నారదీయపురాణము/చతుర్థాశ్వాసము

శ్రీ

నారదీయపురాణము

చతుర్థాశ్వాసము

క.

శ్రీమన్నాగ్నజితీప్రే
మామోదాంభోధిపూర్ణిమాంబుజహరసు
త్రామసుతసూతకృత్యభి
ధాముహురాఖ్యాతపుణ్యదాక్షిణ్యగుణా!

1


వ.

అవధరింపుము నైమిశారణ్యవాసులగు మహామునీంద్రులకు సూతుండు
మఱియు నిట్లనియె. మున్ను మాంధాత వసిష్ఠు నడిగిన యేకాదశీ
వ్రతంబు మీకు నెఱింగించెద వినుండు.

2


క.

ఏపున శుష్కార్ద్రములౌ
పాపేంధనకోటులెల్ల భస్మము సేయన్
దీపించు వహ్ని యెయ్యది
తాపసకులనాథ! తెలుపు దయతో మాకున్.

3


సీ.

మూఁడులోకంబుల మునినాథ నీ వెఱుం
                       గనియది లేదు నిక్కముగఁ ద్రివిధ
కర్మ నిశ్చితము విఖ్యాతిమైనఙ్ఞాత
                       కలుషంబు లెంచ శుష్కములు జ్ఞాత
కలుషంబు లార్ద్రముల్గా విన్నవించితి
                       వార్త కెక్క నతీతవర్తమాన
భావికాలోచితపాపేంధనంబు లే
                       వహ్నిచే నడఁగుఁ బావనచరిత్ర


తే. గీ.

యనిన హరివాసరము నియతాత్మ మనుజుఁ
డుపవసించి హరి భజించి యుచితభక్తిఁ
గాంచి నిశినెల్లఁ దా మేలుకాంచి ధనము
జూదరియుఁ బోలెఁ బాతకస్తోమ మడఁచు.

4

వ.

వినుము రాజేంద్రా! ఏకాదశీసముద్భవానలంబుచే జన్మశతోద్భవంబు
లైన పాతకేంధనంబులు భస్మంబగు. హరిదివసంబువంటి దివసంబు
లేదు. హరివాసరంబున నుపవసించు తన కనేక[1]దేహంబుల పాపంబు
లుడుగు. హరివాసరోపవాసషోడశాంశంబునకు నశ్వమేధ
సహస్రంబులు వాజపేయశతంబులు సమంబులు గావు. హరివాస
రోపవాసంబున నేకాదశేంద్రియకృతపాపంబులన్నియు నాశంబు
నొందు. హరివాసరసమంబుగాఁ బాపంబులవలన రక్షించునది
యొక్కటి లేదు. ఒక్కొక్కవ్యాజంబున హరివాసరోపవాస మాచ
రించి దండధరునిం జూడఁడు. స్వర్గమోక్షప్రదంబును, శరీరారోగ్య
కరంబును, సుకళత్రసుపుత్రలాభకారణంబును[2] నగు. మఱియును.

5


క.

కురుగంగాకాశీపు
ష్కరరేవావేణికావికర్తనతనయా
సరయూగయాదితీర్థము
లరయన్ సరి యనఁగఁ దగునె హరిదినమునకున్.

6


మ.

అవనీనాయక! కల్గు లోకుల కనాయాసంబునన్ నేఁడు వై
ష్ణవధామం బుపవాసజాగరము లిచ్చంజేయ నేకాదశిన్
సవిశేషంబుగ మాతృపక్ష పితృపక్ష స్వప్రియాపక్ష వం
శవతంసంబులు వార్తగాఁ బదియు మోక్షం బందుఁ దానుం దగున్.

7


క.

ఏకాదశి చింతామణి
యేకాదశి కామధేను వింద్రమహీజం
బేకాదశి మోక్షప్రద
మేకాదశి వేదమార్గ మేకాదశియే.

8


శా.

ద్వాదశ్యుత్సవ మాచరించు నరుఁడు ద్యద్దోశ్చతుష్కంబుతోఁ
గాదే నాహితదివ్యవాహనముతోఁ గౌశేయవస్త్రంబుతో
నాదిత్యుల్ గొనియాడ నాహరిపురోదంచన్మణీవేదికన్
మోదం బందుచునుండు వైష్ణవసభాముఖ్యుల్ ప్రశంసింపఁగన్.

9

క.

హరివాసరోపవాసాం
తరమున జన్మాంతరములఁ దరలని పాపాం
తరము[3]లు జననీగర్భాం
తరవిణ్మూత్రాదిలిప్తతయుఁ దొలఁగు ధరన్.

10


వ.

ఈప్రశ్నంబె నైమిశారణ్యవాసులు వ్యాసశిష్యుండగు సూతునిం జూచి
మహాభారతంబు మొదలుకొని యష్టాదశపురాణంబులు నీ వెఱుంగనివి
లేవు. వేదశాస్త్రపురాణస్మృతులందు లేనిది యెద్దియును లేదు. కావున
సర్వంబును నీ వెఱుంగుదువు. మాహృదయంబుల నింత సంశ
యం బున్నది. తత్సంశయంబు దీర విస్తరంబున నెఱింగింపు. తిథి
ప్రాంతంబున నుపవసింపవలయునో? తిథిమూలంబున నుపవసింప
వలయునో? అందు దేవపితృకార్యంబులకు నుపయోగించినయవి
యెఱింగింపవే [4]యని యడిగిన నాసూతుండు శౌనకాదుల కిట్లనియె.
తిథ్యంతంబున దేవపితృహితంబుగా నుపవసింపవలయు. తిథి
మూలంబునఁ బైతృకం బాచరింప[5]వలయు.

11

తిథిఫలనిర్ణయము

ఆ. వె.

సాధు లాద్వితీయషష్ఠియష్టమి భూత
తిథి హరిదివసములఁ దెలిసి పూర్వ
విద్ధయైన దాని [6]విడువనగుఁ ద్రివర్గ
కాంక్షు లుపవసింపఁ గాదు ధరను.

12


సీ.

వాసిగాఁ బ్రాతి సాంవత్సరీకదశమి
                       పౌర్ణమాసీదరశిభవ్యతిథులు
పూర్వవిద్ధములైనఁ బూని సేయఁగఁ దగు
                       నట సేయకుండిన నతఁడు ఘోర
నరకంబులందు నానావిధహానియు
                       సంతతిచ్ఛేద మత్యంతదురిత
దౌర్భాగ్యములఁ జెందుఁ దప్పదు మున్నంచు
                       ద్వైపాయనుండు తథ్యముగఁ బలికె

తే. గీ.

వెలయ నాదిత్యుఁ డుదయించువేళయందు
నింతయేనియుఁ దిథి గల్గెనేని యదియె
పూర్ణయగు [7]నుదయముఁ బాసి పూర్ణయైన
యదయ పూర్ణయ కాఁజూడుఁ డనఘులార!

13


వ.

పారణంబునకు మరణంబునకుం దత్కాలతిథి కర్తవ్యము. పైతృ
కంబునకు నస్తమయస్పృక్కైన తిథి కర్తవ్యము. పైతృకకర్మంబున
కుదయతిథి గ్రాహ్యంబు కాదు. కావున మౌహూర్తికులవలనఁ దిథి
శోధింపవలయు. తిథికిఁ బ్రమాణంబులు సూర్యచంద్రులు. పూర్వవిద్ధ
యైన నుపవసింపఁదగదు. స్నానపూజనంబులు యామచతుష్కంబు
వర్జించి దానకర్మంబులన్నియు శర్వరీ[8]ముఖంబునఁ జేయవలయు
నిది యుపవాసవిధిప్రకారంబు.

14


క.

ద్వాదశి యల్పమయిన నరు
ణోదయమున లేచి స్నానహోమార్చనదా
నాదికము సేయఁదగు నా
వేదజ్ఞుల కెల్ల ధర్మవృత్తి యెసంగన్.

15


క.

శుద్ధిఁ ద్రయోదశి సత్క
ర్మోద్దతిఁ బారణ యొనర్చి [9]యురుధాత్రీదా
నోద్ధత బల మున్నతయ
జ్ఞోద్దరణబలంబు మనుజుఁ డొందుచు నుండున్.

16


సీ.

[10]అదిగాన ద్వాదశి యల్పమయినను స్నా
                       నపితృతర్పణము లెన్నంగ నాడి
జరపి తద్ద్వాదశి సాధింపవలయు సా
                       ధింపకుండిన మహోదీర్ణవర్ణ
[11]హానియు నిజధర్మహానియు నగు సమ
                       గ్రముగ నస్నాతసరస్వతిగతి
భూరిదోషంబులు పుట్టిన నణఁగించి
                       వర్తించు శ్రీహరివాసరంబు

తే. గీ.

నకును ద్వాదశియే మహోన్నతఫలప్ర
దయగు [12]వృద్ధిదినక్షయాంతరములందు
నపరిమితభక్తి ద్వాదశియందు నుపవ
సింపఁగాఁ దగు విద్ధ వర్జింపవలయు.

17


వ.

మఱియు ద్వాదశి పూర్వసంయుతమై యొప్పుచుండునప్పు డుపవా
సంబు నరులెల్లం జేయవలయు నన నుపవాసదినము పూర్వవిద్ధయై
ద్వితీయదినము నందు లేకయుండిన నేకాదశి [13]యె ట్లాచరింపవలయు
ననిన సూతుం డిట్లనియె.

18


తే. గీ.

ద్వాదశీ[14]దినమునఁ బూర్వవాసరంబు
నందు నేనియు సూర్యచక్రార్ధమాత్ర
మొందినను బరదినమున నుపవసింప
యుక్తమై యుండు సజ్జను లుల్లసిల్ల.

19


వ.

అనేకాగమవిరోధంబులు నైన నేమి? బ్రాహ్మణులు వివాదించిన నేమి?
ద్వాదశ్యుపవాసంబునుం ద్రయోదశిపారణయుం జేయవలయు.

20


తే. గీ.

అరయ నేకాదశి యవిద్ధ యైననేని
శ్రవణమునఁ గూడి పాపసంక్షయ మొనర్చు
నట్టి ద్వాదశి యుపవాస మందవలయు
ఘనతమై శుక్లకృష్ణపక్షములయందు.

21


వ.

ఏకాదశీ[15]ద్వాదశీనిర్ణయంబు తెలిపితి మఱియుం దెలియవలయునవి
యడుగుం డనిన ఋషులు యుగాదినిర్ణయం బడిగిన సూతుం
డిట్లనియె.

22

యుగాదినిర్ణయము

సీ.

అనఘాత్ములార! యుగాదులు శుక్లప
                       క్షమునందుఁ గృష్ణపక్షంబునందు
రెండు రెండనఁగ వర్తిల్లు వైశాఖశు
                       క్లతృతీయ[16]యుం గార్తికసితపక్ష

నవమి నభస్య కృష్ణత్రయోదశి మాఘ
                       [17]పంచదశమియును బావనములు
గ్రాహ్యంబు శుక్లపక్షమునఁ బౌర్వాహ్నిక
                       మాపరాహ్ణికము గ్రాహ్యంబు కృష్ణ


తే. గీ.

[18]పక్షమున నయనము దినభాగకంబు
సంక్రమణము షోడశాంశంబు నదియె
నిది యెఱింగి బుధోత్తము లెల్ల సకల
దానములు సేయవలయు ననూనమహిమ.

23


తే. గీ.

ఉత్తరాయణ ముడిగి సూర్యుండు వేగ
దక్షిణాయనమున కేఁగుతఱి మెలంగు
మధ్యకాలంబు విషమమై మహిఁ జెలంగు
నదియె ముక్తకనామధేయము వహించు.

24


మ.

తిథి సాంవత్సరికోపదేశమున బుద్ధిం జాల శోధించి సు
ప్రథితశ్రీ నుపవాస మున్న నగు ధర్మంబున్ శుభంబున్ మనో
రథముల్ సద్గతులున్, మహాదురితచర్యం బూర్వసంవిద్ధయౌ
[19]తిథియందే యుపవాసమున్నఁ గలదే తేజంబు పుణ్యస్థితుల్.

25


తే. గీ.

ఉత్తమోత్తమమైన గంగోదకంబు
నందు సురబిందుమాత్రంబు నందెనేని
యతిపవిత్రంబు గాని యట్లయ్యె దశమి
హరిదినమునఁ గళామాత్ర మంటెనేని.

26


తే. గీ.

ఉభయపక్షముల మహోత్తముండగు కుశ
కేతుఁ డఖిలదనుజజాతి యాత్మఁ
బొంగి సన్నుతింపఁ బూర్వవిద్ధములైన
తిథుల నుపవసింపఁ దెలిపె మున్ను.

27

సీ.

తర్కింపఁగ నకాలదత్త మపాత్ర[20]
                       త్తం బసత్కాలదత్తంబు క్రోధ
దత్తంబు పూర్వవిద్ధతిథిదత్తంబు ను
                       చ్ఛిష్టదత్తంబు[21]ను శ్రితజనైక
దత్తంబు పతితదత్తం బేకవస్త్రతా
                       దత్తంబు జలవరదత్త మగ్ర
కీర్తన దత్తంబు కేవలాసురజన
                       ప్రీతికరంబు ధాత్రీస్థలమున


తే. గీ.

నట్లు గావున విద్ధమౌ హరిదినమున
[22]నుపవసించినఁ బూర్వపుణ్యోత్కరంబు
లణఁగు వృషలీపతి యొనర్చినట్టి శ్రాద్ధ
కర్మమును బోలె సకలలోకములు నెఱుఁగ.

28


తే. గీ.

చక్రధరనామకీర్తి నస్తవనభజన
జప్తదత్తహృతస్నాతసవన[23]ముఖ్య
ములును బోవుఁ దిథినివేధమున మహోద్భ
టాంధతమసంబు సూర్యోదయమునఁ బోలె.

29


క.

ముదిసిన మగనిన్ యౌవన
మదవతులై యున్న సతులు మనసిజకేలిన్
గదియని యట్లనే వేదా
స్పదమగు తిథియందు ధర్మసంఘము దొలఁగున్.

30


వ.

అనిన విని ఋషులు శ్రీభగవదారాధనక్రియ విస్తరంబున నెఱింగింపు
మెందున హరి ప్రసన్నుండై సమీహితంబు లిచ్చుననిన సూతుండు
భక్తియే ప్రధానంబు. భక్తియుక్తుండై జడుండేని భగవంతుం బూజిం
చినఁ గ్లేశంబు లణంగు. తృష నొందినవాఁడు జలంబునఁ దృప్తుండైన
కరణిఁ బూజించినమాత్రనె హరి పరితోషంబు నొందు. నిందునకుఁ
బాపనాశనంబగు ఋషిగౌతమసంవాదంబునందు నైన రుక్మాంగదో
పాఖ్యానంబు విన్నవించెద వినుండు.

31

ఏకాదశీమాహాత్మ్యము

తే. గీ.

జగతి రుక్మాంగదక్షితీశ్వరుఁడు ధర్మ
పరుఁడు గలఁ డొక్కరుఁడు విష్ణుభజనశక్తి
ఘనుఁడు తచ్చక్రహస్తునిగాని యన్య
దేవత భజియింపఁడు రాజతిలకుఁ డెలమి.

32


శా.

చాటించెన్ [24]మదహస్తిపైఁ బటహ ముచ్చైర్ఘోషమైయుండ ది
గ్వాటుల్ ఘూర్ణిల నానృపాలకుఁడు గర్జద్దుర్మతశ్రేణి ను
ద్ఘాటించెన్ హరివాసరంబునను భుక్తం బెవ్వఁ డాశించినన్
దాటింతున్ జటులాసిచే నతని మస్తంబంచు నత్యుద్ధతిన్.

33


సీ.

అష్టవర్షాధికుండైనవాఁ డెవ్వఁడేన్
                       బదియేండ్లదాఁక నాపద్మనాభు
దివసంబున మదీయదేశంబున భుజింపఁ
                       దగదు జననినైనఁ దండ్రినైన
దారపుత్రాప్తబాంధవులనైనను బట్టి
                       దండింతు [25]నిటఁ జోరదండనమున
నెఱిఁగింపుఁ డిపుడు మహీసురోత్తములకు
                       జాహ్నవీవారి మజ్జనము సేయుఁ


తే. గీ.

డబ్జనాభకథాలాప మాలకించుఁ
డనుచు నే నాడువచనంబు లాత్మఁబూని
నడచు మామకునకు నతినవ్యరాజ్య
భోగ మొనరింతు మత్కృపాపూర్ణమహిమ.

34


వ.

అని శుక్లపక్షంబులఁ గృష్ణపక్షంబులఁ బటహంబు మ్రోయించి.

35


క.

ఆరాజచంద్రుఁ డిటువలె
భూరివ్రతనిష్ఠ నడవఁ బురుషులు స్త్రీలున్
సౌరిపురిఁ జేర రెన్నఁడు
శౌరి పురియ కాని పుణ్యసామర్థ్యమునన్.

36


వ.

వ్యాజము చేసెనేనిఁ బరమపావనంబగు. ద్వాదశి సాధించెనేని హరి
మందిరంబుఁ జేరు. మఱియు.

37

క.

హరివాసరమునఁ గుడిచిన
పురుషుల కిలలోని పాపములు ప్రాపించున్
హరివాసరమునఁ గుడువని
పురుషుల కిలలోని పుణ్యములు ప్రాపించున్.

38


ఆ. వె.

వైమనస్య మందె వైవస్వతుం డంతఁ
జిత్రగుప్తలేఖ్యపత్రలిఖిత
దురితపుణ్యు లిపుడు [26]తుడుపులు వడిరి త
ద్విష్ణుదివసమహిమ వింతకాదె!

39


క.

హరిలోకమునకు నేఁగఁగ
సురపురమును యమపురంబు శూన్యం బయ్యెన్
సురముని [27]నారదుఁ డొయ్యన
నరుదెంచి కృతాంతుఁ జూచి యపు డిట్లనియెన్.

40


తే. గీ.

చిత్రగుప్తుఁడు నున్నాఁడు [28]చిన్నవోయి
నరులు పావనులైరి నీపురమునందు
యాత నాక్రందములు వొంద వనఘ ధర్మ
రాజ! యిది యెంచి చూడఁ జిత్రంబు గాదె!

41


వ.

అనిన[29] రుక్మాంగదక్షితీశ్వరుం డేకాదశీవ్రతంబు సేయుచుండ నీ
రాష్ట్రంబులోఁ జాటించ నట్లనె నరులు వర్తించఁ దన్మహత్త్వంబున
మల్లోకం బిట్లయ్యె. బ్రహ్మహత్యాదిపాతకాన్వింతుడైన సింహంబువలె
నున్నవాఁ డేను కాష్ఠమయుండనై యున్నవాఁడ; నేత్రకర్ణహీనుండునుం
బోలె, సంధ్యాహీనుఁడైన ద్విజుండునుంబోలె, స్త్రీజితుండైన పురుషుం
డునుంబోలెఁ; బ్రమదాపతి యగు షండుండునుంబోలె నిర్విణ్ణుండనై
యున్నవాఁడ, నిటువంటి లోకపాలకత్వంబు విడిచెదనని బ్రహ్మ
లోకంబునకు నేఁగి యేతత్కార్యంబు విన్నవించెద. స్వామివిత్తం బను
భవించి స్వామికార్యంబునెడ నిర్వ్యాపారుండై యున్నవానికి నరకం
బగుం గావున.

42

ఆ. వె.

అనుచు నిట్లు పలికి యంతకుం డంతకుఁ
జిత్రగుప్తు లట్ల చేష్ట లుడిగి
చిత్రగుప్తుఁ డాలసింపక వెంటరాఁ
ద్రోవ నరిగె నారదుండు దాను.

43


వ.

అంత.

44


శా.

మూర్తామూర్తజనంబు గొల్వ నిగమంబుల్ దానయై తజ్జగ
త్కర్తృత్వప్రపితామహత్వముల నోంకారాఖ్యమై హంసమై
యార్తత్రాయకమై స్వయంభువయి తుర్యంబై కుశాంకంబునై
కీర్తించందగు నొక్కతేజము [30]శుభోద్గీథంబు వీక్షింపుచున్.

45


సీ.

స(క)లదివ్యులు దిగీశ్వరలోకపాలకుల్
                       విగ్రహంబులు దాల్చి వేదములు పు
రాణంబు లఖిలశాస్త్రములు నాకృతిఁ బూని
                       జలధులు నదులు కాసారదీర్ఘి
కాకూపములు తటాకములు దేహము లెత్తి
                       యశ్వత్థముఖభూరుహములు మూర్తి
మంతంబులై సానుమంతంబు లాకార
                       ములతో నహోరాత్రములును బక్ష


తే. గీ.

ములును మాసంబులును వర్షములును [31]దనువుఁ
బొంది సత్కర్మములు బంధములును మేను
లమరి సత్వంబును రజంబుఁ దమముఁ జాల
నంగములు దాల్చి సేవించు నంతలోన.

46


వ.

శాంతరూపంబులు ఘోరవికారరూపంబులుం బరివేష్టింప నమ్మహా
విభుని నమ్ముఖంబున విన్ననై మొగంబు వంచికొనియున్న దండ
ధరునిం జూచి సభాసదు లిట్లనిరి.

47


ఉ.

దండధరుం డితం డధికదైన్యముతో నరుదెంచె నిమ్మహో
ద్దండుఁ డధర్మమన్నఁ దెగు ధర్మము గల్గిన నిర్వహించు బ్ర
హ్మా(ం)డములోని మానవుల కందరకు [32]సమవర్తి గాన ని
ట్లుండ క్షణంబు తీరదు మహోద్ధతి నిచ్చటి కేల వచ్చెనో?

48

ఆ. వె.

చిత్రగుప్తుఁ డేల చిత్రధర్మాధర్మ
పత్రికలు లిఖించి పట్టుకొనఁడు
వినఁ గనంగరాని వింతలు పుట్టెనో
నాకమునకు హృతజనాకమునకు.

49


వ.

అని యచ్చటిజనంబు లాడుకొనుచున్నసమయంబున విరించి
పాదాగ్రంబుల నికృత్తమూలంబగు సాలంబునుంబోలె వ్రాలి త్రాహి
త్రాహి యని కన్నీరు తొరుఁగ సమ్మార్జితపటుండనైతి నని విన్నవించి
నిశ్చేష్టితుండైయున్న సభయందు నొకహలాహలశబ్దంబు పుట్టె;
మఱియు.

50


ఉ.

స్థావరజంగమాత్మకసుశస్తజగద్వలయంబు నీతఁడే
కేవల బాధ [33]నొంచ నపకీర్తికి రోయక యెంచె నట్టివాఁ
డీవెత నుండె సత్యమగు నెన్నిక కాకి టగాధబాధచేఁ
గావె యనేకబాధ లనఁగా జనతాఘన[34]పాప మారుటల్.

51


మ.

