పండ్రెండు రాజుల కథలు/చిరకారిమహారాజు కథ

మలయవతి, గూడి యిష్తభోగంబుల ననుభవించుచు, సుఖంబుగా నుండెను.


మూఁడవ రాత్రి కథ.

మూఁడవనాటిరాత్రి యధా పూర్వంబుగఁ గృష్ణార్జును లిరువుఱును యమునాసిక తాతలంబునం దాసీనులై నాగవల్లీ దళ చర్వణ బొనరించుతరి, పార్టుండు కేశవుం దిలకించి——"స్వామి! గతరాత్రి వచించిన కథ యద్బుతంబై యోప్పారె! నేటి రేయి మూఁడవదియగు నాదానందతత్వముతో గూడిన పుణ్యకధ నెఱిగించి ధన్యుం జేయవే!" యని ప్రార్థింప సధోక్షజుండు భీభత్సుం గాంచి——"విజయా! చిరకారి మహారాజు చరితంబు జెప్పెద నాకర్ణింపుము. దీనివలన నీయభీష్టం బీడేరెడు" నని పలికి యిట్లు వచింపఁ దోడంగె——

చిరకారి మహారాజు కథ.

తోల్లి మిధిలాపురంబును మేధానిధియను రాజోత్తముండు ధర్మజ్జుఁడై పరిపాలించుచుండెను. అతనికి చంద్రరేఖ యను సతీతిలకంబు వలన గళానిధియను పుత్రరత్నం బుదయించెను. ఆబాలునకు షడ్వత్సర ప్రాయంబు గల్గియున్న తరుణంబున, యొక సిద్ధుం డాతనికడ కరుదెంచి, యాతని మానసంబును వైరాగ్యమార్గంబునకు మరల్ప నారాజు కాయ సిద్ధికై——యమ్ముని వెంట హిమాలయంబున కరుగుచు, నప్పటికి, గర్బవతియైయున్న పత్ని నింటవిడిచి, తన సోదరుఁడగు శ్వేతకేతునకు రాజ్యం బప్పగించెను. మేధానిధిరా జరిగినయనంతరంబున శ్వేతకేతుఁడు దుర్మార్గుఁడై వధూనికను నిరాదరణం బోనరింప నాసాధ్వి యట నుండనోపక , విశ్వాసపాత్రురాలగు తన సఖియగు తిలకతోఁ గూడి పాదచారిణియై గర్భ భారంబున నత్యంత శ్రమను సహించుచు, నాఱేండ్ల పుత్రుని డగు కళానిధితో, తన సోదరుఁడును అవంతి పురాధిపతియు నగుమంత్ర గుప్తరాజు కడ కరుగుచుండ, మార్గమధ్యంబున, నొక్కచో రాత్రికాలంబున నొండొక విపినంబున శయనింప, నెవ్వఱో చోరులు కుమారు నపహరించిరి. గర్భవతియగు, చంద్రరేఖ యీదారుణంబునకు సహింప నోపక——మూర్ఛమునింగెను. తిలక యామెకుఁగల్గిన విపత్తునకు పగచుచుఁ గంటికి ఱెప్పవోలెఁ గాపాడుచున్నను, చంద్రరేఖ బహుదినంబుల దనుక మూర్ఛ తేరుకొనదయ్యె—— ఇట్టి యవస్థలోననే యొక్క దినంబున నించుక' మూర్ఛ తేఱి, చంద్రరేఖ కుమారునికొఱకై దుఃఖించుచుండ నా మార్గంబున నెం దేనింజను నవంతీపుర వాసియగు నొకవిఫ్రుండట కరుదెంచి, యవంతీపుర రాజగు మంత్రగుప్తుఁడై శత్రువులచే రాజ్యభ్రష్టత నంది యెందో చనియెనను పిడుగుఁబోలినవార్త నెఱిఁగింప——పుండుమీఁద రోకటిపోటుచందంబున నీవార్త చంద్రరేఖకు మఱింత దుర్భరమైతోఁప——మొదలునరికిన పెనువటంబుకరణి మరల మూర్ఛమునింగెను. ఆమూర్ఛయందే యామె సౌజ్జారహిత స్థితియందు ప్రసవింప నొక స్త్రీ శిశువు గలిగెను. కాని యాబాల జన్మించిన కొన్ని గడియలవఱకు గదులకున్నంత, మృతశిశువే జన్మించెనని తలంచి తిలక మిగుల దుఃఖాక్రాంతయై చంద్రరేఖకు స్మృతిగల్లు లోపలనే శిశువును భూస్థాపనం బొనరింపనెంచి, యొకచో గర్తముం ద్రవ్వి, 'బాలికంబూడ్పనుం కించునంతలో, నొకవ్యాఘ్రారాసము వినంబడుటయు నామెభీతిల్లి——బాలిక నందేవిడిచి నికుంజంబున మాటునకుం బలాయితయయ్యెను. ఇంతలోఁ గొందఱు కాటిపాప లామార్గంబున నరుగుచు, నప్పుడే కన్నులు దెఱచి శోకించుచున్న బాలికంగాంచి, తమ వెంటఁ గొనిపోయి, యవంతీ పురంబునఁగల మల్లికయను వేశ్యకు విక్రయించిరి. అట్లు వ్యాఘ్రభీతిచే నరుగుసమయంబున తిలకకుఁ గూడ బాలి కారోదనంబు వినంబడియె—— గాని కాటిపాపలరు దెంచి బాలికం గొని పోయినజాడఁ గాంచదయ్యె——బాలిక రోమ్ముపైఁ గల పుట్టుమచ్చ మాత్రము తిలకస్మృతిపధంబున నుండెను. వ్యాఘ్రభీతితొలంగిన కొం డొకవడికి తిలక మరలఁ దాను బాలికనుంచినయెడ కరుదెంచి చూడనందు బాలిక గాన రాదయ్యె; తన్ను భీతిలం జేసిన వ్యాఘ్రమే యా శిశువును గబళించెనని, తలంచి, తిలక మిగుల శోకించుచు, నప్పటి కింకనుమూర్ఛ తేఱని చంద్రరేఖకడ కరుదెంచి కాఁచియుండ నింతలో దైవవశంబున నొక యెఱుకత, మూఁడేండ్ల బాలు నొకనిగొని యటకరు దెంచ నాశిశువు చంద్రరేఖకు జనించిన శిశువని భ్రమించి దానిని వెఱసింప, నది పురుషశిశువుగాని స్త్రీ శిశువుగాదయ్యె——ఆశిశువునకై కొంతధన మిచ్చి తిలక యాయెుఱుక వద్దగొని, యీలోపల మూర్ఛదేఱిన చంద్రరేఖ కాబాలునింజూపి “తల్లీ! నీవు మూర్ఛిల్లినతరి నీకీ బాలుడు జన్మించెను. నీవాఱునెల లోకేమూర్ఛ యందు మునిగియుంటివి. ఈ బాలుఁ డెట్టి విపరీత వేళ జన్మించెనో కాని పుట్టినపుడే దంతములుగల్గియుండెను. నెల దినములలోననే నడువఁగలిగెను. రెండవ నెలలో మాటలు నేర్చెను. ఇప్పుడు మూఁడు నెలలకే మూడేండ్ల వానివలెనున్నాఁడు,” అని పలికెను. చంద్రరేఖయా బాలుంజూచుకొని, చోరాపహృతుండగు కళానిధిని మఱచియుండెను. ఈలోన, నవంతీరాజ్యమునందలి పుష్కరాగ్రహారమునవసించు నోక విప్రుండుకలసికొని యామె తమ ప్రభువునకు సోదరియని యెఱింగి, తనయింటికిఁ గొనిపోయి, స్వపుత్రికంబలె పోషించుచు నబ్బాలకునకు విశారదుం డనునామకరణం బొనరించెను. ఇది యిట్లుండ రాజ్య కాంక్షచే శ్వేతకేతువు కళానిధిని దొంగల మూలమున తస్కఁరింప జేసి చంపింప యత్నించుచుండగా—— హిమాలయంబునకరిగియుండిన , మేధానిధిరాజు, సిద్ధుని వలన నప్పటికి కాయసిద్ధినందఁజాలక మణికొన్ని దినంబులకు రానాజ్ఞాపింపబడి పురంబునకువచ్చుచు, చోరులచే సంహరింపఁ బడనున్న స్వపుత్రుఁడగు కళానిధిని రక్షించి గృహంబునకుఁ గొని తెచ్చెను. ఈలోపల స్వకీయ పాపఫలంబుగా శ్వేతకేతునకుఁ గన్నులుపోవ నాతఁడంధుఁడై పశ్చాత్తాప దుఃఖంబున సోదరుని పాదములంబడి క్షమింపఁ బ్రార్థించెను. రాజు సోదరుని క్షమించి, తన దేవియగు చంద్రరేఖ పుష్కరాగ్రహారంబున నుండు టెఱింగి, యామెను రప్పించి, విశారదుండను పుత్రుండు గల్గుట కలరి యల్లారుముద్దుగాఁ బెంచుచుండెను. ఇది యిట్లుండ, నాడు కాటిపాపలచేఁ దనకు విక్రయిఁబడిన బాలికకు మల్లిక, మోహిని యను నామకరణంబొనరించి పెంచి, సమస్త విద్యలను నేర్పి యామెకు వయస్సు వచ్చినంతనే, వ్యభిచారంబునఁ బ్రవేశ పెట్ట నుంకించెను. కాని మోహిని యందుల కియ్య కొనక, తన్నుఁగామించివచ్చిన, మనోహరుల డనువానికి వేదాంతోపదేశ మొనరించి మనంబు మరలింప వాఁడు విరాగియై యామెకు మాతృభావంబున నమస్కరించి తన సాటివిటులందఱని వ్యభిచార వ్రుత్తి నుండి మరలించెను. మోహినిమూలంబునఁ దనవృత్తి నాశనంబగుటకు దుఃఖించి మల్లిక యాబాలిక ననేక బాధలం బెట్టుచుండ మోహిని సహింపజాలక, నొకరేయి తగ్గృహంబువాసి