కొనిరి. ఇఁక నిట్టిదుష్కార్యములు సాగవని తలంచిరి. పిదపఁ దమ తమయిరవులకుం బోయిరి.


ఆఱవ వీచిక.

“ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచుక్ ధృత్యున్నతో శ్సాహులై ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్' గావున!".”

అని ప్రాచీనోక్తి కలదు. ఆనూ క్తి యే కాలమున నైనను మార్పునొందదనుట నిక్కునము. ఈ ర్యాళువులు సాధువుల మేలున కే కీడు గల్గింపఁ బూనుదురు. ఇది లోకముస సాధారణ ముగా సాగునాచావము. ఈ యాచారమునకు లోబడక యుండువారు లేదన రాదు విరళముగా గలరసవలయు. -ఈయాచారమును బాటించియే "కాఁబోలు పాళు నిబంధు వులు వాని కారాగార ప్ర వేశము మొదలుకొని లేఖల వాసి రారామదాసని కృష్ణదాసని లోనగు పేరులతో శ్రీవత్సాంకదాసు నకుఁ బంపసాగిరి. రాధిక ప్రవర్తనము మంచిక "కాదనియుఁ, బెక్కం డ్రామెకు నే స్తగాండ్రు, కలరనియు, మీవంటిమం"్యద గల కుటుంబముల వా కట్టికన్యకలను గోడండ్రగా గ్రహింప రాదనియు, సౌందర్యమునుబట్టి మీరు మోసపోయినను స్వల్ప కాలమునకే మీమర్యాద యూడిపోవుననియుఁ, దర్వాత విచారించిన లాభము లేదనియుఁ గొంత యాలో చించి ప్రయ త్నించిన మేలనియు, నందు వాయఁబడుచుండెను. రామ దాసు శ్రీనివాసదాసునకు మిత్రుడనియు, మీసంబంధమును ________________

ఆఱవ వీచిక. గోరియే యతఁడు పంపఁబడిన వాడనియు, వాని మాయా వాక్కుల నమ్మకయుండవలయుననియు, నింతకంటె విశేషించి. మీవంటి మర్యాదాభూషితులకు వ్రాయ నక్క ఱయుండ దనియు, మీసౌజన్యమును విన్న వారము కానఁ గళంకమురాఁ గూడదనునూహచేఁ దెలిపితిమనియు, మాయీ భావమును మీరు విశ్వసింపకయుండినఁ దర్వాత విచారింపవలసి వచ్చు ననియు, నొక్కొక్క లేఖయందుఁ గడుఁ జమత్కారముగా వ్రాయఁబడుచుండెను. ఈ లేఖలన్ని యు శ్రీవత్సాంకదాసునకుఁ బద్మావతి దేవికిని మిగుల విచారమును గలిగింపసా గెను. ఒక్కొక్కసారి యిందు నిజముండకపోవునా యనియు స్పురింప సాగెను. రామదాసుగారియందు నించుకసంశయము గలుగ సాగెను. పిలువని పేరంటముగా వచ్చుటకిదియే హేతువుండునా యనియు వారూహింపసాగిరి. రాధిక కు సంగీత చిత్ర, లేఖనములఁ గలకౌశలము దుష్ప్రవృత్తిని గలుగఁ జేయునదియే యగుటం బట్టి యామె మనకుఁ గోడలుగా నుండి మర్యాద కాపొడునో లేదో యని పలుసారు లనుమానింపసాగిరి. రామదాసున కీవిషయము గోచరించినను యథాపూర్వముగ నున్న ట్లే యుం డెను.

పదిదినము లిట్టియనుమానముల నాయిరువురు పరి తపించుచుఁ దుదకుఁ బరీక్షించి గాని వివాహమున కూఁకోన రాదని నిశ్చయించిరి. శ్రీకృష్ణదా సొకనాఁడు తనమిత్రుడగు శశిభూషణుని బిల్చి యీవిషయమంతయు నెఱిగించి విలాసథామమునకుం బోయి వేషాంతరమునఁ గొన్ని దినములుండి యథార్థ మెఱిఁగిరమ్ము. జాగరూకుఁడవై చరింపుము. నా ________________

నీతిరత్నాకరము మేలంతయు నీయదియేకదా యని యెంతయుం బ్రోత్సహించెను. శశిభూషణుఁడు విశ్వాసపాత్రుఁడు. సత్యహితుఁడు. పరోపకార నిపుణుఁడు. కావున శ్రీవత్సాంక దాసుని మనస్సంశయమును దొలఁగింప నెంచి సన్న్యాసి వేషమూని విలాస థామమున కరిగెను. నాలుగైదుదినములు పల్లియలలో సంచరించుచు నందందుఁ గారణాంతరములచే వారివార్తలరయుచు నిష్కళంక యశస్సును విని యానందించుచు విలాస థామమును జేరి సత్రములలో భుజించుచు వేషాంతరములఁ బూని సంతర్పణములలో దిరిగి భుజించుచు వార్తలురయుచుఁ బాతాళుని వ్యవహారమడిగి యా నెపమున రాధికా ప్రవృత్తిని బ్రశ్నించుచు దూషించునట్లు నటించి పాతాళుని పక్షమూని ప్రశ్నించుచు నెందఱినో యట్లు మాటలాడించుచు నొకపక్ష, మందుఁ గడపి శ్రీనివాసదాసు నింటికిం బోయి సన్న్యాసి గావున సులువుగ నాయింటం జోచ్చి సకల మర్యాదలొనరించి వా రెల్ల గారవింప నందే నాల్గు దినము లుండి సకలవిషయములఁ బరీక్షించి వారియనుమతి నోంది వారాణసికరుగుమార్గమునం బోయి మరలి జాలంధర పురమున కుం బోయెను

