తెలుగు భాషాచరిత్ర/ప్రకరణం 4
ప్రకరణం 4
శాసనభాషా పరిణామం
(క్రీ. శ. 1100-1399)
__ఎం. కందప్పశెట్టి
4. 0. తెలుగు శాసనాలు క్రీ. శ. 6వ శతాబ్దినుండి కనబడ్డా 11వ శతాబ్ది దాక అవి చాల పరిమితంగానే ఉన్నాయి. కాని 1100-1399 కాలానికి చెందినవి దాదాపు 2000 తెలుగు శాసనాలు ప్రచురితమయి ఉన్నాయి. కాబట్టి ఈ యుగంలో తెలుగుభాషాపరిణామాన్ని తెలుసుకోడానికి ఈ శాసనాలు చాల ఉపయోగిస్తాయి. అందులోను ఈ శాసనాలు దేశంలో నలుమూలలా వ్యాపించి ఉండడంచేత ఆకాలపు మాండలికాల్ని తెలుసుకోడానికి కూడా ఇవి చాల ఉపయోగపడతాయి. ఈ వ్యాసంలో పూర్తి వివరాలు ఇవ్వడం కుదరదు. కాబట్టి కొన్ని ముఖ్యాంశాలు మాత్రం వివరించబడతాయి.
4.1. ఈ యుగంలోని వర్ణాలు (Phonemes) :
హల్లులు :
ఓష్య దంత్య దంతమూలీయ మూర్ధన్య తాలవ్య కంఠ కంఠమూలీయ
స్పర్శ ప బ త ద ట డ క గ
ఫ భ థ ధ ఠ ఢ ఖ ఘ
స్పర్శోష్మ చ జ ఊష్మ వభ థతధ ఠఢ ఖఘ స్పర్శోమ్మ చజ ఊమ్మ స ష శ హా అనునాసిక మ ణి హార్శ్విక శ
కేవ ఈవ్ స్పృష్ట) శకటరేవ కంపితం) అంతన్థ ఆవ య
త ౧౫౮౦6 ౬ 104
తెలుగు భాషా చరిత్ర
అచ్చులు :
ముందు వెనక
సంవృత ఇ ఉ ఆర్దసంవృత ఎ ఒ వివృత అ
అచ్చులలో దీర్ఘతకూడా ఒకవర్ణమే అవుతుంది, ఱ కారము సందిగ్ధవర్ణంగా కనబడు తుంది. జ, ఇ ధ్వనులు మవర్ణానికి సవర్ణాలుగా పరిగణించ వచ్చు.
4.2. అనుస్వారం : వర్గపంచమాక్షరాలకుబదులు అనుస్వారం వ్రాయడం దాదాపు ఈయుగంలో పూర్తయిందనవచ్చు. కాని ఒక్క టవర్గ ముందు మాత్రం వర్గానుసికం చాల తరచుగా కనిపిస్తుంది. వర్గపంచమాక్షరాలకు ముందున్న అనుస్వారానికి వర్గానునాసికాల ఉచ్చారణే ఉంటుంది. గనక ఈస్థానాల్లో అనుస్వారం ఒక ప్రత్యేకమైన వర్ణం అని చెప్పలేము. ఉదా : పంచాదసి (SII4.996 2,1155) దీన్ని పజ్బాదసి అనియే చదువుతాము కనక ఇందలి ఆనుస్వారానికి ఇకారోచ్చారణే ఉంటుంది. మణ్డలేళ్వర (SII 4.996.6,1155) మొదలగుచోట్ల అను స్వారంగాక ణ కారమే తరచుగా వ్రాయబడి ఉంది. సంస్కృతంనుండి వచ్చిన ఎరువు మాటల్లో వకార, హకారాల ముందు ఈ అనుస్వారం ఉచ్చారణ ఎట్టిదో తెలిసికోడం చాలా కష్టంగా ఉన్నవి. ఈ పరిసరాల్లో అనుస్వారం ఉన్న పదాలు వివిధరీతులుగా వ్రాయబడి ఉన్నవి. సంగ్వత్సరంబు (SII 10.707.6, 1153), సమంత్సరంబు (పై. 6. 137,8, 1147), సహ్వస్యర (పై. 6.145.1, 1292). సంహృత్సరంబు. (పై. 5.1212 2,1210), సంమ్వత్సరంబు. (పై. 5.1214.11,1309) - సంవత్సరం, సింహ్య (పై. 6.728.25, 1270), సింహ్వ (పై. 5.1166.4, 1276), సింఘ (పై. 10.63,6, 1106), సిహ్య (పై. 6.775 4, 1364) -సింహం, మొ. వి. బహుశా శిష్టభాషలో ఈ పరిసరాల్లో అనుస్వారానికీ సంస్కృత అనుస్వారోచ్చారణ ఉండేదేమో! ఆ ఉచ్చరణ సామాన్యులకు కొత్తగా ఉండడంవల్ల పై శబ్డాలకు అనేక లేఖన పద్ధతులు ఏర్పడి ఉండవచ్చు, కాబట్టి పై పరిసరాల్లోని అనుస్వారోచ్చారణ శాసనకర్త వ్యవహారంలో ఎలాగుండేదో చెప్పలేము. కాని ఈ పరిసరాల్లో మకారోచ్చారణ ఉండేదేమో ! అని సందేహపడవచ్చు, నరసిహ్మ (SII 4 1090.7, 1142), బ్రాంహ్మణ (NI 1.25.17, 1274). శాసన భాషా పరిణామం
105
బ్రాహ్మణ, వహ్ని మొదలగు శబ్దాల్ని ప్రాక్సృతభాషలలో ప్రాచీనకాలం లోనే బ్రామ్హణ, వన్హి అని ఉచ్చరించే వారట, ఈయుగంలో కూడా అలాగే ఉచ్చరించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. వన్హి ( S1I 4.675.36, 1140) మొ. వి. నరసింహ శబ్దాన్ని నరసింహ్మ అని విలోమపద్ధతిలో వ్రాసి ఉండటంచేత దీనిని నరసిమ్హ అని ఉచ్చరించినట్లు ఊహించవచ్చు.
4.3. ఱకారం : ఈ యుగంలో ఱ కారం కొన్ని సంజ్ఞావాచకాల్లోనే కనబడుతుంది. అదీ సాధారణంగా విశాఖ-శ్రీకాకుళం ప్రాంతానికే పరిమితం. ఉదా : నిఱు జెఱ్వు ( SII 10.684 3,1133 ) , తాలాంఱ ( పై. 10.674.10, 1131), చోఱగంగ (పై. 10.665.7, 1124 ). పై ఉదాహరణలన్నీ 12 వ శతాబ్దిలొనివే. 13 వ శతాబ్దిలో ఱుత్తిక (పై. 10,262.9, 1218) తప్ప వేరే ప్రయోగాలు లేవు. 14వ శతాబ్దిలో అసలు బొత్తుగా కనబడదు. ఈ ఱకార ప్రయోగం 12వ శతాబ్దిలో విశాఖ-శ్రీకాకుళ ప్రాంతంలోనే కనిపించినా 13వ శతాబ్దిలోని ఱుత్తిక శబ్దం పశ్చిమ గోదావరిలోని తణుకు తాలూకాలో కనిపిస్తుంది. పై శతాబ్దాలకు నిడుం జెఱువు. తాలాండ, డుత్తిక అనే రూపాలు తరచుగా కనిపిస్తాయి. పై శబ్డాలన్నీ సంఙ్ఞావాచకాలే కాబట్టే ఇవన్నీ కేవలం వ్రాతలోనే నిల్చిఉన్నాయనీ అవి ఉచ్చారణలో లేవనీ చెప్పవచ్చు. అదీగాక సఱపంగలవాండు (SII 5.1083.1, 1108), విహారవాఱ (పై. 10.690. 8, 1139)మొ రూపాల్లో డకారానికి బదులు ఱకారం వ్రాతలో ఉంది. కాబట్టి పై ప్రా౦తంలో ప్రాచీన లేఖనా పద్ధతి నిల్చి ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఱకారాన్ని వర్ణంగా తీసుకోనక్కరలేదు.
4.4. ఛకారం : ఛకారం శాసనాల్లో కనిపిస్తుంది. కాని దాన్ని వర్ణంగా తీసుకోనక్కరలేదు. ఎందుకంటే చకారం ద్విత్వమయ్యే టప్పుడూ, అనుస్వారం తర్వాత వచ్చేటప్పుడూ సాధారణంగా ఛకారంగా వ్రాయబడి ఉంది. ఉదా. ఇచ్చిరి/ఇచ్చిరి, సమర్పించిరి/సమర్పింఛిరి. ఇట్టి ప్రయోగాలు సాధారణంగా. విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. ఇట్లు ఈ ప్రాంతంలో రెండు రూపాలు పర్యాయంగా కనబడ్డంచేత ఛకారాన్ని చకారానికి రూపాంతరం అనవచ్చు. కాని దాన్ని వర్ణంగా చెప్పనక్కరలేదు.4.5. [చ,చ]లు : చవర్జం నేడు తాలవ్యాచ్చుల ముందు తాలవ్యంగాను
106
తెలుగు భాషా చరిత్ర
తక్కిన అచ్చులముందు దంతమూలీయంగాను ఉండటం మనం గమనించవచ్చు. ఇట్టి రెండు రకాలైన ఉచ్చారణలు ప్రస్తుత యుగంలో కూడా ఉండి ఉండాలి అని చెప్పడానికీ ఒకే ఒక వ్రాత ఆధారం కనిపిస్తుంది. పుత్సుకొని ( SII 6.745 10, 1398) < పుచ్చుకొని. దీన్ని ఈ క్రింది అచ్చులమార్పు స్పష్టంగా బలపరుస్తుంది.
ధ్వనుల మార్పు :
4.6. అ>ఎ;ఎ>అ : ఈ యుగంలోని శాసనభాషలో తాలవ్యహల్లు తర్వాత అకారం ఎకారంగాను, ఎకారం అకారంగాను మార్పుచెందడం తరచుగా కనిపిస్తుంది. ఇందు అ>ఎ మార్పు తత్సమాల్లోనూ, ఎ>అ మార్పు దేశిపదాల్లోను మాత్రమే కనిపించడం గమనార్హం.
(అ) ఆ>ఎ : విజెయువాడ (SII.4.754.6, 1135). యెధోచిత (పై. 6.982,20, 1296), శెంఖు (పై. 6.1052.11.1350) మొ వి.
(ఆ) ఎ>అ : యఱ్యన (పై. 4.945.29, 1152), యవ్వరు (NI. 1.17.18, 1218), యట్లు (ఎట్లు) (పై. 1.23.20,1347), యనక<యెనక<వెనక (NI. 2 100.16.1195)మొ.వి.
పై ఉదాహరణల్లో ఆ>ఎ మార్పు తాలవ్యహల్లు లన్నింటి తర్వాతనూ, ఎ>ఆ మార్పు కేవలం యకారం తర్వాత మాత్రమున్నూ కనిపిస్తాయి. అంటే దేశిపదాల్లో ఉన్నటువంటి ‘చ’ దంతమూలీయంగా పలకబడ్డంచేత పైమార్పు లేవీ దేశ్యచకారం తర్వాత జరగలేదన వచ్చు. తత్సమాల్లో తాలవ్యం తరవాత తాలవ్యేతర అచ్చు పరమైతే తాలవ్య హల్లు దంతమూలీయంగా పలకడమో లేక అచ్చులో మార్చు చెందడమో జరగవచ్చు. పై ఉదాహరణల్లో అచ్చుల మార్పును మనం గుర్తిస్తున్నాం. దేశిపదాల్లో ఎకారం అకారంగా మారడాన్ని బట్టి ఎ (అనగా యె) కొద్దిగా వివృతంగా ఉచ్చరింపబడేదని ఊహించవచ్చు.(ఇ) పై ఆ>ఎ మార్చు దేశిపదాల్లో ఒక్కదానిలో మాత్రం ఈ యుగంలో ఒక ప్రాంతంలో జరుగుతున్నట్లు కనిపిస్తుంది. చల్లు>చెల్లు, ఈమార్పు ఈయుగా
శాసన భాషా పరిణామం
107
నికి ముందే ఒక్క విశాఖ-శ్రీకాకుళం ప్రాంతం తప్ప తక్కిన ప్రదేశాల్లో పూర్తయి ఉండాలి. కనక తక్కిన అన్నిచోట్ల చెల్లు అనే రూపం కనిపిస్తుంది. కాని విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలో చల్లు ( SII 6.719 31, 1278, 6.1129.12 1376) మొ-వి; చెల్లు (పై. 6,845.12, 1273, 6.911.8 1349) మొ. రూపాలూ కనిపిస్తున్నాయి.
4.7. ఋ > రి, ఋ > రు : ఋ సాధారణంగా శాసనభాషలో రి అవుతుంది, రిషభ (SII. 4.990.2, 1158) మొ.వి. కాని ఈ యుగంలో ఋ > రుగా మారడం కూడా క్వాచిత్కంగా చూడవచ్చు. పిత్రుస్థానము (SII 4.1248.9, 1112), ప్రుదివి (తె.శా. 1.62.9 1259, 1258), రుతు (SII 4.950.8, 1346) మొ.వి.
4.8. దీర్ఘాచ్చులు : (అ) యకారం పరమవుతుండగా పదాది ఎఏలు రెండూ పర్యాయంగా ఈయుగంలో కనిపిస్తాయి. ఉదా. వేయి ( SII. 10.671.12,1128), వెయి (పై. 5.1013.2, 1148). నేయి (పై. 10.206.11,1195), నెయి (పై. 5.1012.9, 1108) మొ.వి. శాసనాల్లో ప్రయోగాల సంఖ్యనుబట్టి చూస్తే వేయి రూపం వెయి రూపం కంటే అధికంగానూ, నెయిరూపం నేయిరూపం కంటే అధికంగానూ ఉన్నాయి. దీన్ని బట్టి వేయిరూపానికి దీర్ఘ పూర్వకమూ, నేయి రూపానికి హ్రస్వపూర్వకమూ ప్రాచీనమేమో అనిపిస్తుంది. మొత్తంపైన యకార పూర్వక హ్రస్వదీర్ఘ సమ్మేళనం (merger) ఈ యుగంలో సమగ్రంగా కనిపించటంచే ఈ సమ్మేళనం ఈ యుగానికి పూర్వమే ఎప్పుడో జరిగిందని చెప్పవచ్చు.
