నృసింహపురాణము/ప్రథమాశ్వాసము
ప్రథమాశ్వాసము
కథాప్రారంభము
వ. | ఏను విన్నపంబుసేయంగల శ్రీనరసింహావతారం బనుపురాణకథకుఁ బ్రారంభం బెట్టి | 1 |
క. | ఏతీర్థము కలియుగమున, భూతాభయదానచతురపుణ్యోన్నతి ను | 2 |
శా. | ఏతీర్థంబున సర్వకాలమును సర్వేశుండు సర్వాగమా | 3 |
శా. | ఏతీర్థంబుఁ దలంచువారు వినువా రీక్షించువా రెప్పుడున్ | 4 |
శా. | ఏతీర్థంబు సమస్తతీర్థతిలకం బిష్టార్థసిద్ధిప్రదం | 5 |
క. | అని ప్రార్థించిన మునులకు, వినయాననతాంగుఁ డగుచు విశ్రుతవాణీ | 6 |
ఉ. | ఈగుణకోటియంతయును నెక్కడ నెక్కడఁ గల్మిదుర్లభం | |
| ద్యాగురుఁ డైన మద్గురుముఖాంబురుహంబునఁ గంటి నిప్డు త | 7 |
సీ. | ప్రోగులై యెందును బోఁ గేర్పడక యున్న శ్రుతు లన్నియును నోజ సూత్రపఱిచె | |
గీ. | బుట్టినప్పుడె సంసృతిపొలముఁ గప్పు, నట్టియెఱుకను బుట్టినపట్టిఁ గనియె | 8 |
వ. | సమాహితహృదయుల రై వినుండు. | 9 |
ఉ. | సంతతపుణ్యవర్తనుఁడు సద్గుణసంవృతకీర్తనుండు ని | 10 |
సీ. | అర్థి గంగద్వార మాడెఁ బుష్కరములు గనియె హరిక్షేత్రమునఁ జరించె | |
గీ. | దఱిసె శ్రీవేంకటాచలస్థాయిఁ గొలిచె, సహ్యజావేణి ( దోఁగెఁ దత్సవిధసీమ | 11 |
వ. | ఇట్లు పరిపాటిం బ్రసిద్ధంబు లగు తీర్థంబు లాడుచు మఱియును. | 12 |
క. | గోకర్ణము సహ్యగిరియు, శ్రీకుల్యముఁ బుష్పనగము సిద్ధాచలమున్ | 13 |
క. | అందు భవనాశనీనది, నందనదళితారవిందనవమకరంద | 14 |
వ. | తదనంతరంబ. | 15 |
ఉ. | ఆమునినాయకుండు వినయానతుఁడై కొలిచెం జగత్త్రయ | 16 |
వ. | ఇవ్విధంబున శ్రీనరసింహసందర్శనం బొనరించి కృతార్థుం డై యచట ననేకముని | |
| సంభావనంబు వడసి యాసీనుం డై గాలవుండు నమ్మహాత్ముండు వివరించునచ్యుతమ | 17 |
క. | చూచితి ననేకతీర్థము, లీచందముపుణ్యతీర్థ మే నెఱుఁగ మునీం | 18 |
క. | ఇచ్చట దొల్లి జనార్దనుఁ, డచ్చపువాలారుగోళ్ల నసురవరేణ్యున్ | 19 |
సీ. | అఖిలలోకేశ్వరుం డగురమాధిపుతోడ విడువనివైరంబు దొడరునట్టి | |
గీ. | పుణ్యతీర్థంబు లెయ్యవి భూరిపుణ్య!, యింతయు సవిస్తరంబుగా నింపు మిగుల | 20 |
క. | అని పలికిన గాలవుపలు, కనుమోదించుచు మునీంద్రు లందఱుఁ దమ నె | 21 |
క. | తనవదనమునన చూడ్కులు, నినుపఁగ దేవశ్రవుండు నిరుపమవిద్యా | 22 |
క. | నీ వడిగిన యర్థము ముని, సేవితము సమగ్రబోధసిద్ధిప్రద మి | 23 |
