దశావతారచరిత్రము/పీఠిక-2
శ్రీరస్తు
దశావతారచరిత్రము
పీఠిక
| 1 |
ఉ. | పాణితవాణి పంకరుహపాణి రమాఘనవేణి నిత్యక | 2 |
శా. | అంతర్వాణులు రీణు లంచను నపఖ్యాతి న్నివారించెఁ గా | 3 |
మ. | తతయుక్తిన్ ఘనశబ్దము ల్వెలయ నర్థవ్యంజకప్రక్రియల్ | 4 |
ఉ. | సప్తఋషీంద్రు లెల్ల బుధజాలము మెచ్చఁగఁ బార్వతీచకో | 5 |
మ. | తనగంభీరతచేత నిర్జలతఁ జెందం జేసి వారాశి డాఁ | 6 |
మ. | తళుకుంబంగరుమేను వజ్రమయమౌ దంతంబు హస్తంబునం | 7 |
మ. | భవతేజంబునఁ బుట్టి రామభజనాపారీణుఁ డై పద్మసం | 8 |
మ. | ఘనశబ్దేభ ముదీర్ణవర్ణమణిప్రేంఖద్ధాటిఘోటంబు చం | 9 |
మ. | పదలాలిత్యము లేమి ఖంజులును శబ్దజ్ఞానవిజ్ఞానసం | 10 |
సీ. | శ్లేషాదిపదములు చెలువు సూపఁగఁ బదవాక్యార్థదోషము ల్వర్జములుగ | |
తే. | విలసదుపమాద్యలంక్రియ ల్వింతఁ దెలుప, లలితముగఁ బాకములు సేయ లక్ష్యశయ్యఁ | 11 |
వ. | అని క్రమంబున విశిష్టేష్టదేవతానమస్కృతియు సుకృతిజనపురస్కృతియు దుష్కృ | 12 |
సీ. | తనదుకీర్తి సరోజధామకు భువనజాతమ్ములు భువనజాతములు గాఁగఁ | |
| దనదయాశరధిరత్నమునకు మార్గణౌఘంబులు మార్గణౌఘములు గాఁగఁ | |
తే. | బ్రబలు మగదల పద్మనాభ ప్రధాన, పూర్వజన్మసహస్రసంపూర్ణరచిత | 13 |
వ. | వెండియు నఖండనవఖండధరణీమండలభరణప్రచండమనీషాదండితపుండరీకకుండ | |
| లువుకూటంబునంబొడవు కెంపుసొంపునింపువినుకెంపునుడికింపువిడికెంపురవచెక్క | 14 |
క. | నను సంస్కృతాంధ్రభాషా, వినుతు దినైకప్రబంధవిరచనదక్షుం | 15 |
సీ. | శ్రీరామకరుణారసారూఢసంస్కృతప్రాకృతాద్యష్టభాషాకవిత్వ | |
| ముఖ్యనానాదానముదిత భూసురచంద్ర నాగప్రధానేంద్రనందనుఁడవు | |
తే. | వాప్తుఁడవు గాన వేఁడెద నందముగను, గృష్ణునిదశావతారము ల్గృతి యొనర్చి | 16 |
వ. | అని కనకాంబరాభరణగ్రామబహుగ్రామసమేతంబుగాఁ గర్పూరతాంబూలంబు | 17 |
సీ. | శ్రీకరవేదాంతసిద్ధాంతవైఖరీపారదృశ్వలు పరబ్రహ్మ మనియు | |
ఆ. | మఱియు ధన్యులయిన మాధ్వు లంతర్యామి, యనియు నెట్టిదేవు నాశ్రయింతు | 18 |
తే. | [1]భువనజాతాశ్రయం బౌట భోగిశయను, నుదరతలమున నీరజ మొదవె దానఁ | 19 |
తే. | బ్రహ్మకు జనించెను మరీచి బ్రహ్మవర్చ, నకృతఘర్మమరీచిలోచనమరీచి | 20 |
శా. | శ్రీమత్కాశ్యపగోత్రవారిధి జనించెం బూర్ణసోమాకృతిన్ | 21 |
సీ. | రసమంటె ననుచు నీరసముతోడఁ బుటంబు వేయ మేరువుఁ జేరె విశ్వకర్మ | |
