నరసభూపాలీయము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
నరసభూపాలీయము
కావ్యాలంకారసంగ్రహము - చతుర్థాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము దోషంబులను వచింతు, నవియు శబ్దార్ధగతము లై ద్వివిధము లగు | 2 |
సీ. | అప్రయుక్తం బపుష్టార్థంబు నేయార్థ, మసమర్థకంబు నిరర్థకంబు | |
తే. | పదగతంబులు వెలయుసప్తదశసంఖ్య, గడలుకొన వీనిలక్ష్యలక్షణము లెల్ల | 3 |
క. | ఈకవితాదోషోత్కర, మేకడ నీ వొసఁగుమాడ్తి, నియ్యక ఖలు లౌ | 4 |
అప్రయుక్తము —
క. | కవులు ప్రయోగింపనిపద, మవనిం దగ నప్రయుక్త మగు నె ట్లన్నన్ | 5 |
అపుష్టార్థము —
క. | ఎనయఁ బ్రకృతోపయోగం, బునుఁ జెందక యున్నపద మపుష్టార్థం బోఁ | 6 |
నేయార్థము —
క. | ఇలఁ దనసంకేతంబున నిలిపినపద మెంచి చూడ నేయార్థం బౌ | 7 |
అసమర్థము —
క. | ధర నప్రసిద్ధయోగం, బరసి ప్రయోగించుపదమ యసమర్ధం బౌ | 8 |
నిరర్ధకము —
క. | ఇలఁ బదపూరణమాత్రం, బలపడినపదంబు కృతి నిరర్థక మయ్యెన్ | 9 |
గ్రామ్యము —
క. | పామరులభాష గ్రామ్యము, భామినికటిగల్లములు విభాసిల్లు ననన్ | 10 |
చ్యుతసంస్కారము —
క. | వ్యాకరణదుష్ట మగుపద, మేకడఁ జ్యుతసంస్కృతాఖ్య మిది యె ట్లన్నన్ | 11 |
గూడార్థము, అన్యార్థము —
క. | కృతి నఖ్యాతము గూఢం, బతిశయరూఢివ్యపేత మన్యార్థం బై | 12 |
అశ్లీలము —
క. | వ్రీడ జుగుప్సామంగళ, శీలము లగుపదము లొకటఁ జేర్చిన నవి య | 13 |
క. | వసుదేవయోనిగోపీ, విసరమహాపీనకుచనవీనాశ్లేషో | 14 |
అప్రతీతము —
క. | అల శాస్త్రపురాణములనె, కలశబ్దం బప్రతీతకం బగుఁ గృతులం | 15 |
అప్రయోజనము —
క. | అవిశేషవిధాయక మై, కవిసినపద మప్రయోజకము భూతివిభా | 16 |
క్లిష్టము —
క. | దూరార్థము క్లిష్టం బగు, ధారుణిఁ బవనాశనేంద్రధరమకుటాలం | 17 |
సందిగ్ధము —
క. | సందిగ్ధ మనఁగఁ జెలఁగును, సందేహాస్పదపదంబు సమరధరిత్రీ | 18 |
విపరీతధీప్రదము —
క. | జగతి న్విరుద్ధ మతికర, మగునది విపరీతధీప్రదాఖ్యం బనఁగా | 19 |
ఆవిమృష్టవిధేయము —
క. | అవిమృష్టవిధేయం బగుఁ, దవిలినవర్ణ్యాంశ మప్రధానం బైనన్ | 20 |
పరుషము —
క. | శ్రుతికటువు లైనపదములు, కృతిఁ బరుషము లనఁగఁ జెలఁగు నిలఁ గుధ్రేడ్జా | 21 |
వాక్యదోషములు —
సీ. | అక్రంబు విసంధి ప్రక్రమభంగంబు, పునరుక్తియుత మసంపూర్ణతరము | |
తే. | వచన మక్రియసంబంధవర్జితములు, వాక్యగర్భితమును నన వాక్యదోష | 22 |
అక్రమము —
క. | క్రమహీన మక్రమం బగు, సమధిక మగు నితనికీర్తి శౌర్యచ్ఛాయా | 23 |
విసంధి —
