నాగర సర్వస్వం/కాంతల ఏకాంతధర్మాలు

కాంతల ఏకాంత ధర్మాలు

ఇంతవరకు వివిధ భేదములతోకూడిన కామక్రీడా విధానములన్నియు తెలుపబడ్డాయి. పురుషుడు ఈ శాస్త్రమునందెంత పండితుడైనా భార్యయొక్క అనురూపాచరణం వల్లనే ఆతనియందు ఉత్సాహం జనిస్తుంది. అప్పుడాతడు తనానందించి ఆమెను ఆనందింపజేయ గలుగుతాడు. భార్యయొక్క నడవడి, ఆమెచేతులు, అతనిమనస్సులో ప్రేమోత్సాహాలను జనింపచేయలేకపోతే అతడామెయందు తగినంత అనురాగం ప్రదర్శింప జాలనివాడవుతాడు. ఫలితంగా ఆలుమగల దాంపత్యం రసహీనంగా ఉంటుంది. అందుచే ఏకాంతంలో భర్తయొక్క మానసాన్ని ఆకర్షించడానికి కాంతలు ఆచరింపవలసిన పనులు ఈ ఉపకరణంలో తెలుపబడుతున్నాయి.

తనభర్తయొక్క మనస్సును ఆకర్షించాలని, అతనియొక్క పరిపూర్ణ ప్రేమానురాగాలకు తాను పాత్రం కావాలని ప్రతివనిత కోరుకొంటుంది. అలా భర్తయొక్క ప్రేమానురాగలను వాంఛించే వనిత అన్నిపనులు భర్తమనస్సుకు అనుకూలంగా ఆచరించాలి. భర్తకు అనిష్టమైన పనిని ఆచరించుట, ఇష్టమైన పనియందు అనాదరము చూపుట భార్యకు తగదు. ఆమె ఎల్లవేళల స్వచ్ఛమైన వస్త్రాలను నాజూకుగా ధరించాలి. అందున పతిని కలిసే ఏకాంతసమయంలో ఆమె వస్త్రాధారణం స్వచ్చతాపూర్ణమై - నాగరకతతో కూడినదై ఉండుట మిక్కిలి అవసరము. ఆమె నాగరకులు తమశరీరాలు అలంకరించుకొనే విథానాలయందు నేర్పుగడించి శరీరాలంకరణములో శ్రద్దకలదై ఉండాలి. ఆమె వేషాలంకారాలలో పల్లెటూరివారి అసహ్యకరములైన లక్షణాలు కనిపించకూడదు. ఆమెభర్త మనస్సుకు నొప్పితోచేమాటలు నెన్నడును పలుకక మధురభాషిణియై ఉండాలి.

పతియెదుట పత్నికి భయభక్తులే శోభాజనకాలు. ఆమె పతియందును రాగముతోబాటు భీతినికూడ తగుమాత్రంగా ప్రదర్శిస్తూ లజ్జాశీలయై ఉండుటవల్ల ఆతనిహృదయానురాగాన్ని పొందగలుగుతుంది. స్త్రీలకు సిగ్గు సహజాభరణం. అందుచే పతి ఎరుగని రహస్యములు తనయొద్ద లేకపోయినను స్త్రీ లజ్జాగుణాన్ని విడువకూడదు. అట్టి లజ్జాప్రదర్శనం వల్ల పతియొక్క మనస్సు ఆనందతరంగితం అవుతుంది. నిర్లజ్జ సిగ్గులేనిది) అయిన వనితయందు పురుషునకు విరక్తికలుగుతుంది. అందుచే పతి ఎదుటకూడ వనిత సిగ్గువిడచి ఎన్నడును చరించకూడదు. సంతతము చిరునవ్వుతో కూడిన ముఖముకలదై నాజూకైన వస్త్రధారణంద్వారా అల్పంగా మాత్రమే గోచరించే శరీరముకలదై లజ్జావతియైన వనిత పతియొక్క మానసాన్ని ఆకర్షించ గలుగుతుంది. పతిఎదుట చిరునవ్వును విడచి కోపమును, దుఃఖమును ప్రదర్శించే వనితలు భర్తయొక్క అనురాగావేశాన్ని కూడ సంపాదించలేరు.

చిరకాలమునుండి తాను పతితో కలసి కాపురముచేస్తూ ఉన్నా ఆపతి రతిక్రీడయందాసక్తిచూపినప్పుడు వనిత వెంటనే అంగీకరించరాదు. ఆ సమయమునందామె తన శరీరాన్ని ముడుచుకొని, కొంతసిగ్గును, కొంతభయమును, కొంత వ్యతిరేకతను ప్రదర్శించుటద్వారా మాత్రమే పతియొక్క మనస్సులో అనురాగాన్ని దీప్తం చేయగలుగుతుంది.

ఇక రతిక్రీడ ఆరంభమైనమీదట వనిత అంతవరకు ప్రదర్శించిన సిగ్గును వ్యతిరేకతను కొంతవరకు విడచిపెట్టి తనయొక్క శరీరాన్ని భర్తకు అర్పించాలి. ఆ అర్పించుటలో ఆతనిమీది ప్రేమవలన తాను దీనికి (రతికి) ఒడబడుతూ ఉన్నట్లుండాలేకాని, తానే రతిని కోరుతూ ఉన్నట్లు ఉండకూడదు. సంభోగసమయంలో భర్త ఆవేశముతో తనయొక్క ఏ శరీరభాగాన్ని చూడగోరినా లేక నఖక్షత దంతక్షతము లాచరింపగోరినా ఆ శరీరభాగాన్ని ఆతనిదృష్టికి చేతులకు అందకుండ తప్పించి , ఆతనిని కవ్వించి అందించాలేకాని కోరినంతనే అందీయకూడదు. భర్త తనయొక్క స్తనాదులను చేతులతో నొక్కి పీడించునపుడు భార్య "కూజితము" (పావురము వలె 'కువకువ' మనుట) దంతక్షత మాచరించినపుడు బాధతో "హుంకారము" (ఉహ్ అనుట) నఖక్షత మాచరించినపుడు 'సీత్కారము' (ఇస్ అనుట) అనే ధ్వనులను ఆచరించాలి. ఆమెయొక్క ఈధ్వనులు భర్తయొక్క ఆనందాన్ని పెంపొందిస్తాయి.

