పంచతంత్రము (దూబగుంట నారాయణ)/చతుర్థాశ్వాసము
పంచతంత్రము
లబ్ధనాశము
క. | శ్రీసమధికగుణమందిర, వాసవవిభవాభిరామ వర్ధితదానా | 1 |
వ. | అవధరింపుము సుదర్శనక్షితీశనందనులు విష్ణుశర్మకుం బ్రణామం బాచరించి లబ్ధనాశం | 2 |
క. | చెందినయర్థం బితరుల, యందపుమాటలకు విడుచునతిమూఢుఁ డిలన్ | 3 |
వ. | అనినఁ దత్కథాక్రమం బెట్టి దని నృపకుమారు లడిగిన నతం డిట్లనియె. | 4 |
సీ. | రంగదుత్తుంగతరంగసంఘంబులు, సరసాభినయకరాబ్జములు గాఁగ | |
గీ. | ఘుమఘుమధ్వని వాద్యఘోషములు గాఁగఁ, జండతాండవాడంబరశంభుమూర్తి | 5 |
ఉ. | ఆలవణాంబురాశిదరి నర్జునతాలతమాలసాలహిం | 6 |
వ. | మఱియును దత్సమీపంబున నొండొకయూథనాథుం డైనకపీశ్వరుండు బలివర్ధను | 7 |
ఉ. | ఈముదిమర్కటంబునకు నేటికి నీకపిరాజ్య మంచు ను | |
| సీమకుఁ బాసి యొక్కరుఁడు సి గ్గెసఁగన్ బలివర్ధుఁ డేఁగె నా | 8 |
వ. | చనిచని యొక్కనదీతీరంబున మధుగర్భం బనునౌదుంబరంబు ఫలభరితం బైనదాని | 9 |
క. | కామితఫలముల నొసఁగం, గా ముందటఁ గల్పకంబు గానంబడిన | 10 |
వ. | అని తలంచి డాయం బోయి. | 11 |
క. | తరు వెక్కి దీర్ఘశాఖలఁ, బరిపక్వఫలంబు లరసి భక్షించుతఱిన్ | 12 |
క. | ఆచప్పుడు తనచెవులకు, నేచినకౌతుకముఁ బెనుప నెడనెడ ఫలముల్ | 13 |
వ. | క్రకచనామధేయం బగుశింశుమారం బమ్మేడిక్రింది జలంబులలోనఁ గ్రుమ్మరుచుండి | 14 |
ఉ. | ఇంతకుమున్ను నాదుహృదయేశ్వరుఁ డెయ్యెడ కైన నేగినన్ | 15 |
క. | తెలియంగవలయుఁ బొ మ్మని, పలికిన నది పోయి వచ్చి ప్రాణసఖికి నే | 16 |
సీ. | నెలఁత నీవిభుఁ జూడ నీవు న న్నంపినఁ, జయ్యన నేను బ్రచ్ఛన్నవృత్తిఁ | |
గీ. | చేర్చుమతిఁ బూరుషులు నవప్రియులు గాన, వారి మానంగ నేరికి వశము గాదు | 17 |
క. | అమ్మాట మొసలిలేమకు, నమ్మయి తాఁకుటయు నిశ్చయం బని మదిలోఁ | 18 |
వ. | అమ్మకరవధూటి ప్రియసఖీసంభాషణంబులఁ బెద్దయుం బ్రొద్దునకుఁ దెలివి నొంది. | 19 |
గీ. | మగఁడు చేసినట్టి నెగులునఁ గడు నొచ్చి, విరహవహ్ని చేత వేఁగి వేగి | 20 |
వ. | ఆక్రకచుం డట్లున్న తనప్రాణవల్లభం జూచి యిట్లనియె. | 21 |
ఉ. | పంకజనేత్ర నీయొడలిభారము చూచి భయంబు పుట్టెడున్ | 22 |
వ. | ఆశింశుమారంబున కిట్లనియె. | 23 |
ఉ. | అక్కట నీవు పోయినది యాదిగ నీకలగంఠి రుగ్ణతం | 24 |
వ. | అనిన నమ్మహాగ్రాహంబు. | 25 |
క. | సంజీవని మొదలుగ నే, నంజక కొనివత్తు నెట్టియౌషధ మైనన్ | 26 |
వ. | అనిన నది యిట్లనియె. | 27 |