అని లోకుల్ సభ నాడ నావరుణుఁ డొయ్యన్ వారి వారించి యా
తని దండానతు శ్యామపీతనిజదోర్దండంబులన్ లేవ నె
త్తి నవీనో త్తమపీఠిపై నునిచి యెంతేవేడ్కతోఁ గాంచి మ
న్నన గావించి ప్రశంస చేసి యతినూత్నప్రీతితో నిట్లనున్.

52


తే. గీ.

ఎవ్వఁ డపకార మొనరించె నెవ్వఁ డిట్లు
బాధగాఁ జేసె మార్జితపటునిఁ జేసి
యెవ్వఁ డొనరించె సర్వంబు నెఱుఁగఁ బల్కు
వబ్జజుఁడు నీమనోదుఃఖ మవనయించు.

53


వ.

అని వరుణుండు పల్కిన శమనుండు కృతదుఃఖశమనుండై పితా
మహువదనంబుఁ జూచుచు నిట్లనియె.

54


సీ.

స్వామి! నాశక్తి తేజంబునంతయుఁ బోయె
                       నంతకంటెను మృతియైన మేలు
ప్రభుధనంబు భుజించి ప్రభునియోగోపేక్షఁ
                       గావించు నాతఁడు కాష్ఠకీట

మధిపుకార్యము తప్ప నాచరింపుచుఁ బ్రజా
                       ద్రవ్యంబు భుజియించు తద్దురాత్ముఁ
డబ్దశతత్రయం బనుభవించు ననేక
                       నరకంబు లేలిన ధరణినాథు


తే. గీ.

కార్యమంతయు మఱచి వికారమొంది
మత్తుఁ డై యున్నయట్టి దుర్మానుఁ డందు
నఖిల[35]నిరయంబులును బ్రళయాంతమైన
ననుభవించు స్వకీయకర్మానువృత్తి.

55


తే. గీ.

స్వామికార్యంబు విడిచి దుర్జాలుఁ డాత్మ
కార్యమున నున్నచో మూషికత్వ మొందు
ధరణిలోపలఁ గల్పశతత్రయంబు
కమలసంభవ! మీయాజ్ఞ గాదె యిట్లు.

56


క.

భూనాథుకార్యమంతయుఁ
దా నింటనెయుండి భృత్యతతి చేర్చిన య
ట్లొ నను నియోగి [36]పాపం
బాని మహోత్కటబిడాలమై జనియించున్.

57


వ.

కావున మీయాజ్ఞ యుల్లంఘనము సేయక యింతకాలంబును బుణ్య
కర్మంబులఁ బుణ్యంబులును, బాపకర్మంబులఁ బాపంబులును ధర్మ
వేదులగు మునులతో విమర్శించి తత్తత్ఫలం బనుభవింపఁ[37]జేయు
నాకు నింక శక్యంబు గాదు వినుము.

58


సీ.

ధరణిపై రుక్మాంగదక్షమాధీశుఁ డే
                       కాదశీవ్రతదీక్షఁ గైకొనంగఁ
జతురబ్ధిపర్యంతజగతిలోఁ గల జను
                       లావ్రతమంతయు నాచరింపఁ
బాడయ్యె నేఁడు నాపట్టణంబంతయు
                       నితరధర్మములు లే వెవ్వి దేవ
పూజయు నిజపితృపూజయు భూసురు
                       పూజయుఁ జేయరు పుణ్యతీర్థ

తే. గీ.

సరణిఁ గానరు యోగంబు సాంఖ్యయోగ
మనఁగ [38]విన రెన్నఁడేని స్వాధ్యాయమైన
హవనకృత్యంబుఁ [39]జేయరు దివిరి వారు
హరిపదముఁ గాంచి రిట్ల నత్యద్భుతంబు.

59


వ.

మనుజు లేకాదశీవ్రతంబునఁ బితృపితామహులతోఁ బరమపదం బందు
టెంత? వారిపితృగణంబులఁ బితృగణంబును బరమపదంబు
నొందిరి. మాతామహు లట్లనె పరమపదంబు నొందిరి. బీజవిశేషంబున
భార్యాపక్షంబువారు నట్లన పరమపదంబు నొందిరి. మల్లిపితుడిచి
యెవ్వరు చేసిన పుణ్యపాపంబులు వారలే యనుభవించువారలు గాక
యితరుల కేమి కారణంబు? జామాతృపుణ్యమాహాత్మ్యంబున భార్యా
పక్షంబున కి ట్లర్హంబే? ఈనియోగంబు నే నొల్ల. యజ్ఞతీర్థదానయోగ
సంయోగంబుల నిటువంటి సద్గతి లేదు. ధాత్రీఫలానులిప్తులై వాంఛ
లుడిగి, రసభోజనోద్భవవాంఛలు విడిచి విభ్రష్టకర్ములేని హరి
లోకంబుఁ గాంచిరి. గళరజ్జుబంధనంబుల మద్దూతలు దెచ్చినవారల
హరిదూతలు శిక్షించి కొనిచనిరి. ద్వాదశాదిత్యతీవ్రతాపదుర్గమం
బైన మన్మార్గంబు భగ్నం బయ్యె నేమి విన్నవింతు నింక.

60


సీ.

హరిపదంబున కేఁగు నధ్వంబు త్రిభువనా
                       ర్చితమైనయది విమర్శింప నిసుక
చల్లిన రాలదు జనులచే నీలోక
                       మప్రమాణం బగమ్యం బనంత
మద్భుతం బింతింత యౌననఁగారాదు
                       గణుతించి చూచిన ఖల్వశంఖ
పద్మకోట్యాగముల్ బలసి కాపుర మున్న
                       నిండదు తజ్జనమండలంబు


తే. గీ.

మఱి సుకర్మస్థులును వికర్మస్థులును బ
విత్రు లపవిత్రులును రమావిభుదినంబు
నందు నుపవాస మొనరించి యందుచుంద్రు
పరమధామంబు తన్మహీపాలునాజ్ఞ.

61

మ.

ధరణీనాథుఁ డతండు తన్మహిమచేతం దండనీయుండు గాఁ
డురుతేజంబున వేయువత్సరము లి ట్లుర్వీతలం బంతయున్
బరిపాలింప భుజాచతుష్టయముతో ధర్మాంశుకశ్రీలతో
గరుడారోహణలీలతోఁ గనిరి తత్కైవల్యధామోన్నతుల్.

62


తే. గీ.

అతఁడు ధర నుండెనే నితరాగ్రవృత్తి
ధారుణీలోక మాపరధామమునకుఁ
జేర్పఁగలఁ డీవు నాకు నిచ్చిన ప్రసిద్ధ
దండపట మణఁగించె నుద్దండమహిమ.

63


మ.

అరులం జ్యేష్ఠవిభావసుండువలె దీప్తాకారులం జేయఁడే!
నరుఁ డామూఢుఁడు పుట్ట నేమిటికి నన్యాయాత్ముఁడై మాతృదు
ర్భరగర్భాంతరదుర్గనిర్భరణనిర్భాగ్యుండు, శ్రీజన్మవి
స్ఫురణం బట్లనె కాదె కీర్తివిభవంబు ల్లేక వర్తించినన్.

64


క.

విద్యాబలసంపద నన
వద్యంబై పితృకులంబు వన్నెకు నెక్కుం
జోద్యముగాఁ జేయని సుతు
లార్యరజోరోగ మగుదు రాజననులకున్.

65


క.

ధర్మార్థకామములయెడఁ
గూర్మి మదిన్ విడిచి ప్రాతికూల్యస్థితిచే
దుర్మాదత నిలిపిన దు
ష్కర్ముని మఱి మాతృఘాతిగా నెంతు రిలన్.

66


ఆ. వె.

వీరసూసమాఖ్య విలసిల్లె రుక్మాంగ
దక్షితీశుఁ గన్నతల్లి యొకతె
మల్లిపి ప్రతాప మార్జనం బొనరించి
యాత్మజుండు జగము లాక్రమింప.

67


వ.

ఇ ట్లేరాజులు నడవ రితండు మత్పటహాని గావించి పటహానిశ
ఘోషంబునుం జాటించి యేకాదశీవ్రతంబు నడుపుచునున్నవాఁ డెట్ల
నోర్తునని విన్నవించిన విరించి యిట్లనియె.

68

మ.

ఇదియే చోద్యము గాఁగ భిన్నమతివై యి ట్లాడుచున్నాఁడ వా
పదచో సద్గుణ మొక్కచోఁ గలుగఁ దాపం బందినం బాతకం
బది యంచున్ మరణాంతికంబు స్మృతిమాత్రానీతచక్రాంకన
త్పద మానువ్రత మావ్రతంబున కసాధ్యం బెద్దియుం గల్గునే?

69


తే. గీ.

అవనియందు శతాశ్వమేధావబృథస
మంబు గృష్ణసకృత్ప్రణామంబు జనన
మందుఁ దిరుగ దశాశ్వమేధావబృథము
సేయువాఁ డిందు జననంబుఁ జెందఁ డరయ.

70


క.

[40]కురుకాశీగంగాదిక
వరతీర్థాంతరములందు వలనౌనె గతుల్
హరియను నక్షరములు రెం
డురుగతి నేనరునిజిహ్వ నూనిన యట్లన్.

71


ఆ. వె.

శ్వపచి యగునది మఱి రజస్వలయు నైనఁ
బూనిక వశి సురామాంసభోజియైనఁ
దద్ద్విజుం డంతమున హరిఁ దలఁచి పూర్వ
పాపములఁ బాసి [41]తద్దివ్యపదముఁ గనరె!

72


సీ.

ఉచ్చరించినమాత్ర నొనగూర్చుఁ గైవల్య
                       ముపవసించిన నీకయున్నె ముక్తి
హరివాసరమున జనార్దనుఁ బొగడి వం
                       దనము గావించి తత్కథలు విని వ్ర
తం బాచరింప వత్సరములు పదివేలు
                       గంగాతరంగిణికాండపూర
మున నవగాహించు పుణ్యంబు ప్రాపించు
                       మాకు లోకములకు మధువిరోధి


తే. గీ.

జనకుఁ డేకాదశీవ్రతశాలిఁ జూచి
యీర్ష్య సేయుట దుర్బుద్ధి యంతభాగ్య
శీలుఁడవు నిన్ను బంధించి చేతిగదలఁ
జూర్ణముగఁ జేయరైరి యో సూర్యతనయ!

73

ఆ. వె.

రాజహితులఁ గాంచి రాజులకంటెనుఁ
దేజ మెసఁగ భక్తిఁ దిరుగఁడేని
[42]గర్వియైన తదధికారిని వారలు
నిగ్రహింతు రొక్కనెపము చూచి.

74


ఆ. వె.

రాజహితులు సాపరాధులైనను వారి
దండనంబు సేయఁదగునె పనుల
వారికెల్ల భూమివల్లభుసత్కృప
[43]వార నిరపరాధు లైరి గాన.

75


తే. గీ.

దండ్యు లయ్యును విష్ణుతత్పరులు పరులు
దండ్యు లెన్నఁడుఁ గారయో దండధర! య
జాండగర్భంబునందు నుద్దండమహిమ
వారిబంధులఁ జూడవలయు నెఱిఁగి.

76


క.

[44]మద్భక్తుఁడైన నాభా
స్వద్భక్తుండైన నీకు సాహాయ్యక మే
[45]సద్భక్తిఁ జేసెదను ముర
జిద్భక్తులు సేయ మాన్పఁ జెల్లదు మాకున్.

77


వ.

సర్వదేవతలకు భగవంతుం డాఢ్యుండు. భగవద్భక్తుల నిగ్రహింపఁ
దగదు. ఉభయపక్షంబులయందు ద్వాదశివాసరం బొక్కొక్కవ్యాజంబు
చేతనే సాధించినవారు నీ కవమానంబు చేసిన నేను నిర్వహింప శక్తుండఁ
గాను. శక్తుండనై వచ్చితినేని స్వరూపహాని యగుఁ గావునఁ దద్భక్త
విరోధంబు సేయ వెఱతు ననినఁ గృతాంతుండు విజ్ఞాతకృతాంతుండై
యిట్లనియె.

78


సీ.

నీపాదములు గంటి నీరజోద్భవ నాకు
                       నిటువంటి యధికార మింకఁ జాలు
హరివాసరవ్రత మాచరింపక యుండ
                       నరసి యారుక్మాంగదావనీశు

నస్మద్విరోధి నత్యంతాంతరాయముల్
                       గల్పించి కలఁచి భగ్నముగఁ దద్వ్ర
తంబు దప్పించిన ధన్యుఁడనై గయా
                       పిండప్రదునియట్ల పెంపు గాంతు


తే. గీ.

నేతదాచారనిరతుల నింతనుండి
చూడవెఱతు హరిస్థితి చూడ్కు లొక్క
వ్యాజమున నుచ్చరించిన నణఁగు మాతృ
గర్భబాధలు మత్పురిఁ గానఁ డెపుడు.

79


తే. గీ.

నారదుండును గూడి విన్నపము సేయ
దండధరుఁ డంతకంతకు దైన్యమంద
నతని మన్నించుటకు నీరజాసనుండు
చింతతో నుండి నపు డొక్కకొంతతడవు.

80


సీ.

అలికాంతసంచలదలకాంతయలకాంత
                       యలకాంతకాంతలు నాత్మఁ గలఁగ
నవ్యభూషణభూషణంబైన రూపరే
                       ఖావిలాసంబులు గల్గి మెఱసి
నిజమనోజాతయై నిత్యవిభ్రాంతమ
                       నోజాతయై పూర్ణతేజ మంది
రుచిరవిద్రుమలతారుణ్యంబు తారుణ్య
                       మును బూని మోహంపుమొలక యనఁగ


తే. గీ.

నున్నఁ గమలాసనుఁడు చూచి యొఱపు నెఱప
మానసము కొంత గిలిగింత పూనఁ బ్రత్య
వాయభయమున నిజనేత్రవనరుహములు
భాసురజ్ఞానభరమున మూసికొనియె.

81

బ్రహ్మ మోహినీదేవతను బుట్టించుట

సీ.

[46]జననీతనూజాస్నుషా భ్రాతృజాయ గు
                       రుప్రియరాజభీరువులతో స
రాగమై తగు నంతరంగంబునఁ దలంప
                       రాదు; సరాగమై పాదుకొనిన

చూపులనేనియుఁ జూడరా దిట్లైన
                       నరకంబు, శ్వపచియౌ నాత్మ, నాత్మఁ
జింతింపరాదు తత్కాంతలఁ, గాంచి చి
                       త్తక్షోభ మందిన తన్మహాదు


తే. గీ.

రాత్ము నాజన్మకృతపుణ్య మప్పు డడఁగుఁ
దత్ప్రసంగం బొనర్చిన దశసహస్ర
జన్మసుకృతంబు లన్నియు సడలు నట్టి
సుకృతములు వోవ నాఖువై క్షోణి నుండు.

82


వ.

అది గావునఁ దద్రాగంబు వలదు; మఱియు.

83


తే. గీ.

తనయునకుఁ [47]బదిరెండేండ్లు దాఁటినపుడు
జననికేనియు నభ్యంగసమయమునను
బాదము లొసంగఁజనదు సంప్రాప్తపూర్ణ
[48]యౌవనోత్కటుఁ డైనచో నాడనేల?

84


తే. గీ.

షష్టివత్సరములు దాఁటి చనిన జనని
సుతున కభ్యంజనము సేయ శుభతరంబు
శాటి దొలఁగిన నభ్యంగసమయమునను
జననియంగంబు వీక్షింపఁజనదు సుతుఁడు.

85


ఆ. వె.

[49]తల్లి వృద్ధయైనఁ, దరుణుఁడైనను వృద్ధుఁ
డైన నాత్మజుఁడు నిజాంఘ్రు [50]లంట
నవనియందు నిడఁగ నభ్యంజనంబున
నొనరు గౌరవము తదుభయమునకు.

86


క.

కరచరణంబులు దక్కం
దరుణీమణి పుత్రకునకుఁ దక్కిన యంగాం
తరములు మూయక చూపిన
[51]వరటక్రిమిపూర్ణ యగుచుఁ బడు నరకములన్.

87

తే. గీ.

పాదశౌచంబు స్నాన మభ్యంజనంబు
తత్స్నుపాహస్తమునఁ జేయఁదగదు చేసె
నేని యాపాపశీలుని మేను దొలఁచు
కూటముఖకీటకంబు లక్షోభ్యశక్తి.

88


వ.

అదిగాన సాభిలాషమానసంబున స్వసుతనేని వీక్షించినఁ బతితుం డగు.
రుచిరనాసావిలాసంబగు వట్రువమొగంబు శ్లేష్మాగారం బనియు,
మేను వసామేధశ్చర్మమాంసావృతంబైన యస్థిపంజరం బనియును,
నయనంబు లశ్రుబుద్బుదంబు లనియు, స్తనంబులు మాంసగ్రంథు లనియు,
జఠరంబు మలమూత్రపూరం బనియు, జఘనం బుదగ్రమాంసఖండం
బనియు, గుహ్యం బపానవాయుజుష్టమాత్రం బనియు, జంఘలు చర్మ
భస్త్రిక లనియు, నాభి నరకకూపం బనియు; నంగుళవితానంబు మాంస
కణిక లనియు వితర్కింపక నరుం డిట్ల వర్తిల్లెడు నని విరించి వివరించి
ధైర్యం బవలంబించి యాబాలికం జూచి యిట్లనియె.

89


క.

మనసునఁ దలఁచిన యట్లనె
జనియించితి శుభవిలాససంపద ని న్నే
మన సునయన కల్పించితి
మనసునకున్ మదనమోహమాయామహిమల్.

90


వ.

అనిన నమ్మానసకన్య నవ్వి యవ్విరించికి మ్రొక్కి యిట్లనియె.

91


మ.

సకలస్థావరజంగ మాత్మకజగజ్జాలంబు మద్రూపరే
ఖకు మోహింపకయున్నె [52]నీవు నెదలోఁ గంజాతసంజాతభా
వుకముల్ గోరెదరేని ధర్మగణితవ్యుల్ భవ్యు లాత్మస్తుతుల్
ప్రకటస్ఫూర్తి నొనర్చిరేని నరకప్రాప్తుల్ గదా మీఁదటన్.

92


తే. గీ.

అయినఁ గార్యనిమిత్త మే నబ్జజాత
చెల్లు నాత్మప్రశంసలు చేయ, సకల
మోహమూలంబుగా నీవు మొదల నన్ను
నిట సృజించితి విటఁ బని యేమి నాకు.

93

మ.

[53]నను వీక్షించి యచేతనంబులు మహోన్మాదంబునం [54]జొక్కుఁ జే
తన వస్తువ్రజముల్ గలంగవె సముద్యచ్ఛ్వాసనిశ్వాసతం
జని యిట్లంటినఁ జోద్యమే, యువతివీక్షావర్ణనాఖేలనన్
జనియించున్ వ్రతభంగి సంగిహృదయాసంగంబు లెవ్వారికిన్.

94


మహాస్రగ్ధర.

వితతభ్రూచాపముక్తావితథశశిముఖే
                       వీక్షణోగ్రాశుగంబుల్
ధృతి చిందన్ ధీరహృద్భిత్తికలు పలుమఱున్
                       దీటి నాటించఁగా, ను
ద్ధతిఁ దానెందాఁక వేడం దను కనవ్రతముల్
                       ధైర్యమున్ లజ్జయున్ ద
క్షతయున్ దేహేంద్రియస్వస్థతయు వినయమున్
                       సర్వమర్త్యాళి కుర్విన్.

95


మ.

సరిగాఁ బోల్తురు చంద్రబింబమని యోషావక్త్రబింబంబు నే
సరసుల్ [55]కావ్యలసత్కవిత్వవిభవైశ్వర్యంబునన్ మూఢులై
ధరపై దానికి నెవ్వి [56]భ్రూవిలసనోద్యద్విభ్రమాపాంగభం
గురవీక్షాదరహాసమోహనకళాకోపప్రసాదస్థితుల్.

96


శా.

ఔరా! జవ్వని మోహనాంగి భళిరా హా ముగ్ధముద్ధోక్తి భా
మారత్నం బని మాటిమాటికి మదోన్మత్తుండు చింతించి యా
నీరేజాననకేళికిన్ [57]మలయుఁ బూన్కిం గంతుఁ డేఁచంగ, వి
ద్యారూపంబగు మంత్రదేవత తదంతర్యామియుం బోలుచున్.

97


క.

తావకసురనరవర్గము
నేవెతలం బెట్టనేర దీక్షించి మదిన్
భావించి గౌరవించినఁ
బూవుంబోఁడులు కలంచి పోవరె వేగన్.

98

వ.

అది కావున నేకార్యంబునకు నన్ను నియోగించితి వానతీవే యని విన్న
వించిన విరించి యిట్లనియె.

99


సీ.

సత్యమాడితి(వె) యసాధ్యమె నీకు నీ
                       భువనత్రయంబు, నీపూర్ణశక్తి
మచ్చిత్త మేని, నీమాయఁ జిక్కదె! ఘన
                       జ్ఞానాంకుశమున నిశ్చలత నిలిపి
నాఁడఁగాక, వయోధననిధానమైన నీ
                       రూపకళాలక్ష్మి చూపి యాడి
పాడి విలాససంపదల మించిన మనో
                       జాతుండు నీకు దాస్యంబు సేయు


తే. గీ.

మెఱయ స్త్రీవ్యక్తులెల్ల నిర్మించినాఁడఁ
గాని యిటువంటి రూపరేఖావిలాస
విక్రమస్ఫూర్తు లొకవింత వింతలయ్యె
నింతి! నాకైన శక్యమే యిఁక సృజింప.

100


వ.

అని బహూకరించి యిట్లనియె.

101

బ్రహ్మ మోహినికిం గర్తవ్యం బుపదేశించుట

తే. గీ.

అవని విదిశాపురం బేలు నతిబలోద్ధ
తాంగదుండైన యట్టి రుక్మాంగదుండు
వరలె సంధ్యావళి యనంగ వానిభార్య
సుదృఢసంధ్యావళీసదాస్తుతచరిత్ర.

102


సీ.

[58]ఆరాజసుతుఁడు ధర్మాంగదుం డనువాఁడు
                       తండ్రికంటెను మహౌదార్యగుణము
నం దధికుండు నాగాయుతబలశాలి
                       ధరణిఁ బ్రసిద్ధప్రతాపహేళి
క్షమ ధరాదేవత ఘనుఁ డాత్మజనకుఁ డా
                       ఢ్యుండు జంబూద్వీప మొకటి యేలె
నితఁడు సప్తద్వీపవితతధాత్రీమండ
                       లంబెల్ల నేలు శౌర్యంబు మెఱసి

తే. గీ.

తండ్రివాక్యంబు లేశంబు దాఁటఁ డతుల
ధర్మశీలుండు మాతృశతత్రయైక
తత్పరాశయుఁ డన్యకాంతావిమోహుఁ
డమ్మహామహుమహిమ శక్యంబె పొగడ.

