పంచతంత్రము (దూబగుంట నారాయణ)/ద్వితీయాశ్వాసము
పంచతంత్రము
సుహృల్లాభము
క. | శ్రీ రమణీమణిహారవి, హారాంకితబాహుమధ్య యానతి వైరి | 1 |
వ. | అవధరింపు మక్కుమారులు సుహృల్లాభం బనియెడుద్వితీయతంత్రం బెఱిగింపు | 2 |
గీ. | సాధనంబులు నర్థసంచయము లేక, బుద్ధిమంతులు తమలోనఁ బొందు చేసి | 3 |
వ. | అది యెట్లంటేని. | 4 |
సీ. | మహికి నలంకారమండనం బై యొప్పు, మహిలాపురప్రాంతగహనభూమిఁ | |
గీ. | నుండఁ గొఱగాదు దుర్జనుఁ డున్నచోట,నట్టు గాకయు నా కింటి కరుగవలయు | 5 |
క. | వల వైచి క్రింద ధ్యానం, బలికి నిగూఢంబు గాఁగ నవ్వలిపొదలో | 6 |
క. | కనుఁగొని చిత్రగ్రీవుం, డనఁ బరఁగకపోతభర్త యాధాన్యములం | 7 |
వ. | ఇట్లు కాలపాశబద్ధుండునుంబోలెఁ జిత్రగ్రీవుండు సపరివారంబుగా నవ్వలం | 8 |
సీ. | ఉదరాగ్నిబాధల నొడ లెఱుంగమిఁ జేసి, తడఁబడఁ బడితి మిందఱము వలను | |
గీ. | ననిన నట్లకాక యనుచుఁ గపోతంబు, లద్భుతంబు గాఁగ నాకసమున | 9 |
వ. | తనలో నిట్లని విచారించె. | 10 |
చ. | వలఁ బడి చిక్కుటొండె వల వ్రచ్చుకపోవుటయొండెఁ గాక ప | 11 |
వ. | ఆసమయంబున శాల్మలీవృక్షగతం బగువాయసం బధికక్షుత్పిపాసాపరవశంబై | 12 |
క. | నాచెలికాఁడు హిరణ్యకుఁ, డీచేరువ నుండు నెపుడు నిటఁ దా మనపైఁ | 13 |
వ. | అనఁ గపోతంబు లట్లకాక యని హిరణ్యకుం డనుమూషికంబుబిలంబు గదియ | 14 |
క. | మిగుల వివేకివి నీకుం, దగ నెగ్గులు చేసెనే విధాతృం డనినన్ | 15 |
వ. | ఎఱింగియు న న్నడిగితివి గాన విను మని యిట్లనియె. | 16 |
ఉ. | ఎచ్చట నేనిమి త్తమున నేపని యెవ్వనివంక నెప్పు డౌ | 17 |
వ. | అనిన విని హిరణ్యకుండు విచారింపక పలికితిం గాని నీ చెప్పినట్ల యగుం దప్ప దని | 18 |
గీ. | నూటపదియోజనంబులపాటి నెగసి, యవనిఁ బక్షులు పొడగాంచు నామిషంబు | 19 |
క. | గ్రహపీడ చంద్రసూర్యుల, కహిగజవిహగముల కుగ్ర మగు బంధనముల్ | 20 |
చ. | అరుదుగఁ జేరరానిగహనాబ్ధులఁ గ్రుమ్మరు నాఖగాండజో | 21 |
చ. | ఒరులకుఁ గీడు సేయక పరోపకృతిం జరియించుసజ్జనుం | 22 |
వ. | అని యిట్లు హిరణ్యకుండు పలికి తనమిత్రుం డగుచిత్రగ్రీవున్ బంధనిర్ముక్తుం జేయం | 23 |
క. | పరిజనబంధచ్ఛేదము, వెరవునఁ గావించి పిదప విడిపింపు ననున్ | 24 |
వ. | అని యిట్లు పలికినచిత్రగ్రీవువచనంబులకుఁ బ్రియం బంది హిరణ్యకుం డిట్లనియె. | 25 |
క. | నీనిర్మలగుణసంపద, నీనడవడి నీక యొప్పు నినుఁ గొనియాడం | 26 |
గీ. | వాలి భూలోక మంతయు నేలఁ జాలు, నధికపుణ్యుండ వని కొనియాడి యతని | 27 |
గీ. | విందు పెట్టి యనుప వేడ్క నాతఁడు వోవ, నాసాహిరణ్యకుండు నరుగఁ జూచి | 28 |
గీ. | ఓహిరణ్యక సఖుని ని ట్లూఱడించి, బంధనిర్ముక్తునిఁగఁ జేసి పంపఁ జూచి | 29 |