ఈనడుమ మాసము గడచెను. శ్రీనివాసదాసునకు నిందిరాదేవికి నీయభియోగ మూలమున ననుమానము తోచు నేమో యనుశంక శ్రీవత్సాంక దాసున కుదయించెను. వివాహ ప్రయత్నములు సాగించుట విరమించి యనవరత మాలోచింపసాగెను. ఇందిరాదేవియు విచారసాగర నిమగ్న యయ్యెను. రాధిక వెడవెడ నావిషయ మెఱింగి నరపా లయ్యెను. శశిభూషణుఁడు జలంధ రపురమును జేరి శ్రీవ ________________

ఆఱవ వీచిక. త్సాంక దాసుంగాంచి యేకాంతమున నెందో ఫూసగ్రుచ్చిన చందమున నావార్తల నన్నింటి నెఱిఁగించి ఘోర ప్రమాణముల నొనరించి వారి మనస్సంశయమును దుడిచి వేసెను. ఆమఱు దినమే రామదాసుగారితో నాలో చించి సుముహూర్తము నిశ్చయించిరి.

ఆమఱుదినమే పురోహితుని బంపిరి. ఆతఁడరిగి శ్రీనివాస దాసునకు జాలంధరనగర వార్తల నెఱింగించి యామువ్వుర చింతలం దొలఁగించెను. దాసాభూసురుని సంతుష్టుం జేసి శుభ ముహూర్తమును దెలిపిన నేను బురోహితుని బంపుదుననియు "రామదాసుగారు నిర్ణయీంచినదే ముహూర్తమనియుఁ దెల్పెను. ఆవార్తం గైకొని మరలి జాలంధర నగరమును జేరి గృహస్థ వర్యున కాసువార్తం దేలియఁజేసెను రామదాసు ముహూ ర్తము నిర్ణయించి శుభ దినమున విలాస ధామమునకుం బంపెను, శుభముహూర్తపుత్రికను జూచి యాదంపతులు మా నందమునొంది. విశేషించి వివాహ ప్రయత్నముల నొనరింప సాగిరి. నగరమంతయు నావివాహమహోత్సవమును గాంచఁ గోరుచున్న యట్టు లలంకరింపఁబడియెను. శక్తిక నురూపముగ నెల్ల వారును దమతమ గృహములకు ముందు రంభా స్తంభాదుల నిలుపుకొన ననువగునట్లు పందిరుల వేసికొనసాగిరి. అందందుఁ బాంథులకు ఫలాహారము లమరింపఁబడుచుండెను. ఏవిషయ మునను గ్రోత్త వారి కామహోత్సవసమయమునఁ గొదువ రాక యుండునట్టు లుచితరీతి సాయపడ నెల్ల రుత్సుకు లై యుండిరి. ________________

96 నీతిరత్నాకరము జాలంధర నగరమునుండి పెండ్లి కరుదెంచువారి కాయాయితావుల శీతలవితానముల నమరింప శ్రీనివాసదా నూహించి యట్లే యొనరించెను. ఆ పందిరులయందుఁ 'బానకము ఫలాహారములు శిశువుల కావుపాలు నొసంగునట్టియేర్పాటు చక్కగా నొనరించెను. యోజనమున కొక్క తావున సత్రములఁ బెట్టించెను. ఆయాయిజాతులకు వేఱువేఱు భోజనముల నమరించి తదధికారులు సిద్ధముగ నుండిరి. భోజనమునకు, సుపహారము నకుఁ గొదువరానీయరాదని దా సిట్టి ప్రయత్నముల నొనరించె నని యెల్లరు సంతసిల్లుచుండిరి. దూరమునుండి పండితులు రాఁ బ్రయత్నించుచుండిరి. కవులు గాయకులు పరిహాసకులు నర్తకులు సంఖ్య కుమిగిలి రాసాగిరి. నాలుగుదినములకు ముందే వచ్చిన వారి కెల్ల భోజనమునకుఁ గొదువ లేనియట్లు చాటింపఁబడియెను. వేలకు వేలుగా వచ్చిన వారినందఱ నొక చోటఁ దోలి యెట్లో యన్నము పెట్టిన శ్రమమెక్కుడగుటయే కాక వారలకుఁ దృప్తియుఁ గలుగదని యూహించి యైదువం దల కొక్కొక్క తావున భోజనమిడునట్టిపద్దతి నొనరించెను, దానుదారహృదయుఁడనియుఁ బరమా స్తికుఁడనియు నెల్లరు కనుఁగొనిరి. అంతియ కాక స్వహస్తపాకులకు నర్హ భవనములు నిర్ణయింపఁబడియెను. ఒక్కొక్క విషయమునకుఁ గొందఱు నుద్యోగుల నిర్ణయించి యించుకంతయు లోప మావిషయమున రానీయకుండఁ జేయవలయునని వారల హెచ్చరించెను.