సమాసాల్లో హల్లు పరమైనప్పుడు యకారం కనిపించదు. పూర్వాచ్చు దీర్ఘ రూపంతోనే కనిపిస్తుంది. నేమాన (SII 4.1061.10, 1149), వేకై లలు (పై. 10.715.18, 1251).(ఆ) 'ఈ’ అనే విశేషణం ఈ యుగంలో పరహల్లు దిత్వం కాకుండనే తరచుగా హ్రస్వరూపంతో ప్రయోగింపబడుతుంది. ఇదీపము (SII 5.160.15, 1136). ఇతోణ్ణపట్టు (పై. 4.1114.20, 1163) మొ.వి. వికాఖ-శ్రీకాకుళం ప్రాంతంలో హ్రస్వదీర్ఘాలు తరచుగా తారుమారౌతాయి. బహుశా ఇది ఒరియాభాష ప్రభావమై ఉంటుంది
108
తెలుగు భాషా చరిత్ర
4.9. డ->ద-: పదాది డకారం దకారంగా మారడం, శాసనభాషలో 10వ శతాబ్దిలోనే ప్రారంభమమైనా, ఈ యుగంలో డకారాది రూపాలు చాలా వరకు నిల్చి ఉన్నాయి. డాయు (SII 5.134.7, 1132) ; డున్ను (EI 5.14.138, 1213), డిగ్గిలి ( SII 5.1214.26, 1309). దకారంగా మారిన రూపాలు చాల స్వల్పంగా కనిపిస్తున్నాయి. దుత్తిక(<డుత్తిక<ఱుత్తిక) (SII 10.364.14, 1259), దున్ను (NI 2.7, 1314).
4.10. త-> ట-: -ఎంక్-అనే వర్ణాలు పరమవుతుండగా, తకారం టకారంగా మారటం ఈ యుగంలో క్వాచిత్కంగా కనిపిస్తుంది.
తకార రూపాలు : తెంకాయ (SI1 5 1236.3, 1277 ), తెంకణ (ప. 6.628.118, 1224), నూతెక్కి (పై. 10.79.18 1118). టకారరూపం; నూట్టెంకి (పై. 10 142 4, 1158) మొ వి.
4.11. -ంఱు(-న్ఱు) -ండు(-:ణ్డు) : నకార, శకటరేఫల సంయుక్తం ణ్డగా మారడం ప్రాచీనశాసనాల్లో విరివిగా కనిపిస్తుంది. ఈ యుగంలో ఒక నెల్లూరుజిల్లాలో మాత్రం ణ్డగా మారనిరూపాలు రెండుసార్లు కనిపిస్తాయి. అందులో వ్రిత్తికాంఱు (NI 1.24.17, 1187) ప్రథమాంతం, వాన్రి పెద్దకొడుకు (NI 3.9.29, 1259) షష్ట్యంతం. ఈ రెండవదానిలో శకటరేఫకు బదులు రేఫే కనిపిస్తుంది.పై రూపాలు వ్రాతలో మాత్రం నిల్చి ఉన్నాయా ? లేక ఉచ్చారణలోనూ నిల్చి ఉన్నాయా? మాండలికాల విషయంలో నెల్లూరుజిల్లా అనేక ప్రాచీనరూపాల్ని నిల్పుకొన్నట్లు చెప్పడానికి మనకు పెక్కు ఆధారాలున్నాయి. చేసిన, చేసిరి, అనడానికి బదులు 7వ శతాబ్దికి చెందిన భైరవకొండ (ఉదయగిరితాలూకా, నెల్లూరుజిల్లా) శాసనాల్లో కేసిన, కేసిరి అనే రూపాలున్నాయి. ఆంటే తెలుగుభాషలో తాలవ్యీకరణo అతి ప్రాచీనకాలంలోనే జరిగి పోయినా తాలవ్యీకరణం కాని రూపాలీ ప్రాంతంలో నిల్చి ఉన్నాయి. ఇవి కేవలం వ్రాతల్లోనే నిల్చి ఉన్నాయేమో అనడానికి వీల్లెదు. ఇటీవలి మాండలిక పరిశీలనలో నెల్లూరుప్రాంతాల్లో కింక, కీలిసె, కీడిసె వంటే తాలవ్యీకరణం కాని రూపాలు కనిపించాయి2. కాబట్టి వ్రిత్తికాన్ఱు వంటి రూపాలు బహుశా నెల్లూరు జిల్లాలో పామరమాండలికాల్లో (Substandard dialects) నిల్చి ఉండవచ్చు. అట్టివి క్వాచిత్క౦గా శాసనాల్లోకి వచ్చి ఉండవచ్చు.
శాసనభాషా పరిణామం
109
4.12. -న్ఱ్-/-oఱ్-/ ్రఱ్ ->-oడ్ర్-; తన్ఱి (SII 6.917.5, 1340), ఈ ఒక్కటి తప్ప తక్కినవన్నీ ఆనుస్వారంతోనే కనిపిస్తాయి. తంఱి (పై. 4.1119.15,1261), పంఱెండు (పై. 6.937.7,1359), ఎనుమంఱు (పై. 5.1052.10,1350), ఒత్తుకాంఱు (పై. 6.937.7, 1349), వాస్యకాoఱు (పై. 6.1116.13.1376) మొ.వి, పై వాటిలో రెండు ప్రయోగాలు తప్ప తక్కినవన్నీ విశాఖజిల్హాలోనివే, ఆరెంటిలో ఒకటి గుంటూరికి మరొక్కటి తూర్పుగోదావరికి సంబంధించినవి.
పై ప్రయోగాలకు మిగిలిన శాసనాల్లోను, సారస్వతభాషలోను తండ్రి, పండ్రెండు, ఎనుమండ్రు మొ. రూపాలే కనిపిస్తాయి. వీటిలో సాహిత్యప్రయోగాలు ప్రాచీనరూపాలా ? లేక పై శాసనరూపాలు ప్రాచీనమైనవా ? చారిత్రకంగా చూస్తే -న్ఱ్ ప్రాచీనస్వరూపమని, -న్ఱ్ రూపానికి అర్వాచీనరూపం -౦డ్ర్- అనీ చెప్పవచ్చు. తండ్రి శబ్డానికి ప్రాచీనరూపం తన్ఱి అనడానికి ఈకింది ఆధారాలున్నవి. తెలుగు, తండ్రి, కుఇ,తంజి, కువి. తంజి. వీటిని పునర్నిర్మాణం (re-construction) చేస్తే *తన్ఱి రూపం వస్తుంది.
పండ్రెండు శబ్డానికి ప్రాచీనరూపం *పన్ + రెండు (>పన్ - ఱెoడు> పండ్రెoడు) అనవచ్చు. పదికి రూపాంతరం పన్ అనడానికి అనేక ఆధారాలున్నవి. పన్నిద్దఱు [పన్ + ఇద్దఱు ] (SII 5.1298.8,1241) మొ.వి. ఆలాగే ఎనమండ్రు అనడానికి ప్రాచీనరూపం *ఎణ్-పన్-రు (> ఎణ్-మన్-ఱు> ఎనుమంఱు> ఎనమండ్రు) అనవచ్చు. ఒత్తుకాంఱు, వాస్యకాంఱ్రు శబ్ధాలకూ ఒత్తుకాన్-రు, వాస్యకాన్-రు రూపాలు ప్రాచీనరూపాలని చెప్పవచ్చు.
న్ఱ>ణ్డృ మార్పు తెలుగులో ఎప్పుడు జరిగిందో చెప్పటానికి ఆధారాలు అంత స్పష్టంగా కనబడవు. అద్దంకిశాసనంలోనే పణ్డెండు శబ్ధం కనబట్టంచేత ఈమార్చు 8వ శతాబ్దికి పూర్వమే జరిగిఉండాలి. ఈయుగంలో కనిపించే తన్ఱి మొదలగురూపాలు బహుశా పామర మాండలికంలో (Substandard dialect) వ్వవహారంలో ఉండవచ్చు. విశాఖ ప్రాంతంలోని కొండభాషలో నేటికి –న్ఱ- ఉచ్చారణలో ఉండటం దీనికి ప్రబల తార్కాణ అవుతుంది.4.13. –యి- > - హి- : ఇకారం పరమౌతుండగా అపదాది యకారం హకారంగా మారడం ఈయుగంలో చాల తరచుగా సంభవిస్తుంది. ఉదా: నాహిండు
110
తెలుగు భాషా చరిత్ర
<నాయిండు ) [SII 10.321.9, 1248 ], ఆచంద్రార్కస్తాహిగా (పై. 10.510,8, 13;5) మొ. వి. పయిఁడి అనడానికి ఈయుగంలో పహిండి/ పైండి రూపాలు ఉన్నాయి. పసిండి రూపం బొత్తుగా కనిపించదు. అందులోను పహిండి రూపమే చాలా తరచుగా కనిపిస్తుంది, (SII 4.1142.7,1142, 10.431. 27,1272) మొ. వి.
4.14. ఆపదాది రేఫకు పరమయ్యే హల్లులు సాధారణంగా ద్విత్వంగా వ్రాయడం శాసనభాషలో కనిపిస్తుంది. సవ్వ౯ (సర్వ), చక్రవత్తి౯ (చక్రవర్తి, రేచెల్ల౯ (రేచెర్ల) మొ.వి. ఇట్టి వానిలో రేఫలోపించడం ఈయుగంలో తరచుగా కనిపిస్తుంది. అఖoడపత్తి (SII 6-995. 14, 1288), సమప్పించు (పై. 5.15, 1.10,1305) మొ.వి. రేఫలోపించని రూపమైన ఇద్ధ౯ఱు ( పై. 6.941.12, 1299) శబ్దం ఫై వాటిలో చాలా ముఖ్యమైంది. ఇందలి రేఫలేని రూపం ఈయుగానికి పూర్వమే కనిపించినా ఈ ఒక్క ప్రయోగం మాత్రం ఈయుగంలో రేఫతో కనిపిస్తుంది. ఇది విశాఖ ప్రాంతంలోనిది. ఈ ప్రాంతమందలి అనేక ప్రాచీన రూపాల్లో ఇదీ ఒకటి అనుకోవచ్చు.
4.15. పై రేఫకు వర్ణవ్యత్యయం జరగడం కూడా ఈ యుగంలో సాధారణంగా కనిపిస్తుంది. ఉదా. ప్రెగ్గడ (SII 10.73.111, 1115), <పెగ్గ౯డ (పై.6.217.4, 1129), ద్రుగ్గాదేవి. (పై. 5-1217.8,1290) (<దుర్గాదేవి) మొ వి.
4.16. ఆదిహల్లుపైన రేఫ సంక్లిష్టమై ఉంటే అట్టి రేఫకు లోపం కావడం ఈయగంలో క్వాచిత్కంగా కనివిస్తుంది. మాను ( SII 10.241.10, 1185), < మ్రాను, తావు (NI 1.25. 69, 1284) < త్రావు, బిందావనం (SII 5.4.12, 1394) < బ్రిందావనం.ప్రెగ్గడ శబ్దంలోనూ ఈలోపం తరచుగా కనిపిస్తుంది, కాని ఇది వర్ణవ్యత్యయానికి ముందుగాను తర్వాతగాని జరిగి ఉండవచ్చు, పెగ్గ౯డ > పెగ్గడ ; లేదా పెగ్గ౯డ > ప్రెగ్గడ > పెగ్గడ. వర్ణవ్యత్యయం రేఫలోపం రెండూ ఈ యుగంలో జరుగుతూ ఉండటంచేతనూ, అది సంశ్లిష్టంలో రేఫలోపం చాలా క్వాచిత్కంగా కనిపించుటంచేతనూ పై రేఫలోపం వర్ణవ్యత్యయానికి ముందే జరిగి ఉంటుందనవచ్చు (చూ. 4 14),
శాసన భాషాపరిణామం
111
4.17. ఱ : శకటరేఫ, సాధురేఫ కొన్నిసార్లు తారుమారవడం శాసనాల్లో కనిపించినా, శకటరేఫ రూపాలు చాలా వరకు ఈ యుగపుశాసనాల్లో సక్రమంగానే పాటింపబడి ఉన్నాయి. కూcతురు శబ్దంలోనూ, _రాలు ప్రత్యయంలోనూ సాధురేఫ ఉన్నట్లు బాలవ్యాకరణంలో చెప్పబడి ఉంది, కాని ఈరెండు రూపాలు ఈ యుగపు శాసనాల్లో చాలా తరచుగా శకటరేఫతోనే ఉన్నాయి. కూంతఱు (SII 5.1025.10,1111), నాయకఱాలు (పై. 5.1030.5, 1141) మొ వి. కాబట్టి నన్నె చోడుడు వీటిని శకటరేఫతో వ్రాసి ఉండాలి. బహుశా వ్రాతప్రతులలో వ్రాయసగాండ్రు వాటిని తమకాలంలోనే అలవాటు ప్రకారం సాధురేఫగా మార్చారు కాబోలు !
4.18. స > ళ : తాలవ్యాచ్చు పరమౌతుండగా సకారం శవర్ణంగా మారడం ఈయుగంలోనే చాలా తరచుగా కనిపిస్తుంది. అందులోను పదమూడో శతాబ్దినుంచి ఇది బలీయంగా వ్యాపిస్తుంది. ఉదాః పడశిన (SII 6.845, 12,1273) చేశిన (పై. 10 465. 109,1290), శీతాదేవి (పై. 5.1225 5,1349) మొ వి. ఈ మార్పుకూడా ఈయగంలో తాలవ్యాచ్చు ముందు దంత్యం కాని దంతమూలీయంగాని నిలవవు అనే సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. అంటే తాలవ్యాచ్చు ముందు చవర్ణం తాలవ్యంగాను, తక్కిన పరిసరాల్లో దంత్యం లేక దంతమూలీయంగా పలికేవారనడానికి ఈ మార్పుకూడా ఒక తార్కాణంగా తీసుకోవచ్చు, (చూ. 4,5-6).
4.19. వర్ణసమీకరణం : డ్ల > ళ్ళ : ఈ యుగంలో 12వ శతాబ్దిలో డ్ల రూపాలే. చాలా తరచుగా ఉన్నాయి. ళ్ళ రూపాలు చాలా క్వాచిత్కంగా కనిపిస్తాయి. ళ్ళ రూపాలు రానురాను ఎక్కువౌతూ 14వ శతాబ్టిలో దాదాపు డ్ల రూపాల స్థానాన్ని ఆక్రమించిందనవచ్చు. డ్ల - రూపాలు: మాడ్లు (SII 10.476.6, 1293),(మాడలు); మూడ్లు(పై 5.70,12, 1117) (మూరలు); ళ్ల రూపాలు; మూళ్లు(పై. 10.84.17,1122), గుళ్ళు(పై.4.1379.9, 1381) మొ.వి.
వర్ణాల స్థాన నియమాలు :
4.20. పదాదిలోను, అజ్మధ్యంగానూ, హల్లులు సాధారణంగా ఏ నియమం లేకుండా వస్తాయి. కాని ఒక డకారం తప్ప తక్కిన మూర్దన్య హల్లులు సాధారణంగా ఆఆల ముందే కనిపిస్తాయి. తక్కిన అచ్చులముందు ఈయుగపు శాసనాల్లో అట్టే కనిపించడంలేదు. టంకమాడలు (SII 6.1183.9, 1221). 112
తెలుగు భాషా చరిత్ర
ఠక్కురు. (పై. 6.897.6, 1298), ఠావు (పై. 10.111.8,1142), ఢాకిని (భారతి 15.1. 159.86, 1323) మొ.వి. పదమధ్యంలో అటిక (SII 6.1033. 13,396) మొ.వి. ఇతర అచ్చుల ముందూ వస్తాయి.
