అట్టి______అట్టు 37 అట్ల_______అడ

  • "ఇది యేమో మన పాళె మెల్ల వగ నట్టిట్టయి వెతం జెంద..."
  • శుక. 1. ఆ. 477 ప.
  • "ఎడబాయనీక బల్విడి నంట గదుముచు నట్టిట్టు వడి ద్రోపులాడునవియు."
  • కళా. 8. 81.

అట్టిట్టు సేయు

  • కలత పెట్టు.
  • "తొట్రించి గొర్లలో దోడేలు పొచ్చిన, ట్లీగబ్బి వేళ్ళ నట్టిట్టు సేయు."
  • సారం. 1. 92.

అట్టిద కాక

  • సరేం అట్లాగే.
  • "మా యనుమతిజేసి, పుట్టు ద్వితీయ శంభుం డన బుడమి, 'నట్టిద కా' కని యానందలీల, బుట్టె."
  • బస. 1. ఆ. 8 పుట.

అట్టుడికినట్లు ఉడుకు<.big>

  • ఒకవిషయమై గగ్గోలు ఏర్పడు.
  • "ఆపిల్ల ఎక్కడో లేచిపోయిం దని ఊరంతా అట్టుడికినట్టు ఉడికి పోయింది." వా.

అట్టుపుట్టు

  • పుట్టుపూర్వోత్తరాలు. జం.

అట్టుపుట్టానవాళ్ళు

  • "దాని అట్టుపుట్టు ఆనవాళ్లు వాడిని అడిగితే కాని తెలియవు." వా.
  • "అట్టుపు ట్టానవాళ్లతో నాగుట్టంతయు నీవే చెప్పుచుండ నేను లే దని మఱుగు పఱచుటవలన నేమి లాభము?"
  • సౌందర్య. స. 58.

అట్టులవోలె

  • వలె - ఉపమా వాచకం.
  • వీనిలో ద్విరుక్తి నన్నెచోడునిలో విరివిగా కానవస్తుంది.
  • కుమా. 9. 64.

అట్ల కాక.

  • సరే.
  • ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు మంచిది అన్నట్లే - సరే అన్నట్లే - గ్రాంథికంలో అంటే ఆనాటి వాడుకలోనూ, అట్ల కాక అనుట అలవాటు.
  • బస. 2. ఆ. 24 పుట.

అట్లు పోయు

  • చూ. దోసెలు పోయు.

అడ కట్టు

  • గుత్తిగా యేర్పడు.
  • "ఎత్తులం గలసి చిగుళ్లువెట్టి యడకట్టిన క్రొవ్విరి మొల్ల పూవుటెత్తులు."
  • శకుంతలా. 1. 83.

అడకత్తెర

  • పోకలు కత్తిరించుకత్తెర. కన్నడంలో అడకత్తు అంటే ఖండించు అని అర్థం. కొత్తు అన్నా అంతే.

అడకత్తెర బతుకు

  • అటూ యిటూ కూడా బాధలకు గురి యగుబతుకు.
  • "నే నటు పోవడం లేదని పుట్టింటివారికి కోపం. వాళ్ళవల్ల యేమీ లాభం లేదని అత్తింటివారికి కోపం. వీళ్ళిద్దరి మధ్యా పడి నాది అడకత్తెర బతుకు అయిపోయింది." వా. అడ_______అడ 38 అడ________అడ

అడకత్తెరలో పడు

  • ఇఱుకున చిక్కుకొను.
  • "వాడు అడకత్తెరలో పడి మిటకరిస్తున్నాడు." వా.

అడకత్తెరలో పోకలాగ

  • చిక్కులో ఇరుకుకొని పోవుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "చెల్లెలు, భార్యా మధ్య వాడు అడకత్తెరలో పోకలాగా అయిపోయాడు." వా.

అడకొత్తున నొత్తు

  • ఇఱుకున పెట్టి బాధించు, అడకొత్తునం దొత్తినట్లు అనుట.
  • "ఓర్వదు బంధుజాల మడకొత్తున నొత్తును మామగారు."
  • శశాం.3. అ.

