." వా.
కుంతలము లొత్తు
- వెండ్రుకలు సరి చేసుకొను.
- "తరుణి నుదుట బైకొన్న కుంతలము లొత్తి." ఉ. హరి. 1. 170.
కుందనపుకమ్మి దిగిచిన యందమున
- కమ్మి తీసినట్లు; మనోజ్ఞ రూపంతో.
- సమానత మొదట అర్థ మై కుందా____కుందె 482 కుందె____కుంప
- తరువాత మనోజ్ఞతకు కూడా పర్యాయ మైనది.
- బంగారు కమ్మిని కమ్మెచ్చులో తీసినపుడు తొలి నుంచీ తుదిదాకా ఒకే తీరులో ఉంటుంది. దానిమీద వచ్చిన పలుకుబడి.
- "కుందనపు గమ్మి దిగిచిన, యందమున." కళా. 2. 33.
- చూ. కమ్మెచ్చున తీసినట్లు.
కుందార్చు
- దు:ఖము తీర్చు.
- "అరసి దు:ఖాక్రాంత యైనరుక్మిణిని, గర మర్థి గుందార్చె గమలలోచనుడు." ద్విప. కల్యా. 130.
కుందికట్టు
- ఒక పిల్లల ఆట. యయా. 3. 55.
కుంది కుట్టాడు
- ఉన్న చోటు వదలక పడిఉండు.
- "ఇంటిలోనే రాత్రింబవళ్ళు కుంది కుట్టాడు దేల?" తె. జా.
కుందెటికొమ్ము
- అసంభవ మైనది.
- కుం దేలుకు కొమ్ముండదు గనుక అలా ఏర్పడినది.
- "వసుధన్ గుందెటికొమ్ము తెచ్చుకొనగా వచ్చున్ బ్రయత్నంబునన్." మల్లభూ. నీతి. 5.
- చూ. కుందేటికొమ్ము.
కుందెనగిఱి
- పిల్లల ఆట.
కుందెనగుడి
- ఒక పిల్లల ఆట. కాళ. 3. 33.
కుందేటికొమ్ము
- అసంభవము, అసత్యము.
- కుందేటికి కొమ్ము లుండవు కనుక, సంస్కృతంలో దీనినే శశవిషాణం అంటారు. వంధ్యాపుత్రుడు. గగన పుష్పము ఇత్యాదుల వంటిది.
'*"తిరిగి కుందేటికొమ్ము సాధింప వచ్చు, జేరి మూర్ఖునిమనసు రంజింప రాదు." భర్తృ. సు. నీతి.
- చూ. కుందెటికొమ్ము.
కుంపటి పెట్టు
- తగాదా పెట్టు, ఏదో ఒక అనాహూతము తెచ్చి పెట్టు.
- "వా ణ్ణేదో మాటసామెతకు ఇంటికి రమ్మంటే నే నక్కడ చేసిన వన్నీ నా భార్యతో చెప్పి కుంపటి పెట్టి పోయాడు." వా.
కుంపటిలో తామర మొలిచినట్లు
- తగనితావున ఉన్న మంచి వస్తువు పట్ల అనే పలుకుబడి. కుంపటిలో పెట్టిన మొక్కలకు బాగా నీరు పోసి ఎరువు వేసి పెంచుతారు. అందుకే అవి చాలా ఏపుగా కుంప____కుంభ 483 కుంభ____కుంభ
- పెరుగుతాయి. కానీ తామర నీళ్ళలోనే తప్ప కుంపట్లో మొలవదు.
- అందుపై ఏర్పడినది.
- ఈ 'అట్లు'కు బదులు ఏ ఉపమా వాచకం అయినా ప్రయుక్తం కావచ్చును.
- "నీ మగనితేజమున ను, ద్దామశమ సమగ్రు డనగ దగి కుంపటిలో, దామర మొలచినక్రియ ద,న్వీ! ముని విభు డైనసుతుడు నీ కుదయించున్." నృసిం. 3. 127.
- "కలిగెగదా కుంపటిలో,పల దామర వోలె నిట్టి పాషండపురిన్, జలజాక్షు ప్రతిమ భాగ్యము, గలవారికి నెచట నైన గల నభిమతముల్." పరమ. 5. 84. కాశీయా. 43.
- చూ. కుంపటిలో తామరలవలె.
కుంపటిలో తామరలవలె
- అనర్హస్థానంలో ఉన్న ఉత్తమవస్తువువలె.
- ఈ 'వలె' కు బదులు ఏ ఉపమావాచకంతో నయినా ఇది ఉపయుక్త మవుతుంది.
- "సామంతున కిడిన చలువచప్పరములు త,న్పై మేదిని గుంపటిలో, దామరలుంబోలె నట్టితఱి నొప్పారెన్." ఆము. 2. 69.
- చూ. కుంపటిలో తామర మొలిచినట్లు.
కుంభకర్ణనిద్ర
- మొద్దునిద్ర.
- కుంభకర్ణుడు ఏటా ఆరు నెలలు నిద్రపోయేవా డన్నకథపై వచ్చిన పలుకుబడి.
- "వాడిది కుంభకర్ణనిద్ర. ఏనుగులు తొక్కినా లేవడు." వా.
కుంభకోణం
- మోసం.
- "ఇందులో యేదో కుంభకోణం ఉందని నా అనుమానం. నే నిందులో దిగను." వా.