డకారం పదాదినికూడా అన్ని అచ్చులముందూ కనిపిస్తుంది. డంగుంబ్రాలు (S1I 4.1243.12. 1112), డాపల ( పై. 10. 1034.7, 1132), డిగ్గు (పై. 6.1201. 7, 1219), డున్నవారు (పై .6.1200.14 1175), డెబ్బదేను (NI 2.28.7, 1258) డేరా (SII 5.1216.6,1314), డోలు (పై. 10.451 115, 1289).
4.21. సంయుక్త వర్ణాల మధ్యవచ్చే అచ్చు : సంయుక్త వర్ణాల్లో రెండోవర్జం యకారంగా ఉంటే ఇకారమున్నూ, తక్కినచోట్ట ఉకారమున్నూ ఈ యుగపు శాసనాల్లో చాలా తరచుగా వస్తాయి. యకారంముందు : పరియంతము (SII 10 : 340.12, 1253) ( < పర్యంతము ), సంధియ (పై. 5.192.2,1228) (< సంద్య) మొ.వి. తక్కినచోట్ల : పరుషంబు ( పై. 5.1008.1, 1127), కలుహార (పై. 5.672,8, 1139), మహాళబుద (తె. శా. 2: 128.4,1298) మొ. వి.
4.22. పార్శికాలలో లకారం ఒకటే పదాదిన వస్తుంది. ళకారంరాదు. లక్షణి (SII 6.647.4, 1148 ), లావ (NI3 47.60, 1211 ) మొ.వి. అజ్మధ్యంగా 'బిళసరము, బెళగు'మొ. కొద్ధిచోట్ల ప్ప తక్కినచోట్ల సర్వత్రా ళ కార రూపాలకు లకారరూపాలు. పర్యాయంగా కనిపిస్తాయి. ఉదా : నీళేశ్వర (SII 10. 708.4, 1151). నీలేశ్వర(పై. 10.704 8, 1151), చోడవళనాంటి (పై. 6.156.15 . 1154 ), చోడవళనాణ్జి (పై. 6.135.3, 1144), స్తళము (తె.శా. 1.18.158. 1162): స్తళకరణాలు(SII 10. 528.11, 1319)మొ.వి.4.23. ఈ యుగంనాటి తెలుగుభాష పూర్తిగా అజంతం అయినట్లు తోస్తుంది. పదాంతంలో ఒక్క అనుస్వారం చాలా తరచుగా కనిపిస్తుంది. దత్తం (SII 5.7.6, 1388 ), మాసం(పై. 6.84.2, 1292), రక్తం (NI 1.24 14, 1187) మొ.వి. నకారాంతపదాలు చాలా క్వాచిత్కంగా కనిపిస్తున్నాయి. చంద్రమౌళికిన్(SII 10.124 , 1144)మొ. పద్యాల్లో నకారపుపొల్లు రావలసినచోట్ల కూడా 'ను' కాని 'ని' గాని వ్రాసేవారు. భువిని (పై. 10.151, 1161)
శాసన భాషా పరిణామం
113
భువిన్ అని చదవాలి. కాముండును(పై. 10.151, 1161) కాముండున్ అని చదవాలి.
4.24. పదాదిస్థానంలో అచ్చులు, (హస్వదీర్ఘాలు వస్తాయి. కాని పదాంతంలో సాధారణంగా ఆ, ఇ, ఉ,లే తరచుగా వస్తాయి. ఎ, ఒలు క్వాచిత్కింగా వస్తాయి. విజయరాజె (SII 5.1070.8, 1138), ఒకకోటి (పై 10. 177.22,1171) మొ.వి.
సంధి:
4.25. రెండు పదాల చేరిక వలన రెండు అచ్చులు కలిసినప్పుడు మొదటి అచ్చు లోపించవచ్చు, లోపించక పోవచ్చు ; మధ్యలో యడాగమo రావచ్చు. మన వ్యాకరణ నియమాలేవీ ఈ శాసన ప్రయోగాలకు సరిపడవు.
(అ) సంధివచ్చే రూపాలు : తమన్న (SII 10.416.128, 1280) (తమ + అన్న); మహిదేవైన (పై, 6.1097.9, 1378) (దేవి + ఐన) మొ. వి.
(ఆ) సంధి రాని రూపాలు : కొట్టరువు ఎఱియమ (పై. 4.1114.19,1163), దేవనెమ్మెళను ఎవ్వండైన (పై. 6.98 24,1131) మొ.వి.
(ఇ) యడాగమం వచ్చే రూపాలు : కుంభమాసము యమావాస్య (పై. 5,1343.5, 1146), సత్యెరాజు యిచ్చిన (పై. 4.1098.8, 1152) మొ.వి,
4.26. ఈశ్వరశబ్ధం పరమయ్యేటప్పుడు గుణసంధికి బదులు తెలుగు సంధి జరగడం ఈ యుగపు శాసనాల్లో తరచుగా చూడవచ్చు.
(అ) తెలుగు సంధి రూపాలు : భీమేశ్వర( SII 10,177,42 1171), నీలీశ్వర (పై. 10.7128, 1183), మల్లీశ్వర (పై. 6.89.4 1241) మొ. వి.
(ఆ) గుణసంధి రూపాలు : భీమేశ్వర (పై.10 510.8,1315), నీలేళ్వర (పై. 10.704.8, 1151), మల్లేశ్వర(పై . 6.89.2, 1241) మొ. వి.
4.27. అచ్చుకు క చ త ప లు పరమైతే గ స ద వ లు కావచ్చు, కాకపోవచ్చు. వీటిలో దేశి తత్సమాల నియమాలేవీ లేవు.
(అ) అయిన రూపాలు : రెండు గుంచములు (SII 4.1188.8, 1155), క్రిష్ణసతుర్దసి (పై. 5.1070.4 1138), బోయుండుదన (పై.4.674.6, 1150), పండ్రెండువుట్లు (పై. 5.91.16, 1176) మొ.వి.(8)
114
తెలుగు భాషా చరిత్ర
(ఆ) కాని రూపాలు : కూంతుఱు కొమ్మసాని (పై. 5.67. 8,113), పెట్టిన చేను(పై. 5.172.13,1194), దొమ్మనతన (పై. 5.1089.8,1131) ఱoటెoగి పొలము(పై. 5.1068.8, 1145) మొ.వి.
4.28. పదాంతంలో ఒక్క అనుస్వారం తప్ప తక్కిన హల్లులు సాధారణoగా రావు. ద్రుతసంబంధి నకారంకూడా పొల్లుగాగాక 'ను' రూపంలోనే ఉంటుంది(చూ. 4.24 ). కాబట్టి సారస్వతభాషలో ద్రుతప్రకృతికము లనబడే రూపాలు శాసనాల్లో సాధారణమైన అజంతాల లాగానే ప్రవర్తిస్తాయి. ఏకాదశిని ఆదివారమూనూ (NI 2.51.3, 1198), వీని సేకొని (SII 4. 1000.6, 1166), భోజనార్థములకు వెట్టింపులకుంగా ( పై. 4.1098,8, 1153 ), పుష్పాలకు యిచ్చిన (పై. 18.526.44, 1319) మొ.వి. కొన్ని కొన్ని చోట్ల ద్రుతప్రకృతికాల౦ తర్వాత చ ప లు జ బ లుగా కూడా మారి ఉన్నాయి. క్రిందను బెట్టిన (SII 5.1046.12, 1187), పరలోకానికిం జని తేని (తె. శా. 1.78.2, 1276) మొ.వి.
సంయుక్త వర్ణాలు
4.29. పదాదిలో : స్పర్శోష్మాలతోను, మూర్దన్యాక్షరాలతోను, పార్శ్వ రేఫాక్షరాలతోను, యకారంతోను, మహాప్రాణాలతోను ప్రారంభమయ్యే సంయుక్తాలు అరుదు. ఘ్రములు (NI 2.84.16) మొ.వి. మహాప్రాణాక్షరాలతో అరుదుగా కనిపిస్తున్నాయి. మిగిలిన హల్లులు రేఖతో సంయుక్తమై తరచుగా కనిపిస్తున్నాయి. క్రొత్త (SII 10.472.25, 1292), గ్రొచ్చు (పై. 10.655.5, 1105), త్రాసు (పై. 10,443.6. 1278), ద్రావిడ (పై .6.719 .23, 1278), ప్రత్తి (పై. 4.935.27,1268), బ్రతుకు (NI 2.727, 1814), న్రిపాలక (పై .10. 89.6. 1132), మ్రొక్కు (పై .4.1302.12, 1106), వ్రయము (పై . 10.340.11, 1253) మొ.వి రేఫగాక తక్కిన హల్లులతో సంయక్తాలు క్వాచిత్కంగా కనిపిస్తాయి. క్షేత్రము (పై . 5.120. 53,1275), ద్వార (పై. 6. 1136.7,1374), వ్యాపారి (పై. 6,1173.5, 1104) మొ.వి.4.30. పదమధ్యంలో : తత్సమ పదాలను మినహాయించి స్థూలంగా ఈ కింది విధంగా చెప్పవచ్చు. దేశివర్ణాలలో ఒక్కరేఫ, హకారం తప్ప అన్ని ద్విత్వంకాగలవు. సంయుక్తాలలో అనునాసికాలు, మూర్థన్యాలు, దంతమూలీయ పార్శ్వం, రేఫ శకటరేఫలు ప్రథమవర్దంగా సాధారణంగా కనిపిస్తాయి. అందు
శానన భాషా పరిణామం
115
అనునాసికాలు తమ వర్గాక్షరాలతో కలిసినప్పుడు వ్రాతలో అనుస్వారాలు అవుతాయి. అవిగాక కాన్కి(SII 6.639.2, 1147), మన్చి (తె. శా. 1.13.33. 1170), తంఱిి (SII 6. 631.4, 1286) మొ.వి. గమనార్హం, మిగిలిన హల్లులకు ఉదాహరణలు: వడ్లు (పై. 6.169.5, 1167), అట్లు (పై-4.671.18. 1130), కొల్చు (పై 5.1188.54, 1250), పెర్లు ( NI 2.59.24,1167), కఱ్త(SII 5.167.15, 1200) మొ.వి.
4.31. నామప్రాతిపదికలు (noun stems) రెండురకాలు : 1. అవి భాజ్యం (Simple), 2.విభాజ్యం(Complex and Compound). అవిభాజ్యం-దేశిపదాలు, ఎరువుమాటలు అని రెండురకాలు. ఊరు (SII 5.70.10, 1177), ఇల్లు (పై. 10,184.80, 1154) మొ. వి, దేశిపదాలు. ఎరువు మాటల్లో సంస్కృతంనుంచి ప్రాకృతాల నుంచీ వచ్చినవి అని రెండు రకాలున్నాయి. భూమి (పై. 5.1046.10,1187) మొ. వి. సంస్కృతం నుంచి వచ్చినవి. వీటినే మన వైయాకరణులు తత్సమపదాలన్నారు. ఠక్కురు (పై. 6.897.6, 1298) డేరా (పై. 5.1216,6, 1314) మొ.వి. ప్రాకృతాల నుంచి వచ్చిన ఋణపదాలు. ఇవిగాక పిరాట్టి (తె. శా. 1.71.12, 1258), వళిక (SII 10,565.12, 1891) మొ. అన్యదేశ్యాలు కూడా ఈ యుగంలో క్వాచిత్క౦గా కనిపిస్తాయి.
విభాజ్య ప్రాతిపదికల్ని ప్రధానంగా రెండురకాలుగా చెప్పవచ్చు. 1. ఏకధాతుకం (derivatives), 2. బహుధాతుకం (compounds), ఏకధాతుకం-కృత్తులని, తద్ధితాలనీ రెండు రకాలు.
4.32. కృత్తులు : మూలధాతువుల పైచేరే ప్రత్యయాలు. ఇవి దేశిపదాలు గానే ఉంటాయి.(క) -ఇకి/-ఇక: ఏలికి ( SII 6.649.10, 1160), కానిక (పై. 10.465,99, 1280) మొ.వి. ఇకారం లేకకూడా రావచ్చు కాన్కి (పై.6.692, 1147).
116
తెలుగు భాషా చరిత్ర
(ఖ) -ఆపు/-ఉపు/-పు : అడపు( SII 4.1020.10, 1118), కొలువు (పై. 6.756 6,1118), కాంపు (పై. 5.162. 11,1169),
-ఇంచు చేరే ధాతువుకు -ఇంపు చేరుతుంది. పెట్టించు-పెట్టింపు (పై.4.1098, 1158) మొ.వి
(గ) -అవు/-ఉవు/వు : తొడవు ( SII 5.162.4, 1169), తెరువు (పై. 6.1178.7,1198), పూవు(ఫై 6.897.7,1298)మొ.వి.
(ఘ) -ఉవ/-వ : విలువ (పై. 6.912.8,1278), త్రోవ (పై. 10.481.41,1297) మొ.వి.
(చ) -ఇమి/-మి: కూరిమి (పై.5.1075,7,1128), పేర్మి (పై. 6.1౩2.౩,1151) మొ.వి.
(ఛ) -అలి/-ఇలి : కూడలి (పై. 10.565.6,1౩91), డిగ్లిలి (పై 5.1214.౩0, 1309)మొ.వి.
(జ) -ట : తోణ్ట ( పై. 4.120౩.9,116౩. పూణ్ట (పై 4. 1020.9.1118) మొ.వి.
(ఝ) -ఇణ్టి/-ణ్జి : పహిణ్థి (పై. 4.1190.4,114౩), వెణి (పై. 4.1190.4,114౩) మొ వి.
(ట) -Ø (శూన్యం) : తప్పు (పై. 5.1290.6. 1230), చెల్లు (NI 5.25,4, 1244) మొ. వి.
4.33. తద్ధితాలు : పై కృత్ప్రత్యయాలలా గాక ఈ తద్ధిత ప్రత్యయాలు దేశి పదాలపైననూ తత్సమాలపైననూ రావచ్చు. ఇవి మూలధాతువులపైగాక ప్రాతిపదికలపై వస్తాయి.
(క) -కా- : ఈ ప్రత్యయంపై మహత్ప్రత్యయం-ణ్డు, మహతీ ప్రత్యయం -త్త్య చేరుతాయి. మహతీ ప్రత్యయం ముందు - దీర్ఘం హ్రస్వమౌతుంది. అవజకాండు ( SII 10,334.93, 1251) వ్రిత్తికత్త్య (పై.10.110.18, 1141) మొ.వి.(ఖ) -అరి/-అరి/-ర/-అఱ-ఆఱి/-ఱ. మొ: కొట్టరి (పై. 4.1114.12 1163), కోనారి (పై.6.924.8, 1369), భడర (పై. 4.900.9,
శాసన భాషా పరిణామం
117
1158), సుంకఱి (పై. 6,617.7, 1145), తలాఱ (NI 2.8.6, 1188), తలాఱి (NI 2.10.7, 1188) మొ. వి.
