నృసింహపురాణము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
ద్వితీయాశ్వాసము
| శ్రీమదహోబలతీర్థ | 1 |
వ. | దేవా రోమహర్షణుండు మహర్షుల కిట్లనియె. అట్లు పుట్టి హిరణ్యకశిపుహిరణ్యాక్షు | 2 |
సీ. | కనుబింకపుఁగింకఁ గలుగువేఁడిమియెల్ల నొక్కటియై యొడ లొత్తె ననఁగఁ | |
గీ. | బ్రళయకాలదహనుఁ బాటించుదొర యనఁ, జండదండధరునిసఖుఁ డనంగఁ | 3 |
మహాస్రగ్ధర. | తనదోర్దర్పంబు తెల్పం దలచి సరభసోత్పాతదిగ్దంతిదంత | 4 |
ఆ. | అసురు లనినఁ జంప నలుగు నవ్యాహారు, లనిన నోరికళ్లు గొనఁగఁ దలఁచుఁ | 5 |
క. | ద్వేషించు నాగమంబుల, రోషించున్ ధర్మపదనిరూఢస్థితికిన్ | 6 |
వ. | ఇట్లు ప్రకృతిపారుష్యదూష్యప్రకారుం డగుచు నయ్యసురవకుండు సంతతెశ్వర్య | 7 |
చ. | అమరులతల్లికంటెను మదంబ వరిష్ఠ త్రిలోకరాజ్యభో | |
| ద్యమగరిమంబుమై సురల నందఱ మ్రుచ్చులఁ బోలెఁ దీవ్రదం | 8 |
క. | కావునను గ్రపుఁదపమున్, గావించెదఁ దపముచేతఁ గానివి కలవే | 9 |
సీ. | అమరపదంబును నమరేంద్రపదము తపంబనుభూజంబుపండ్లు గావె | |
గీ. | తపములావునఁ గాదె యిద్ధరణివలయ, మఖిలమును దాల్చియున్నవాఁ డహి యొకండ | 10 |
క. | పోయెద నిప్పుడ యుద్యద, మేయతపోనిష్ఠ నజుని మెచ్చించెద మ | 11 |
వ. | అతి తలపోసి యప్పుడ కదలి మునిసిద్ధసేవితం బైనగంధమాదనంబునకుం జని యందు | 12 |
క. | నాలుకలు గ్రోయువహ్నులు, నాలుగుదిక్కుల నమర్చి నడుము నిలిచి సూ | 13 |
సీ. | ఏపారుతుఱఁగలి నెఱమంట లొండొండ వ్రేసిన నేమియు వెగడుపడక | |
గీ. | దిట్టతనము పేర్మి దేహాభిమానంబు, విడిచి నిష్ఠ యేడుగడయుఁ గాగఁ | 14 |
శా. | విద్యుత్కేతువు లొప్ప శక్రధనురావిష్కారఘోరంబుగా | 15 |
క. | తొలువానలు గురియఁగఁ ద, జ్జలనివహము దైత్యవిభునిసంతప్తాంగం | 16 |
తే. | బట్టబయటఁ బ్రౌఢపద్మాసనస్థుఁడై, యున్నయతనిమీఁద నొక్క పెట్టఁ, | 17 |
స్రగ్ధర. | దీర్ఘస్ఫీతాంబుధారల్ దెరలఁ బొదువ నుద్వేగదూరుండు స్ఫూర్జ | |
| నిర్ఘాతోత్పాతవిద్యున్నికరము లడగన్ నిర్వికారుండు ధైర్యం | 18 |
క. | పదపడి హేమంతునిసం, పద యొయ్యున శీతగిరి యుపాంతమువలనం | 19 |
ఉ. | ఒక్కట మైహికంబు లగు నుత్తరమారుతము ల్శరీరముల్ | 20 |
సీ. | దనుజఘోరతపోగ్రతకుఁ దలంకినమాడ్కిఁ గమలిననెత్తమ్మి కన్నుమూయ | |