కుంభద్రోణముగా
- కుండపోతగా (వాన కురియు.)
- "కుంభద్రోణముగా గురిసెన్." విప్ర. 3. 61.
కుంభముమీది పొట్టేలువలె
- క్రొ వ్వెక్కి.
- జాతర్లలో అన్నం వండి అమ్మవారిముందు రాశి పోస్తారు. దాన్నే కుంభం అంటారు.
- అక్కడ దేవతకై వదిలిపెట్టి ఉండిన పొట్టేలును బలి యివ్వడానికి నిల్పుతారు. ఆ పొట్టేలు బాగా తిని క్రొవ్వి ఉంటుంది. అందుపై వచ్చిన దేవరపోతు లాంటి పలుకుబడి. అది తనకు కలుగ నున్న
ఆపదను (బలి యివ్వ నున్నారన్న) గమనించక నిర్విచారంగా ఉంటుంది. దానివలె ననుట.
- "తెగిచి యిటు వండి పెట్టిన, బొగులవు కుంభంబుమీది పొట్టేలుక్రియన్." శుక. 3. 276. కుంభ____కుక్క 484 కుక్క____కుక్క
- ఇట వలెకు బదులు ఏ ఉపమావాచక మయినా ప్రయుక్తం కావచ్చును.
కుంభవర్షము
- కుండపోతవాన. కుండలతో గ్రుమ్మరించినట్లు - ఎక్కువగా కురియు వాన.
- "కుంభవర్షం బయ్యె గుంభినియందు." పల. పు. 14.
- చూ. కుండపోత.
కుక్కకాటుకు చెప్పుదెబ్బ
- చెడుగుకు బదులు చెడుగే చేయాలి అనుపట్ల అంటారు.
- "వా డన్నదానికి సరీగా బదులు చెప్పావు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ." వా.
- చూ. కుక్క కాటు చెప్పు టేటు.
కుక్కకాటు చెప్పుటేటు
- చూ. కుక్క కాటుకు చెప్పుదెబ్బ.
- తాళ్ల. సం. 11. 3 భా. 77.
కుక్కకు గతుకునీళ్లే
- వాడి అనుభవం అంతే అనే నిరసనార్థంలో ఉపయోగిస్తారు.
- నీళ్లు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కుక్క నాలుకతో అద్ది గతుకుతూనే తాగుతుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
- "వాడు ఎంత సంపాదిస్తే నేం? ఎంత చేస్తే నేం? మిరప్పొడి మెతుకులు తప్ప ఇం కేం తినడు. ఎన్ని వానలు వచ్చినా కుక్కకు గతుకునీళ్లే." వా.
కుక్కకు నై వేద్యమా
- నిష్ప్రయోజనము, అనర్హము అనుట. వేంకటేశ. 74.
కుక్కకూతురా!
- ఒక తిట్టు.
- "కుక్క కూతుర మెడ గోసి పో గలవు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 881.
- "కుక్కకూతుర వల దంచు వెక్కిరించు." శుక. 2. 458.
- చూ. గాడిదకొడుకు.
కుక్కగొడుగులు
- పుట్టగొడుగులు.
- క్షణికములు.
- ఎక్కువగా పుట్టుకొని వచ్చునవి అనే అర్థంలో ఉపయోగించే పలుకుబడి.
- వాన వచ్చినప్పుడు ఈ పుట్టగొడుగులు విపరీతంగా మొలుస్తాయి. త్వరలో పోతాయి కూడ. అందుపై వచ్చిన పలుకుబడి.
- "ఈ కుక్కగొడుగుల పార్టీల కేమి లే. లక్ష పుడతాయి, పోతాయి." వా.
కుక్కచ్చు వేయు
- శిక్షించు.
- అపరాధులకు తత్సూచకంగా రాజులు కుక్క ముద్ర వేసి విడిచేవారు; ఇదొక శిక్ష.
- "తల గొఱిగి ప,దంపడి కుక్కచ్చు వేసి దండింప దగున్." విజ్ఞానే. ప్రా. కాండ. 64.
- చూ. కుక్కయచ్చు. కుక్క____కుక్క 485 కుక్క____కుక్క
కుక్కజట్టీలు
- పెనగులాటలు.
కుక్కతోక
- వక్ర మైనది.
- ఆ వక్రాన్ని తీర్చుటకు వీలు లేనిది.
- ఎంత చక్కగా నిలుపుదామని ప్రయత్నించినా కుక్కతోక వంకర పోతూనే ఉండటం అలవాటు. దానిపై వచ్చినపలుకుబడి.
- "వాడి బుద్ధి ఒట్టి కుక్కతోక లాంటిది. ఎంత చెప్పి ఎంత చేసినా మరీ అంతే." వా.
కుక్కతోకను గొట్టము చేర్చు
- అసాధ్య కార్యమునకు పూనుకొను.
- గొట్టములో పెట్టినప్పుడు చక్కగా కనిపించినా, అది తీయగానే యథాప్రకారం వంకరగా తిరుగుతుంది.
కుక్కను కొట్టినట్లు
- చావదన్ని అనుట.
- "వెఱ్ఱి,కుక్క లోబడ బట్టి కొట్టిన రీతి." గౌర. హరి. ద్వి. 1111.
కుక్కనోటి ప్రాత
- భ్రష్ట మయినది.
- సంపంగిమన్న. 22.