తలాఱి మొదలగు శబ్దాల్లో సాధురేఫ శకటరేఫ గూడా కనిపిస్తున్నాయి. అంటే సాధురేఫకూ, శకటరేఫకు గల వ్యత్యాసం ఈ పదాల్లో తబ్బిబైందన్నమాట. కొట్టరి, పురవరి మొదలైన మాటలలోని -ఆరి, -అరి ప్రత్యయాలు బహువచనానికి సంబంధించినవని చెప్పవచ్చు. కాని ఏదో కారణంచేత ఇవి శకటరేఫలతో కూడా శాసనాలలో కనివిస్తాయి.
(క) లోని-కాణ్డు రూపానికి కన్నడంలో-కాఱ్డ అనేరూపం ఉంది, బహుశా ఈ కన్నడంలోని-కాఱ శబ్దం ప్రభావం వల్ల పై రూపాల్లో శకటరేఫ వచ్చి ఉండవచ్చు.
(గ) -ఇ : ఉదారి (SII 4.666.8, 1189), భండారి (పై. 6.154.7,1152): ఈ-ఇ ప్రత్యయమే పై తలారి మొ. వానిలోని -ఇ అయిఉంటుంది. (చూ. 4 33 (ఖ) ).
(ఘ)-క- : దీని తర్వాత క్లీబవాచక ప్రత్యయమైన -ము/-౦ (బిందువు) చేరుతుంది. రడ్డికము ( SII 4.737,15, 1115), రడ్డికం (పై. 4.762.18, 1131) మొ. వి.
(చ) -తన-: దీని తర్వాత కూడా -ము/-o వస్తుంది. స్టానాపతి తనము (పై- 10.709.9,1189), తలారి తనము (పై .6.207.31,1209) మొ. వి.
లింగబోధక ప్రత్యయాలు (Gender Suffixes) :
4.34. మహత్తు (ఏకవచనం) : -ంఱు, -ణ్డు, -డు. వీటిలో ౦ఱు ప్రాచీనరూపమైన -న్డుకు రూపాంతరం అనవచ్చు. వ్రిత్తికాంఱు (NI 1.24.17, 1187), అల్లుణు (పై 6.628,9. 1202), తమ్ముడు (పై. 6.120.39, 1275) - oఱు ప్రత్యయం. నెల్లూరశాసనంలో ఒకచోట మాత్రం కనిపిస్తుంది. ఇది ఆ ప్రాంతంలో కనీసం మాండలికంగానైనా వ్యవహారంలో ఉండేది అనడానిని వాన్రి పెద్దకొడుతు ( NI 3.9.29 ) అనే ప్రయోగం ప్రబలమైన ఆధారం. 118
తెలుగు భాషా చరిత్ర
4.35. మహతి (ఏకవచనము) : -ఱాలు, -ఆలు, -త్య : నాయకుఱాలు. (SII 5.1030.5, 1141 ), బాలవ్యాకరణంలో - రాలు అని ఉంది. కాని శాసనాలలో బహుసంఖ్యాకంగా - ఱాలు అనే ఉన్నది. -ఆలు ప్రత్యయం కొన్ని బంధుత్వపదాల్లోనే ఉంది. కోడలు (SII 6.634.2, 1153), మఱoదలు(పై. 6.634.2., 1153); వ్రిత్తికత్త్య (పై. 10.110.13, 1141)మొ.వి. -త్త్య -కా ప్రత్యయం మీదనే వస్తుంది. దీనిముందు కాలోని ధీర్ఘత పోతుంది.
4.36. క్లీబం : -ము, -మ్ము, -౦బు, -౦ (అనుస్వారం): కూటము (SII 4.1102.11, 1150), సుంకమ్ము (NI 1.25.59, 1284), దేశంబు (SII 6.402. 20, 1264). రక్తం (NI 1.24. 14, 1187) మొ.వి.
బహుధాతుకం (సమాసం)
4.37. సమాసాలు నాలుగు రకాలు 1. దేశి, 2. తత్సమం. 3. మిశ్రం. 4. వర్ణలుప్తం.
(1) దేశి : దేశిరూపాలతో అయ్యేది దేశసమాసం. దేశిసమాసాలు ఏర్పడే విధాన్ని బట్టి ఈ కింది విభజన చేయవచ్చు.
(క) ఇతరత్ర స్వతంత్రప్రయోగం ఉన్నరూపం విశేణంగా ఉన్నాకూడా దానిని విడదీస్తే అర్ధము మారిపోయింది. కాబట్టి అట్టివి సమాసంగానే భావించాలి. ఛలివందిలి (తె. శా. 1.37.3, 1215), గుండకుడ్క (SII 5.1172.15, 1293 ) మొ. వి.
(ఖ) మరోచోట స్వతంత్రప్రయోగం లేని బంధరూపం (boundform) విశేణంగా ఉండటం. నల్లిల్లు (తె.శా. 1. 17. 27,1115). “నల్"కు స్వతంత్రప్రయోగం లేదు: ఆంబోతు(SII 10. 834.102,1251), “ఆన్" కు స్వతంత్రప్రయోగంలేదు మొ.వి.
(గ) బంధరూపంపై- అ చేరినవి. మేనమామ (SII 6.634.1,1153), అనపాలు (పై. 6.1118.18, 1281) (ఆవుపాలు ). ఊరతలారి (పై 10.528.11 1819).(ఘ) పై-అ ముందు ము వర్ణకమందలి మకారానికి ప వర్ణమౌతుంది.
శాసన భాషా పరిణామం
119
ఇనుప ఎడ్లు ( SII 4.1156.11, 1185 ) (ఇనుము = నల్లని, ఎడ్లు = గృహజంతువులు) ; మొ. వి.
(చ) ద్వంద్వసమాసం : తల్లిదండ్రులు ( SII 6,125.82,1172) కూరకాయలు (పై. 10.33. 4.96,1251), మొ.వి. మొదటిరూపంలో తకారం దకారం అయింది. రెండవదానిలో “క”, వర్ణం “గ" కాక పోవడం గమనార్హం. ఏకవచనాంతమైన ద్వంద్వసమాసరూపాలు కూడా ఉన్నాయి. ఇట్టివి 18 వ శతాబ్దం నుంచి కనిపిస్తాయి. తల్లి తండ్రి ( SII 6.90.8 1341), కాయకూర (పై. 7.904.28,1291) మొ. వి.
(2)తత్సమం : సంస్కృతసమాసాలు అలాగే తీసుకొన్నవి. సహస్రనామార్చన (SII 6.1212.11 1210), జలధార (పై. 6 43,16, 1192) మొ.వి.
(3) మిశ్రసమాసం : ఇవి తెలుగు పదాల స్థానాన్ని బట్టి రెండు రకాలు.
(క) తె + సం : తలరాసి. (SII 4.1058.6, 1149), వెంజామర (పై. 4,1190.4.1143) మొ. వి.
(ఖ) సం + తె : చామరకొలుపు(పై.6.756.10, 1113), దీపమాన్య (పై. 6.1203,7 1226) మొ. వి.
(4) వర్ణలుప్తసమాసం : తిరువజాము (తిరువర్థజామ) (SII 6.742, 6, 1372), మంజుతెర ( మంజిష్ఠ తెర ) (పై. 5.1216.4, 1314 ), హవిలి (హవిబలి) (పై 10.131.14, 1158) మొ. వి.
4.38. వచనం
(క) -రు : మానవవాచకాల్లో (human nouns) కొన్నింటికి బహువచన ప్రత్యయంగా - రు వస్తుంది. అల్లురు (SII 10.164.6,1168 ), దీనురు ( పై. 6.628.115, 1224) మొ. వి.(ఖ) -ఱు, ౦డ్రు, -౦ఱు, -౦ఱు : -కా- ప్రత్యయం మీద మహత్తులో పై ప్రత్యయాలు వస్తాయి, వాద్యకాఱు ( SII 10,707.14, 1153), మద్దెల కాండ్రు (పై. 5.1188,65- 1250), ఒత్తుకాంఱు (పై. 6.955.9, 1349), వాస్యకాంఱ్రు (పై .6.1116.13,1376).
120
తెలుగు భాషా చరిత్ర
పై వానిలో ౦ఱు -౦(ఱు విశాఖప్రాంతంలోనే కనిపిస్తాయి. పైనాలుగు రూపాల్నిబట్టి పునర్నిర్మాణం (reconstruct) చేస్తే* న్ఱు వీటికి ప్రాచీనరూపమని చెప్పవచ్చు (చూ. 6,12). -కా- ప్రత్యయంలో దీర్ఘం ఊంది. కాబట్టి ఈ దీర్ఘం పైన అనునాసికంపోయి -ఱు ఒక మాండలికంలో అయి ఉంటుంది. బహుశా ఇది కన్నడప్రాంత మాండలికంలో అయి ఉండవచ్చు. -న్ఱు > -౦డ్రుగా ఇంకో మాండలికంలో అయి ఉంటుంది. తర్వాత మాండలికమిశ్రం (dialect-mixing) వల్ల -౦డ్రు, -ఱు రెండు రూపాలూ తెలుగుభాషలో నిల్చాయి. నన్నయ, నన్నెచోడుల భాషల్లోనూ, 12 వ శతాబ్దిదాకా శాసనాల్లోనూ ఒక్క కాఱు శబ్ధమే కనిపిస్తుంది, -కా౦డ్రు శబ్దం 18 వ శతాబ్టిసుండే కనిపిస్తుంది. ఈ- కాండ్రు ప్రత్యయం 13వ శతాబ్దినుండి ఎక్కువౌతూ 14వ శతాబ్దిలో దాదావు-కాఱు రచనలో లోపిస్తుంది.
పెక్కండ్రు (SII 4.974.2, 1132 ), ఎన్మండ్రు (పై. 5.1305. 11,1107) తొమ్మండ్రు (పై. 6.87.11,1164), పదుండ్రు (ఫై. 10 130.15, 1153) ఇర్వoడ్రు ( 6.1189.64, 1260 ) మొ. శబ్దాలోను-ండ్రు ప్రత్యయం కనిపిస్తుంది. వీటీలో ఎన్మండ్రు అనడానికి రూపాంతరం ఎనమంఱు (SII 6. 1052.10, 1350) కూడా వికాఖ ప్రాంతంలో కనిపిస్తుంది.
4.39. -లు : సర్వసాధారణంగా బహువచన ప్రత్యయంగా వచ్చేది -లు. ఇది కొన్ని ప్రాతిపదికలకు మార్పేమీ లేకే చేరుతుంది. తలియలు (SII 6.1294.9, 1245) మొ. వి. కాని ఈ ప్రత్యయం ముందు కొన్ని రకాలైన ప్రాతిపదికలకు మార్పులు వస్తాయి. అవి ఈ కింది విధంగా జరుగుతాయి. (క) -లు ప్రత్యయం ముందు మహత్ప్రత్యయం లోపిస్తుంది. తమ్ములు ( SII.6.192.7, 1167). (ఖ) -ము వర్ణకాంతాలకు-లు అలాగే చేరవచ్చు. కుంచములు (పై. 6.1328.9, 1115), లేదా ము వర్ణకం లోపించి పూర్వాచ్చు దీర్ఘం కావచ్చు. కారణాలు (పై. 4.1115.15, 1165).(గ) -లు ప్రత్యయం ముందు-ఇకారం ఉకారమౌతుంది (మాని) మానులు (పై. 4.992.6.1156). [వ్రిత్రి] వ్రిత్తుల (పై. 4.667.3,1112)
శాసన భాషా పరిణామం
121
(ఘ)ట, డ, ర, ల పై గల అచ్చులు పోవచ్చు. లేదా ఉండనూవచ్చు. అచ్చులుపోగా 'రల'లు డకారంగా మారుతాయి. పుట్లు (SII 6.845 11.273), తాడ్లు (పై 5.126.12,1296), ఊడ్లు (పై.10 199. 108, 1170), కాహడ్లు (పై. 4.675.31,1140).
అచ్చులు పోని రూపాలు:
పుట్టులు (SII 6,845 11, 1273). మడులు (పై. 6.788. 7.1880), మూరలు (పై. 10.509.8, 1814). పైనియమాలు అకారాంతపూర్వక లకారానికి చెల్లవు. నెల-దీనికి ఒకచోట నెల్లు (తె.శా. 1.47.520, 1803)అని ప్రయోగం ఉంది.
(చ) లకారాంతమైన కొన్ని పదాల్లో -లు ప్రత్యయానికి ముందు డకారానికి బదులు -ండ్ అవుతుంది. (మడపలి) మడపండ్డు (SII 6 1172.9,1283), (ఇల్దు) ఇండ్లు (పై.10.840.11,1258) మొ.వి. ఇట్టి సంధికార్యం హ1, ఆహ2 (హ2)ఆ రూపాల్లోనే అవుతుంది. ఇందు హ అనేది లకారం. ఇట్టి రూపాలు సమాసాల్లో కూడా ఉండవచ్చు. మడపలి అనేది మడ + పల్లి అని రెండు రూపాలు చేరిన సమాసం కాబట్టి దీనికి కూడా ఈ సంధికార్యం జరిగింది కాని చివరి అచ్చు అకారమైతే ఇది జరగదు. నెల-నెలలు మొ.వి. పై (ఘ) (చ)ల లోని -డ్ల రూపాలకు వర్ణ సమీకరణమై ళ్ల రూపాలు కూడా కావచ్చు (చూ. 4.19).
(ఛ) (హ)1 హ అహ2 ఆ రూపాల్లో హ2 యకారం గాని నకారం గాని అయితే _లు ప్రత్యయం ముందు అది దాని అచ్చుతోసవా లోపిస్తుంది. వేయి-వేలు. (SII 10.177.74,1171), చేను-చేలు (పై. 10, 834. 75, 1251) మొ.వి.
(జ) చేయి శబ్దానికి -తులు బహువచన ప్రత్యయంగా వస్తుంది. దీని ముందు 'యి' లోపిస్తుంది. చేతులు (SII 10,438.20, 1276) మొ.వి.(ఝ) మ్రాను మొదలగువానికి -కులు బహువచన ప్రత్యయంగా వస్తుంది.
122
తెలుగు భాషా చరిత్ర
దీనిముందు ను అనుస్వార మవుతుంది. మ్రా౦కులు (SII 4.1050.9,1165) మొ.వి.
(ఞ) రాత్రి శబ్డానికి -ళ్ళు కూడా బహువచన ప్రత్యయంగా వస్తుంది. రాత్రుళ్ళు (NI 1.23.28,1847) మొ. వి.
(ట) పూజ్యార్థంలో బహువచన ప్రత్యయం చేరడం ఈయుగంలో చాలా తరచుగా కనిపిస్తుంది. పై చెప్పిన వాటిలో -రు,-లు. గౌరవార్థం చేరినవి, గురులు (SII 4.778,6,1165 ), గుండమదేవులు (పై. 4.680.10,1171) మొ.వి. బ్రహ్మరాయరు. (పై.5.1083.6, 1108), దేవరు (పై.10.689.2, 1137). మొ.వి. పూజ్యార్దంలో-గారు ద్వితీయారూపానికి చేరుస్తారు. నంబిగారు (NI 2.51.7,1198), భాను ఏడ్రాయనిగారు (SII 6,377.12, 1340) మొ.వి. పూజ్యార్థంలో -వారు: జియ్యరువారు. ( NI 2. 51.7. 1155). జక్కిరడ్డివారు (SII 6.93.1, 1241).