గీ. | శాల్మలీవృక్షగతుఁడనై సంచరింతుఁ, బ్రీతి లఘుపతనుం డనుపేరువాఁడఁ | 30 |
వ. | అనిన హిరణ్యకుం డతనితోడ నీకును నాకును మైత్రి యెట్లు గూడ నేర్చు విను | 31 |
గీ. | ఎవరి కెవ్వరి కేభంగి నెట్లు పొసఁగు, నట్టివారికి మైత్రి దా నమరుఁ గాక | 32 |
వ. | అనిన విని లఘుపతనుం డిట్లనియె. | 33 |
క. | నీదేహము నా కశనము, గా దో పుణ్యాత్మ యిట్టికష్టుఁడ నే | 34 |
క. | రోయక నిను భక్షించిన, నాయాఁకలి దీఱఁ జాలునా యనుమానం | 35 |
క. | ఎందును దిర్యగ్జంతువు, లందును దగు సమయనిశ్చయంబును హితముం | 36 |
వ. | అని లఘుపతనుండు మఱియు నిట్లనియె. | 37 |
ఉ. | ఓర్వక దుర్జనుండు కఠినోక్తుల సజ్జనుఁ బల్కె నేని ని | 38 |
వ. | అనిన హిరణ్యకుం డిట్లనియె. | 39 |
గీ. | చపలమతివి నీవు చాల నమ్మినవారి, నెలమిఁ బ్రోచుశక్తి యెట్లు గలుగుఁ | 40 |
వ. | అనిన లఘుపతనుం డిట్లనియె. | 41 |
ఉ. | ఏ నటువంటివాఁడ నని యీవిరసోక్తులు పల్క నేటికిన్ | 42 |
వ. | అనిన నతం డిట్లనియె. | 43 |
గీ. | నీకు నాకును శాత్రవనియతధర్మ, మైననడవడి వర్తిల్లు నాత్మయందుఁ | 44 |
గీ. | బుద్ధిమంతుఁ డైన పురుషుండు దనశత్రు, హితుఁ డటంచుఁ జేర నిచ్చి చెడును | 45 |
వ. | అని మఱియును. | 46 |
క. | విను శక్య మైన కార్యము, చనుఁ జేయ నశక్య మైనఁ జనునే చేయన్ | 47 |
చ. | మిగుల హితుండు నావలన మేలునుఁ బొందె నితండు నాయెడం | 48 |
ఉ. | చాలఁగ నిష్టుఁ డంచు నను శౌర్యమహోద్యమకార్యజాలముల్ | 49 |
క. | సనిదానంబున శత్రుఁడు, ననుకూలత లేనినిజకులాంగనమనువున్ | 50 |
క. | కర్కశరిపునెడఁ దొలఁగక, మార్కొనఁ దగు సంధి చేసి మఱి కదిసినచోఁ | 51 |
క. | ఏదోషంబులు నతనికి, నాదిం జేయుటయ కల్గ దని క్రూరాత్ముం | 52 |
వ. | అని యిట్లు హిరణ్యకుండు పలికిన లఘుపతనుం డిట్లనియె. | 53 |
క. | నీనీతివాక్యపద్ధతు, లే నన్నియు వింటి నీకు నిష్టునిఁగా న | 54 |
వ. | అని మఱియును. | 55 |
చ. | కరఁగిన నెల్లలోహములు గ్రక్కునఁ గూడు నిమిత్తమాత్రమై | 56 |
గీ. | మంటికడవఁబోలె మఱి దుర్జనస్నేహ, మధికశీఘ్రముననె హత్తు విరియుఁ | 57 |
వ. | అని యిట్లు లఘుపతనుండు పలికిన హిరణ్యకుం డిట్లనియె. | 58 |
క. | నే నీకు నెంత చెప్పినఁ, గానిమ్మన కెల్లభంగిఁ గావలె ననుచుం | 59 |
మ. | ఉపకారం బొకవంకఁ జేయుటయుఁ దా నూహింప సన్మైత్త్రియే | |
| నెప మొక్కింతయు లేనివర్తనము లున్మేషింప మేల్గీళ్ల న | 60 |
వ. | అనుచు నివ్విధంబున నన్యోన్యసంభాషణంబుల నత్యంతస్నేహంబులు నిగుడ నఖమాం | 61 |
ఉ. | ఉండితి నీకడన్ విడువ నోపక యివ్విపినంబులోన నేఁ | 62 |
ఉ. | ఆతఁడు మిత్త్రమందరసమాఖ్యమునం బొగ డొందుకచ్ఛపం | 63 |