కుక్కనోట్లో కట్టె పెట్టినట్లు
- అనవసరంగా కోపపడి కసురు కొంటాడు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- ముందే నోటిదురుసు కలవాణ్ణి అనవసరంగా గిల్లుకొని రెచ్చగొట్టిన ట్లనుట.
- కుక్కనోట్లో కట్టె పెడితే 'బౌ' మంటుంది.
- "వాడితో వాదించడం కుక్కనోట్లో కట్టె పెట్టినట్లే." వా.
- "వాడు ఏం మాట్లాడినా కుక్కనోట్లో కట్టె పెట్టినట్లుగా మాట్లాడతాడు." వా.
- "వాడితో మాట్లాడితే కుక్క నోట్లో కట్టె పెట్టినట్లే." వా.
కుక్కబుద్ధి
- నీచబుద్ధి.
- "నీ కుక్కబుద్ధి నువ్వు మానవు కదా." వా.
కుక్క ముట్టిన కుండ
- మైల పడినది.
- కుక్క ముట్టితే ఆ కుండ ఇక వంటకు పనికి రా దనీ పారవేయవలె ననీ అంటారు.
- "...వాయుసూనుని సుతు డింత సేయకున్న, పొలతి శశిరేఖ వ్యర్థ మై పోవు నమ్మ, కుక్క ముట్టినకుండ యై కుందరదన." శశి. (అప్ప) 4. 75.
- "ఆ కుక్క ముట్టినకుండలాంటి పిల్ల నెవరు చేసుకుంటార్రా?" వా.
కుక్కమురికి సంతానము
- కుచేలసంతానము.
- నారాయణదాసు సావిత్రీచరిత్ర. కుక్క____కుక్క 486 కుక్క____కుక్కి
కుక్కమూతి పిందెలు
- చెట్టు కాపు ఉడిగినప్పుడు ఏవో చిన్న చిన్న పిందెలు పుడతాయి. వాటినే కుక్క మూతిపిందె లంటారు. అవి పుడితే ఇక కా పుడిగిం దన్న మాటే.
- "చెట్టు చెడుకాలానికి కుక్కమూతి పిందెలు." సా.
కుక్క యచ్చు
- చూ. కుక్కచ్చు.
కుక్క యిల్లు చొచ్చినట్లు
- దొంగగా.
- "ఎఱుగకుండగ కుక్క యిలు జొచ్చినట్లు, ఘనుల నిక్కడ దెచ్చి కవ్వించినావు." మైరా. పు. 66.
కుక్కల కట్టు
- దొంగసాధానాలలో ఒకటి.
- "కత్తియు నీలిచీరయును...కుక్కల కట్టును." చెన్న. 3. 294.
కుక్కలవలె కాటులాడు
- నీచముగా కీచులాడు. వాడుకలో కాటులాడు కాట్లాడుగా మారినది.
- "కుక్కలభంగి దమలోన గాటులాడి." భార. శాంతి. 1. 45.
కుక్కలే శునకాలు కుండలే భాండములు
- ఎంత మరుగుగా చెప్పినా ఆ నీచ మైనది నీచ మైనదే అనుపట్ల ఉపయోగిస్తారు.
- శునక మని అర్థం కాని సంస్కృతం పేరు చెప్పినా అది కుక్కే కదా అనుట.
- "నీ వెంత సర్ది ఎన్ని చెప్పినా వాని దుర్మార్గాల నేమాత్రం దాచ లేవు. కాదన లేవు. దుర్మార్గుడు దుర్మార్గుడే. కుక్క లే శునకాలు కుండలే భాండములు - అన్నారు." వా.
కుక్క సంతకు వెళ్ళినట్లు
- నిష్ప్రయోజన మైన పని చేసినప్పుడు ఉపయోగించే పలుకుబడి.
- కుక్క సంతకు పోయి తూనిక కట్టెల దెబ్బలు తిని వచ్చిన దన్న సామెతపై వచ్చిన సామ్యం.
- "ఏదో ఆ ఊరికి వెళ్లాను కానీ నా ప్రయాణం అంతా కుక్క సంతకు వెళ్లినట్లు అయింది." వా.
కుక్కిన పేనులాగ
- గుక్కు మిక్కు మనకుండా, పేనును కుక్కితే అదలా చప్పున చచ్చి ఊరుకుంటుంది.
- "వాడు వచ్చా డంటే వీడు కుక్కిన పేనులాగా పడి ఉంటాడు." వా.
కుక్కిమంచము
- నులక వదు లై గుంత పడిపోయిన పాత నులకమంచము.
- "ఆ మూల కుక్కిమంచంలో ఉంటుందా ముసలవ్వ." వా.
కుక్కివడు
- మంచం కుక్కి అయిపోవు కుక్కు____కుక్షి 487 కుచ్చ____కుచే
- "కుక్కి వడిన మిగుల గొంగోడు వోయిన, గుఱుచ యైన...నుల్కమంచ మొప్ప దండ్రు." వి. పు. 4. 215.
- చూ. కుక్కిమంచము.
కుక్కురో కుఱ్ఱను
- కోడి అరుచుటలో ధ్వన్యనుకరణము.
- "కుక్కురో కుఱ్ఱని కూసె గల్కోడి." పండితా. మహిమ. 197. పు.
కుక్షింభరుడు
- 1. తన పొట్ట నింపుకొనుటే లక్ష్యముగా కలవాడు - స్వార్థపరుడు.