గీ. | దివిజవైరితమము తెఱఁగెల్లఁ గంటికి, నిదురలేక చూచునదియుఁబోలె | 21 |
వ. | మఱియు నమ్మహావ్రతుండు తపోవిశేషాభిలాషంబు దనకుం బరిపోషణం బొనరింప | 22 |
తే. | వేళ్లదిండ్ల గూరలఁ గొంత నీళ్లఁ గొంత, గారవమునఁ దపోయాత్రఁ గోరి నడపె | 23 |
వ. | ఇవ్విధంబున ననేకసంవత్సరంబులు ధీరవ్రతాచారుండై యున్నయాదైతేయతా | 24 |
మ. | జనకుం డొక్కఁడ వేఱుతల్లులు జగత్సామ్రాజ్యపూజ్యస్థితుల్ | 25 |
క. | అసురతపంబు జగంబుల, కసహ్యమై యునికిఁజేసి యంబుజభవుఁడున్ | 26 |
క. | నిను నాశ్రయించియును నే, ననఘా కడలేనివనట యనువననిధిలో | 27 |
చ. | అనుటయు దేవమంత్రి దరహాసముతో దివిజేంద్రుఁ జూచి యి | |
| కనినపదంబు ద్రిప్పఁగ జగత్పతి పద్మజు కైనఁ బాడియే | 28 |
వ. | అదియునుంగాక. | 29 |
సీ. | ఏదేవుతుదమొద లెఱుఁగక నేఁడును శ్రుతిమార్గములు బహుగతులఁ దిరుగు | |
గీ. | నట్టియాదిదేవు నంబుధిశయను ల, క్ష్మీకపోలముకురమితముఖాబ్దు | 30 |
ఉ. | పొందవు దుఖముల్ భయము పొందదు పొందదు దైన్య మెమ్మెయిన్ | 31 |
క. | తను నెబ్బంగిఁ దలంతురు, జను లాభంగిన తలంచు సరసీరుహలో | 32 |
క. | హరిభక్తుతపము తపము, హరిభక్తుజపము జపము హరిభక్తులభా | 33 |
క. | హరి యను రెండక్కరములు, దొరకొనఁ దీపొసఁగు జిహ్వతుది నెవ్వని క | 34 |
సీ. | దారుణదురితాంధకారసూర్యోదయం బధికపాతకవిపినానలంబు | |
గీ. | సకలకల్యాణమూలంబు సకలవేద, శాస్త్రపాఠంబు సకలార్థసంచయంబు | 35 |
శా. | వేదాంభోధి మథించి వెండియు మహావిస్తీర్ణశాస్త్రార్థసం | 36 |
ఉ. | శ్రీస్తనకుంకుమద్రవనిషిక్తభుజాంతరభాగవిస్ఫుర | |
| ప్రస్తుతమత్తభృంగరవరాగరసోల్బణభోగిభోగత | 37 |
వ. | అని పలికి యాఖరదూషణశోషణపరాయణపదద్వయనిరాకరణకారణంబుగా నఖిల | 38 |
తే. | అంబుజాసనుఁ డాదిగా నాద్యు లెల్ల , నిమ్మహామంత్రపరమార్థ మెల్లనాఁడు | 39 |
వ. | హిరణ్యకశిపుతపోవిబృంభణంబునకు భయం బందవలదు, దైత్యులయైశ్వర్యం బయ్యు | 40 |
క. | నారాయణవిద్విషులకు, గ్రూరుల కాయువును శ్రీయుఁ గులము బలంబున్ | 41 |
తే. | విష్ణుఁ డిహపరదైవంబు విష్ణుదేవు, నొల్లమియ యిహపరముల నొల్లకునికి | 42 |
మ. | అనువాచస్పతిభాషణంబులకు నాహ్లాదంబు సంధిల్ల న | 43 |
వ. | చని వెండియు వివిధవితర్కజనితపరిస్పందం బగుడెందంబు డిందుపఱుపనేరక సుర | 44 |