వ. | అనిన విని హిరణ్యకుం డిట్లనియె. | 64 |
గీ. | నిన్నుఁ బాసి నిలువ నేర నీతోడన, వత్తుఁ గొంచుఁ బొమ్ము వాయసేంద్ర | 65 |
వ. | అని పలుక లఘుపతనం డదరిపడి నాతోడ నిన్నిదినంబు లెన్నఁడుం జెప్పవు సుఃఖ | 66 |
ఉ. | ఎన్నఁడు రానిచుట్ట మిదె యిచ్చటికిం జనుదెంచె భాగ్యసం | 67 |
వ. | అనిన మిత్త్రమందరునకు లఘుపతనుం డిట్లనియె. | 68 |
చ. | ఇతఁడు హిరణ్యకుం డనఁగ నిమ్మహి మూషికభర్త నాకు సం | 69 |
గీ. | విను సహస్రముఖముల వేలు పొండెఁ, దెలిసి నాలుగుముఖములదేవుఁ డొండె | 70 |
గీ. | చెలిమి గలకాల మెల్లను జెఱుప కునికి, క్రోధ మాప్రొద్దె శీఘ్రంబె కూడి విడుట | 71 |
వ. | అని మఱియుఁ జిత్రగ్రీవోపాఖ్యానంలు మొదలుకొని హిరణ్యకునిగుణకథనంబు | 72 |
గీ. | అనఘ యింతదూర మనక నిర్జన మైన, వనము చొచ్చి నన్నుఁ గనుట కిచట | 73 |
సీ. | ఒకయూరిలోపల నొర పైన మఠ మెప్పు, నందుఁ జూడాకర్ణుఁ డనఁగఁ బరఁగు | |
గీ. | నిద్ర దెలిపి యతని నెఱయ నే వినుచుండఁ, బుణ్యకథలచేతఁ బ్రొద్దు గడప | 74 |
గీ. | అప్పటప్పటి కాకోల చప్పుడించి, నన్నుఁ దనభిక్షపాత్రయం నాటఁ జూడఁ | 75 |
వ. | ఏకాగ్రచిత్తుండవు గామికిఁ గతం బేమి యనినఁ జూడాకర్ణుం డాబృహస్ఫిగున కిట్ల | |
| బొకటియొ బహుమూషకంబు లున్నవో యనినఁ బెక్కు లే వొక్కటియే యనిన నతం | 76 |
గీ. | శాండలీమాత యనునట్టిచంద్రవదన, నువ్వుఁబప్పుకు సరి చేరునువ్వు లడుగ | 77 |
వ. | అనిన నత్తెఱం గెఱింగింపు మనినఁ జూడాకర్ణునకు బృహస్ఫిగుం డిట్లనియె. | 78 |
మ. | విను మే నొక్కధరామరేంద్రుగృహ మ న్వేషించి భిక్షింపఁ గాఁ | 79 |
వ. | అనిన బ్రాహ్మణి దనపురుషు నీక్షించి యిట్లనియె. | 80 |
క. | తన నేర్పుకొలఁదిఁ బురుషుం డనువున ద్రవ్యములు గూర్చి యవి దెచ్చినచో | 81 |
వ. | అనిన నమ్మహీదేవుం డమ్మగువం గోపించి యిట్లనియె. | 82 |
క. | తగుసంచయంబు వలయుం, దగ దతిసంచయము సేయుతలఁ పెవ్వరికిన్ | 83 |
చ. | అనుటయుఁ గాంత తత్కథ ప్రియంబునఁ జెప్పుఁ డనంగ బ్రాహ్మణుం | 84 |
వ. | కనుంగొని యాత్మగతంబున. | 85 |
క. | ఇది నాకు దైవ మిచ్చిన, యది యని తనమూఁపువేఁట నటు పెట్టి శిత | 86 |
క. | అంత నొకనక్క యామిష, చింతం జరియించుచుండి చేరువఁ గని య | 87 |
గీ. | దాఁటు నూలపెట్టుఁ దలఁకు దిక్కులు సూఁచుఁ, దోఁక నులుచుఁ గడియఁ దొడఁగుఁ దొలఁగు | 88 |
వ. | ఇవ్విధంబున ననేకప్రకారంబుల నాదద్రుకనామధేయం జగుమృగధూర్తంబు | 89 |
గీ. | బోయ నొకనాఁడు భక్షింతు భూరిమృగము, సూకరంబును రెన్నాళ్లక్షుధకు విడుతుఁ | 90 |
ఉ. | గ్రక్కునఁ జేరి నక్క తమకంబునఁ జచ్చినబోయయొద్ద ము | 91 |
క. | మిక్కిలిగఁ గూడఁబెట్టక, తక్కక ధనసంచయంబు తగుమాత్రముగా | 92 |