- "వాడు వట్టి కుక్షింభరుడు. ఏది ఏ మయినా తన పొట్ట గడిస్తే చాలు." వా.
- 2. కడుపులో ఉంచుకొను వాడు.
- "రక్షార్థంబు భరింప రాదె యభవున్ ద్రైలోక్యకుక్షింభరున్.: భీమ. 4. 105.
కుక్షి ప్రోచుకొను
- పొట్ట పోసుకొను.
- "ఎందైన గా,నీ భైక్షంబున గుక్షి బ్రోచుకొని దీనిం దీర్చి నే వత్తు." కా. మా. 3. 165.
- వాడుకలో 'వాడు కూలో నాలో చేసుకొని పొట్ట పోసు కొంటున్నాడు.'
- జనంలో ఉన్న దిదే. దీనిని పర్యాయపదాలలో ధూర్జటి మార్చినాడు.
- చూ. పొట్ట పోసుకొను.
కుచ్చలి గంత
- యోగుల బొంత. రాజ. చ. 2. 94.
కుచ్చలి బొంత పరమ. 1. 185.
- చూ. కుచ్చలి గంత.
కుచ్చిటప్పాలు
- డంబాచారపు మాటలు, జొల్లుకబుర్లు.
- "పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ కుచ్చిటప్పాలు తప్పితే వాడు చేసే దేముంది?" వా.
కుచ్చుమీసములు
- కడపట ఒత్తుగా ఉండే మీసాలు.
- "ఆ తలపాగా, ఆ కుచ్చు మీసాలు, ఆ పెద్ద కన్నులూ, మనిషి బహుగంభీరంగా ఉంటాడు." వా.
కుచ్చెళ్లలో పాము
- అతిప్రమాదకారి, దాపుననే ఉన్న ఆపద.
- చీర కుచ్చెళ్ళలోనో, పంచె కుచ్చెళ్ళలోనో ఉన్న పాము ఏ నిమిష మైనా కాటు వేయ వచ్చును కదా.
- "కుతుకం బంతయు గూలద్రోసెదవు గా కుచ్చెళ్లలో బామ వై." పాండ. విజ. 79.
కుచేలసంతానము
- గంపెడుపిల్లలు.
- ఇందులో పేదతనంలో చాక కుటి____కుట్టి 488 కుట్టు____కుట్టు
- లేనంత మంది పిల్ల లున్నా రనీ సూచన ఉన్నది.
- "వాడు ముసలితనంలో ఉద్యోగం లేక ఆ కుచేలసంతానంతో నానా బాధా పడుతున్నాడు." వా.
కుటిలత్వము కూడుగా కుడుచు
- కౌటిల్యమే ప్రథాన మగు. అతికుటిలు రనుట.
- "అటు గాన నెన్ని భంగుల, గుటిలత్వమును కూడు గాగ గుడుతురు మగనా, రెటువంటివారి మదిలో, నెటుగా నమ్ముదురు సతులు హితు లని పతులన్." విక్ర. 7. 131.
- చూ. కూడుగా కుడుచు.
కుటిలపఱచు
- కౌటిల్యమునకు పాత్రముగా చేయు, కుటిలత్వము చూపు, నెఱపు.
- "కుండు పెట్టక యేన్నాళ్ళు కుటిల పఱచి." భీమ. 4. 12.
కుట్టి చూచుటకు దోసకాయలా?
- తెలుసుకో లేము వాని ఆంతర్యం అనుపట్ల అంటారు.
- "....ఎదిరి కోర్కి యెఱుంగుట యెట్టు కుట్టియా, చూడగ దోసకాయలె? విశుద్ధయశోధన యన్య చిత్తముల్." హర. 2. 63.
కుట్టితే తేలు కుట్టకుంటే కుమ్మర పురుగు
- తన శక్తి చూసినప్పుడే సమర్థు డనీ, లేనిపట్ల చేత కాని వా డనీ అంటారు అన్న భావాన్ని తెలియ జేసే పలుకుబడి. ఇదే గ్రాంథిక రూపంలో -
- "కుట్ట దేలు కుట్టకున్న గుమ్మర బూచి, తోసిరా జటంచు దోచె జెలియ, దాని వ్రేలు దీసి దాని కన్ను బొడిచి, నటుల సేయకున్న నగునె పలుక." రాధ. 3.
- "వా డన్ని రకాలుగా వేధిస్తుంటే శాంతంగా నే నూరకుంటే న న్నేదో చేత గానివా డనుకుంటారు. కుట్టితే తేలు కుట్టకుంటే కుమ్మరపురుగు!" వా.
కుట్టుకాడ
- కుట్టుపోగు. శ. ర.
కుట్టుచేడు
- తప్పుపనులకు ప్రేరేచువాడు.
- "గురుసతి గూడురట్టునకు గొంకని మోడు వియోగినీసము, త్కరముల కీడు చూచుటకు దర్పకు రే పెడుకుట్టు చేడు." వరాహ. 4. 24.
- కొరడా అని సూ. ని; దుర్మార్గుడు అని వావిళ్ళ ని. - రెండూ సందిగ్థ మనే వ్రాసినవి.
- పై అర్థం సందర్భాన్ని బట్టి వ్రాసినదే. ప్రయోగాంత రాలున్నట్లు లేవు.
కుట్టుటాకు
- విస్తరి.