యెక మహారణ్యంబునంబడి పోవ బోవ, దైవవశంబున నొక్కచో జటిలమహాముని దివ్యాశ్రమంబు నయన పర్వంబుగాఁ గాన్పించెను. అంత నాయెలనాగ, జటిలమహర్షి పాదంబులం బడి తన వ్రుత్తాంతమంతయు నెఱిఁగించి తరణొపాయముం దెలుపుమని ప్రార్థింప నామహర్షి యా బాలకు ధైర్యముంగలుపి——"బిడ్డా! పరమపావనంబును, నిహపరోత్తారకంబును నగు నాదానందమును నీకు బోధించెదను. దీనిని బవిత్రురాలవుగ"మ్మని పలికి నాదానంద ప్రభావము నెఱిఁగించెను. మునీంద్రునివలన నారాజపుత్రిక నాదానంద ప్రభావము నాలకించి——మోదమంది "యోపుణ్యపురుషా! నాదానంద సౌఖ్యంబు ననుభవించితి, ఇది యిట్టిదని చెప్ప నలవిగాని మహానందము; నాభాగ్యమూలంబున నిట్టి మహానందము గలిగెను దేవవాద్యంబులనన్నింటి నాలకించి ధన్యాత్మనైతి. ఇంక మీపరిచర్యవదలక నేనిందే యుండుదాన, నన్ను ధన్యురాలిం జేయుఁ" డని పలుక నాజడదారి "యో బాలా! నీవు యుక్త వయస్కవగు కాంతవు; నీయున్కి మా తపోనిష్టల కంతరాయమును గల్గించును. కాన నీవిందుండఁజనదు. మిధిలాపురాధి పతియు, ధర్మజ్జుఁడును నగు మేధానిధి రాజేంద్రుని ప్రాపున కరుగుము. ఆరాజు నిన్ను స్వపుత్రికనుంబలె గౌరవించి పెంచు" అని పలుక మోహిని, యా మునీంద్రుని యాజ్ఞానుసారంబుగా మిధిలానగరంబున కరిగెను. అట్లు చని, మోహిని యారాజదంపతులతోఁ దన చరిత్రం బెల్ల దాఁచక నెఱిఁగించినంతనే——నిజపుత్రిక గావున, తద్రహస్యంబు నెఱుంగకున్నను, నవ్యాజంబగు వాత్సల్యంబుగలుగ, నాబాలిక నతి ప్రేమంబునఁ బెంచుచుండిరి. మోహినిం గాంచినప్పటినుండియు, విశారదున కామెపై గాఢమగువలపును, కళానిధి కట్టిట్లనినిర్ణయింపరాని యెట్టిదియో యొక ప్రేమంబును గలుగ సాగెను. అంత నవంతీపురాధిపతియగు, మంత్రగుప్తరాజు సమీప రాజన్యుల సహాయంబునంది మగుడ తన రాజ్యంబు నాక్రమించిన, శత్రు భూపాలు నోడించి, రాజ్యంబు సేయుచు, నొక్క నాడు తనసోదరిని బావమఱందిని దర్శించిపోవ సభిలాషంబు వోడమ——ముందుగా మేధానిధి కిట్లోక 'లేఖ వ్రాసి పుత్తెంచెను. "శ్యాలకా! దైవానుగ్రహంబున నారాజ్య వైభవంబులను మరల నందఁగంటిని. మే మందఱ మిందు సేమముగా నున్నారము; కాని నేను రాజ్యభ్రష్టుండనై శత్రురాజుచేఁ దఱుమబడి యొక యరణ్యంబున నరుగునెడ, మత్కుమారుఁడగు విజయుని, మూడేండ్ల వాని, నెవ్వరో తస్కరులు హరించిరి. వానిపోఁబడి నేటిదనుకఁగాన రాదయ్యెను. అదియే నాకును మీ చెలియలికిని మిక్కిలి విచారముగనున్నది. కతివయ దినంబులలో నెను మిమ్మొక్క మాఱుదర్శింప మిధిలకు వచ్చుచున్నాను”. మంత్రగుప్తుఁడు లిఖించి పంపిన లేఖంజూచుకొని విజయునిపోఁబడికిఁ జంద్రరేఖయు, మేధానిధియు విచారమునంది మంత్రగుప్తునిరాక కెదురు చూచుచుండిరి. ఇట్లుండ మోహిని, మహానందముతో నత్యంతమగు చనువున రాజప్రసాదంబున బెరుగుచు, చిత్రములగు కథలతోడను, పరిహాసములతోడను, సంగీతకళా వ్యాసంగము తోడను చంద్రశేఖ నానందింపఁ జేయుచు నొక్కనాడు చంద్రశేఖంబరిహసింపఁదలంచి, పురుషాకృతివహించి యీమెను తాను రాజ్యమును చాలించి, కుమారుఁడగు చిరకారికిఁ బట్టాభిషేక మొనఱించి వానప్రస్థుఁడై శేషంబగు జీవితంబును ప్రమోదంబున గడిపెను.


