దివ్యదేశ వైభవ ప్రకాశికా/కపి స్థలమ్
28. కపి స్థలమ్ 28
శ్లో|| శ్రీ మద్గజేంద్ర సరసీ కపిలాఖ్య తీర్థ | సంశోభితే శుభ కపిస్థల దివ్యదేశే |
దేవ్యా రమామణిలతాహ్వయయా సమేతో | దేవో గజేంద్ర వరదో భుజగేంద్ర శాయీ |
శ్లో|| వైమానమస్య వర కారక నామధేయం | దేవేశ దిగ్వదన సంస్థతి శోభమానః |
నాగాధిరాజ మరుదాత్మజ సేవితాజ్గః | శ్రీ భక్తిసారమునిరాజ నుతో విభాతి |
వివ: గజేంద్ర వరదన్ - రమామణి వల్లి తాయార్ - పాఱ్తా మరైయాళ్ - గజేంద్ర పుష్కరిణి - కపిల తీర్థము - గగనాకార విమానము - తూర్పుముఖము - భుజంగ శయనము - గరుత్మంతునకు, హనుమంతునకు ప్రత్యక్షము. తిరుమழிశై ఆళ్వార్ కీర్తించినది.
విశే: ఈ దివ్య దేశమునకు 5 కి.మీ. దూరములో ఉమయాపురమునకు పోవు మార్గములో తొండరడిప్పొడి ఆళ్వార్ల తిరూవతార స్థలమైన మణ్డజ్గుడి క్షేత్రము కలదు.
మార్గము: కుంభఘోణం - పాపనాశం టౌను బస్. పాపనాశం నుండి 3 కి.మీ. కుంభఘోణం - తిరువయ్యారు బస్ మార్గమున 20 కి.మీ. సత్రములు కలవు.
పా|| కూత్తముమ్ శారా కొడువినైయుమ్ శారా; తీ
మాత్తముమ్ శారా వగై అణిన్దేన్ - ఆற்றజ్
కరై కిడక్కుమ్ కణ్ణన్ కడల్ కిడక్కుమ్
మాయన్ ఉరైక్కిడక్కుం ఉళ్ళత్తెనక్కు.
తిరుమழிశై ఆళ్వార్ - నాన్ముగన్ తిరువన్దాది 50 పా.
సంబంధము
మంచిమాటమిళకాళ్వాన్ అను ఆచార్యులు తామున్న గ్రామమునకు ప్రక్కనగల వేరొక గ్రామమునకు తరచుగా పోవుచుండెడివారు. ఇది తెలిసిన కొందరు భక్తులు వారిని జూచి మీరు ప్రక్కగ్రామమునకు పలుమార్లు పోవుచున్నారేల? అని ప్రశ్నించిరి. అందులకు మిళకాళ్వాన్ ఇట్లు సమాధానము చెప్పిరి.
"చూడుడు". నేను ఆయూరు వెళ్ళినచో ఆయూరివారికి భగవంతుని విషయములను చెప్పుచుందును. ఆ మంచి మాటలు వినుటచే ఆయూరివారు ఈయూరి వారికి విరోధులు కాకుండ నుందురు. మరియు నేను చెప్పిన భగవత్సంబంధమైన మాటలు విని సంతసించి వారు సమర్పించిన పదార్థములను తీసికొని వచ్చి భాగవత కైంకర్యము చేయుదును. ఇందువలన పదార్థములను సమర్పించిన వారికిని మంచి కలుగును.
ఆమాటలు వినిన భక్తులు వారి పదార్థములు మనకు అనుకూలించునా? అని ప్రశ్నింపగా మిళగాళ్వాన్ నేను అందరిని శ్రీమన్నారాయణునితో సంబంధము గల వారిగానే చూతును. కాని యెవరిని ప్రకృతి సంబంధులుగా చూడను. కావున నాకు ఏ వస్తువయినా శ్రీమన్నారాయణునకు సంబంధించినది గానే కనిపించును అని చెప్పిరి.