క. | వానరహృదయముతోఁ దగ, మానినయౌషధము పెట్ట నువిదకు మానున్ | 28 |
గీ. | కానఁ గోఁతిగుండెకాయ నీ విప్పుడు, తెచ్చి యిచ్చితేని తెఱవ బ్రతుకు | 29 |
వ. | అనినఁ దద్వచనంబు లాకర్ణించి యతం డట్టిద కాక యనుచుఁ గొంతద వ్వరిగి యరిగి | 30 |
క. | తరుచరహృదయము నాకుం, దరమే దొరకింపఁ గష్టదశ వచ్చెఁ గపీ | 31 |
చ. | అతని వధించు టెంతయు మహాదురితంబు సమస్తధర్మసం | |
| మతిఁ దలపోయ నిద్దఱును మాన్యులె యైనను భార్యరక్ష దా | 32 |
ఉ. | ఎక్కువ చెప్పఁ జూపఁ గలయింట జనించుకులాంగనాళిలోఁ | 33 |
వ. | కావునఁ గులకాంతను రక్షించుటయ యుత్తమధర్మంబు మిత్త్రుం డైనబలివర్ధనుఁ బరి | 34 |
గీ. | ఎంత వేగిర మింటికి నేఁగి తిప్పు, డింతలోననె మరలి రా నెద్దికతము | 35 |
క. | చిరకాలమైత్త్రి నీయెడ, జరగంగా నింటి కరుగఁజాలక నేఁ డ | 36 |
క. | ఉపకారవాంఛ సఖ్యము, నిపుణతఁ జేయుదురు గాక నీ వేమియుఁ బ్ర | 37 |
వ. | అనుటయు బలివర్ధనుఁ డిట్లనియె. | 38 |
గీ. | డాసి యువకార మే నేమి చేసినాఁడఁ, బూని నీతోడఁ జేసినపొందువలన | 39 |
గీ. | శోకశాత్రవభయములచొప్పు మాన్పు, ప్రీతివిశ్వాసగుణహేతుభూత మైన | 40 |
వ. | అని పలికిన విని క్రకచుం డిట్లనియె. | 41 |
ఉ. | మింటికి నిక్కునీతరువుమీఁదను నీవును నేను నీటిలో | 42 |
క. | నిలిచినకపివరుఁ దోడ్కొని, నిలుపోపక మొసలి పలికె నేఁ డీమిత్త్రుం | 43 |
క. | స్త్రీకార్యము బలవంతము, నా కింతటి సాధుమిత్త్రు వనచరు మృతుఁగాఁ | 44 |
వ. | అని విచారించి మఱియును దనమనంబున. | 45 |
సీ. | హేమంబు మేలుగీ డెఱుఁగంగఁ దలఁచిన, మానుగా నొరిసినఁ గానవచ్చుఁ | |
గీ. | మాయలకు నిక్క మందులమనికిపట్టు, సకలదోషంబులకు నెల్ల జన్మభూమి | 46 |
వ. | అని తలపోసి వెండియుఁ దనమనంబున. | 47 |
గీ. | ఆఁడదానికొఱకు నకట నాప్రియమిత్త్రు, వృద్ధుఁ జంప నెట్లు బుద్ధి పుట్టె | 48 |
క. | ఏమంటి విపుడు నీలో, నేమిటి కీచింత నాకు నెఱిఁగింపు మనం | 49 |
క. | అనుమాట కాత్మలోపల, ననుమానము నొంది వానరాధిపుఁ డీతం | 50 |
గీ. | అడిగి చూచెదఁ గా కంచు నగచరుండు, కలఁక నొందినమదితోడ జలచరేంద్ర | 51 |
ఉ. | అల్లన శింశుమారవిభుఁ డాకపినాథునిఁ బల్కె మన్మనో | 52 |
వ. | అనుటయు నాబలివర్ధనుం డిట్లనియె. | 53 |
చ. | జలములు గాని వెల్పలికిఁ జాల నటంచు విచార మేటికిన్ | 54 |
క. | పొ మ్మనవు పోయి మందులు, దె మ్మనవు చికిత్స చాలఁ దెలిసినవైద్యున్ | 55 |