తనసౌధమునకుముందు విశాలభాగము నావరించునట్టు లొకపందిరి వేయించెను. ఆయుతసంఖ్యాకు లందుఁ గూరు చుండ నర్హముగనుండ బీఠము లమర్పఁబడియెను. చుట్టును ________________

ఆఱవ వీచిక, నిలుచుండి కోలాహలము గావింపకుండ దాని వెలుపల నున్న తాసనము లుండఁజేసెను, రక్షకభటు లందందు నిలుచుండి నిశ్శబ్దముగా నుండఁజేయుటకు నేర్పఱచెను. ఆపందిరి విచిత్ర ముగా నలంకరింపఁబడియెను. చూచినది చూడకుండఁ జూచు చుండినను మూఁడుదినములు పట్టునట్లు చిత్రము లందుండెను. దానియె త్తిరువది బాహువులు. రామాయణ భారత భాగవతాది సద్గంథములచరిత్రము లన్నియుఁ జిత్రములయందే కనఁబడు చుండెను. ఆశిల్పమహిమము గొనియాడఁదగి విశ్వకర్మ నిర్మిత మాయనఁ దోఁపఁజేయుచుండెను.

జాలంధరనగరావతంసమునకు సుముహూర్తమునకు నొక్క దినముముందే దయచేయవలయునని శ్రీవత్సాంకదాసు నకు శుభలేఖలనంపి పురోహితుని సపత్ని కునిగా నంపెను. వా రచ్చటఁ జేరఁగనే యుచితమర్యాదల నెఱపి గారవించి బంధువులను హితులను రావించి సభ చేయించి శుభ లేఖఁ జది వించి యాశీర్వదించిన వారియక్ష తలను గైకొని యాపురో హితులను విశ్లేషించి గారవించి శ్రీవత్సాంకదాసు వివాహ ప్రయాణమునకు సంసిద్ధుఁ డయ్యెను. బంధువులు మిత్రులు పురోహితులు పరిజనులు ప్రయాణమునకు సంసిద్ధులైరి. ఉచిత వాహన శకటశిబి కాదు. లాయత్తము చేయఁబడియెను. శుభ దినమున శ్రీనివాసదాసపురోహితులు మార్గదర్శకు లగుచుండ మహోత్సవముగాఁ దరలిరి చతురంగయానములు బహువిధ శృంగారములఁ గైసేయఁబడియె. వానింజూడ మూఁగినజనుల సంఖ్య వచింప నలవిగాక యుండెను. ఆవివాహమును జూడ గోరిక కలదని తెల్పిన వారినెల్లఁ దోడుకోనిపోవ శ్రీవత్సాంక ________________

నీతిరత్నాకరము దాసు సంకల్పించినందున యాచకులు గాక మూడు వేల సంఖ్యకు మించినవారే ప్రయాణము సాగించిరి. అందందు విడుదుల నేర్పఱుప బ్రయత్నించెనుగాని యంతకు ముందే శ్రీనివాసదాసు వాని నేర్పఱచియున్న వార్త వినఁబడినందున నూరకుండెను. వారి శుభాగమనమున నాదరింప నున్న వారి యడంకువ కచ్చెరువందు వారిసంఖ్య యంతయని వచింప రాక యుండెను. ఎందు నిలువఁబూనిన నందే తగిన చలువ పందిరు లుండెను. దిగిన వెంటనే యాతిథేయసత్కారము లాచరిం తురు. భోజునాదులు మిక్కిలి కొనియాడఁదగిన ట్లుండును. మరల బయనముసాగించుటకుముందే యుపాహరము లమర్పఁ బడును. ఘోటకములకుఁ గూడ సుఖకరమగు ఘాసాద్యాహా రము సిద్ధముగ నుండును, పరిచారకుల కొనరిం చుసత్కార మే విచిత్రముగ నుండును. ఇంకఁ బెండ్లి వారి విషయమునఁ బ్రశ్నింప నవసర మేమియుండును?

కతిపయ ప్రయాణములకు విలాసధామ సమీపమును జేరఁగల్గిరి, అందొక రమ్యస్థానము నిర్మింపఁబడియుండెను. అందే వరపూజ చేయవలసినట్లు శ్రీనివాసదాసుగారి యాశయము. పెండ్లివా రచ్చటికి రాఁగా మంగళ వాద్యములు చెల రేగెను. కొందఱిదియే వివాహమందిరమని భ్రమ మొందిరి. అదొక పటకుటీరము. కుటీరమనుశబ్దమునకు సాధారణముగాఁ జెప్పు చున్న యర్థమున కది లక్ష్యముగాక యతివిశాల మై యున్నతమై హర్ష్య బ్రాంతిని గలిగించుచుండెను. అద్దానిం జేర రాఁగా వాద్య నిస్వనములు శ్రుతిహితములై శుభసూచకమ్ములై యొక్కుమ్మడి 'చెలఁగెను. అంతలోఁ గొందఱు ముత్తైదువులు ________________

ఆజవ వీచిక. ఫలకుసుమ కుంకుమ పరిమళవస్తు వ్రాతములఁ గైకొనియుఁ బురుషులు ఫలమంత్రాక్షతలఁ బూనియు నెదురుగఁ బోయి శ్రీకృష్ణ దాసును నాశీర్వదించి యతని జననీజనకుల బహూకరిం చిరి. అది వారియింటఁ గలమర్యాద. ఆయాచారము నడపి ప్రార్థించి వరునిం బూజించి తోడి తెచ్చిరి. అం దమర్పఁబడిన యున్న తాసనముల పై ఁ గూరుచుండఁ జేసిరి, హారతులెత్తి సువా సినులు దీవించిరి. విద్వాంసులు పెండ్లి కొడుకువు గమ్మని యాశీర్వ దించిరి.