103


వ.

ధర్మప్రధానుండైన యారాజు మందరాచలంబునకుఁ దురంగంబు నెక్కి
రాఁగలండు. నీవు నచ్చట నుండి గీతంబున మోహంబు నొందించిన
హయంబు డిగ్గి గిరినితంబంబున నిన్నుం గవయునెడ నీదార నయ్యెద
నుదారా! నామాట యొక్కటి చేసెదనని శపథంబు సేయుమని భ్రమ
యించి దక్షిణకరంబుఁ గైకొని కొన్నిదినంబులకు సురతాంతతాంతా
త్ముండై చొక్కినయెడ నగి పూర్వశపథంబుఁ దలంచికొని తచ్ఛపథంబుఁ
బాలింపుమన నతం డంగీకరింపనని యే నిన్నుఁ బాసి నిముసంబు
నోర్వ; [59]దశమ్యేకాదశీద్వాదశీనిశాత్రయంబెల్ల నెడఁబాయుదు (ననుఁ
యౌవనోపేతయై సుముఖియైన స్వభార్యం గవయక సర్వాకాంక్షి)
యగు దురాచారుండు నరకంబు లొందు. శ్రాద్ధకాలంబులం దేనియు
నుపవిష్ణులై ద్విజులు భార్యాసంగమంబుఁ గోరిన ననుభవింపందగు
నండ్రని బోధించిన నీవ్రతంబు మానండేని నిజధృతకరవాలంబున
ధర్మాంగదశిరోనికర్తనంబు చేసి మదుత్సంగంబునఁ దచ్ఛిరంబు
నిలుపుమనినఁ బ్రాణసముండైన పుత్రుని హింసింపఁడు. బ్రాహ్మణ
వాక్యోపదేశంబున హరివాసరంబు విడుచునట్లైనఁ బూర్వమార్గంబునం
దిరుగుచు జనులు యమకింకరపాశబద్ధులై యమాంతికంబున కేఁగెదరు.
రాజును సత్యంబును నిలుపుకొనఁ దనయుని హింసించెనేనియు నశేష
కల్మషంబులం బాసి పరమధామంబుఁ జేరుననిన విని యాకమలలోచన
తండ్రివి, యాత్మజనైన నాకు నెయ్యది నామం బెట్లు మందరంబున
కేఁగుదు ననిన మోహినియను పేరు గావించి నిజశిష్యులు వెంట
నియోగించి పంచిన ధాతకుం బ్రణమిల్లి యమరులు వీక్షింపం దృతీయ
ముహూర్తంబున మందరగిరిశిఖాగ్రంబునకు డిగ్గె నప్పుడు.

104


మ.

ఘనతన్ వాసుకివేష్టనోత్థశుభలేఖల్ మీఱ షడ్లక్షయో
జనవిస్తీర్ణపయఃపయోనిధీసమంచద్గద్గరీమధ్యమం
థనమంథానతకూర్మకర్ఫరనిరోధద్రాగ్విభిన్నత్వ మొం
దని సారంబున నున్న కొండ గిలిగింత ల్గొల్ప నీక్షింపుచున్.

105

సీ.

ప్రబలసురాసురప్రవరుల కెడలింప
                       నలవిగాని నగేంద్ర మరయ నెద్ది?
హరికి వ్యామగ్రాహ్యమై భుజాంగదసము
                       త్కాషసారంబైన గ్రావ మెద్ది?
పుక్కిటిబంటిగాఁ బూర్ణదుగ్ధాంభోధి
                       నోలలాడెడు మహాశైల మెద్ది?
భూతజాలావృతపురమర్దనైకవి
                       హారసౌధంబైన యచల మెద్ది?


తే. గీ.

దివిజులకు రచ్చ, తాపసప్రవరులకుఁ ద
పంబు పంట, సురాధిపభామలకు ర
తిప్రవర్తనవశ్యాధిదేవత, వివి
ధౌషధంబుల కాకరం, బట్టి శిఖరి.

106


చ.

అయుతము వేయుయోజనము లగ్గిరిమూలము దానియంతయే
నియతముగా వెడల్పును వినిర్మలకాంచనరత్నశృంగముల్
వియదవనీతలంబులను వింతలుగొల్పు మణిప్రభా[60]మహో
దయములు మించ ధామనిధిధామ మడంగఁగఁజేయఁ దద్గిరిన్.

107


తే. గీ.

అర్కతేజంబు దివ్యరత్నాలి గ్రోలి
యగ్గిరీంద్రంబు మెఱయ నయ్యవనిధరము
నంగలావణ్యధాళధళ్యమున వింత
మెఱుఁగు వెట్టుచు నొకశిలమీఁద నిలిచె.

108


తే. గీ.

సప్తయోజనవిశ్రుతశక్రనీల
కలితతచ్ఛిల దివ్యలింగంబు [61]మెఱయు
నది వియల్లింగ మన దళహస్తమితమ
హోచ్చతయు [62]నిన్మడి వెడల్పు నొనరి వెలయు.

109


వ.

ఆదివ్యలింగంబు సన్ముఖంబున.

110

శా.

ఆరామామణి మూర్ఛనల్ బెళక గీతానీకముల్ వాడె గాం
ధారగ్రామము మేళవించి శృతులం దాళంబులం దంత్రులం
[63]గోరం జీఱిన నేఱుగా నమృతముల్ ఘూర్ణిల్ల శైలంబులున్
నీరై యుండఁగ వల్లకిన్ మృదుకరోన్నిద్రస్ఫురన్నైపుణిన్.

111


క.

తద్గీతామృతధారలు
హృద్గోళమునాటి కరఁగి యేతెంచె సము
దృద్గరిమమై దిగంబరుఁ
డుద్గతకందర్పసాయకోత్పాటితుఁడై.

112


మ.

తనిసెన్ మాసుషభోగసంపదలచేతం జాలఁ బెక్కేండ్లు కృ
ష్ణునిఁ బూజించె విరోధులం దునిమె నక్షుద్రప్రతాపంబునన్
మనుజానీకముఁ బట్టి యీక యమధామంబంతయున్ విద్య నే
ర్పునఁ బాడై పొగులంగఁజేసె నరుఁడే రుక్మాంగదుం డుర్వరన్.

113


సీ.

అతఁ డొకనాఁడు ధర్మాంగదుఁ బిలిచి యేఁ
                       బాలించినట్ల భూపాలనంబు
సేయుము పుత్రుఁ డూర్జితబలసంపద
                       చే సమర్థుండయి సిరి వహించు
రాజ్యభారంబు తోరంబుగా నిలువని
                       రాజుకీర్తియును ధర్మంబు నణఁగు
నటువంటి సుతుఁడు గుణాఢ్యుండు గలుగ సు
                       ఖంబు నొందని దురాగ్రహుఁడు పాపి


తే. గీ.

జనకభారభరణదక్షశౌర్యశాలి
యైన సూనుఁడు తద్భార మానఁడేని
చర్చ సేయ నజాగళస్తన[64]సమానుఁ
డతఁడు మనుజులలో నధమాధముండు.

114


ఆ. వె.

కన్నతండ్రికంటె ఘనుఁ డనఁగాఁ గీర్తి
గల్గి సూర్యదీప్తి ఘనత గాంచి
భూమి వెలయునట్టి పుత్రుండు పుత్రుండు
వాఁడె యుభయవంశవర్ధనుండు.

115

క.

జనకున కతిఖేదముగాఁ
దనయుఁడు వర్తించెనేని తత్తనయుఁడు [65]
ల్పనియుతము ఘోర నిలయము
ల ననయమును గూలు దుఃఖరాశి యనంగన్.

116


ఆ. వె.

తండ్రిమాట యింత చాఁటక గృహమున
సకలభారములు స్వశక్తిఁ బూని
తెలివి నున్న సుతుఁడు దేవేశుసన్నిధి
నుండు దివిజులెల్ల నుల్లసిల్ల.

117


క.

వెలయఁగ నిద్రాహారం
బులు లేక యహర్నిశంబు భూప్రజలకునై
సలిపితి సత్క్రియ లుర్వీ
స్థలిని బ్రబుద్ధుండనైనదనుకఁ గుమారా!

118


సీ.

శైవమార్గంబున సంచరించినవారి
                       సౌరమంత్రోపాస్తి సలుపువారిఁ
బద్మాసనాచారపద్ధతి మనువారిఁ
                       బార్వతీమతవృత్తిఁ బఱఁగువారి
నరసి సాయంప్రాతరశనముల్ గొనువారి
                       నిత్యాగ్నిహోత్రులై నిలుచువారి
సతతతీర్ధాసక్తి జరుగుచుండెడువారి
                       శ్రాద్ధకర్మనియతిఁ బ్రబలువారి


తే. గీ.

బాలయువవృద్ధగుర్విణీబాలికాస
రోగవికలతరాసక్త[66]భోగశీలు
రైనవారిని హరివాసరాభిమాన
చణులఁ జేసితి శాస్త్రవిశ్వాసమహిమ.

119


వ.

కొందఱిని విత్తదండనంబు గావించి కొందఱిని విద్వన్ముఖంబున శాస్త్ర
దృష్టిని శాసించి నిగ్రహించిన నందఱు నిరాహారులైరి. ఇందునకై
ధరాతలంబున సుఖం బెఱుంగనైతి. ప్రజలు కొందఱు దుఃఖింపుదురు.
కొందఱు సమ్మతింపుదురు. అటు గావున స్వహస్త పరహస్తంబులఁ
బ్రజారక్షణంబు చేసిన నక్షయలోకంబులు గలవని పెద్ద లానతి యిచ్చిరి.
ఇంక మృగయావిహారాదిభోగంబు లనుభవించెద.

120

క.

పానద్యూతసుఖం బది
యేనో మూలంబు దాని నే నొల్లన్ ద
త్పానద్యూతాసక్తమ
హీనుఁడు హీనుండు నరక మిది యద్భుతమే.

121


శా.

ఆఖేటాటనకేలిమై నిఁక నరణ్యానీ నదీ రాజధా
నీ ఖేటర్షి పరాక్రమాది తతులన్ వేష్టింతు భావత్కదో
శ్శాఖన్ భారము నిల్పి కాంచెద నశేషన్వేష్టభోగంబు లే
నీష్ఖేదంబున నున్న నాకు నిరయం బీమీదఁ బ్రాపించెడిన్.

122


వ.

అనిన ధర్మాంగదుం డిట్లనియె.

123


సీ.

అఖిలభోగంబులు ననుభవింపుఁడు సుదు
                       ర్ధరధరాభార మిద్ధరణిఁ దాల్చు
తావకవాక్యవర్తనమున నడుచుట
                       కంటె ధర్మం బొండు గలదె నాకుఁ
బితృవాక్యపాలనస్థితిలేని యితరధ
                       ర్మమున నధోగతిప్రాప్తి గానఁ
గావింతు నీదు వాక్యక్రమంబున నన
                       రాజసన్నిభుఁడైన రాజమౌళి


తే. గీ.

వేఁట కుద్యుక్తుఁడయ్యె నావేళఁ బ్రజలఁ
బిల్చి ధర్మాంగదుండు గంభీరమధుర
భాషణంబుల లాలించి భక్తి వారి
యంతరంగంబు చిగురొత్త నప్పు డనియె.

124


మ.

నను బోధించె ధరాభరంబునకు భూనాథాగ్రగణ్యుండు మ
జ్జనకుం డావచనంబు సేయుట ప్రశస్తంబైన ధర్మంబు మ
ద్ఘనతేజంబున మిమ్ము దండధరుఁడున్ దండింపఁగాలేఁడు మీ
రనఘుల్ శ్రీహరిఁ గొల్వుఁడే సుకృతకర్మారంభులై నిత్యమున్.

125


వ.

ఏను బితృమార్గంబునకంటె నధికంబైనయది మీకు నెఱింగించెద.
జ్ఞాను లెల్లను సర్వంబు బ్రహ్మార్పణంబు సేయవలయు. మాతండ్రి
శాస్త్రక్రమంబున హరిదినోపవాసంబు సలువవలయునని యానతి యిచ్చె.
అదిగాక యాత్మకుం బునరావృత్తిరహితంబైన యది తద్బ్రహ్మార్పణ
సంజ్ఞికంబైన విశేషంబుగల దీరెండు నవశ్యంబుగా నాచరింపవలయు
నని ప్రజల మఱియు నూరడించి యహర్నిశంబును గంటికి నిద్రలేక

శౌర్యంబున నన్నిదిక్కులు విమర్శింపుచు, ధాత్రి నిష్కంటకంబుగా
నేలుచు, నేకాదశి నుపవసించి ద్వాదశి సాధించి త్రివిధకర్మంబులయందు
మమత్వంబు విడిచి దేవేశుం జింతింపందగు. హవ్యకవ్యంబులు
దదాత్మ యగు జనార్దనునకే సమర్పితంబులు సేయవలయు. తురీయుం
డయ్యు హృషీకేశుండు నిసర్గంబున జగత్పతి యగు. స్వజాతివిర
హితంబైన సన్మార్గంబు నందున్న మాధవుండే యుపాస్యుండని,
పురుషోత్తముండే భోక్తయు భోక్తవ్యంబును [67]సర్వకర్మంబులందు
నతని కేది నియోగం (బది) సేయందగునని మేఘధ్వానంబగు పట
హంబు హస్తిమస్తకంబున మ్రోయింపుచుఁ జాటించు ధర్మాంగదు
మహిమ తనకంటె నధికంబని యెఱింగియు సంధ్యావళిం జూచి
హర్షించి రుక్మాంగదుం డిట్లనియె.

126


సీ.

పద్మాక్షి! చూచితే పద్మాక్షివోలె నా
                       నందకందంబైన నందనుండు
జనియించె [68]మనదు వంశంబు(ల్ పవిత్రంబు)
                       లయ్యె మోక్షంబను నట్టి వార్త
వింటిమి గాని కన్గొంటలే దెవ్వఁడు
                       నెందైన మదికి నభీష్టుఁడైన
వినయసంపన్నుండు ఘనతర దృఢశౌచ
                       శాలి ప్రతాపి మోక్షప్రకాశ


తే. గీ.

[69]రూపుఁడు భయాన్వవాయప్రదీపకుఁ డగు
తనయుఁ డుదయించి సకలసత్కర్మకరణ
దక్షుఁడై యున్న వీక్షించి తండ్రి యాత్మ
యందు నానందమందుట యమృతపదము.

127


క.

స్థావరజంగమరూపం
బౌ విశ్వత్రయమునందు నతిసౌఖ్యం బో
దేవి! సుపుత్రుఁడు జనకుని
భావ మెఱిఁగి యతఁడు పూను [70]భారముఁ బూనన్.

128

క.

దక్షుఁడు నీరేరుహలస
దక్షుఁడు పుత్రుండు భార మానెడు నో ప
ద్మాక్షి! మృగయావిహారా
పేక్షం దిరిగెద మహామహీధరవనులన్.

129


వ.

అనిన సంధ్యావళి యిట్లనియె.

130


సీ.

సత్యంబు పలికితి జననాథ! పుత్రసౌ
                       ఖ్యము శతక్రతుఫలసమధికంబు
స్వామి! సప్తద్వీపసంవేష్టితావనిఁ
                       బ్రబలితి పుత్రునిఁ బ్రభునిఁ జేసి
భుజశక్తి మృగహింస పూనంగఁ దగదు జ
                       నార్దనప్రీతిగా యజ్ఞములు స
మృద్ధిఁ [71]గావించు ప్రసిద్ధికి నెక్కంగ
                       భోగస్పృహావృత్తిఁ బొరలక సుర


తే. గీ.

నరవరానందముగను మానసము నిలుపు
మట్ల నడచిన న్యాయ మన్యాయ మధిప!
మృగయ మృగయాతనాకర మగణితముగఁ
బుత్రవంతులు మృగయాశఁ బొంద రిట్లు.

131


క.

హరిఁ బూజింపు మహింసా
పరమో ధర్మ మనఁగ వినవె పార్థివదోషాం
తరములఁ బొరయని మృగములఁ
బొరిగొన నిజధర్మహాని భూపాలురకున్.

132


సీ.

విద్వజ్జనంబు షడ్విధ మని జీవహిం
                       సాఘంబు వర్ణింప నతిశయమున
మొదలిపాతకి యనుమోదించిన యతండు
                       ఘాతకుండు ద్వితీయపాతకి యగు
విశసనపరుఁడు భావింపఁ దృతీయపా
                       తకి యగు మాంసభక్షకుఁడు దాఁ జ
తుర్థపాతకి ఘటితోఁ బచన మొనర్చు
                       నతఁడు పంచమపాతకాన్వితుండు

తే. గీ.

షష్ఠపాతకి విక్రియాచరణపరుఁడు
హింసచేఁ జేయు తద్ధర్మ మేటిధర్మ
మది యధర్మంబె యండ్రు విద్యాఢ్యు లెల్ల
పాప మేటికి ధర్మసంపత్తి గాక.

133


వ.

అది గావున మృగహింసాసముద్భవంబైన స్వభావంబు విడువుము.
మున్ను రాజులు మృగయావిహారంబుచేత నష్టులైరని బోధించిన
భార్యం జూచి యిట్లనియె.

134


మ.

అబలా! నే మృగహింస సేయ మృగయావ్యాజంబునన్ నిర్భర
ప్రబలాభీలనిషాదభిల్లశబరప్రాయాటవీసీమ ది
క్ప్రబలశ్వాపదతస్కరాదిభయముల్ ప్రాపింపకుండన్ బ్రజన్
బ్రబలం జేసెద వెంట నిర్భరధనుష్పాణుల్ ననుం గొల్వఁగన్.

135


క.

తా నేని తనయుఁ డేనియు
భూనాథుఁడు పూనవలయు భూభారముఁ ద
న్మానవులఁ బ్రోచి మఱి స
న్మానించని ధర్మమైన నరక మొనర్చున్.

136


వ.

అని సమ్మతింపంజేసి.

137

రుక్మాంగదుఁడు వేఁటకు వెడలుట

మ.

పవనం బాకృతిఁ దాల్చె నాఁగనెఱి చౌపట్టాలు వ్రేడెంబు మేల్
రవకాల్ద్రొక్కులు మండలభ్రమణధారాపాతసవ్యాపన
వ్యవికృత్తక్రమసంక్రమ[72]క్రమము లొప్పం జారు వాల్తేజిపై
నవనీనాథవతంన మేఁగె మృగయాయత్తైకచిత్తంబునన్.

138


మ.

శతకోటిప్రభ మించి బాలతరుణీజాలస్తనోత్పీడనో
ద్యతమై చక్రఘటాంకుశధ్వజసురేఖాన్వితమై నవ్యభ
వ్యతరాశోకమహీజపల్లవనిభంబై యొప్పు [73]సవ్యేతరో
న్నతహస్తంబు మహీసుపర్వులకు నంతఃప్రీతిగాఁ జూపుచున్.

139


వ.

చను నా సమయంబున.

140

క.

వడదోళ్లు విల్లు నమ్ములు
జడకట్టిన వంకసిగలు జాగిలములు పె
ల్లడిదంబులు వేటరు ల
ప్పుడు పిడుగుం[74]దునియలట్ల మొగి నాల్చంగన్.

141


క.

హరికరికిరిగండకకా
సరగవయతరక్షుఋక్షశల్యకులంగో
త్కరభీకరఘోరవనాం
తరముల కపు డేఁగె ధరణిధవుఁ డుత్కంఠన్.

142


సీ.

పరిపక్వబహువిధఫలశిక్యములతోడ
                       [75]క్షౌద్రవీవధసహస్రములతోడఁ
బంచషసారంగబాలోత్కరముతోడఁ
                       బంజరకీరడింభములతోడఁ
బరిరటత్సంకుశాబకవితానముతోడఁ
                       గస్తూరికామృగోత్కరముతోడఁ
బల్యంకికాదండబహుదండములతోడ
                       భవ్యచామరకదంబములతోడ


తే. గీ.

నేల యీనినగతి వచ్చి నిలిచి కొలువు
మ్రొక్కు మ్రొక్కి యొయారంపుమొనలు దీర్చి
చెంచుదొర లందఱును విన్నవించి రొక్క
వింతగా నంత ధారుణీవిభునియెదుట.

143


సీ.

గావుపట్టెదఁ దొలంగక నిల్చెనేని బె
                       బ్బులుల నెన్నిటినైనఁ [76]బూని తెత్తు
నెలుఁగుఁ గూల్చెద నొక్క[77]యలుగున నిపుడు నా
                       యెలుఁగునఁ గడకడ కేఁగకున్నఁ
దగరుతాఁకుల బోడతలలుగాఁ దాఁకింతుఁ
                       గారుపోతులఁ గొమ్ముగములు విఱిచి
యొంటిగాఁ డెదురైన బంట పోకు మటంచు
                       ఢాకమై విదిలింతు నీకటారి

తే. గీ.

భీకరంబుగఁ దముఁ దామె పెట్టికొనిన
బిరుదు లేటికిఁ జూడు నాపెంపు సొంపు
పట్టనేటికి జముదాళి బాకు కిరుసు
సురియ విలునమ్ములున నేఁడు చూడు రాజ!

144


తే. గీ.

పులి యెలుఁగు పంది దుప్పి కార్పోతు మన్ను
జింక యన నెంత నేఁడు నాచంక నిఱికి
వేనవేలుగఁ దెత్తు నావేఁట చూడు
సామి! బంటుతనంబును సాహసమును.

145


తే. గీ.

నూటి కొక్కండు నామూఁకపోటుబంటు
సామి! పులుఁగైన వెలుఁగైన నేమి విడువు
కత్తియుఁ గటారి నేఁటికి కదిసినపుడె
చంకఁగొట్టి యడంతు నిశ్శంకవృత్తి.

146


వ.

అనుచు [78]వీరాలాపంబు లాడుచుండ.

147


తే. గీ.

దంష్ట్రికాగ్రసమాలగ్నతతసువృత్త
నిరుపమితపంకపటలమై యరుగుదెంచు
నట్టిఘోరవరాహంబు నవనినాథుఁ
డప్పు డాదివరాహమౌ ననుచు విడిచె.

148


తే. గీ.

కృష్ణసారాగ్రగణ్యత కీర్తి కెక్కు
[79]దానిపై బోయ యెప్పుడు తగిలి యేయు
నపుడు మీఁదట నయ్యెడు ననుచు మాన్పె
భూవరుఁడు భక్తినిష్ఠాతిపూర్ణుఁ డగుచు.

149

రుక్మాంగదుడు వామదేవునిఁ జూచుట

వ.