విభక్తిప్రత్యయాలు :
4.40. ప్రథమా విభక్తికి ప్రత్యకంగా ప్రత్యయాలు లేవు. పైన చెప్పిన రూపాలు అలాగే ప్రథమారూపాలుగా వాడవచ్చు, ద్వితీయాది విభక్తి ప్రత్యయాల్ని పైన చెప్పినకొన్ని నామపదాలకు అలాగే చేర్చవచ్చు. ఉదా: పొలములోన (SII 5.1016.13, 1134). కాని కొన్నింటికి పదాంతంలో కొంతమార్పు పొంది ప్రత్యయాలు చేరుతాయి. అట్టి మార్చును తేచ్చే ప్రత్యయాల్ని ఔపవిభక్తిక ప్రత్యయాలంటారు. అవి ఈ కింది విధంగా వస్తాయి.
(1) మహత్ప్రత్యయంగల పదాల్లో _డుజ్జు లోవిస్తుంది. అలా లోపించిన దానిమీద -ని పాక్షికంగా రావచ్చు. పరమాత్మునిచేం (SII 4.737.32, 1115), రఘునాధునిచేం (పై. 10.89.13, 1132) మొ. వి. డుజ్జులోపించక -ఇ చేరిన రూపాలుకూడా ఈయుగంలో కనివిస్తాయి. దేవుడికి (NI 3.138.9, 1247), వాన్రి పెద్దకొడుకు (NI 3.9.29, 1259 మొ.వి.
(2) బహువచన ప్రత్యయాలైన -లు, -రు, -ఱు, -ండ్రు పైన ఆ చేరుతుంది. నివేద్యములకు (SII 5.90.11, 1177), మునూర్వురకు శాసన భాషా పరిణామం 123
(పై. 10.173.7, 1170), వాద్యకొఱకు (పై .10.707.14.1153), పెక్కoడ్రును (పై. 6.98.2, 1131), వాస్యకాంఱృకు (పై. 6. 1116.15, 1376), మొ. వి.
(3) -ను, -లు, -రు చివరగల కొన్ని నామపదాలకు -ఇ చేరుతుంది. చేనికి (SII 10.488.34, 1198), పాలిలోన (పై. 10.425,11,1270), పోరిలోన (పై. 6,117.47, 1118). నీరు శబ్దం మాత్రం -ఇ ప్రత్యయాన్ని పాక్షికంగా తీసుకొంటుంది. మున్నీరులోం (పై.4.1075.8, 1166), నీరువేల (పై 4. 704,15 1167). 14వ శతాబ్దిలో -ఇ ప్రత్యయం. లేని రూపాలే ఉంటాయి. నీరు శబ్దానికి -టి ప్రత్యయం కూడా క్వాచిత్కంగా కనిపిస్తుంది. నీటినేల ( NI 1.39.5, 1141) మొ. వి. చేను శబ్దానికి కూడా ఒకచోట -ఇ ప్రత్యయం లేకుండా కనివిస్తుంది (SII 7.735.11, 1291).
(4) య, ల, ఱ, డ-లు చివరగల కొన్ని పదాలకు -తి చేరుతుంది. ఇది చేరేటప్పుడు కింది విధంగా సంధిమార్పులు వస్తాయి.
(క) -తి చేరేటప్పుడు యకారం లోపిస్తుంది. నేయి-నేతికి (SII 5.1107.11 1139).
(ఖ) లకారాంత పదాలకు తి చేరినప్పుడు రెండు రకాలైన సంధికార్యాలౌతాయి. (1) ల్ + తి > ణ్టి, (2) ల్ +-తి > టి. ఇందు మొదటిది హ1 అ1 (హ2) హ2 అ2 రూపాలపైనను (హ2 లకారం అ2 అకారం తప్ప తక్కిన అచ్చు), రెండోది తక్కిన రూపాలపైననూ అవుతాయి. ఇల్లు - ఇంటను (SII 10.507.17,1314), కుఱుంగల్లు - కుఱుంగంటికి (పై. 10.112.8 1248). ఇక్కడ కల్లు శబ్దం సమాసగతంగా ఉంది(చూ. 2.89 (చ)). తక్కినచోట్ల కేవలం-టి మాత్రం వాకీలి-వాకిటాన (NI 3.78 87, 1353) మొ.వి.
(గ) హ1 అ హ2అ (రూపాంతరం హ1 అహ2హ2 అ) రూపంలో ఉన్న శకటరేఫకు -తి ప్రత్యయం ముందు మార్పేమీ ఉండదు. మ్రోంపఱ్డు-మ్రోంపఱుతను ( SII 10,172.10, 1170), కఱు-కఱ్త 124 తెలుగు భాషా చరిత్ర
(పై. 6.645.3, 1158) మొ. వి. తిప్రత్యయం ముందు. ద్విత్వం ఉండదు. తక్కినచోట్ల ఱ్ + తి > టి : పడమర - పడుమటం (పై. 5.167.14 1200) మొ వి
(ఘ) డకారం -తితో కనిసి -టి అవుతుంది, వీడు-వీట (SII 10. 690.9, 1139 ) మొ. వి.
(5) పై ప్రత్యయాలు చేరనిపదాలు క్వాచిత్క్మంగా కనిపిస్తాయి. పడుమఱ భాగము ( SII 5.1133.4, 1155 ), చేబ్రోలు నాండం (పై. 5.1250.1122), వాకిలికి (పై. 4.952.2, 1313) మొ.వి.
(6) పై ప్రత్యయాలు చేరిన పదాలనుండి అనుచిత విభాగమై -oటి, -టి ప్రత్యయాలు చేరడం ఈ యుగంలో చాలా తరచుగా కనిపిస్తుంది. రాత్రింటి ( SII 6 1118.35,1281), నగమింటిలోను (పై.6.1008.12, 1389), రాత్రి అనే సంస్కృత పదంలోనూ ఇది రావడం గమనార్హం.
4.41. ద్వితియావిభక్తి : -ను ద్వితీయా విభక్తి ప్రత్యయం. ఫలమును బొందుదురు (NI. 2,18.9, 1155). దీనికి అనుస్వారం కూడా అవుతుంది. కవిలం వధించి (పై. 1 24.14, 1187) మువర్ణకం గల వాటిపై, క్వాచిత్కంగా -ము లోపించి -న్ని చేరుతుంది. దీనిముందు (హస్వం ధీర్ఘమవుతుది. ధర్మాన్ని (NI 1.40.8, 1140).
ఈ ద్వితీయావిభక్తి ప్రత్యయం కర్మార్థంలో వస్తుంది. సాధారణాంగా క్లీబ రూపాలకు ప్రథమరూపాల్నే ద్వితీయలోనూ వాడుతారు. ఈ ధర్మువు ప్రతిపాలింపనివారు (తె. శా. 1.5. 29, 1221).
4.42. తృతీయావిభక్తి : (క) -న్, -అన్, -నన్ : (ఖ) _తోడన్ -తోన్, (గ) మెయిన్,
(క) -న్, -అన్, -నన్ : ఉకారంత పదాలవై -నన్, ఇకారంత ఔపవిభక్తికాలపై -అన్ మిగిలినిచోట్ల -న్ వస్తాయి. ఇవి సాధారణ౦గా సహార్థంలోనూ వస్తాయి. శాసన భాషా పరిణామం 125
నహార్థంలో : సుఖంబున (SII 4.737.4, 1115), వినోదంబులు (పై. 10.334.56, 1251 ). ఇట్టి రూపాలు సారస్వతంలోనే నిల్చాయి. కాని వాడుకకు రాలేదు.
కరణార్థంలో : కొలందుడిచెను ( SII 6,628 49, 1224 ), నల్లిఱాతకట్టి ( పై. 6.1142.15, 1268 ). ఈ ప్రత్యయాల పైన-చేసి హేత్వర్థంలో చేరుతుంది. భక్తింజేసి (పై. 4.1073,4, 1149), గ్రోప్పించుటంజేసి (పై. 6.1177.8.1201), ధర్మువునం జేసి (పై. 4 661.73, 1297) మొ వి.
(ఖ) -తోడన్ :-తోన్ : ఇవి సహార్థంలో వస్తాయి, భక్తితోడ (SII 5.163.6,1156), దయతోనిచ్చె (1089.89.19,1132).తోడన్ అనే రూపానికి తోఱన్ అనేది ప్రాచీనరూపం, ఱ > డ మార్పురాక పూర్వమే అకారం లోపించడం మూలంగా -తోన్ రూపం ఏర్పడి ఉండాలి.
(గ) మెయిన్ : ఇదీ సహార్ధంలోనే వస్తుంది. సచ్చరితమెయిని (SII 10.111.14, 1142) మొ. వి. ఈ ప్రత్యయం ఉన్న రూపాలన్నీ పద్యశాసనాల్లోనే ఉన్నాయి. ఇది 14 వ శతాబ్దిలో బొత్తుగా కనిపించదు.
4.43 చతుర్ధీ విభక్తి : -కిన్, -నకున్, -కున్ : ఇకరాంతాల తర్వాత -కిన్ -ఉకారాంతాల తర్వాత ,-నకున్ వస్తాయి. ఈ ప్రత్యయాలు సాధారణంగా సంప్రదానార్థంలో, నిమిత్తార్థంలో వస్తాయి.
సంప్రదానార్థంలో : కోలకానికి (SII 10.91.82, 1132), రిషి పెద్దికి (పై. 6.207.12, 1209) మొ. వి.
నిమిత్తార్ధంలో : చమరునకు (పై 10.427.21, 127౦), అరదివియకు (పై. 6.679, 1183)మొ. వి. ఈ ప్రత్యయం ముందు మువర్ణకం పాక్షికంగా లోపిస్తుంది. లోపిస్తే పూర్వస్వరం దీర్ఘమవుంది. దీపానకుం ( SII 6.84,4,1292) మొ. వి. అలా మువర్ణకం లోపించిన తర్వాత -నకు ప్రత్యయానికి బదులు -నికి ప్రత్యయం క్వాచ్చిత్కంగా కనిపిస్తుంది. దీపానికి (SII 10.293.3, 1241) మొ. వి. 126 తెలుగు భాషా చరిత్ర
ఉకారాంత పదాల్లో కూడా -కు ప్రత్యయం తరచుగా కనిపిస్తుంది. దీపముకు (SII 5.1043.8, 1123 ) మొ.వి. ఈ చతుర్థీ విభక్తికి తరచుగా అగు క్త్వార్ధక రూపమైన -౦ అన్నంత రూపమైన -కాన్ చేరడం కనిపిస్తుంది. భోగాలకై (SII 10.480.19, 1296), . పెట్టింపులకుంగా. (పై. 4.1098.8, 1153 ), మొ. వి, నిమిత్తార్థంలో -కాన్ మాత్రం రావడం కూడా కనిపిస్తుంది. రాజ్య రాష్ట్ర గామ వర్థనగా... పెట్టిన (పై. 10.710.8, 1178) మొ. వి.
-కొఱకు ప్రత్యయం 14 వ శతాబ్దిలో రెండుచోట్ల మాత్రం కనిపిస్తుంది. అభీష్ట సిద్ధికొఱకు (SII. 6.789.7, 1381).చేయించి కొఱకై (పై. 6.1096. 4, 1383).
4.44. వంచమీ విభక్తి : (క) -చేతన్, -చేన్, -వలనన్, రూపాంతరం : (వల్నన్ , వల్లన్) (ఖ) -నుండి. (గ) -కంటెన్,
(క) -చేతన్, చేన్, -వలనన్ : ఇవి గ్రహ్యర్థంలోనే ప్రయోగంలో కని పిస్తాయి. వీటిలో -చేతన్, - చేన్ మహన్మహతీ పదాల తర్వాతను, వలనన్. క్లీబ పదాల తర్వాతిను వస్తాయి. స్తానపతుల చేతవిల్చి (SII 6.600.8, 1165 ), దేవరచే కృపంగొని (పై.6.1142. 28, 1268), జీతాలవలనం... (NI 2.43.10, 1340), తనవ్రిత్తి వల్న నిచ్చిన (SII 10.422.28, 1269 ), సుంఖంవల్లను (పై 10.480.19, 1296). ఒక్కచోటమాత్రం -చేత ప్రత్యయం క్లీబ సమంపైన కనిపిస్తుంది. మగతల సమస్తంఐన పరివారము చేతను (తె.శా. 2.128.28, 1297), _వలనన్ ప్రత్యయం క్వాచి త్కంగా మహన్మహతీ పదాల పైననూ వస్తుంది, వైష్ణవ నాయకుల వవల్లను ( SII 6.904,25, 1291 ).
(ఖ) -నుండి : గంగకఱుతనుండి (SII 4.1190.2,. 1143), మొ. వి. దీన్ని ఆంగ్లంలో from అనే అర్ధంలో వాడుతారు. ఈ అర్థంలో నేడుపయోగంలో ఉన్న -నుంచి రూపం ఈ యుగంలో కనిపించదు.
(గ) -కంటెన్ : ఈ ప్రత్యయ౦ చాలా క్వాచిత్కంగా కనిపిస్తుంది. శాసన భాషా పరిణామం
127
దీన్ని పోల్చే సందర్భంలో వాడుతారు. నాకాధీశపురంబు కంటె నిదిమేలు ( SII 6,285.4, 1158 ) మొ.వి.
4.45. షష్ఠి విభక్తి : ఉకారాంత పదాలకు అచ్చుపరమైతే షష్ఠిప్రత్యయంగా నకారం వస్తుంది. మూలస్థానంబు నాదిమూర్తికి ( SII 4.672.17, 1139) మొ. వి. లేనిచో ప్రాతిపదికే షష్ఠీరూప మవుతుంది. ప్రోలెబోయు తమ్ముండు (పై. 4.667.13, 1132) మొ.వి.
4.46. సప్తమీవిభక్తి : (క) -న్, -అన్, -నన్, (ఖ) -లోన్, -లోనన్, _లోపలన్ : (గ) -అందు, -నందు, -నయందు ఇవి అధికరణార్థంలో వస్తాయి.
(క) -న్, -అన్, -నన్ : తృతీయావిభక్తిలో చెప్పిన పరిసరాల్లోనే ఇవీ వస్తాయి. కేటిఫల్లిని (SII 10.702.7,1153), పడుమటం (పై. 5.167.14, 1200 ), శ్రీకూర్మమున ( పై. 5.1338,22, 1188).
(ఖ) -లోన్, -లోనన్, -లోపలన్ ; ఉత్తరసీమలో (SII 5.1114.11,1164), చెల్లానలోన ( పై. 4.167.13, 1200 ), సోరకి నాంటి లోపలం ( పై. 10.690.17, 1139 ).
