పగవారికి నవ్వగ సందే


పల్లవి:
పగవారికి నవ్వగ సందే - మగడే నను వేరు జేసెగదే నా
మగడే నను వేరు జేసెగదే ॥పగవారికి॥

చరణ:
వినవే తనమో - మున ముద్దిడ బోయిన వద్దని దిగ్గున లేచెనయో
ఎనసి ముద్దిడరాదటే ఇది వాదటే
మనసులో దయలేదుగా - ముమ్మాటికి
ఇక మాటలేమిటికి ॥పగవారికి॥

కలనా మరుకోలలనొ యెడ గు - బ్బల నాగగలనా లలనా
వలచి చేరిన నేరమా - పెరవారమా
చెలియ నాతో నలుక - లేటికి చెల్లబో నేనేటికి ॥పగవారికి॥

వర తోటల వల్లూరి వేణూగోపాలా - కరుణారసకలిత సుకలిత
భరిత దాస్వభిరాముని - శ్రీరాముని
సరస సమ్మత చరితుడాయెనే - సామిని నేమందునే ॥పగవారికి॥