మఱియు నొక్కరుండు శార్దూలమస్తకంబుపైఁ దీవ్రంబులైన క్షుర
ప్రదరంబులు రెండు నాటి యజంబుఁ జేసి విడిచె. ఒక్కఁడు కార్పోతు
విషాణంబులు విరిచి పందికొమ్ము సురియచే వదనంబు గ్రుమ్మి
యేకలంబులం జేసి పాఱిందగిలె. ఒక్కరుండు చమరీమృగంబులం
గరంబుల బాహుమూలంబులఁ బదంబుల నంసంబుల నిఱికించుకొని

బిరుదుజల్లులు వైచిన కైవడి విజృంభించె. ఒక్కరుండు భల్లుకంబుం
గవయించుకొని యీడ్చి కంటకలతాకుంజంబుల వత్సంబులంబోలెఁ
దదీయశిలాలతికలం గట్టివైచె. ఒక్కరుండు వ్యాఘ్రనఖంబుల శశంబు
శిరోభాగంబునం గ్రుమ్మి విషాణంబులు గల్పించె. ఒక్కరుండు
కురంగనాభిస్థలంబు నఖంబులం జీరి తన్మదధారలు పయిం జల్లుకొని
వీరరసావేశంబు దాల్చినట్లు రాణించె. ఒక్కరుండు గైరికారక్తగాత్రుండై
శిఖావంతుండై లోహితాశ్వుం డయ్యె. ఒక్కరుండు గండకంబుల వంశ
లతావలయంబులు దూలించి నర్తింపంజేసె. ఒక్కరుం డెట్టు మెకంబుల
నేని కరచి విదళించి శరంబునం గ్రుమ్మి కరంబునం జిమ్మి
యురంబునం గ్రమ్మి విజృంభించె. ఇట్టు చలాచలలక్ష్యభేదులై నిషాదులు
ముందఱ మార్గంబు చూపఁ బక్కణంబులఁ గుంజాగ్రంబుల నారవైచిన
పలలంబు లంటిన చామరంబులును, సంకుమదపల్వలంబులును,
బ్రోవులైన కస్తూరికాపంకంబులును, గొండలైన కరిమౌక్తికంబులును,
నేరులైన నానాఫలధాతుసధారలును, బడి మొలచిన కప్పురంపుటనంటి
మొక్కలును గలుగం జూచుచు మృగయావిహారంబు సలిపిన యట్లనె
యేఁగుచు మున్యాశ్రమంబులు దాఁటి యష్టోత్తరశతయోజనంబులు
గడచి కదలి యశోకనాగపున్నాగవకుళనారికేలసాలరసాలకంద
రాలసింధువారచందనస్యందననీపలోధ్రకలిద్రుమప్లక్షబదిరాది
నానాతరుశోభితంబై సుగంధిగంధవాహబంధురంబైన యొకయాశ్ర
మంబున హుతభుక్తేజులగు మునిరాజుల వీక్షించి తురంగమంబు డిగ్గి
బహుశిష్యసమేతుండైన వామదేవునిం గాంచి దండప్రణామం బొన
రించిన నతండు కుశాసనంబు వెట్టించి యర్ఘ్యపాద్యంబు లిప్పించి
యిట్లని వినుతించె.

150


మ.

ఫలియించెన్ దపముల్ ఫలించె హుతముల్ పాత్రైకదానంబులున్
ఫలియించెన్ ఫలియించె సత్క్రియలు శ్రీపద్మాధిపార్చావిధుల్
ఫలియించెన్ ఫలియించె మజ్జననసంపద్భాగ్యసౌభాగ్యముల్
ఫలియించెన్ నిను విష్ణుభక్తినిధి భూపాలాగ్రణిం జూచితిన్.

151


తే. గీ.

మహి సుకర్మస్థులును వికర్మస్థులును మ
హాత్మ! నీదు వ్రతంబున హరిపదంబు
గనిరి నినుఁ జూడఁ జిత్త ముత్కంఠఁ జెందు
నంతలోననె ప్రత్యక్షమైతి భూప!

152


వ.

అని వామదేవుం డానతి యిచ్చిన రుక్మాంగదుం డిట్లనియె.

153

క.

ననుఁ గొనియాడకు మో ముని
జననాథ! భవత్పదాంబుజాతపరాగాం
శనిజమహత్త్వము డలదే
జనవిభుఁడ మదాంధుఁడన్ బ్రశంసార్హుఁడనే?

154


క.

ధరణి సురవర్యులం గని
పరితోషము నొంద విష్ణుభక్తి ఫలించున్
ధరణీసురవర్యులఁ గని
పరితోషము నొందకున్న ఫలియించ దిలన్.

155


ఆ. వె

అనిన వామదేవుఁ డనియె నాగృహమున
కరుగుదెంచితివి మహాత్మ! నీ క
భీష్ట మెద్ది? [80]తెలుపు మిచ్చలు హరిదిన
వ్రతపరాయణైకమతధురీణ!

156


వ.

అనిన రుక్మాంగదుండు కరంబులు మోడ్చి యిట్లనియె.

157


సీ.

తాపసోత్తమ! భవత్పాదపద్మంబులు
                       గాంచునంతనె సర్వకామితములు
నాకు లభించె సన్మౌనీంద్ర! యొకసంశ
                       యం బాత్మలో నున్నయది యణంపు
మనఘాత్మ! లోకత్రయాధికసౌందర్య
                       శాలిని మద్భార్య సాధుచర్య
ననుఁ జూచు నవ్యమన్మథునిగా నాసాధ్వి
                       ద్రొక్కినచోట్ల నిధుల్ ప్రకాశ


తే. గీ.

మందు నంటినచోఁ బాప మవియు నగ్ని
పాసి సిద్ధించు షడ్రసబహువిధాన్న
ములు భుజింతురు విప్రకోటులు ధరిత్రి
తన్మహత్త్వంబు చెప్పఁ జిత్రంబు కాదె!

158


తే. గీ.

బ్రాహ్మణోత్తములును విష్ణుభక్తులును జ
రాంధులును రోగులును వచ్చి యాశ్రయింప
నాత్మఁ గరఁగు నవజ్ఞ సేయదు తదీయ
వాక్యములు ద్రోయదు విశిష్టవర్తనమున.

159

క.

ఇటువంటి సాధ్వికడుపునఁ
గుటిలారివిభేదియైన కొడు కుదయించెన్
బటుతరమదోత్కటోద్భట
పటహార్భటి హరిదినప్రభావము నెరపెన్.

160


సీ.

నా మాట జవదాఁటఁ డేమియునేని లో
                       కమున సత్పుత్రుని గనినవాఁడ
నేను జంబూద్వీప మేలితిఁగాని స
                       ప్తద్వీపములు నేలె బాహుశక్తి
రణమున వైరి[81]ధరాతలేంద్రుల గెల్చి
                       యనగ విద్యుల్లేఖ యనఁగ మించు
దాని నా కర్పించె దర్పించి విక్రమ
                       ద్రవిణశాలుర నయుతద్వయము ద


తే. గీ.

శాధికంబున నోర్చి నిరాయుధత్వ
మందఁజేసి జయించె బాల్యమున శ్రీప్ర
భుత్వపరరాజ్యమున కేఁగి పూని కాంచి
యేర్చి యెనమండ్రుకన్యల నిచ్చె నాకు.

161


క.

దివ్యపటదివ్యభూషణ
దివ్యమణిప్రదరములను దీపించఁగ వా
స్తవ్యుం డాతఁ డొసంగెం
భవ్యంబుగ జననికిన్ శుభప్రదనిధికిన్.

162


క.

అకలంకచిత్తుఁ డాతం
డొకనాఁ డీపృథివియెల్ల నుల్లాసముతోఁ
బ్రకటముగఁ దిరిగి మత్పా
దకమలజాభ్యార్చనము ముదంబునఁ జేయున్.

163


వ.

మఱియు విశేషంబునం బ్రాప్యజనంబు శిక్షింపుచు నిశాంతరంబున
నప్రమత్తుండై మద్ద్వారంబుఁ గాచికొని జనుల మేల్కొలుపుచు నుండు.
అప్రమేయంబులగు వైభవంబులఁ దనయుం డిట్టి మహాతనయుండు
గలుగ గృహంబున శుభభోగ్యద్రవ్యంబులు గలవు. శుభాకార
ప్రయోజనంబులు గలవు. వాజివారణరథధనధాన్యంబు లనంతంబుగాఁ

గలవు. మదాజ్ఞాపాలకులగు పూర్వపరిజనులమూఁకలు గల వివి
పూర్వజన్మ సుకృతంబుననో? ఆసుకృతం బెట్లు ప్రాప్తం బయ్యె నెఱిం
గింపవే మహాత్మా!

164


శా.

ఆరోగ్యం బనుకూలకాంత గృహభోగ్యద్రవ్యసామగ్రి దై
త్యారాతిస్ఫుటశక్తి విద్వదతిపూజాసక్తి సత్పాత్రదా
నారంభంబు ప్రభూతపూర్వసుకృతవ్యాపారశీలక్రియా
సారస్ఫూర్తి లభించుఁగాక యితరాసంగంబునం గల్గునే.

165


వ.

అనిన వామదేవుం డిట్లనియె.

166

వామదేవుడు రుక్మాంగదునికి నాతని పూర్వజన్మవృత్తంబుఁ దెలుపుట

సీ.

నరనాథ! పూర్వజన్మమున శూద్రుఁడవు దు
                       ర్దోషదుష్టుఁడవు బద్దుఁడవు నీవు
నీభార్య దుర్గుణనికరపూర్ణశరీర
                       దానితోఁ గ్రుస్సి యబ్దములు గొన్ని
గడపుచు నొకనాఁడు పుడమిపైఁ దీర్థయా
                       త్రాభిముఖుండవై యరిగి యచటఁ
దత్తీర్థతటసభాస్థలమునందుఁ బురాణ
                       గోష్ఠి సల్పుచు ధర్మగుణవిచార


తే. గీ.

దృష్టి శ్రావణశుద్ధద్వితీయమొదలు
గాఁగ నాలుగునెలలు యుక్తంబుగాన
శూన్యశయనవ్రతంబు సంశుద్ది నోచు
నతఁడు ముక్తుఁ డనఁగ వింటి వధిప! మున్ను.

167


వ.

విని నిజగృహంబునకు వచ్చి తద్వ్రతం బాచరించి లక్ష్మీసనాథు
[82]జగన్నాథుం బూజించి పుష్పధూపదీపానులేపనవస్త్రంబుల నుపచారంబు
చేసి విప్రులశయ్యాదానవస్త్రదానభోజనదానంబులఁ దృప్తులం జేసి
తి వాపూర్వజన్మసుకృతవిశేషంబున నేతజ్జన్మంబుననేని హరిభజనం
గావింపుచు నున్నవాడ వాశూన్యశయనవ్రతంబు గృహవృద్ధికరంబు
సకలపాపనాశనకరంబు లక్ష్మీకరం బిది కావింపలేనివారి గార్హస్థ్యంబు

వంధ్యాజననంబునుంబోలె నిష్ఫలం బగు. నీకు జనార్దనుభక్తినిష్ఠ
సర్వంబును ఫలించె నన మ్రొక్కి రాజ్యభారంబునకుఁ దనయుండు దివిరి
యున్నవాఁడు. మందరనగావలోకనంబునకు నేఁగెదనని విన్నవించిన.

168


తే. గీ.

తండ్రిఖేదంబుఁ దీర్చి తద్వాక్యసరణిఁ
దిరుగువానికి గంగానదీజలావ
గాహఫలము [83]లభించుఁ దత్క్షణమునందె
చెప్పఁ జిత్రంబు వాని విశేషమహిమ.

169


క.

గురువాక్యోల్లంఘన[84]దు
శ్చరితుఁడు (దాఁ) ద్రిపథగాంబుసంస్నాననిరం
తరశీలుఁడైన సుకృతాం
తర మింత లభించ దంచుఁ దలఁతురు విబుధుల్.

170


వ.

కావున నీ వవాప్తసకలకాముండవు హరిభక్తిమహోద్దాముండ వని
చెప్పి యనచినఁ దురంగంబు నెక్కి సరస్సరిద్వనోపవనశైలంబులు
చూచుచు శ్వేతగిరి గంధమాదనంబు దాఁటి ముందట.

171


సీ.

భాస్కరశతవిఖాభాసురంబగు దాని
                       హరిభుజాసంఘట్టనాభితస్స్ర
వత్కాంచనరసప్రవాహతఁ దగుదాని
                       బహువృక్షబహుధాతుబహుమణీంద్ర
బహునిర్జరశ్రీల ప్రభల మించినదాని
                       బహుసత్త్వనాదసంపదఁ జెలంగు
దానిఁ దేజోమయోదారామరావతీ
                       పురవతంసములీలఁ బూని మెఱయు


తే. గీ.

దాని [85]మందరభూధరోత్తమముఁ గాంచి
యప్పు డారూఢకాముఁడై యామహీమ
హేశుఁ డెడ యింత [86]దిరిగెడునిచ్చఁ దిరిగి
నిలిచినంతటఁ దచ్ఛైలనికరసీమ.

172

రాజు మోహినిం జూచి సంభాషించుట

తే. గీ.

మోహినీమోహనాద్భుతముఖరముఖర
నస్ఫురద్గానమున మృగశకునినికర
మవశత వహింప వీనుల కమృతముగను
దన్మహానాదరుచి నిండఁ దాను గలఁగి.

173


క.

మోహించి యామహీపతి
[87]వాహము దిగనుఱికి గిరికి వడినుఱికి జగ
న్మోహిని మోహిని లీలా
వాహినిఁ దేజఃప్రవాహవాహినిఁ గాంచెన్.

174


వ.

కాంచి.

175


తే. గీ.

రతియొ మాయయొ యీనగరాజసుతయొ
కమలగేహయొ యీసృష్టికర్త మాన
సాభిలాషంబు స్త్రీ లీలయై నటించె
నో యనఁగఁ దోఁచె నప్పు డాతోయజాక్షి.

176


వ.

అంతఁ బ్రతప్తచామీకరప్రభ నాయింతి లింగాశ్రితత్రినేత్రునేరి
మోహింపంజేయం జూచి యా క్షణంబున మోహించి మహిం బడి
విసంజ్ఞతం జెందినఁ దన్మోహిని కటాక్షాంచలకించిదవలోకనం
బొనరించి కార్యసిద్ధి యయ్యెనని వల్లకీగీతంబు చాలించి యశోక
రక్తాంగుళీపల్లవంబులచేత మృగపక్షిగణంబుల నదల్చుచు స్వవాసనా
గంధలోలంబగు భృంగజాలంబు వారింపుచు మధురోక్తుల రాజా!
లెమ్ము; మూర్ఛిల్ల నేటికి? నీకు నవశ్యంబు వశ్యనైతి; ధరాభారంబుఁ
దృణంగా వహించునట్టి ఘనుండ వీమోహభారంబు వహించు టెంత?
నీకు నామీఁద వాంఛ గలిగినయట్లనె నాకును నీమీఁద వాంఛ జనించె.
నిజదారంబలె నేలి రమింపుమని విన్నవించిన.

177


సీ.

అతిమధురోక్తిరసామృతధారలు
                       చెవులు సోఁకిన రాజశేఖరుండు
[88]శతపత్ర(చారు)విశాలనేత్రంబులు
                       చిగిరించుకొని కొంత చింత నొంది

గద్గదోక్తుల సాత్వికశ్రీలు రాజిల్ల
                       మోహిని నాత్మకామోహిని నతి
[89]పూర్ణలక్ష్మిం గాంచి, పూర్ణగాంతరముల
                       ననుభవించితి నాయొయారు లిట్లు


తే. గీ.

నమితసౌందర్యరేఖాసమగ్రమహిమ
వలచి వలపింపనేర్తురే వనిత! నీవు
వలచి వలపింప నేర్చితి వన్నె మెఱసి
మరులుగొంటి నిరీక్షణమాత్రముననె.

178


చ.

అమృతము చిల్కఁ బల్కక యొయారపుఁజూపులఁ జూచినంతనే
భ్రమము వహించితిన్ వికచపద్మనిభాస్య! యనుగ్రహింపవే
యమితములైన వాంఛితములన్నియు నిత్తు శరీర మిత్తుఁ బ్రా
ణము లిపు డిత్తు రాజ్యము ధనంబును నిత్తు జగంబు మెచ్చఁగన్.

179


చ.

జలనిధిచేలయై రవిశశాకరలోచనయై లసత్కులా
చలమణిభూషయై ఘనవిశాలపయోధరయై స్ఫురన్నభ
స్థలతనువై సురాలయవిశంకటమౌళియునై యధోంతరో
జ్జ్వలకటియైన భూవనితఁ జామ! భవన్నిజదూతిఁ జేసెదన్.

180


వ.

ప్రాణంబు లిచ్చువానికి గజవాజిరత్నమణిభూషణాంబరాదు లిచ్చు
టెంత? నన్నుఁ గటాక్షింపవే యన విని మధురోక్తుల నూరార్చి
యురంబునం జేర్చి యేమియు నేటికి? నేఁ గోరిన వాంఛితం బొకటి
దయసేయవే; యనేకక్రతుకర్తయు బహుపుణ్యరాశియు భూరిద్రవిణ
దాన[90]శస్తంబు నగు దక్షిణహస్తంబు శిరంబున నుంచిన నాకుఁ
బ్రత్యయం బయ్యెడి. నీవు ధర్మశీలుండవు. సత్యకీర్తివి. అనృతంబులు
పలుకనేరవు. యమపురంబు నిర్జనంబు గావించితివని ప్రశంసించిన
రాజేంద్రుం డిట్లనియె.

181

సీ.

బహుబాష లేటికిఁ బ్రత్యయారంబుగాఁ
                       గరియాన! దక్షిణకరము నీకు
నిచ్చితిఁ దప్పితినేని యేతజ్జన్మ
                       సంచితసుకృతనాశ మగు నిన్ను
వలచితి భార్యవై వర్తింపు తనువు ప
                       రాయత్తమై యున్నయది యపూర్వ
శృంగారనిధి! మోహనాంగి! నీ వెవ్వని
                       తనయవు మందరధరణిధరవ


తే. గీ.

రోత్తమాధిత్య కిట వచ్చియుండు టేమి
యబల! యైక్ష్వాకువిభుఁడ రుక్మాంగదుండ
నాఋతుధ్వజపుత్రుండ ననఘయశుఁడ
విదిశ యేలెడి రాజ నో విమలగాత్రి!

182


వ.

ఏను మృగయావ్యాజంబున దుర్జనశిక్షయు సాధురక్ష యొనర్పుచు
వామదేవాశ్రమంబు చొచ్చి యమ్మహామునివలన ధర్మరహస్యంబులు
గొన్ని విని మందరావలోకనాగంబుగాఁ జనుదెంచి యిచ్చట భగవద్గీ
తామృతంబు వీనులవిందై యున్న నేతెంచితి. నన్నుఁ గటాక్షించి
ప్రత్యుత్తరం బొసంగి యనుగ్రహింపవే యనిన విని యిట్లనియె.

183


చ.

అధిప సరోజసంభవుని యాత్మజ నేను సరోజసూతి ని
న్నధిపతిగాఁ దలంచి మన మారఁగ నన్ను సృజించునాఁడు నేఁ
డధికులు రుద్రముఖ్యదివిజాగ్రణు లున్నఁ బరిత్యజించి [91]నేఁ
డధిగతవాంఛితార్థునిఁ గృతార్థుని నిన్ను భజింప వచ్చితిన్.

184


వ.

మనస్సమాధిం దపం బాచరింపుచు నృత్తగీతవాద్యంబుల శంకరు
మెప్పించిన సార్థదినత్రయంబునఁ బ్రసన్నుండయ్యె. సురదుర్లభుండైన
యాపార్వతీవల్లభు నభిలషింపక యతనివలన నీప్సితంబులు గాంచితి;
అన్యోన్యమోహతరంగంబులైన సంగంబు లంతరంగంబున మెలంగ
విలంబంబు వలదని కరంబుఁ గరంబునఁ గీలించి యిట్లనియె.

185


క.

శంక వల దధిప! నే నక
లంకఁగుమారికను గుణకలాపకలాపన్
బంకరుహాప్తకులోద్భవ!
పంకజభవపుత్రి దగదె పరిణయ మందన్.

186

తే. గీ.

అనఘ! సుక్షతయైన కన్యను సగోత్ర
యైన కన్య ద్వితీయ దానైన కన్య
బ్రాహ్మణీశూద్రసంగమోత్పన్నకన్య
స్త్రీత్వవిరహిత యగు [92]కన్యఁ జెందఁదగదు.

187


క.

కానఁ గులంబున గుణ మభి
మానంబును గలుగు సత్కుమారీమణి న
న్నోనృపతి! పెండ్లి యాడిన
భూనుతమై నిజయశంబు పూజ్యత నొందున్.

188


వ.

అనిన నట్లనె శాస్త్రోక్తప్రకారంబున నగ్గిరియందు నుద్వహించి నగు
మొగంబున నిట్లనియె.

189


శా.

నాకశ్రీవిభవోపభోగమహిమల్ నాకల్పమై తోఁచె ము
న్నాకల్పంబు లభించినన్ జెలువ యొయ్యారంబు తేజంబు ల
క్ష్మీకౌతూహలలీల యోగ్యతయు వాసిం గల్గె నీ వబ్బఁగా
నో కల్యాణి! సురేంద్రవైభవము నా కుత్కృష్టమే చూడఁగన్.

190


ఉ.

కాన భవన్మనంబున నొకానొకకాంక్షిత మెద్ది గల్గినన్
ఓ నలినాయతాక్షి! చతురోన్నతిఁ జేసెదఁ జిత్తగింపు మెం
దైనను మంద్రశైలమలయాచలమేరుమహీంద్రనందనో
ద్యానములన్ రమించెదవొ ధన్యత మత్పురిలో రమించెదో.

191


వ.

అనిన మోహిని యిట్లనియె.

192


చ.

సవతులు క్రూరచిత్త లతిసాహనలన్ [93]నృమహోదయప్రియా!
సవతులు చూడ నొల్ల విదిశాపుర మామరణాంతకం బగున్
సవతులపోరు నేఁ దెలిసి సౌఖ్యముఁ గాంతునె? దాని కెవ్వియున్
[94]సవతులు నీనగేంద్రముల సంతతమున్ విహరింప నెంతయున్.

193


సీ.

అనఘ పుత్రవతి సంధ్యావళి యాసాధ్విఁ
                       బాసి నీ వేరీతి బ్రతుకువాఁడ
వతిదుఃఖమున నార్తి నందితివేని నా
                       కధికతరార్తి యౌ నట్లుగాన

నీకు సుఖంబైన [95]నెలవున నుండెద
                       నదియ మందరము నాఁ కాత్మభర్త
యుండినచో భార్య యుండగాఁదగు శూన్య
                       మైన గేహంబైన హైమనగము


తే. గీ.

పెన్నిధానంబు పతి కడుపేదయైనఁ
దండ్రిగృహమున నున్న కాంతాలలామ
యంధతమసంబునందు నత్యంతనరక
మనుభవింపుచు సూకరియై జనించు.

194


వ.

ఇట్లు నే నెఱింగి మందరంబున నుండనోపుదునే? సుఖదుఃఖంబులకుఁ
గర్తవగు నీతోఁగూడ భవత్పురంబున కరుగుదెంచెద ననిన మనంబు
రంజిల్లి కౌఁగిటం జేర్చి యిట్లనియె.