(గ) -అందు, -నందు, -నయ౦దు : చెఱువందు (తె. శా. 1.16.7,1170 ), భోగమునందు ( SII 5.1081.3, 1132 ), ఉత్తరాయణమునయందు (పై. 10.177.90, 1171). పై అందు శబ్దానికి -ఉల ప్రత్యయం చేరి విశేషణం అవుతుంది. అందుల గొల్లమంత(SII 10.208.7, 1200) మొ. వి. అలాగే “ఇందుల కాయ కూర" (పై. 6.904.28. 1291) మొ.వి. ప్రయోగాలు ఉన్నాయి. ఉల ప్రత్యయానికి బదులు -అలి ప్రత్యయం క్వాచిత్కంగా కనిపిస్తుంది. అందలి మాడూరి సోమయ ( తె.శా. 10.36.33, 1215 ) -అల ప్రయోగం ఒక్క శాసనంలో రెండుసార్లు కనిపిస్తుంది. ఇందల శ్రీకంఠమ నాయకు ( SII 10.691.16, 1139 ). ఇందల సోమేళ్వరదేవర (పై. 10. 691.21, 1139). 128
తెలుగు భాషా చరిత్ర
4.47. ఇవిగాక -క్రి౦దన్, -మీందన్/-మిందన్, -పైన్, ఒద్దన్/-వద్ధన్, -కడన్ మొ. ప్రత్యయాలు గూడా సప్తమ్యర్థంలో కనిపిస్తాయి. చెఱువు క్రి౦ద (SII 6.1174. 9, 1151 ), ధాత్రిమీంద (పై 6.625.65,1158 ), పల్లియలమింద (పై. 4737.11,1115 ), ఈ ధర్మువుపై (పై. 5. 1343.12,1146), ఉయ్యూరి ఒద్ధ (పై. 4.762.10,1131), తూమువద్ద ( తె.శా. 1.1559,1125), తాడేకుంటకడ (SII 6.225.8,1288) మొ.వి. _పోలెన్, _వలెన్, _మాడ్కి -వంటి మొదలైన పోలిక ప్రత్యయాలు కనిపిస్తాయి. గురుంపోలెన్ ( పై. 10.675.35, 1140), మాఱయ వలెన్ (పై. 10.282.11,1230), అఱిగాంపుల మాడ్కి . (పై. 4.737 21,1115 ), లెంకవంటి కోకన ( పై. 10.337-
68,1251) మొ వి.
4.48. సంఖ్యావాచకాలు :
ఇవి నామపదాల కిందే రావలసీ ఉన్నా, ఇందుకొన్ని విశేషాలుండటం చేత వీటిని గురించి ప్రత్యేకంగా వ్రాయవలసి వచ్చింది.
(1) ఒకటి : ఈ శబ్దాన్ని ఈ యుగంలో ఈ కిందివిధంగా వ్రాసేవారు. ఒక్కొణ్డు ( SII. 4.1305,8, 1107 ), ఒక్కణ్ణు (పై. 5.1091.8.1129), ఒకణు (పై. 5 1848, 12.1146 ), ఒక్కడు (పై. 5.1284.20. 1235), ఒక్కటి. (పై. 4.685.10,1173). ఒకటి (పై. 10,73,115, 1115). ఈ యుగానికి పూర్వపు శాసనాలుచూస్తే ఒక్కొండు వంటి రూపాలే ఎక్కువగా ఉండటంచేత ఈ ఒక్కొండు శబ్దం ఒక్ + ఒణ్డు కలయికచేత ఏర్పడిందని చెప్పవచ్చు. ఒక శబ్దం కొన్ని మధ్య ద్రావిడ భాషలలో కనిపిస్తుంది, ఒణ్డుకు ప్రాచీన రూపమైన *ఒన్ఱు చాలా ద్రావిడ భాషలలో కనిపిస్తుంది. అది మొదట ఒక్కొాండు అయి తర్వాత ఒక్కండు అయింది. ఇట్టి మార్పు ఈ యుగానికి ముందే ఎప్పుడో జరిగిపోయింది. కాని ఈ యుగంలో ఒక్కండు శబ్దానికి ఔప విభక్తిక రూపమైన ఒక్కణ్ణి లేక ఒక్కటి ప్రథమారూపంగా వాడడం జరిగింది. ఔపవిభక్తిక రూపాన్ని ప్రథమాంతంగా వాడడం 11 వ శతాబ్దిలోనే ఒక్కచోట కనిపిస్తుంది. 12వ శతాబ్ది నుండి క్రమేణ ఎక్కువగుతూ వస్తుంది. శాసన భాషా పరిణామం 129
ఇట్టి పరిణామాన్ని నన్నయ భాషలోని ప్రయోగాల్ని ఎఱ్ఱన ప్రయో గాల్ని బట్టి చూచినా స్పష్టమవుతుంది.3
(2) రెండు, మూడు రూపాలకు ఈ యుగంలో చెప్పుకోదగ్గ విశేషా లేమీ లేవు.
(3) నాలుగు : ఈ శబ్దానికి ముఖ్యంగా రెండు రూపాలున్నాయి. (అ) నాలుగు/నాలువు ( ఆ ) నాలు-నాలుగు (SII 6.598. 10,1163), నాలువు (పై. 4.1142.5,1143), నాలు (పై. 6.845. 16,1273) మొ. వి. పై వాటిలో నాలు రూసం విశాఖ - శ్రీకాకుళం ప్రాంతంలోనే కనిపిస్తుంది.
(4) ఐదు : దీనికి రెండు రూపాలున్నాయి. (అ) ఐదు (ఆ) ఏను: ఐదు (SII 6.228.63.1197), ఏను ( పై. 5.1011.7,1108). ఈ రెంటిలో ఏను శబ్దం 12వ శతాబ్దిలో విశేషంగా ఉండి రానురాను ఎక్కువవుతూ. వస్తుంది. అందులోను ఐదు శబ్దం 12వ శతాబ్దిలో తెలంగాణా-గుంటూరు ప్రాంతంలో మాత్రం కనిపిస్తుంది. 13, 14 శతాబ్దులలో ఐదు శబ్దం పూర్తి ఆంద్రదేశానికి వ్యాపిస్తుంది. బవాశా ఐదు శబ్దం కన్నడం నుండి తెనుగుకు వచ్చిన ఎరువుమాట అయి ఉంటుంది.
(5) ఆఱు, ఏడు శబ్దాల్లో విశేషాలేమీ లేవు.
(6) ఎనిమిది : ఎనిమిది (తె. శా. 1.19.42,1195), ఎన్మిది (SII 4.1248.12,1112), ఎనుమిది ( పై. 6.1173.6,1104) మొ. వి. ఎనిమిది శబ్దానికి పూర్వరూపం ఎణ్-పది అని చెప్పవచ్చును. ఇది ప్రాచీనశాసనాల్లో అనేక రూపాలతో ఉంది. ఈ యుగానికి ఎనిమిది రూపం స్థిరపడినట్టు పై ఉదాహరణలవల్ల తెలుస్తుంది.
(9) తొమ్మిది : (SII 5.1166.10,1266). దీనిని తొణ్-పది నుండి వచ్చినట్టు చెప్పవచ్చు. ఈ రూపం కూడా ఈ యుగంలో మార్పేమీ లేకుండా స్థిరపడిందని చెప్పవచ్చు. పై వివరణలవల్ల ఒకటి, ఎనిమిది, తొమ్మిది రూపాలు చారిత్రకంగా రెండు ధాతువుల కలయికవల్ల
ఏర్చాడ్డాయని తెలిసింది. అంటే ఇవి సమాసరూపాలన్నమాట. 130
తెలుగు భాషా చరిత్ర
(8) పది, నూఱు రూపాల్లో విశేషాలేమీ లేవు. నూఱు శబ్దానికి పర్యాయంగా నేడు ప్రయోగంలో ఉన్న వంద శబ్దం ఈ యగంలో కనిపించదు.
(9) వేయి; ఈ శబ్దానికి కింది రూపాలున్నాయి. వేయి (SII 5. 207.15. 1141), వెయి( పై. 5.1013.2, 1148). వేయు (పై. 4.930,14, 1165), వేయు ( పై. 6,1200.16, 1175 ), వెయ్యి (పై. 5.1202.2,1214). 'ఇ/ఉ' లు పదాంతంలో పర్యాయంగా రావడం నేయి శబ్దంలో కూడా చూడవచ్చు. అంటే ఇట్టిబ్దాల్లో చివరి అచ్చు ఊతకై వచ్చి చేరినదని చెప్పవచ్చు. ఈ వేయి శబ్దానికిపూర్వం రూపం వేన్ అని నిరూపించవచ్చు.4
(10) పదిపై కూడిక సంఖ్యలు : పండ్రెండు, పందొమ్మిది తప్ప మిగిలినవంతా పది శబ్దానికి ఆయా సంఖ్యలను చేర్చడంద్వారా అవుతాయి. ఆ చేర్చేటప్పుడు ఆహఅ రూపంలో ఉన్న సంఖ్యావాచకాలు తప్ప తక్కినవి చేరేటప్పుడు పది శబ్దానికి -ఉన్ -గాని, -న్- గాని చేరుతుంది. ఇందలి నకారం హల్లుల ముందు కనిపించదు. పదునకొండు (తె. శా. 1.41.8,1231). ఇందు నకారంపైన 'అ' వ్రాతపొరబాటయి ఉంటుంది. పదినొకండు ( SII 6.768.8, 1391 ), పదుమూండు (పై. 6.235.32, 1158), పదినాలువు (పై.6.1173.8 1104) మొ. వి. పైవాటిలో కేవలం -న్- చేరే రూపాలు విశాఖ - శ్రీకాకుళం ప్రాంతంలోను, -ఉన్ చేరే రూపాలు మిగిలిన ఆంధ్రదేశంలోను కనిపిస్తాయి. ఆహఅ రూపాలు చేరేటప్పుడు ఆ శబ్దాలు పది రూపానికి అలాగే చేరుతాయి. చేరేటప్పుడు సంధి కావచ్చు కాకపోవచ్చు. పదేను (SII 5.125.12,1296), పదియేను ( పై. 4.1314.7, 1148), పదాఱు (పై. 4.945.29, 1152), పదిఆఱు ( పై. 6.1000 15,1307) మొ.వి. పండ్రెండు, పందొమ్మిది రూపాలు -పన్-రూపానికి రెండు, తొమ్మిది శబ్దాలు చేర్చగా ఏర్పడుతాయి. *పన్-రెండు > పన్ఱెండు > పంఱెండు ( SII 6,973.7, 1359 ) > పండ్రెండు (పై. 5.70.12,1177), పన్ + తొమ్మిదిా > పందొమ్మిది ( పై.
6.865,20, 1286 ). శాసన భాషా పరిణామం
131
(11) పది పై గుణి౦తపు సంఖ్యలు. ఇరువది మొ.వి. ఇట్టి సంఖ్యావాచకాలు ఈకింద ఇచ్చిన రూపాలపై పది చేర్చగా ఏర్పడుతాయి, ఇరు-(రెండు), మూ-(మూడు), నలు- (నాలుగు), ఏన్-/ఎన్- (ఐదు), అఱు - (ఆఱు), డె-(ఏడు), ఎన-(ఎనిమిది), తొన్ -(తామ్మిది). ఈ రూపాల్లో పది చేరేటప్పుడు ఈ కింది సంధిమార్పులు వస్తాయి.
1. మొదటిరూపంలోని చివరి ఉకారం పాక్షికంగా లోపిస్తుంది. ఇరు-పది > ఇరువది, ఇర్వది.
2. (హ) అ (హ1) ఆ : లో హ1 రేఫ అయితే తర్వాత 'ప'కారం 'వ'కార మవుతుంది. ఇర్వది, 'హ1' "ల"కారమయితే 'ప'కారం పాక్షికంగా 'వ'కారమవుతుంది. నలుపది, నలువది.
3. 'న'కారం తర్వాతను, 'ఉ'కారం కాక తక్కిన అచ్చుల తర్వాతను 'ప'కారం 'బ'కార మవుతుంది. దీనిముందు 'న'కారం ఆనుస్వారం అవుతుంది. ఏంబది, ఎనబడి, తొంబది.
4. హఅ లేక హఆ తర్వాత 'ప'కారం ద్విత్వమయి పూర్వ దీర్ఘం లోపిస్తుంది. ముప్పది. 3 వ సూత్రం ప్రకారం-డెబ్బది.
5. శాసనభాషలో పది శబ్దంలోని ప్రథమహల్లు పాక్షికంగా మహాప్రాణమవుతుంది, ముప్పది మొ. వి.
6. పదిశబ్దంలోని 'ప' కారం పాక్షికంగా 'య'కారం అవుతుంది. ముప్పయి, ముప్పై మొ.వి. ఉదా. ఇరువది (SII 5.1084,6, 1118 ), ఇర్వయి ( పై. 5.1188.64 1250 ), ముప్పది (పై. 10.654.8, 1152), ముప్పై (పై. 6.936.7, 1280), నలుపది (పై. 6.598.11.1163), నల్వది ( పై. 6.597.8,1238) నల్ఫయి (పై. 5.1188.52, 1250), ఏంబది (పై 6,211.26, 1170), -ఎంబై (పై. 6.928.8,1291), అఱువది (పై .10.177,78.1171), అఱువై (పై. 6.812.5,1390), డెబ్బది ( పై. 5.1018.2,1148), ఎనబై (పై. 6.1035.15, 1394), తొంభయి. (పై. 5.1188.16 1250) మొ. వి. పై శబ్దాల్లో ఇరువది మొ. దకారాంతపదాలు 12వ శతాబ్దిలో క్వాచిత్క౦గా కనిపిస్తూ రానురాను ఎక్కువవుతాయి. 132
తెలుగు భాషా చరిత్ర
ఇట్టి సంఖ్యలకు ఏను చేరేటప్పుడు ఒక-వింతసంధి కార్యం 12, 13 వ శతాబ్దుల్లో కనిపిస్తుంది. ఇరువదేను ( SII 6.085.6, 1287), డెబ్బదేను (పై. 6.1143.18,1269) మొ.వి. ఇందు 'ద'కారం 'డ'కారం కావడం విశేషం- 14వ శతాబ్దిలో 'ద'కారం 'య'కారం కావడం దాదాపు పూర్తి అయిందనవచ్చు. కాబట్టి ఈ శతాబ్దిలో ఇరువదేను వంటి రూపాలు కనిపించటంలేదు. ఇరువై యేను వంటి రూపాలే కనిపిస్తాయి.
(12) నూరుపై గుణింతపు సంఖ్యలు ఇన్నూఱు మొ.వి. : ఇన్నూఱు (SII 10.547.4.1332) , మున్నూఱు (పై. 10.304.8, 1245), నన్నూఱు ( పై. 6.1167.8.1220) , ఏనూఱు ( పై, 5.1046. 13,1187) మొ. వి. తర్వాతి నూర్లసంఖ్యలు శాసనాల్లో కనిపించటం లేదు.