క. | ఏనును బెద్దలచే మును, వీను లలరఁ దనతరంబ విన్నవిధంబున్ | 24 |
వ. | అని పలికి దేవశ్రవుం డిట్లని చెప్పం దొడంగె. | 25 |
సీ. | అఖిలలోకానందుఁ డగుచంద్రుఁ డెందేని గలిగె నుజ్జ్వలఫేనకణముమాడ్కి | |
గీ. | నాదిమత్స్యకూర్మములవిహారలీలఁ, దనరు నెందేని ప్రకృతి సత్యములకరణి | 26 |
క. | తాన లవణాబ్ధి యనినను, దాన మధురజలధి యనిన దాన యమృతపా | 27 |
క. | కావున దుగ్ధాంభోనిధి, శ్రీవిభవము వర్ణనంబు చేసెద సాక్షా | 28 |
ఉ. | ఒక్కొకవేళ శీతకిరణోదయవేళలఁ బొంగి నింగికిన్ | 29 |
ఉ. | ఎక్కుడువేడ్కఁ గ్రోలికొని యెండక యున్నపయోధీ పల్మఱున్ | 30 |
సీ. | బిగి యుల్లసిల్లెడుపగడంపుఁగెమ్మోవి చెలువంపుబింకంబు చిగురులొత్తఁ | |
తే. | లలితభంగుల నొప్పునేలావధూటి, కమ్రభంగభుజంబులఁ గౌఁగిలించి | 31 |
ఉ. | ప్రేపులు రేలుఁ బెద్దయును బేర్చి సమీపనగేంద్రచంద్రకాం | 32 |
చ. | తటరుహవిద్రుమద్రుమవితానము లొప్పుఁ బయోధి కింక ను | 33 |
తే. | కడలిచేతు లార్చుచు ఫేనఘనతరాట్ట, హాసరుచితోఁ బ్రవాళజటాలి విద్రిచి | 34 |
చ. | పొలుపుగ నెల్లనాఁడు నుడివోవక పెల్లుగఁ బూఁచు తీఁగెలం | 35 |
ఉ. | ఱిక్కలతోడ కొండల నెఱిం దనలోన నడంచికొన్న నీ | 36 |
సీ. | సిరిపుట్టినిల్లు రాజీవలోచనుసెజ్జపట్టు మహీకాంతకట్టుఁజీర | |
గీ. | సురతభవనంబు వాహీనీసుందరులకుఁ, గూర్మి నిల్కడ గంభీరగుణము నెలవు | 37 |
వ. | ఇ ట్లపారవిభవోదారం బగుదుగ్ధసారావారంబునకు నలంకారం బగుచుఁ దదీయ | 38 |
క. | అదియు మహిమయు నేర్పడ, నాదిపురుషుఁ డొకఁడ యెఱుఁగు నన్యులకెఱుఁగం | 39 |
సీ. | క్షీరాబ్ధితరఁగలపేరణిఁ గూడిన సేనసంహతి చిక్కఁ బేరె నొక్కొ, | |
గీ. | యుదరమున ముత్తియంబు లొయ్యయ్యమూగి, తెట్టువలు సేరి పెనుమిఱ్ఱు గట్టెనొక్కొ | 40 |
శా. | శ్వేతద్వీపనివాసు లందఱు శరజ్జీమూతరేఖాసిత | 41 |
క. | హరిభక్తి తేపగా దు, స్తరసంసారాబ్ధిఁ గడచుసాధుజనులకుం | 42 |
వ. | అమ్మహాద్వీపంబునడుమఁ బ్రచండమార్తండమండలసహస్రదుర్నిరీక్ష్యసహజతేజోవి | 43 |
క. | నాలుగునోళులవానికి, నాలుక లిరువేలు గల ఘనస్థిరమతికిన్ | 44 |
సీ. | నారాయణునిదివ్యనామసంకీర్తనం బనిశంబుఁ జేయుమహాత్ములకును | |
గీ. | భవము దీఱినతుది సచ్చి భవ్యసుఖము, లనుభవింపంగఁ దగునెల వగుటఁ జేసి | 45 |