తే. | మహితమగదలసోమనామాత్యసోమ, రామణీయకయుతకీర్తిరామరుచిర | 22 |
క. | సోముఁడు గావున గౌరీ, భామినిఁ జేకొనియె ననుచుఁ బ్రజ లెన్నఁగ నా | 23 |
క. | గౌరమ సుగుణావళి బా, గౌరమ మహిమహిళ నగుక్షమాన్విత యయ్యున్ | 24 |
తే. | గౌరియందుఁ గుమారునిఁ గనియె సోముఁ, డౌర యచ్చెరు వని జను లనఁగ సోమ | 25 |
శా. | ఏమే జాన్హవి యేమి రాఘవ యదేమే వైరి నెన్నేవు నీ | 26 |
క. | తిమ్మనమంత్రీంద్రుఁడు ల, క్ష్మమ్మను వరియించి కనియె నాశ్రితజలరు | 27 |
చ. | మగదలతిమ్మధీరునికుమారుని వేంకటమంత్రి నెన్నఁ బ | 28 |
సీ. | అగ్రహారంబుల నలరించె ధారుణీరమణీకుచాగ్రహారములు గాఁగ | |
తే. | మంత్రిమాత్రుండె మానినీమానమథన, మదనసమమూర్తి హరిదంతమధురకీర్తి | 29 |
క. | పద్మాధరణుల నేలిన, పద్మాక్షునిలీల [6]వెలసె భాసురతేజ | 30 |
తే. | ఔర వేంకటవిభుద్వితీయద్వితీయ, యద్వితీయగుణస్ఫూర్తి నతిశయించి | 31 |
సీ. | విబుధేంద్రమాతయై ప్రబలె నాయదితి దాఁ గశ్యపుసంగతి [7]గాంచు టెట్టు | |
తే. | మతము గాదిది విబుధేంద్రమాత యనిన, నతిసువర్ణాఢ్య యనిన స్నేహవతి యనిన | 32 |
క. | ఆవేంకటాంబగర్భసు, ధావార్ధి జనించి రమరధరణీరుహసు | 33 |
ఉ. | తిమ్మన వీరరాఘవసుధీమణీ కేశవమంత్రి దాతృతా | 34 |
సీ. | సంగీతపుంభావశారద సాహిత్యతత్త్వాద్యతనకాళిదాసుఁ డతుల | |
తే. | వీరవేంకటపతిరాయవిభువతంస, భావితోభయచామరభద్రదంతి | 35 |
ఉ. | తిమ్మనమట్ల తేనియలు తేరగఁ బల్కఁగ నేర్చు బంధుజా | 36 |
తే. | అట్టితిమ్మనమంత్రి వెంగాంబయందుఁ, గనియెఁ దిరువేంగళాంబనాఁ గన్యలక్ష్మి | 37 |
తే. | వీరరాఘవమంత్రికి వీరరాఘ, వుండె సరిగాక ధర మానవుండు సరియె | 38 |
మ. | తరమే వేంకటమంత్రికేశవుమహోదారత్వ మెన్న న్నిరం | 39 |
సీ. | మాననీయనరేంద్రమంత్రాచరణవేళ ఫణినాయకుఁడు తడఁబడకయున్న | |
తే. | సాటి యనవచ్చు మగదలశాసనాంక, వేంకటామాత్య మకరాంకపంకరహిత | 40 |
సీ. | ప్రతిఘటించిన నెంతబలవంతులను బటాపంచగాఁ దఱిమించుప్రౌఢిమంబు | |
తే. | విద్య వినయంబు తాదృశవిభవమునను, శాంతి యేపట్ల ధైర్యంబు సరసమృదుల | 41 |
సీ. | మంత్రీశ్వరుఁడు గాన మౌళిపై వలగొన్న భాగీరథి యనంగఁ బాగ దనర | |
ఆ. | గుణములను బోలి వృత్తానుగుణము లయిన, కంఠమాలిక ముత్యాలకడియములును | 42 |
సీ. | అపరిహాస్యంబుగా నన్యమతంబులయందు శంకఘటించునౌఘళంబు | |
తే. | మఱియుఁ జాటువులందు రామాయణాది, బహువిధగ్రంథములయందుఁ బ్రాజ్జు లెన్నఁ | 43 |
