నీ సరి దైవము
సురటి రాగం - ఆదితాళం
మార్చుపల్లవి:
నీ సరి దైవము లేదని నామది నిన్నే నమ్మి నారా రామా ||
అనుపల్లవి:
భాసుర భుసుర పాలన మేలన వాఇగ నీ దాసుని
దయచే సుఖాప్తు జేయు రామ ||
చరణం 1:
నిండు భక్తి గలిగి ఎపుడు నిన్నే పొగడినారా రామ
మండన ఖండన మానిత మానుత అండగ నీవుండగ
మా పండగ ఏపట్ల రామ ||
చరణం 2:
అహరహము నీదు పుజలాశ జేతురా రామ
అహిత రహిత మహిత విహిత బహుధా నీ
మహిమ లెన్న ద్రుహిణు తరమె అహహ రామ ||
చరణం 3:
ప్రేమ మీర దసు శ్రీరామునేలరా రామ
కోమల భామల గోపక రూపక నీ మది నను ప్రేమ
గలిగి ఏమరక భరించు రామ ||