(13) పై ఇరువది మొ. సంఖ్యా రూపాల్లో లాగానే ఇరు- మొ. రూపాలు. సమాసాల్లోనూ కనిపిస్తాయి. 1.ఇరువుట్టి (SII 5.1016.13,1134), ముయ్యద్ద ( పై. 10.118.25.1146), నలుతుము (పై. 10.408. 115,1266 ), పందుము (పై. 10.710.19,1178 ), ఎనిమిది శబ్దానికి మాత్రం ఎనుబం లేక ఎనుమల రూపాలు కనిపిస్తాయి. ఎనుబందుము ( SII 10.422.9,1318 ), ఎనమందుము ( పై- 6.835.8, 1391) మొ. వి, ఇంకా ఈ కిందివి గమనార్హం. పందుము (పై 5.1364.18.1121), పనిద్దుము (పై 10.557.32, 1373), పదేందుము(పై.5.159.6,1277)మొ. వి, పై సమాసాల్లో బహువచన ప్రత్యయం లోపించి ఉండటం గమనించవచ్చు. బహువచనం తోడి రూపొలూ క్వాచిత్కంగా కనిపిస్తాయి. నలుమూడ్లు (నాల్గు మూరలు) (SII 6.1136,13,1374) మొ. వి.
(14) మహన్మహతీ సంక్యావాచకాలు :
(క) ఒకడు (NI 3.14.77,1245), ఒకరు (SII 6.839. 23,1365), ఒకరుడు (పై. 6,1136.24,1250).
(ఖ) ఇద్దఱు(SII 6.941 941.12,1299), ఇద్దఱు ( పై. 6.667,16,1182). శాసన భాషా పరిణామం 133.
(గ) మూవురు (పై 6.625.15, 1158), ముగురు ( పై.6.1084.14, 1321).
(ఘ) నల్వురు (పై. 4.1020. 9, 1118), నల్గురు (పై. 4.1067.8, 1153).
(చ) ఏవురు (పై.4.1191.7,1128). ఐగురు (పై.6.1117.8,1378)
(ఛ) అఱు, ఏడు ప్రయోగాలు లేవు.
(జ) ఎన్న౦డ్రు (పై.4.1305.11,1107), ఎనుమంఱు (పై.6.1052.10, 1850). తొమ్మండ్రు (పై.6.87.11,1164), ఇర్వండ్రు (పై. 5.1188.64, 1250) మొ. వి.
4.49. సర్వనామాలు : సర్వనామాల్లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ ఈ యగపు శాసనాల్లో కనిపించవు. కనిపించినవాటిని ఈకింద ఇస్తున్నాను. ఏను ( తె.శా. 1.150.20, 1170), ఏము (SII 4.1186.3, 1153), నేను, మేము మొ. ప్రయోగాలులేవు. మధ్యమపురుష సర్వనామాలు శాసనాల్లో కనిపించవు. 'తాను' శబ్దానికి బహువచన రూపం 'తారు' మాత్రం శాసనాల్లో కనిపిస్తుంది. 'తారు' ( EI. 5.147.139, 1213 ) మొ. కాని 'తాము' కనిపించదు. నన్నయ నన్నె చోడులు కూడా 'తారు' రూపాన్నే ప్రయోగించి ఉన్నారు. కాన తాము > తారు మార్పు ఈయుగానికి పూర్వం ఎప్పుడో జరిగి ఉండాలి.
4.50. క్రియాపదాలు : క్రియాప్రాతిపదికలు రెండు రకాలు, 1. అవి భాజ్యం (Simple), 2. విభాజ్యం అని. అగు (SII 4.672.7, 1139 ), అమ్ము (పై.6.637.2.1147) మొ. అవిభాజ్యాలు. విభాజ్యాలు (అ) ఏకధాతుకం (ఆ) బహుధాతుకం అని రెండు రకాలు.
4.51 ఏకధాతుక విభాజ్యాలు : (Complex)
(అ) ధాతువుకు _ఇంచు చేర్చటంవల్ల ఏర్పడేవి. ఉదయించు (SII 4.1061.2, 1149), వర్థించు (NI 2.28 A 18,1166). సరించు (SII.10.83.19, 1125) మొ. వి. సంస్కృత పదాలన్నీ
కూడా సాధారణంగా ఇలాగే అవుతాయి. (హ)అహ-తర్వాత ఇంచు 134
తెలుగు భాషా చరిత్ర
నకు -ఇయించు కూడా వస్తుంది. సరియించు (SII 5.1138, 9,1140) మొ.వి. వీటి పోలికవలన ఉదయించు రూపానికి ఉదియించు. (పై. 4.1061.2,1149) వంటిరూపాలు తరచుగా కనిపిస్తాయి. -ఇంచు ప్రత్యయం అకర్మక రూపాన్ని సకర్మకం చేయనూ, సకర్మకాన్ని ప్రేరణరూపంచేయనూ కూడా వస్తుంది. చెల్లించు (పై. 10.61.6,1104), చేయించు( పై. 6.1096.4,1383). ఈ ప్రత్యయం ముందు 'చ'కారం 'ప'కారం అవుతుంది. గ్రొచ్చు - గ్రొప్పించు (పై. 10.991.14, 1139) మొ. వి. మెచ్చించు (పై. 10.151, 1161) వంటి రూపాలు అరుదుగా కనిపిస్తాయి.
(అ) బహుధాతుక విభాజ్యాలు (Compounds)
దేశి : చేకొను ( SII 4.1170.11, 1129), పనివడు (పై. 10.89. 14, 1132) మొ. వి.
మిశ్రం : దయసేయ (సం + తె) (పై. 4.737.30.1115), నుతికెక్కు (పై. 4.675.25, 1140) మొ. వి.
ప్రత్యయాలు చేరేటప్పుడు క్రియాప్రాతిపదికల్లో చాలామార్పులు వస్తాయి. ఇట్టివి చాలా ఉండటంచేత సారస్వతభాషలో గాక శాననాల్లో మాత్రం వచ్చేవాటిని కొన్నింటిని ఇక్కడ పేర్కొంటాను.
(క) క్రియాప్రాతిపదిక అంతమందుగల యకారానికీ ద్వితయక్త చకారానికి ఉత్తమ మధ్యమ భూతకాలిక ప్రత్యయం పరమయ్యేటప్పుడు సకారమవుతుంది. చేయు - చేస్తిని ( SII 10.334.66, 1251 ), ఇచ్చు-ఇస్తిమి ( పై. 6,121.37, 1119 ) మొ. వి. అనుస్వారం తర్వాత చకారం ద్విత్వమౌతుంది. కాబట్టి వాటిక్కూడా సకారమౌతుంది. మన్నించు-మన్నింస్తిమి ( పై. 10.499.15.1311). ఇలాంటి చోట్లలో అనుస్వారం లోపించవచ్చు. కటిస్తిమి ( NI 1.7.28, 1244) మొ వి.
(ఖ) ద్విత్వం కాని చకారం క్త్వార్ధక ప్రత్యయమైన-ఇ ముందును విశేషణ ప్రత్యయమైన -ఇన ముందును సకారం కావచ్చు. విలిసి (SII 4.1114.17,1163), విడిసిన ( పై. 4.1122.5, 1189)మొ. వి. శాసన భాషా పరిణామం 135
(గ) -ఏ విశేషణ ప్రత్యయానికి ముందు యకారం సకారం అవుతుంది. చేసేవాండు. ( NI 1.38.63, 1217 ). ఈ ప్రత్యయం రాకున్నా కొన్ని చోట్ట ఈ మార్పు వస్తుంది. చేసువాండు (SII 10.61.7. 1104) మొ.వి.
(ఘ) అచ్చు ( < అర్చు ) ధాతువు అన్నంత ప్రత్యయం ముందు అరు- అవుతుంది. అరువంగలవాండు (SII 4.1200.16, 1263) మొ. వి.
4.52. సమాపక క్రియలు : సమాపక క్రియలు రెండు రకాలు. 1. సామాన్య సమాపక క్రియలు (Simple) -వచ్చెను, వచ్చును మొ. వి. 2. సంశ్లిష్ట సమాపక క్రియలు (periphrastic) వచ్చుచున్నాడు, మొ. వి. కింద సామాన్య సమాపక క్రియలు మాత్రం వివరిస్తాను. ఈ సామాన్య సమాపక క్రియలు రెండు రకాలు.. (అ) కాలబోధకాలు, (ఆ) కాలబోధకాలు కానివి. కాలబోధక రూపాలకు క్రియా ప్రాతిపదిక + కాలప్రత్యయం + పురుష వచన ప్రత్యయము అనే మూడు విభాగాలున్నాయి. వీటిలో పురుషవచన ప్రత్యయాలు ఈ కింది విధంగా ఉంటాయి.
పురుష వచన ప్రత్యయాలు :
ఏక బహు
ఉత్తమ.. -ను -ము/-మి
మధ్యమ -- -రి
ప్రథమ -ను (క్లీబ బహుత్వం కూడా) -రు/-రి(మహన్మహతిమాత్రం)
మధ్యమ పురుష ఏకవచన రూపాలు శాసనాల్లో కనిపించవు.
4.53. భూతకాలిక ప్రత్యయాలు : -ఎ ప్రథమపురుష ఏకవచనం, క్లీబం బహువచనంలోను -ఇ ప్రథమ పురుష మహన్మహతీ బహువచనంలోను, -ఇతి/-తి ఉత్తమ మధ్యమ పురుషల్లోను వస్తాయి. జనించెను (SII 4.677.16, 1180), ఇచ్చిరి (పై. 5 1016.17, 1184), ఇచ్చితిమి (పై. 5.70.15, 1177), ఇస్తిమి ( పై. 6.121.37, 1119 ): వీటిలో చివరి ఉదాహరణ తప్ప
మిగిలినవన్నీ సారస్వతభాషలోవలెనే ఉన్నాయి. 136
తెలుగు భాషా చరిత్ర
4.54. వర్తమాన భవిష్యత్ప్రత్యయాలు : చిన్నయసూరి తద్ధర్మార్థక ప్రత్యయాలన్నవి వాస్తవానికి ఆ రోజుల్లోని వ్యవహరాన్ని బట్టి రెండురకాల ప్రత్యయాలని చెప్పవచ్చు. -ఎద-, =ఎడి/ఎడు- వర్తమాన భవిష్యత్ప్రత్యయాలనీ, తక్కిన వాటిని తద్ధర్మ భవిష్యత్రత్యయాలని చెప్పవచ్చు. శాసనాల్లో వర్తమాన భవిష్యత్రత్యయాలు చాలా ఆరుదు. చెరిచెదను ( SII 10,590.54, 1314 ), నడిచెదము. ( పై. 10 504.22, 1313 ). ఈ రెండు ప్రయోగాలుమాత్రం లభించాయి.
తద్ధర్మ భవిష్యత్రత్యయాలు ; ప్రథమైక పురుషంలో ప్రత్యయం Ø (అంటే ప్రత్యయం ఉండదు అని అర్థం), మిగతావాటి ముందు -దు/-తు-/-డు- వస్తాయి: అవును (SII 10.465.115, 1290 ), పోదురు ( పై. 5.1316.12,1113), వరియింతురు. ( పై. 4.945.3, 1152 ), విండుము (పై. 6.123.52 1132). వీటిలో చివరి ఉదావారణ తప్ప మిగిలినవి ఆ కాలపు సారస్వత భాషా ప్రయోగాలకంటె భిన్నమైనవి కావు.
కాలసూచన లేనివి :
4.55. (అ) వ్యతిరేకార్థకాలు : వీటిలో క్రియాప్రాతిపదిక + వ్యతిరేక బోధక ప్రత్యయం + పురుష ప్రత్యయం అని మూడవయవాలుంటాయి. అందు -అ- వ్యతిరేక బోధక ప్రత్యయం. ఈ కిందివి పురుష వచనప్రత్యయాలు.
ఏక బహు
ఉత్తమ - ము మధ్యమ - - ప్రథమ మహత్ అమహత్ మహన్మహతి క్లీబ
- -దు -రు -వు
శాసనాల్లో ప్రయోగాలు లేనిచోట్ల చూపించలేదు. అడ్డపెట్టము ( SII 10.556. 56.1358), అడుగపడయదు ( పై. 5.1181.17,1341 ), పడయదు. (పై. 4,974.5,1132), లే, కా మొ. ప్రాతిపదికలకు వ్యతిరేకబోధక ప్రత్యయం లోపిస్తుంది. లేదు ( పై. 10,261.41, 1214) మొ.వి.
(అ) విధ్యర్థకం: పురుషవాచక ప్రత్యయాలు ఏకవచనంలో - ము, శాసన భాషా పరిణామం 137.
బహుత్వ౦లో -౦డు/-డి వస్తాయి. విధ్యర్థక ప్రత్యయం -ఉ-; ' జరిగించము (SII 5.1202.6,1214), ఉండుండు (తె. శా. 1.78.8,1276), . విచ్చేయుడి (పై. 1.69.15,1234).
(ఇ)అశీశ్శాపాదులు : అయ్యుండును (SII 6.781.14,1386 ) ఈవుతము ( హైద. ఆర్కె. సీరీస్. 3.2.8, 1236 ) మొ. వి. శాసనాల్లో కని పిస్తాయి.
4.56. అసమాపక క్రియలు : క్త్వార్ధకంలో సారస్వత శాసనాల రూపా -లకు వ్యత్యాసం లేదు. చేసి (SII 90.17,1177) మొ. వి. శత్రర్థకంలో కూడా వ్యత్యాసం లేదు. పరగుచును (పై 4.675 45,1140), కాని ఈ రూపానికి సముచ్చయ ప్రత్యయం చేరడం కద్దు. చేయచున్ను (పై. 6.287.5, 1273). చేస్తుండి అనే ఒక్క రూపం ( NI 1.7.15.1275). -తు- ప్రత్యయంతో కనిపిస్తుంది. కేతన గ్రామ్యాలు అన్న కొంటూ మొదలై ని రూపాలు శాననాల్లో కనిపించటంలేదు. వ్యతిరేకార్థకంలోను శాసన సారస్వత భాషల్లో వ్యత్యాసంలేదు. నడపక (SII 10. 671.11,1128) మొ.వి. అన్నంత రూపాల్లోనూ. శాసన సారస్వత భాషలకు వ్యత్యాసం లేదు. కొలువను ( పై. 6.758.6, 1113) మొ. వి.
చేదర్ధకం : ఇనన్/-ఇనాన్ చేదర్దక ప్రత్యయాలు. పేర్కొనినం (SII 6.151.60,1161 ) మొ. వి. అమ్మినాను. (పై. 110.422.93.1269); కొన్వా దులకు -నన్/- నాన్, పడ్వాదులకు -ఆన్ ప్రత్యయాలు వస్తాయి. పేర్కొన్నను (పై. 10.89.16,1132), ఉన్నాను ( పై. 10.556.49,1358 ), ఆడ్డపడ్డాను. (పై.4.985.89, 1269). 13వ శతాబ్దినుంచి చేదర్ధకంలో -ఇతే/-తే ప్రత్యయాలు కనిపిస్తాయి. పోయితేను ( SII 10.332.80,1250 ), చేస్తే (NI 8.48.56, 1252) మొ. వి.
4.57. విశేషణాలు :
(క) గుణవాచక విశేషణాలు విశేష్యాలకు ముందు వస్తాయి. నల్లరాయి (SII 6. 1142.12,1268), పచ్చిపాలు (పై. 6. 1000 9,1307 ) మొ. వి. నామపదాలు కూడా ఇలా రావచ్చు. కలుగాడి (పై
5.213.8,1286). 138
తెలుగు భాషా చరిత్ర
(ఖ) హఅహఅహఅ రూపంలో ఉన్న మువర్ణకాంతాలైన తెలుగుపదాలు విశేషణాలయ్యేటప్పుడు మువర్ణకానికి బదులు -ప వస్తుంది. ఇనుప కవదివియ (SII 5.1265. 11,1207).