- విడియాకులు కుట్టగా ఏర్పడినది. కుట్టు____కుడి 489 కుడి___కుడి
కుట్టుతేలు
- దుష్టుడు. ఆం. భా.
కుట్టుపోగులు
- మొదట చెవి కుట్టినప్పుడు వేసే వట్టి బంగారుకాడతో చేసిన పోగులు.
కుట్టుపోయు
- కుట్టు వేయు.
కుట్రపువాడు
- దర్జీ. బ్రౌన్.
కుడిచి కూర్చుండు
- 1. అందుకనే కాచుకొని యుండు.
- 'అందుకు' అనునప్పుడు ఏదో ఒక చెడుపనికై అని కూడా.
- 2. తన కేమీ అవసరం లేక పోయినా కల్పించుకొను.
- "కుడిచి కూర్చుండి మీ రేల కొఱత యైన, కుమ్ము లాడెద రోయన్నదమ్ము లారా!" భీమే. 4. 53.
- "కుడిచి కూర్చుండి రాజ్యంబు విడిచి పోవ." జైమి. 2. 108.
- "కుడిచి కూర్చుండి వెత దెచ్చుకొంటి మొకటి." ప్రభా. 4. 16.
- "కుడిచి కూర్చుండి యే గ్రొవ్వి, యివ్వేషంబు బూనిన యవివేకమునకు దోడు...." విప్ర. 3. 56.
- "వాడు కుడిచి కూర్చొని ఊళ్లో వాళ్లందరిమీదా లేనిపోని అపవాదులు వేస్తుంటాడు." వా.
- "కుడిచి కూర్చొని ఇదేం పనిరా?" వా.
- తిని ఉండబట్టలేక అన్న పలుకుబడివంటిదే ఇది.
- "తిని కుడిచి తిమ్మణ్ణి పాడెను." సా.
కుడితిలో పడ్డ యెలుక
- అతి సంకటావస్థలో పడిన వ్యక్తి.
- చూ. కుడితిలో బల్లి.
కుడితిలో పిల్లి
- చూ. కుడితిలో బల్లి.
కుడితిలో బల్లి
- అతిసంకటావస్థలో తగులుకొన్న సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.
- "వాడు కుడితిలో బల్లిలాగా నానా అవస్థా పడుతున్నాడు." వా.
కుడినీరు
- మంచినీరు.
- "పడమటి పన్నీరు కుడినీరు రాయంచ, గిండులు చెంగట గీలుకొల్పి." దశా. 7. 1.
కుడిబుజము
- ప్రధానమైన అండ.
- "కుడిబుజ మై రమ్ము గొబ్బున నెను బోతు, కానుక సేతు నూకాల తల్లి." కవిచకోర.
- "వాడు రెడ్డికీ కరణానికి కుడిభుజం. వాడు లేందే ఏం జరుగుతుంది?" వా.
కుడిమివాడు
- విషవైద్యుడు. బ్రౌన్. కుడి____కుడి 490 కుడు____కుడు
కుడిముట్టు
- అన్నం తినే - నీళ్ళు త్రాగే - పాత్ర.
- "తొడవులు చినికిన యెమ్ములు, గుడిముట్టు కపాల మిల్లు గుడి ముడి యెద్దె,క్కుడు గట్టువలుపు దో లగు, బడరున కై నవయ నేమి ప్రళయము వచ్చెన్." కుమా. 7. 39.
కుడియెడమగా
- కొద్దిపాటి భేదముతో.
- "ఆ ప్రాచీనవిగ్రహానికి ఇతను కుడి యెడమగా ప్రతిరూపం చేశా డంటే నమ్ము." వా.
- "కాస్త కుడి యెడమగా ఉంటా రా అన్నదమ్ములు." వా.
కుడి యెడమ యెఱుగని
- మంచీ చెడ్డా తెలియని.
- "జడివాన కురిసినట్లే, విడువక వాదింతు రాత్మ వేత్తల మనుచున్, కుడి యెడ మెఱుగని మాటల, జడమతు లగు కొంద ఱన్న సంపగిమన్నా!" సంపగిమ. శ. 56.
- "వాడికి కుడీ యెడమా తెలీదు. అందరినీ అలా గే కసురుకుంటాడు." వా.
కుడియెడమల దిరుగు
- అటు ఇటు తిరుగు.
- "ఎడనెడ దలవడుచో వడి,గుడి యెడమల దిరుగు నేనుగులపిఱుదులు నే,ర్పడునట్టి క్షణములోనన." కళా. 8. 86.
కుడి యెడమ లేక
- అటూ యిటూ కూడా అనుట.
- ఇటు వేయాలి అటుకాదు అన్న భేదం లేకుండా ఎటుపడితే అటు. ముందూ వెనుకా చూడకుండా అనుట వంటిది.
- "వెడవిల్తుడు శిరముల బా,రిడి నను గుడి యెడమ లేక యేయం దొడగెన్." శ్రవ. 3. 45.
కుడుపకూటి ప్రాయమువాడు
- బాలుడు.
- అన్నము పెట్టి తినిపించవలసిన వయసులో ఉన్నవాడు అనుట.
- తక్కువ అన్నం తినేవాడని కూడా భావార్థం.
- "ఇసుమంత గాని లే డీ, పసిబాలుడు కుడుపకూటి ప్రాయమువాడు." పాండు. 4. 180.