శా. | లావణ్యోదయముల్ ప్రియంబు లుచితాలాపమ్ము లాటోపముల్ | 45 |
ఉ. | మించినపేర్మి నేయెడల మిన్నులు ముట్టి వెలుంగునట్టి నూ | |
| ఱంచుల కై దువుల్ తృణకణాకృతియై వెడబాయఁ బేర్చి ద | 46 |
సీ. | ఉల్లంబు మీచూడ్కు లుచ్చిపోకకుఁగదా వాలమ్ములకు నోర్చు వారికోర్కి | |
గీ. | పుణ్యసస్యంపుఁబంటలు భూరినియమ, తరుఫలంబులు సౌఖ్యాధిదైవతములు | 47 |
ఉ. | మానము ప్రోదినై నియతమాత్రముగాఁ బొడవై ధరిత్రి నె | 48 |
చ. | వ్రతములఁ గొల్చి శీలముల వ్రచ్చి జపంబులఁ గ్రోలి యుత్తమ | 49 |
సీ. | చామలనగుమోముఁ జందురుపొడవున రాగాంబుధులు నిట్ట గ్రమ్ము ననుట | |
గీ. | యద్భుతంబు లై విపులభవాబ్ధిఁ దిరుగు, జనులహృదయంబు లనియెడుజలచరములు | 50 |
క. | కావున మీతెఱఁ గంతయు, భావించి జగద్ధిత మగుపని యొక్కటి సం | 51 |
క. | దితిజుఁడు హిరణ్యకశిపుఁడు, వ్రతచర్యానిష్ఠ నున్నవాఁ డాతని ధీ | 52 |
ఉ. | మీ రిటుపూని యీక్రమము మేకొని చేసిన దివ్యరాజ్యల | 53 |
వ. | చనుఁ డసురేంద్రుఁ డున్న వికచద్దృమపుష్పసుగంధిగంధమా | 54 |
వ. | అనిన నయ్యింతు లందఱు నట్లకాక యియ్యకొని రప్పుడు తిలోత్తమ యయ్య | 55 |
సీ. | ఏను గ్రీఁగంట నొక్కించుక చూచిన ఖలుడెంద మైనను గరఁగు ననిన | |
గీ. | నరతి యైనఁ దాల్మి యను కైన నుల్లంబు, చులక నైనఁ దసము లులక నైన | 56 |
క. | చూచెదవు గాక యే నిటు, చూచిన నయ్యసురతపము సొంపఱి వ్రతిని | 57 |
వ. | అని పంతంబులు పలికిన యమ్మగువమాటకు మరున్నాయకుండు మనంబునం బ్రమ | 58 |
క. | వారలతోడనె యాత్మ, స్ఫారవిభవ మెల్లఁ గొని వసంతుడు దనయా | 59 |
చ. | ఇదె చనుదెంచెఁ జైత్రుఁ డని యెల్లవనంబులకుం బ్రమోదముల్ | 60 |
ఉ. | పండినమ్రాకు డుల్లి నవపల్లవముల్ తిలకింపఁ బూఁబొదల్ | 60 |
ఉ. | ఎందును బుష్పసౌరభమ యెందును మందమదాలిఝంకృతుల్ | 61 |
తే. | సరసకింశుకకోరకసంచయంబు, చెలువు తిలకించె భావినృసింహదేవు | |
| దీప్తినఖపంక్తి ప్రకటదైతేయరుధిర, సేకరుచి నొప్పు తెఱఁగు సూచించినట్లు. | 63 |
ఉ. | కాముఁడు లోక మంతయును గైకొని పట్టము గట్టికొన్నఁ బే | 64 |
చ. | అవిరళచారుకోరకచయంబుల లోకములంద చూడ్కులం | 65 |
చ. | తనియక కమ్ము లిచ్చి చవి దాఁకినచొక్కునఁ గన్ను వ్రాలఁ జం | 66 |
సీ. | అంచబోదలమోద మారంగఁ జెక్కిళ్లు గొట్టుచు నెలదోడుకొనలు నలుప | |