సీ. | దరముతోఁ దుహినకందరముతో గిరిశనూపురముతోఁ బచ్చకప్పురముతోడ | |
తే. | దోడునీడయి క్రీడించు వేడు కలరఁ, బ్రౌఢ గావున మగదల పద్మనాభ | 44 |
చ. | మగదల పద్మనాభునిసమస్తగుణవ్రజముం గణింపఁ గా | 45 |
తే. | జలధిమధ్యస్థుఁ డాతఁడు జలధితీర, వాసి యితఁ డనునొకమాట వాసి గాక | 46 |
ఉ. | [10]కోసలరాజకన్యకయె కుంభినిలోపల వేంకటాంబయై | 47 |
మ. | ధనదోదారుఁడు పద్మనాభ సచివాధ్యక్షుండు పక్షంబుతో | 48 |
సీ. | పతిభక్తిచే నరుంధతి యుద్ది యనవచ్చుఁ దను వ్రేలఁ జూపించికొనకయున్న | |
తే. | గాక యితరధరాతలకాంత లెనయె, యంచు జను లెంచ నంచితోదారసుగుణ | 49 |
సీ. | ఏసాధ్వి [11]పెరటిలో నెలదోఁటఁ గని వజ్రనందనవని నిందనం బొనర్చు | |
తే. | రట్టిలోకైకపావని యఖిలవిమల, గుణకలాపావని తటాకకోటిభాగ | 50 |
ఉ. | శ్రీయలమేలుమంగవలెఁ జెన్నగురంగమగర్భవార్ధిచం | 51 |
సీ. | శ్రీవరేశ్వరులకుఁ గోవెల లూరూరఁ గట్టించె నేమంత్రి ఘనత మెఱయ | |
తే. | నతఁడు చెలువొందు నన్నదానాదిసకల, దానవిద్యాపరాభూతధనవిభుండు | |
| నూత్నదేదీప్యమానభానుప్రభుండు, నవ్యవిభవుండు నారాయణప్రభుండు. | 52 |
సీ. | అతనుండు మొదల హ్రస్వాకారుఁ డౌటచేఁ జెలువంబునను సాటిసేయరాదు | |
తే. | సాటియే నేఁటి యొకపాటిసచివకోటి, వైరిగిరిశతకోటికి వచనవిభవ | 53 |
మ. | అగధీరుం డగునారనార్యుఁ డవురా యాసానబూదూరిలోఁ | 54 |
సీ. | వనిలోన స్త్రీమాట విని యన్న కొకవంత దెచ్చిన లక్ష్మణదేవుఁ దెగడి | |
తే. | హర్ష మొసఁగుచు మాఱుమాటాడ వెఱచి, యన్నపక్షము దనపక్ష మై చెలంగ | 55 |
శా. | ఆనారాయణమంత్రిశేఖరుఁ డమిత్రాంభోదపాళీజగ | 56 |
తే. | అసము వొసగంగ మఱియు రాయసము చెలవ, యార్యమౌళికి నారాయణమ్మ కాత్మ | 57 |
సీ. | తనయాశ్రితుల సంపదలఁ జూచి ధనభర్త ధనవాంఛ శివుఁగూర్చి తపము సేయఁ | |
తే. | బ్రబలు దేశాధినాథనబాబుసాహి, బూవితీర్ణసువర్ణజాంబూనదాంబ | 58 |
సీ. | నీరాకరము లెల్ల క్షీరాకరము లయ్యెఁ దటినులు గీర్వాణతటిను లయ్యె | |
తే. | యౌర మగదల వంశరత్నాకరాధి, నాథచంద్రాదినారాయణప్రధాన | 59 |
తే. | అనఘుఁ డయ్యాదినారాయణార్యమౌళి, ఘనుఁడు రాచూరి వేంకటేంద్రునకుఁ గోన | 60 |
ఉ. | హాటకదాతయౌ మగదలాధిపకృష్ణునిదానవాహినీ | 61 |
తే. | గరిమ నఱువదినాలుగుకళలఁ బొసఁగి, యెసఁగు మగదల కృష్ణమంత్రీంద్రవదన | 62 |
సీ. | అమరంగఁ దా నంబరము గప్పుకొను నెట్టు కవుల కీయఁడు మేఘుఘనత యెంత | |