అంతట శ్రీనివాసదాసు నిందిరా దేవియు నరు దెంచి కులో చితమర్యాదలం బాటించి కొంతతంతు నడపి విధివిహితముగ వరపూజ చేసిరి పాదములు కడుగుచు నాతని లక్ష్మీ నారాయణ స్వరూపునిగా భావించిరి. పిదప నొకరత్న హారము పురోహి శుఁడా శ్రీకృష్ణ దాసునికంఠమున వైచెను దాసు విహితపూజ లొనరించి కన్యాదానమును గైకొన రమ్మా యని యభ్యర్థిం చెను. పిదప వీరకానికి వీరకత్తియకును మర్యాదలు నడపిరి. వాద్యములు మ్రోఁగుచుండ వారవనితలు పాడుచుండ ద్విజ ప్రవరులు వేదమును బఠించుచుండఁ బ్రయాణము సాగించిరి. యానాధిరూఢులై కొందఱు పోయిరి. మందమందగమనముల విలాస ధామమును బ్ర వేశించి విడిదియింట వారినెల్ల నిలిపి వారి బంధుమి త్రాదులకుఁ దగినగృహములం జూపి యాయాయధి కారు లవ్వారికిం దగుసపర్యలు సలుపఁ గట్టుదిట్టములు చేసి శ్రీని వాసదాసు స్వగృహమునకుం బోయెను.

ఆరాత్రి యెల్లరకు క్షణకాల మట్లు తోఁచి గడచెను. ప్రతిగృహము వివాహమందికముగ నే తోఁపఁ జేయుచుండెను. ________________

100 నీతిరత్నాకరము తెల్ల వాఱుజాముననే మేల్కాంచి తమతమ విధుల నిర్వర్తించి కొని వాద్యధ్వనులఁ జెవియొగ్గి యాలించుచు జనులా పెండ్లి వేడుకలఁ జూడఁ గోరుచుండిరి. కన్యాదాతలు నభ్యంగస్నాన మొనరించి విధులందీర్చి లగ్నమునకై వేచియుండిరి. వరునిజన కులు కృతాభ్యంగస్నానులై కులాచారముల నయ్యై తెఱం గుల నిర్వర్తించి ముహూర్తమునకై కని పెట్టియుండిరి. ఇందిరా దేవియు శ్రీనివాసదాసును రామదాసయోగివర్యుం బురస్కరించుకొని సువాసినీ బృందము తోడ నడువ విప్ర ప్రవరులు వేదపారాయణము చేయుచు రాగా శుభ వాద్యధ్వనులు దిక్కులఁ బ్రతిధ్వనులీయఁ జేరవచ్చి వరునిఁ గులోచితమర్యా దలం దాటక పూజించి వరజననీజనకులఁ 'బ్రార్థించి శీఘ్రంబ యరు దెంచి సుముహూర్తమున నా వాంఛఁ దీర్పవలయునని పలుక నమృత పుసోనల మించిన యా నిద్దంపుఁబలుకుల నాలకించి యింతింత యనరాని సంతసంబున శ్రీవత్సాంక దాసు భార్యా పుత్ర పరివృతుండై సపరివారముగాఁ గదలి చని నిజపురోహి తో క్తమార్గంబు ననుసరించి కూరుచుండెను.

పాణిగ్రహణమహోత్సవము.

శుభముహూర్తము సమీపించెనని పురోహితుఁడు వక్కాణించెను. శుభ నినాదములు చెలరేఁ గెను. కన్యావరుల యంతరమున నొక నూతనాంబరమును బట్టుకొని నిలుచుండిరి. రాధిక యంతకుముందే సకలాభరణభూషితయై మహా లక్ష్కిం బూజించుచుండెను. కావునఁ బురోహితుఁడు తల్లిదం ద్రులుఁ జని స్వస్తీవాచనపూర్వకంబుగాఁ బిలుచుకొని వచ్చి, పశ్చిమాభిముఖము గలుగున ట్లుచితషీఠమునఁ గూరుచుండఁ ________________

ఆఱవ వీచిక. జేసిరి, మంగళ ప్రదము లగు గాథలు గలమంత్రములను శ్లోక ములను బఠించిరి. బ్రాహణ ప్రవరు లాశీర్వదించిరి. కన్యాదానము యథావిధిగ సాగెను. ఆయవనిక తొలఁగింపఁబడియె. వరుఁడు కన్యాముఖమును జక్కఁగాఁ జూచెను. అదియే ప్రథమ వీక్షణము. కావున నాతని మదింగల ప్రీతి యొక తేజోరూపమున నాకన్య కాహృదయమును దృష్టి మార్గమునఁ బ్రవేశిం చెను. కన్యామణి ప్రమదము నట్లె వరునిహృదయమును వీక్షణ మార్గమునఁ బ్రవేశించెను. ఆ ప్రీతి శాశ్వతమగుఁగాక యని పెద్ద లాశీర్వదించిరి. జీలకఱ్ఱయు బెల్లము కలిపి ముద్దఁ జేసి వరుఁడు కన్యామూర్దమద్యమున నున చెను. అదియే లగ్న మనఁబడును. తలఁ బ్రాలుగ మనోజ్ఞ తమమౌక్తికములఁ జేకొని రాధిక మనోహరుఁడగు శ్రీకృష్ణ దాసుమూర్ధమునఁ బోసెను. ఆతఁడట్లే దోసిటం గైకొని వానిని రాధికామ స్తకమునఁ బోసెను. మంగళసూత్ర ధారణాదులు క్రమము తప్పక సాగింపఁ బడెను. తలఁ బ్రాలు పోసినపిదప మహాత్తుల యాశీర్వచనార్థము వధూవరుల వరుసఁగాఁ గూరుచుండఁ బెట్టిరి. నిర్మలాంతః కరణులగు భూసురపుంగవులు లోనగువారు దంపతుల కీయిరు వురకును శ్రీలలనా ప్రాణనాథుఁడు సర్వమంగళా ప్రాణేశుఁడు సరస్వతీమనోహరుడు శచీనాయకుఁడు తక్కుంగల దేవతోత్త ములు నిరంతర సుఖానుభవదీర్ఘాయుర్బాగ్యముల నొసంగుచు రక్షింతురు గాక యని ద్రవ్యాభిలాషమున: గాక ప్రీతిమై నాశీర్వదించిరి.