గీ. | బసిఁడిగద్దియగా గ్రుద్దపైకరంబు, ప్రీతి నెలకొన సిరి పేరుఁ బెంపుఁబడయఁ | 67 |
చ. | వలివిరవాదిక్రొవ్విరులవాతుల మూఁతులు వెట్టి తేనియల్ | 68 |
తే. | పొగడమ్రాకులమొదలను బుష్పరసము, దొరఁగి నెత్తావియందును నెరయ నొప్పెఁ | 69 |
క. | పూచినయశోకములయం, దేచినతుమ్మెదలరవము లింపెసఁగెఁ బొరిం | 70 |
చ. | విలసితచంద్రకాంతమణివేదులపై మృదుమారుతాహతిన్ | 71 |
చ. | చిలుకలపిండు నొప్పిదము చిత్రసురాయుధలీలయేపునం | 72 |
చ. | మనసిజమంత్రఘోషములు మన్మథునానతిమాట లిందిరా | 73 |
చ. | అరుగుగఁ దేఁటితీఁగె గొనయం బెసకం బగుపచ్చవింట ని | 74 |
సీ. | వెలయు నీవెన్నెలవెల్లికాంతులసిరి పిఱుఁదుదీవులు చేరి మెఱయ కున్న | |
గీ. | మునిఁగి పోరె మన్మథున కగ్గమై పోరె, చాలఁ గొంకువోర తూలిపోరి | 75 |
వ. | ఇట్టివసంతసమయంబునందుఁ బురందరాదేశంబు నెఱపం బూని చనుదెంచినవనజలో | 76 |
సీ. | కమనీయకరపద్మకాంతిపల్లవములు కోమలస్మితదీప్తికుసునుములును | |
గీ. | నతిశయిల్లంగ మధుసమయాధిదేవ, తమ శుభాకారలీలలు దాల్చి రనఁగ | 77 |
క. | క్రమమున నాటలపైఁబడి, నమరాంగన లమరవైరి కంతను వింతన్ | 78 |
చ. | కదలుకుచద్వయంబు వడఁక న్దనుమధ్యము కక్షదీధితుల్ | |
| బొదలఁగఁ గంకణస్వనము పొల్పెసలార సుమాస్త్రుదర్పముల్ | 79 |
ఆ. | పిఱిఁదిపెంపు వ్రేగుపఱుప నందంద ప, య్యెద దొలంగఁ జన్ను లదర నంది | 80 |
సీ. | మునికాళ్లు మోపి నిక్కినఁ బదచ్ఛవి నేలయును బల్లవించిన యొప్పు మెఱయ | |
గీ. | నొయ్య డానేల దవ్వుల నున్నతీఁగఁ, దిగిచి నఖదీప్తు లంతంత దీటుకొనఁగ | 81 |
తే. | ఓర్తు కరతాళ మొనరింప నోర్తు సమద, గీతి పచరింప సరితాళగింప నోర్తు | 82 |
సీ. | అమృతంపుసోన పైనడరినట్లే పాట చెన్నున మోకళ్ళఁ జివుళు లొత్తె | |
గీ. | ననినఁ బోలుఁ బొసగు నగుఁ దగు ననఁగ స, చేతనంబు లెల్ల జిత్రరూపు | 83 |
క. | జంకెలు బుజ్జనములునుం, గింకలు దళుకొత్త నోర్తు గీరంబులకున్ | 84 |
సీ. | కెమ్మోవుతావికే గ్రమ్ముతుమ్మెదగమి తూలెడుకురులలోఁ దొడిబడంగఁ | |
గీ. | వళులలావున నలికౌను బలిసి నిలువఁ, జూచువారిచూడ్కికి నొప్పుచూఱ లిడుచు | 85 |
చ. | వలపల డాపలన్ వరుస వాలు గనుంగొనఁ జూపు లార్చుచున్ | 86 |