వ. | అనిన నమ్మకరకులాధీశ్వరుం డిట్లనియె. | 56 |
ఉ. | అడిగినవాఁడఁ బండితుని నాయన చెప్పగ మందు నీకడం | |
| ప్పుడు నెఱిఁగింపకున్న నది పోవదు నామదిలోన దుఃఖమున్ | 57 |
వ. | అనినఁ దరుచరనాథుం డిట్లనియె. | 58 |
గీ. | మనసు గలసినచో నొకమాట యైనఁ, గపటమునఁ జెప్పకుండుట కలుష మండ్రు | 59 |
వ. | అమ్మాటకుఁ బుయిలోట దక్కి మొసలి యిట్లనియె. | 60 |
క. | వానరహృదయముతోఁ దగ, మానినయౌషధముఁ దెచ్చి యువిదకుఁ బెట్టన్ | 61 |
ఉ. | చెప్పిన నన్నుఁ దె మ్మనియెఁ జెప్పెడి దేమీ మఱెందు నేరికిం | 62 |
క. | తనసతికి రోగ మైనం, గనుఁగొని యది చక్కఁబెట్టఁగా నేరఁ డితం | 63 |
వ. | అని చెప్పినఁ గపీశ్వరుండు. | 64 |
గీ. | సగము చచ్చినమేనితోఁ జకితుఁ డగుచుఁ, గంప మొందుచు వృద్ధమర్కటము మూర్ఛ | 65 |
వ. | తనలో నిట్లని వితర్కించె. | 66 |
గీ. | ప్రేమ నటియించి యింటికిఁ బిలువఁ దడవ, మొసలిమాటకు నా కేల మోసగలిగె | 67 |
వ. | అని మఱియును. | 68 |
సీ. | రాగసంయుక్తుఁ డరణ్యవాసంబునఁ బహుకాల మున్నను ఫలము లేదు | |
గీ. | వానినిలయంబు ఘనతపోవనము గాని, దండకాషాయవస్త్రకమండలువులు | 69 |
వ. | అని తలంచి బలివర్ధనుండు దైవానుకూల్యంబున నాయుశ్శేషంబుకతంబునం దనకు | 70 |
క. | ఓయన్న కల్ల చేసితి, వీయర్థము మున్ను నాకు నెఱిఁగించిన నే | 71 |
ఉ. | గుండియ పుచ్చి పెట్టుకొని కొమ్మపయిం బదిలంబు చేసి నే | 72 |
వ. | అయినను ద్వరితగమనంబున నయ్యుదుంబరంబు కడకుం జని యస్మదీయహృదయం | 73 |
గీ. | మొనసి ధర్మార్థకామముల్ మూఁటివలన, ఫలము లెవ్వాఁడు దా నాసపడియెనేని | 74 |
క. | మానుగ హృదయం బచ్చటి, మ్రానం దగిలించి యుంటి మన మట మగుడం | 75 |
వ. | అనిన. | 76 |
క. | అమ్మాటల జలచరమును, సమ్మతితో నమ్మి వృక్షచరమును గొనుచుం | 77 |
గీ. | అంతకంతకుఁ బొడవుగా నరిగి యరిగి, వృక్షశాఖాగ్రమున నున్న వృక్షచరముఁ | 78 |
గీ. | పొందు చేసిచేసి పొసఁగక మతి పోయి, తిరిగి వచ్చునతఁడు తిరుగఁ జెడును | 79 |
వ. | అనినఁ దత్కథాక్రమంబుతెఱంగు జలచరపతి యడిగినఁ దరుచరపతి యిట్లనియె. | 80 |
సీ. | కలఁ డుగ్రవనములోపల నొక్కమృగరాజు, గోమాయు వతనికిఁ గూర్చుభృత్యుఁ | |
గీ. | గార్దభముకర్ణ మొక్కటి గలిగెనేని, యౌషధంబున నది గూర్చి యారగించి | 81 |
చ. | అనిన మహాప్రసాద ముని యామృగధూర్తము పోయి రోయుచున్ | 82 |
| ఎలయించి తెచ్చి యిచ్చినఁ, బొలియింప మృగేంద్రుఁ డడరఁ బొడమినభీతిన్ | 83 |