క. | అనునతనిమాట కాసతి, వినయంబునఁ బలికె నేను వెఱ్ఱినె కాలం | 93 |
ఉ. | ఆమరునాఁడు రేపకడ నాతిల లెల్లను దంచి ముంగిటన్ | 94 |
క. | విను కామాంధకి యాతిల, లనయము గొఱగావు బ్రాహ్మణార్థముకొఱకున్ | 95 |
గీ. | ఇంటిగృహమేధి యచటికి నేఁగుదెంచి, యేమి బేరము నాడెద వింతి యనిన | 96 |
క. | చేనువ్వులకుం గడిగిన, యీనువ్వుల నిచ్చువార లెందును గలరే | 97 |
వ. | అనుమాట లంతకమున్న భిక్షాన్నంబునకున్ బోయి నేను వింటి నిమ్మూషికం | 98 |
క. | తనభిక్షాన్న మశంకం, గని నిచ్చలు నొంటి నరిగి గర్వోద్రేకం | 99 |
గీ. | పాఁడికొయ్యను నాయున్నవలను క్రొచ్చి, పెద్దకాలంబునను గూడఁబెట్టినట్టి, | 100 |
క. | ధనహీనుఁ డైననాకుం, దనుశక్తియుఁ బౌరుషంబుఁ దఱగినకతనన్ | 101 |
వ. | అయ్యతీశ్వరునిభిక్షాపాత్రం బెట్టకేలకుఁ గదల్చు నన్ను గనుంగొని యదల్చు | 102 |
క. | ఘనధన మంతయుఁ గైకొ, న్నను భిక్షాపాత్ర దివియ నడయాడుచు నే | 103 |
క. | ధనవంతుఁడె బలవంతుఁడు, ధనవంతుఁడె యోగ్యుఁ డరయఁ దా నధికం బ | 104 |
వ. | అని మఱియును. | 105 |
ఉ. | భూరిదరిద్రుఁడున్ మిగుల బుద్ధివిహీనుఁడు నైనమానవున్ | 106 |
క. | కలవాఁడె చెలులు చుట్టలు, కలవాఁ డగు నతఁడు బుద్ధి గలవాఁడు నగున్ | 107 |
క. | పరదేశమె నిజదేశము, పరులే బాంధవులు ద్రవ్యపరిపాలునకున్ | 108 |
క. | కులసతి రోయును జుట్టం, బులు వాయుదు రొరులు కష్టపుంబలుకుల ని | 109 |
క. | మృతి నొందినజను నైనను, హితు లెల్లను డాయుదురు మహీస్థలిలోనన్ | 110 |
ఉ. | చుట్టము లేని దేశమును సూనుఁడు లేనినికేతనంబునున్ | 111 |
చ. | అమరు నిరాకులేంద్రియము లన్నియు నప్రతిమానబుద్ధియున్ | 112 |
వ. | అది నిమిత్తంబుగా నే నచ్చట నుండ నొల్లక యొండొక్కచోటికిం బోదుఁగా | 113 |
చ. | వడువఁగఁ దొట్రుపా టొదవు నాలుక యాడదు మాటలాడఁగాఁ | |
| వడఁకు భయంబు గ్రమ్మి దురవస్థలఁ దల్లడ మందు వేఁడుచోఁ | 114 |
గీ. | అర్థహీనుఁ డై యుండెడునంతకంటె, వహ్నిలోపలఁ దగ మేను వైచు టొప్పు | 115 |
సీ. | వఱలు దారిద్య్రంబువలన సిగ్గు జనించు, సిగ్గున సత్యంబు శిథిల మవును | |
గీ. | నట్లు గావున నిర్ధనుం డైనవాఁడు, బహువిధంబులు నీ చెప్పఁబడినయట్టి | 116 |
వ. | అని మఱియు హిరణ్యకుండు. | 117 |
చ. | పరఁగ నసత్యవాక్యములు పల్కుటకంటెన మౌనవృత్తి మే | 118 |
చ. | చెడు నభిమాన మార్యునకు సేవకతంబున సాంద్రచంద్రికన్ | 119 |
వ. | కావున నొక్కరి నడిగిన వారు పెట్టుట కష్టం బగుట నెవ్విధంబున బ్రతుక నేర్తు | 120 |
గీ. | నిత్యసంతోషవంతుఁ డై నెగడువాని, కన్నిచోటుల సంపద లానియుండుఁ | 121 |
వ. | అని మఱియును. | 122 |
శా. | సంతోషామృతతృప్తి నూఁదినమదిన్ శాంతాత్తు లైనట్టిని | 123 |