ఆతరుణమున నామహాసభ భూసురేం ద్రాది నిబిడమై యుండెను. రామదాసయోగీంద్రుఁడు లేచి నిలువంబడియేను. ________________

102 నీతిరత్నాకరము వారి యమృతవాక్కుల వినఁ గుతూహలులై యుండువారు గాన నెల్లరు నిశ్శబ్దముగ నుండిరి. రామదాసిట్టు లుపన్యసించెను. నిర్మలాంతఃకరణ భూషితులారా ! పరోపకారపారీణులారా ! ఈమహోత్సవమును గుఱించి నాలుగుమాటలు చెప్పే దను చిత్తగింపుడు. కన్యాదానము చేయుపద్దతి యిది మీరు చూచితిరి గదా, సనాతనమగునది యీయాచారమే కన్య కను వివాహమునకన్న ముందు వరుఁడు కనుఁగొనరాదు. అతని తల్లిదండు, లే యామె కులశీలాదులఁ బరికింపవలయు. లోకమున భగవంతుఁడు తప్ప దక్కెనవారిలోఁ దలిదండ్రుల కంటె దనయుని మేలు కోరువారు లేరనుట నిర్వివాదాంశము. అట్టి తలిదండ్రులు పరికించి కులోద్దారకురాలు కాఁగలదని విశ్వసింప వలయు. ఆకన్యకను వరుఁడు వరింపవలయు. పాణి గ్రహణమున నొకవస్త్రము వరుసకుం గన్యకకునడుమఁ బట్టు కొనఁబడును. ఆవలఁ గన్యక తనకుఁ దగిన ట్లునుపఁబడిన పీఠ మునఁ గూరుచుండవలయు. పాణిగ్రహణము ననంతరము వస్త్రము తొలఁగింపఁబడును. అత్తరుణమునఁ దనయావజ్జీవ సుఖాకర యగుకన్యకను వరుఁడు చక్కఁగాఁ జూడవల యును. ఆవీక్షణమే పరస్పర ప్రీ తిరశ్ముల వారిని బంధించును. ఈసంబంధ మాజన్మ ము నిలుచునదియే కాని నడుమ విడి పోవునది 'కాదనుభావ మే వారికిం గల్గును. అట్టి ప్రీతి శాశ్వత ముగా నిలువక తప్పదు. ఒక్క రాజు పట్టాభిషిక్తుఁడు కాగా నాతనిపై మిగులఁ బ్రీతి యంతకుముందు లేకుయున్న నిఁక నీతఁడే మనకు ఱేఁడు. మన మీతనిరక్షణమున నుండక తప్పదు. అనుభావము దృఢపడఁగా ముందున్న యసూయ: ________________

ఆజవ వీచిక. తోలఁగును. వానినే విశ్వసించి మానవు లుందురు. ఈయుదు హరణము మీయనుభవమునఁ దోఁచునదే కానీ క్రోత్తగా గల్పింపఁబడినది కాదు కదా. అట్లే తనయావజ్జీవము సహధర్మ చారిణి యని ప్రేమించినకన్యను వరుఁడు రూపమునే ప్రధాన ముగా భావించిన ననర్థము వాటిల్లును. గుణము ప్రధానముగా భావింపవలయుననియే సనాతనాచారము తెల్పెడిని. అట్లుగాక వివాహమునకంటె ముందే సహచరసల్లాపాదులచే నాకన్యకనుబరి చితం జేసికొని ప్రేమించి పిదప వివాహము చేసికొనిన నా ప్రేమ మస్థిరమగుటయే కాక యనర్థదాయక మగుటకు సంశయం బే లేదు. ఒక్కనినే ప్రేమింపవలయునన్న నియమ మపు డుండదు. 'పెక్క డ్రఁబ్రేమించి యందెవ్వనిపై నతిశయ వాంఛ కలుగునో యాతనిం గన్యక 'పెండ్లియాడు నేని యద్దానిమనస్సు త్వరగా మాఱిపోవు ననుట య చ్చెరువును గల్పింపఁజాలదు. కావున వధూవరు లిరు వురును సద్గుణలుబ్ధులు కావలయును. రూపపరీక్ష, తల్లిదండ్రు లది. ఈయాచారము ననుసరించినవివాహము వధూవరులకు సదా సంతోషదాయకంబే యగు. పరస్పర సహకారమును వారు విడువఁజాలరు.

ఈసనాతనాచారము హేయమని యూహించి యిష్ట మునకు నను వగుకన్యను బెండ్లియాడవలయునని యీ కాలపు వారు విరళముగ నందం దుపన్యసించుచున్నారు కదా. ఒక్క నినే ప్రేమించుట యీ నూతనాచారమున సంభవింపదు. ఎంద ఱినో పరీక్షించి యం దుత్తము నొక్కనిఁ బెండ్లియాడవలసి యుండును. అట్టి స్త్రీ చిత్తము పలుతావులఁ బ్రసరించినదగుటం ________________

101 నీతిరత్నాకరము జేసి యొక్క తావుననే నిలుచుననుట విశ్వసింపఁ దగనిమాట. వరునిచి త్తము నట్లే యని నిశ్చయింపవలసి యుండును.

