పదబంధ పారిజాతము/ఐ
ఏళ్లు____ఏషా 292 ఏష్య___ఐదు
- వాడుకలో రూపం:
- "ఏం తప్పు చేసినా కడుపులో పెట్టుకొని ఈ అమ్మాయిని నీవు ఏలుకోవలసిందే."
ఏళ్లు కోళ్లు ఏక మగు
- ఏకార్ణవ మగు. నదులూ కాలువలూ కలిసి పోయె ననుట. (కోడు = కాలువ.)
- "మొన్నటివర్షాలలో ఏళ్ళూ కోళ్ళూ ఏక మయినవి." వా.
ఏ వెంట
- ఏ విధముగా, ఎట్లయినను, ఏరీతిగా చూచినను.<.big>
- "కావున నగ్న ముఖ్యప్రకారంబు,లే వెంట నిందయే యిల?" పండితా. ప్రథ. వాద. పుట. 687.
ఏవెంట బోయితి మేమి?
- ఏ విధముగా నైనా, ఏ దెట్లయినా. ఎలా అయితేనేమి? అనుట.
- "జంటన్ వచ్చిన సారమేయములు నీ సైన్యంబులున్ మావెయే, వెంటం బోయితి మేమి?" ఉ. హరి. 2. 140.
ఏసరేగు
- విజృంభించు, ఎక్కు వగు.
- "ఇట్లు లత్యుగ్ర మగుగ్రీష్మ మేస రేగి." పాండు. 4. 18.
ఏషాగాధా లాడు
- అస్తవ్యస్తపుమాట లాడు. దీని వ్యుత్పత్తి వి......... తంజావూరు వాఙ్మయంలో విశేషంగా కానవచ్చే పలుకుబడి.
ఏష్యములు పలుకు
- భవిష్యత్తును చెప్పు. ఆము. 6. 66.
ఏహ్యముగా
- అసహ్యంగా, రోతగా.
ఐదు పది సేయు
- నమస్కరించు. రెండుచేతులు కలిసినప్పుడు అయిదువేళ్లు పది వేళ్లగును. వెనుకంజ వేసినప్పుడు కాలి వేళ్లు పది యగు నని కొందఱు.
- "ఉరవడి బోరికై కవచ మొల్లరు మంత్రములందు దక్క సు,స్థిరభుజ శక్తి నైదు పది సేయరు దత్తిన తక్క మంటికై." ఆము. 2. 34.
- కళా. 8. 100.
ఐదువేళ్లూ లోపలికి పోవు
- చూ. అయిదువేళ్లూ లోపలికి పోవు.
ఐదువేళ్లూ సమంగా ఉండవు.
- అందరూ ఒకటిగా ఉండరు - ఎన్నోరకాలు అనుపట్ల ఉపయోంచేపలుకుబడి. ఒక యింటి వారు ఒక తల్లి పిల్ల లే అయినా విభిన్నత లుండు ననుపట్ల ఉపయోగిస్తారు.
- "అలాంటి పెద్దమనిషితమ్ము డింత దుర్మార్గు డయ్యడే, అయినా ఐదు వేళ్లూ సమంగా ఉండవు లే." వా. ఐన______ఐస 293 ఒంట______ఒంట
ఐనది కాదను కానిది ఔనను
- అడ్డదిడ్డంగా మాట్లాడు.
- "ఐనది కా దని యనగా, గానిది యౌనని వచింపగా గలమీతో." శ్రవ. 4. 54.
ఐనన్ కానిమ్ము
- అయితే కానీ.
- "ఐనన్ గానిమ్ము భవద్దీనతకై వ్రతము విడిచితిన్." మను. 3. 100.
- ఒకడు బలవంతము చేయగా అంగీకరించిన సందర్భంలో అనేమాట.
- "అయితే కానీ, ఏం చేస్తాం?" వా.
ఐపు అజ
- జాడ. జం.
- "వాడి ఐపు అజా తెలియడం లేదు." వా.
ఐపు లేడు
- ఎక్కడికి పోయినాడో తెలియదనుట.
- "వాడు ఐపు లేకుండా పోయినాడు." వా.
ఐసరుబొజ్జ
- సెబాసు.
- "కాంతలమాట నమ్ముకొని కంతునికిం గడు లోకు వై తదీ, యాంతరభావముల్ దెలియ కైసరు బొజ్జ యటంచు నుబ్బుచుం, ద్రెంత వివేకు లైన...." శ్రవణా. 3. 75.
ఐసరు బొజ్జ తోపా
- సెబాసు.
- చూ. ఐసరుబొజ్జ.
ఒంటని
- అహితు లైన. పథ్యముకాని, హితము కాని - అన్న సంస్కృతం మాటల వలెనే 'ఒంటదు' కూడా రోగికి కొన్ని వస్తువులు పథ్యము కావు అన్నట్లే ఉపయోగిస్తారు. 'వానికి వంకాయ ఒంటదు' ఇత్యాదులు. అందుపై వచ్చిన మాట.
- "ఒంటనిరాజుల కప్పము, గొంటి న్మే లేర్చి...." కళా. 5. 116.
ఒంట బట్టు
- బలప్రవర్ధక మగు, మనసున కెక్కు, హిత వగు. ఏదైనా తిన్న ఆహారం జీర్ణ మై రక్తరూపంలో ఒంటికి పట్టిన దనుటపై వచ్చిన పలుకుబడి. తర్వాత ఇది ఆంగిక మయిన ప్రోదికే కాకా ఇతరములకూ చెల్లినది.
- "వాడికి తిన్న ఆహారం ఏదీ ఒంట బట్టడం లేదు." వా.
- "వాళ్ల నాన్న ఎంత ప్రయత్నించినా వాడికి చదువు ఒంటబట్ట లేదు." వా.
- "ఎన్ని నీతులు చెప్పినా వానికి ఒంటబట్ట లేదు." వా.
- "ఈ ఊరినీళ్లు నీకు బాగా ఒంటబట్టినట్టున్నాయే. అప్పుడే కాస్త ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాజసమూ, ఆఠీవీ." వా.