గీ. | ఆశ మిగులంగఁ గల్గినయన్నరునకుఁ, గదల నూఱామడయు దవ్వు గాక యుండు | 124 |
వ. | అట్లు గావున నర్థవంతుండును వివేకియు నయ్యెనేనియుం గాంచనరత్నసాంగత్య | 125 |
ఉత్సాహ. | భూతదయకు మిగులఁ గల్గుపుణ్యమున్ బ్రభూతరో | 126 |
వ. | అది నిమిత్తంబు నాకుఁ బుట్టినవిచారంబుకతంబున భవదంతికంబునకుం జనుదెంచితి | 127 |
క. | సురనరకిన్నరపన్నగ, గరుడాసురపక్షిపశుమృగంబులు లోనై | 128 |
క. | కావున నాహారార్థము, కావింపఁడు నింద్య మైనకార్యము ప్రాజ్ఞుం | 129 |
ఉ. | మానవుఁ డంత ధర్మవిధిమార్గ మెఱుంగఁగ లేనికేవల | 130 |
గీ. | అచ్చుపడ నీతిశాస్త్రంబు వచ్చెనేనిఁ, బొరి నిరుద్యోగి ఫలసిద్ధిఁ బొందలేఁడు | 131 |
వ. | అని చెప్పి మఱియును. | 132 |
సీ. | ఒకవేళ దాత యాచకవృత్తిమై నుండు, యాచకుం డొకవేళ నగును దాత | |
గీ. | హెచ్చుదగ్గులు తఱుచుగా నెల్లయెడల, నెవ్వరికి నైనఁ గలుగుచో నివ్విధమున | 133 |
వ. | కావున దేశకాలంబుల తెఱం గెఱుఁగునది. | 134 |
క. | వనమునఁ బుట్టినకాకము, లనయము భక్షింపఁ దనకు నాఁకలి చెడదే | 135 |
వ. | అని యిట్లు హిరణ్యకు నూఱడించి యిట్లనియె. | 136 |
సీ. | అవివేకి శాస్త్రంబు లభ్యసించినయేని, నతఁడు మూఢుఁడు గాని ప్రతిభ లేదు | |
గీ. | దెవులు గొన్నట్టివానికిఁ దివిరి మందు, చేసి సేవింప నొసఁగక చేత నిడిన | 137 |
క. | నెలవులు దప్పిన మిగులం, బలుచన నఖదంతకేశమానవులపనుల్ | 138 |
వ. | అని పలికి మిత్త్రమందరుం డవ్విధం బల్పవిచారికార్యం బార్యుల తెఱంగు విను మని | 139 |
చ. | ఇరువుల రాయి డైనఁ దగునిక్కలు చూచుచుఁ బోయిపోయి కే | 140 |
సీ. | ధీరుండును వివేకదీపితుండును నైన, ప్రభునకుఁ బరదేశభయము లేదు | |
గీ. | కులిశసన్నిభనఖముఖాంకుశవిభిన్న, మదభరాభీలకుంభికుంభప్రకీర్ణ | 141 |
గీ. | అమర మండూకములు పల్వలమును బకు, లరసి కాసారమును జేర నరుగుకరణి | 142 |
వ. | అవ్విధం బెట్టిదనిన. | 143 |
చ. | వఱపున మేను లెండఁ దమవారియెడం బెడఁబాసి జీవముం | 144 |
వ. | అని చెప్పి వెండియు. | 145 |
శా. | ఆలస్యంబును గామినీజనరతివ్యాసక్తియున్ జన్మభూ | 146 |
వ. | కావున నివి యాఱుగుణంబులు పరిహరించిన పురుషుం బ్రదీప్త | 147 |
గీ. | చక్రపరివర్తనమువోలె జనుల కెల్ల, సౌఖ్యదుఃఖంబు లెడనెడ సంభవించు | 148 |
సీ. | వర్ధితోత్సాహుఁ డై వలయుకార్యములందు, దీర్ఘసూత్రుఁడు కాక తెలివి గలిగి | |
గీ. | యుండు పురుషునిగుణములయోజ తెలిసి, యింటి కెడపక తనుఁదానె యేఁగుదెంచి | 149 |
క. | ఉద్యోగరహితు నలసుని, నుద్యత్సాహసవిహీను నొల్లదు సిరి సం | 150 |
వ. | కావున నీకు ద్రవ్యసంపత్తి గలుగుకున్నను బుద్ధిసముత్సాహంబు గలుగుటంజేసి | 151 |