కావున అందరిని, అన్నింటిని, శ్రీమన్నారాయణునితో సంబంధము కలవారిగానే దర్శింపవలెను
"వార్తామాల"
39 29. తిరువెళ్లియంగుడి 29
శ్లో|| వెళ్ళి యజ్గుడి పురేవిరాజతే | బ్రహ్మతీర్థ కవి పద్మినీయుతే |
కోలవిల్లి రఘునాథ నామకో | నాయకీం మరతకాభిధాం శ్రితః |
శోభనాభిద విమాన మధ్యగో | భోగిరాజ శయితేంద్ర దిజ్ముఖః |
ఇంద్ర శుక్ర విధిశక్తి సూనుభిః | సేవితః కలిహ సంస్తుతోనిశమ్ |
వివ: కోలవల్ విల్లి రామన్ (శృంగార సుందరన్) - మరకతవల్లి తాయార్ - బ్రహ్మతీర్థము - శుక్రపుష్కరిణి - శోభన (పుష్కలావర్తక) విమానము - తూర్పుముఖము - భుజంగ శయనము - ఇంద్ర, శుక్ర, బ్రహ్మ, పరాశరులకు ప్రత్యక్షము. స్థలవృక్షము కదళీవృక్షము (అరటిచెట్టు) - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: ఇచ్చట చతుర్భుజములతో శంఖ చక్రములతో వేంచేసియున్న గరుడాళ్వారు కలరు. ఈ దివ్య దేశమునకు సమీపముననే పెరియవాచాంపిళ్ళై (శ్రీకృష్ణసూరి) అవతారస్థలమగు శెంగనల్లూరు కలదు.
మార్గము: కుంభకోణము నుండి తిరువెళ్లియజ్గుడికి టౌన్ బస్ కలదు. కుంభకోణము నుండి శంగనల్లూర్ చేరి అక్కడ నుండి 1 కి.మీ నడచి పోవచ్చును.
పా|| పారినై యుణ్డు పారినై యుమిழ்న్దు పారదమ్ కై యెఱిన్దు; ఒరుకాల్
తేరినై యూర్‌న్దు తేరినై త్తురన్ద శెజ్గణ్ మాల్ శెన్ఱుఱై కోయిల్
ఏర్‌నిరైవయలుళ్ వాళైగళ్ మఱుగియెమక్కిడ మన్ఱి దెన్ఱెణ్ణి;
శీర్ మలిపొయ్‌గై శెన్దఱై గిన్ఱ తిరువెళ్లియజ్గుడి యదువే.
కాற்றிడై ప్పూళై కరన్దనవరన్దై యుఱక్కడలరక్కర్ రమ్‌శేనై
కూற்றிడై చ్చెల్ల క్కొడుజ్గణై తురన్ద కోలవిల్లిరామన్జన్ కోయిల్
ఊற்றிడై నిన్ఱ వాఝయిన్ కనిగళూழ்త్తు వీழ்న్దన వుణ్డు మణ్డి;
శేற்றிడై కయల్ గళుగళ్ తిగழ் వయల్ శూழ் తిరువెళ్లియజ్గుడి వదువే
ఒళ్లియ కరుమమ్ శెయ్‌వ నెన్ఱుణర్‌న్ద మావలి వేళ్వియిఱ్పుక్కు
తెళ్ళియ కుఱళాయ్ మూవడికొణ్డు తిక్కుఱ వళర్‌న్దవన్ కోయిల్
అళ్ళియమ్బొழிల్ వాయిరున్దువాழ் కుయిల్‌కళరి యఱియెన్ఱవై యఝప్ప
వెళ్ళియార్ రుణజ్గ విరైన్దరుళ్ శెయ్‌వాన్ విరువెళ్ళియజ్గుడి వదువే.
తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 4-10-5,6,7.
40