వ. | ఇవ్విధంబున మదనవికారకారణంబు లగువిభ్రమవ్యాపారంబులఁ బ్రవర్తిల్లునయ్యం | 87 |
మ. | పురుషాకారముతోడ నున్నసిరియో పుంస్త్వంబు లేదో యటే | 88 |
వ. | అంత. | 89 |
సీ. | కలయంగ నడవిలోఁ గాచినవెన్నెల లై చారుహాసంబు లనధిఁ బోవఁ | |
గీ. | గర్వములు బెండువడఁ గౌతుకములు ముడుఁగ, నదటు లాఱడిపోవఁ బ్రల్లదము లడఁగ | 90 |
ఉ. | అతనినిష్ఠయున్ ఘననిరాకులధైర్యము దన్ను నెంతయుం | 91 |
ఉ. | చాలుఁ దపంబు చాలఁగఁ బ్రసన్నుఁడ నైతి వరంబు లిత్తు వీ | 92 |
తే. | చక్క జాగిలి మ్రొక్కి యంజలిపుటంబు, మౌళిఁ గదియించి నిలిచి సమంచితార్థ | 93 |
క. | దేవర ప్రసన్నుఁ డగునటె?, సేవకులకుఁ బడయరానిసిద్ధియుఁ గలదే? | 94 |
వ. | కావున నసురేంద్రత్వంబు నాకు గృపసేయవలయు నిదియ మదీయాభిలాషంబనినఁ | 95 |
చ. | సమధికపూర్వదేవకులసంజనితుండవు నీవు నీకు న | |
| య్యమరవరేణ్యసంపదకు నగ్గలమై పెనుపొందువైభవం | 96 |
క. | అనినఁ దగువరముఁ దననె, మ్మనమున నూహించి యసుర మఱి యిట్లనియెన్ | 97 |
సీ. | దేవకులంబుచే దేవయోనులచేతఁ బికృకోటిచే దైత్యవితతిచేత | |
గీ. | నవని నంతరిక్షంబున దినమునందు, వాసరంబులయందు శర్వరులయందు | 98 |
గీ. | అనిన నిచ్చితి ననియెఁ బద్మాసనుండు, దైత్యపతియు మహాప్రసాదంబు దేవ | 99 |
వ. | వనరుహసంభవుండు దితిసంభవుని ప్రభూత వరదానసంభావితుం జేసి నిజనివాసంబు | 100 |
మ. | దితిసంతానము దానవాన్వయము నీతేజంబు నిత్యోర్జిత | 101 |
ఉ. | జన్నములుం బరాన్నములుఁ జాలఁగ మ్రింగి కరంబుఁ గ్రొవ్వి పే | 102 |
చ. | హరి తనకు న్గలండని పురాంతకుఁ డామురవైరిసేఁత లె | |
| ర్జరులకు మేలు గోరునని సంయమకోటితలంపుల న్నిజ | 103 |
ఉ. | అట్టి సురాధినాథువద టంతయుఁ బాపి నిలింపనిర్గమున్ | 104 |
వ. | అని పల్క యసుర తక్షణంబ భృగువంశభవ్యుం డగుకావ్యు నచ్చటికి రావించి తదుప | 105 |
ఉ. | దానవనాథునౌదల నుదగ్రత నొప్పునవాతపత్ర మా | 106 |
సీ. | అసురవల్లభుప్రతాపాగ్ని పర్వెడులీల దిశల నుల్కాపాతదీప్తి పొదివె | |
ఆ. | గిరులు వడఁకె నధికపరుషంబు లై పవ, నములు చెలఁగె నిబిడతిమిర మడరె | 107 |
క. | అవి యెల్లఁ జూచి దైత్యులు, దివిజకులాపాయభంగి దెలిపెడునవె యీ | 108 |
వ. | ఇ ట్లభిషిక్తుం డై యపూర్వగీర్వాణపుంగవుండు గర్వగరిమాకాంతస్వాంతుండును | |