చ. | ఘనుఁ డొకవేళ లేమిఁ గడుఁ గందినఁ జుల్కదనంబు గాదు హీ | 152 |
సీ. | శౌర్యసముత్సాహధైర్యసారంబులఁ, బురుడు చెప్పఁగ రాని పురుషవరుఁడు | |
| దలఁచు నహీనసత్త్వప్రతాపోజ్జ్వలు, నగరిలో నవనిధానములతోడ | |
గీ. | నట్టిపుణ్యులు తఱుచుగాఁ బుట్ట రవనిఁ, బుట్టిరేనియు సుజనసంపూజ్యు లగుచు | 153 |
క. | అమరాద్రిపొడవు పాతా, ళములోఁతు మహాబ్ధివిరివి లఘుతరములుగాఁ | 154 |
వ. | అనిన హిరణ్యకుండు మిత్త్రమందరున కిట్లనియె ననఘా నీవు చెప్పినహితవచనంబు | 155 |
మ. | ధనవంతుండవు నిన్ను గర్వ మిసుమంతం జేర దిబ్భంగి నే | 156 |
మ. | ఖలసంసర్గము యౌవనాభ్యుదయమున్ గాంతాజనస్నేహమున్ | 157 |
క. | అది గాన నర్థహానికి, హృదయంబునఁ దలఁక నించుకేనియు నను నిం | 158 |
వ. | అనిన మిత్త్రమందరుండు హిరణ్యకున కిట్లనియె. | 159 |
ఉ. | తోడనె యర్థసంపదలతోఁ బ్రభవించినవాఁడు లేఁ డొడం | 160 |
ఉ. | దానముకంటె వేఱొకనిధానము లేదు ముదంబుకంటె నిం | 161 |
క. | పెక్కులు పలుకం బని లే, దెక్కడికిం బోవ వలవ దేనును నీవున్ | 162 |
వ. | అనిన హిరణ్యకుం డిట్లనియె. | 163 |
గీ. | మిత్త్రమందర నీసుచరిత్రమహిమ, మఖిలజనులకుఁ గొనియాడ నాస్పదంబు | 164 |
ఉ. | ఉన్నతుఁ డైనమానవున కొక్కయెడన్ గడుఁ గీడు వొందినన్ | 165 |
ఉ. | దేవబలాఢ్యుఁ డైనతఁడు ధీరమతుల్ కొనియాడ నొక్కచో | 166 |
చ. | పరువడి నెల్లనాఁడు బుధబాంధవకోటి నుతింప నుండువాఁ | 167 |
వ. | అని మఱియును. | 168 |
ఉ. | మారుతముల్ వనంబులను మానుగ షట్పదపంక్తి పువ్వులన్ | 169 |
వ. | అని యిట్లు మిత్త్రమందరలఘుపతనహిరణ్యకులు తమలోపల సంభాషణంబులఁ | 170 |
క. | సారంగ మొకటి మృగయుని, బారిం బొరిఁ దప్పి బెదరి భయవిహ్వలతన్ | 171 |
వ. | మిత్త్రమందరలఘుపతనహిరణ్యకులు మృగంబు తీవ్రగమనంబు చూచి వెఱచుచుఁ | 172 |
ఉ. | ఎచ్చటినుండి వచ్చి తిది యేమి మృగోత్తమ నీమదిన్ భయం | 173 |
వ. | అనిన విని చిత్రాంగుం డిట్లనియె. | 174 |
గీ. | వెంట విడువక లుబ్ధకవీరుఁ డొకఁడు, సారెకును వచ్చి నామీఁదఁ జలముకొన్న | 175 |
క. | మాకంటె నీకుఁ జుట్టము, లీకాననమందుఁ గలుగ రిది నీయిలుగాఁ | 176 |
ఉ. | అంగద నొక్కనాఁడు ప్రియ మారఁగ మేతకు దూర మేఁగి చి | 177 |
క. | కని లఘుపతనుఁడు డగ్గఱి, మునుకొని కన్నీరు దొరుఁగ మోహభ్రాంతిన్ | 178 |
ఉ. | ఒక్కని వేఁడఁ బోవు మఱియొక్కనిచేటున కియ్యకోవు వే | 179 |
వ. | అని మఱియు ననేకప్రకారంబుల నమ్మృగంబు నుద్దేశించి వగచుచు వాయసపతి | 180 |
క. | ఈవంక కేల వచ్చితి, నేవెరవునఁ దగులు వడితి వింకిట మనకున్ | 181 |
గీ. | అనఘ వేఁటకాని కగపడ్డననుఁ గావ, నీకుఁ గడింది వాఁడు రాకమున్న | 182 |