చ. | శ్రుతిమతధర్మయోగములు చోద్యపుమూల్యము లప్పురంబునం | 46 |
సీ. | తమవాఁడిచూడ్కి కందర్పున కేపని యైన సాధించుదివ్యాస్త్ర మనఁగఁ | |
ఆ. | జొక్కుమందు లనఁగ సోయగంబులగను, లనఁగ సుఖమునిక్క లనఁగఁ జాలి | 47 |
ఉ. | మారుని గన్నతండ్రి, సిరిమానసము న్గబళించునేర్పుసొం | 48 |
ఉ. | శ్రీసతికి న్మురారికిని సేసలు పెట్టినపెండ్లిపెద్ద ల | 49 |
సీ. | హరిదాసులను హత్తి కరులు శ్రీకరు లెల్లఁ గల్క్యవతారసంకల్పలీల | |
గీ. | జాతు లెల్ల విరించి హంసవ్రజంబు, బలఁగ మింపార రాయంచపదవు లెల్ల | 50 |
ఆ. | సకలకాలకుసుమసంపద సొంపారి, నిఖిలసుఖవిహారనిర్మితులకు | 51 |
సీ. | హరిభూతభావధన్యావతారంబులఁ గీర్తనం బొనరించుఁ గీరసమితి | |
గీ. | ఘోరసంసారతాపనివారణంబుఁ, జేయునున్నతభూరుహచ్ఛాయచయము | 52 |
చ. | ఉరుతరశంఖచక్రరుచి నొప్పులగద్విమలోదరస్థితాం | 53 |
సీ. | తరితాల్పు పొక్కిటితమ్మికమ్మనితావి యెల్ల నల్దెసలను జల్లి చెల్లి | |
గీ. | కొలువు తఱిఁగోరి సంభ్రమాకులతఁ బారు, చెంచువేల్పులమూకల సేదచేర్చి | 54 |
వ. | మఱియు నప్పురంబు పురుషోత్తముమహిమయుంబోలెఁ వర్ణనాతీతవైభవంబును, లక్ష్మీ | |
| దరస్థితంబయ్యును సుకవిముఖవిరాజమానంబును విలయక్లేశంబునకు నగమ్య | 55 |
శా. | రాకాచంద్రసహస్రకోటితులనారమ్యోల్లసత్కాంతియుం | 56 |
ఉ. | ఆనగరంబురాజు వివిధాద్భుతరత్నమరీచిమండలో | 57 |
శా. | హేమస్తంభమణిప్రదీపమణు లింపేసారుకర్పూరసా | 58 |
ఉ. | చుట్టును గల్పవృక్షములు చుట్టును బుష్పలతావితానముల్ | 59 |
మ. | మును లేతెంచి నుతించుచుండుదురు సమ్మోదంబుతో నమ్రు లై | 60 |
ఉ. | ఆడుదు రెల్లప్రొద్దు లలితాభినయంబున దేవకామినుల్ | 61 |
వ. | ఆదివ్యమందిరంబునకు రక్షకులై యష్టదంష్ట్రులు చతుష్షష్టిదంతులు మహామస్తకవక్షస్థల | |
| నాయతశక్తియుక్తులును నానావిధాయుధహస్తులును నసమానసత్త్వసంరంభగంభీరు | 62 |
సీ. | పద్మనివాసిని పట్టపుదేవియు నలినాసనుఁడు ప్రియనందనుండు | |
తే. | ధర్మసంస్థాపనలు వినోదంపుఁబనులు, శ్రుతులు నుతు లిట్టి యతులితోన్నతులఁ జేర్చి | 63 |
క. | ఆదేవుదివ్యమహిమం, బాదేవుఁడు తానె యెఱుఁగు నన్యుల కెఱుఁగం | 64 |
సీ. | భూరిరజోగుణస్ఫురణపద్మజుఁ డనా భువనప్రపంచంబు పొడవుఁ జేయు | |