కుడుపు దక్కు
- ఒక్కప్రొ ద్దుండు, ఆహారం లేకుండు.
- "కుల్యయందు ద్రిరాత్రంబు గుడుపు దక్కి, శౌచియై యఘమర్షణజపము చేసి, యశ్వమేధఫలము నందు ననఘ వరుడు." భార. అను. 2. 87.
కుడుపు వెట్టు
- భోజనము పెట్టు - నై వేద్యము పెట్టు.
- "చమురు చిప్పిలం గాల్చినకమ్మకఱ కుట్లం జట్రాతిపయి గాట్రేనికం గుడుపు వెట్టి."
కుడుముల వ్రేట్లాటలు కావు
- సులభకార్యములు కావు. కుడు____కుడు 491 కుడు____కుతి
- "కుడుముల వ్రేట్లాటలు గా, వుడు రాజానన రణంబు లూహించిన..." ప్రభా. 5. 195.
కుడువ గట్టను దొడుగను ముడువ కలదు
- అనుభవించుటకు తగిన వన్నీ ఉన్నవి.
- వాడుకలో తినడానికీ, కుడవడానికీ - తినడానికీ, తొడగ డానికీ - ఉం దని అంటారు.
- "కుడువ గట్టను దొడుగను ముడువ బుడమి, నెంత గలిగిన..." హంస. 3. 206.
కుడువ గూడును గట్టుకో గోక లేక
- తిన తిండి, కట్ట బట్ట లేక అని వాడుక.
- "కుడువ గూడును గట్టుకో గోక లేక, యితని కిల్లాలి నై యుండ నేల యనుచు." శుక. 2. 365.
కుడువ నిచ్చు
- భోజనం పెట్టుటకు ఒప్పు కొను
- "....తనబానసంబు వానిం బిలిచి యే నొక్క బ్రాహ్మణునకుం గుడువ నిచ్చి మఱచి యుండితిం జెచ్చెఱ నవ్విప్రునకు మాంసంబుతో గుడువంబెట్టు మని పంచిన." భార. ఆది. 7. 115.
కుడువబెట్టి కంచ మాఱడి గొను
- నోటిముందరి అన్నము తీయు. అన్నం పెట్టి కంచం తీసి వేయుట అంతే కదా.
- "అతడు మంత్రశక్తి నసిబోయె గాక కా,కున్న మృత్యుబాధ నొందకున్నె, కాన గుడువ బెట్టి కంచ మాఱడి గొను, కంటె మిగుల బాతకంబు లేదు." భోజ. 6. 182.
కుడువబెట్టు
- విం దిచ్చు.
- "అవ్విప్రునకు మాంసముతో గుడువ బెట్టు మని పంచిన." భార. ఆది. 7. 115.
కుతకుతలాడు
- 1. ఉడుకు.
- "అన్నం కుతకుతలాడుతూ ఉంది." వా.
- 2. కోపించు.
- "అత నే మలా కుతకుతలాడు తున్నాడు?" వా.
- 3. కళవళపడు.
- "నా మనసు కుతకుతలాడుతూ ఉంది." వా.
కుతికంటు
- కంటె.
- "కుతికంటు సరిపెణ గుండ్లపేరు." హంస. 2. 190.
కుతికిలపడు
- కూలబడు. మను. 4. 27.
కుతిల కుడుచు
- కుతిలపడు; దు:ఖపడు.
- "కొండల తిమ్మని జూచి లోలో కుతిల కుడుప నేటికే." తాళ్ల. సం. 12. 82.
- "ఊళ్ళ వెంబడి దేవర, గుళ్ళపంచల జేరి గుతిల కుడిచి." హరి. 4. 191. కుతి____కుత్తు 492 కుత్తు____కుది
కుతిలగొను
- బాధపడు.
- "దైత్య రాజతనయ, దొడరి దేవయాని ద్రోపించె వలువీక, క్రుంగి నూతిలోన గుతిలగొనగ." భాగ. 9 స్కం. 523.
కుతిలపడు
- దు:ఖపడు.
- "కుష్ఠామయంబున గుతిలపడగ." శివ. 4. 78.
- "కుతిలపడు నతండు గువ్వకుత్తుక తోడన్." పాండు. 3. 20.
కుతిలపఱుచు
- ఇక్కట్టు పెట్టు; బాధ పెట్టు.
- "కుతిలపఱుపరె నృపుబంట్లు గుదెల వారు." కాశీ. 5. 289.
కుతిలపాటు
- బాధ.
కుతిల పెట్టు
- బాధ పెట్టు.
- "...అరాజకత్వ, దోషజాత మైన దురితబాహుళ్యంబు, కుతిలవెట్టి భూమి యతలమునకు, బోవ." భార. శాం. 2. 89.
- రూ. కుతిలవెట్టు.
కుత్తుకంటు
- కంటె. రా. వి. 1. 62.
కుత్తుకబంటి నీరు
- కుత్తుక మునుగు దాక ఉన్న నీరు. నీటిలోతు చెప్పుటలో - మోకాలి బంటి (లోతు) మొలబంటి (లోతు) అంటారు.
- "నిండు మనంబుతో విజితనీరధి గుత్తుకబంటి నీటితో, నుండి." కా. మా. 1. 131.
కుత్తుక విసము, నాలుక బెల్లము
- గోముఖవ్యాఘ్రము లాంటి పలుకుబడి.