ఇటీవలఁ గొందఱు కొంతలు పెండ్లియాడినపిదప నాతని వదలి వేఱోకనింగూడి చరించుచు నితరులను, దమమా ర్గము నుపదేశించుచు సభలకు, విలజ్జం బోవుచుఁ బురుషులని యనుమానింపక మాటలాడుచుఁ గరము వై దుష్యము నగ పఱచుచు వారి నవ్వించుచుఁ బ్రాచీనాచారములం దూలనా డుచుఁ బ్రవర్తించుచున్న వారని వినవ చ్చెడిని. అది కరము చింతాకరము! పరిశుద్దాంతరంగులకు మిగుల సంతాపకరము. పరపురుషునిం గూడితిరుగుట యెంతి మంచిదో నే: జెప్పనక్కఱ లేదు.*[1] వయసుక త్తియ వయసు కానిం గూడి తిరుగుట భారత భూమి నీవఱకు 'లేదనియు, నిప్పుడు కొత్త గా నచ్చినయా చాన మనియు, మీరు నేఱుంగుదురు. చంద్రమతి, దమయంతి, సీతాది సాధ్వీమణులు జన్మించిన యీపవిత్ర భూమియం దీయాచారము ప్రాంతది కాదని నేఁ జెప్పనేల? శాపాను గ్రహసామర్థ్యము వెలయ నీభూమిని బొడమిన స్త్రీ పురుషులు ప్రసిద్ధి గాంచిరి. మనశ్శుద్ధివినాశనం బగు నీయాచారము నవీనముగాఁ బొడ చూపుచున్నది. ఆమార్గము స్వేచ్ఛా ప్రవర్తకుల కత్యంతాను కూలముగా నుండుటంబట్టి కాబోలు కొంద ఱీయాచారమే మంచిదనుచున్నారనియు, దానినే యనుసరింపఁ బ్రయత్నించు చున్న వారనియు వినుచున్నాఁడను. ఈయాచారమే క్రమ క్రమముగ వృద్ధియైనచోఁ బ్రాచీనసదాచారము లడుగంటి స్వేచ్ఛాచారములు ప్రబలును. దాన సత్యము ధర్మము నశించును. అసత్యాధర్మములు పెంపొందును. వివాహధర్మము తుదముట్టం జెడును. సహధర్మ చారిణి యను పేరు భార్యకుంజెల్లదు. దాంపత్య సుఖము కూడఁ జెడఁగలదు. పరపురుష సంగతిన్ మెలంగుట యుత్తమ స్త్రీ ధర్మంబు గాదను సృతి పురాణేతిహాసములు వ్యర్థములగు. ఏనాఁ డాభావము మానవులమదుల వ్యాపించునో యానాఁడే కలిపురుషుఁడు తాండవ మాడునని నమ్మవలయును.

మహాజనులారా! [2]సత్కర్మముల నుమ్మాలించిన భగవంతుఁడు దూరమగును. కులకాంతలు దుష్టలగుదురు. దాన వర్ల సంకరము గలుగు, అయ్యది నరక ప్రాప్తి హేతువగును . పితరులు లుప్తపిండోదక క్రియు లగుదురు. విశేషించి స్త్రీలు ________________

106 నీతిరత్నాకరము ప్రపంచవృద్ది హేతుభూతలు. కావున స్త్రీల మనస్సులు దుష్టములు కాకయుండఁ గాపాడవలయును. కులమును, జరిత్ర మును, దనను, సంతానమును, ధర్మమును గాపాడుకొనఁ దలఁచువాఁడు పరపురుషసంగతిఁ బోనీకయుండ భార్యను రక్షింపవలయును. లేనిచో నివి యన్ని యు దుష్టములవు. కావుననే పెద్దలు యోగదృష్టం బరికించి ధర్మములను యుగముల కనుకూలములుగా మార్చిరి. భగవంతునియందు భక్తి గలుగుమార్గముల సులభముగాఁ దెలిపిరి. వానినెల్ల నీనూతనా చారములు పాడుచేయును.

ఈవివాహము ప్రాచీన సదాచారము సనుసరించి చేయఁబడినది. వధూవరు లన్యోన్య ప్రీతి గలిగి మీ యమో ఘాశిషములమూలమునఁ బరమేశ్వరుకరుణకుం బాత్రులై దీర్ఘాయురారోగ్యములఁ గాంతురు గాక. సర్వేశ్వరునను గ్రహమున సనాతనధర్మము, తదనుగుణము లగునాచారములు నశిం పక యథాపూర్వముగా నుండుఁగాక. మీరందఱు మన్వాది సృతులయుఁ బురాణములయు, మహాభారతా దీతిహాసము లయు ధర్మములను వదలక యాచరించుచు, దురాత్ములయుప దేశముల, నుపన్యాసముల నాలకించి మోసపోవక వారు స్వేచ్ఛా ప్రవర్తకులని లోకమున గౌరవమునే కోరువారని, శాస్త్రములతత్త్వముల నెఱుంగనివారని కేవల యుక్తివాదు లని, ఆ స్తికులభంగిఁ దోచు నాస్తికులని నిశ్చయించి వారికి దూరముగాఁ దొలంగియుండవలయును. వారితో విశేషించి సంభాషింపరాదు. వారియుక్తుల విని యిందే మేని 'మేలుం డునా యని యాలోచింపరాదు. వారిం జేరి భాషింపఁ బూన ________________