ఆ. | గేవలుండె నిఖిలదేవచూడామణి, యఖిలదేవతామయైకమూర్తి | 65 |
చ. | సిరి గరుడుండు చారుతులసీదళదామము కౌస్తుభంబు ప్ర | 66 |
చ. | తపములఁ బోనిపాపములు దానగుణంబులఁ బోనిదోషముల్ | |
| చ్చఁపుఁదలఁపొప్ప నొక్క మరి సర్వము నైన రమేశుపేరు తీ | 67 |
క. | కరుణయుఁ దనకుఁ దొడవు త, త్పరచిత్తులదెసయ తనకు భాగ్యము భక్తో | 68 |
సీ. | నాలుగుమొగములబాలుఁ బొక్కిటితమ్మి సృజియించి జగములు సేయఁ బనిచె | |
గీ. | దలఁపులకుఁ జేరుగడ తాన తెలువులకును | 69 |
వ. | ఇట్టిపరమేశ్వరుండు పరమప్రభావభరణుం డగుచు భువనహితచరితంబులం బాపుచు | |
| నారాయణమహిమాకారపారావారంబులం జేరుప్రబుద్ధజనంబులబుధ్ధులతెఱంగునం | 70 |
చ. | నిరుపమభోగితల్పమున నిర్మలయోగవిశేషలీలమై | 71 |
సీ. | నెరసినచిక్కని యిరుచన్నుగవచెన్ను పరిపూర్ణకుంభవిభాతి యనఁగఁ | |
గీ. | దనమనోహరభావంబు దనవిభునకు, నుచితమంగళవిధముల నుల్లసిల్ల | 72 |
చ. | ఉరుతరకల్పపన్నగఫణోజ్జ్వలరత్నసహస్రదీప్తి మైఁ | 73 |
వ. | అంత. | 74 |
సీ. | అంబుధినాదంబు నతకరించుచుఁ బర్వె నభమునఁ బాంచజన్యస్వనంబు | |
గీ. | పసిఁడినీరుమీఁదఁ బడఁగినక్రియ నిజపక్షకాంతి దిశలఁ బ్రజ్వరిల్ల | 75 |
వ. | ఇట్లు బోధంబు నొంది కొండొకసేపు గోవిందుండు మందస్మితసుందరవదనారవిం | 76 |
ఉ. | ఆనలినాయతాక్షినయనాంచలచంచలతాసవిభ్రమ | 77 |
క. | డెందమునఁ గొలుపువేడ్కలు, సందడిగొన నేగుదెంచి సంయమివరులున్ | 78 |
వ. | అప్పుడు. | 79 |
సీ. | అవసరం బిప్పుడ యగునంతదాఁకను బగళమై నిలుఁడు దిక్పాలవరులు | |
గీ. | లనుచు నుద్ధతవేత్రదండాభిరామ, హస్తు లై మణిహారు లందంద నిలువ | 80 |
వ. | అట్టిసంకులసమయంబునందు. | 81 |
క. | సనకుఁడు సనందనుండును, సనత్కుమారుఁడు సనత్సుజాతుం డనఁగా | 82 |
వ. | ఇట్లు చొచ్చి యనివార్యగమనంబున నరుగుదెంచువారికి నడ్డపడి విష్ణుసారూప్యదే | 83 |
ఉ. | ఇప్పుడ మేలుకాంచెఁ బరమేశుఁడు సాగరకన్యకాంతతో | 84 |
క. | ఈసిద్ధు లీసురప్రభు, లీసంయమివరులు జగదధీశ్వరుఁ గొలువం | 85 |
క. | మీరును నొక్కింతదడవు, సైరణతో నిలిచి సమయసముచితముగ ల | 86 |
చ. | అనుటయు నాదిదేవుఁ బరమాత్ముఁ గనుంగొన నెమ్మనంబులన్ | 87 |
ఆ. | అఖిలలోకగమ్యుఁ డగుపరమేశ్వరుఁ, జూడఁ గొల్వ నబ్బుసుకృతమునకు | 88 |
ఉ. | కావున ధర్మవిద్విషులు కల్మషకారు లనంగ దుష్టమో | |