రతిక్రీడ కొంతవరకు సాగినమీదట భార్య పులకించిన శరీరముతో, చెమటతో దోగిన ముఖము కలదై అలసటను, ఆయాసమును సూచిస్తూ నిట్టూరుస్తూ నెమ్మదిగా "హా" అని మూల్గుటద్వారా పతియొక్క అనురాగాన్ని వృద్ధిచేయగలుగుతుంది. ఆమెరతివేళ ఔచిత్యమెరిగి- "అబ్బ! అంత మోటుదనమైతే ఎలా? పన్ను గట్టిగా నొక్కకు! నొక్కితే నేను ఓర్చుకోలేను! నాకంత ఓపికలేదు!" - అనే మాటలు పలుకుతూ ఉండాలి.

రతిక్రీడయందు పతి సర్వదా ఒకేరకమైన ఆవేశాన్ని ప్రదర్శించడు. ఒకప్పుడాతడు అల్పా వేశముతో ప్రవర్తిస్తే , ఒకప్పుడు అధికావేశముతోడను, ఒకప్పుడు సాధారణావేశముతోడను ప్రవర్తిస్తాడు. పతిలోని ఈ సంభోగాతురత ఏపాలులో ఉన్నదో గమనించి భార్య తదనుకూలమైన నడవడిని ప్రదర్శించాలి.

ఇక రతిక్రీడ ఉభయుల మనస్సులకు ఆనందజనకంగా సాగుతూ ఉన్నప్పుడు స్త్రీ తన వినయగుణాన్ని విడిచి, ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఒకటి రెండు అశ్లీలాలు (బూతుమాటలు) భర్తతో పలుకుటకూడ అర్హకృత్యమై ఉన్నది. ఆసమయంలో అట్టి బూతుమాటలు భార్య పలికితే భర్తలోని కామావేశం పెరుగుతుంది. ఈఒక్క సమయంలోనే స్త్రీ బూతుమాటలు పలుకుటకు శాస్త్రాలు సమ్మతించాయి దీనికి భిన్నమైన ఏపరిస్థితి యందును ఆమె అశ్లీలాలు పలుకరాదు.

రతిక్రీడ పరిసమాప్తమైనంతనే వనిత శిధిలమైన దేహము కలదై, మూయబడిన కన్నులుకలదై, తనలోని పారవశ్యాన్ని తన శరీరస్థితిచే ప్రదర్శించాలి. రతిక్రీడ ముగిసినమీదట కాంత ఎంత పరవశయై ఉన్నా మిక్కిలి శీఘ్రంగా భర్తయొక్క కంటబడకుండునటు తన జఘనభాగాన్ని (మొలముందు ప్రదేశము) వస్త్రముతో కప్పుకొనాలి. క్రీడా సమాప్తియందు చిక్కులుపడిన తన జుట్టును, అలసటను సూచించుచు చెమటతో దోగిన కన్నులను ప్రదర్శించినట్లు వనిత తన జఘనదేశాన్ని భర్తకు ప్రదర్శించకూడదు.

కాంతలందరు ఈ ఏకాంత ధర్మాలను గుర్తించి చరించాలి. వీనివలన వారిలోని నాజూకుదనం ప్రదర్శింపబడి వారు భర్తను ఆకర్షించగలవారు అవుతారు. లోకంలో కాంతానురంజనం (స్త్రీని సంతోషపెట్టుట) మిక్కిలి సున్నితమైనది. క్లేశముతోకూడినది. ఈఏకాంతధర్మాలను కాంతలు ఆచరించే తీరునుబట్టి పురుషుడు వారియొక్క తృప్తిని, అసంతృప్తిని గ్రహించి తగినట్లు వర్తించాలి. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరును ఆనందమయజీవితం గడపగలుగుతారు.

★ ★ ★

పరదారగమనము

పరదార అనగా పరభార్య ' నపరదారన్‌గచ్ఛేత్ ' పరస్త్రీలను పొందరాదు. అని వేదము చెబుతోంది. పరస్త్రీలపొందు ఈ విధంగా వేదవిరుద్ధము, అధర్మము అయి ఉండగా కామశాస్త్ర గ్రంథముల యందు ఆపరస్త్రీని పొందడానికి, ఉపాయాలు చెప్పబడ్డాయి. అందుచే అవి నింద్యములయ్యాయి - అన్న వాడుకకూడ లోకంలోఉన్నది. కాని ఈవిషయం వాస్తవంకాదు.

పరస్త్రీని పొందరాదనియే సర్వకామశాస్త్రములు ఘోషిస్తూన్నాయి. కాని ఒక్కొక్కప్పుడు కామం మిక్కిలి ప్రబలంగాఉండి తాను వాంఛించిన స్త్రీని - ఆమె పరస్త్రీయేకావచ్చు - పొందలేక పోతే తన తనువుకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఎక్కడనోకాని ఏర్పడదు.