తెలుగు భాషాచరిత్ర/ప్రకరణం 3
ప్రకరణం 3
ప్రాచీనాంధ్రం: శాసన భాషా పరిణామం
(క్రీ. పూ. 200-క్రీ. పూ. 1100)
-బూదరాజు రాధాకృష్ణ
3.0. ఆధారాలు : ప్రాచీనాంధ్రభాషాస్వరూపాన్ని గుర్తించటానికి శాసనాలు తప్ప వేరే ఆధారాలు లేవు.
ఈ అధ్యాయంలో క్రీ. పూ 200 నుంచి క్రీ శ. 1100 వరకూ ఉన్న 269 శిలాతామ్రశాసనాలను పరిశీలించి భాషా
చరిత్రను నిరూపించటం జరిగింది. వీటిలో 217 శిలా శాసనాలు; 52 తామ్ర
శాసనాలు. వీటిలో, 255 మాత్రమే ప్రచురితమైనాయి. ప్రచురితాల్లో 187 కొద్ది
భాగాలు మినహా మొత్తంమీద తెలుగులోనే ఉన్నాయి; మిగిలిన 68, స్థలనామ.
వ్యక్తినామాదులు మాత్రమే తెలుగులో ఉన్నాయి. ఆంధ్రేతరభాషాశాసనాలు పూర్తిగా
తెలుగు వాక్యాల్లో ఉన్న మొట్టమొదటి. శాసనం క్రీ శ. 575 నాటిది. లిపినిబట్టి,
శాసనకర్తలను గురించి చరిత్ర కందిన ఇతరాధారాలనుబట్టి, ఇవన్నీ ఏ కాలానివో
నిర్ణయించదగ్గవి. అలాటి. నిర్ణయానికి ఆందని శాసనాలు , మరికొన్ని.ఉన్నా వాటి
నిక్కడ పరిశీలించటంలేదు. అముద్రితప్రాచీనశాసనాలు రెండు మూడు వందల
దాకా ఉన్నప్పటికీ వాటిలో ఉపయుక్త మనిపించిన పధ్నాలుగింటిని మాత్రమే
పరిశీలించాం.*
3.1. లిపి : క్రీ. పూ. 200 నాటి శాసనం 'భిట్టిప్రోలు / ద్రావిడీ' శాఖకు చెందిన బ్రాహ్మీలిపి'లో ఉంది. పరిశీలితశాసనాల్లో కొంతభాగం దేవ నాగరిలోను మిగిలింది తెలుగు-కన్నడ లిపీలోనూ ఉన్నదొకటి, వేంగీచాళుక్య లీపీలో ఉన్నవి నాలుగు ఉన్నాయి. ద, డ-లకు, ళ, డ-లకు, (ఱ)ఱ-లకు, థ, న్ఱ-లకు లిపిలో సాన్నిహిత్యం ఉండేది. ఈ, ఊ లకు తప్ప ఇతరాచ్చులకు సాధారణంగా దీర్ధత గుర్తించబడేదికాదు. ఎ ఏ, ఒ ఓ, లకు
∗ ఈ అధ్యాయం బూదరాజురాధాకృష్ణ అముద్రిత పరిశోధనవ్యసానికి సంగ్రహరూపం. హ్రస్వదీర్ఘభేదం లిపిలోనే లేదు. ద్విత్వాక్షరాలకు బదులుగా ఒకే హల్లును ఉపయోగించటం, మహాప్రాణాలకు ముందున్న ఆల్పప్రాణాలను వదిలివేయటం, అనుస్వార చిహ్నంగా ఉన్న చుక్కను కాలక్రమంలో భిన్న స్థానాలకు మార్చటం వంటి అనేక ప్రత్యేకతలు ఆనాటి లిపిలో కనిపించేవి. ఆందువల్ల అనేక భిన్నపాఠాలూ అపపాఠాలూ బయలుదేరి పాఠపరిష్కరణ కష్టసాధ్యమయింది. 3.2 లేఖన పద్ధతులు: రేఫ తర్వాత, బిందువు తర్వాత, ద్విరుక్త హల్లులు రాయటం ఆనాటి లేఖనసంప్రదాయంగా ఉండేది, రేవమీది హల్లును ద్విరుక్తం చేయటమనే పద్ధతి ఆర్యభాషా సంప్రదాయం నుంచి, ఎరువుగా వచ్చింది. ఉదా. తూప్పు౯న (SII 6.584. 8,641), కాత్తి౯య (EI 27. 231-34. 8,625-50). ఈ అలవాటు క్రీ.శ. 11 శతాద్దినుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. అనుస్వారంమీది పరుషాలను ద్విత్వంచేసే ఆచారం క్రీ. శ. 9-10 శతాబ్దుల నుంచి మాత్రమే కనిపిస్తుంది. ఉదా. ఱంక్క. (తె. శా.1.163-165.59,892-922), గుంట్ట (IA 13.50,58,918-25). ఇది చారిత్రాకకాలంలోనే ఆరంభమైన దేశీయాచారం. క్రీ. శ, 11 శతాబ్ది వరకూ ఈ పద్ధతి విరళ ప్రచారంలోనే ఉండేది.
3.3. లేఖన దోషాలు : శాసనభాషలో అనేకవిధాల లేఖనదోషాలు కనిపిస్తాయి. శిల్పుల ఆజ్ఞానంవల్ల, ఆశ్రద్ధవల్ల వచ్చేవికొన్ని, శాసనకర్త భాషకూ శిల్పిభాషకూ గల భేదాలను నిరూపించేవి కొన్ని, లిఖిత వాగ్వ్యవహారాల మధ్య ఉన్న సంబంధం సూచించేవి కొన్ని, కాసన పాఠకుల అశద్ధవల్ల కలిగిన దోషాలు కొన్ని-ముఖ్యంగా నాలుగు రకాల దోషాలు కనిపిస్తున్నాయి. ఉదా. (అ) శిల్పి కృత దోషాలు: ఆగ్( = అగ్భ, 50 10.68.98, 9/10); తజ్కి (= తాజ్క, వై. 828.8, 9/10); దేగులలంబును (డాగులంబును. వై 8.115255. 2526, 7); నాంజ్దు (= నాండు/నాడ్డు, అం. చొ, నొం. వు, ౨16.21.11,. 678), బైయ్లుమ్బ (= బైదుమ్చు/బయమృ,_ ౨0 24 180 198.2.825); వాజ్జేన (వాజ్జైన్స 5/1, కలి! 68,1070). (అ) భాషా మూలకదోషాలు : ఎడ్డుకు (= ఎడ్లకు, 5005. 77. 108); ఒక్తాడు బోళచేత (= ఒకంన అం, వ. 1041=42, 1415 2,600-25); వకొట్టి చల్దుర (కౌందటు -, 500 10.614.0,9 |. ౨. వేవుగ్గణావిలాక (ఇువేయి తవిళాలు, వై.-696.17,.. 1025-50). (ఇ) ఉచ్చారణ సూచకాలు : గోళ్ళ (-గోత్ర, పై. 644. 47,1060); తళ్చి (= తల్చి, పై. 598,58,925-50); ఖఴ్గ(=ఖడ్గ, తె.శా. 1.163-65. 11.892-922). (ఈ) పాఠక కృతదోషాలు: ఒగోం డు (=ఒంగోడు, EI 5.249-252. 17,554); పిదెన (=పిడెన, పై. 9.236-41.29,673); చెఴిచిన (= చెఱిచిన, SII 10.598 .58,925-50); తెల్కొన్థ (=తెల్కొన్ఱ IA 7.185-191.13,668-69); ఉత్తరయాన (=ఉత్తరాయన, రా.వ.సం. 187-88. 21-22,1018)
3.4. వర్ణమాల : ఆల్పసంఖ్యాకమైన పైదోషాలను విస్మరించి మిగిలిన భాషను పరిశీలించినప్పుడు ప్రాచీనాంధ్రంలో 23 హల్లులూ 10 అచ్చులూ గల దేళ్యవర్ణమాల ఉన్నట్టు తెలుస్తుంది. క,గ,ఙ,చ,జ.ట,డ,ణ,త,ద,న, ప,బ, మ,య,. ర,(ఱ),ల,శ,వ,స,హ,(ఴ), అనేవి హల్లులు. వీటిలో ఱ, ఴ లు చారిత్రక కాలంలోనే వర్ణత్వాన్ని కోల్పోయినాయి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఒ, ఓ అనేవి అచ్చులు, 'ఆయ్, అవ్' లతో భేదకత్వంలేని 'ఐ,ఔ' లు ప్రత్యేకవర్ణాలు కావు. అరసున్న సంధిగత వర్ణం. పఞ్చిన (రా. వ. నం. 71-72.25, 847), పన్చిన (భారతి, 5.618.7, 850) శబ్దాలను పోల్చినప్పుడు ఞకారం నకారానికి సవర్ణమని తెలుస్తుంది. మొడత్స (రా. వ. నం. 187-89, 1018) శబ్దంలోని 'త్స' ౘకారానికి బదులుగా రాసింది కాబట్టి ఆనాటికి ఉచ్చారణలో ౘకారం ఉందని చెప్పవచ్చు. ౘౙ లు చ జ లకు సవర్ణాలని కూడా ఊహించవచ్చు. నిండుసున్న వర్గానునాసికాలకు పర్యాయసంకేతమేగాని ప్రత్యేకవర్ణం కాదు. సంస్కృత, ప్రాకృతాల ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చిన సహవర్ణాలు మరికొన్ని ఉన్నాయి. ఖ, ఘ, ఠ, థ, ధ, ఫ, భ,శ, ష, లు కనిపించినా ఠకారం ,ప్రత్యేక వర్ణమనదగ్గ శాసనస్థనిదర్శనం లభించలేదు. ౠ,ఌ, ౡ, లకు ప్రయోగమే లేదు. ఋకారానికి 'రి'కి భేదం లేనందువల్ల అది ప్రత్యేకవర్ణం కాదు.
3.5 వర్ణవ్యాప్తి : శాసనభాపలోని వర్ణవ్యవస్థలో కనిపించే కొన్ని ముఖ్యవిశేషాలివి. దీర్ఘాచ్చు మీద ద్విరుక్ర హాల్లుగాని. 'ఓ' తర్వాత సంయుక్త హల్లుగాని కనిపించవు. జ, ఞ, ట, ణ, హ-కారాలు పదాదిన లేవు. పదాది ళకారం ఎ, ఒ-కారాలకు ముందు, పదాది ఴకారం అకారానికి ముందు, మాత్రమే కనిపిస్తాయి. రేఫతో సంయుక్తమైన క, త, ద, ప, బ, మ, వ లు మాత్రమే పదాదిన కనిపిస్తాయి, ఉ.దా. క్రొచ్చె (SII 10.597.21-22, 925-50), త్రాగిన (పై. 644.106-7, 1060), ద్రోవది (భారతి 1948, 270-90; 369-75,66, 892-922), ప్రాలును (SII 4.1015.12,1084), బ్రమన (పై 1300.7,1095), మ్రాను (IA 7.185-91.13, 668-69), వ్రచ్చిన (SII 10,599.26, 625-50). ఴకారంతో సంయుక్తమైన క,పలు మాత్రమే పదాదిన కనివిస్తాయి, ఉదా. క్రొచ్చె (ఫై 601.27,700.25), ప్ఴోలనాండు (EI 18.58-60.14,732). క, గ, చ, జ, ట, త, ద, న, ప, బ, మ, య, ఱ, ల, ళ, వ, సలు అజ్మధ్యంలో ద్విరుక్తంగానూ అద్విరుక్తంగానూ కనిపిస్తాయి. ఇదిగాక ర, హ, ఴ, లు అద్విరుక్తంగానే ఉండేవి. రెండేసి హల్లులు కలిసిన సంయుక్తవర్ణాలు అజ్మధ్యంలో ఎక్కువగా ఉండేవి. మూడు హల్లులు కలిసినవి ఎరువు మాటల్లోకూడా చాలా తక్కువగా ఉండేవి.
