దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువెళ్లియంగుడి

29. తిరువెళ్లియంగుడి 29

శ్లో|| వెళ్ళి యజ్గుడి పురేవిరాజతే | బ్రహ్మతీర్థ కవి పద్మినీయుతే |
    కోలవిల్లి రఘునాథ నామకో | నాయకీం మరతకాభిధాం శ్రితః |
    శోభనాభిద విమాన మధ్యగో | భోగిరాజ శయితేంద్ర దిజ్ముఖః |
    ఇంద్ర శుక్ర విధిశక్తి సూనుభిః | సేవితః కలిహ సంస్తుతోనిశమ్‌ |

వివ: కోలవల్ విల్లి రామన్ (శృంగార సుందరన్) - మరకతవల్లి తాయార్ - బ్రహ్మతీర్థము - శుక్రపుష్కరిణి - శోభన (పుష్కలావర్తక) విమానము - తూర్పుముఖము - భుజంగ శయనము - ఇంద్ర, శుక్ర, బ్రహ్మ, పరాశరులకు ప్రత్యక్షము. స్థలవృక్షము కదళీవృక్షము (అరటిచెట్టు) - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇచ్చట చతుర్భుజములతో శంఖ చక్రములతో వేంచేసియున్న గరుడాళ్వారు కలరు. ఈ దివ్య దేశమునకు సమీపముననే పెరియవాచాంపిళ్ళై (శ్రీకృష్ణసూరి) అవతారస్థలమగు శెంగనల్లూరు కలదు.

మార్గము: కుంభకోణము నుండి తిరువెళ్లియజ్గుడికి టౌన్ బస్ కలదు. కుంభకోణము నుండి శంగనల్లూర్ చేరి అక్కడ నుండి 1 కి.మీ నడచి పోవచ్చును.

పా|| పారినై యుణ్డు పారినై యుమిழ்న్దు పారదమ్‌ కై యెఱిన్దు; ఒరుకాల్
     తేరినై యూర్‌న్దు తేరినై త్తురన్ద శెజ్గణ్ మాల్ శెన్ఱుఱై కోయిల్
     ఏర్‌నిరైవయలుళ్ వాళైగళ్ మఱుగియెమక్కిడ మన్ఱి దెన్ఱెణ్ణి;
     శీర్ మలిపొయ్‌గై శెన్దఱై గిన్ఱ తిరువెళ్లియజ్గుడి యదువే.

    కాற்றிడై ప్పూళై కరన్దనవరన్దై యుఱక్కడలరక్కర్ రమ్‌శేనై
    కూற்றிడై చ్చెల్ల క్కొడుజ్గణై తురన్ద కోలవిల్లిరామన్జన్ కోయిల్
    ఊற்றிడై నిన్ఱ వాఝయిన్ కనిగళూழ்త్తు వీழ்న్దన వుణ్డు మణ్డి;
    శేற்றிడై కయల్ గళుగళ్ తిగழ் వయల్ శూழ் తిరువెళ్లియజ్గుడి వదువే

    ఒళ్లియ కరుమమ్‌ శెయ్‌వ నెన్ఱుణర్‌న్ద మావలి వేళ్వియిఱ్పుక్కు
    తెళ్ళియ కుఱళాయ్ మూవడికొణ్డు తిక్కుఱ వళర్‌న్దవన్ కోయిల్
    అళ్ళియమ్బొழிల్ వాయిరున్దువాழ் కుయిల్‌కళరి యఱియెన్ఱవై యఝప్ప
    వెళ్ళియార్ రుణజ్గ విరైన్దరుళ్ శెయ్‌వాన్ విరువెళ్ళియజ్గుడి వదువే.
          తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 4-10-5,6,7.

40

30. మణిమాడక్కోయిల్ 30 (తిరునాంగూర్)

(శీర్గాళి - వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ)

శ్లో. భాభాతి దివ్య మణిమాడ పురే సురేంద్ర
   రుద్రాభిధాన నళినీ ద్వయ శీభమానే|
   శ్రీపుండరీక లతికా మహిషీ సమేతో
   నన్దా ప్రదీప భగవానితి నామధేయ:||

శ్లో. ప్రాచీముఖాసనలసన్ ప్రణవాభిధాన
   వైమాన వాస రసిక శ్శ్రిత పారిజాత:|
   ఏకాదశేశ మఘవన్నయనాను భూత
   శ్రీమత్కలిఘ్న మునిపుజ్గవ కీర్తిత శ్రీ:||

వివ: నందా విళక్కు పెరుమాళ్(నరనారాయణర్)-పుండరీక వల్లి తాయార్-ఇంద్ర పుష్కరిణీ-రుద్రపుష్కరిణి(ప్రణవాకార విమానము)-తూర్పు ముఖము-కూర్చున్న సేవ-ఏకాదశరుద్రులకు, ఇంద్రునకు(మాతంగ మహర్షికి)ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: మకరమాసము అమావాస్య(తై అమావాస్య) నాడు జరుగు 12 గరుడ సేవలను సేవించియే తీరవలెను. తిరునాంగూర్ తిరుపతులలో నిదిమొదటిది. మిగిలినవి వై గున్ద విణ్ణగరం. అరిమేయ విణ్ణగరం, వణ్ పురుషోత్తమం, శెంబొన్‌శెయ్ కోయిల్; తిరుతైట్రి యంబలమ్‌, ఈ సన్నిధిలో తిరుక్కోట్టియూర్ నంబి(గోష్ఠీపూర్ణులు) వేంచేసియున్నారు. అర్చకస్వాములను ముందుగా కలసికొని సేవింపవలెను. మేషం చిత్తా నక్షత్రము తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. శీర్గాళి నుండి టౌన్ బస్ కలదు. రామానుజ కూటం గలదు. మిగతా భోజనాది విషయాలు సన్నిధిలో ఏర్పాటు చేసికోవాలి.

ప్రతి సంవత్సరము మకర మాసము అమావాస్య దినమున తిరుమంగై ఆళ్వార్లు తిరువాలి తిరునగరి నుండి పల్లకిలో వేంచేసి, తిరుక్కురైయలూర్ క్షేత్రమును చేరి అచట వేంచేసియున్న పంచ నృసింహమూర్తులకు "వాడినేన్‌వాడి", పాశురాలతో మంగళా శాసనం చేయుదురు. పిమ్మట మంగై మఠం చేరి "అజ్గణ్ జ్ఞాలం" అను పాశురములతో ఉత్తరదేశమున వేంచేసియున్న "శిజ్గవేళ్‌కున్ఱమ్"(అహోబిలం) పెరుమాళ్లకు మంగళ శాసనం చేయుదురు.

అటు పిమ్మట తిరుక్కావళంబాడి, తిరుమణిక్కూడం; తిరుపార్తం పళ్లి మొదలగు క్షేత్రములకు వేంచేసి పెరుమాళ్లకు మంగళా శాసనము చేసి తిరుక్కావేరి

                                              41