195


క.

దేవేరుల కగ్రణివై
నీవు మహాభోగవిభవనిరతిశయశ్రీ
ప్రావీణ్యంబున నుండుదు
జీవితమునకంటె నతివిశేషము మెఱయన్.

196


క.

అని రుక్మాంగదభూపతి
తనయోపద్రవము మీఁదఁ దలఁచక పలుకన్
వనిత ముహుర్మంజీర
ధ్వని నగములు గరఁగ నడచె [96]ధవుఁడుం దానున్.

197


క.

కొన్ని మహానీలరుచులఁ
గొన్ని మహారజతరుచులఁ గొన్ని రజతకాం
చ్యున్నతముల హరితాభలఁ
గొన్ని చెలంగంగఁ గనిరి కుధరతటంబుల్.

198


సీ.

వజ్రధారాగ్రతీవ్రఖురాగ్రమున ధరా
                       గ్రంబుఁ ద్రిప్పుచు సమగ్రత వహించి
[97] వల్గాముహుర్ముహు ర్వల్గు దంశనజాత
                       ఫేనంబు [98]చుక్కలవిధము గొనఁగ

నాత్మేశ్వరా లోకహర్షహేషితము త
                       ద్దైవతస్వరము చందంబుఁ దెలుపఁ
గనకరత్నాంకురకాంతిచ్ఛటుల మంద
                       రాగపోషిత[99]కీరపూగ మగుచు


తే. గీ.

బెళుకు లీనెడిజల్లులు బిత్తరింపు
మేనిచాయలు సొగసైన మెఱుఁగుపచ్చ
పల్లడము [100]తరకసము డాబా ఫిరంగు
నందమైయున్న జగతేజి నపుడు గాంచి.

199


క.

ఉన్నతఖురాగ్రధారా
నున్నతలోర్వీవిధూతనూతనగృహగో
ధి న్నౌగిలి యున్నఁ గనుఁగొని
యన్నలినహితాన్వయేశుఁ డార్ద్రహృదయుఁడై.

200


తే. గీ.

అపుడు హాహా యటంచు నత్యంతకరుణఁ
గోమలమహీజపల్లవాంకురములందుఁ
బొదిగి మోహిని దెచ్చిన యుదకధార
లపుడు చల్లించి పైఁగప్పి నార్ద్రపటము.

201


వ.

అప్పుడు సేదదేరి గృహగోధిక రాజేంద్రుం జూచి యిట్లనియె.

202


సీ.

నరనాథ! శాకలనగరంబునం దొక
                       విప్రునిభార్య నవీనరూప
యౌవనసంపన్ననైన న న్నొల్లక
                       కలహించుఁ బరుషవాక్యములు పలుకు
నెవ్వరిపట్టున హిత మాచరించువాఁ
                       డీరీతి నను నాడ నెంతకేని
తాళి తాళఁగలేక తతదోషశీలనై
                       పతుల వర్జించిన పౌరసతులఁ


తే. గీ.

దద్వశీకరణౌషధాంతరము లడుగఁ
దమకుఁ బ్రత్యయమైన చందమున నపుడ
పొమ్ము [101]ప్రవ్రజ్య యొకతె యాపురముచెంత
నున్నయది దాసునిగఁ జేయనోపు ననిన.

సీ.

అక్షసూత్రంబుఁ గరాగ్రంబున వహించి
                       వింతగా జపముఁ గావించుదానిఁ
బరితస్సభాసదబర్హి [102]బర్హివ్యజ
                       నానిలసుఖలీల లందుదాని
నవ్యభస్మోద్ధూళనస్ఫుటధావళ్య
                       ధాళధళ్యశ్రీలఁ దనరుదానిఁ
గాషాయవస్త్రసంఘటితయై దీర్ఘజ
                       టామకుటం తేటగలదాని


తే. గీ.

గురుతరస్తంభశతశుభ్రకుట్టిమోరు
హర్మ్యతలమునఁ దేజంబు నందుదాని
వ్రతపరాయణశీలయై వరలుదాని
యోగినీమణిఁ గనుఁగొంటి నొక్కదాని.

204


వ.

కాంచి పదములపై వ్రాల మద్భావం బెఱింగి ప్రసన్నయై చూర్ణంబును
రక్షయు నొసంగి యీచూర్ణంబు క్షీరంబులతోఁ గూర్చి భర్తకుఁ
ద్రావించిన, వాఁడు నీదాసుండగు నీరక్ష నీవు గళంబునం దాల్చిన
నిఖిలవశీకారంబగునని నియోగించిన నేను నట్ల కావించితి. తన్మ
హిమచే భర్త దినదినంబును గృశియించి ముఖంబున వ్రణంబులు పుట్టి
తద్వ్రణంబులం గ్రిమిసహస్రంబులు వొడిమ నస్థిచర్మావశిష్టుండై
యుండి నన్నుం బిలిచి నీదాసుండ నైతి నన్యగృహంబుల కేఁగ నన్నుం
గటాక్షింపవే యనిన నేను దద్యోగిని విన్నవించిన యువశమనౌష
ధంబు దెచ్చిఁ స్వస్థునిఁ జేసితి నంత.

205


సీ.

పంచత నొంది భూపాలక! యేను దు.
                       ర్నరకయాతనల [103]దైన్యంబుఁ గంటిఁ
దప్తతామ్రభ్రాష్ట్రతలమునఁ బదియేను
                       యుగములు క్రకచాళి నొత్తి తనువు
ఖండించి తిలమాత్రఖండముల్ గావించి
                       వేచి పాకంబు గావించి నంత
సంతకభటులు నే నంతట గృహగోధి
                       కాకృతి యమునాజ్ఞ నవనిఁ బుట్టి

తే. గీ.

వత్సరాయుతశతదుఃఖవనధి మునిఁగి
యున్నదాన భవత్కటాక్షోపలబ్ది
జ్ఞాన ముదయించె నాకు నో సార్వభౌమ!
హరిపరాయణు నినుఁ జూచునంతలోన.

206


క.

ధన్య యగు నింతి ధరణి న
నన్యాశ్రిత యగుచు భర్తయాత్మ యెఱిఁగి సౌ
జన్యమున నుండఁగాఁదగు
నన్యదురాచారధర్మ మది విడువఁదగున్.

207


క.

భర్తయె దేవుఁడు గురుఁడున్
భర్తయె లోకంబు లోనఁ బరదైవంబున్
భర్తకుఁ గూర్చక[104]యుండు న
భర్తృమతికిఁ గలవె తదిహపరసౌఖ్యంబుల్.

208


క.

పతిమాటలోనఁ దిరుగని
సతి క్రిమికాష్ఠోపమానసరణిం దిర్య
క్ఛతయోనుల జన్మించున్
బతి హిత మొనరింపవలయుఁ [105]బద్మాక్షులకున్.

209


మ.

శ్రవణద్వాదశినాఁటి పుణ్య మిడి రాజా నన్ను రక్షించు త
చ్ఛ్రవణద్వాదశి నర్మదాసురనదీసంగంబునం దీరమా
డు విశేషంబు జనింపఁజేయునట నీడుం గర్మజాలంబు త
ద్దివసస్నానము సర్వతీర్థఫలసిద్ధిం బొంద నిల్పుం ధరన్.

210


ఆ. వె.

[106]దత్తకల్పధర్మదైవార్చనాదు ల
క్షయఫలంబు లొసఁగు సార్వభౌమ!
విష్ణుభక్తినియతి విజయాదినవ్రత
యెవ్వఁ డాచరించు నీతనికిని.

211


క.

ద్వాదశ్యుపవాసంబు త్ర
యోదశిఁ బారణము సేయ [107]నుత్తమఫల మా
పాదించు ద్వాదశాబ్దఫ
లాదులు దన్మహిమ యింత యం తనఁదగునే?

212

వ.

అట్లు గావునఁ దత్ఫలంబు నాకు నొసంగి ధర్మమూర్తీ! వైవస్వతపద
ధ్వంసీ! పాలించవే యని గృహగోధి పల్కిన విని మోహిని యిట్లనియె.

213


క.

ఇలలోపల సుఖదుఃఖం
బులు దాఁ జేయునవి తానె భుజియించు నరుం
డలవడఁగ క్షుద్ర యిది దు
ష్కలుషాత్మక దీనిఁ బ్రోవఁగా నిఁకఁ దగునే?

214


సీ.

ఇది దుష్ట దుశ్శీల యెంచ రక్షాచూర్ణ
                       ములఁ బతిఁ గారించె [108]మూఢబుద్ధి
సాధువులకుఁజే యు సదుపకారంబు స్వ
                       ర్గయశఃపదంబు లోకంబులోనఁ
బాపాత్ములకుఁ జేయు బహుళోపకారంబు
                       ఘనభయభ్రంశసాధనము శర్క
రామిశ్రదుగ్ధసారంబుఁ దాఁ(గొని) పన్న
                       గములకుఁ బోసిన గరళమైన


తే. గీ.

కరణిఁ దత్పాతకిజనోపకరణ మమరు
విడువు మీ[109]యింతిపైఁ గృప, వెడలవలయు
నగరమున కాత్మసౌఖ్య మెన్నంగఁ గలదె
యన్యకార్యాంతరాసక్తి నలసియున్న.

215


వ.

అనిన రా జిట్లనియె.

216


తే. గీ.

బ్రహ్మపుత్రివి నీ కిట్లు పలుకఁదగునె?
సాధుజనులకు నీదురాచారవృత్తి
యుక్తమే? యాత్మసౌఖ్యకరోద్యమమునఁ
బాతకమే కాని జ్ఞానసంపత్తి కలదె?

217


తే. గీ.

శశియు సూర్యుండు ననిలుండు [110]జగతిఁ బావ
కంబు హరిచందనంబు నాకద్రుమంబు
లుత్తమంబులు నవసంఖ్య నొనరుఁ గీర్తి
ఘనత నుదయించుట పరోపకారమునకె.

218

.

సీ.

ఆరయఁ బరోపకారార్థంబుగా నరుఁ
                       డత్యంతశుభవృత్తి నందవలయు
దీపింప సప్తాంతరీవమధ్యం బేలు
                       సార్వభౌముఁడు హరిశ్చంద్రవిభుఁడు
చండాలమందిరస్థాయియై సుతదార
                       విక్రయ మొనరించి వివిధదుఃఖ
ములఁ బొంది సత్యంబు [111]నిలుపుకొనియె సరో
                       జాసనాదిసువర్వు లభినుతించి


తే. గీ.

వర మొసంగెద మనఁగ భావమునఁ దలఁచి
తరుసరీసృపయువవృద్ధపురుషభామి
నీజనంబులు మత్పురి నేఁడు ముక్తి
నందఁగాఁ దగునని వారి నడిగికొనియె.

219


వ.

తాను నయోధ్యాపురజనంబుతోఁ ద్రిదివంబు నొంది యిప్పుడును
గామగ విమానంబున విహరింపుచు నున్నవాఁడు. పరోపకారంబు
వ్యర్థమే? మఱియును వినుము.

220


క.

అస్థిరతఁ దలఁచి నిర్జరు
లస్థిరతస్ఫూర్తి నడుగ నర్పించఁడె ధ
ర్మస్థుండైన దధీచి వ
నస్థాశ్రమజనము లతిఘనస్థితి మెచ్చన్.

221


తే. గీ.

శ్యేనమున కీఁడె మాంసంబు శిబి కపోత
రక్షణార్థంబు మున్నుగాఁ బక్షిపతికి
[112]జీవనం బొసఁగఁడె నిజచిత్త గరుడ
వాహనుండైన జీమూతవాహనుండు.

222


వ.

అది గావున రాజు దయాళుండు గావలయు. పర్జన్యుండు శుచి
స్థలంబుననేని నశుచిస్థలంబుననేని వర్షించు. చంద్రుండు చండాల
పతితాదులనేని యాహ్లాదకరుండై కరంబులచే స్పృశించు నట్లగుటంజేసి
సుదుఃఖితయై దుర్లిఖితగోధికయైన గృహగోధిక, నిజపుణ్యంబులచేత,
దౌహిత్రులచేత నహుషుండునుంబోలె నుద్దరించెదనని మోహినిని
వారించి విజయాసంభవంబైన సుకృతం బిచ్చితి ననిన నంత.

223

మ.

వరదివ్యాభరణంబు లాని యతిభవ్యంబైన నెమ్మేనితోఁ
దరుణాదిత్యసహస్రతేజమున దిగ్ధామంబు లుద్దీప్తులై
పరఁగంజేయుచు యోగిగమ్యమగు శ్రీపద్మామనోనాథమం
దిరగర్భంబున కేఁగె నిర్జ(రు)లు గీర్తింపంగ సద్భక్తిమై.

224


సీ.

ఆగృహగోధిక నట్లు కటాక్షించి,
                       మోహినితో గంధవాహవాహ
వాహనంబునను బర్వతవనీపాదప
                       నదనదీమృగపక్షినగరఖేట
ఖర్వటగ్రామదుర్గమ[113]ఘోరలక్ష్మిఁ గీ
                       ర్తించి చూచుచు వామదేవునాశ్ర
మప్రాంతమున నిల్చి [114]మఱియు మఱియు మ్రొక్కి
                       యనిలవేగంబున నరిగి సకల


తే. గీ.

ధనకనకవస్తుసామగ్రిఁ దనరు నిఖిల
దేశములు గాంచికొంచు నుదీర్ణపూర్ణ
రత్ననిధి యగు విదిశాపురంబుచెంత
నిలిచియున్నంత దిగ్దేశనృపులతోడ.

225

మోహినీసహితుండైన రుక్మాంగదుని స్వదేశాగమనము

వ.

ధర్మాంగదుం డొడ్డోలగంబై యుండి చారులచే విని, యుదీచిముఖంబున
వెలుంగుచున్నది మద్గురుండు రుక్మాంగదుం డరుదెంచె. తద్వాజి
తేజంబు విజృంభించెనని యెదుర్కొనం దలంచి.

226


క.

జనకుం డేతించినయెడఁ
దనయుం డెదురేఁగి మ్రొక్కఁదగుఁ గాకున్నన్
ఘనఘోరనరకకూపం
బునఁ ద్రోయకయున్నె తపనపుత్రుఁడు వేగన్.

227


తే. గీ.

తండ్రి వచ్చిన నెదురేఁగి దండనతు లొ
నర్చి నిలిచిన యట్టి యానందనునకు
నడుగు నడుగుకుఁ బ్రాపించు యజ్ఞఫలము
లనుచుఁ బౌరాణికోత్తము లాడికొండ్రు.

228

వ.

అనుచు వారలుం దాను యోజనమాత్రంబు పాదచారంబున నెదురుకొని
దండప్రణామంబులు చేసిన విభుండు హయంబు [115]డిగ్గనుఱికి
సుతులం గౌఁగిటం జేర్చి శిరంబు మూర్కొని యిట్లనియె.

229


సీ.

ప్రజల నందఱఁ బరిపాలించితే పుత్ర!
                       యరుల శిక్షించితే యనఘ! న్యాయ
[116]సముపార్జితములైన సద్వస్తుతతులఁ గో
                       శగృహంబు నిల్పితే సత్యసంధ!
విప్రులయెడల సద్వృత్తిఁ గావించితే
                       వేదాదివిద్యల వినయశీల!
కార్యదక్షతఁ గీర్తిఁ గాంచి నిష్ఠురభాష
                       ణములు వర్జించితే నయధురీణ!


తే. గీ.

బాహ్యచండాలగృహములఁ బాఁడి పిదుకు
సురభు లుండిన మాన్పితే సుగుణమూర్తి!
నీవు పాలించు జనపదనికరములను
దండ్రిమాటల నడుతురే తనయులెల్ల.

230


సీ.

అత్తమామలయాజ్ఞయందు వర్తించునే
                       పతిభక్తి గల వధూప్రకరమెల్ల
వరుస విప్రులతో వివాదముల్ దీర్తువే
                       ధేనుబృందములకుఁ దృణము జలముఁ
గలదె తులామానములు దినత్రయమున
                       శోధింతువే విప్రసుజనకోటి
నప్పనల్ గొని వీడ నందింపఁబోవక
                       యుంటివే నీ వేలు నుర్వియందు


తే. గీ.

నరయ నుదపానముఖ్యంబు [117]లచ్చికంబు
లేక యుండెనె యడిగెడు లోకులకును
భిన్నరస భిన్నఫలధాన్య భిన్నవస్త్ర
భిన్నభోజనదాతలబె ట్లణఁచితె.

231

మ.

కరులం దేజుల నీవు దృష్టిగని సాక్షాచ్ఛక్తిఁ బాలించితే
వరుసం దల్లుల కెల్ల హృత్ప్రియముగా [118]వర్తించితే కీర్తిగా
నరు లేకాదశి యుండఁజేసితె నిశానాథక్షయప్రాప్తులన్
గరిమం బైతృక [119]మాచరింతురె జనుల్ కర్మైక విశ్వాసులై.

232


సీ.

మొదల నిద్ర యనర్థమూలంబు, నిద్ర పా
                       పవివర్ధనము, నిద్ర పరమనిత్య
దారిద్ర్యజనని, నిద్ర సమస్తశోకమో
                       హనిదానఖని, నిద్ర యాధిరాజ్య
పాలనవిఘ్నసంపత్తి నిద్ర కుమార!
                       యపరరాత్రంబులయందు నిద్ర
మాని వర్తింతువే మానిని పుంశ్చలి
                       యైన లోకద్వయ మాత్మభర్త


తే. గీ.

కంటనీని తెఱంగున నడఁచు, నిద్ర
రాజులకుఁ గాన నీరీతిఁ బ్రబలశ క్తి
నడఁచితే యంచుఁ దండ్రి నెయ్యం బొసంగఁ
బలుక ధర్మాంగదక్షోణిపాలుఁ డనియె.

233


వ.

స్వామీ! నీకటాక్షంబున నిట్లనె యాచరించిన పుత్రులు జగత్రయ
వంద్యులు. కాకున్నఁ దత్పాతకంబున కంతంబు గలదె? శరీరజీవన
ధర్మంబులు త్వదధీనంబులు. సుతులకుం దండ్రియ దైవంబు. త్రిలో
కియు నీకు సమర్పించిన ఋణంబు తీరునే యని పలుకు తనయునిం
జూచి రుక్మాంగదుం డిట్లనియె.

234


చ.

పలికితి వేదసమ్మతసుభాషలు పుత్రక! తండ్రికంటె భూ
స్థలమునఁ బుత్రసంతతికి దైవత మెవ్వఁడు? తండ్రిమాటలో
మెలఁగని యాకుమారకుని మీఁదట నల్గుదు రెల్లవేల్పులున్
నిలిపితి మత్కులంబు ధరణీభరణాభరణైకదక్షతన్.

235


క.

భూపతులు మెచ్చ సప్త
ద్వీపంబులు నేలితివి సుధీజను లలరన్
సౌపర్వాలోకసుఖ
ప్రాపకుఁడవు నీవె నాకుఁ బావనమూర్తీ.

236

వ.

అనిన ధర్మాంగదుం డిట్లనియె.

237


సీ.

ఎందెందుఁ దిరిగితి రిన్నినా ళ్ళినవంశ
                       శేఖర! యిట్టి రాజీవగంధి
యెచ్చోట నబ్బె సమిద్ధసూర్యాయుత
                       తేజంబు గల్గు నీదివ్యకాంత
నలినజాతుఁడు శిల్పనైపుణి యెల్ల నీ
                       రూపంబునందునె చూపెఁ ద్రిభువ
నంబున నీదృశనవ్యశృంగారైక
                       లావణ్యఖనియైన లలన గలదె


తే. గీ.

యంబయో కుసుమశిలీముఖాంబయో ల
తాంబయగు యమమాయయో యరయ నా న
ఖరశిఖాంతంబు గాఁగ [120]నీ కలికి యొప్పు
చొప్పునం దొచ్చె ము న్నదేసొగసుగాక.

238


క.

ఇటువంటి లోకనుందరి
[121]కుటిలాలక తల్లియైనఁ గుతలంబున ను
త్కటభాగ్యసంపదలు నృప
పటలంబులలోన నాకు ఫలియించుఁజుమీ!

239


వ.

అనిన ధర్మాంగదుఁ గొనియాడి రుక్మాంగదుం డిట్లనియె.

240


క.

తురగారోహణరేఖా
త్వర నొకపక్షంబు నడచి తన్మంద్రమహీ
ధరమునఁ గాంచితి శోణా
ధరమున దరహాసరుచులు దలఁగెడు దీనిన్.

241


క.

జనయిత్రి నీకు నయ్యెడు
వనజాసనతనయ భాగ్యవతి యిది పతిగా
ననుఁ దలపోయుచుఁ దాఁ బ్రా
క్తనతీవ్రభయంకరోరుతప మొనరించెన్.

242


వ.

ఇది మందరశిఖాగ్రంబున దిగంబరేశ్వరు సేవింపుచునుండ నే తన్మంజు
మంజీరశింజితంబు విని కంజాతశరశరభిన్నహృదయుండనైన

[122]నన్ను గారవించి మహోదారత్వంబునం దారత్వంబుఁ గైకొనియె.
నేను నంగీకరించి దక్షిణకరం బిచ్చితి నంత మందరంబు డిగ్గి మూఁడవ
దినంబు నిచ్చటికి జనుదెంచితి నిది నీకు జనని. సంధ్యావళిసమంబు
వందనంబు గావింపుమని నియోగించిన.

243


క.

గురువాక్యంబున వారిము
గురువేణిం గాంచి భక్తి యుప్పొంగ మహా
గురుభక్తి మ్రొక్కి కాలా
గురుగంధిలనగరమధ్యకుంభినియందున్.

244


వ.

తనయుండు రా మోహినిం జూచి రాజు నగుచు ధర్మాంగదుండు
భూపతులతోఁ గూడ నమస్కరించుట నిన్నుఁ గూర్చియ కా వీని ననుగ్ర
హింపుమనఁ గృతాంజలియైన తనయునిం గాంచి హయంబు డిగ్గి
యామోహిని భర్తృదాక్షిణ్యంబున బాహువుల నుపగూహనంబు
గావింపుమని చేసి యెత్తినఁ బునర్దండప్రణామంబు చేసి సుకుసుమ
సువస్త్ర సుభూషణంబులచేతఁ దల్లి నలంకరించి తనవీపునం దల్లిపదం
బానించి హయంబు నెక్కించి రాజు నట్లనే కావించి రాజులుం దానును
బాదచారంబున ముందఱ నడుచుచుఁ దన్మోహినిఁ జూచి యిట్లనియె.

245


ఆ. వె.

లలితశుభవిలాసలక్షణవతులైన
సతులతోడఁ దండ్రి సకలభోగ
వైభవముల నుండ, [123]వర్తించు తనయుండు
ధన్యుఁ డఖిలలోకమాన్యుఁ డరయ.