3.6. తాలవ్యీకరణం : పదాదినర్ణాలు చరిత్రలో కొన్ని ముఖ్య పరిణామాలను మాత్రమే ప్రస్తావిస్తాం. తాలవ్యాచ్చులకు ముందున్న ప్రాచీన ద్రావిడ కకారం తెలుగులో చకారంగా మారటం సాధారణ లక్షణం. ఈ తాలవ్యీకరణం క్రీ. పూ. 300లకు క్రీ. శ. మొదటి కొద్ది శతాబ్దులకూ మధ్యకాలంలో జరిగి ఉంటుందని బరో (BSOAS, 11.122-39, ముఖ్యంగా 126), మూలద్రావిడంలోనే జరిగి ఉంటుందని కోరాడ రామకృష్ణయ్య (JVOI 16.76ff.), దక్షిణద్రావిడంనుంచి తెలుగు విడిపొయ్యేకాలంలోనో క్రీ. శ. 5వ శతాబ్దికి ముందుకాలంలోనో ఆరంభమై తెలుగులో సాహిత్యం ఏర్పడటానికి ముందున్న ప్రాచీనాంధ్ర కాలానికి పూర్తయి ఉంటుందని భద్రిరాజు కృష్ణమూర్తి (1961, 1.11-18) భావించారు. క్రి.శ. 395-410 నాటి పెదవేగిశాసనంలోని 'కమ్బురాఞ్చెరువు' (భారతి 1,110-22.15).'చెఞ్చెరువు' (పై 13-14) అనే మాటల్లోని 'చెఱువు' మూల ద్రావిడ శబ్దం *కెఱయ్ నుంచి ఏర్పడ్డది కాబట్టి, ఆనాటికే తాలవ్యీకరణం భాషలో స్థిరపడ్డదని చెప్పవచ్చు. 'కిరాత' శబ్దభవమైన “చిలాత” శబ్ధం (మెహందాళే 1948, పీఠిక 23, పే. 120,23, మొ.) క్రీ. శ. 8వ శతాద్దినాటి ఒక ప్రాకృతశాసనంలో (నాగార్జనకొండశాసనం EI.20.1-7,21.51-71) లభిస్తున్నది. పై శాసనాధారాలనుబట్టి ఈ ధ్వనిపరిణామం క్రీ. శ. నాలుగోశతాబ్దంలో మధ్యాంధ్ర దేశంలో మొదలైందని చెప్పాలి. ఆయితే క్రీ. శ. ఎనిమిదో శతాబ్దంవరకూ “చేయు” ధాతువు పూర్వరూప మైన “కేయు” రూపాలు లేఖనంలో కనిపిస్తున్నాయి. భీమునిపట్నం తాలూకా ముంజేరులోని క్రీ. శ. 709 నాటి శాసనంలో 'కేచిని' (CP 10 of 1908-9) అనే రూపం, ఉదయగిరి తాలూకాలోని భైరవకొండ శాసనాల్లో “కేనిన” (SII 10.54. 1-2,7), 'కేసరి' (పై. 47,7) అనే రూపాలు, తాడిపత్రి తాలూకా కొత్తూరులోని ఒక శాసనంలో 'కేసి' (EI 30.69-71.5,699-700) అనే రూపం, కనిపిస్తాయి. ఆదే కాలపు నెల్లూరు జిల్లా శాసనాల్లో “చేయ” రూపాలు కూడా ఉన్నాయి, అంటే 'కేయి' రూపాలు ప్రాచీనలేఖన సంప్రదాయంగా మాత్రమే నిలిచాయిగాని ధ్వనిపరిణామం అప్పటి కెప్పుడో పూర్తయిందని అర్థం.
3.7 పదాది నరళాలు : ప్రాచీనాంధ్రంలో జరిగిన ప్రధాన ధ్వని పరిణామాల్లో పదాది సరళాల విషయం ఒకటి. అసలు ప్రాచీన ద్రావిడంలోనే పదాదిన సరళాలు లేవని ఆర్. కాల్ద్వెల్ (191.338-39), కె. వి. నుబ్బయ్య (IA 38.193-221), టీ. బరో (BSOAS 9.711-22), భద్రిరాజు కృష్ణమూర్తి (1961, 1.55,1.70-73), వాదిస్తుండగా, ఉన్నవని ఴూల్ బ్లాక్ (IA 48. 194-95), గోదవర్మ (BSOAS 8.562), కోయిపలర్ (పై. 9.987), ఎ.మాస్టర్ (పై 1008), ఎన్ కె ఛటర్జీ (IL 14.9-15)లు విశ్వసించారు. శాసనభాషను బట్టి చూస్తే మొదటివారి వాదాన్ని సవరించనక్కరలేదనిపిస్తుంది. అందుకివి ప్రధాన కారణాలు : (i) క్రీ. శ. 7వ శతాబ్దికి ముందున్న వ్యుత్పత్తి స్పష్టంగా తెలిసిన దేశ్యపదాల్లో సరళాదులు కనిపించవు. (ii) క్రీ. శ. 6వ శతాబ్ది నుంచి అల్పాల్పంగా సరళాది తద్భవాలున్నాయి. (iii) పరుషాది సరళాది రూపాలు రెండూ ఉన్న పదాలు ఇంచుమించు ఏకకాలంలో శాసనభాషలోనే కనిపిస్తున్నాయి. ఉదా. ఖణ్డుగ (EI 10.100-6.28,674) . గణ్డుగ (SI 10.217.7, 745-801). (iv) పదాది సరళాలున్న కొన్నిమాటలకు స్థిరాది పర్యాయపదాలు కలిపిస్తున్నాయి. ఉదా. బాణ(పై 23.23, 719-20) వాణ (EI 30.69-72.2, 699-700). (v) ఎరువు మాటల్లోని పదాది సరళాలనే పరుషీకరించిన నిదర్శనాలున్నాయి. (vi) వ్యుత్పత్తి నిర్ణయం సరిగా సాధ్యపడని “గుజంబు, గెల్బి" వంటి నాలుగైదు మాటలను బట్టి మూలద్రావిడంలో పదాది సరళాలున్నాయనటం సిద్ధాంతం కాదు. (vii) పదాది సరళాలున్నా వ్యక్తినామ స్థలనామాల వ్యుత్పత్తి సందిగ్ధ మయింది. సరళాదిపదాలు రెండు రకాలు, పదాదిపరుషాలను సరళీకరించినందున ఏర్పడ్డవి ఒకరకం; వర్ణవ్యత్యయ కారణంగా నరళాదిపదాలైనవి రెండోరకం; వర్ణవ్యత్యయం వల్ల ఏర్పడ్డవి మళ్ళీ రెండురకాలు : అద్విరుక్త సరళాదులు, సంయుకాక్షరాదులు. ప్రస్తుతం వర్ణవ్యత్యయం వల్ల ఏర్పడ్డ అద్విరుక్తసరాళాది పదాల విషయం చూద్దాం.
3.8 వర్ణవ్యత్యయం : ప్రథమాక్షరం మీదనుంచి ద్వితీయాక్షరం మీదికి ఊనిక మారినందు వల్ల వర్ణవ్యత్యయం పురాణాంధ్రంలోనే ఏర్పడిందని కె. వి. నుబ్బియ్య (IA 209) వాదం. ఎల్. వి. రామస్వామి అయ్యర్ (QJMS 22 448-80), ఎం. బి. ఎమేనో (Lg. 31. 191-92)లు కూడా ఈ వాదాన్ని పరిశీలించారు. ఎ. మాస్టర్ ఈ ధ్వని పరిణామానికి "పోఎన్థెసిస్" (Proenthesis) అనే పేరు (BSOAS 12. 340-64) పెట్టారు. వర్ణవ్యత్యయంతో పాటు అచ్సంకోచం కూడా జరిగిందని భధ్రిరాజు కృష్ణమూర్తి (1961. 1.121-38) వివరించారు. ఈమార్పు(అ' హఅ2>హఅ2అ2హఆ) కారణంగానే తెలుగులో పదాదిన గ,డ,ద,వ,ర,ఱ,ల,ళఴ, కారాలుగల శబ్దాలు ఏర్పడ్డాయి. ఉదా గారి (భరతి 5.618.7,850), దగ్గుంబఱ్ఱి (IA 12.91-95.55,845-70),, దాని (కొ. వ. మం. 1.2-3.41, 898-934), వాన్ఱు (SII 10.606.18=19, 600-25), రెణ్డు. (EI 27.234-38.11, 625-50), ఱేని (భారతి 5.618.7,897), లేచి (పై. 473-84,848), ళోన (SII 10.628.8.9/10), అచ్చు (వై. 24. 12, 682). వీటిలో "గారి" అనేది వారి (NI 3.1151.4.650) నుంచి ఏర్పడ్డది. 'ళోన'కు పూర్వరూపమైన 'ఒళన' (అం వ 1941-42. 5-15.1, 600-25) శాసనభాషలోనే లభిస్తున్నది. "ఴచ్చు" కు పూర్వరూపమైన *అఴియు ధాతురూపాలు “అఱిసిన' (SII `10.25, 625-50) శాసనాల్లోనే ఉన్నాయి. ఈ మార్పు శాసనభాషాకాలానికి చాలా ముందుగానే పూర్తయిందని చెప్పవచ్చు.
3.9. పదాదిసంయుక్తాక్షరాలు : వర్ణన్యత్యయ, ఆచ్సంకోచాలవల్ల
పదాదిన ఏర్పడ్డ సంయుక్తాక్షరాలు క్రి. శ. 4/5 శతాబ్దినుంచీ శాసనభాషలో
క్రమంగా కనిపిస్తాయి. పదాది క్ఴ, ప్ఴ, న్ఱలు క్రమంగా క్ర, ప్ర, వ్ర,లుగా క్రీ. శ. . 7వ
శతాబ్టికే మారినట్టు చెప్పవచ్చు. ఉదా. క్టొచ్చె (5 27.988-40, 27,700.25):
క్రొచ్చె (SII 10.597.20-21); ప్ఴాన్దోఱంబు. (JAHRS 53. తెలుగు భాషా చరిత
5.51-56.21,763)> ప్రా- * వ్ఱ> వ్రచ్చిన (SII 10.599,26, 625-50). క్రీ. శ. 4/5 శతాబ్ది నాటి-తొఱె శబ్దం. (భారతి 1.110-22.11, 395-410) క్రీ. శ. పదో శతాబ్ది నాటి త్రోవ (EI 5.139-42.27, 945-70) కు పూర్వరూపం. మాధ్యమిక రూపం *త్ఱోవ అని ఉండవచ్చు. అంటే క్రీ. శ. పదో శతాబ్దికే సంయుక్తాక్షరగతమైన శకటరేఫ సాధురేఫగా మారిందని భావించవచ్చు. పదాది సంయుక్తాక్షరగతమైన సాధురేఫ క్రీ. శ. పన్నెండో శతాబ్ది మధ్యకాలంలో రాలిపోయి ఉంటుందని పూర్వులు విశ్వసించారు. (కృష్ణమూర్తి 1961 && 1.145). అయితే ఈ మార్పు క్రీ. శ. ఏడో శతాబ్ధంలోనే మొదలయిందనటానికి కొన్ని నిదర్శనలు లభిస్తున్నాయి. ఉదా. అయ్యవోళు (భారతి 16.613-19.13,691- 92), గొచ్చి (SII 10.621.3, 9/10), పోలమ (పై. 620.5,914), పప్పు (ఫై. 4.1015.9, 1084) మాని (పై. 10.646.29, 1062). కాని ఈ మార్పు బహు విరళంగా ఉండేదని, చారిత్రక కాలంలో పూర్తి కాలేదని చెప్పాలి.
3.10. పదాది య, వలు: పదాది యికారవకారాలు క్రమంగా క్రీ. శ. 8 వ శతాబ్దులనుంచే లేఖనంలో కనిపిస్తున్నాయి. ఊదా. (i) యుళ్లలూరు. (EI 9.233-3 6.20 426), యలమ్మ (SII 10.29.16,971) (ii) వకొట్టి (పై. 614 6,9) వుద్దిని (EI 30.280-84. 12,972), ఇవి వర్ణాత్మకలేఖనంలో తొలిగిపోతాయి.
3.12 పదమధ్య గ, వ లు: పదమధ్యంలో ప్రత్యయాత్మక గ, వ కారాలు మారుపాటు పొందటం శాసనభాషలో కనిపిస్తుంది. ఈ మార్పుల్లో ఏది ఏ ప్రాంతంలో ఆరంభమయిందో చెప్పలేముగాని, క్రీ.శ. పదకొండో శతాబ్దంలో ఇవి పరస్సరం మారిన వనటానికి సాక్ష్యముంది. ఉదా. (i) -గ->-వ-: నాలుగు (NI 3.1151.6-7, 650) నాలువు (SI 4.1029.10.1100). (ii)-వ->-గ- దణ్డువు (భారతి 5.618. 7,897), దణ్డుగు (CIT 26.13, 1079).
3.12 పదమధ్య న,ణ లు: మూలద్రావిడ *ణకారం. తెలుగులో నకారంగా మారింది. ఈ మార్పు క్రీ. శ. ఏడో శతాబ్దిలో మొదలై తొమ్మిదో శతాబ్దికి పూర్తయినట్టు తెలుస్తుంది. ప్రొద్దుటూరు తాలూకాలో దొరికిన క్రీ. శ. 626-50 నాటి ఓక శాసనంలో ణకార యుక్తమైన 'ఆణతి' (EI 26.234-36.15), నకారయక్తమైన 'పని' (.32) అనే. రెండు రూపాలూ దొరుకు59 ప్రాచీనాంధ్రం : శాసన భాషా పరిణామం
తున్నాయి. క్రీ. శ. తొమ్మిదో శతాబ్ది నాటి ఒక శాసనంలో 'తన' శబ్దానికి బదులగా 'తణ' (SII 10.639.11,825) అనే విలోమ లేఖనం కనిపిస్తుంది. ప్రాచీన ణకారం లేఖనంలో క్రీ. శ. పదకొండో శతాబ్దిదాకా అక్కడక్కడ కనిపించినా (కొణం, పై. 647.30,1097) ధ్వనిపరిణామం తొమ్మిదో శతాబ్దికే పూర్తయిందనాలి.
3.13 పదమధ్య డ, ణ, లు: ఆజ్మధ్యడకారం కొన్ని రూపాల్లో ణకారంగా మారటం క్రీ. శ. ఏడో శతాబ్దిలో పల్నాటి సీమలో ఆరంభమయిందని నిరూపించవచ్చు. ఉదా, కొడికిం (EI 15.249-52.17, 554) : కొణెకి (పై 31.74-80. 21,669). ఇది ధ్వనిసూత్రం కాదు. అందువల్ల ఈ మార్పు భాషలో పర్యాప్తంగా లేదు.