క. | అపగతలక్షణమును గ్రా, మ్యపుసంధియుఁ దగ విసంధి యనఁ దగు నరిగె | 24 |
ప్రక్రమభంగము —
ఆ. | ప్రక్రమంబు విడువఁ బ్రక్రమభంగంబు, శౌరి దానవారిఁ జక్రధారి | 25 |
పునరుక్తియుతము —
క. | ఎనయఁగ శబ్దార్ధంబులు, పునరుక్తము లైన నదియె పునరుక్తియుతం | 26 |
అపూర్ణము —
క. | ధరలోఁ గ్రియాన్వయంబుల, సరిపోని దపూర్ణ మనఁగ సన్నుతి కెక్కున్ | 27 |
వాక్యసంకీర్ణము —
క. | ఏకడ వాక్యాంతరితప, దాకీర్ణము వాక్యకీర్ణ మగుఁ బొగడుదు రీ | 28 |
వ్యాకీర్ణము —
క. | భ్రాంతికరం బగు నన్వయ, మెంతయు వ్యాకీర్ణ మయ్యె నీడుఁడు తిలకముం | 29 |
అధికపదము —
క. | తలఁపఁగ మిక్కిలిపదములు, గలిసిన యది యధిక పదము కమలారికలా | 30 |
వాచ్యవివర్జితము —
ఆ. | వాచ్య ముజ్జగింప వాచ్యవివర్జితం, బనఁగ నెగడు నాజి నభవుఁ నైనఁ | 31 |
అరీతి —
క. | రసమున కనుచితమగుపద, విసర మరీతి యనఁ బొల్చు విటజనహృదయ | 32 |
న్యూనోపమము, అధికోపమము —
తే. | ఉపమ చాల కున్న న్యూనోపమం బది, కోపమాఖ్య మధిక ముపమ యైన | 33 |
సమాప్తపునరాత్తము —
క. | క్రమ ముడిగి మగుడఁ బూనిన, సమాప్తపునరాత్త మయ్యె శాశ్వతు నభవుం | 34 |
అస్థానసమాసము —
క. | అపదసమాసం బస్థా, నపటుసమాసంబు రిపుల ననిఁ దునిమెద నే | 35 |
ఛందోభంగము, యతిభంగము —
క. | ఛందము యతియుం దప్పిన, ఛందోయతిభంగము లగుసంగతి నితఁడున్ | 36 |
పతత్ప్రకర్షము —
క. | క్షితి నుత్కర్ష ము దక్కినఁ, బతత్ప్రకర్షంబు గవయ భల్లూకమృగీ | 37 |
భిన్నలింగము, భిన్నవచనము —
ఆ. | ఉవిదఁ బురుషుఁ బోల్ప నొకనిఁ బల్వురఁ బోల్ప, భిన్నలింగ మనఁగ భిన్నవచన | 38 |
అక్రియము లేక అశరీరము —
క. | తుదలఁ క్రియాశూన్యము లగు, పదంబు లశరీర మనఁగఁ బరఁగు న్విభవా | 39 |
సంబంధవర్జితము —
క. | సంబంధవర్జితం బగు, సంబంధము విడువ గరులు శైలములు తురం | 40 |
వాక్యగర్భితము —
క. | నడుమ నొకవాక్య పద్ధతి, తొడరిన నది వాక్యగర్భదోషము ఖలు లౌ | 41 |
అర్థదోషములు —
క. | క్రమమున నిఁక నర్థదో, షముల నెఱింగింతు సుకవిజనులకు హీనో | 42 |
తే. | వ్యర్థ మేకార్థము ససంశయం బపక్ర, మము విరుద్ధంబు విరసాతిమాత్రహేతు | 43 |
హీనోపమము, అధికోపమము —
తే. | ఉర్వి ఘను నల్పుఁ బోల్ప హీనోపమంబు, శ్వానమునబోలె నితఁడు విశ్వాసి యనఁగ | 44 |
అసమోపమము, అఖ్యాతోపమము —
తే. | ఉపమ సరివోని దిల నసమోపమంబు, హలధరుఁడు మేరుగిరివోలె నలరు ననఁగ | 45 |
పరుషము —
క. | పరుషార్థంబులు గలయం, పరుషం బనుదోష మయ్యెఁ బరఁగెడు నీభూ | 46 |
వ్యర్థము, ఏకార్థము —