వ. | ఆమృగపతి గోమాయువుం గనుంగొని మనయత్నంబు విఫలం బయ్యె నింకను బ్రయ | 84 |
గీ. | మునుపు గార్యంబు దెలియనిమూఢచిత్తుఁ, బొసఁగ నిది సేయు మన మోసపోవుఁ గాని | 85 |
వ. | అయినను నాబుద్ధిబలంబుననుఁ బలుకులనేర్పునను నాగార్దభంబుమనంబునం గల | 86 |
మ. | మృగరాజుం గని కొల్చి యాయనకడన్ మేఁ తెల్ల నీసొమ్ముగాఁ | 87 |
వ. | అని మఱియును. | 88 |
ఉ. | మానుగ నంటరానికొఱమాలిన మైలలమోపు వీపునం | 89 |
వ. | అనుటయు నాగార్ధభం బిట్లనియె. | 90 |
క. | నమ్మించి యేను నీవును నిమ్ముల బ్రదుకుద మటంచు నెలయించి ననున్ | 91 |
గీ. | శితనఖంబులు మెఱయంగ జేగురించు, ఘనతరానన మతిభయంకరము గాఁగ | 92 |
వ. | అనిన నమ్మాటకు జంబుకం బిట్లనియె. | 93 |
మ. | మొదలం జూడనివాఁడ వైనకతన న్ముంచెన్ భయం బెంతయున్ | 94 |
వ. | అని మఱియును. | 95 |
చ. | వలసిన భక్ష్యభోజ్యము లవారణఁ బారణ చేయవచ్చు ని | 96 |
శా. | నాయత్నంబు ఫలింప దయ్యె నకటా నాస్నేహభావంబునన్ | 97 |
వ. | అని మఱియునుం బ్రియాలాపంబులు పలుకునగ్గోమాయువుమృదుమధురభాషణంబులకు | 98 |
క. | కందువచుట్టమువై మది, కం దంతయుఁ బాపి మీఁదఁ గలభాగ్యము నా | 99 |
క. | కడుపున కందియు నందని, కుడుపుల ననుదినముఁ గుదిలఁ గుడుచుటకంటెన్ | 100 |
వ. | అని నిశ్చయంబుగాఁ బలికి గార్దభం బమ్మృగధూర్తంబువెనుకం జనఁ గొనిపోయి | 101 |
క. | నమ్మించి తోడి తెచ్చితి, నమ్మినభృత్యుండు గాఁడు నాక యితని నీ | 102 |
వ. | అని విన్నవించి యామృగధూర్తంబు దొలంగిన మృగనాథుండు. | 103 |
గీ. | ఉఱికి గార్దభంబు నుగ్రదంష్ట్రలు గల, ముఖమునం దుదగ్రనఖములందు | 104 |
గీ. | దినముఖోచితకర్మంబు దీర్చి వచ్చి, యనుభవించెద నందాఁక నరసియుండు | 105 |
సీ. | దివ్యౌషధం బని తెప్పించి మృగరాజు, నన్నుఁ గావలి పెట్టి నదికిఁ బోయె | |
గీ. | నంత హరివచ్చి యాగార్దభావయవము లెక్కడికిఁ బోయె నిపు డన్న నెఱుఁగనట్లు | 106 |
వ. | కావున నీగార్దభంబునకు హృదయకర్ణంబులు లే వనిన నట్లకాఁబోలు నని యామృ | 107 |
ఉ. | తెల్లదలాటరాయ సుదతీజననూత్నమనోజ మల్లికా | 108 |
ఉత్సాహ. | మందరాచలేంద్రధీర మనుచరిత్రసంతతా | 109 |
భుజంగప్రయాతము. | రమాసూనురేఖావిరాజత్స్వరూపా | 110 |
గద్యము. ఇది శ్రీమైత్రావరుణగోత్రపవిత్ర బ్రహ్మనామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ నారా
యణనామధేయప్రణీతం బైనపంచతంత్రం బనుమహాకావ్యంబునందు
లబ్ధనాశం బనునది చతుర్థాశ్వాసము.
————