3.14. సాధుశకటరేఫలు : పెదవేగిశాసనంలో 'అఱుతొఱె' (భారతి 1 110-22, 10-11 395-410), 'చెఞ్చెఱువ' (పై 13-14), “కమ్బరాఞ్చెరువ" (ఫై.15) అనే మాట లున్నాయి. రెండో మాటలో ఉన్న శకటరేఫ అదే పదంలో మూడో మాటలో లేదు, అందువల్ల ఆప్పటికి చాలాముందు కాలంలోనే ఆ రెండు ధ్వనులూ ఒకే వర్ణంగా మారాయని చెప్పవచ్చు. క్రీ. శం ఏడో. శతాబ్టినాటి. 'ఇరుకుటూరు” (EI 31. 74-80, 39-40, 669), ఎనిమిదో శతాబ్దినాటి 'చిట్టేరు' (JAHRS 5.51-56.19,763) 'నూరు' (SI 10.37.2.8) వంటి మాటల్లో శకటరేఫ లేదు. అదే కాలంలోని 'పడమఱలూఱి' (పై. 605. 1-2 8) అనే పదంలో 'ఊరు' శబ్దంలో ఉండరాని శకటరేఫ వచ్చి చేరింది. పైవాటిలోని ఏడో శతాబ్దిపదం పల్నాటిది. ఎనిమిదో శతాద్ది రూపాలు విశాఖనుంచి అనంతపురం వరకున్న భూభాగాలవి. అందువల్ల రేఫ అకారాల భిన్న వర్ణత్వం అజ్మధ్యంలో క్రీ. శ. ఏడో శతాబ్దికిముందే మధ్యాంధ్ర దేశంలో లోపించటం మొదలుపెట్టి ఎనిమిదో శతాబ్దికి దేశమంతా అల్లుకుపోయిందని చెప్పవచ్చు.
3.15. పదమధ్య ల, ళ లు : మూలద్రావిడ *ళకారం కీ. శ. ఏడో శతాబ్దికే లకారంగొ మారటం మొదలుపెట్టి తొమ్మిదో శతాబ్దికి వూరర్తిగా మార్పు చెందింది. నరసరావుపేట తాలూకొలోని ఒక శాసనంలో 'కొలచి (పై. 6.250 7,862-98) అనేరూపం కనిస్తుంది. అయితే ఏడో శతాట్దికే ప్రాదీన ద్రావిడ *లకారం ఉండవలసినచోట ళకారం రాయటమనే విలోమలేఖన పద్ధతి 60. తెలుగు భాషా చరిత్ర
వచ్చినందు వల్ల *ళకారం లకారంగా అప్పటికే మారిందనాలి. ఉదా. ఆయ్యవోళు (భారతి 16.613-19.13, 691-92), కళర్ (పై. 5.935-48. 13,675), తళవర (EI 31.74-80. 22,669)
3.16. పదమధ్య ఱ, డ లు : అఙ్మధ్య ఱకారం క్రీ. శ. ఏడో శతాబ్దికే డకారంగా మారింది. చోఴ (పై. 27. 229-30. 1,600-25), కుడుచు (SII 6.584.10,641) వంటిది ఇందుకు నిదర్శనాలు.
3.17. వర్ణసమీకరణం I : ప్రాచీనాంధ్రంలో వర్ణసమీకరణం కారణంగా అఙ్మధ్యంలో ద్విరుక్తమైన క,గ,చ,ట,డ,ణ,త,ద,న,ప,మ,య,ఱ,ల,ళ,వ,స లు ఏర్పడ్డాయి. ఈమార్పు సాహిత్యం ఏర్పడటానికి ముందు కాలంలో జరిగిందని బరో (BSOAS 11.129), కృష్ణమూర్తుల (1961, && 1.179-80) అభిప్రాయం. శాసనాధారాలను బట్టి క్రీ. శ. నాలుగో శతాబ్ది నాటికే ఈ మార్పు వచ్చినట్టు చెప్పవచ్చు. ఈ సమీకరణం రెండు విధాలు: (i) (హ) అహ-హ > (హ)అ-హహ. ఉదా. ఇచ్-చిన(EI 27.225-28.4 575-600). (ii) (హ) అహ- అ>(హ) అహహ- ఉదా. కొట్ట్-ఊరు (నర్కార్, 1942, 1.256 -57.19, 330-75). ఈ మార్పు చెందని *పెర్దల్, (రా. ప. సం. 71-72.27,847) వంటి రూపాలు క్రీ. శ. పదకొండో శతాబ్ది దాకా క్వాచిత్కంగా లేఖనంలో నిలిచినా, ధ్వనిపరిణామం మటుకు అప్పటికి ఏడెనిమిది శతాబ్దుల కిందనే ఆరంభమయింది.
3.18. అఙ్మధ్య ద్విరుక్త హల్లులు : ద్విరుక్తణకార ళకారాలు కూడా చారిత్రక కాలంలోనే ద్విరుక్త నకార లకారాలుగా మారిపోయాయి. క్రీ. శ. ఎనిమిదో శతాబ్దిలోని 'కొణ్ణ' (SII 10.611.2) అనే శబ్దం 9/10 శతాబ్దికి 'కొన్న' (తె. ళా. 0.163-65. 70-71, 881-922)గా మారింది. క్రీ. శ. పదో శతాబ్దిలో కూడా 'అణ్ణ' (EI 30.280-84.7, 972) వంటి రూపాలు లేఖనంలో నిలిచినా, ఆనాటికే ధ్వని పరిణామం పూర్తయినట్లే. అఙ్మధ్య ద్విరుక్త ళకారం క్రీ. శ. ఎనిమిదో శతాబ్దికే ద్విరుక్త లకారంగా మారింది. ఉదా. పళ్ళి (పై. 31.74-80. 21.669), -పల్లి (CP 2, 1914-15. 26, 764-99).
3.19. వర్ణసమీకరణం II : ఆజ్మధ్యంలోని భిన్న హల్లులు సమీకరణం పొందినందు వల్ల చారిత్రకకాలంలో అజ్మధ్య సంయుక్త హల్లులు 61. ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం
(అహ1 హ2 ఆ) మరికొన్ని ఏర్పడ్డాయి. అలాంటి మార్పుల్లో 'ణ్చ' కారం 'న్చ'గా మారటమొకటి. అది క్రీ. శ. తొమ్మిదో శతాబ్దికే పూర్తయింది. ఉదా. పణ్చిన (భారతి 5.473-848), పన్చిన (పై. 618.7850) 'ళ' క్రీ. శ. ఏడో శతాబ్ధికే 'ల్క'గా మారింది. ఉదా. పల్కిన (EI 230-31, 625-50). సంయుక్షాకరగతమైన శకటరేఫ ఆకాలలోంనే సాధురేఫగా పరిణమించింది. ఉదా. తూఱ్పు (భారతి 5.935-48. 11,675), తూప్పు౯న (SII 6.584.8,641). 'న్ఱ'కారం 'న్డ, ణ్డ. న్డ', లుగా మారటం కూడా అప్పుడే జరిగింది. ఉదా. తాన్ఱికొన్ఱ (IA 9.102-3.75), కొఱ్డ (EI 27.231-34.8,625-50), పణ్ఱేణ్డు (SII 10.599,31, 625-50), వాణ్డ్ (పై. 4.1015.12,1084); ఇన్ఱు. (పై. 10.46.2,7), ఇన్డుల (పై. 10.599.32,625-50). 'ళ్ప'కారం క్రీ. శ. తొమ్మిదో శతాబ్దిలో 'ల్ప'గా మారింది. ఉదా. వెళ్పు (పై. 6.585.2,633-63), వెల్పూరు) (EI 5.122-26.29,844-88). సంయక్తాకర గతమైన సాధురేఫ వర్ణ సమీకరణం వల్ల మీది హల్లుతో కలిసి క్రీ. శ. తొమ్మిదో శతాబ్ది నుంచి ఆజ్మధ్యద్విరుక్త హల్లుగా మారింది. ఉదా. ఉపు౯టూరు (SII 1.31-36.25, 794-842), ఉప్పుటూరు (భారతి 1.90-110 65,844 -88).
3.20 ఇయ>-య : పదమధ్యాచ్చు లోపించినందు వల్ల అజ్మధ్యంలో సంయుక్తాక్షరం ఏర్పడటం క్రీ. శ. పదకొండో శతాబ్దిలోనే జరిగింది. దీపశబ్ద భవమైన *దివియనుంచి ఏర్పడ్డ దివ్య (SII 4.1317.6,1081), దివ్య (AR 1933 AP. B. 56.7,1072) లు అనాటి శాసనాల్లో ఉన్నాయి. తిక్కన కవితలో ఈనాటి శబ్దాలున్నందువల్ల క్రీ. శ. పదమూడో శతాబ్దికి ఈ పరిణామం పూర్తయిందని భావించవచ్చు.
3.21. అచ్చుల హ్రస్వదీర్ఘతలు : ప్రథమాక్షరంలో హ్రస్వదీర్ఘాచ్చులుండి అర్థభేదం లేని జంటమాటలు కొన్ని శాసనభాషలో కనిపిస్తాయి. ఇవి రెండు రకాలు. (i) అక్షర సంఘటనలో ఇందువల్ల మార్పురానిని. ఉదా. ఎమ్భది (EI 30.69-71.4,699-700), ఏమ్బది (పై. 27.231-34.11,625-50). (ii) హ్రస్వాచ్చు మీద ద్విత్వహల్లు గాని దీర్ఘాచ్చుమీద అద్విరుక్త హల్లుగాని ఉన్నవి. ఉదా. జూవి (SII 10.217.745-801), జువ్వి (EI 5.127-31-31, 392-922). ద్వితీయాక్షరంలో హ్రస్వదీర్ఘ భేదముండి అర్థభేదం లేని 62. తెలుగు భాషా చరిత్ర
పదాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఉదా. కళర్ (భారతి 5.935-48.13,675), కళార్ (EI 30.12.26-27,8). 'కలవారు' నుంచి అర్వాచీనకాలంలో 'కలార్' ఏర్పడ్డదనే మన వ్యాసకర్తల భావం. ప్రామాదికమని ఈ నిదర్శన నిరూపిస్తుంది.
3.22. అనుస్వారం : పరుష సరళాలకు ముందు అనుస్వారం వాడటమనేది ఆర్యభాషా ప్రభావం వల్ల చాలా ప్రాచీనకాలంలోనే తెలుగులోకి వచ్చిన సంప్రదాయం. పదాంశాల్లో, వాటి అవధుల దగ్గరా, పదాంతంలోనూ పరసవర్ణాదేశం చేయటమో అనుస్వారాన్ని దానికి బదులుగా వాడటమో క్రీ. శ. నాలుగో శతాబ్ది నుంచీ కనిపిస్తుంది. ఉదా. (i) పదాంశంలో : పణ్టూర (పై. 6.315-19.24,234), కంగూర (పై. 17.327-29.3,4). (ii) పదాంశావధివద్ధ ; చెఞ్చెఱువ (భారతి 1.110-22. 13-14, 395-410). విలెంబలి (పై. 334-37.9,610), (iii) పదాంతంలో : ఏళన్ (EI 27.221-25.5, 575-600), ప్రవర్తమానం (పై. 29.160-64.5,680). వ్యాకరణాలు స్పష్టంగా నిషేధించక పోయినా సాంప్రదాయ పండితులు తప్పుగా భావించే పంక్త్యాది అనుస్వార లేఖనం కూడా క్రీ. శ. ఏడో శతాబ్ది నుంచి శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా. పులొ -ంబున (SII 6.584.6 - 7,641). అనుస్వార పరసవర్ణాల్లో ఏది రాయాలో తేల్చుకోలేక (i) ఒకే పదంలో రెండూ రాసినవీ (ii) ఏదో ఒకటి రాయబోయి తప్పుగా రాసినవీ కనిపిస్తాయి. ఉదా. నాంణ్డు (JAHC 3.16-21.11,) 678), (ii) సజ్వత్సరంబు (EI 30.12-8,8). క్రీ శ. నాలుగో శతాబ్ది నుంచి అనుస్వారం వాడుకలోకి వచ్చినా ఏడెనిమిది శతాబ్దుల నాటికి గాని ఈ వాడుక నిలదొక్కుకోలేదని ఈ స్థితికి అర్థం. మొత్తం మీద అనుస్వారం కన్న పరసవర్జాదేశమే అధిక ప్రాచుర్యంలో ఉండేది. క్రీ. శ. పదకొండో శతాబ్ది నుంచి అనుస్వార లేఖనం ప్రచురతరమయిందికాని పూర్వమర్యాద పూర్తిగా తొలగిపోలేదు. జ, మ లకు బదులుగా బహుళంగాను, ఞకారానికి బదులుగా సమాన వ్యాప్తితోను, ణ, న లకు బదులుగా విరళంగానూ, అనుస్వారం వాడుకలో ఉండేది. దేశ్య శబ్దాల్లో పరుష సరళాలకు ముందు, తద్భవాల్లో ణ, ప, లకు ముందు కూడాను, తత్సమాల్లో మహా ప్రాణాలకూ య, స, శ, హ, లకు ముందుకూడాను *అనుస్వారం కనిపిస్తుంది.