246


క.

సతి యొకతియైనఁ దండ్రికి
నతిదుఃఖప్రాప్తి దెలియ నాదుఃఖము త
త్సుతులకు లభించుఁ గావున
నితరసుఖంబులు దలంచ నేటికి నింకన్.

247


క.

ఒకతల్లికిఁ బ్రణమిల్లిన
నకలంకస్ఫూర్తిఁ గల్గు నతివుణ్యంబుల్
ప్రకటమతిఁ బెక్కుతల్లుల
కొకమరి వందన మొనర్ప నొందక యున్నే?

248

తే. గీ.

[124]తెలివిమైఁ దల్లిఁ బూజింప దినదినంబు
నక్షయఫలంబు ప్రాపించు నంత కంత
ప్రహరకాష్ఠానిమేషసంభావ్యమాన
సుకృతరాసులు శోధింప నొకనితరమె?

249


వ.

ఇట్లు పల్కుచు విదిశాపురవీథులు దాఁటి యంతఃపురాంతరంబున నశ్వో
రసంబు [125]డిగ్గ, మోహినిం జూచి రాజు ధర్మాంగదగేహంబునకుం
జని పూజాదులు గైకొనుమని నియోగించిన.

250


క.

దరహాసచంద్రికారుచి
తిరమై తగ నపుడు రాజుదేవేరి మనో
హరమైన సుతుని మణిమం
దిరసీమకు నేఁగెఁ బూర్ణతేజం బెసఁగన్.

251


క.

ధగధగ ధిగధిగ లొలుకుచు
సొగసగు మణిపట్టసూత్రశోభితరవిబిం
బగరీయఃపర్యంకిక
దిగధీశకుమారకుఁడు సతీమణి నుంచెన్.

252


వ.

ఉంచి యంత నర్ఘ్యపాద్యంబులిచ్చి సంధ్యావళికంటె నంతరంగంబున
బ్రేమ దళుకొత్త ఘనోరుజఘనస్తన యగు నాతన్వంగిని [126]వర్షా
యుతసమన్వితంగాఁ దన్ను వక్షోత్పన్నబాలకల్పునింగాఁ జింతించి
చరణంబులుం గడిగి శిరంబునం జల్లికొని కృతకృత్యుండ నైతినని
పల్కి సర్వభోగంబులు నొసంగి క్షీరోదమథనజాతకుండలంబు
లమృతప్రభామండనంబు లైనయవి, పాతాళగర్భంబున దానవులు
దాఁచినయవి మోహిని కర్ణంబుల సంస్థాపించి యప్పు డష్టోత్తర
సహస్రధాత్రీఫలనిభశుభమౌక్తికంబుల రచియించిన హారంబులు
కంఠంబున వైచి వజ్రసంయుతంబైన శుద్ధజాంబూనదనిష్క
సూత్రంబు హారాంతరంబునం గైసేసి కరంబులం బదియాఱుమాణిక్య
స్థాపితకంకణంబులు గీలించె. మూల్యవేదులైన నరులచేత నొండొండు
నిష్కకోటి యని [127]విలువదేర నూనూరుకేయూరనూపురంబు
లొసంగి తారకాసురసంగ్రామవిభీతి కాళికాకటిస్థలచ్యుతనానా

రత్నసూత్రంబు మలయాచలంబునఁ బడిన యది గ్రహించిన తమాయి
యను దైత్యుండు మలయంబున నున్న వాని జయించి తెచ్చినది
మోహినికి నొసంగె. హిరణ్యకసిపుభార్య లోకసుందరి శంపా
సహస్రంబుఁ దొలగించు సీమంతభూషణంబు పతివెంట నేఁగుచో
సముద్రమధ్యంబున వైచినఁ దత్సాగరంబు నిజపరాక్రమంబునకు
మెచ్చి యిచ్చె నది ధమ్మిల్లరేఖయందు సవరించె. అతిశుభ్రవస్త్రంబు
లును, గంచుకంబులు నిడియె. సిద్ధహస్తంబున దేవగిరిశిఖరంబునఁ
బ్రాపించిన దివ్యమాల్యదివ్యవిలేపనంబులు సమర్పించె. దివ్యద్వీప
విజయసంప్రాప్తకామవర్ధనద్రవ్యంబులు ప్రతిపాదించె. అంత షడ్ర
సాన్నంబులు భుజియింపంజేసి తన్మాతృహస్తంబునం దానును భుజి
యించి మధురవాక్యంబుల నిట్లనియె.

253


క.

రాజోక్తి [128]నడవఁదగునో
రాజీవాసనకుమారి! రంజిల్లి మహా
తేజమున రాజులెల్లను
బూజార్హులు గారె సకలభువనంబులకున్.

254


క.

రాజహిత మొనర్చు రమణి! పట్టపుదేవి!
ప్రాతికూలవృత్తిఁ బరఁగి రాజు
మనసురాని యింతి మనుజేశుఁ గొల్చిన
జనులకెల్ల [129]దుష్టచరిత గాదె?

255


సీ.

ఆత్మేశ్వరునకు మోహంబుగా వర్తించు
                       చంద్రాస్యమీఁద మత్సరము సేయు
నతివ చతుర్థశేంద్రావధిగత[130]నర
                       కంబులఁ బడుఁ బతిఁ గడప నాడఁ
దప్తతామ్రభ్రాష్ట్రతలమున వేపించు
                       నంతకుం డటుగాన నధిపకార్య
భరణంబుచే నుండుభార్యకుఁ దగ నను
                       కూలతఁ బతిహితగుణము నెరప

తే. గీ.

హీనకేనియు స్వర్లోక మెనఁగి [131]యుండు
నీర్ష్య గర్వంబు నుడిగి [132]సమిధ్ధబుద్ధిఁ
బ్రాణవల్లభు నిష్టసపత్నిఁ జూచు
సతికి సర్వేశలోకంబు సంభవించు.

256


తే. గీ.

పతిహితముగ సపత్ని సపత్నిసేవ
చేసి నిత్యంబు రంజింపఁజేసెనేని
యట్టి సాధ్వీలలామకు నఖిలలోక
పూజితంబైన వైకుంఠపురి లభించు.

257


వ.

ఇందునకు నొకయితిహాసంబు గలదు వినుము.

258

బ్రాహ్మణవృత్తాంతము

క.

శాకలపురమున బ్రాహ్మణుఁ
డేకదురాచారుఁ డతివిహీనుఁడు వ్రతకు
ట్టాకుఁడు వానికి నొకవే
శ్యాకాంత లభించె నాత్మ హర్షం బొందన్.

259


సీ.

ఆబ్రాహ్మణద్రోహుఁ డాదరింపక యున్న
                       [133]వేశ్య కారించిన వికలవృత్తిఁ
జెండక తద్భార్య శీలసంపన్నయై
                       యాయిరువురకుఁ దా ననుదినంబు
పాదము ల్గడుగు నభ్యంగన మొనరించు
                       సంవాహన మొనర్చు సతతనియతి
బహుకాల మీరీతిఁ బరిచర్య యొనరింప
                       నావేశ్య వశ్యమోహకములైన


తే. గీ.

యౌషధములు ప్రయోగింప నందు మీఁదఁ
[134]దదురు పావకభక్షణోద్ధతిని భార్య
కాగ్రహము చూపు నాగ్రహం బంటినట్లు
శాంతి యింతయు లేక దుర్జడత నతఁడు.

260

క.

నిరతశ్రీజితుఁ డగు నా
ధరణీదివిజాధమునకు దారుణత భగం
ధరరోగం బుదయించెం
బరివేదన నొందె వాఁడు పగలున్ రేయున్.

261


క.

సర్వస్వము గొని యాతని
[135]దుర్విధునిం జేసి వేశ్య తొలఁగి చనియె నా
యుర్వీసురు భార్యామణి
నిర్వేదన లేక వచ్చి నిలిచి భజించెన్.

262


వ.

అప్పు డతండు చూచి లజ్జావనతమానసుండై యిట్లనియె.

263


మ.

అతివా! నన్ను ననుగ్రహింపు మిఁక వేశ్యామోహవిభ్రాంతి దు
ర్మతినై నే నపరాధముల్ సలిపితిన్ రాజాస్య! సంపన్మద
స్థితి గర్వించితి బేలనై, సతుల గాసింబెట్టి మూఢుండు షం
డతఁ బాటింపుచునుండుఁ బంచదశజన్మంబుల్ దురాచారుఁడై.

264


క.

ఘనజనులు నింద సేయఁగ
మొనసి దివాకీర్తి గేహమునఁ బుట్టుదునో
వనితాజనతాఖిలపా
పనితాంతనితాంతఘోరపాపము కతనన్.

265


క.

భవదీయక్రోధాద్భుత
పవిఁ దూలితి నన్నుఁ గావు పాపాత్ముని నో
యువతీ నవతీవ్రామయ
భవతీక్ష్ణ శిలీముఖముల పాలైతి నిఁకన్.

266


వ.

అని పల్కు విభునిఁ జూచి యాసాధ్వి యిట్లనియె.

267


సీ.

ఆత్మేశ! నీకు దైన్యము నొంద నేటికి
                       లజ్జించనేల యుల్లమున నాకుఁ
గోపంబు గలదె మత్కోపదగ్ధుఁడ నైతి
                       ననుచు నాడితివి జన్మాంతరోరు

[136]కలుషకృత్యముల దుఃఖములు ప్రారబ్ధంబు
                       లై సంభవించుఁ దథ్యముగ నట్ల
యెఱిఁగి తద్దుఃఖంబునెల్ల సహించినఁ
                       బురుషోత్తముఁడు వాఁడె భూతలమున


తే. గీ.

నీవు చేసిన పాపముల్ నీవె యనుభ
వింపుచున్నాఁడ వాయమవేదనలను
స్వామి! కలనైన రోషవిషాదవృత్తి
యెఱుఁగనని భర్త నూరార్చి [137]యింతి యంత.

268


గీ.

జనకబంధుమిత్రజనకనకము దెచ్చి
యాత్మ భర్త కిచ్చి హరిని గాఁగఁ
జిత్తవీథినుంచి సేవించి భావించి
యుపచరించి చాల నుజ్జగించి.

269


మ.

మలమూత్రంబులరోఁత దీర్చి గుదసీమాభాగనిర్యాసదు
ల్జలఘోరక్రిమికోటికూటము నఖస్పర్శంబునం దార్చి క
న్నుల రేయుంబగలున్ సదా నిదురకున్కున్ లేక వేగించి యా
లలనారత్నము సేవ చేసెఁ బతియుల్లం బుల్లసిల్లం దమిన్.

270


గీ.

భర్త రోగదుఃఖభరమునఁ [138]బొగులంగ
భువనమెల్లఁ బొగులు పోల్కి సాధ్వి
తలఁచి యంత కంతఁ దాతప్యమానయై
యంతరంగసీమ నపుడు గలఁగి.

271


సీ.

నిర్జరోత్తములార! నిఖిలమాతృగణపి
                       తృగణములారా! సుధీరులార!
యారోగ్య మొసఁగుఁ డీయాత్మేశ్వరునకు నో
                       చండిక! మన్మాంసఖండరక్త
ధార లర్పించి యుద్ధతమత్తమహిషంబు
                       గావు పట్టించి యగ్రమున నిర్జ
లోపవాసములు పె క్కుండెద రేయెల్ల
                       సూచి కంటకసంచయా(౦)చితమగు

తే. గీ.

శయ్యపైఁ [139]బండెద మధురసంబుఁ గ్రోల
నాజ్య మే నొల్ల మేని కభ్యంజనంబు
దడవని మ్మింతటిమనోరథంబు నాకు
ననుచు నద్రిజఁ బూజించె ననుదినంబు.

272


వ.

అంత నతండు కొన్నినాళ్లకు రోగబాహుళ్యవైకల్యంబు నొంది త్రికటు
కషాయంబు ప్రదేశిని నిల్చినఁ దదంగుళిదంశనంబు [140]గావింపఁ
దత్ఖండంబునం భర్తృవదనంబు జిక్కిన స్రుక్కక యతనితోఁగూడ
దుఃఖంబు లనుభవించి మురారిలోకంబునకు నేఁగె నది గావునఁ
బతిహితం బొనరించుట పతివ్రతలకు జన్మవ్రతంబు.

273


సీ.

అని పల్కుతనయుని నక్కునఁ జేర్చి సం
                       ధ్యావళి యతనిశిరోంతరము స్పృ
శించి యాఘ్రాణంబు చేసి నీ పల్కిన
                       వచనం బొనర్చెద వన్నె మెఱయ
నీర్ష్యతోఁ బాసి మోహిని భోజనముఖ్య
                       సకలోపచారముల్ సంఘటింతు
నిన్ను నొక్కఁని గని నేఁడు నూర్వురుపుత్ర
                       కులఁ గాంచినట్లనె వెలయఁగలిగె


తే. గీ.

బహునియమ బహునిర్జర బహుమహీశు
పర్వసేవావిధానసంపత్తిమహిమఁ
గంటి నినుఁ బుత్రుగాఁ దమ్మికంటివేల్పు
వంటి సాత్వికరత్నంబు [141]గెంటులేక.

274


క.

శోకానుతాపకారకు
లై కనుపట్టెడు కుమారు లట నూర్వురు దు
ష్పాకులు పుట్టెడుకంటెఁ ద
దేకకుమారుండె లోక మేలఁగఁ జాలున్.

275

తే. గీ.

సకలలోకోపరిప్రదేశమున నున్న
దాన నీసద్గుణస్ఫూర్తిఁ దనయ మాన్య
ధన్య రాజావరోధిమూర్ధన్య నైతి
నూతనముగ ఫలించె నానోములెల్ల.

276


క.

సప్తద్వీపవిభుఁడవై
సప్తాశ్వనిభుండవై యశస్స్ఫూర్తి సుధీ
రాప్తతయై వర్ధిల్లఁగ
దృప్తారి జనంబు కలఁగి తిరిగిరి తనయా!

277


క.

తనయుఁడు పుట్టిన జననీ
జనకుల కాహ్లాదకరణసౌభాగ్యకళా
ఘనశక్తి చూపకుండిన
ననఘా! పాపాత్ముఁ డెంచ నాతఁడు గాఁడే?

278


వ.

అని సూపకారజనంబు నీక్షించిన యంత షడ్రసాన్నామృతాన్న
భాండంబులు ముందర నిడునంత.

279


మ.

అమృతాహారము కందమూలములు సూపాపూపహయ్యంగవీ
నములుఁ జిత్రఫలోత్కరంబు పరమాన్నంబు [142]రసాంచద్విశే
షము మాంగళ్యముఁ దేనె తిమ్మనము పచ్చళ్లాదిగాఁ గల్గు భో
జ్యము వడ్డించె నకించిదంచితవిలాసశ్రీలు దైవారఁగన్.

280


తే. గీ.

[143]పానభాజనవేష్టితచర్మపాత్ర
తలమున విరించినందన తా భుజింప
సాతకుంభాసనమున నాసాధ్వి తాళ
వృంత మొకవింత నంతంత వీవఁ దొణఁగె.

281


వ.

దూరంబున ధర్మాంగదుండు పింఛపుటాలపట్టంబున విసరి భోజనా
నంతరంబునం దాంబూలంబు మడిచి యిచ్చుచునుండ సంధ్యావళి
చందనం బలంది నవ్వుచు, నీవె ధర్మాంగదునకు జననివి కాకున్న నీ
విట్లు సేవింప నెన్నఁడుం గైకొనినదానం గాననినం జూచి ధర్మాంగదుం
డిట్లనియె.

282

తే. గీ.

ధనదుగర్భంబునందు నీతరళనేత్ర
వత్సరత్రయంబు వహించి వాసిఁ గనియె
సాధ్వి! భవదీయపూర్ణప్రసాదమహిమ
వన్నె మెఱయంగ నే నింతవాఁడ నైతి.

283


తే. గీ.

ఇందుముఖి! నాకు జనయిత్రు లెందఱేని
కల్గినం గల్గనిమ్ము లోకములు మెచ్చ
సాధ్వి యీకాంత నిజఘనస్తన్యపాన
మహిమఁ బోషించె న న్నసమానవృత్తి.

284


తే. గీ.

జనని [144]ప్రసవైకవేదన జాలిఁ జెందె
నన్ను నొక్కనిఁ గాంచి యెన్నంగఁ దనువు
శిథిలబంధంబు గాఁగ గాసిల్లె నాకు
నాఋణముఁ దీర్ప మఱి యుపాయంబు లేదు.

285


క.

జననీజనాంకతలమున
దినదినపరివృద్ధిఁ బెరిఁగితి న్నాకంటెన్
ఘనుఁ డెవ్వం డినుఁ డెవ్వం
డనఘుం డెవ్వఁడు తలంప నంబుజవదనా.

286


సీ.

బాలకుమారిక భర్తృసౌఖ్యం బెఱుం
                       గనియట్ల జననియంకంబునందు
మహిమ నుండక కాని మాతృసౌఖ్యముఁ గనఁ
                       డిట్లు మాతాపితృపేతుఁ డొకఁడు
కలుగఁడు జగతి నొక్కట లీలఁ దల్లియం
                       కమునందుఁ [145]బెరిఁగిన కొమరుఁ డతుల
దర్పుఁడై శంభుమస్తకచంద్రకళఁ గరం
                       బునఁ బట్టి తివియంగ భుజబలంబు


తే. గీ.

గలిగి తమకించు జనని యొకర్తు పనుప
[146]జనక హీనతనున్నఁ దజ్జనుఁడు జగము
లన్నియు హరింపఁ దలఁచు శౌర్యమున నట్టి
పటిమ గాదె ప్రసూస్తన్యపానశక్తి.

287

క.

నను సంధ్యావళి గర్భం
బునఁ దాల్చిన నేమి నీకుఁ బుత్రుఁడ నేత
జ్జననికి మీకు విశేషము
మనసున వాక్కునఁ గ్రియాక్రమమునం గలదే?

288


వ.

అని తనయుండు పలుక విస్మయాన్వితయై మోహిని ధర్మజ్ఞుండగు నీ
వినయశీలునియెడ విరుద్ధాచరణంబు సేయ ధర్మంబె? పితృశుశ్రూ(ష)
ణంబునం దిట్టివాఁ డెందునుం గలుగఁ డితండు పుత్రుండై యేను జననియై
యెట్లు ద్రోహకృత్యంబుఁ గావింతునని చింతించి తనయునిం బిలిచి రాజు
రావింపు మతనిం బాసి నిమేషంబు నోర్వననిన శీఘ్రంబున నేఁగి చెప్పిన
రాజు సంధ్యావళిసదనంబునకు నేతెంచి.

289


ఉ.

హావవిలాసవిభ్రమసమన్వితయౌవనలీల దేవి సం
ధ్యావళి మెల్లమెల్లనె సమంచదురశ్శిరవీజనంబుచే
వీవ ననేక[147]భోగములు వెల్లువలై పెనుపొందఁ బాన్పుపైఁ
గేవలమన్మథాస్త్రములఁ గిన్నరకంఠి మెలంగు నంతటన్.

290


వ.

రాజు పొడకట్టిన దిగ్గున లేచి పర్యంకంబున నంకంబున నిడుకొని
రాజ్యభారేచ్ఛ నెట్టు వర్తింపుచున్నవాఁడవు? విశ్వవిశ్వంభరాభరణం
బైన పుత్రరత్నంబు గలుగ నేటికిం గాయక్లేశంబు గుణాధికుండైన తన
యునియందు రాజ్యంబు నిలువక కష్టకృత్యంబునం దిరుగువాఁడు
మహాపాతకుండు గాఁడా? కేవల ఫలభోక్తలై విషయాసక్తచిత్తులగు
వారు పుత్రప్రియభ్రాతృమంత్రిభృత్యసుహృజ్జనంబులు దక్షులు
గలిగిరేని వారియందేని బలవద్వీరులయందేని భారంబు నిల్పి యనుభ
వింపుదురు. వ్యాధిగ్రస్తుండగు దుర్బలుండు ప్రియభోగంబులు విడిచి
న ట్లుండితివి. నీతో నాకుఁ బ్రయోజనం బేమి? అప్రయోజనంబుగా
మందరంబున నుండి యేల తెచ్చితివి? ఏను విషభోజ్య నయ్యెద;
యౌవనోపేతయగు స్వభార్యను దుర్మతియై యెవ్వఁ డంగీకరింపఁడొ
వాఁడు దుర్బుద్ధి యగు, నతనికి నది యెట్లు ప్రియురా లయ్యెడు. భార్య
విడనాడిన జనులు చేసిన దానధర్మంబులు చెడు. ధనంబులు చెడు.
రాజ్యవైభవంబులు చెడు. అనధీతంబైన శ్రుతంబు మానినయట్ల, అల
సులచేత విద్య దొరకనియట్ల, భార్య యాశ్రితవ్రతంబులచేత లభించని
యట్ల, యనుష్ఠాతకు దోషం బుద్భవించనియట్ల, యభక్తులకుం బ్రియుం
డు లేనియట్ల, యజ్ఞానులకు మోక్షంబు ప్రాపించనియట్ల, యత్యాగు

లకు యశంబు దొరకనియట్ల, యనుద్యోగికి సుఖంబు చేకూఱనియట్ల,
యభార్యునకు సంతతి జనింపనియట్ల, యనశ్వునకుఁ బృథివీపాల
నంబు సంభవింపనియట్ల, యగజునకు సంగరంబు జయింప సామ
ర్థ్యంబు పుట్టనియట్ల, యనగ్నికి మృష్టాన్నంబు సిద్ధింపనియట్ల, రివు
నకుఁ బ్రియోక్తు లుదయించనియట్ల, యప్రశ్నునకు నెఱుంగంబడని
యట్ల, యగమనునకు నడువ శక్తి లేనియట్ల, జాగరవంతునకు
భయంబు గనిపించనియట్ల యటుగాన నన్ను ధర్మాంగదుగృహం
బున విడిచి రాజ్యసుఖంబుఁ గోరెద వి ట్లుచితంబే యని కన్నుల
బెళఁకు, మేనితళుకు, సిగ్గుకళుకు దొలఁకఁ బుత్రసన్నిధానంబున
గుణనిధానంబన నున్న మోహినిం జూచి యిట్లనియె.

291


మ.

లలనా! నే నధికారకృత్యమున నాలస్యంబుఁ గావింప ని
స్తులమార్గశ్రమ నిద్రఁ జెందితి దరిద్రుం డర్థపుంజంబుఁ ద్రో
వల వీక్షించినయట్ల ధర్మగుణభవ్యశ్రీల ధర్మాంగదుం
డలఘుం డెట్లు నొనర్చె నర్చనలు నీ కానందమై యుండెనే.

292


వ.

అనిన మోహిని యిట్లనియె.

293


సీ.