(గ) మిగిలిన మువర్ణకాంతాలు విశేవణా లయ్యేటప్పుడు -ము వర్జానికి బదులు -పు వాడటం ఈయుగంలో తరచుగా కనిపిస్తుంది. దక్షిణపు వలను (తె. శా. 1.177.8,1190)మొ. వి. ఇలా -ము, -పు కావడం 12వ శతాబ్దిలో క్వాచిత్కంగాను రానురాను అధికంగాను కనిపిస్తుంది. -౦పు రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. వజ్రంపు రాకోట ( SII 4.1379.6,1881).
(ఘ) ఉదంతం లేక అదంతమైన పదాలు విశేషణా లయ్యేటప్పుడు అనుస్వారం తరచుగా కనిపిస్తుంది. తూర్చుంబౌలము ( SII 10.526. 15,1819), చెఱకుం గుడ్ములు (బెల్లపు ఊటలు) (పై. 5.1275. 7,1283), తెల్లంబ్రాలు (పై. 4.1328.9,1115) మొ. మువర్జకం వువర్ణకంగా మారితే ను వస్తుంది. ఉత్తరపుం బొలము (పై. 5.126.6,1296).
(ఞ) పరిమాణార్థత ప్రత్యయం : పరిమాణార్థక పదాలకు -ఎణ్డు లేక -అణ్డు ప్రత్యయాలు చేరుతాయి. పుట్టెణ్డు (SII 5.1114.15,1168), మానండు (పై. 6,1166.6,1198) మొ. వి. -అండు ప్రత్యయం విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలోను, ఎండు తక్కిన చోట్ల తోను విరివిగా కనిపిస్తాయి.
(చ) వైభాజిక, ప్రత్యయం (Distributive) చేసి లేక ఏసి ప్రత్యయాలతో వైభాజీక పదాలు విశేషణంగా వస్తాయి. మానెండు సేసినేయ (SII 4.667.15,1132), మూండేసి (పై. 4.677.52,1180), మొ. వి. 12వ శతాబ్దిలో -చేసి ప్రత్యయమే తరచుగా కనిపిస్తుంది. కాని 14వ శతాబ్దిలో ఇది కనిపించదు. -ఏసి ప్రత్యయం 13వ శతాబ్ది నుండి ఎక్కువౌతుంది.
(ఛ) సంఖ్యావాచక విశేషణాలు : ఒక్క ఒకటి సంఖ్య తప్ప తక్కిన అన్ని సంఖ్యావాచకాల్ని అలాగే విశేషణాలుగా ప్రయోగించవచ్చు. శాసనభాషా పరిణామం
139
రెండు దీపంబులు ( SII 4.667.15,1132 ), మూడు సంధ్యలు (పై. 5.90.10.1177) ) మొ. వి. ఒకటి సంఖ్యకు ఒక్క, ఒక అనే రూపాలు వస్తాయి. ఒక్కపాలు (పై. 4.748.25,1199), ఒక పళ్ళెము (పై. 5.4.5, 1394) మొ. వి. ఇవిగాక వక, ఒకొ, ఒఖ, ఓ రూపాలు క్వాచిత్క౦గా కనిపిస్తాయి. వకవెలి పొలము (తె. శా. 1.95 38,1118) ఒకకోటి (SII 10.177.22,1171), ఒఖకుండ ( పై. 5.1191.14,1349). ఈ ఒఖ శబ్దం 14వ శతాబ్ది శాసనాల్లోనే కనిపిస్తుంది. ఓ విధము(తె.శా. 1.69.25, 1234)(ఇరు, మొ. సంశ్లిష్ట రూపాలకు చూ. 4,48).
(జ) పూరణార్థకం : అగున్ లేక అవున్ చేరి పూరణార్థకాల్నై సంఖ్యావాచక విశేషణాలు కనిపిస్తాయి. మూణ్డవునడపు (SII 4. 1025. 12,1225), పదియేడగునేణ్డు (పై. 6.128.64,1132) మొ. వి. -అవన్ ప్రత్యయము క్వాచిత్కంగా కనిపిస్తుంది. రెండవనడపు (పై. 4.1194.8,1128), హల్లుల ముందు పై నకారం లోపిస్తుంది. మూడవ పాలివారు (పై. 10.73.107, 1115), 'ఓ' ప్రత్యయం ఒక్కచోట కనిపిస్తుంది. మూండోనడపు ( పై. 4.1155.4,1186). పై శబ్దాన్ని అడపు అనిగాని నడపు అనిగాని చెప్పవచ్చు. అడపు అని చెప్తే - ఓన్ ప్రత్యయం అని చెప్పాలి.
4.58. క్రియావిశేషణాలు :
(క) భూతకాలం : -ఇన, -న, -అ. పెట్టిన (SII 5.67.11.1183). కొన్న (పై. 5.1051. 10.1118), పడ్డ (తె.శా. 1.47.16, 1803). ఈ క్రియావిశేషణాల విషయంలో శాసనభాషకు సాహిత్య భాషకు వ్యత్యాసం కనిపించదు.
(ఖ) వర్తమానకాలం : చున్న ప్రత్యయంచేరి వర్తమాన క్రియావిశేషణ రూపాలేర్పడతాయి. కాని ఈ -చున్న ప్రత్యయం శాసనభాషలో అగు ప్రాతిపదికకు మాత్రం చేరుతుంది. తక్కిన ప్రాతిపదికంపై కనిపించదు. ఏలికలగుచున్న (SII 4.704.11,1167) మొ. వి. 140. తెలుగు భాషా చరిత్ర
(గ) తద్ధర్మం : తద్ధర్మ క్రియావిశేషణాలకు నాల్గురకాలై న ప్రత్యయాలు చేరతాయి.
(అ) Ø/-న్ (ఆ) -ఎడు/-ఎడి (ఇ) -ఏ/-ఎ (ఈ) -ఇ.
(అ) -Ø/-న్ : వడ్డించుచట్టువము (SII 4.1248.20, 1122), విశేషణం తర్వాత అచ్చు పరమైతే నకారం రావచ్చు. చేయునవసరము (పై. 10.690. 110, 139). నకారంరాని రూపం ఆరగించు అప్పాలు పై.. 5.1188.3,1276).
(ఆ) -ఎడు/-ఎడి. : ఉండెడు ( SII 4.1295.8, 1106 ), ఒత్తెడి (పై.4.1253.4,1232). ఎడురూపం 12 వ శతాబ్దిలో ఎడిరూపంతో దాదాపు సమానంగా ఉండి రానురాను తగ్గుతూ వస్తుంది. కేతన, పెద్దన వ్యాకరణాల్ని బట్టిచూస్తే ఇది స్పష్టంగా గుర్తించవచ్చు. ఎడి- అనడానికి- ఎటి అనే రూపం 13 వ శతాబ్దినుంచి తరచుగా కనిపిన్తుంది. అనెటి ఊరు (పై. 6.1213.28, 1265).
(ఇ) -ఏ/-ఎ : ఇది 12వ శతాబ్ధిలో ఆడె, ఆయకు ( SII 10.102.8, 1137) ఒక్క రూపమే కనిపిస్తుంది. తర్వాత తరచుగా కనిపిస్తుంది. చెల్లే మాడలు (ఫై. 5.1249.9, 1293) మొ. వి.
(ఈ) -ఇ : నడిపివాండు. (EI 5,17.141, 1213), అనభవించి వారికి (SII 5.1188.82,1250) మొ. వి. ఇట్టి రూపాలు నేటికీ కొన్ని పామర మాండలికాల్లో ఉన్నాయట. (ఘ) భవిష్యత్కాలము : అన్నంత క్రియరూపానికి -కల శబ్దాన్ని చేరిస్తే భవిష్యద్విశేషణ రూపం ఏర్పడుతుంది. ఆరంగింపంగల కుడుములు (SII 4.1099.6, 1186).
4.59. పై విశేషణాలలో భూతభవిష్యత్క్రియా విశేషణాలపై వాణ్డు, వారు అనే సర్వనామాలు చేరేటప్పుడు వకారం లోపించడం తరచుగా కనిపిస్తుంది. వ్రచ్చినారు (SII 10.702-16,1153); నడపంగలాణ్డు (పై.5.1129.12,1178) మొ.వి. ఇలాంటి రూపాలు 12 వ శతాబ్దిలో క్వాచిత్కంగాను రానురాను చాలా
విరివిగాను కనిపిస్తాయి. వీటికి -అది -అవి అనే సర్వనామాలు చేరేటప్పుడు శాసన భాషా పరిణామం
141
'అ' లోపించడం కూడా చాలా తరచుగా కనిపిస్తుంది. కొన్నది (SII. 5.131.7, 1296), చెల్లకలది (NI 2.51.21,1198) మొ. వి.
క్రియావిశేణాలపై సర్వనామాలు చేరిన రూపాల్ని కర్తస్థానాల్లోనూ ఉపయోగించవచ్చు. విఘ్నము సేసినారు ... కపాలమునం గుడిచినారు (SII 5,140).
భవిష్యత్కాల క్రియావిశేషణాలపైన పురుషవచన ప్రత్యయాలు చేరితే అవి కేవలం సమాపకక్రియలే అవుతాయి. నడపంగలరు (SII 10.686.7,1183), ఇలాంటివి విశాఖ - శ్రీకాకుళం ప్రాంతంతోనే ఉంటాయి. వీటిని నడపంగలారు వంటి రూపాలతో పోల్చడం కుదరదు.
మాండలికాలు :
4.60. ఈ యుగంతో దాదాపు 2000 రాతిశాసనాలు ఆంధ్రదేశం నలుమూలలా వ్యాపించి ఉండటం చేత మాండలిక సంబంధమైన అనేక విషయాలు మనకు గోచరిస్తాయి. డా. కృష్ణమూర్తి గారు ఇటీవల కనుగొన్న విశాఖ-శ్రీకాకుళం మాండలీకం7 ఈయుగానికి పూర్వమే ఏర్పడిందనడానికి అనేక మాండలిక విషయాలు పైన చెప్పబడీ ఉన్నాయి. అందులో 1. ఱ కారం వ్రాతలో నిల్చి ఉండటం, 2. స్థ సంయాక్తం నిల్చి ఉండటం, 3. చెల్లుపదానికి చల్లు అని వాడటం. 4. నాల్గు అనడానికి నాలు రూపం వాడటం 5. సంఖ్యా వాచకాల్లో పదినొకండు మొ. వాటికి ,-ఉన్- ప్రత్యయంగాక అండు ప్రత్యయం రావటం మొ.వి. ఈ మాండలికంలోని కొన్ని విశేషాలు. ఇవిగాక అనేక మాండలిక విషయాలీయుగంలో కనిపిస్తాయి. అందులో ఒకటి మాత్రం కింద వివరించబడ్డది.
నామపదాల్లో- ఇయాంత రూపాలకు 12 వ శతాబ్దిదాకా ఎలాంటి మార్పులేక నిల్చి ఉన్నాయి. కాని 13 వ శతాబ్దిలో వీటికి రెండు రకాలైన మార్పులు కనిపిస్తాయి. విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలో -ఇయ లోని -ఇ- గాని -ఇయ్- గాని లోపిస్తుంది. మధ్య ఆంధ్రలో -ఇయకు మారుగా -ఎ వస్తుంది.
విశాఖ - శ్రీకాకుళం-/-అ ; నూన్య ( SII 8.807.8,1385 ), చెల్యలు (పై. 6.841.6,1364), నూన (పై. 6.864,10,1376) మొ వి.
మధ్యాంధ్రం -ఎ : నూనె (SII 10,334.88,1251), చెల్లెలు(పై. 4.933. 9,1241). మొ. వి. ఈ ప్రా౦తంలో పైన పేర్కొన్న రూపాలు కనిపించవు. 142
తెలుగు భాషా చరిత్ర
పైన చెప్పిన మార్పులు గొఱియలు అనే పదంలో కూడా చూడవచ్చు ఈ శబ్ద౦ శాసనాల్లో కొల్లలుగా కనిపిస్తుంది. ఈ గొఱియలు శబ్దానికి శాసనాల్లో 13వ శతాబ్ది నుండి మూడు రకాలైన మార్పులు కనిపిస్తాయి. 1. వికాఖ- శ్రీకాకుళం ప్రాంతంలో గొఱ్యలు అని -ఇ- లోపించడం. 2. మధ్యాంధ్రంలో గొఱ్రెలు అని -ఇయ > -ఎ కావడం, 3. నెల్లూరు-దక్షిణ గుంటూరులో -ఇయ > -ఉ కావడం లేదా -ఇయ పూర్తిగా లోపించడం గొఱ్రులు/గొర్లు జరుగుతుంది.
దీన్నిబట్టి ఆంధ్రదేశంలో ఆనాటికే (1) విశాఖ-శ్రీకాకుళం (2) మధ్యాంధ్రం (3) దక్షిణాంధ్రం (నెల్లూరు-దక్షిణ గుంటూరు) అని మూడు మాండలికాలు ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ యుగశాసనాల్ని బట్టి తూర్పు పశ్చిమాంధ్రాల్ని (తెలంగానా-సర్కారు) వేరువేరు మాండలికాలు అని చెప్పడానికి చాలినంత ఆధారం కనిపించటం లేదు.
జ్జాపికలు
1. Mehandale M.A., Historical Grammar of Inscriptional Prakrit's పేజీలు 86, 134 196, 237.
2. మాండలిక వృత్తి పదకోశం, ప్రథమ సంపుటం. పేజీ. 38.
3. V. Ramachandra, A Critical study of Errapreggada's works, thesis submitted to S. V. University, Tirupathi.1964. పేజీలు 194,197
4. ఎం. కందప్పశెట్టి. వేయి శబ్దవిచారము. భారతి. మార్చి 1978 మద్రాసు.
5. నన్నెచోడుని కుమారసంభవంలో పై ప్రత్యయాల్ని పరిశీలిస్తే తేలిన సారాంశం ఇది. (చూ. ఎం. కందప్పశెట్టి. 11వ శతాబ్టి వర్తమానార్ధక క్రియలు భారతి. సెప్టెంబరు , 1968 మద్రాసు).
6. Lisker, Introduction to Spoken Telugu. పేజీ 243. ఇట్టి ప్రయోగాలు విశాఖ-శ్రీకాకుళం మాండలికంలో నేటికి ఉన్నట్టు శ్రీ వి. రాధాకృష్ణగారు అన్నారు.
7. మాండలిక వృత్తిపదకోశం, ప్రధమ సంపుటం, పేజీలు 46-52.
8. ఈ యుగవు శాసనభాషకు, మాండలికాలు విశేషాలకు చూ. M. Kondappa Chetty, Historical Grammar of Inscriptional Telugu. Thesis submitted to S. V. University, Tirupati. 1966. పేజీలు 432-445.