'3.23. అర్థానుస్వారం : అర్ధానుస్వారానికి లిపి సంకేతం లేదు. ప్రాచీనాంధ్రం : శాసనభాషాపరిణామం 63
మొదట బిందువుగా ఉండి తరవాత సున్నగా మారిన సంకేతాంశం పూర్ణార్ధ బిందువులను రెంటినీ సూచించేది. ఛందస్సును బట్టి ఆర్ధానుస్వారమూలరూప నిరూపణం సాధ్యమవుతుంది. కొన్ని సమయాల్లో అనుస్వారానికి బదులు పరసవర్ణాదేశమే లేఖనంలో ఉన్నా, ఛందస్సును బట్టి అరసున్న (అనునాసిక్యం) ఉన్నట్లు నిరూపించవచ్చు. ఉదా... ప్రభుం బణ్డరంగుం బణ్చిన...పణ్డ్ఱెణ్డుంగొని...వేంగినాణ్టిం... (భారతి 5.473-84.4-6,848) అనేభాగాన్ని '*ప్రభుఁ బండ రంగుఁ బణ్చిన...వేఁగినాఁటిఁ' అనే చదవాలి. 'గవజ్వాంబ్... కొట్టంబుల్.... పై. 3, 6) అనేచోట్ల '*గర్వమ్...కొట్టముల్' అనే పఠించాలి. లేదా ఛందో భంగం. బిందుపూర్వక బకారాన్ని మకారానికి బదులుగా రాయటం క్రీ. శ. ఏడో శతాబ్ధం నుంచీ ఆచారంగా ఉండేదని గ్రహించాలి. సంప్రదాయ పండితులు దీర్ఘం మీద అర్ధానుస్వారం లేదంటారు. కాని 'కూంతు సరియ పోల్పం గాంత లెంద్దు' (రా. ప. సం. 25-29.11, 1065) వంటివి అందుకు విరుద్ధంగా ఉన్నాయి. నన్నెచోడుకి కవిత్వంలోని వీండె ఖలుండు. దక్షుఁడను వీఱిఁడి పాఱుఁడు...బ్రహ్మాండము..' మొదలైన ప్రయోగాలను ఇక్కడ అనుసంధించినప్పుడు ప్రాచీనాంధ్రంలో మాండలికంగా నయినా అర్ధానుస్వారం ఉండేదని తెలుస్తుంది. బిందువు మీది పరుష సరళాలను ద్విత్వంచేసి పూర్ణబిందువును చేయక ఖండబిందువును పూర్వులు నిర్జేశించేవారన్న విశ్వాస మొకటి ఉంది. అయితే ఈ ఆచారం అన్ని సందర్భాల్లోనూ చారిత్రక కాలంలో నియతంగా కనిపించదు. ఉదా. (i) పూర్ణబిందువే ఉండవలసినా ద్విత్వహల్లు లేని శబ్దాలు : పణ్డురంగు (భారతి 5.792.10,848-49). బింకమ్ (పై. 618.7,897); (ii) ఖండబిందువు లేకపోయినా ద్విత్వహల్లులున్న శబ్దాలు : సామంత్త (పై. 473-84.5, 848). ఎత్తించ్చె (EI 4.314-18.20, 1075-76). అర్ధానుస్వారం పూర్వాచ్చును అనునాసికంగా ఉచ్చరించటాన్ని సూచిస్తుందని కేతన (ఆం. భా. భూ. 30,56,57) మాటలను బట్టి ఊహించాలి. అంతకు మించిగాని, అందుకు విరుద్ధంగా గాని నిదర్శనాలు లేవు. పర్యాయోపయోగం కారణంగా అనుస్వారం అనునాసిక వర్ణాలకు ప్రత్యామ్నాయి సంకేతమేగాని ప్రత్యేకవర్జం కాదని చెప్పవచ్చు. 3.24. అచ్చంధులు : పదాంతంలోని అత్తు సంధిలో లోపించటం క్రీ. శ. [9/10 శతాబ్ది నుంచి కనిపిస్తుంది. యడాగమంగల రూపాలు క్రీ. శ. ఏడో శతాబ్ది నుంచి కనిపిస్తుంటే ఆరో శతాబ్దిలో పదాంతాత్తు నిలిచి ఉన్నట్టు నిదర్శనా లున్నాయి. 64 తెలుగు భాషాచరిత్ర
ఉదా. సంధికి-ఇడ్డట్లు (ళా. ప. మం. 1.2-3.41, 898-934); విసంధికి- పన్నస ఇరవది. (EI 27.225-28. 12-13. 575-600). యడాగమానికి-కలయన్త (SII 6.585.11, 633-63); విరళమైన వడాగమానికి- ఎఱ్ఱ వుమ్మయును (పై. 10.29.18, 971).
ఇత్సంధి ప్రాచీనమై క్రీ. శ. 9/10 శతాబ్ది వరకు యడాగమం వికల్పంగా ఉండి తరవాత బహుళమయింది. ఉదా. సంధికి-శ్రీ కెల్లన్ (తె. ళా. 1.163-65. 41-42, 892.922); విసంధికి-ఇరుపజయది ఏను (AR 392/1904. 11-13, 575-600); యడాగమానికి-ఇరవది యాదినాల్కు (EI 27.225-28 575-600). ఉత్సంధి మొదటినుంచీ బహుళంగానే ఉండేది. క్రీ. శ. ఏడో శతాబ్ది నుంచి యడాగమం కనిపిస్తూ పదకొండో శతాబ్దికి బహుళవ్యాప్తికి వచ్చింది. అంటే ఉత్సంధి నిత్యం కాకపోగా వైకల్పికంగానే ఉండేదని అర్థం. ఉదా. సంధికి- ఊడ్లందు (SII 6-585.9,633-63); విసంధికి- రేనాణ్డు ఏళన్ (EI 27.221-25.4-5, 575-600); యడాగమానికి - వారు యిఱ్లకాను (SII 6.584.10, 641). పదాంతాచ్చులు హల్లుకు ముందుకూడా లోపించటం విరళంగా ఉండేది. ఉద్దా. అన్వారు (ఆం. ప. 1941-42. 5, 625-50). నల్తుముడ్లు (AR 232/1949-50.9,8). శాస్త్రీయంగా చెప్పాలంటే హలంత శబ్దాలమీద అజాగమం రాలేదనాలి. ఏకాక్షరధాతువుల తుదిహల్లుకు అచ్చులముందు క్రీ. శ. ఏడో శతాబ్ది నుంచి ద్యిరుక్తత కనిపించేది. ఉదా. అన్నేణ్టన్ (భారతి 23.182-86.5, 641). నన్నయగారి 'అన్నిష్టసఖి' ఈలాటిదే.
3.25 గసడదవాదేశం : గసడదవాదేశం క్రీ. శ. 8-11 శతాబ్దుల మధ్య నిత్యంగాను, అంతకుముందు వైకల్పికంగానూ ఉండేది. డాదేశానికి శాసనస్థ నిదర్శనాలు దొరకలేదు. ఉదా. సంధికి : ఆణతి-గాను (EI 27.234-36.15 625-50). పణి-సేసిన. (SII 6.584.5,641), స్థితి-దప్పి (ళా. ప. మం. 1.2-3.39, 898-934), ఏను-వుట్లు (SII 6.585.10, 633-63). విసంధికి : రెండు-తోటళు (EI 27.234-36.11, 625-50). ఆడ్లు - పట్టు (భారతి 5.935-968.8-9, 675). ఈ ఆదేశం సంప్రదాయ వ్యాకరణాల్లో చెప్పిన దానికన్నా ఎక్కువ వ్యాప్తిలో ఉండేది. తత్సమాల్లో, ద్రుతాంతాలమీద, విశేషణాలమీద, క్త్వార్ధకాలమీద, సమాసగత
సంవృతాక్షరాల్లో గసడదవాదేశం జరిగేది. ఉదా. తత్సమాల్లో : కలయంత-
గాలంబు. (SII 6.585.21, 633-63), విత్తుపట్టు- వసాదణ్చేసిరి (EI 7.177-192.74, 945-70); ద్రుతాంతాలమీద: నాలును వుట్టు (
1201-9228, 70) కళ్టెంసూరె (2 8.250,7, 742-908), ఇన్దు
వ్రత్యక్షబ యన్నన్ (శా. వ. ముం, 1,,23. 26-27, 898-934.)
విశేషణాలమీద : ఇరు-వుట్టి (SII 6.585.9, 633-63); స్థితి-నెఱ్పి (SII 10. 645.57.1060). , పొంది-గాని (తె. శ. 1.163-65.6, 892-922); సంవృతాక్షరాలో: . నిడు-గట్ట (EI 18.313-16. 15, 696-709), దమ్మ-వురంబున (భారతి 5.473-84. 10-11 848). అయితే మొత్తంమీద శాసనభాషలో ఈ ఆదేశం చాలా విరళంగా
3.26. ద్రుతం, ద్రుతసంధి: ద్రుతమన్నది పదాంతంలోని అనునాసికవర్ణమేగాని మరొకటి కాదు. క్రీ.శ. 6-9 శతాబ్దుల మధ్యకాలంలో ద్రుతసంధి వైకల్పికంగానే ఉండేది. కాలక్రమాన అది బహుళంగా పర్యవసించినా, క్రీ.శ. పదకొండో శతాబ్దిలో కూడా ఇది నిత్యసంధి కాలేదు. అయితే క్రీ.శ. తొమ్మిది పది శతాబ్దుల్లోని పద్యశాసనాల్లో మాత్రం. ద్రుతసంధి నిత్యంగా ఉండేది, ద్రుతాంతాలమీది పరుషాలు సరళాలు కావడం పదిరకాలుగా ఉండేది, ఉదా. ద్వితీయాంతాలమీద: దీని-గాచినవారు (NI-3-1151, 10, 650); తృతీయాంతాలమీద: వైదుంబుళచేతం-బట్టంకట్టబడి - (SIi 10.640.4,9/10); . చతుర్యంతాలమీద: నాకు-బణి సేసిన (పై. 6.584. 5, 641); సప్తమ్యంతాలమీద: సుద్దపక్షబున-బఇ్చమియు (JAHC 3.46-21.9-10, 678); సముచ్చయంమీద: " పణ్ఱెంణ్డుం గొణి (భారతి 5.473-84,40-41,848); అన్నంత క్రియలమీద.. కట్ట బడిన (SII 10. 629.5,825); భూతకాలికసమాపక క్రియలమీద: కట్టించెం-గ్రమబున (శా.ప.మం. 1.2-3,40-41, 898-934); విధ్యర్ధకక్రియలమీద చేయవలయుం - గాన (తె.శా. 1.163-65,29-30, 892-922); అవ్యయాలమీద: నేల యెల్లం-గావంబూని (పై. 12); విశేషణాలమీద: నిఱ్ఱు-జెఱువున (SII 10.652.6,1095). ద్రుతసంధి జరిగిన సందర్భాలు లేకపోలేదు, ఉదా. పాఱకు కుణ్డికాళ్ళుళ (EI 27.225-28. 11-12, 575-600), పులొంబున-చెఱువు (SII 6.584.6-7, 641), చేరమజ్గలమ్బున-తొఱ్రుకొణ్ణన్ (పై. 10. 631.6-8,9/10), ఏణ్టన్-పళ్లినాట్టి (భారతి 23. 182-86 5,641).
3.27. ద్రుతంమీద య వ లు: ద్రుతంమీద యడాగమ, వడాగమాలు చేయటంకూడా క్రీ.శ. ఏడో శతాబ్దం నుంచి కనిపిస్తుంది. అంటే పదాది యవలు ఆనాటినుంచి వాడుకలో ఉన్నాయని అర్థం, ఉదా. యడాగమం: పఞ్చమియు- యాదిత్యవారంబు (JAHC 3.16-21.9-11, 641), విషయంబు యేళు (SII 10.23.4,719-20), పడుమట-యేడు (పై. 6.250.4,742-98), వడాగమం : ఇఱ్లకా వెఱుగువారు (ఆం. ప. 1941-42, 14-15.2-3, 600-25), పోటున-వకొట్టి (SII 10.614.5-6, 8), రట్టగుడియు-వుద్దిని (EI 30.280-84. 12,972). ప్రథమాంత శబ్దాలమీద కూడా పదాదియకారాన్ని నిలపటం ప్రాచీన కాలంలో ఉండేది, ఉదా. సంవత్సరమ్బుళ్ + యేనగు (పై. 27.234-36.6-7, 625-50).
3.28. విరూపసంధులు: తత్సమశబ్దాలకు తెలుగు పద్ధతిలోను, తెలుగు మాటలకు సంస్కృత పద్ధతిలోను సంధిచేయటం అక్కడక్కడ కనిపిస్తుంది, ఉదా. నీలీస్వర (SII 10. 652.6, 1095), మన్చ్యుణ్ణ (EI 17.334-337.11, 610). రెండో శబ్దం విషయంలో ఇదొక్కటే ప్రయోగం నన్నయనాటివరకున్న శాసనాల్లో కనిపిస్తుంది. కాని తరవాతికాలపు ప్రయోగాల్లోని 'గొఱ్య, గొఱ్ఱె; పళ్యాలు, పళ్యెము, పళ్లెం' మొదలైన శబ్దాల్లో గోచరించే *ఎ ధ్వని ఇందులోనూ ఉందని గుర్తించవచ్చు. 'కళ్యాలు' వంటి శ్రీనాథప్రయోగాలను ఇక్కడ అనుసంధించుకోవాలి (చూ. ఈ గ్రంథంలోనే కందప్పచెట్టి 5.7)
పదమధ్యసంధులు: ప్రత్యయం పరమైనప్పుడు ప్రాతిపదికల్లో వచ్చే మార్పులన్నీ పదమధ్య సంధులే అయినప్పటికీ, అలాటి మార్పులను ఆయా ప్రాతిపదికలను వర్తించేటప్పుడే ప్రస్తావించటం జరిగింది. సంవృతాక్షరాల్లో (Closed Syllables) రేఫ - ఱకారంగా మారటం ఒక ధ్వని పరిణామం. దీనికి వర్ణభేదకత్వం లేదు, ఉదా. పణ్డ్ఱెడు (SII 10.599.32,625-50), విట్ఱజాల (భారతి 5.935-48.2,675), కొణ్డ్ఱు (SII 10.633.4,8), వాణ్డ్రు (పై. 4.1015. 12, 1084). వాణ్ణు మొ. చోట్ల రేఫకు ముందు డకారా గమం జరగటం విట్టజులవంటి చోట్ల రేఫను ఱకారంగా పల్కటం, ఈ సంధిలోని విశేషాలు. వీటిని బట్టి క్రీ. శ. తొమ్మిదో శతాబ్దిలో ఱకారానికి స్పర్శ ధ్వని లక్షణం ఉండేదని, 'డ-ఱ' లకు (లేదా *న -ద -లకు) స్పృష్ణోష్మ లక్షణాలుండేవని ఊహించవచ్చు.