ఆజన వీచిక. రాదు, వారికిని దైవము తోడ్పడునని మనమించు కేఁ దలంప రాదు. వారికి భగవద్గీత లుపన్యాసముల కుపయోగించుననియే నిశ్చయింపవలయును. ఈ నాలుగుమాటలు మీకుఁ దెలుపు టనవసర మే యైనను వచ్చియున్నా ఁడఁ గానఁ జెప్పితిని మను జులసంసర్గమునే మాని యందందు నిర్ణనస్థలముల నివసించుచు భగవన్నా మసంకీర్తనము చేయుచునుండిన నేనీ కాలమునఁ బ్ర బలిన దురూహలననుసరించి ప్రాచీనసదాచారముల మానుడు రేమో యన్న సందియమున వచ్చి లోకమున కుదాహరణ భూతులగు నీసజ్జనుల ప్రయత్న మునకుఁ దోడ్పడ నరుదెంచి తిని. ప్రాజ్ఞులారా ! మీ రెఱుంగని విషయములు లేవు. మీరు చదువనిశాస్త్రములు లేవు. మీ రాచరింప నిధర్మములు లేవు. మీ రభ్యసింపని యోగములు లేవు. మీకుఁ దోఁపని యూహలు లేవు. ఐనను వాక్చావలమున నామనస్సునఁ గల యభి ప్రాయమును దాఁపక వెలిపుచ్చితిని. మీ రెల్లరు సమా హితచిత్తులరై , యాలకించితిరి. ఇక నేను మీయనుజ్ఞఁగైకొనఁ దలఁచుచున్నా ఁడను. తరణోపాయము దొరకక భగ వంతు నాశ్రయించినఁ దనంతన తానే దొరకునని నమ్మియున్నాఁ డను.

అని యుపన్యసించి రామదాసు కూరుచుండెను. ఆమహో' పన్యాసము నాలకించి గంభీరమగు తదగ్గమును గ్రహించి సామా న్యులుకూడఁ బరమానందభరితు లైరన నిఁకఁ బండితులమాట నిటఁ జెప్ప నేటికి ? వారు కూరుచుండఁగనే మీయభి ప్రాయము సత్యధర్మ విహితము. అని యేక వాక్యముగఁ దమ మనోభావ ములఁ దెల్ఫిరి మఱియు నెవ్వరెవ్వరు సనాతనసదాచాలనిర్మూల ________________

103 నీతిరత్నాకరము నము చేయఁ బ్రయత్నింతురో వారిని దమజాతినుండి వెడల నడువఁ దీర్మానము గావించిరి. వివాహాదులయందుఁ గలకట్టు బాటుల సడలింపరాదనియు వానివలనిలాభములు వాజ్ఞానస గోచరములు సామాన్యులకుఁ గావనియుఁ దప్పక యెంతో మేలు వానివలనఁ గలదనియు నతీంద్రియజ్ఞు లాశుభముల నెఱింగియే వాని నియమించిర నియు నట్టివాని నల్పజ్ఞులు సడలింపఁ బ్రయ త్నించిన వారిభావముల మన మంగీకరింప రాదనియు నెల్లరు తీర్మానించిరి.

ఆపిదప సాగవలసిన వివాహతంత్రములు సాగింగఁ బడియెను. సకాలమున ముహూర్తము జరపబడుటయుఁ బెద్ద లాశీర్వదించుటయుఁ జూచువాల కెంతో యామోదమును గలిగింపఁజా లెను. శ్రీనివాసదాసు వచ్చిన పెద్దల బహూకరించి చందన తాంబూలముల నొసంగి రామదాసు గారిని గృహప్రవే శము దనుక నుండి ఫోవలయునని ప్రార్థించి వారందుల కను మతింప నెల్లరను భోజనములు సేయ నాయాయి చోటులకు దయ చేయుఁడని ప్రార్థించెను. ఎల్లరు తమతమ విడుదులకుం బోయిరి, వధూవరుల కాపగలు భోజనము లేకుండుట యాచారము. అరుంధతీ దర్శనానంతరము భుజింప వలయునని పెద్దలయాశ యము. ఆ యాచారము ననుసరించి వారు ఫలాహారములం గైకొనియుండిరి.

వచ్చిన వా రెల్ల భుజించి సంతృప్తి మిగులం గాంచి యిం చుక విశ్రమించి సాయంసమయమునకు ముందే కార్య క్రమము 'నెఱింగిన వారు 'గానఁ 'బెండ్లి పందిరి కరుదెంచిరి అందాసమయమున నాట్యము సాగును. వారకాంతలు వచ్చి యల్ల రకు నమ ________________

ఆఱవ వీచిక. 109 స్కరించి వారియనుమతినొంది యభినయమున కారంభించుచు,

శ్లో. *[3] దేవః సాయాత్సయసివిమలే యాము నేమజ్జతీనాం
యాచంతీ నామనునయపదైరంచి తాన్యంశుకాని,
లజ్జాలో లైరలసవిల సైరున్మి షత్పంచబాణై
ర్గోపస్త్రీణాం నయనకుసు మైరర్చితః కేశవోనః.”