అడగనివానిది పాపం

  • అడిగినవాని కల్లా ఇచ్చు ననుట.
  • అడగనివాడు పా పాత్ముడు అని కూడా అంటారు.
  • "అందరూ అన్నీ ఒడుచుకొని పోయారు. అడగనివానిది పాపం!" వా.

అడగిపోవు

  • అణగిపోవు.
  • "పుడిసెడు నీటిచే నడగిపోయెడు ధూళికి."
  • జైమి. 5. 7.

అడగోలుకొను

  • వశము చేసికొను.
  • "శంకరార్థ దేహం బడగోలుకొన్న."
  • హరి. ఉ. 6. 19.
  • "ఆ యంబుజనేత్ర నన్ను నడగోల్కొనియెన్." దశ. 5. 55.
  • "ఇల్ల డసొమ్ము నడగోలుగొని త్రోచు నతనిగతికి."
  • భోజ. 6. 14.
  • అడమానములోని 'అడ' కూడా యిదే. దీనికి 'అపహరించు' అని అర్థం చెప్ప నక్కఱ లేదు. వశము చేసికొను అను అర్థమే అన్ని చోట్లా సరిపోతుంది.

అడచిపడు

  • మిడిసిపడు.
  • చూ. అడిచిపడు.

అడజడి పెట్టు

  • అలజడి కలిగించు.
  • "అడజడి పెట్టు మాటలటు లాడగ గూడునె యీయకార్యముల్, విడువు లతాంగి."
  • మార్క. ఆ. 1.

అడపకత్తె

  • తాంబాలక రండవాహిక. రాయలసీమలో ఇప్పటికీ వక్క, ఆకు, పొగాకు, సున్నం మొదలయినవి, ఒక గుడ్డతో సంచి కుట్టి అందులో ముఖ్యంగా ఆడవాళ్లు - వేసుకుంటారు. దానిని అడప మనే అంటారు. అడపతిత్తి అన్నా అదే. అడపం పట్టుకొనునది అడపకత్తె.
  • "అడపకత్తెలు తెలనాకు మడుపు లొసగ." వైజ. 1. 113.
  • చూ. అడపది. అడ_______అడ 39 అడ_______అడ

అడపకాడు

  • తాంబూలకరండవాహకుడు. అడపది ఆడ దైతే అడపకాడు మగవాడు.
  • చూ. అడపది.

అడపట్టె పట్టు

  • విత్తిన తరువాత విత్తనాల మీద మన్ను పడేవిధంగా ఒక రక మైన గుంటకను తోలుతారు. అలా తోలడమే అడపట్టె పట్టడం.

అడపతిత్తులు

  • వక్కలు ఆకులు పొవ్వాకు సున్నం వగైరా లుంచుకునే బట్టతో కుట్టినసంచులు. నేటికీ ఇవి వాడుకలో నున్నవి. అడపం అనీ అంటారు అలాంటి తిత్తిని.
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 317.
  • చూ. అడపది.

అడపది

  • తాంబూలక రండ వాహిని. తాంబూలం పళ్ళెం పట్టుకొని ఎప్పుడూ రాజున కిచ్చునది.
  • "ఆకు మడుపు లీ దివిరెడు నడప దాని." ఉ.రా. 4. 223.

అడపాదడపా

  • అప్పుడప్పుడూ. జం.
  • "వాడు అడపా దడపా మాయింటికి వస్తుంటాడు."
  • "అడపాదడపా వాడికి జ్వరం వస్తుంటుంది." వా.

అడపొడ

  • జాడ. జం.
  • "వాడి అడాపొడా తెలియడం లేదు. పదిరోజు లయింది ఇల్లు విడిచిపోయి." వా.

అడపొడ లేకపోవు

  • రూపరి పోవు, స్వరూపనాశన మగు.
  • "ధూర్జటి కంటి కడిందిమంటలో నడపొడ కానరాక తెగటారియు." మను. 3. ఆ.
  • "వారి యీసుచే నడపొడ లేకపోయెనట యల్పము లయ్యె గులాభి మానముల్." కళా. 7. 44.