నాల్గవనాటి రాత్రి కథ.

పదంపడి, యథాపూర్వకంబుగం దురీయ దివసయామినీ సమయంబునఁ గృష్ణార్జునులు, యమునా సైకత ప్రదేశంబున సుఖాసీనులై——యున్న తరి పార్థుండు నారాయణుం దిలకించి, పంచముద్రల రహస్యంబు నెఱిఁగించు వినోదకథ నోండెఱింగింపుమని వేడుటయు, నాతఁడు బావమఱఁదిం జూచి, వీరబాహుమహారాజు చరిత్రంబు నాకర్ణింపుమని యిట్లు నివేదింప నారంభించెను,

వీర బాహుమహారాజు కథ.

ఫల్గుణా! తొల్లి యుత్కళ దేశంబును పరిపాలించిన శూరబాహు మహారాజునకుఁ మహాబాహువను సహోదరుం డొక్కఁడుండెను. శూరబాహువునకు వీరబాహువను పుత్రుండను, మహాబాహువునకు క్రూరబాహువను కుమారుఁడునుఁ గల్గియుండిరి——ధర్మప్రభువై చిరకాలము రాజ్యపాలనం బొనరించి, వృద్ధాప్యంబు పైకొన, సుశీలయను భార్యను, ఏక పుత్రుఁడగు వీరబాహువును వదలి పరలోకంబున కరిగెను. సోదర మరణానంతరమున రాజ్యాపహరణ దుర్భుద్ధి జనింప, మహాబాహువు, యువరాజు నెట్లెనఁ బోకార్పనెంచి, యర్ధరాత్రంబునఁ గొందఱు కిరాతులకు యువరాజు నపహరించి నడుకాన నఱికి వేయున ట్లానతిచ్చెను. మహాబాహువువలన ధనలాభమునొందిన తత్తిరాతు లంతఃపురమునం దూరి, సుశీల మొఱ్ఱోయని యేడ్చుచుండ బలవంతమున యువరాజుం గొని చనిరి. ఈ క్రూరకృత్యం బెల్ల తన మఱఁదియగు మహాబాహుని