ణాలుచేసేవనితలు కూడ కొంతప్రయత్నంతో పరపురుషునకు వశమవుతారు.

3. అసాధ్యలైన వనితలు

మిక్కిలి సిగ్గుపడే వనితలు, భయపడే వనితలు, ఏదో పెద్ద దుఃఖంలో చిక్కిఉన్న వనితలు, దేనియందున ఆశలేని వనితలు పరపురుషునకు ఎన్నడు వశంకారు. బాగా సిగ్గుపడే వనిత పరపురుష ప్రసంగానికే సిగ్గుపడి వెనుకకు తగ్గుతుంది. భయపడే వనితలు లోకభీతిని వీడజాలనివారై వుంటారు. అందుచే అచ్చట పరపురుషుడు ఎన్నివలలు పరచినా ప్రయోజనం లేదు. ఏదో మహాదుఃఖంలో చిక్కివున్న వనిత ఆదుఃఖచ్ఛాయలు తొలగినమీదట అంగీకరిస్తుందేమోకాని, ఆదుఃఖం మనస్సుమీద పీటవేసుకొని కూర్చుండగా పరపురుష సాంగత్యానికి ప్రాణంపోయినా అంగీకరించదు. ఏదోఆశ - సుఖించవచ్చుననియో, కానుకలు, ధనము లభించుననియో - ఏదో కోరిక వున్నపుడుకదా వనిత పరపురుషునకు వశమవుతుంది. కాని ఏఆశ లేని స్త్రీ పరున కెందుక వశమవుతుంది. అందుకే లోభవర్భితలైన స్త్రీలు పరపురుషున కెన్నడును స్వాధీనలుకారు. ఈ అసాధ్యలైన స్త్రీల విషయంలో పరపురుషుని ప్రయత్నం సఫలం కాదు. సఫలమైనా నిరాపదంగా సఫలంకాదు.

సులభసాధ్యలైన స్త్రీల విషయంలో పురుషుడు తనంతతానే చొరవ దీసికొని వ్యవహరించవచ్చును. లేదా తనకు కొంత జంకు కలిగితే యేస్నేహితునో కార్యసాధనకు వినియోగించవచ్చును. ఇలా అల్ప యత్నంలోనే వారు ఆతనికి స్వాధీనలవుతారు. కొంత ప్రయత్నం చేసిన మీదటగాని సాధ్యలుకాని స్త్రీల విషయంలో పురుషుడు తనంతతానుగా వ్యవహరించకూడదు. స్నేహితునికూడ వినియోగించకూడదు. అట్టి చోటలందాతడు దూతికను వినియోగించాలి.

దూతికలు :

ఇంటి చాకలి స్త్రీ ఇంటిలో నిత్యము పనిచేసే దాసి, పూవులమ్మునది, యోగాభ్యాసముచేయు ఆడుది, పొరుగింటి స్నేహితురాలు, పశువులయొద్ద బాగుచేయు వనిత, చేటిక (పనికత్తె) - వీరు దూతికలుగా వినియోగించుటకు తగినవారు.

పురుషుడు పరవనితకు ఒక సందేశం పంపదలచి ఒక పురుషునే ఈపనియందు వినియోగిస్తే - ఆమె స్త్రీ. ఈతడు పురుషుడు అయినందున ఈసందేశం అక్కడకు చేరడంలో అభ్యంతరాలు ఎక్కువగా యేర్పడతాయి. అంతేకాక ఈపనిని ఆచరించేవాడుకూడ పురుషుడే అయినందున ఆ ఆనందం తానే జుర్రుకొని కూర్చోవచ్చు. అందుచే పరస్త్రీని పొందగోరే పురుషుడెన్నడూ వేరొక పురుషుని (సులభసాధ్యలైన స్త్రీల విషయంలో స్నేహితుని వినియోగించినట్లు) దూతకర్మలో వినియోగించకూడదు. అనగా స్త్రీలనే వినియోగించాలి. ఆస్త్రీలైనా ఆవనిత వుండేచోటుకు ఎక్కడో దూరంగా వుండేవాళ్ళు. ఎప్పుడో కాని ఆమె ఇంటికి రావడానికి వీలులేనివారు అయితే వారివల్లకూడ పని సాధింపబడదు. అట్టివారు ప్రత్యేకం ఈపనిమీద మాటి మాటికి రాకపోకలు సాగిస్తే - "ఈమె అంతదూరం నుండి పనిగట్టుకొని రోజూవస్తోంది. కారణం ఏమిటి?" అన్న శంక ఇతరులకు కలిగి కార్యభంగం అవుతుంది.