పదాంతాక్షర నంధి : పదాంత సంవృతాక్షరాల్లోని న, మ లకు క్రీ. శ. 4/5 శతాబ్దిలో ప్రత్యేకవర్ణత్వం పోయిందని చెప్పవచ్చు. కమ్బురా ఞ్చెరువ (భారతి 1.110-22.15, 395-410), చెఞ్చెఱువ (పై. 13-14) వంటిమ్ మాటలను బట్టి పదాంతంలో నమలు ప్రత్యేక వర్ణత్వం కోల్పోయి సవర్ణంలో మేళవించాయి. క్రీ. శ. ఏడో శతాబ్దిలోని ఉదక పూవ్వ౯లజ్కేసి' (EI 30 69-71.5, 699-700) అనే పదబంధం సంవృతాక్షరంలో పదాంతమకారం కంఠ్యస్పర్శంగా మారిందని నిరూపిస్తున్నది.
3.29. మహదేకవచనం : క్రీ. శ. పదకొండో శతాబ్ది వరకుగల శాసనభాషలో 1882 విభిన్న విశేష్యపదాలు లభిస్తున్నాయి. వాటిలో 573 దేశ్యాలు ; 211 తద్భావాలు; 424 తత్సమాలు. మహద్వాచక విశేష్యాలలో చాలా వరకు లింగబోధక ప్రత్యయాలు లేనివే. ఉదా...తలవరి (పై. 20.1-7 B 1.5. 3), మన్చ్యణ్ణ (పై. 17.334-37. 11, 610), రాజు - (పై. 27.221-25, 2-3, 575-600), కమ్మరి (ఫై. 234-36.21, 625-50), కొడుకు (JVOI 15.41-42.6, 740). కొన్ని మాటలు (ప్రథమైకవచన ప్రత్యయం ఉండీ, లేకుండా కూడా కనిపిస్తున్నాయి. ఉదా, (i) దేశ్యాల్లో : గణ్డ (SII 10.635.5.80): గణ్డడు (El 4,314-18.18,1075-76); (ii) తద్భవాల్లో: ఓజు(భారతి 3.83 94.56-57, 1060), ఓజన్ఱు (EI 27.240-42. 19-20,725); (iii) తత్సమాల్లో డుమంతానికి సంప్రదాయ వ్యాకరణాలు చెప్పేచోట్ల ప్రత్యయరహిత శబ్దాలు కొన్ని కనిపిస్తున్నాయి, ఉదా. పాతకు (పై. 228-29. 8, 600-25), పణరంగు (భారతి 5.473-84. 5, 848). ప్రత్యయయుక్తంగా ఉన్న మహద్విశేష్యాలు విభిన్న ప్రత్యయాలతో కనిపిస్తున్నాయి, ఉదా. ధనంజయు -ఱు (El 27.221-25.3-4,575-600), ఉత్తమోత్తము-న్ఱు (పై. 231-34. 4,625-50), వా-ణ్డు (SII 10.599. 33, 625-50), సంయుక్తు-ణ్ఱ్ (EI 30. 12-31,8), కుళ్ళమ్మ-న్ (SII 10.631. 6, 9/10). ఈ ప్రత్యయాల్లో -లు లేఖక ప్రమాదంవల్ల వచ్చింది కావచ్చు. '-న్' అనేది అత్యంత ప్రాచీనమూ, బహుశా తమిళంనుంచి సంక్రమించింది కావచ్చు. -న్ఱు ప్రత్యయం క్రీ.శ. ఏడో శతాబ్దికి -ణ్డుగా మారింది. కాని లేఖన సంప్రదాయలలో పదో శతాబ్దిదాకా నిలిచింది. ధ్వనిపరిణామం తొమ్మిదో శతాబ్దికే పూర్తయింది. ఇది పద్యశాసనాల్లో వైకల్పికంగా -ఁడుగా మారింది. '~' కు పూర్వాచ్చుకు వచ్చిన ఆనునాసిక్యమని అర్థం. -ను చేరిన దేశ్య పదాలసంఖ్య అత్యల్పం. తత్సమాదుల్లో ఇది చేరినప్పుడు పదాంతంలోని అత్తు వైకల్పికంగా ఉత్తుగా మారేది, ఉదా.ఓజ-న్ఱు (EI 27.240-42.20,725), ఉత్తమోత్తము-న్ఱు (పై. 231-34. 4, 625-50), సోమనాథ-ఁడు(SII 10.4.7,1008). హల్పూర్వానునాసిక లోపం సంప్రదాయంగా ఉన్న కన్నడ ప్రభావంవల్ల ధనంజయు-ఱు ఏర్పడి ఉండవచ్చు. మూలద్రావిడంలో మహదేకవచన ప్రత్యయం *-న్ఱ్ గా ఉండి, దక్షిణ ద్రావిడంలో *ఱకారలోపం పొందిందని బరోగారి అభిప్రాయం (కృష్ణమూర్తి గారికి రాసిన లేఖద్వారా తెలిసింది). ప్రాచీన ద్రావిడంలోని *-న్ ఱ్ /*-న్ ట్ అనే ఈ ప్రత్యయం దంతమూలీయోచ్చారణలో *న్-ట్ గా ఉండేదని, దీంట్లోని ట్-వర్ణం అమహదేకవచన శబ్దమైన *అతు-కు సంబంధించిందని ఎమెనోగారి ఆశయం (1955, 10.5). బహువచన ప్రత్యయం చేరినప్పుడు ఏకవచన ప్రత్యయం సాధారణంగా లోపిస్తుంది. ఈ లక్షణం ప్రకారం 'కున్తుఱ్, కున్తుల్' శబ్దాలను పోల్చి చూసినప్పుడు -ఱు ప్రత్యయం ఏకవచన బోధకమని భావించవచ్చు. ద్రావిడభాషల లింగబోధక ప్రణాళిక నిర్దుష్టం కానందువల్ల ఈ విధంగా వ్యాకరించటం సమర్థనీయమే.
3.30. అమహదేకవచనం : అమహత్తుల్లో కూడా ప్రథమైకవచన ప్రత్యయం చేరనివి, చేరినరూపాలూ చేరనిరూపాలూ రెండూ ఉన్నవి కనిపిస్తాయి, ఉదా. (i) ప్రత్యయాలు చేరనివి: వేపుర (EI 14. 153-55.3, 145-46), పణ్టూర (పై. 6.315 19.24,244), కొట్టూరు (సర్కార్ 1942,1.256-57.19, 330-75), .
తాన్ఱికొన్ఱ (IA 9. 102-3.7,5), ఆణతి (EI 27.234-36. 15, 625-50), మొ. అనేకం. (ii) ప్రత్యయరహితంగా, సహితంగా కనిపించేవి: (అ) దేశ్యాల్లో: ఇల్లు (SII 10.645,48 1060),
కోయిల-ము : (IA 13.50.57, 918-25),
రామడు (భారతి 7.297-318.44, 715-20), మడు-వు (CP 13/1908-9. 19,709); (ఆ) తద్భవాల్లో : దణ్డు (రా.ప.సం. 71- 72. 19,847), దణ్డు-వ్ (భారతి 5.618.7,897); (ఇ) తత్సమాల్లో ద్రమ్మ (తె.శ. 1.163-65.67,892-922): ద్రమ్మ-ము (JAHRS 1.81-85.3,10), (iii) ప్రత్యయాలతో కనిపించేమాటలివి కొన్ని : ఉదా. నాగ-బు(భారతి 5. 934.1,200), కొట్ట -ంబు-న (EI 27.225-28. 10,575-600), చే-ను (SII 6.585.10, 633-36), దేశ-ము (NI 3.1151.6,650), పురస్సరం. (EI 29.160-64. 4, 680), ప్రసాద - ф-చేసిరి(SII 10.609. 14,675-99), సాసన-వు (CP 10/ 1908-9.1,709), కిరన-మ్ము-న (భారతి 5.618. 5,850). పై నిదర్శనలను బట్టి-వు ప్రత్యయం ఎరువు మాటలమీదనే వచ్చేదని, అది క్రీ.శ. ఎనిమిదో శతాబ్దం నుంచి మాత్రమే కనిపిస్తుందని చెప్పవచ్చు. కొన్ని మాటలు -ము, -వు లు రెంటితోనూ దొరుకుతున్నాయి, ఉదా. పరిహార-ము (పై. 236-38.10-11,700-25): పరియారు-వు (రా.ప.సం. 71-72.19-20,847), ప్రాకార-ంబు(భారతి 5.618.11, 850): ప్రాకారు-వు (SII 10. 651.11, 1090-91). వీటినిబట్టి -వు చేరినప్పుడు ప్రాతిపదిక చివరి అత్తు ఉత్తుగా మారేదని చెప్పవచ్చు. -బు ప్రత్యయం లేఖకదోషమో పాఠక దోషమో కావచ్చు -ంబు ప్రత్యయమే అమహదేకవచనంగా ఉండి ఏడో శతాబ్దికి ఎరువు మాటల్లోను, ఎనిమిదో శతాబ్దికి దేశ్యపదాల్లోను -మ్/-ముగా మారింది. అజ్రహితంగా -ము ప్రత్యయాన్ని వాడటం ఏడో శతాబ్దికే స్థిరపడిపోయినా, పండితు లీనాటికీ దాన్ని దోషంగా పరిగణిస్తున్నారు. -ంబు వర్ణసమీకరణం వల్ల తొమ్మిదో శతాబ్దికే -మ్ముగా పరిణమించింది. చేను, కొలను వంటి శబ్దాల్లోని-ను ప్రాతిపదికలో భాగం కాదు. అది-ము ప్రత్యయానికి రూపాంతరమనవచ్చు. ము ప్రత్యయాంతాలకు లాగానే వీటికి 'ను' తో కలిసీ, కలియకా, బహువచనరూపాలుండటం ఒక కారణం. కెయమ్/కెయన్, కుళమ్/కుళన్ వంటి
పర్యాయరూపాలు తమిళంలో కూడా ఉండటం రెండో కారణం.
3.31. మహన్మహతీ బహువచనం: ప్రాతిపదికమీద -రు ప్రత్యయంచేరి మహన్మహతీ బహువచనరూపం ఏర్పడుతుంది. అప్పుడు తత్సమ ప్రాతిపదికల చివరి అత్తు సాధారణంగా ఉత్తుగా మారుతుంది, ఉదా. ఎవ్వ-ర్ (భారతి 23, 182-86.14, 641), వేవు-రు (EI 27.234-36.19, 625-50), దేవర (భారతి 9.461-67.1,8), మల్లు-ర (SII 10.614. 6, 8), మలిను-ర్ (శా.ప.మం. 1.2-3. 15,898-934), సంయుక్తు-ర్ (ఆం.సా.ప.ప. 24. 15870. తెలుగు భాషా చరిత్ర
62.4, 10). పై వాటిలోని చివరి మూడు మాటలూ గమనార్హాలు. కొన్ని సందర్భాల్లో మహదేకవచనంమీద -రు ప్రత్యయం చేరి (అమహత్తుల్లోలాగా) బహువచన రూపం ఏర్పడటం కద్దు. ఉదా. వాణ్-ర్ (SII 4,1015.12,1084), ఇరువణ్డ్-రకు (పై. 7). వీటిని కన్నడంలోని, 'అవ-న్' అవ-న్డ్-ఇర్, మగ-న్డ్-ఇర్, ఆళియ-న్డ్ -ఇర్, తాయ్వ్-ఇర్' వంటి మాటల్తో పోల్చినప్పుడు, ఈ విధానం విరళంగా నయినా ఇతర ద్రావిడ భాషల్లో ఉందని గమనించగలం. ఇదే లక్షణం 'చేనులు/చేలు' వంటి చోట్ల కూడా కనిపిస్తుంది.
3.32. మహదమహద్బహువచనం : మహదమహత్తులకు సాధారణమైన బహువచన ప్రత్యయం -లు. (ఇదిగాక అప్రాణివాచకాల్లో మాత్రమే కనిపించేది. -కు/-గు. ఇది-లు ప్రత్యయానికీ ప్రాతిపదికకూ మధ్యలో వస్తుంది). ఇందుకు కొన్ని నిదర్శనాలు: ఉదా. (i) ప్రాణివాచకాల్లో : ఆణపోతు-లు (వ్యా. నం. 301.10.2, 600-25), కన్న్య-ళ్-అను (NI 3.1152-55.49, 7) బో-ళు (SII 10.23 9,719-20 ), రాజు-ల్ల్-అ (EI 27.225-28.2, 575-600); (ii) అప్రాణివాచకాల్లో : ఆడ్-లు (5.935-48.8, 675), గుళ్-ళు-వు (NI 3-1152-55.44, 7), మ్రాం-కు-ల్-అ. (SII 4.1016, 1087), రేం-గు-ల్-అ. (రా. వ. నం. 187-89.16, 1018). చివరి రెండు మాటల్లోని-కు, -గు.లు పునరుక్తంగా వాడినవే. ళు పూర్వరూపం -లు తరవాతి రూపం. ఏడో శతాబ్దికే ళకారం లకారంగా మారిందని ఇంతకు ముందే (2.11) గ్రహించాం.