- "కైరవాప్తకళంకంబు పేర విషము, లోన జీర్ణించి యుండ బైపైని చంద్రి,కలు వెలిగించెదవు కుత్తుకను విసంబు, నాలుకను బెల్లమును గాదె పాలసునకు." కవిరా. 3.
కుత్స సేయు
- అసహ్యించుకొను, నిందించు.
- "జీవితేశ్వరుడు డించిన యోగిరంబులు కుత్స సేయక భుక్తి గొనుట తగవు." కాశీ. 2. 75.
కుదికిలబడు
- చదికిల బడు.
కుదిమట్టంగా
- లావుకు తగినయెత్తు కలిగి.
- "ఆ పిల్ల అంత పొడుగూ కాదు. అంత పొట్టీ కాదు. కుదిమట్టంగా ఉంటుంది." వా.
- చూ. కుఱుమట్టము.
కుదియ గట్టు
- ఒకటిగా కట్టు.
- కూటశాల్మలులందు గుదియ గట్టగ లేదు." రుక్మాం. 2. 22.
కుదియ బట్టు
- గట్టిగా పట్టు; వెనుకకు లాగి పట్టు.
- "వాహకుల్, పరిపరిలాగులం గుదియ బట్టుచు రా." జైమి. 2. 15.
- "పగ్గముల్ కుదియబట్టి." జైమి. 3. 111. కుది____కుదు 493 కుదు____కుదు
కుదియబడు
- వెనుకంజ వేయు; కృశించు.
- "చిందముల కోలాహలములకు గుదియ బడక." భార. విరా. 4. 62.
- "దేహంబు.....కుదియబడగ." దశా. 2. 139.
కుదిలపడు
- చూ. కుతిలపడు.
కుదిలపఱుచు
- బాధ పెట్టు, నొప్పించు.
- "కూలికై న న్నిట్లు కుదిలపఱుచు చున్నారు." పరమ. 5. 48.
కుదుకనగోలు గైకొను
- చెల్లు వేసికొను.
- "ఇక నైన,కుదుకనగోలు గైకొనక నా ధనము, వదులుము." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1285.
- వంచించు అని వావిళ్ళ. ని.
కుదుటపడు
- ఊరట చెందు; ఒక స్థిమితమునకు వచ్చు.
- "ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ల కుటుంబం ఈనాటికి కొంత కుదుటపడింది." వా.
కుదురుకొను
- 1. నెలకొను కవిక. 2. 61.
- 2. స్థిరపడు.
- "శివుడు చటులవిషాగ్నిం, గుదురుకొన గంఠబిలమున, బదిలంబుగ నిలిపె." భాగ. 8. 245.
- "ఆ ఊళ్లో వా డింకా కుదురుకో లేదు." వా.
కుదురుకొల్పు
- నెలకొల్పు.
- "....గుబ్బ చన్నుల మీద గుదురు కొల్పి." క్రీడా. పు. 45.
- స్థిరముగా నిలుపు.
- "కురుకులంబున సత్కీర్తి గుదురు కొల్పు." జైమి. 1. 61.
- ఇది 'పాదుకొలుపు' వంటిది.
- కుదురు = పాదు.
కుదురుగా కూర్చుండు
- స్థిరముగా కూర్చొను.
- "నిశ్చలతం,గడు గుదు రై కూర్చుండుట, పుడమిన్ వీరాసనాఖ్య బొలుచు మహాత్మా!" కళా. 5. 162.
కుదురు చేయు
- పాది చేయు, ఆలవాలమును ఒనర్చు.
- "తాన కుదురు చేసి, వలయుబీజము లెల్ల మొలవ బెట్టి..." కుమా. 7. 19.
కుదురుపట్టు
- పంటికుదుళ్లు.
- "కుదురుప ట్టెడలి లివలివం గదలురదన పంక్తులును." కవిక. 5. 110.
కుదురుపడు
- నెలకొను; స్థిరపడు; నిలుచు.
- "మత్పాదభక్తి యాత్మను జనించిన మాత్ర జ్ఞానంబు గుదురుపడును." దశా. 1. 222.
కుదురు పఱుచు
- కుదురుపడునట్లు చేయు.
- "కీలుగొప్పున బైడి గేదంగిఱేకులు, గొనలు గానంగ రా గుదురుపఱచి." శృం. నైష. 8. 112. కుదు____కుప్ప 494 కుప్ప___కుప్ప
కుదురుపాటు
- స్థిరత.
- "వాని తండ్రికిం, బట్టము గట్టి యా కుదురుపా టవునంతకు నిల్చి." రాధ. 3. 52.
కుదువ పెట్టు
- తాకట్టు పెట్టు.
- ఇది రాయలసీమలో నేటికీ వినవచ్చే పలుకుబడి.
- "విత్తంబు చాలని విభవంబు కొఱ గాదు, కుదువపెట్టగ రాదు కుందనంబు." రామలిం. 46.
- "అప్పటి కిప్పుడు అల్లు డొచ్చా డని కంటె కుదువబెట్టి ఇరవై రూపాయలు తెస్తిని." వా.
కునికిపాట్లు పడు
- తూగు, పని లేక ఉండు.
- "ఆఫీసులో కూర్చునే వాడు కునికిపాట్లు పడుతూంటాడు." వా.
కునుకు పట్టు
- నిద్ర పట్టు.
- "కునుకు పట్టిన జుట్టుకొను దవాగ్ని." రామలిం.