ఆత్మేశ యంతఃపురాంగనల్ న న్నుద్వ
                       హించినమొదలు ననేకకామ
భోగనిరాశలై పొగులుచు నున్నవా
                       [148]రింక నూరార్పు హితేరితముల
వరరూపలావణ్యవతులైన జ్యేష్ఠభా
                       ర్యలశిరంబునఁ బ్రియమైన దా
మృత్యువుగా నిల్పి మెఱయించు వానిపై
                       ననురక్తి గలదె తదంగనలకు


తే. గీ.

నట్టికాంతలచేతఁ బంచాస్త్రకేళి
గలదె యనుకూలసాధ్వులు గలుగ నాకు
నగునె కల్యాణలక్ష్మి నన్నట్టి సాధ్వు
లాగ్రహించిన నేరీతి నగుదు నొక్కొ.

294

శా.

[149]ఆసంధ్యావళి మేటిసాధ్వి మృదువాక్యారంభసంరంభయౌ
నీసౌభాగ్యకళాధనంబగు భవత్స్నేహంబున న్నన్నుఁ బ్రే
మాసక్తిం గరగించి షడ్రస[150]రసాభ్యాప్తంబుగా భోజనం
బీ సొక్కింతయు లేక తా నొసఁగె సౌహిత్యంబు చోద్యంబుగన్.

295


క.

[151]తరుణు లిటువంటివారలు
వరసుందరు లెందఱేని వల్లభ! నీమం
దిరమునఁ గలుగఁగఁ దత్పద
పరాగకణతుల్యగరిమఁ బరఁగఁగ నేలా?

296


వ.

అనిన సంధ్యావళియును బుత్రుండును దగ్గరనుండ మోహిని వచనం
బులు విని రాజు లజ్జ నూరకయున్న నింగితజ్ఞుఁడగు ధర్మాంగదుండు
తదవస్థ నెఱింగి సంధ్యావళీముఖ్యజననులం బిలిచి కృతాంజలియై
మోహినీరహఃక్రీడారంభపరుండై రాజు మోహించియున్నవాఁడు.
మీరు ననుగ్రహింపుండని పల్కిన వార లిట్లనిరి.

297


క.

ఈగతి నెవ్వరు పల్కుదు
రీగతి నెవ్వ రిట నడతు రిది చోద్యము పు
త్రా! గురుభక్తిపరుండవు
ప్రాగల్భ్యము నెరపి యిట్లు పలుకందగునే?

298


సీ.

ఆత్మమాంసముఁ దానె యట చవిగొను నెవ్వఁ
                       డనలంబుఁ గరమున నాను నెవ్వఁ
డత్యుగ్రవిషము భోగ్యంబుగాఁ గొను నెవ్వఁ
                       డసిచేతఁ దనతల నడఁచు నెవ్వఁ
డనుపమశిలఁ గట్టుకొని సాగరం బీదు
                       నెవ్వఁడు [152]పులినోట నెసఁగు నెవ్వఁ
డిభవైరి నట లూడ్చ నిచ్చ మైకొను నెవ్వఁ
                       డతి[153]శితఖడ్గధారాగ్రసీమఁ

తే. గీ.

జిందులాడెడు నెవ్వండు సిరి వహించి
సవతితోఁ బ్రాణనాథుఁ డశ్రాంతగోష్ఠి
సలువ నేకాంత యేకాంతసదనసీమ
నిలిచి చూడంగనోపు నో నృపకుమార!

299


వ.

అదియునుం గాక సర్వదుఃఖంబులకు నిదియ దుఃఖతరంబని పల్కిన
ధర్మాంగదుఁ డిట్లనియె.

300


తే. గీ.

కలుషశీలత వాఙ్మనఃకాయకర్మ
హితము సేయక తండ్రికి నెగ్గొనర్చు
నెవ్వఁ డాతఁడు నాశత్రుఁ డెంచ వధ్యుఁ
డరయ సంధ్యావళీసతి యైన నేమి?

301


క.

అందఱిలో నీమోహిని
మందరనగసీమనుండి మనుజేశసుఖా
నందకరప్రియశీలతఁ
జెందినయది గాన హితము సేయఁగవలయున్.

302


సీ.

అనినఁ బుత్రునిమాట లాలించి జననులం
                       దఱును లాలించి గద్గదమనోహ
రోక్తుల నీమాట యోగ్యంబు న్యాయసం
                       యుత మవశ్యముఁ జేయ యుక్త మనఘ!
కించిద్ధనం బొసంగి భవద్గురుండును
                       మోహినీకేళిఁ గ్రమ్ముకొనుఁగాత
అఖిలభోగంబులు ననుభవించి మనంబు
                       దృప్తిఁ జెందినయది తెలియనేల


తే. గీ.

వాసి కెక్కి ద్వితీయవివాహమునకుఁ
గూడి ప్రథమపరిణయద్విగుణధనంబు
లోలి సేయంగఁ దగుఁ గాకయున్న జ్యేష్ఠ
భార్య కాభర్త ఋణికుఁడై పరఁగియుండు.

303


క.

పుత్రేచ్ఛ నన్యనీరజ
నేత్రం బరిణయము నంద నెక్కొని కరుణా
పాత్రంబగు జ్యేష్ఠకు ధన
మత్రత్యులు మెచ్చ ద్విగుణ మర్పింపఁదగున్.

304

వ.

అనిన విని ప్రహృష్టాంతరంగుండై ధర్మాంగదుండు.

305


సీ.

ఒక్కొక్కయింతికి నొక్కొక్కకోటి హై
                       మశలాకికలును గ్రామములు వేయు
నశ్వతరీయుక్తహారికాంచనమాలి
                       రథము లెన్మిది సహస్రనవదాసి
కా నదీరత్నముల్ ఘనఘృతకుంభాయు
                       తము తైలకుంభాయుతము నజావి
కము [154]లసంఖ్యాకముల్ సమవజ్రరత్నాష్ట
                       కంబు మాణిక్యసంఘములు తాచు


తే. గీ.

[155]భూషణంబులు నమలినాశేషభూరి
హారములు చందనంబు కర్పూరములును
[156]గనక పాత్రలు మణిపాత్రకములు గోటి
కనకకుంభాష్టశతము లుత్కంఠ నిచ్చె.

306


వ.

మఱియుం గరేణువులు వింశతియు వింశతియు, నుష్ట్రంబులు [157]శతం
బును శతంబును, శిబికాదండంబులు వేయును, జామరంబులు వేయును
సవిశేషంబుగా నొసంగి ప్రదక్షిణం బొనర్చి మ్రొక్కి మోహినీమోహ
వారిధిం దేలియాడుమని మీర లనుగ్రహింపుండనఁ బుత్రవాక్యంబు
విని రాజేంద్రా! విదేహతనయతో రఘువీరుండునుం బోలె మోహినితో
విహరింపు మీమోహిని కుశకేతుపుత్రి మాకుం జెలియ లీర్ష్య యేమియు
లే దీపుత్రుండు బోధించి మాహృదయంబులు గరంగినయవి. యని
విన్నవించిన రాజు ప్రహర్షంబు నొంది ధర్మాంగదుం జూచి యిట్లనియె.

307


శా.

సప్తద్వీపపరీతభూవలయ మైశ్వర్యంబుతో నేలు మ
త్యాప్తత్రాణము దుష్టశిక్షణము శౌర్యస్ఫూర్తిచేఁ జేసి భూ
గోప్తల్ గొల్వఁగ విష్ణువాసరపరిక్షుణ్ణవ్రతాచారసం
ప్రాప్తిం ధర్మము నిల్పుమీ సుకృతసారజ్ఞుల్ ప్రశంసింపఁగన్.

308


వ.

ఎల్లప్పుడు నీవు దేశంబులు దిరుగు దానంబు వదలక కౌటిల్యంబు
లెఱింగి లోకోత్కృష్టంబైన యాచారం బెయ్యది యదయ కావింపుచు

రాజులకు విశ్వాసం బన్నియెడల వలయుం గావునఁ గోశాగారపరిజ్ఞా
నంబు సేయుచు నుండుము. నీవు సుతుండవైన కతన నాకు నీ
జగన్మోహిని యైన మోహినితోడ విహరింపఁ బునర్యౌవనప్రాప్తి
యయ్యెడు. మనుష్యలోకంబున వృద్ధునకు సురతానురాగంబు
గలుగుట హాస్యకరంబు. మేను జీర్ణం బయ్యె. శిరోరుహంబులఁ బలి
తంబు వొడమె. జీర్ణుండనైన నీచే నజీర్ణుండనై భోగంబు లనుభవించెద.
నే నీకాంత నాకాంతంబు విడిచి నాకాంతయై వచ్చుటంజేసి భవద్భాహు
గుప్తుండనై [158]బర్హినిర్ఝరదివ్యనదీతటంబుల విహరింతు నీపురంధ్రి
మత్ప్రాణంబు. దివ్యకాంత. ఏతన్నిమిత్తంబుగా దేవతలు ఖేదంబు
నొందుచుంజనిరి. దీని సంరక్షింపవలయు ననిన తండ్రివాక్యంబులు
విని యుపచారంబులు గావింప నాజ్ఞానువర్తుల నియోగించి రాజ్య
భారంబు వహింపుచుండె నంత.

309


సీ.

ఈరీతి ధర్మాంగదేంద్రుండు పాలింపఁ
                       బాపబుద్ధులు లభింపరు జగములఁ
బుష్పఫలవిహీనభూరుహంబులు లేవు
                       శాలిరహితమహీస్థలము లేదు
సకలార్తిహరపాపశమనశీతారస
                       దుగ్ధమృతంబు లద్భుతము గాఁగఁ
బిదుకని మొదవుల కదుపు లెవ్వియు లేవు
                       కలఁగి దురుక్తభాషలు వచింపు


తే. గీ.

నంగనలు లేరు దుర్వృత్తులైన యట్టి
తనయులును లేరు పితృగృహస్థాయిని యగు
కన్యయును లేదు విప్రోక్తికలితభవ్య
కార్యములు చేయని మనుష్యగణము లేదు.

310


వ.

మఱియు హరివాసరంబున నెవ్వరు భుజియింపరు వారికి సంపదలు
[159]భోగదానంబులు వ్యవధానంబు నొందవు. నదులు నిదాఘంబున
శోషంబు నొందునట్లు క్షీణత నొందవు. వర్షాగమదూర్వాంకురంబులుం
బోలె నక్షయంబులగు (సస్యసంపద లొంది) దస్యుభయంబులు లేక

(యందఱును) గృహంబుల సత్యధర్మపరులై యఖిలభోగంబులు
ననుభవింపుదురు. భూమి దున్నక పండు. శిశువులకుఁ జనుబాలపుష్టి
గలదు. స్త్రీలు భర్తృభోగ[160]కలిత లగుదురు. స్వరాష్ట్రగుప్తిని
రాజులు హర్షంబు నొందుదురు. [161]ధేనువులు గోపకులు గాయక
స్వేచ్ఛాసంచారంబు చేసి వత్సక్రియలై పాలు గురియుచు [162]నిల
(య)౦బులకు వచ్చు నిట్లు రామరాజ్యప్రకారంబున నుండు నంత.

311

రుక్మాంగదుఁడు మోహినితో సుఖించుట

క.

ఇది దిన మిది రే యిది క్షణ
మిది జా మిది పక్ష మనుచు నెఱుఁగక భోగా
స్పదమగు పదమన నావిభుఁ
[163]డెదమాడి సుభోగభోగ మెసఁగ [164]రమించెన్.

312


శా.

ఆరామామణితో రమించి రవివంశాధీశుఁ డత్యంతతే
జోరమ్యత్వదృఢత్వసత్వబహువస్తుత్వంబులన్ శుక్లప
క్షారూఢద్విజరాజువోలె నుదయం బందెన్ వధూనృత్తగీ
తారంభంబులు గాంచి తద్వనితయాస్యస్ఫూర్తి వీక్షింపుచున్.

313


క.

వరకుంభికుంభపీనాం
తరనీరంధ్రాతివృత్త[165]తత్కుచము లురోం
తరమున రాయుచు ధరణీ
ధరవల్లభుఁ డమితమోహతత్పరుఁ డయ్యెన్.

314


క.

ఆరోమరేఖ యాసొగ
సారుచిరనితంబబింబ మాయొయ్యారం
బౌరా! రాజీవభవుం
డేరీతిం జేసెనో సమిద్ధత దీనిన్.

315

వ.

కరికరాకారరేఖకు బిరుదు గట్టిన యవి యూరువులు, విజితశరధి
సంఘలు జంఘలు, శృంగారరసప్రగల్భంబు గుల్భంబు, నీయింతి
గలుగ నే నింద్రాదులకంటెం గృతార్థుండ నైతి నని హర్షించి యిది
వేఁడిన ధర్మాంగదుండు దక్కం బ్రాణంబేని యిత్తు ననుచు మెచ్చి
యష్టవర్షోపభోగసంలబ్ధి వర్తించునంత.

316


గీ.

తొమ్మిదవయేట ధర్మాంగదుండు మలయ
పర్వతో త్తమమున [166]మహాబలపరాక్ర
మాఢ్యుల ఘనుల (భువన)విఖ్యాతబలుల
గెలిచె నేవురు విద్యాధరుల రణమున.

317


సీ.

అప్పన దెచ్చె విద్యాధరుల జయించి
                       మణులేను నిజశక్తిమహిమ నొకటి
హాటకమయలక్షకోటిపదంబగు
                       నొకటి సహస్రశతోత్తమ[167]పట
దాయకం బొక్కటి తారుణ్యసంపద్వి
                       ధాయకనవసుధాధార లొలుకు
నొకటి [168]గృహప్రధానోత్కటధాన్యసా
                       ధనమయి కీర్తిని దనరు నొకటి


తే. గీ.

వ్యోమగమనంబు నొందించు నొరపు మెఱయ
నట్టి మణిరాజములు దెచ్చి యధికశౌర్య
ధనులు విద్యాధరాగ్రణుల్ దారు నశ్రు
పూర్ణనేత్రాంతలై తదంభోజముఖులు.

318


వ.

వెంటరా ధర్మాంగదుండు రుక్మాంగదక్షితీశుపదంబులపై వ్రాలి వీరె
యేవురు విద్యాధరులు మలయాచలంబున వీరి జయించితి వీక్షింపు
మేతద్భార్యలు సైరంధ్రులయి యీమణులచే మోహినీకాంత నలంక
రింతురు. సర్వకామప్రదంబులై పునర్యౌవనదాయకంబులై యుండు
నీమణులు దాల్చిన జీర్ణవంతులేని లావణ్యవంతు లగుదురు. ఈ
మణులు [169]వళిపలితనాశకంబులు; వస్త్రహర్మ్యసువర్ణాదిచింతిత

.

సిద్ధిమూలంబులు. చింతామణులే కాని యితరమణులు గావు.
గంధర్వులు నేనును ముప్పదిదినంబులు రణం బొనర్చి నీతేజంబున
జయించి యప్పన గొంటి. ఏను సముద్రంబు ప్రవేశించి సముద్ర
గర్భంబున నొకయేఁడు వర్తించితి. నాగశతావృతమైన భోగవతి
నిర్జించి యయుతనాగకన్యలం గొనివచ్చితి. ఫణిఫణారత్నంబులు
దెచ్చితి నచ్చట దానవమందిరంబున కేఁగి యెనిమిదివేవుర దానవీ
కన్యకల నాహరించితి. శతకోటిరత్నంబులు దీపార్థంబుగా నాపా
దించితి. యుష్మత్పరాక్రమపాలితుండనై రసాతలస్థితంబగు వారుణ
లోకంబు చొచ్చి వరుణుం గాంచి బ్రతుకవలసెదవేని మాతండ్రి
యాజ్ఞం దిరుగు మనంగ నలిగి యుద్ధసన్నద్ధుండై యొకవత్సరంబు
పోరె. అతని నారాయణాస్త్రంబునం దూలించిన సమీరవేగంబులై
విజితచంద్రప్రభాభోగంబులై యొక్కొకకర్ణంబు శ్యామంబై తృణ
తోయంబులు లేక బ్రతుకు తురంగాయుతంబును బుష్కరానుజయైన
త్రిలోకసుందరియగు నొకకన్యను భార్యార్థంబుగా సమర్పించె. ఇచ్చ
వలసిన యవి యంగీకరింపుడు. పుత్రార్జితవిత్తంబు గ్రాహ్యంబు.
శంక వలవదు. వ్యయంబు సేయుము. తండ్రియెడ నీధనంబు నే
నార్జించితినని గర్వంబున నాడికొనుపుత్రుం డాభూతసంప్లవంబుగా
నరకం బనుభవించు. కుఠారంబునుం బలెఁ బిత్రధీనుండగు కుమారుం
డిచ్చెనని తండ్రియు ననుకొనందగదు.

319


సీ.

తండ్రిశౌర్యంబునఁ దనయుండు సర్వంబు
                       [170]నార్జించుపట్టున నతనిమహిమ
[171]ధాత పన్నించు నుత్కటతృణవ్రాతంబు
                       పవనపూరితచర్మభస్త్రజలము
ధరియింపఁజేయు సూత్రప్రోతయగు దారు
                       మయయోష దిరుగు సమగ్రశక్తి
[172]నటుగానఁ బితృశక్తి యందు రా తనయుని
                       తేజోబలంబులు దెలిసి చూచి

తే. గీ.

యట్లగుట నీజలాధీశ్వరాగ్రపుత్రిఁ
గాంచి కరుణించి నీయిచ్చ గలిగినట్ల
యిమ్ము పంకజసంభవహితకుమారి
కగ్రదాసిగ మన్నించి యవనినాథ.

320


వ.

అనిన విని మాంధాత యిట్లనియె.

321


తే. గీ.

కొడుకుమాటలు విని రాజకుంజరుండు
మోహినియు నేమి తలఁచిరి మునివరేణ్య
చిత్రతరమైన యీ కథాసూత్ర మెల్ల
నీముఖంబున విన బుద్ధి నేఁడు పొడమె.

322


వ.

అనిన వసిష్ఠుం డిట్లనియె.

323

ధర్మాంగదుని వివాహము

శా.

ఆనీతాద్భుతపుత్రసంపదలు నెయ్యం బంది వీక్షించి ని
త్యానందంబు వహించి భూవిభుఁడు శౌర్యస్పూర్తిసత్కీర్తి ల
క్ష్మీనిత్యోన్నతి ధాత్రి నాజ్ఞ నడిపించెన్ వీఁడు సత్పుత్రుఁ డ
న్యూనజ్ఞాననిధాన మాఢ్యతరుఁ డర్హుం డంచు నూహింపుచున్.

324


క.

అసమకళ సుదిన[173]సుముహూ
ర్తసువిధునక్షత్రతిథుల ధరణిపు లెంచన్
స్వసుతునకు వివాహము సే
య సువిప్రులఁ బిలిచి ధన్యుఁడై పూజించెన్.

325


వ.

పూజించి గోనిష్కసహస్రంబు లొక్కాక్కని కిచ్చి యనిచి
నిజపురోహితునిం జూచి యిట్లనియె.

326


గీ.

యౌవనోపేతుఁడగు పుత్రు నాత్మజనకుఁ
డర్థ మబ్బియును వివాహ మాచరింప
కున్న నాతఁ డగమ్యమై యున్న దుర్ని
రయముల వసింపుచుండు యుగాయుతంబు.

327


వ.

అది గావున బాల్యంబుననే వివాహంబు సేయుట పితృకృత్యంబు
సుతుని నిర్వహించుట తన్ను నిర్వహించుకొనుట. సుతుండు కృత

వివాహుండైనఁ దండ్రి [174]కృతార్థుం డగుటఁ బుత్రుండు గుణవంతుండేని
వివాహంబు సేయవలయు ననం దద్వచనంబులు విని పురోహితుండు
హర్షించి [175]సంకేతంబు లిచ్ఛామాత్రంబునం బొడమక గురువాక్యం
బునం దాఁటకయున్న ధర్మాంగదునకు వరుణాత్మజాపూర్వకంబుగా
నాగకన్యకల వివాహంబు చేసిన, మొదలఁ దండ్రికి మ్రొక్కి యంత
మోహనికిఁ గేలు మోడ్చి తదనంతరంబ సంధ్యావళి చరణంబుల కెరఁగి
నగుచు నిట్లనియె.

328


చ.

గురువచనంబుచేత మయికొంటిఁ బరిగ్రహసత్పరిగ్రహం
బురుతర[176]భక్తియుం గురుహితోక్తియు మామకజీవనంబు ని
ర్భరతరదారసంగ్రహనిరంతరభోగము లేల నాకుఁ ద
ద్గురుపదసేవయే సుకృతగుచ్ఛము నాకము నాకు నేటికిన్.

329


వ.

మనము గురుశుశ్రూష సేయందగు నన సంధ్యావళి యిట్లనియె.

330


మ.

అనఘా! సంతతభోగభాగ్యబలదీర్ఘాయుస్సమేతుండవై
జనకానుగ్రహశక్తి నీవు గలుగన్ సర్వంసహన్ శక్తి స్త్రీ
జనమూర్ధన్యత ధన్యతన్ వెలసితిన్ జాలన్ సపత్నీసతుల్
నను మన్నించఁగ మంటి నీమహిమ నానావైభవస్ఫూర్తులన్.

331


వ.

అని శిరంబు మూర్కొని యనిచిన నితర[177]జనయిత్రుల నట్లనె పూజించి
రాజ్యపాలనంబు సేయుచు నేదేశంబునందు నేప్రయోజనంబు నందు
నేమరక వర్తించె. సర్వకార్యజాగరూకనిర్వాహుండై నిలిచె.
హస్త్యశ్వరథపదాతిపోషణంబు గావించె. దుర్గసంరక్షణం బొన
రించె. తులామానంబులు నెలనెలకు శోధించె. పౌరజనగృహ
కృత్యంబు పరిశీలించె. ఎచ్చట స్తనంధయుండు స్తన్యపానంబు లేక
రోదనంబుఁ గావించు, నెచ్చట శ్వశ్రూజనావమానంబు నొంది వధూ
జనంబు దుఃఖించు, నెచ్చట సమర్థుండై తనయుండు గణన సేయక
యుండు, నెచ్చట వర్ణసంకరం బగు, నెచ్చట గూఢవిభవులై లోకులు
వర్తింతు, రెచ్చట భర్తృమతియైన యింతి కంచుకరహితయై యిల్లు
వెడలి తిరుగు, నెచ్చట సకేశయై విశ్వస్త గనఁబడు, నెచ్చట నకేశ

యగుచుఁ బుణ్యపురంధ్రి రాణించు, నెచ్చట ప్రతిక్రోధియై యుండు,
నెచ్చట నారణ్యకుండు నగరాశ్రయుండగు, నెచ్చట ధనికుండై లోభి
యగు, నెచ్చట నిర్దయుండు వసించు, నెచ్చట గోపాలుండు పురాంతర
వర్తియగు, నెచ్చట ఋత్విజుండు సశాస్త్రుండు గాఁడు, ఎచ్చట దేశి
కాగ్రణియగు గురుండు లేఁడు, ఎచ్చట బాలిశుండు వసించు, నెచ్చట
లోహవిక్రయం బొనరింతు, రెచ్చట నీలి విక్రయంబు సేయుదు, రెచ్చట
నీలవస్త్రనిషేవణంబు గావింతు, రెచ్చట మద్యపానంబు వాటింతు,
రెచ్చట వృథామాంసభోజను లగుదు, రెచ్చట [178]స్వకళత్రపరిత్యాగులు
నిల్తు, రెచ్చట సకలసురసంపూజ్యుండగు విష్ణుదేవుని విడిచి యన్య
దేవతా[179]భజనంబు సేయుదు, రచ్చట నచ్చట వితర్కించి, వాఁ డస్మ
దీయుండు గాఁడని శిక్షింపుచున్నవాఁడని వసిష్ఠుండు మాంధాత
కిట్లనియె.