| క్ష్మీవిభుమీఁదిమచ్చరము కిన్కయుఁ గాఱియఁ బెట్టుఁగాత మీ | 89 |
వ. | అని వారు ఘోరంబుగా శపించిన. | 90 |
క. | వెఱగుపడి హర్షరాగము, దఱకిన వదనములు వెల్లఁదనము గదుర బి | 91 |
వ. | ఆసమయంబున. | 92 |
సీ. | ఇమ్మహాపురుముల కెంతమాత్రకుఁ గాఁగ నేలకో యీకోప మిట్లు పుట్టె | |
గీ. | ననుచు మునులును సిద్ధులు నమరవరులు, నాదిగా నెల్లవారలు నచట నచటఁ | 93 |
వ. | ఆవృత్తాంతం బంతయుఁ దనదివ్యచిత్తంబున నవధరించి సకలజగన్నివాసుం డగువా | 94 |
క. | మీఱినమౌనులకినుకకు, మా ఱలుగక యున్న మీసమగ్రక్షమ వే | 95 |
ఉ. | ఎంతఁ గొఱంతఁ జేసియు మహీసురముఖ్యులు నాకుఁ జూడఁగా | 96 |
సీ. | అజ్ఞానరోగంబు లలఁతబెట్టెడుచోట దివ్యౌషధంబు భూదేవసేవ | |
| దురితాంధకారంబు పరఁగిక్రమ్మినచోటఁ బటుభానురుచి బ్రహ్మభాషితంబు | |
గీ. | సారభద్ర ముత్తమవర్ణచరణరజము, భవ్యతీర్థంబు బాడబపాదజలము | 97 |
శా. | నారూపంబులు మేదినీసురలు నానారూపదీప్యత్తప | 98 |
క. | దైవాధీనము త్రిజగము, దైవము తన్మంత్రవశము తన్మంత్రము భూ | 99 |
ఆ. | బ్రాహ్మణావమానపరు లైనవారలు, నన్ను నాత్మనొల్లకున్నవారు | 100 |
వ. | కావున బ్రాహ్మణవచనాతిక్రమణం బొనరించిక జన్మాంతరంబులు గైకొనవలము, నతి | 101 |
మ. | పగవాఁ డైనను మూర్ఖచిత్తుఁ డయినన్ బాపాత్ముఁ డైనన్ మదీ | 102 |
శా. | ఏ నెవ్వాఁడనొ నాచరిత్రముతెఱం గెబ్బంగియో మన్మయ | 103 |
క. | నారాయణాఖ్యుఁ డగుసుతుఁ, బేరుకొనినబోయ కెట్టిపెం పొదవెను వాఁ | |
| డేరూపువాఁడొ ముందఱ, మీరటు దలపోయుఁ డాసమీహితబుద్ధిన్. | 104 |
వ. | మదీయశరణాగతుల రగుటంజేసి మీకు నెందును శుభంబ సకలచరాచరజనకుం డైన | 105 |
క. | ఆజయవిజయులు పుట్టిరి తేజంబునఁ గశ్యపునకు దితికిని సుతులై | 106 |
క. | అని గాలవమునివరునకు, ననఘుఁడు దేవశ్రవుండు హర్షముతోఁ జె | 107 |
ఆశ్వాసాంతము
క. | సౌభాగ్యభాగ్యలక్ష్మీ, లాభోన్నతవక్ష భువనలాలితరక్షా | 108 |
మానిని. | భూరికృపారసపోషణ కౌస్తుభభూషణ దుస్తరభూమభవో | 109 |
క. | వినతవిశారదనారద, మునిమధురోద్గీతనినదమోదభ్యస్తా | 110 |
వనమయూరము. | స్ఫారగుణహార శ్రుతిసార జగదేకా, ధార విదుదార నగధార ననమేఘా | 111 |
గద్యము. | ఇది శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్యధుర్య | |