తే. | అప్రయోజనంబు వ్యర్ధ మౌ ఫేనిలం, బైనజలధి దాఁటె ననిలతనయుఁ | 47 |
ససంశయము —
క. | క్రమమఱిపదములు సంది, గ్ధము లైన ససంశయంబు ధరణీవరుధై | 48 |
విరుద్ధము —
క. | క్రమ మెడలి దేశకాలా, సముచితము విరుద్ధ మయ్యె సమదవిలోల | 49 |
విరసము —
క. | ధర ననుచితరసభావము, విరసం బగు నితనిసమదవిద్వేషితలో | 50 |
అతిమాత్రము, హేతురహితము —
క. | క్షితిలో లోకాతీతం, బతిమాత్రము నింగి నిండె నబ్జాక్షికుచ | 51 |
నిరలంకృతి, అశ్లీలము —
క. | ధరజాతిమాత్రశూన్యము, నిరలంకృతిబాహుయుతుఁడు నృపుఁ డన లజ్జా | 52 |
సహచరచ్యుతము —
క. | సరిగా సరిగా నిది యు, ర్వరపైఁ బొందింప సహచరభ్రష్టం బౌఁ | 53 |
భిన్నము —
క. | భిన్నం బగుసంబంధవి, భిన్నం బీతనివిరోధపృథివీశ్వరుఁ డా | 54 |
క. | రసములు వాచ్యము లైనను, వెస నదియును దోప మయ్యె విపులోగ్రరణం | 55 |
గుణములు —
తే. | ఇంక గుణములు వివరింతు నివియుఁ గృతుల, దొరసి శ్లేషప్రసాదమాధుర్యసౌకు | 56 |
క. | ఇల సంధి గూడి పదములు, నెలకొని యొకపదమురీతి నిలిచిన శ్లేషం | 57 |
శ్లేషము —
శా. | లలావణ్య మగణ్య మాగుణగణం బవ్యాజ మాతేజ ము | |
| యాలాపం బతిసత్య మావితరణం బాశాంతవిశ్రాంత మా | 58 |
ప్రసాదము —
ఉ. | ముంగిటిపెన్నిధాన మిలుముందటికల్పక మర్థికోటిముం | 59 |
క. | సరసము లగువాక్యంబులు, వరుసను వేర్వేఱ మించువగ మాధుర్యం | 60 |
మాధుర్యము —
చ. | అనయము యంత్రమత్స్యము నొకమ్మున శ్రీనరసింహుఁ డేయఁగా | 61 |
సౌకుమార్యము —
ఉ. | చెందొవవిందుమంచువలెఁ జిందురుచిం దగఁ జందనంబు వె | 62 |
క. | లలితార్థభంగిఁ బాదం, బులు నాల్గిట నేకసరణిఁ బొదువ సమత యౌ | 63 |
సమత —
సీ. | శరవేగములు లేవె చలయంత్రపాఠీన, పాటనక్రియకు నేర్పడవు గాక | |
తే. | తొలుత గడిదుర్గముల నున్న దొరలు లేరె, మహిమ నీమాడ్కి గదనదుర్మదసపాద | 64 |
అర్థవ్యక్తి —
సీ. | నలు వొందునమరేంద్రునాగంబు సాటిగా, సామజంబుల నెల్ల | |
| మహిమ మించినమింటిమ్రాకులసాటిగా, బాదపంబుల నెల్ల బాదుకొల్పి | |
తే. | స్వర్గసృష్టికిఁ బ్రతిసృష్టి, సలుపుకీర్తి, వసుధఁ గౌశికగోత్రపావనుఁడ వైన | 65 |
క. | కతిపయసంయుక్తాక్షర, వితతం బౌదార్య మయ్యె విమలవిచిత్రా | 66 |
ఔదార్యము —
చ. | ఎదిరిస యోబశౌరినరసేంద్రునికీర్తి నిజాంశుపంక్తికిన్ | 67 |
కాంతి —
సీ. | నెలవంక తోడివెన్నెలవంక గలమేటి, నెలవంక రహితాంశునియతిఁ దెగడి | |
తే. | తనరుచులు లోకములు నిండఁ దనరుచుండు, లాటకరహాటలలనాలలాటఫలక | 68 |
క. | విలసితసమాసభరితో, జ్జ్వలబంధం బోజ మయ్యె సరియవ్యగుణం | 69 |
ఓజము —