332


సీ.

ఇట్లు ధర్మాంగదుం డిల యేల నేనరుఁ
                       డైన ధర్మము సేయు నసుఖి లేఁడు
సంతానహీనుఁడై జనుఁ డుద్భవించఁడు
                       వైకుంఠనగరాధివాసి గాని
వాఁడు మృగ్యుం డగు వసుధాజనంబులు
                       తుష్టి పుష్టి దయైకదృష్టియుఁ దగి
వర్తింతు రతితృప్తి వత్సలు చెలరేఁగ
                       ఘటదౌగ్ధులౌ నాల కదుపు పితుకుఁ


తే. గీ.

బూర్ణమైయున్న ప్రతిభూజములకు సీమ
క్షౌద్రపటలంబులం దనిశంబు ద్రోణ
మాత్రమధురసధారలు చిత్రలీల
[180]గీలుకొనుఁ బండు దున్నక క్షేత్రతలము.

333


సీ.

[181]కృతయుగధర్మంబు క్రిందుఁ గావించు త్రే
                       తాద్వాపరయుగమధ్యసమయమున
గగనమార్గము ఘనాఘనలీలఁ బొరయ సు
                       ప్రభ మించి చంద్రబింబంబు మెఱయఁ

గుంభసంభవకళాంకురము తళ్కులు దేర
                       [182]నదులు మిన్నేఱులై పొదల నాశ్వి
నాంతంబునందు దైత్యాది మేల్కొనఁ గుసు
                       మాస్త్రశరాయత్తుఁడై యరణ్య


తే. గీ.

సారకల్హారకమలకాసారసింధు
సంగమమలయమందరసహ్యవింధ్య
హేమనగపారియాత్రమహేంద్రముఖ్య
గిరివరంబులఁ గాంతతోఁ క్రీడ సల్పె.

334


క.

దినదిన మొక్కొకచింతను
దనులావణ్యంబు నెరపి తను నప్పుడు మో
హిని మోహము నందించగ
ఘనుఁ డాతఁడు మఱచె సకలకార్యాంతరముల్.

335


క.

దురితహరమైన యాశ్రీ
హరివాసర మొకటి మఱవఁ డర్థము మఱచెన్
దరుణుల మఱచెన్ ధరణీ
భరణము మఱచెన్ జితారిభరణము మఱచెన్.

336


వ.

ఇట్లు దశమి మొదలుకొని దినత్రయంబు గంధతాంబూలపుష్పాది
కంబును స్త్రీభోగంబును విడిచి వర్జించె. పుణ్యప్రదంబైన కార్తికంబు
ప్రవేశించె. కార్తీకసమంబైన మాసంబును, గృతయుగసమంబైన
యుగంబును, వేదసమంబైన విద్యయును, గంగాసమంబైన తీర్థం
బును. జలదానసమంబైన దానంబును, ధర్మసమంబైన విత్తం
బును, సత్యసమంబైన యశంబును, నారోగ్యసమంబైన యుత్సా
హంబును, [183]గేశవసమంబైన (దైవంబును) గల్గకుండుటం జేసి
కార్తికంబున విషయప్రపణుండేని వ్రతంబు సేయక యుల్లంఘించిన
సర్వధర్మబహిష్కృతుండై తిర్యగ్యోని జనించు నని వసిష్ఠుం
డానతి యిచ్చిన మాంధాత యిట్లనియె.

337

క.

ఇటువంటిమాసమున నా
కుటిలాలకఁ గూడి రాజకుంజరుఁడు మహో
ద్భటమోహపరుఁడు తద్వ్రత
మెటులం గావించె నందు నేమి యొనర్చెన్.

338


వ.

అనిన వసిష్ఠుం డిట్లనియె నాకాలంబున రాజు పటహంబు మ్రోయ
మోహినిం జూచి నీతోఁగూడి పెక్కేండ్లు రమించితి. భవదవమాన
భయంబున నిన్ను వీడనైతి. ఒకటి సంప్రాప్త మయ్యెం జెప్పెద
వినుము. నీయందు మోహంబున ననేకకార్తికంబులు దాఁటె.
హరివాసరంబు దక్కఁ గార్తికంబు వ్రతంబు సేయనైతి. ఇష్టా
పూర్తంబులు వ్యర్థంబులయ్యె. తన్మాసమాహాత్మ్యంబు వినుము.

339

రాజు మోహినికి గార్తీకమాహాత్మ్యము వివరించుట

మ.

మృగయాసక్తులు మాంసభోజనులు సన్మేధాస్థితిం గార్తికో
పగమాద్యంతములందు [184]మాంసభయదంభంబుల్ విసర్జించి ప
న్నగతల్పాలయసీమ నుంద్రు నిరతౌన్నత్యంబుతో నందు నిం
పుగ భక్షానియమం బొనర్చు నరులన్ భూషింప శక్తుండనే?

340


క.

ఇలలో ననేకదానం
బులు గల్గినఁ గల్గనిమ్ము భూరిద్రవ్యం
బులు చిత్తాయాసకరం
బులు పోలునె దీపదానముల నిలలోనన్.

341


క.

ధర భూతికాముఁడగు నా
పురుషుఁడు చేయఁదగు నందు భూరియశశ్శ్రీ
కరమై ధర్మగుణంబున
కిరవై యధికమగు దాన మెయ్యది యైనన్.

342


క.

ఒకచోట సకలదానము
లొకచోటం దీపదాన ముత్కటపుణ్య
ప్రకటతసమములు సర్వా
ధికమౌ కార్తికమునందుఁ దెలివి నొనర్పన్.

343

క.

క్షితిఁ గార్తికమాసం బ
చ్యుతనాభిసరోరుహంబు నూరిజనం బ
చ్యుతపూజ సేయునాతఁడు
శతజన్మాఘములఁ బాయు శౌరిం జెందున్.

344


గీ.

వసుధలో వ్రతోపవాసనియమములు
కార్తికంబునందుఁ గడపెనేని
వాఁడు దివ్యశక్తివైమానికుండయి
తిరుగుచుండు విష్ణుదేశమునను.

345


వ.

అది గావున నాపై మోహంబు వదలి హరిపూజాపరత్వంబున వర్తింపు
నేను వ్రతపరుండ నయ్యెద ననిన మోహిని యిట్లనియె.

346


ఉ.

కార్తికమాస ముత్తమముగా నిటు పల్కితి విస్తరంబుతో
నార్తిహరంబుగాఁ దెలుపు మభ్రధునీకిటిధామపుష్కరా
వర్తములందుఁ జేసెద నవశ్యము దానిమహత్త్వ ముర్విపై
వార్తగఁ దద్వ్రతంబు మునివర్యులకెల్లఁ బ్రకాశమై తగన్.

347


వ.

[185](అనిన మోహినికి రా జిట్లనియె.) కార్తికంబునఁ బ్రాజాపత్య
చరుండై, ఏకాంతరోపవాసియై యేకరాత్రంబునందైన షడ్రాత్ర
ద్వాదశరాత్రపక్షంబులయందేని మానసంబునందేని నుపవాసంబు
గావించిన హరిలోకప్రాప్తి యగును.

348


ఆ. వె

ఏకభుక్తయాచితేతరేతరమహా
వ్రత మొనర్చిన నట్టివాఁడు గాంచు
నవని యెల్ల సంశయము లేదు కార్తిక
మాసరాజమునను మందయాన!

349


సీ.

కార్తికంబున రమాకాంతుపూజ యొనర్చి
                       హరివాసరవ్రత మాచరించ
నరవరేణ్యుండు స్తనంధయుం డెన్నఁడుఁ
                       గాడు ప్రబోధ నీకాలమునను

జాగరం బొనరించి సకలపురాణసం
                       శ్రవణంబు గావించి చక్రిఁ గొల్చి
యారాత్రి దాఁటించె నతిపాతకుండేని
                       హరిలోకమున కేఁగు నతిశయమున


తే. గీ.

రమణిగర్భంబు చొరఁడు వరాహమండ
లంబు తత్కాలమునఁ గుశలమతిఁ జూడ
సా(౦)ఖ్యయోగప్రభావప్రసక్తిఁ బాసి
యనఘనిర్వాణసంపద యాక్రమించు.

350


వ.

కార్తికంబున సూకరమండలంబు చూచి త్రివిధపాతకంబులఁ బాసి
పునర్జన్మంబు నొందండు. కార్తికంబునఁ దైలక్షౌద్రంబులు వర్జింప
వలయు. [186]కాంస్యపాత్రంబున భుజింపందగదు. నిష్వావభక్ష
ణంబు చేసి సంవత్సరకృతపుణ్యంబులం బాసి [187]రాసభియోనిం
బంచదశజన్మంబులు జన్మించు. కార్తిక[188]మాసంబున సూకర
మాంసంబు భుజించిన దుర్మతి షష్టివర్షసహస్రంబులు రౌరవంబునం
బడు. నారౌరవంబులం బాసి గ్రామసూకరంబై జనియించు.
కార్తికంబున మత్స్యభక్షణంబు సేయునతండు చండాలుండై జని
యించు. కించిద్వ్రతాచరణంబు చేయువానికినేనిం గార్తికంబున
సకలపాపంబులు నడంగు. కార్తికంబున వ్రతదీక్షఁ గైకొనండేని
సర్వపుణ్యంబులు నిరర్థకంబులగు. పశుయోనియందు జనియించి
మఱియుఁ గ్రిమికీటకాళియందు నుద్భవించు. కార్తికంబు వచ్చిన
గృహంబున వర్తింపందగదు. విశేషించి కార్తికి గృహంబునఁ జేయం
జనదు. తీర్థాంతరంబునకుం జనవలయు. కార్తీకశుక్లపక్షైకాదశి
నుపవసించి ద్వాదశిప్రాతఃకాలంబున శుభకర్మంబు లాచరించినవానికి
హరిమందిరసీమ లభించు. సంవత్సరవ్రతసమాప్తియుం జాతు
ర్మాస్యవ్రతసమాప్తియుం గార్తికంబునం జేయవలయు. కార్తికంబునఁ
బదిదినంబులు విష్ణునాభిసరోరుహం బని వెలయు; నాదినంబుల
యందు నుత్తరాయణంబు గాకయున్న శుద్దలగ్నంబు లేకయున్న
వివాహంబు లొనర్చినఁ బుత్రపౌత్రాభివృద్ధి యగుఁ గానఁ గార్తిక
వ్రతంబు సలుపవలయు ననిన మోహిని యిట్లనియె.

351

శా.

సత్యారామ[189]తటాధిరోపితసుమాంచత్పారిజాతద్రుమా!
యత్యైశ్వర్యవిశేషపూరితకుచేలాఖ్యాక! పాంచాలికా
సత్యార్తిక్షపణప్రసన్నవిమలస్వాంతా! భజల్లోకసం
పత్యుల్లాసవికాసదాయికరుణాంభఃపూర! భోజ్యాధిపా!

352


క.

ఘంటాకర్ణమనోరథ
ఘంటాపదశీల! బాణకలుషాత్మకదో
ర్లుంటాక! వక్రిమాఖ్య[190]చి
రంటీసౌశీల్యకల్యరక్షోరునిధీ!

353


మహాస్రగ్ధర.

[191]కకుబంతాఖ్యాకరుగ్ముక్కకుదవరశుభాకారరేఖావిధానా
ధికసౌరభ్యప్రసాదా! స్థిరవిభవఘనోదీర్ణతేజఃప్రభావా!
[192]ప్రకటస్వాంతస్థలోకప్రచయసకలసంపత్ప్రకాశాతి[193]హర్షో
త్సుకసచ్ఛ్రీహృద్యశోదాస్తుతచరిత! సుధాంధోజనస్తోత్రపాత్రా!

354

గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నృసింహప్రణీతంబైన
నారదీయపురాణంబునందుఁ జతుర్థాశ్వానము
సంపూర్ణము

  1. దేహంబునం బాపంబు లుండు
  2. ('ను' లేదు.)
  3. యని శౌనకాదు లడిగిన నాసూతుం డిట్లనియె.
  4. వలయునని
  5. విడువవలయుఁ ద్రివర్గ
  6. నుదయమున బాశ
  7. ముఖంబున సేయవలయు
  8. యొనర్చి యట ధాత్రీదా | నోద్ధత బలము
    న్నత బలము య | జ్ఞోద్ధరణబలంబు
  9. అది గాన ద్వాదశి యల్పమైనను స్నానపితృతర్పణమ్ము లెన్నంగ నాడి
  10. హానిద నిజధర్మ హానిదయగు సమ
  11. వృద్ధిని దిన
  12. యట్ల నాచరింపవలయు
  13. దినమున పూర్వ
  14. శి
  15. యుఁ
  16. పంచదశమియు నివి పావనములు
  17. పక్షమున నయనముం దినభాగకంబు
  18. తిథియం దినుపవాసముం గలదె తేజంబు పుణ్యస్థితుల్
  19. దత్తంబు సత్కాలదత్తంబు
  20. ('ను' లేదు)
  21. నుపవసించిన పూర్వ
  22. ముఖ్యములు వోవు తిథినివేధమున
  23. మదహస్తిపై పటహ
  24. నిట చోరదండనమున
  25. తుడుపులు పడియెఁ ద | ద్విష్ణుదివస మహితు వింతకాదె.
  26. నారదుఁ డొయ్యని యరుదెంచి
  27. చిన్నబోయి
  28. (‘న' కొట్టివేయఁబడినది.)
  29. శుభోత్తేజంబు
  30. దనువులొంది
  31. సమవర్తి గాన యిట్లుండ
  32. నొంద
  33. పాప మారునే
  34. నిలయంబులును
  35. పాపం బూని
  36. జేయ
  37. వినం డెన్నండేని
  38. జేయరు దేవ వారు
  39. కురికాశీ
  40. తద్దివ్యపదముఁ జెందు
  41. గర్వియగు తదధికారిని
  42. వారు
  43. మద్భక్తుఁడైన యాభా | స్వద్భక్తుండైన
  44. సద్భక్తిం జేసెదను
  45. జననీతరుణజా
  46. బదియు రెండేండ్లు
  47. యౌవనోత్కటుఁ డైనచో నెంచ నేల
  48. తల్లి వృద్ధయైన తరుణుఁడైనను
  49. లిడఁగ
  50. బరితక్రిమిపూర్ణ
  51. నీవు నొదలో కంజాంతసంజాతభావుకముల్
  52. చని వీక్షించి
  53. జొక్కు చేత వస్తుల్ వ్రజముల్ గలంగవే సముద్యచ్ఛ్వాసనిశ్శ్వాసతం
  54. కావ్యులు సత్కవిత్వ
  55. భూ
  56. మలయఁ
  57. ఆరాజసుతుఁడు
  58. దశవ్యేకాదశిద్వాదశినిశాత్రయం బెల నెడబాయుదు. యౌవనోపేతయై
  59. మహాదయమును మించ
  60. మెఱయ
  61. నినుమడి
  62. గోరం జీరిన యేరుగా నమృతముల్ ఘూర్ణిల్ల శైలంబులుం
  63. సమాను నతఁడు
  64. కల్పనియుతఘోరనిలయముల
    ననయమునుం గూలు దుఃఖరాశి యనంగన్.
  65. బోగశీలులైనవారిని
  66. సర్వకర్మంబులందు న్నతని కేది నియోగంబు సేయందగు
  67. మనల వంశము...
  68. రూపుఁడు భయకులప్రదీపకుఁ డగు
  69. భారముఁ బూనున్
  70. గావించు బ్రసిద్ధికి
  71. క్రమము తోరం బౌర వాల్తేజిపై
  72. సవ్యేతరాశతహస్తంబు
  73. దునియలట్ల పెల్లార్చంగన్
  74. క్షాద్ర
  75. బూని తెచ్చి
  76. యెలుఁగున
  77. వీరాలాపంబు లాడుచు
  78. దానిపైఁ బోయప్పుడు తగిలి యేయ నపుడు
  79. తెలుపు నిచ్చలు
  80. ధరాతలేంద్రులఁ గెల్చి
  81. జగన్నాదుం
  82. లభించు తత్క్షణమునందె
  83. దుశ్చరితుఁడు త్రిపథగాంబు
  84. మందార
  85. దిరుగు నిచ్చఁ
  86. వాహము దిగనురికి గిరికి వడినురికి
  87. నే శతపత్రవిశాలనేత్రంబులు
  88. పూర్ణలక్ష్మిఁ గాంచి
  89. శస్తం బగు
  90. నేఁ డభిగత
  91. కన్యఁ లెల్ల....స
  92. స్మృ
  93. సవతులు యీనగేంద్రమున సంతతమున్ విహరింతు మెంతయున్.
  94. నెలవున నుండెద యదియ
  95. ధవుండుం దానున్
  96. వల్గా ముహుముహుర్వల్గు
  97. చుక్కల విరద గొనఁగ
  98. కీరవార మగుచు
  99. తరకసీలు
  100. ప్రవ్రజ్య యెకటి
  101. బర్హవ్రజనానీని సుఖలీల
  102. దైన్యంబుఁ గాంచి తపతామ్ర
  103. యుండిన భర్తుమతికిఁ గలదె
  104. బద్మాక్షునకున్
  105. దత్తజల్ప
  106. నుత్తమఫలమా పాటించు
  107. గూఢబుద్ధి
  108. యింతిపై కృప
  109. జగతి పావ | కంబు అరిచందనంబు నాకద్రుమంబు | లుత్తములు ననల నవసంఖ్య నొనరుఁ
  110. నిలుపుకొని యేను సరోజాసనాది
  111. జీవనం బొసంగండే నిజచిత్త గరుడ
  112. ఘోరలక్షిం గీర్తించి చూచుచు
  113. మఱియు మఱియును మ్రొక్కి
  114. డిగ్గనురికి
  115. సౌపార్జితములైన
  116. లచ్ఛికంబు
  117. వర్తించితేఁ గీర్తిగా
  118. మాచరించిరె జనుల్ కర్మైకవిశ్వాసులై
  119. నీకలిత యొప్పు | చొప్పునం దొచ్చెము న్నదేసొగసుగాఁక
  120. కుటిలాలకి
  121. నన్నుఁ గారవించి
  122. వర్తించుఁ దనయుండు
  123. తెలివియై తల్లి పూజింప
  124. డిగ్గి
  125. వర్షాయత
  126. విలువ దేర నోనూరకేయూర
  127. నడవదగనో
  128. దుష్టశీల గాదె?
  129. నరకంబులఁ బడు పతి గడుపనాడి తప్త
  130. యుండు దీర్ష్య
  131. సమిద్ధబుద్ధి ప్రాణవల్లభు
  132. వేశ్యఁ గారించిన
  133. దైల నిప్పావన భక్షణోద్ధతని భార్య
  134. దుర్విదునిం జేసి
  135. కలుషకృత్యములు దుఃఖములు
  136. యింతి యెంత
  137. బొగలంగ
  138. బండెదను మధురసంబు
  139. గావించి తత్ఖండంబు
  140. గెంటి లేక
  141. రసావళ్విశేషము మచ్ఛండియు దేవె
  142. పానభాజనచేషిత
  143. ప్రసవైకవేదనఁ జాలిఁ జెందె
  144. బెరిగిన యతండు సారదర్పుఁడై
  145. జనకహీనత నున్నతజజనుఁడు
  146. భోగముల వెల్లువలై
  147. రింక నుల్లార్పు హితోక్తి రతుల
  148. ఆసంధ్యావళివంటి సాధ్వి మృదువాక్యారంభసరంభయై యీ సౌభాగ్యకళాధనంబుగు భవత్స్నేహంబు
  149. రసాభ్యుక్తంబుగా
  150. తరుణీ; యిటువంటివారలు
  151. పులినోర నెసఁగు
  152. సితఖడ్గ
  153. లసంఖ్యాతముల్
  154. భూషణంబులు యామలికక్యాషభూరి
  155. గనకపాత్రమణిపాత్రకములు
  156. శతంబున శతంబును
  157. బర్హనిర్ఝర
  158. భోగదానంబుల వ్యదాసంబు నొందవు.
  159. కలితు లగుదురు
  160. ధేనువుల
  161. నిలంబులకు వచ్చుచు నిట్లు
  162. డిదమాది సుభోగ
  163. రచించెన్
  164. తత్కుచములు దొంతరమున
  165. మహాబలపరాక్ర-విక్రమాఢ్యుల ఘనుల విఖ్యాతబలుల
  166. పటు
  167. గృహప్రధానోత్కటంబై ధాన్య-సాధనంబై కీర్తిఁ దనరు
  168. వళితులితనాశకంబులు
  169. నార్జించు పట్టిన యతని మహిమ
  170. ధాత బణంచు నుత్కట
  171. నటుగాన పితృశక్తి
  172. సుముహూర్త సుఁడు సునక్షత్ర సుతిథుల
  173. కృతార్థుం డగుట, పుత్రుండు
  174. సంకేతంబులై యిచ్ఛామాత్రంబునం బొడమక
  175. భక్తియై గురుహితోక్తియె మామకజీవనంబు
  176. జనయిత్వల
  177. స్వకళత్రపరిత్యాగంబులు నిల్తు
  178. భజనంబు సేయుదురు, యచ్చట నచ్చట
  179. గీలుకొనఁ బండు
  180. కృతయుగధర్మం బొకించు గావింపు త్రేతద్వాపరయుగమధ్యస్థలమున
  181. నదులు మోయేరులై పొదల నాశ్విసాంతంబునందు దైత్యారి మేల్కొనఁ
  182. గేశవసమంబైన గల్గకుండుటం జేసి
  183. మాంసచయధంభంబుల్
  184. ("అనిన మోహినికి రా జిట్లనియె." అనునది లేదు.)
  185. కాంస్యపాత్రంబున భంజింపందగదు
  186. రాసభిర్యోనిం
  187. మాంసంబున
  188. తటాదిరోపిత
  189. చిరంటాసౌశీల్యకల్యసౌభాగ్యనిధీ!
  190. కకుబంతాఖ్యాక యుగ్మక్కకుభతర శుభాకార
  191. ప్రకటస్యాంతశ్యలోక
  192. హర్షోత్సుకసన్మునిహృద్యశోదా