అందుచే మామూలుగా ఆఇంటిలోనికి వెళ్ళడం అలవాటున్న వారినే దూతికలుగా వినియోగించాలి. ఇంటిచాకలి వస్తే యెవరికీ అనుమానం కలుగదు, ఆచాకలి స్త్రీయైయున్నందున ఆడవారిఎదుట నిస్సంకోచంగా వ్యవహరిస్తుంది. ఆయింటిలోని ఆడవారుకూడ ఆచాకలిఎదుట ఏవిధమైన చెరుకుదనము లేనివారై ఉంటారు. అందుచే చాకలికి యేదో అవకాశం చూచుకొని పరపురుషుని సందేశం చేరవేయడానికి వీలు యెక్కువగా ఉంటుంది. ఇంటిలో నిత్యమూపనిచేసేదాసి పశుల దగ్గర బాగుచేసే వనిత, అప్పుడప్పుడు ప్రత్యేకపుపనుల ఒత్తిడి కలిగినపుడు వెళ్ళి పనిచేసే చేటిక - ఈముగ్గురుకు కూడ పరపురుష సందేశం అందజేయడానికి అవకాశాలు ఎక్కువ. ఆవనిత ఉండే ఇంటికి పొరుగున నివసించే స్నేహితురాలైన వనితకుకూడ ఇట్టి అవకాశం ఉంటుంది. ఇక పూవులు, అమ్మే వనితలు ఇంటింటికి వెడుతూ ఉంటారు. గనుక వారి రాకపోకలు ఎవరికీ అనుమానం కలిగించవు . కొందరు స్త్రీలు-'యోగమని, యోగాభ్యాసమని, ఆత్మ, పరమాత్మ అని కబుర్లు చెపుతూ ఆయోగంలో కొంత ప్రవేశం కలవారై ఉంటారు. అట్టి స్త్రీలకు స్త్రీలలో కొంత గౌరవము ఆదరము ఎక్కువగాఉండి వారు అందరి యిండ్లకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈవిధంగా యోగినులైన స్త్రీలుకూడ పరపురుష సందేశం భద్రంగా చేర్చి కార్యసఫలతను సాధించకలవారై ఉంటారు. అందు చేతనే దూతికలుగా వీరినే వినియోగించవలెనని చెప్పబడ్డది.

వీరినైనా యోగ్యత చూచికాని పురుషుడు వినియోగించ కూడదు. తగినంత యోగ్యత లేనివారి వలన పని చెడుతుంది.

దూతికా యోగ్యతలు

దూతిక గడుసుదనం కలదై ఉండాలి. ఇతరుల మనస్సులోని భావాలను వారి ముఖంమీదనే చదువగల నేర్పు మిక్కిలిగా కలదై ఉండాలి, ఈయోగ్యతలు లేనినాడు దూతిక వెనుక చెప్పబడినవారిలో ఒకతె అయి ఉన్నా ప్రయోజనం లేదు. అందుచే పురుషుడు ఈలక్షణములు కలవారినే దూతికలుగా వినియోగించాలి. ఎందువల్లనంటే దూతీకృత్యము మిక్కిలి సున్నితమైనది.

దూతీకృత్యము

దూతిక తగు సమయం చూచికాని తాను చెప్పదలచిన ఆపరపురుష సందేశం ఆ పరవనితకు చెప్పకూడదు. ఈ సందేశం చెప్పడానికి ముందు దూతిక ఆవనితతో కామగుణాన్ని వృద్ధిపరచే మాటలు మాట్లాడాలి. ఆమె మాటలు తీయగా-రసవంతంగా - విన్నంతనే ఏవో ఆనందలోకాలలోనికి తీసికొని పోయేవిగా మన్మధభావోద్దీపకాలుగా ఉండాలి. ఇట్టిమాటలు చెప్పి చెప్పి, ఆపురుషుని గుణగణాలు వర్ణించి వర్ణించి, ఆతనితోడి పొందువలని సుఖాన్ని వివరించి వివరించి - ఆదూతిక ఆయువతి మనస్సు స్వాధీనం తప్పునట్లు, ఆ పరపురుషునిపై లగ్నమగునట్లు చేయాలి. ఈ పనిచేస్తూ దూతిక అనుక్షణము ఆవనితయొక్క మనస్సులోని భావాలను ఆమె ముఖలక్షణాలద్వారా గ్రహిస్తూ తగినట్లు వ్యవహరించాలి అప్పుడా యువతి మానసంలో మన్మధుడు తిష్ఠ వేసుకొని కూర్చుంటాడు, ఆమెలో కామాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అపుడామె బిగింపు విడచి తన అంగీకారము నామెకు తెలుపుటయేకాక తల్లివెంట బిడ్డ నడచినట్లు దూతిక వెంటనడచి వెడుతుంది.

ఈపనిని సాధించుటకు దూతికకు ఎంతకాలం పడుతుంది? అన్న విషయం ఆదూతిక నేర్పుమీది ఆపరవనితయొక్క బిగింపుమీద ఆధారపడిఉంటుంది. దూతిక నేర్పుకలదై ఉండి ఆ పరవనితలో బిగింపు తక్కువగావుంటే ఒకటి రెండురోజులలోనే కార్యం సఫలంకావచ్చును. అట్లుకాక ఆపరవనితలో బిగింపు ఎక్కువగాఉంటే దూతిక అప్పుడప్పుడువెళ్ళి తనకార్యానికి అనుకూలములైన మాటలు చెబుతూ క్రమంగా కార్య సాఫాల్యాన్ని సాధించాలి.

ఈవిధంగా పరస్త్రీలకొరకై లోకంలో ప్రయత్నించడం జరుగుతూఉంటుంది. కనుక పురుషుడు తనభార్యను కాపాడుకొనడంలో శ్రద్ధకలవాడైయుండాలి.

స్వభార్యాలక్షణోపాయములు

పురుషుడు భార్యతో పరుషంగా మాట్లాడకూడదు. ఆమెను ప్రేమగా ఆదరిస్తూ ఆమెతో ఏవిషయంచెప్పినా, మృదువుగా మధురంగా చెప్పాలి. ఊరిబయట తోటలలో విహరించడానికి తీర్ధాలలో సంచరించడానికి, సామూహిక ఉత్సావలలో పాల్గొనడానికి భార్యను పురుషుడు నిషేధించాలేకాని అనుమతించకూడదు. ఒకవేళ అనుమతించినా తాను ఏమరుపాటు వహించరాదు. అంతేకాదు, ఇరుగుపొరుగుల తగవులాటలోకూడ తన భార్య పాల్గొనకుండా పురుషుడు జాగ్రత్త తీసుకొనాలి. తీర్థయాత్ర