అను శ్రీకృష్ణకర్ణామృతశ్లోకమును బఠించెను. దానిని విని, నంతన సభ్యులు సంసారముల మఱచి శ్రీకృష్ణ ధ్యానతత్పరు లైరి అంత నా కాంతావతంసము తదర్ధమును జెప్పకుండ నేత్రములను హస్తములను గదలించుచు విధినతిక్ర మింపక దానఁ గలభావ మెల్లఁ గనఁబఱచెను. “నయనకుసుమైః" అనుపదము నభినయించునపుడు సభ్యులయాశ్చర్యము వర్ణనాతీతమయి యుండెను. అభినయానంతర మాయిందుముఖి భక్తిభావము నెల్లరుం గొనియాడిరి. ఆ రేయి భుక్త్యనంతరము హరికథ సాగెను రుక్మి ణీకల్యాణకథను దెలుపుచు నా దాసునెల్లర విస్మిత. చిత్తులనుగా నొనరించెను. ఈరీతిగా నాయాయి వినోదముల నైదుదినములు సుఖముగా గడచెను.

విద్వత్కవి ప్రభృతుల నుచితరీతి సమ్మానించి శ్రీనివాస దాసు పాత్రాపాత్ర వివేకముగలవాఁ డనుఖ్యాతికిం బాత్రుఁ డయ్యేను. తదనంతరము జాలంధర పురమునకు గృహ ప్రవేశ మనుకార్యమున కెల్లరు దయచేయవలయునని శ్రీవత్సాంకదాసు ప్రార్ధింప బంధుహిత పండితాదు లెల్లరు నచ్చటికిఁ బయనము సాగించిరి. వచ్చునపు డెట్టియుపచారముల మార్గమున శ్రీనివాసదాసేర్పఱచి యుండెనో యట్టి యుపచారములు చేయ శ్రీవత్సాంకదాసు మఱుపయనమున నేర్పాటుచేసెను. వీసమంతయు నావిషయమున భేదము గానరాక యుండెను. కతిపయ ప్రయాణముల జాలంధరపురమును బ్రవేశించి శుభముహూర్తమున గృహప్రవేశ శుభకార్యమును జరపించిరి. మూఁడుదినము లందెల్లవారు నుండిరి. ఎల్లర నాదాసు సుచిత విధుల బహూకరించెను. ఎల్లరుఁ బరమసంతుష్టమానసులై తమతమ గ్రామములకు వారి కీర్తియశస్సులం బొగడుచుఁ బోయిరి. అల్లునిం గూఁతును బిలుచుకొని శ్రీనివాసదాసు విలాసధామమున కరుదెంచెను. కొన్ని దినములుండి శ్రీకృష్ణదాసు ధర్మపత్నిం దోడుకొని తండ్రియానతిమెయి నిజపురమున కరిగెను. ఈ రెండువంశము లాదంపతులపై నాధారపడి యున్నందున గొంతకాలము జలంధరపురమునను గొంతకాలము విలాసధామమునను వా రుభయులు నివసించుచుఁ దల్లిదండ్రులకు నత్తమాములకు మహోత్సవమును గలిగించుచు రాధికా శ్రీకృష్ణదాసులు పరోపకార తత్పరులై న్యాయార్జితవిత్తులై సుజనరంజనులై శాంతభూషణులై యన్యోన్యానురాగము వర్దిల్ల వర్తిల్లుచుండిరి. రాధిక యక్కాలపుఁ బురంద్రీమణుల కుదాహరణభూతయై విద్యావినయముల విఖ్యాతింగాంచి సహధర్మచారిణి యను పేరు సార్థకమగునట్లు ప్రవర్తించుచుండెను. శ్రీకృష్ణదాసు రాధిక యనుమతింగొని చేయందగు కార్యముల నొనరించుచుఁ బ్రసిద్ధినొందెను. నాలుగు దేశములయందును వారి ప్రఖ్యాతి వ్యాపించెను. భగవంతునియందు భక్తి, జననీజనకులయందుఁ బ్రీతి, ఆశ్రితులయందు వాత్సల్యము గలిగి రాధికయు శ్రీకృష్ణ దాసును సుఖసంపదల ననుభవించుచుండిరి.

శ్రీరాధామాధవార్పణమస్తు.

శ్రీ శ్రీ శ్రీ




చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి

'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము—1939.

  1. * ఒక్క నిఁ బెండ్లియాడి మఱియొక్కని సుందరకాయుఁ గూడి యే దిక్కు నఁజూడఁ దానయము తేటపడం దగుమాటలాడుచున్ మిక్కిలి నేర్పుకత్తెయన మించి చరించుచుచున్నఁ జూచి "పెక్ మక్కువ నాదరింతు రిది మంచిది గా దన 'రేమి కాలమా.”-కలివిలాసము.
  2. ఆధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః, స్త్రీషు దుష్టాను వార్షేయ జాయతే వర్ణసంకరః, సంకరోనరకాయైన కులఘ్నానాం కులస్య చ, పతంతి పితరో "హ్యేషాం లుప్తపిండోదక క్రియాః, భగవద్గీత ౧ అధ్యా. యాదృశం భజతే హి స్త్రీ సుతం సూతే తథావిధం, తస్మాత్ప్ర జా విశుధ్యర్థం స్త్రియం రక్షేత్ప్రయత్నతః. స్వాం ప్రసూతిం చరిత్రం చ కులమాత్మాన మే వచ, స్వం చ ధర్మం ప్రయత్నేన జాయాం రక్షన్ హి రక్షతి. మనుస్మృతి ౯ అధ్యాయము.
  3. * "యమునా వేణికయంచు గోపికలు నీరాడ స్వకీయాంశుకా ఘముల జ్" దాఁచఁగ సిగ్గుచే మృదులవాక్య ప్రౌఢితో వేడుకర్, సముదంచన్మ చనాలసోల్లననిరీక్షా నీలనీ రేజమా ల్యములక్ వారలు పూజచేయఁదగునయ్యబ్జాక్షు సేవించెదన్ .”