| మనోవికాసభాసమానోద్యానద్యోతితరోధోంతరయు సమస్తభోగభూమియు రత్న | 109 |
క. | అం దుండి సకలసంపద, లుం దనుఁ జేరంగ నఖిలలోకంబులు న | 110 |
క. | దైతేయులు దానవులును, భూతనిశాచరపిశాచములు తద్దయు సం | 111 |
ఆ. | ఆహిరణ్యకశిపు నైశ్వర్య మెంత వ, ర్ధిల్లదొడఁగె నంత దివిజకులము | 112 |
క. | వైరము గొని దైత్యుఁడు దు, ర్వారభుజారంభరోషరభసాకులుఁ డై | 113 |
స్రగ్ధర. | వేదండోద్దండహేలావితతరథపదావిష్కృతాస్వీయభాస్వ | 114 |
వ. | అమ్మహావీరుండు. | 115 |
సీ. | పేర్చుచుఁ బఱదెంచుభిదురంబు ననిమొనఁ బెడచేతఁ బెడమోము వడఁగ నడచి | |
గీ. | పారిజాతసంతానకల్పకతరువులఁ, గొని సుమేరువిచితరత్నకోటికొండ | 116 |
వ. | మఱియును. | 117 |
ఆ. | శిఖలు చూపకుండ శిక్షించి హతికి నై, నోరు దెఱవకుండ మేరవెట్టి | 118 |
సీ. | మెచ్చక యెదురైనమృత్యువుమెడఁ ద్రొక్కి క్రొవ్వాడికోఱలు ద్రెవ్వరాచి | |
గీ. | పేదప్రాణులఁ బొరిగొనుబిరుదుమగఁడ, నగుదు వీ వని యందంద మొగముమీఁదఁ | 119 |
క. | రక్కసుఁడ వయ్యు నమరుల, ది క్కొరిగితి దాయ నీవిధిం బొమ్మనుచున్ | |
| స్రుక్కఁగ నడిచె నిశాచరు, నక్కజముగ నసురపతి గదాహతి నాజిన్. | 120 |
సీ. | లీలమైఁ బాతాళమూలంబుదాఁకను సలిలధిసలిలంబుఁ గలఁచి సొచ్చె | |
గీ. | పశ్చిమాశాధినాథు విపశ్చదర్శ, నీయగాంభీర్యు దైతేయనాయకుండు | 121 |
క. | జపమును బలమును బొలుపఱి, భువనంబుల నెందుఁ దిరుగుపోఁడిమి యెడలన్ | 122 |
క. | నవనిధులు పుచ్చుకొని భవ్యవిమానము నాచికొని సురారి కడిమిమై | 123 |
ఉ. | ఎక్కుడు దెద్దు భూతియును నెమ్ములు సొమ్ములు భిక్ష జీవనం | 124 |
వ. | ఇవ్విధంబున సకలదిక్పతుల న్బరిభవించి తదీయపదంబులుఁ దాన కైకొని మాఱులేక | 125 |
సీ. | వనరాశిజలములు వడిఁ ద్రిప్పుకొనులీలఁ గలఁగించు మందరనగముకరణి | |
గీ. | దిగ్గజంబులగుండెలు దిగులుకొల్పు, హోరరవమునఁ గ్రూరమృగారిపోల్కిఁ | 126 |
సీ. | తపములఁ గ్రుస్సినతపసులఁ బట్టి తెప్పించి యచ్చరలతోఁ బెండ్లిసేయు | |
గీ. | ఖడ్గములు బాదుకలు ఘుటికములు నపహ, రించి సిద్ధపుంగవుల గారించుచుండు | 127 |
క. | సదభిమతము లగుదుఃఖము, విదితముగ హిరణ్యకశిపవే స్వాహా య | 128 |
చ. | సరసిజసంభవుండు హరి శర్వుఁ డనంగఁ గలారె వేట యొ | 129 |