తే. | భువిఁ జతుర్విధశృంగారములు సమిత్ర, బంధుకవిధీరజనముగాఁ బ్రౌఢి మీఱఁ | 63 |
మ. | తలపం గర్ణుఁ డపార్థదాతయె యపాత్రత్యాగిమూర్ధన్యుఁ డా | 64 |
సీ. | రాజరాజసుహృద్ధరాజరాజముఖీవిరాజరాజన్ముఖప్రభల నేలి | |
తే. | కలశజలనిధిహలధరజలజతుహిన, విమలమలయజసురగజవిశదకమల | 65 |
సీ. | తల్లిదండ్రులు ముకుందద్రోహు లంచును బాథోధిలోపలఁ బ్రభవ మొంది | |
| క్షితిజయై పతివివాసితయౌట వలన వైదర్భభూవిభున కావిర్భవించి | |
తే. | వెనుకఁ దపములచేఁ గొండవీటి సిద్ధి, రాజఘనుకనకాంబగర్భమునఁ బొడమి | 66 |
తే. | గుణసముద్రుండు గణుతింపఁ గొండవీటి, సిద్ధిరాజేంద్రుఁ డెల్ల నశీతకరుఁడు | 67 |
ఉ. | నారదమౌని యేమి సురనాథ విశేషము లేమి వింటిరో | 68 |
సీ. | శ్రీవిరాజితుఁడైన సిద్ధిరాజేంద్రుఁడు శ్రీకృష్ణదేవుని చెలువు గుల్క | |
తే. | భామినీజనమోహనాంబకవిలాస, వైఖరులఁ గాంచి మన్మథువలెఁ జెలంగుఁ | 69 |
సీ. | శ్రీరామచరణరాజీవకైంకర్యతత్పరరంజనుఁడు రామదాస ఘనుఁడు | |
తే. | వివిధరాజద్గుణకదంబ వేంకటాంబ, నుత్యనయశాలి రఘుపత్యమాత్యహేళి | 70 |
సీ. | దేవిదేవరఁ బొలిఠీవిమై వర్ధిల్లి తల్లిదండ్రియు సంతతంబుఁ బ్రోవ | |
తే. | నల్లసౌభరీనడవడి యైనవీని, కెనయె యంచు జగజ్జనం బెల్లఁ బొగడ | 71 |
సీ. | చంద్రికపూవన్నె జిలుగురుమాలుపై జాతిమిన్నులతురా చౌకళింప | |
తే. | గుందనపుఁదళ్కు నెఱపూఁతగంద మమరఁ, దగటుఁ చెఱుగులఁ జెంగావి సొగసుఁ జూపఁ | 72 |
షష్ఠ్యంతములు
క. | ఈదృశగుణహారునకును, దాదృశనయమార్గసంతతవిహరునకున్ | 73 |
క. | ధీరునకుఁ గీర్తిఘటజల, ధీరునకు భుజప్రతాపధృతసర్వవిరో | 74 |
క. | సకలకలాపావనునకు, సుకవికలాపావనునకు శ్రుతిచాతుర్య | 75 |
క. | ధృతిబందీకృతనానా, క్షితిధరశంకావిధాయిశృంఖలితమదో | 76 |
క. | చరణానతశరణాగత, భరణాతతవత్సలత్వపాత్రునకు సదా | 77 |
క. | మగదలకులధన్యునకు, జగదేకవదాన్యునకు ద్విషద్ధరణీభృ | 78 |
క. | భద్రశ్రీమిహికాదిమ, భద్రశ్రీవరకరాబ్దఫణిప బిడౌజో | 79 |
క. | ఇంద్రశిలాతంద్రకళా, సాంద్రవిలాసాఢ్యకనకసౌధోన్నతికిం | 80 |
క. | మంత్రి యుగంధరునకుఁ బర, [15]మంత్రికృతాంతునకు దివిజమంత్రినిభునకున్ | 81 |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నేరచియింపంబూనిన రసికజనకంఠాభరణ శ్రీకృష్ణదశావతారచరిత్రమహాప్రబంధపవిత్రముక్తాదామంబునకు విచిత్రకథాసూత్రం బెట్టిదనిన. | 82 |