అడబాల

  • మహానసాధ్యక్షుడు - అతనితో పా టున్న ఉద్యోగి.
  • వంటవాడు వంటలక్క అని శ. ర. కన్నడంలో వంటలక్క, వంటవాడు అని కాక మాంసము అన్న అర్థం కూడా ఉంది. ఇక్కడ మామూలు వంటవాడు కాక ఋ మహానసాధ్యక్షుని వంటి పెద్ద ఉద్యోగో కావచ్చు ననిపిస్తుంది.
  • "బండారులను నడబాళ్ల బ్రెగ్గడల దండ నాయకులను దంత్రపాలకుల."
  • బస. 7 ఆ. 23 పు.
  • "అడబాల గొనిపోయి యమ్మీనుజించి, కడుపులో నొకబాలు గని వెఱ గంది."
  • భాగ. దశ. స్కం.

అడలడి

  • 1. అలజడి, ఆందోళన. అడ_______అడ 40 అడ________అడ
  • "అడలడి బొంద గా దగనియట్టిది ద్రోపది-" భార. శాంతి. 1. 202.
  • "ఆ యింతి భ్రమగొని యడలడి."
  • 2. అడలుపడి, అడలి.
  • కుమా 5. 61.

అడలి చచ్చు

  • భయపడు.
  • "అడలి చచ్చిన గాని యప్పు తీయను." వ్యస. నాట. 33.

అడవనాయాలు

  • చూ. అదవనాయాలు.

అడవపుట్టుపు

  • నిరర్థకజన్మ.
  • "వాడిది ఒట్టి అడవపుట్టు. ఇంట్లోకి పనికిరాడు, బయటికీ పనికి రాడు."" వా.

అడవబతుకు

  • వ్యర్థజన్మ.
  • చూ. అడవపుట్టువు.

అడవమనిషి

  • వ్యర్థుడు.
  • చూ. అడవపుట్టువు.

అడవ (దవ) సరకు

  • మోటు దినుసు.
  • "వాళ్ల దంతా వట్టి అడవసరకురా. వాళ్లలోకి ను వ్వెందుకు దిగుతావు?" వా.

అడవి

  • శూన్యం, పాడు.
  • "అక్క డేమి ఉంది. అడవి."
  • "అది ఒట్టి అడివికొంప. అక్కడ ఎవరు కాపరం ఉంటారు?" వా.

అడవికుక్క

  • తోడేలు.

అడవిగాచిన వెన్నెల

  • వ్యర్థము.
  • "అడవి గాచినవెన్నెల యయ్యె నాదు జవ్వనంబు." మార్కం. 5. 8.
  • "కలయంగ నడవిలో గాచిన వెన్నెల లై చారుహాసంబు లవధి బోవ." నృసిం. 2. 90.
  • "ఆ పిల్ల బతుకు అడవిగాచిన వెన్నెల అయిపోయింది. ఎంత అందంగా ఉంటే నేం? ఎంత తెలివైందై తే నేం?" వా.

అడవిగోడు

  • చూ. అరణ్యరోదనం.

అడవిమూర్ఖుడు

  • అడవిమనిషి, అనాగరకుడు.

అడవి యామలకము అంబుధి లవణము కూడినట్లు

  • ఎక్క డెక్కడివో ఒకచోట చేరినట్లు.
  • "తడవు దినములకును ధరణీసురజ్యేష్ఠ మాకు మీకు సంగమంబు గలిగె నడవియామలకము నంబుధిలవణంబు గూడినట్టు లయ్యె నేడు సూడ."
  • కుచే. 2. 78.

అడవుల గలియు

  • అడవులు పట్టి పోవు.
  • వాడు అడవులు పట్టి పోయినాడు, దేశంమీద పోయినాడు అనే అర్థంలో నేటికీ వాడుక.