- "రాత్రంతా దోమలతో కునుకు పట్ట లేదు." వా.
కుప్ప కూలు
- కుప్పగా కూలిపోవు.
- "నిలువున కుప్ప లై కూలినట్లును." కవిక. 2. 197.
కుప్పకోలుగొను
- ఎక్కు వగు.
- "ఆర్తరవంబులు కుప్ప కోలుకొన." హరి. 3. 61. బ్రౌన్.
కుప్పగూరగా
- 1. ఛిన్నాభిన్నముగా.
- "ఎడగని యబ్బలంబు గడు నేడ్తెఱ గిట్టి మహాస్త్రశస్త్రముల్, గడు వడి గుప్పగూరగ జలంబున బై దొరగింప..." భార. ద్రోణ. 3. 152.
- 2. కుప్పలుకుప్పలుగా.
- "మదీయబాణంబుల గుప్ప గూర బఱపి." భార. భీష్మ. 3. 335. భోజ. 7.
- రూ. కుప్పనగూరలుగా.
కుప్పగూరగా పడు
- కుప్ప గూలబడు.
- "కోపించినన్ గుప్పగూరగా బడియె, నా పాపమతి భస్మ మై." వర. రా. అర. పు. 38. పంక్తి. 9.
కుప్ప గూల్చు
- కుప్పలుగా పడగొట్టు.
- "కుప్ప గూల్చె నిశాచరకోటి నపుడు." భాస్క. రా. యు. 1965.
కుప్ప చిచ్చిడి పేలాలు కొఱకు
- కొద్దిపాటి స్వలాభం కోసం ఇతరులకు అనంతంగా నష్టము కలిగించు.
- తనకు కావలసినవి నాలుగు పేలాల గింజలు. వానికోసమై ధాన్యం కుప్ప కే నిప్పు పెట్టేవా డనుట.
- పరమనీచు డనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- పేలాలకోస మని వామికే నిప్పు పెట్టేవా డంతే కదా! కుప్ప____కుప్ప 495 కుప్ప____కుప్ప
- "తలచు బ్రహ్మస్వదేవస్వములకు నెగ్గు, కుప్ప జిచ్చిడి పేలాలు కొఱుక దివురు, గ్రహణకాలంబునందు మున్గడు జలముల, సెబ్ర చెంచడ మా బ్రాహ్మణ బ్రువుండు." పాండు. 4. 196.
- చూ. గడ్డం కాలుతూంటే చుట్ట ముట్టించు కొన్నట్టు.
కుప్పతెప్పలుగా
- సమృద్ధిగా, ధారాళంగా.
- "కప్పురపు గంది వనిలోన గలయ మెలగు, గప్పురపు టింటి బోదెల నుప్పతిల్లి, కుప్పతెప్పలుగా రాలు కప్పురంబు." మృ. వి. 2. 15.
- "ఆ ఊళ్లో వంకాయలు కుప్ప తెప్పలుగా దొరుకుతాయి." వా.
- చూ. కుప్పలు తెప్పలుగా.
- రూ. కుప్పతిప్పలుగా.
కుప్పనగూర
- చూ. కుప్పగూరగా.
కుప్పన గూరు
- కుప్పగా కూలు.
- ధ్వన్యనుకరణము.
- "కయిసేయు తెఱం గయథాతథంబుగా, గుప్పన గూరి యొండొరుల గూడక." పారి. 3. 11.
కుప్పనూర్పులు
- మహసూలు, పంట రాల్చుకునే కాలం.
- "కుప్పనూర్పిళ్ల కాలంలో కూలీలకు మహా గిరాకీ." వా.
కుప్పలు గట్టు
- కుప్పలు పడు.
- "కుండల చారు మస్తములు కుప్పలు గట్టె పురంబువీథులన్." కేయూర. 2. 116.
కుప్పలుగా గురియు
- ఎక్కువగా కురియు.
- "హృదయము జిల్లని కుప్పలుగా గురిసీ జెమ్మటా." తాళ్ల. సం. 4. 179.
కుప్పలు గొను
- కుప్పలు పడు.
- "కుప్పలు గొన జల్లు పుప్పొడి యెరువుగా, బొరిబొరి విరహాగ్ని బొగుల జొచ్చె." ద్వాద. 5. 130.
- "కుప్పలు గొను విక్రమార్కు గుణములకొఱకై." సంహా. 1. 31.
కుప్పలు తెప్పలుగా
- చూ. కుప్ప తెప్పలుగా.
కుప్పలు పడు
- గుంపులుగా చేరు; కుప్పలుగా పడు.
- "ఏమిటికి నిక నిచటన్, గుప్పలు వడి నిలువగ." వరాహ. 10. 34.
కుప్పలో మాణిక్యము
- చెడు పరిసరాల్లో ఉన్న మంచి వస్తువునో, మనిషినో గూర్చి చెప్పేటప్పుడు అనే మాట.
- "ఆ పాడుకొంపలో అంతా రాక్షసులే. కుప్పలో మాణిక్యంలో ఆ పిల్ల ఒకటీ పుట్టింది." వా.
కుప్పవడు
- కూలబడు; రాసులు పడు.
- "కాళ్ళు కుప్పవడగ గదల జాలక." దశా. 4. 45.
- "ధర బ్రేగులు గుప్పవడగ." చంద్రా. 2. 94.