3.33. బహువచనంలో పదమధ్య సంధి : బహువచన ప్రత్యయం చేరినప్పుడు ప్రాతిపదికాంతంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. అవి అయిదు. విధాలు? (i) ప్రాతిపదిక చివరి-అ-ఇ-ఉ, లు లోపించగా సంయుక్తాక్షరాలేర్పటం : ఉదా. (i) అ లోపించినవి : మణునుఱ్ఱు (EI 27,225_26,14. 575-600), కఞ్చగార్లు (వై .30.69-71.8, 699-700), పెగ్గడ్లు (AR. 1933, II AP.B, 56.7.1072); (ii) - ఇ లోపించినవి: గుడ్లు (SII 6.585.2, 633-63), కోమట్లు (పై. 4.1014,7,1038); (iii) ఉ లోపించినవి : ఏణ్డ్లు (EI 4.314-18 17, 1075-76). నంజుండ్లు (SII 4.1015.9.1084). (2) ప్రాతిపాదిక చివరి అచ్చుతోబాటు దానికి ముందున్న ణ,ఱ, య,వ లు కూడా లోపించటం, ఉదా. (i)-ణ లోపానికి బ్రాహ్మ-ల (పై 2. 10.645.59, 1060); (ii) -ఱ లోపానికి: కూన్తు-లున్ (పై. 647.41,1097); (iii) -య లోపానికి: బో-ళ్ (EI 18.1-4.29, 663), వ్రా-లు (SII 6.250.7, 742-98); (iv) -వ లోపానికి: మోదొ-లు (పై. 593.6,709-46), గురు-లు (పై. 10.645.52, 1060); (3) ప్రాతిపదిక చివరి అ,ఇ కారాలు ఉకారంగా మారటం: ఉదా (i) -అ>-ఉ: సోము -ళ (NI 3.1152-55.23,7): (ii) -ఇ>-ఉ: దేవు-లు (SII 10.596.5, 929-50). ఈమార్పు కేవలం ఎరువుమాటల్లోనే నిత్యంగా జరగటం గమనించ దగ్గది. (4) ప్రాతిపదిక చివరి ము ప్రత్యయలోపంతో బాటు తత్పూర్వ స్వరానికి దీర్ఘత రావటం : ఉదా. (i) ఏకవచనంలో: నరకా-నం (పై. 4. 14, 1008), రాజ్యా-నయు (భారతి 5. 796. 17,1023), భోగా-నకు (SII 10.644.78-79, 1060), లింగా- నకుం (NI 3.1072.16,1088), నిమిత్యా-న (SII 4.1300. 5,1095); (ii) బహువచనంలో: కుంచా-లు (పై. 1014.5, 1038), వర్షా-లు (పై. 10.60. 1, 1091). (5) ప్రాతిపదిక చివరి అచ్చు లోపించి తత్పూర్వ హల్లులు బహువచన ప్రత్యయంతో కలిసినప్పుడు వాటి గుణంలో (quality) కొన్ని మార్పులు వచ్చాయి. అందులో నాలుగురకాలు మార్పులు ఏడో శతాబ్దికి, మరో రెండు ఎనిమిది, పదకొండు శతాబ్దులకు చెందినవని గ్రహించవచ్చు. (i) రేఫ డకారంగానో శకటరేఫగానో మారటం, ఉదా. (అ) ఊడ్లందు (పై. 6. 585.10, 633-63), వడ్లు (AR 233/1949-504,8); (ఆ) ఆచాట్లు (SII 10 47.2,7), పుఱ్ఱనూఱ్ల (పై. 600.6-8,8); (ii) శకటరేఫ డకారంగా మారటం, ఉదా. ఆడ్లు (భారతి 5.935-48.8,675), మఱుతుడ్లు (SII 10.594.9-10, 925-50); (iii) డకారం 'ల/ళ' గా మారటం, ఉదా. గుళ్ళువు (NI 3.1152-55.44,7), రట్టగుళ్ళు (LI 27.234-36.14, 625-56); (iv) ద్విరుక్త టకారం అద్విరుక్తం కావటం, ఉదా. పుట్లు (SII 6.585.10,633-63), భట్లు (పై 10.6.12, 1043); ఇది సార్వత్రికమైన సంప్రదాయ వ్యాకరాణాలు ఈలోపాన్ని గమనించకపోవటం ఆశ్చర్యకరం. (v) లకారం డకారంగా మారటం, ఉదా. మంగడ్ల (పై. 6.250.7,742-98); (vi) నకారం జకారంగా మారటం, ఉదా. మ్రాంకుల (పె.4.1016.3, 1087), రేంగుల ర.ప.సం. 187-89.16,1018). ( vi) లేఖన సంప్రదాయానికి సంబంధించినవి కావచ్చు. 3.34. ద్వితీయా విభక్త్యంగనిర్మాణం: మహద్వాచక శబ్దాల ద్వితీయాది విభక్త్యంగం మూడువిధాలుగా ఉండేది. (1) ధాతువు, (బంధుత్వబోధకాలైన-అయ్యవంటి పదాంశాలు), బహువచన లకారం, విభక్తి ప్రత్యయం క్రమంగా చేరి ఏర్పడ్డవి, ఉదా. పాఱ-కు (EI 27.225-28. 10-11, 575-600), కత్తి-శమ్మన్-కు (పై, 231-234.7, 625-50), సోము-ɸ-కు (NI 3.1151.7-8,650). (2) ధాతువు, ఏకవచన సూచకమైన -(న్) ఇ/-న/ɸ, బహువచన లకారం, విభక్తి ప్రత్యయం క్రమంగా చేరి ఏర్పడ్డవి, ఉదా. భీము-న-కు (తె.శా. 1.163-65.3,892-922). (3) పైవిధంగానే ఉండి బహువచనంలో రేఫకలవి, ఉదా. వా-ని-కి (EI 11.337-47.20,725), ఇరువణ్డ్-ర-కు (SII 4.1015.7, 1084). అమహత్తుల ద్వితీయాది విభక్త్యంగం మూడు విధాలు. (1) ధాతువు, (మీద -పఱువంటి స్థలవాచకపదాంశమూ), దానిమీద ఏకత్వ సూచక '-న/ɸ, ఆ మీద బహువచన లకారం, ఆ తర్వాత విభక్తి ప్రత్యయం కలవి, ఉదా. చిఱుంబూర్-ఇ (EI 27.221-25.6, 575-600), చెఱువు-ɸ-కు (SII 10.37.3,8), లింగా-న-కుం (NI 3. 1072.16,1088), (2) ధాతువు, 'ము/-వు', 'న/ɸ-ను', బహువచన లకారం, విభక్తి ప్రత్యయం వరసలో ఉండేవి, ఉదా. కొట్ట-ంబు-న (EI 27.225-28. 10,575-600), ధమమ్మున్-వు-ల (తె.శా. 1163-65.56, 892-922). (3) ధాతువు, ఆదేశాగమాత్మకాలైన 'త,ట,ణ్డ/ఇɸ, బహువచన లకారం, విభక్తి ప్రత్యయం వరుసగా ఉండేవి, ఉదా. ఏణ్-టన్ (భారతి 23. 182-86.5,641), నూ-ట-ɸ (SII 10. 6-7, 1043), నూఱింటి -కి (పై. 5. 23. 10, 1094), విత్వఱ్ -తి (పై. 6.585.10, 633-63). ఈ ఔపవిభక్తికాలు చేరని నూయి-ని (పై. 10.595.14, 925-50) వంటి రూపాలు కూడా విరళంగా కనిపిస్తాయి. ఈ ఆరు విధాలయిన నిర్మాణక్రమం గల ప్రాతిపదికలే షష్ఠీవిభక్తి సూచకాలుగా, విశేషణాలుగా, ఉపయోగ పడతాయి. పైవాటిలో నప్రత్యయరహితమైన సోముకు, చెఱువుకు గమనార్దాలు.
3.35. ప్రథమేతరవిభక్తులు: ద్వితీయావిభక్తికి 'ɸ, న్,ని,ను,మ్,నిం,ము' అనే సపదాంశాలు ప్రత్యయాలు. ఉదా. దేవి-ɸ (భారతి 23. 182-86.13, 641), దీని-న్ (శా.ప.మం. 1.2-3.34,898-934), కన్న్యళ-ను (NI 3.1152-55.49,7), రడ్డి-ని (SII 6.250.5,742-98), నాణ్డి-ని (భారతి 5.473-84.6,848), చోఱ-నిం (పై. 8188,893), తమ్-ము (El 30.278-80.4,825). చివరి వర్ణసమీకరణంవల్ల నకారం మకారంమైన రూపం.
'-న,-ం' లు తృతీయా విభక్తిని సూచించే సపదాంశాలు. సప్తమీ ప్రత్యయంతో వీటికి ధ్వనిసంబంధంగా, అర్థసంబంధంగా పోలిక ఉంది. నకారం తృతీయా ప్రత్యయంగా క్రీ.శ. 9/10 శతాబ్దినుంచి మాత్రమే వాడుకలోకి వచ్చింది. కాని పదకొండో శతాబ్దివరకు దీనికి అంత ప్రాచుర్యం కాని, నియతో వయోగంకాని కనిపించదు, ఉదా. పరాక్రమంబు-నన్ (తె.శ. 1.163-65.9-10,892-922), అంగంబున-ం (EI 30.280-84. 13, 972). 'చేత, చేతం, తో, తోన్, తోడ, తోడం, తోఱన్' అనే అనుబంధాల నుపయోగించి తృతీయావిభక్త్యర్ధాన్ని బోధించేవారు, ఉదా. బోళ-చేత (ఆం.ప. 1941-42.14-15.2,600-25), చోడుళ-తోడ (SII 10. 626. 4, 848-92), నలరామనిభు-తోఱన్ (భారతి 5.618. 5,897), పదువ-తో (పై. 473 84. 5,848), వైదుంబుళ-చేతం (SII 10.640. 4,9/10), మణ్డ-తోన్ (రా.ప.సం 25-29,8-9, 1065), మెచ్చు-తోడం (EI 4.314-18.28,1075-76). పర్యాయరూపాలైన 'తో' తోడ' మొ. సహార్థ బోధకాలు; చే(త) మొ. కర్తృబోధకాలు.
74
తెలుగు భాషా చరిత్ర
వాదిస్తారు. 'పొణ్ఠె' నన్నయకు తరవాతి కావ్యభాషలో కూడా చాలా విరళంగా ఉండేది.
'మిన్ద, మీన్ద, మీద; కడ; పై;' అనే అనుబంధాలు మాత్రమే పంచమ్యర్థ సూచకాలుగా శాసనభాషలో కనిపిస్తాయి. ఉదా. మహి-మిన్ద (SII 6 585.1,633-63), గుడి-మీన్ది (పై.4.1014.6,1038), మీద (పై.10.605.8.8); భూపాదిత్యుల-కడాన్ (పై. 604. 22,10). భూసతి-పై (EI 4.314-1817, 1075-76). ఈ శాసనాల్లోనే 'పై' స్వతంత్ర శబ్దంగా కూడా ప్రయుక్తమయింది. ఉదా. పై-లేచిసేన (భారతి 5.473 84.4, 848), పయ్ -వారల (శా. ప. మం. 1.2-3 18, 899-934) షష్టీసూచకమైన ప్రత్యేక విభక్తి ప్రత్యయం కనిపించదు. ద్వితీయాది విభక్త్యంగమే షష్టీవిభక్తిసూచకంగా ఉండేది.సప్తమ్యర్థంలో 'Ø, (౦), అన్, న' అనే పదాంశాలు, 'అందు, ఒళన, లో (౦), లోన, లోపలి, ళోన' అనే అనుబంధాలు శాసనభాషలో ఉన్నాయి. ప్రత్యయాలకు ఉదాహరణలు : వారనాశి-Ø (SII 10.611.2-3, 8), తిర్పలూర్-అ (EI 27.231-34.7-8, 625-50), బెజవాడ్-అం (శా. ప. మం. 1.2-3.27, 898-934), అన్వయంబు-న (భారతి 23.182-186.13-14, 641). హలంత ప్రాతిపదికమీద ఆజాది ప్రత్యయాలూ, అజంత ప్రాతిపదిక మీద హలాది ప్రత్యయాలూ పర్యాయ ప్రవృత్తిలో ఉన్నాయి. ఆనుబంధాలకివి ఉదాహరణలు : ఊడ్ల్-అందు (SII 6.585 9, 633-63), రాజుల్ల్-ఒళన- ఆం. ప. 1941-42.1,600-25), ఆజి-లోం (భారతి 5.618.7, 897), భూమిలోన (పై. 15.850 ), కయ్యంబు-ళోన (SII 10 623.7-8, 9/10), డొంక-లోపలి (త్రిలింగ రజతోత్సవ సంపుటి 352-64.17,991), పైవాటిలో 'ఒళన>ళోన>లోన' ఉత్తరోత్తరం ఆర్వాచీనమైనవి. మూలద్రావిడం లోని *ఉళ్/ఒళ్ ధాతురూపం క్రీ. శ. ఏడో శతాబ్ధిదాకా తెలుగులో నిలిచి ఉండటం విశేషమే. ఈ శాసనాల్లోనే 'లోపు' స్వతంత్ర శబ్దంగా క్రీ. శ. పదకొండో శతాబ్ది శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా. 'పల్లికి లోపైన ఇల్లకు ... (SII 10 651. 14. 1090-91), వెలకుంగొని విడిచిన యిల్లు లోపుగా ... (పై 13), పెడరు-లోపుగా యిల్లుపట్టు పై. 4.1161.11, 1082), ... బోయుణ్డును లోపైన
ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం
75
యావ్వు౯రుబోల,. ( పై. 1008.12,1047 ). 'లోపల' శబ్దాన్ని 'డాపల, వలపల, వెలుపల 'శబ్దాలతో పోల్చినప్పుడు* -పల అన్నభాగం ప్రత్యయమేమో ననిపిస్తుంది. విడిగా 'లో' శబ్దం వాడుకలో ఉండటం ఈ అనుమానానికి బలమిస్తున్నది.