సీ. | మందారబిసకుందకుందాదినిధిబృంద, బృందారకాప్తశోభితయశుండు | |
తే. | రాజమాత్రుండె వసుధాధిరాజమకుట, నికటవికటమహానీలనికరసుకర | 70 |
సమాధి —
సీ. | అలబలీంద్రునిచేత నడుగు వెట్టఁగ నేర్చి, ధారాధరముచేత నీరు మోచి | |
| క్షీరాంబురాశి ద్రచ్చినవెన్న నీడేరి, నైలింపగనిచన్నుఁబాలఁ బెరిఁగి | |
తే. | ధరణిఁ బ్రోది వహించినదానకన్య, సకలయాచకబాంధవు ల్సంతసిల్ల | 71 |
శబ్దాలంకారములు —
తే. | ఇఁక నలంకారనికరంబు లేర్పరింతు, నవియుఁ గవితాలతాంగికి హారకటక | 72 |
క. | ఇవియును శబ్దార్థంబుల, ద్వివిధములై క్రమముతోడ వెలయు ననుప్రా | 73 |
తే. | అం దను ప్రాసభేదంబు లైన శబ్ద, భవదలంకారమును మున్ను ప్రస్తుతింతు | 75 |
పంచచామరము. | స్ఫురత్కృపాబలప్రతాపభూతిధైర్యభూభరా | 75 |
తే. | ఒక్కవర్ణంబు కడదాక నుద్ధరింపఁ, బరఁగు జృంభణవృత్త్యనుప్రాస మయ్యె | 76 |
వృత్త్యనుప్రాసము—
చ. | సమదవిపక్షశిక్షణవిచక్షణదక్షిణదోరనుక్షణ | 77 |
లాటానుప్రాసము—
చ. | ఘనత నృసింహుఁ జూడఁ గలకన్నులు కన్నులు వానికౌఁగిటం | 78 |
క. | సమపర్ణయుగాధిక మై, యమరిననియమంబు యమక మగుఁ గృతులం దా | 79 |
క. | మేలిమి రెండవపాదము, నాలవపాదంబు నొక్కయనువునఁ దనరం | 80 |
పాదయమకము —
క. | ఔరా యోబనృపాలకు, మారా మనుమదనసమరమాధుర్యుఁడ వై | 81 |
క. | ప్రస్తుత మగుముక్తపద, గ్రస్తం బన నదియుఁ గృతులఁ బరఁగు బదాంతో | 82 |
పాదాంతపాదాదిముక్తపదగ్రస్తము —
క. | సుదతీనూతనమదనా, మదనాగతురంగపూర్ణమణిమయసదనా | 83 |
సింహావలోకనముక్తపదగ్రస్తము —
క. | మన వేటికి నూతనమా, తన మాయెడఁ బ్రేమ దనకుఁ దక్కితి ననుమా | 84 |
పద్మబంధము —
చ. | కనుఁగొన రేకు లెన్మిదియుఁ గర్ణిక చుట్టిడి స్రగ్ధరాంఘ్రుల | 85 |
స్రగ్ధర. | రామాకశ్రీసమగ్రరణకృతభయముద్రాససక్తారమారా | 86 |
చక్రబంధము —
క. | పదిచుట్లు నాఱురేకులు, పదిలపఱిచి సుకవిపేరు పతిపేరును లోఁ | 87 |
శా. | రక్షానాకపమూర్తిభాసురగభీరావిక్రమోహాస్పదా | 88 |
వృత్తకందగర్భసీసము —
సీ. | మహితవిద్వజ్జనమండలీవినుతసా, హిత్యప్రియంభావుకాత్యుదార | |
తే. | 'నిరుపమదయాపయోనిధినిరతభరిత, చారుచరితనిర్మలతరసత్యరుచిర | 89 |
ఓష్ఠ్యనిరోష్ఠ్యసంకరము —
శా. | భూనాథోత్తమ జంభభంజనమహాభోగాభిరామ క్రియా | 90 |
క. | నీహారశిఖరిశిఖర, వ్యూహామితతుహినకణమహోమహిమ మహా | 91 |
లయగ్రాహి. | మిత్రకులభూషణ యమిత్రకులభీషణ విచిత్రమృదుభాషణ చరిత్రమణిహారా | 92 |
గద్యము. | ఇది శ్రీహనుమత్ప్రసాదలబ్ధకవితాసారసారస్వతాలంకారనిరంకుశప్రతి | |