సీ. | భానుఁ బిల్పించి నాపంపునఁ బాయనితెరువరివై మీఁదఁ దిరుగు మనియె | |
గీ. | దనచరిత్రంబె వర్ణింపఁ బనిచె బహువి, ధేతిహాసపురాణార్థజాతి నెల్లఁ | 130 |
మ. | జముఁడై తాన సమస్తకర్మగతులున్ శాసించు శీతంబు నూ | 131 |
ఉ. | నేలయుఁ గొండలుం దిశలు నింగియు దీవులు నంబురాసులున్ | 132 |
వ. | ఇట్లు లోకపరమేశ్వరుం డగునసురేశ్వరుండు నిరంతరైశ్వర్యుండును, గురుభుజ | 133 |
క. | నీతులచేఁ ద్రోవఁడు దు, ర్ణీతునియుద్రేక మెసఁగి నిగిడినయెడ లో | 134 |
చ. | కడిఁదివరంబు వారిరుహగర్భునిచేఁ గొనినాఁడు వాఁడు మీ | 135 |
సీ. | సామంబుచే శత్రు సాధింత మంటిమా సామంబు ఖలునందు సేమమగునె | |
| దానంబు వశ్యవిధాయక మంటిమా మెల్లమెల్లను వాఁడు కొల్లగొనియె | |
గీ. | కానఁ జతురుపాంబులు కార్యసిద్ధి, జనకములు గావు మఱి చూడ సంధివిగ్ర | 136 |
క. | స్థానంబును వృద్ధియు న, ద్దానవపతియందు నంచితములైనవి దే | 137 |
వ. | స్వామ్యమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలంబు లనుసప్తాంగంబులు సుసంపన్నంబులై | 138 |
శా. | కామక్రోధమదాద్యమై నయసుహృద్గర్వంబులన్ గెల్వ నే | 139 |
క. | అజితాత్ము డైనయాతని, విజయంబును సిరియు విరియు వేగంబ శర | 140 |
మ. | దితిజుం డిప్పుడు కామరోషముల నుద్రేకించి లోకంబు దు | 141 |
క. | విజయాభిమానతృప్తు బ, హుజనద్విషుఁ గామసంవృతోన్మాదు వినో | 142 |
క. | తనుఁ దా నెఱుఁగనివానికిఁ, దనుఁ దా దండించుకొనిన తామసునకు నెం | 143 |
వ. | మనకు దైవంబు దాతయు వాసుదేవుండ మనకె యననేల యనేకబ్రహ్మాండకోటిజా | |
| పాదపద్మంబులు చేరి మనతెఱఁ గంతయు విన్నవింతము. మున్ను చెప్పితి. హరి | 144 |
మత్తకోకిల. | రండు పోదము లెండు వేగమ ప్రస్ఫురత్కులిశాయుధా | 145 |
వ. | అని సురలకు గురుండు వితథం బగునీతిపథంబున బరమహితం బుపదేశించె నని | 146 |
ఆశ్వాసాంతము
క. | శ్రీతులసీదళదామ, ద్యోతారుణహారికిరణయుతకౌస్తుభర | 147 |
భుజంగప్రయాతము. | మహాంభోధికల్లోలమాలావిలోల, న్మహాభోగిశయ్యాసనాక్రాంతకేళీ | 148 |
క. | వైకుంఠనాథ సమద, శ్రీకంఠగ్రహణనిపుణశీల విరించి | 149 |
స్రగ్విణి. | సత్యసత్యాకుచోత్సంగసంగప్రియా, మత్యమత్యంతరోన్ముక్తముక్తస్తుతా | 150 |
గద్య. | ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్యధుర్య | |