3.36 నిర్మాణ క్రమాన్ని బట్టి సర్వనామాలను విశేష్యాలను ఒక్కటిగనే భావించాలి. ఇవి ముఖ్యంగా మూడు రకాలు. లింగవచన సూచకాలుగల నిర్దేశ సర్వనామాలు ఒకరకం. అట్లు మొదలైన అవ్యయాలూ, అది, ఆమె, వాడు మొదలైన 'విశేషణాలూ' ఈ రకానికి చెందినవి. లింగబోధలేని ఆత్మార్థక, పురుషవాచక, సర్వనామాలూ రెండుమూడు రకాలవి. ప్రశ్నవాచక సర్వనామాలు మొదటి రకానికి చెందినవే. అ, ఇ, అనే ప్రాతిపదికలనుంచి ఏర్పడ్డ నిర్దేశ సర్వనామాలు కొన్ని మాత్రమే శాసనభాషలో కనిపిస్తాయి. ఉదా. మహన్మహతీవాచకాలు : ఏక వాన్ఱు (పై. 10.606.18-19, 600-25); వాణ్డు (పై. 599.33,625-50); వాని ( EI 11.337-29. 725):- ఆతణ్ణ్ ( భారతి 5 618.11.897 ); ఆతని (తె. శా. 1.169-65.53. 892-922) ; వీని (SII 10.59 10.1039). వీన్ఱి (పై. 628.8 825).
బహు, వారు (పై. 607.10,575-600); వారల (శా.ప.మం. 1.2-3.18. 898-934); వీరి (SII 10 3-4,8) ; వీరల (పై. 605.8.8).
(ii) అమహద్వాచకాలు : ఏక. (ఇచ్చిన్) అది (EI 27.234-36-16. 625-50); దానిక (శా. ప. మం. 1.2-3. 41, 898-934) ; ఇది ( SII 10.598.32, 925-56); దీని (పై. 606.17,600.25); దేని (భారతి 23.182- 86.13,641).
(iii) ఇన్ఱు (SII 10.45.2.7); ఇన్దు (తె. శా. 1.163-65.74, 892-922); ఇన్దుల ( NI 1,245.3,10 );. ఇన్దోఱు (ఆం. ప. 1941.42-14-15.4, 600-25); ఇన్దూఱు (SII 10.600.7-8, 8).సర్వనామాల నిర్మాణక్రమం : పై వాటిలోని'వీన్ఱి'నేటి'వీడి' (< *వీణ్డి)కి పూర్వరూపం. *ఇదని అనే పూర్వరూపం నుంచి ఏర్పడ్డ 'దీని,దేని' అనే వాటిలో 'దేని' అనేదే సాధారణ రూపమైనా, *ఎదని నుంచి ఏర్పడ్డ 'దేని'తో సమానరూప
76
తెలుగు భాషా చరిత్ర
కత్వాన్ని పరిహరించేటందుకు వాడుకనుంచి తొలగిపోయింది. వాడుకలో ఉన్నంత కాలం దక్షిణాంధ్రంలోనే మాండలికంగా ఉండేది. నేటి 'ఇందరు' శబ్దానికి పూర్వరూపమైన 'ఇన్దోఱు/ఇన్దూఱు'లోని - దోఱు, వ్యక్తులనే అర్ధంగల ప్రత్యేకశబ్దమేమోనని కొండభాషలోని డోఱు శబ్దాన్ని బట్టి ఊహించవచ్చు. 'వాణ్డు' కన్నా 'ఆతణ్డు' అనేది గౌరవాధిక్యసూచికంగా కనిపిస్తుంది. -న్ఱు> - ణ్డు అనే ధ్వని పరిణామంగల 'వాన్ఱు' ఏకవచన బోధకమేగాని వేరుకాదు. అందులోని శకటరేఫ బహువచన ప్రత్యయమన్న పూర్వాభిప్రాయం (సోమయాజి 1948) ప్రామాదికమే. క్రియాన్వయాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఉదా. తేని 'ఱిచ్చినవాన్ఱు పఞ్చమహాపాతకు న్ఱకున్ (వ్యా. సం. 301-310.3-4, 600-25), వచ్చిననాన్ఱు ఞ్చమహాపాతకు అగు (EI 27.228-29.7-8, 600-25) మొదలైన వాక్యాల్లో వాన్ఱు బహువచనంలోనే ఉంటే క్రియాపదం 'అగుదురు' అని ఉండాలి. 'వారు' బహువచన రూపంగా అదేకాలంలో ఉండేదనడానికి ఱచువారు కళరేని (భారతి 5.935-48.12-13, 675) వాక్యాలు నిదర్శనాలు.
ప్రశ్నవాచక సర్వనామాల్లో రెంటికి మాత్రమే ప్రయోగాలు దొరికేయి. ఉదా. (i) మహద్వాచకంలో-ఏక. ఎవ్వణ్డ్ ( JAHRS : 81-85.7 10 ); -ఎవ్వాండ్ (SII 10-4 12, 1008 ); ఎవ్వర్ (భారతి 23.182-86.14, 641) (ii) అమహద్భహువచనంలో - ఎవ్వి (తె. శా. 1.163-65 54-55, 892-922).
పురషబోధక సర్వనామాల్లో ఉత్తమ, మధ్యమ, పురుషైక వచనాలకు మాత్రమే ప్రయోగాలు దొరుకుతున్నాయి. (i) ఉత్తమపురుష : ఏ (పై. 48); నా (పై. 26); నే (పై. 48); నాకు (SII 6.584 5, 641); (ii) మధ్యమపురుష : నీవు (తె. శా. 1.163-65. 26,892.922); నీ (పై 27).ఆత్మార్థకనామాలు దొరికినవి ఇవి : ఏక. తాన్. (శా.ప.మం. 1.2-3.40) 898-934); తన ( NII 287.2. 650 ); తనక (తె. శా. 1.163-65.44 ), 892-922), తన్ను ( NI 1 287.4, 650 ); బహు, తారు. (శా.ప.మం 1.2-3.40, 898.934); తమకు (పై. 21); తమ (తె.శా. 1.163-65 41, 892-922), తమ్ము ( EI 30.278-80.4. 825). ) *తమ-ను వర్ణసమీకరణం వల్ల 'తమ్ము'గా తొమ్మిదో శతాబ్దికే మారటం గమనార్ధం.
ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం
77
3.37. సార్వనామిక విశేష్యాలు : నామధాతువుకు పురుషబోధక ప్రత్యయాలు చేరి విశేష్యాలు ఏర్పడటం తెలుగువంటి ద్రవిడభాషల్లో ఒక విశిష్టత. ఈ శబ్దాలకు కొన్ని సమయాల్లో (నామ) విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. పురుషబోధక ప్రత్యయాలు చేరిన క్రియలు కాలబోధకాలుగా ఉంటాయిగాని ఈ శబ్దాల్లో అలాంటి స్ఫురణలేదు. శాసనభాషలో రెండురకాల సార్వనామిక విశేష్యాలు లభించాయి. (i) నామవాచకం మీద మధ్యమ పురుషైకవచన ప్రత్యయం చేరినవి. ఉదా. ప్రాణసమానుణ్డ్-అవ్ - (తె. శా. 1.163-65. 26-27, 892-922). చెలి-వి (పై. 27) (ii) సర్వనామం మీద నిర్దేశ సర్వనామ ప్రత్యయం చేరినది. ఉదా. వాన్ -ఇద్-అ (JAHRS 1.31-85 7, 10).
3.38. సంఖ్యావాచకాలు : నిర్మాణక్రమానిబట్టి సంఖ్యావాచకాలు విశేష్యాల వంటివే. ఇవి ప్రాథమిక సంఖ్యావాచకాలని, సార్వనామిక విశేషణాలని, రెండువిధాలు. ప్రాథమిక సంఖ్యావాచకాలకు 'అగు' ధాతురూపాలను చేర్చినప్పుడు ఏర్పడే సార్వనామిక విశేషణాలు ఒకరకం. అస్వతంత్రమైన సంఖ్యావాచక విశేషణ ప్రాతిపదిక లింగవచనబోధక ప్రత్యయాలను చేరిస్తే ఎర్పడేవి మరోరకం. విశేషణ రూపాలేర్పడేటప్పుడు కొన్ని సమయాల్లో సంఖ్యావాచక సర్వనామధాతువులోని దీర్ఘస్వరం హ్రస్వమవుతుంది. ప్రాథమిక సంఖ్యావాచకాలనూ, సార్వనామిక విశేషణాలనూ, పురుషబోధక సంఖ్యావాచకాలనూ క్రమంగా నిర్దేశిస్తాం. ఉదా. 1.ఒకొటి (త్రిలింగ రజతోత్సవ సంచిక 352-64.9-10, 991), పకొట్టి (SII 10.614.6,8 ); ఒక (తె.శా. 1.163-65.24, 892-922), ఒణ్ణు (శా.ప.మం. 1.2-3.24. 893-934); ఒరుల్ (పై. 10-11), వీటిలో మొదటిది *ఒకణ్డు అనే అర్ధంలో ప్రయుక్తమయింది. అంటే ఔపవిక్తికరూపం ప్రథమారూపంగా వాడుకలోనికి వచ్చిందని.2. రెణ్డు (EI 27.234-36.11, 625-50), రెంటి-కి (SII 5.23.8, 1094), ఇన్-మడి (రా.ప.సం. 187-89.6, 1018), ఇర-వది EI 27.225-23.13,575-600), ఇరు-పఱయది ఏను (AR 392/1904.11-13-575-600), ఇద్-దఱు (SII 5.1033. 7, 1098), ఇరు-వురు (పై. 6.593.3.4, 703.46) ఇరు-వణ్డ్రకు (పై. 4.1015.7, 1084). 'రెండు' కు విశేషణార్థంలో 'ఇను, ఇర, ఇరు' అనే రూపాంతరాలున్నాయి. మీది హల్లుతో
78
తెలుగు భాషా చరిత్ర
కలిసి వర్ణసమీకరణం పొందినప్పుడు దీనికి 'ఇద్' అనే రూపాంతరం కలిగింది. 'ఇన్మడి' తరవాతి కాలంలో 'ఇమ్మడి' అయింది.
3. మూన్ఱ్ (పై. 10. 217.4, 745-801), మూను (EI 203-206.10, 850), మూణ్డు (SII 10-6. 8-0, 1043 ), మూడ్ (పై. 5.12.3, 1074) 'మూటి- (పై. 6.584.6. 641, మూణ్టి-కి (పై. 10.6.6, 1043 ); ము-న్నూఱు ( EI 27.234-36.13, 625-50), మూ-నూర (SII 10.37.1, 8); ము-మ్మడి (పై. 6.9,1043); ము-వ్వుర (ఆం.ప. 1941-42. 14-15.2,700-25). విశేషణరూపాల్లో మీదిహల్లు ద్విరుక్తమైతే ధాతుగతదీర్థ౦ వ్రాస్వం కావటం, అద్విరుక్తమైతే మారకపోవటం గమనించాలి.
4. నాల్కు (EI 27 225-28.13-14 575-600), నాలుగు (NI 3.1151 6-7, 650), నాల్-ఉను (AR 182/1933-34. 2.41. 2-3, 7); నల్-తుముడ్లు (AR 233/ 1949-50.9, 8); నల్-వురు (రా.ప.సం. 187-89.25, 1018).
5. ఏను ( SII 6,585.10.633-63 ) అన్న రూపమొక్కటే దొరికింది.
6. ఆఱు (భారతి 23.182-6.11, 641), ఆర-వాద్యది (తె. శా. 1.163-65.59-60. 892-922), ఆఱు-వది (రా.ప.సం. 187-89.92. 1018), ఆర్ -వ్వురు (SII 4-1014.2, 1038).
7. ఏఱు (EI 11,337-47.9, 725), ఏడు (SII 6.250 4, 742-98). విశేషణరూపాలు దొరకలేదు.8. ఎణ్బొది (భారతి 23.182-86.5, 641), ఎణుంబొది (SII 6,534.3, 641), ఎనుబొది (భారతి 5.473-84,10, 848 ), ఎణ్మ (SII 10.29.26,971), ఎన్మిది (పై. 6.102.19,1006), ఎనమ్-అణ్డకును (పై. 10.29.8, 971). ఎనిమిది తొమ్మిది శబ్దాల వుతృత్తి స్పష్టంకాదు. ఎనిమిది పూర్వరూపాల్లో ణకారయుక్తమైనవి ప్రాచీనరూపాలు; నకారయుక్తాలు అర్వాచీనాలు. మూలదక్షిణ ద్రావిడంలో *ఎణ్/ఎట్ (=8) అనే రూపాలున్నాయని ఊహించవచ్చు. కాని '-మ, -మిది' వంటి ప్రత్యయాల పూర్వరూపాలను పునర్మించటం సాధ్యపడదు. 'మిది' ఉన్న రూపాను తెలుగు కొలామీ గోండీలలోను, -'మ, ఉన్న రూపాలు తుళు తెలుగులోనూ కనిపిస్తాయి (DED 670). 'ఎణ్-బొది,
ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం
79
ఎణ్ -ఉం-బొది' వంటి ఏడో శతాబ్ది రూపాలనుచూసి 'ఎణ్' అనే ప్రాతిపదికనూ 'బొట' అనే ప్రత్యయాన్నీ సముచ్చయమైన 'ఉం' కలుపుతున్నదని భావించవచ్చు. 'మిది' కాలక్రమాన '-బొది'నుంచి ఏర్పడ్డదని కూడా ఊహించవచ్చు. 'తొమ్మిది' శబ్దంలోని -'మిది' తోటి సామ్యంవల్ల 'ఎనిమిది'లో 'మిది' చేరి ఉండవచ్చు. ఎనిమిది, తొమ్మిది శబ్దాలు రెండూ 'రెండు తక్కువపది, ఒకటి తక్కువపది' అనే పద్ధతిలో నిర్మితాలని, '-బొది, మిది' అనేవి 'పది' రూపాంతరాలని కొందరు భావించారు (సోమయాజి 1948,453-54). తొమ్మిది శబ్దం విషయంలో ఇటు వంటి నిర్మాణక్రమం కొన్ని ద్రవిడ భాషల్లో కనిపిస్తుంది. ఉదా. కన్న. ఒంభత్తు, ఒంబయ్; కొలామీ ఒంబయ్; తుళు ఒరుంబ; గోండీ ఉన్మా(క్), ఎడ్ము -( DEO 862, 2910) మొదలైనవి. అయితే ఎనిమిది విషయంలో ఈ విధమైన నిర్మాణక్రమం ఇతర భాషల్లో కనిపించటంలేదు.
