నేటి కాలపు కవిత్వం/ఇచ్ఛాధికరణం
శ్రీగణేశాయనమః.
వాఙ్మయపరిశిష్టభాష్యం.
ఇచ్ఛాధికరణం.
అవునయ్యా; మీరేమన్నా చెప్పండి? మాయిష్టమైనవి మేము వ్రాస్తాము. మాకీవిచారణలో పనిలేదు. అదే ఉత్తమకవిత్వమంటాము అని అంటారా?
సమాధానం
వివరిస్తాను అవును. ఇష్టం వచ్చినట్లనవచ్చును. అయితే
"స్వాధీనో రసనాంచలః పరచితాః శబ్దాః కియంతః క్వచిత్,
క్షోణీంద్రో న నియామకః పరిషదః శాంతాః స్వతంత్రం జగత్
తద్యూయం కవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతి
స్వచ్ఛందం ప్రతిసద్మ గర్జత వయం మూకవ్రతాలంబినః"
(సా. ద. పీఠికలో ఉదాహృతం)
నాలికస్వాధీనం, కొన్ని శబ్దాలు పరిచితమైవున్నవి. యెక్కడా రాజునియామకుడు లేడు. పరిషత్తులు శాంతంగావున్నవి. కనుక మేముకవులమంటే మేముకవులమని ప్రతిగృహంలో మీరింకగర్జించండి మేము మౌనంగా వుంటాము అని బుధులన్నట్లు అసంబద్ధాలాపాలను ఉపేక్షించవచ్చును. లేదా లోకం వంచితమవుతున్నదని తెలిసినప్పుడు దీని తత్వమిది యదార్థ్యమిది అని సత్యాన్ని ఆరాధిస్తూ సత్యపరతంత్రులు చెప్పవచ్చును.
అని శ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర
పరిశిష్టంలో ఇచ్ఛాధికరణం సమాప్తం.