వ. | అనినం గానిమ్మని లఘుపతనుం డుడువీథి కెగసి యతిత్వరితగతిం జని మిత్త్రమందర | 183 |
క. | మతిమంతుఁ డైననీ వి, ట్లితరునిక్రియఁ దగులువడితి వీదుర్దశకుం | 184 |
క. | మాటాడఁదగదు మన మి, చ్చోటను లుబ్ధకుఁడు వచ్చి చూడకము న్నీ | 185 |
వ. | అనుటయు హిరణ్యకుండు. | 186 |
గీ. | నీకు శుభము గోరి నీసమీపమునకు వచ్చినాఁడఁ గాన వలదు భయము | 187 |
క. | మును మోసపోయి యప్పుడు, కనుగానక తగులుపడితిఁ గడవఁగఁ వశమే | 188 |
ఉ. | ఎంతటివారి కైన మహి నింతటివార మనంగ రాదు మా | 189 |
వ. | కావున నిందులకుం జింత వలవ దాకర్ణింపుము. | 190 |
సీ. | తల్లిగర్భమున నాఱునెల లైన నుదయించి, యొకనాఁడు మూఁకయై యున్నయట్టి | |
గీ. | ముట్టఁ బఱతెంచి ననుగూడ ముట్టి పట్టి, బెట్టిదంబుగ నాకేలు చుట్టికట్టి | 191 |
ఉ. | ఇచ్చిన నన్నుఁ బుచ్చుకొని యెంతయు వేడుక లుల్లసిల్ల నా | 192 |
వ. | ఇవ్విధంబునఁ బెద్దకాలం బుండి యొక్కనాఁ డక్కుమారుండు పవ్వళించినగృహం | 193 |
గీ. | చినుకుతోఁ గూడికొని గాలి చెలఁగఁ జూచి, దాఁట గట్టుచు మృగములు దాఁటుచుండ | 194 |
సీ. | అనుచున్నసమయంబునందు నంతకమున్న, యాచమనార్థమై యరుగుదెంచి | |
గీ. | ననుచు భ్రమనొంది తా మూర్ఛ మునిగి యుండ, నతనిజనకుండు తెలవాఱ నరుగుదెంచి | 195 |
గీ. | జంతుపరిభాష దమలోన జరుగుచుండుఁ, గాని మానుషభాషణక్రమము వినము | 196 |
క. | అని యతనిదేహ మెల్లను, దనకరముల నిమిరి బహువిధంబుల మంత్రిం | 197 |
వ. | అమ్మహీశ్వరుండు నన్నుఁ జుఱచుఱఁ జూచి తనకింకరుల కిట్లనియె. | 198 |
క. | అఱజాతిజఁతు విచ్చట, వెఱపించుచు నుండవలదు విపినంబునకున్ | 199 |
క. | నాఁ డట్లు వడితి నమ్మెయి, నేఁ డి ట్లురిబారిఁ బడితి నీచపువిధి నె | 200 |
వ. | అని యిట్లు చిత్రాంగుండు పలుకునంత నచ్చట మత్త్రిమందరుం డాత్మగతంబున | 201 |
గీ. | మిత్త్రమందర నీవు మామీఁదిభక్తి, నిచటి కేతెంచు టిది మాకు హితము గాదు | 202 |
క. | ఉదకంబులోన నైనన్, గొదగొని పాఱంగఁ గలవు కుంభినిమీఁదన్ | 203 |
వ. | అనుటయు మిత్త్రమందరుం డతని కిట్లనియె. | 204 |
క. | మతిమంతుఁడు గుణవంతుఁడు, హితుఁడును నైనట్టిసఖుని నెవ్వరుఁ బాయన్ | 205 |
వ. | అని మఱియును. | 206 |
చ. | సురుచిరనిర్మలాత్ముఁ డగుచుట్టమునందును శీలవృత్తిపేరి | 207 |
వ. | అని పలుకుచున్న యవసరంబున. | 208 |
క. | యమదూతవోలె నచటికి, సమదగతిన్ వేఁటకాఁడు చనుదేరంగాఁ | 209 |
క. | చిత్రాంగుఁ డుఱికి పఱచెన్, జిత్రత లఘుపతనుఁ డెగసె శీఘ్రతఁ జంచ | 210 |
క. | కని దానిఁ బట్టి త్రాటం, గొని యనువునఁ గట్టి వింటికొప్పునఁ దగిలిం | 211 |
క. | వలఁ జిక్కక చనె మృగ మ, వ్వలఁ జిక్కును దాసరయ్య వలననిజాలిం | 212 |
క. | మృగమును గాకము నెలుకయుఁ, దెగపడి కచ్ఛపము పోక తేటపడిన నె | 213 |
క. | వగ పధికరోగమూలము, వగపునఁ గార్యంబు వచ్చువల నెఱుఁగం డి | 214 |
క. | కడ లేనిదుఃఖవార్ధిం, గడచితిఁ దొల్లియును నేఁడుఁ గడతముగా కి | 215 |
క. | తగుమిత్త్రుఁడు భాగ్యాధికుఁ, డగువానికిఁ గాని దొరకఁ డాపద యైనన్ | 216 |
గీ. | తల్లియందును దనుఁ గన్న తండ్రియందు, నాలియందును సుతసోదరాలియందు | 217 |
చ. | తమతమకర్మవాసనలఁ దాఁకు శుభాశుభకర్మజాలముల్ | 218 |
గీ. | కడఁగి దేహి నపాయంబు గాచి యుండుఁ, గదియుకూటమిఁ బాయుట గాచి యుండుఁ | 219 |
ఉ. | ఆరయ నాయుధక్షతమునందున మేనికిఁ బాటుగల్గు నా | 220 |
ఉ. | భీకరశాత్రవస్ఫురదభేద్యభయంబును దీవ్రదుఃఖమున్ | 221 |
వ. | అని యిట్లు తన ప్రాణసఖుం డైనమిత్త్రమందకుండు దగులువడి పోవుటకుఁ | 222 |
క. | వడి నడవి గడచి లుబ్ధకుఁ డెడదవ్వుగఁ జనియెనేని నెంతటివారున్ | 223 |
వ. | అనినఁ జిత్రాంగలఘుపతను లాహిరణ్యకున కిట్లనిరి. | 224 |
ఉ. | ముట్టినయాపదన్ భయము ముంచి మనంబుఁ గలంపఁ గార్యసం | 225 |
క. | పొడవును జక్కఁదనంబును, గడువల మైనట్టియొడలు గలిగియుఁ గలవే | 226 |
క. | మాకందఱకు నశక్యం, బై కానంబడినబుద్ధి నధికుఁడ వగుటన్ | 227 |
వ. | అని ప్రార్ధించిన హిరణ్యకుండు నాకుం జేయ నవశ్యకర్తవ్యం బైనకార్యంబునకు | 228 |
చ. | మెఱసి మహాజవంబునను మేఘపథంబునఁ బాఱ వాయసం | 229 |
క. | త్వరితముగ వేఁటకానికి, సరిగడచి మృగంబు వాయసంబును దూరం | 230 |
గీ. | లోఁతు లేనినీటిలోను జిత్రాంగుండు, సాఁగబడుచుఁ గాళ్లఁ జాచికొనుచుఁ | 231 |
క. | తల యెత్తి చంచుపుటమునఁ, బలుమాఱును బొడిచి తినెడిభావము దోఁపన్ | 232 |
గీ. | కాంచి మేను పెంచి కడు నాత్మ హర్షించి, కమఠయుక్త మైనకార్ముకంబు | 233 |
క. | కను గలిగి యింత నంతం, జనుదెంచి హిరణ్యకుండు సంతస మెసఁగన్ | 234 |
క. | వడివడి జలమధ్యమునకుఁ, గడువేగం గమఠ మేఁగె గ్రక్కున బొక్కన్ | 235 |
గీ. | ఆస గొలిపి పోయె నక్కట నన్ను నీ, చెనఁటిమృగ మటంచు సిగ్గుపడుచుఁ | 236 |
క. | అందుకొని వెచ్చ నూర్చుచు, మందిరమున కూర కెట్లు మరలుదు ననుచున్ | 237 |
వ. | ఇవ్విధంబున లుబ్ధకుండు విఫలమనోరథుండై కడుదూరంబు వోవుట నిరీ | 238 |
ఉ. | గండధనంజయాంక బలగర్వితవైరిమదాంధకారమా | 239 |
వనమ. | మన్నెకులభార్గవకుమారమకరాంకా, సన్నుతమహోగ్రపటుసంక్షోజయాంకా | 240 |
తోదక. | దానధనాధిప ధర్మపరాత్మా, మానసుయోధన మంత్రివిచారా | 241 |
గద్యము. ఇది శ్రీమైత్రావరుణగోత్రపవిత్ర బ్రహ్మనామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ
నారాయణనామధేయప్రణీతం బైనపంచతంత్రం బనుమహాకావ్యంబు
నందు సుహృల్లాభం బనునది ద్వితీయాశ్వాసము.