9. తొమ్భ (పై. 6.102.17. 1006). తోంభ (రా.ప.సం. 187-89.8, 1018) అనే రూపాలే దొరికాయి. నేటి వ్యవహారంలో 'తొంబ' అంటే 'చాలా (మంది)' అనే ఆర్థం.
10. పది (CIT 2.6.11, 1079 ); పదు-నుఱ్ఱ (SII 10.627.12, 9/10). సమస్త శబ్దాల్లో దీనికి అనేక రూపాంతరాలుండేవి. ఉదా. ఇరవది ( EI 27.225-28. 13, 575-600 ), ఏ-బది ( పై. 228-29.4, 600-25), పణ్డ్-ఱెణ్డు ( SII 10 599.21, 625-50) ఎణ్-బొది (భారతి 23.182-86,5,641 ), పద్-ఏన్ ( పై. 5.735-48.8,675 ), ఇరు-భది (SII 10.245, 682); పన్-దుంబు (AR 182/1933-34. Pt II 41.3-4,7), ము-ప్పది. ( SII 10.217.4, 745-801 ), ఎణ్-మ ( పై. 29.26, 971), నళ్-పాద్-యది (త్రిలింగ రజతోత్సవ సంచిక 352-64.9.991), ఎన్-మిది (SII 6.102.19, 1006 ), నల్-వొది ( రా.ప. సం. 187-89.4, 1018 ), ఏం-భయ్ (SII 5.79-7, 1094). ఆయా రూపాంతరాలకు కారణమైన పరిసర లక్షణాలు స్పష్టంగా తెలియటంలేదు. పై ప్రయోగాల్లోని 'పదున్ఱు' అనేది *పదుణ్డ్రు అనే రూపానికి తప్పుగా రాసిన లేఖనప్రమాదం. చివరి రూపం నేటి 'యాభై' అనే వ్యావహారిక రూపానికి పూర్వరూపం.100. నూర (పై. 10.37.2,8), నూఱు (EI 27.234-36.13, 625-50), నూట (SII 10.6.7, 1043), నూఱింటికి (పై. 5.23.10,
80
తెలుగు భాషా చరిత్ర
1094), నూర్-వ్వురు (పై. 6.109.16, 1076).
1000. వెయి (NI 3.1152-55.46, 7); వేయు (SII 6.585 13, 633-63), వే-ల్ (పై. 10.4.13, 1008); వే-గ విలాళు (భారతి 5.935-48.14, 675), వే-వురు ( పై. 16), వే-వ్రు (SII 6 584.12, 641), వే-గురు (పై. 10.644.105, 1060).
ఇవిగాక సంఖ్యావాచకాలయిన ఎరువు మాటలు కొన్ని దొరుకుతున్నాయి. వాటిలో ప్రాకృతం నుంచి వచ్చిన దువ (=రెండు, EI 9.47.59, 945-46), తిణ్ణి ( =మూడు, IA 185-91.28,668-69 ), చౌ ( =నాలుగు, భారతి 5.618,3,850), బారస ( = పన్నెండు SII 10.645.10, 1060), సత్తిగ (=ఇరవై ఒకటి, పై. 6.102.5-6, 1006), పాతిక (= ఇరవై అయిదు, AR 75/1956-57.18, 1080), వంద ( = నూరు, SII 5.21.5-6,1078) మొదలైనవీ, సంస్కృతంనుంచి వచ్చినత్రి ( = మూడు, CP 13/1908-9,19, 709 ), నవ ( = తొమ్మిది, SII 5 1347.4, 1093), షస్టి( = అరవై, భారతి, 5.618 3, 850), నవతి ( = తొంభై. SII 5.1347.4, 1093), సహస్ర (ప్తె. కోటి (NI 2.607-7.8, 1074 ) మొదలైనవీ కనిపిస్తాయి. అర (SII 5.21.11, 1078 ) వంటి దేశ్యపదంతోను, అడ్డ (పై. 4.1014,4, 1036), ఆద (పై. 10.29.11, 971) వంటి ప్రాకృతపదాలతోను, అర్ధ (తె. శా. 1.163.65, 15,892-922) వంటి సంస్కృత పదంతోను సగభాగాన్ని నిర్టేశించేవారు.3.39. విశేషణాలు : విశేషణాలు అనేక విధాలు (1) విశేష్యాలకు ముందు మాత్రమే వచ్చే అస్వతంత్ర ప్రాథమిక విశేషణాలు ఒకరకం. ఆ, ఈ, ఏ- అనే త్రికం ఈరకానిది. క్రీ. శ. : ఏడో శతాబ్దినుంచి పదకొండో శతాబ్ది దాకా త్రికసంధి వైకల్పికంగానే ఉండేది. త్రికంమీది హల్లు ద్విత్వమైనప్పుడు త్రికదీర్ధ స్వరం వైకల్పికంగా హ్రస్వమయ్యేది. ఉదా. అ-బసిణ్డి (JAHC 3.16-21. 16-17, 678). అ-బ్బారణాసి (శా.ప.మం 1.2-3.12-13, 898-934), ఈ-ఊడ్లందు (SII 6.585. 9, 633-63 ). ఇ-య్యొట్టు (శా. ప. మ. 1 2-3,14, 898-984 ), ఇ- ప్ప్రతిమ (SII 10.633.3,3 ), ఎ-వ్వర్ (భారతి 23.182-86, 14, 641). ఇక్కడి ఆగమ యకారమూ సంయుక్త హల్లులోని
ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం.
81
మొదటిహల్లూ ద్విరుక్తం కావటం గమనించాలి. (2) విశేషణంగావాడే ద్వితీయాది విభక్త్యంగం రెండో రకం: (3) సంఖ్యావాచక విశేషణాలు మూడోరకం. (4) -ఎణ్డు/-ఎడు అనే మానార్థక ప్రత్యయాలు చేరిన విశేషణాలు నాలుగోరకం. ఉదా. మాన్-ఎణ్డు ( SII 10.29.9-10, 971), మాన్-ఎడు (పై. 5.12. 11, 1074). (5) విశేష్యంమీది ము ప్రత్యయ స్థానంలో వినిమాయక పదాంశమైన 'పు' వర్ణకం చేరిన విశేషణాలు అయిదోరకం. ఉదా. వేవ్-ఊర్ (EI 14.153-55.3, 145-46), వేం-బళ్ళి (పై. 30.280-84.6, 972). ఈ విశేషణాలు బహువిరళంగా ఉండేవి. (6) ఆజంత విశేష్యంమీద అజాది విశేష్యానికి ముందు టుగాగమం కాగా ఏర్పడ్డ విశేషణం ఆరోరకం. ఉదా. ఇరుకు-ట్-ఊరి (పై. 31.74-80.39-40;669). (7) విశేష్య విశేషణ లక్షణాలు రెండూ కలవి ఏడోరకం. ఉదా. ఉరుపు-పల్లి (పై. 3.277.17, 466). (8) కేవలం విశేషణంగా మాత్రమే ప్రయోగింపబడేవి ఎనిమిదోరకం. ఉదా. చెఞ్ + చెరుప్ (భారతి 1.110-22.13-14, 315-410), చిట్ట్-ఏరు. (JAHRS 5.51-56.19,763). (9) క్రియాపదాలుగా కూడా ఉండే ధాతుజ విశేషణాలు తొమ్మిదోరకం. ఉదా: (i) భూతకాలిక విశేషణాలు-ఇచ్చిన (EI 27.225-28.4, 575-600), ఉపేక్షించిన (శా. ప. మం. 1.2-3.20, 898-934), (ii) తద్ధర్మార్థకవిశేషణాలు : మను-వాణ్డు (SII 10.599.33,625-50 ). వక్రంబు రాదెంచు-వేర (పై. 35.5-6, 10). ఇక్కడి 'రాదెంచు' అనే రూపం గమనార్హం (iii) వ్యతిరేకార్థక విశేషణాలు : పెటని-వారు (పై. 633.2-3, 8), కొలది లేని-కొట్టంబుల్ భారతి. 5.792.11,848-49).
ఇవిగాక నామవాచకం మీద అగుధాతు భూతకాలిక విశేషణరూపం 'అయిన' చేర్చి నిర్మించిన విశేషణాత్మక పదబంధాలు చాలా విరళంగా కనిపిస్తాయి. ఉదా. ఉత్తమోత్తమున్ఱ్-అయిన (EI 27.231-34.4, 625-50). శాసనాస్థ నిదర్శనాలను బట్టి ఈ పదబంధనిర్మాణం క్రీ. శ. ఏడో శతాబ్దిలో కడప మండలంలో ఆరంభమై, 8-10 శతాబ్దుల మధ్యకాలంలో దక్షిణకోస్తాకు వ్యాపించి, పదకొండో శతాబ్దికి యావదాంధ్ర దేశంలో వాడుకలోకి వచ్చినట్టు తెలుస్తుంది. 3.40. అవ్యయాలు : మూడురకాల అవ్యయాలు శాసనభాషలో కనిపిస్తాయి. (1) విశేష్య ప్రాతిపదికకు 'కా' అనే అసంపూర్ణ క్రియారూపాలు చేరి ఏర్పడ్డవి. ఇవి అసంఖ్యాకం. (2) సర్వనామాలుగా భావించబడేవి. ఉదా. ఇఱ్ల(6)
82
తెలుగు భాషా చరిత్ర
( = ఇట్ల, (ఆ.ప. 1941-42.14-15.2, 600.25), ఏమి (తె. శా. 1.163-65.30, 892-922), అట్లు (శా. ప. మం. 1.2-3.41-42, 898-934), (3) అవ్యయ ప్రయోగంకల స్వతంత్ర శబ్దాలు ఉదా. మఱి (SII 6.585.1, 633-43), పిదప (పై. 4 922 2, 8), ఆర్థిన్ (శా. ప. మం. 1.2-3.7, 898-934), నెగి (పై. 10), మిణ్ణక (EI 30.280-84.14 972), పోలె (భారతి. 5.618.3, 850), తొల్లి (రా. ప. సం. 25-29.5,1065), పరువడి (పై.7). వీటిలో 'మిణ్ణిక' ఆనేది ఒకనాటి *మిణ్డు అనే క్రియకు వ్యతిరేకార్థక విశేషణరూపం.
3.41. క్రియలు : క్రియలు మూడువిధాలు : సామాన్య, సంకీర్ణ, సమస్త క్రియలని. ఏకధాతుకమైన 'ఆగు' వంటివి సామాన్య క్రియలు. ఇవన్నీ దేశ్యాలే. నామప్రాతిపదికమీద క్రియాకారక ప్రత్యయంచేరి ఏర్పడ్డ క్రియలు సంకీర్ణక్రియలు. ఇవి దేశ్యాల్లోనూ, ఎరువుమాటల్లోను ఉన్నాయి. ఉదా. (i) దేశ్యాల్లో : కట్ట్-ఇఞ్చ్-(భారతి 5.473-84.4, 848), ముఱ్చ్-ఇల్-(తె.శా. 1.163-65.59, 892-922); (ii) ఎరువుమాటల్లో : అనుభవ్-ఇంచు (పై. 22), ప్రవత్త్‌౯-ఇల్ల్- ( SII 10-23.2-3, 719-20). సమస్తక్రియలు. కేవలం దేశ్యాలే. ఇవి విరళంగా క్రీ. శ. ఎనిమిదో శతాబ్ధినుంచీ కనిపిస్తుండేవి. వీటిలో క్రియాప్రాతిపదిక మీద మరో క్రియాపదాంశంచేరి ప్రత్యేకార్థాలనిచ్చేవి, అస్వతంత్ర నామధాతువుమీద అనుబంధక్రియచేరి ఏర్పడ్డవి, అవి రెండురకాలున్నాయి. మొదటిరకం సమస్త క్రియలకు ఆయా అర్థాల్లో కొన్ని ఉదాహరణలివి : (1) వర్తమానార్థకం : ఏళుచ్-ఉన్ఱి ( 11 337-479, 725); (ii) భవిష్యదర్థకం: నడపం-గల (027 4.101528, 1084): (iii) ఆత్మార్థకం : అఱిసి-కొన్న (తె. శా. 1.168-65,71-72, 892-922); (iv) అనుజ్ఞార్థకం: మణం-జనదు (పై- 70-71; (v) ఆధిక్యార్థకం: రా-దెంచు (SII 10-35.5,10); (vi) కర్మణ్యర్థకం: కట్ట-బడిన (పై. 629.5-6, 825), (vii) నిశ్చయార్థకం : రక్షిమ్పను- వలయున్ (తె.శా. 1.163-65.49, 892.922). ఇక రెండోరకం సమస్తక్రియలు చే-కొని (భారతి 5.618.8, 897) వంటివి.3.42. అకర్మక సకర్మకాలు : అకర్మక క్రియధాతువుమీద '-చు' ప్రత్యయంచేరిగాని, '-ఇంచు' ప్రత్యయంచేరిగాని సకర్మకక్రియలు ఏర్పడతాయి. అకర్మకధాత్వంతంలోని '-చు' 'వు'గా మారినప్పుడుకూడా సకర్మకక్రియ లేర్చడ
ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం
88
తాయి. ఉదా. (i) అ.క్రి.ధా. + -చు: చెఱి-చిన (తె. శా. 1.163-65.75-58), 892-922), ఈ మార్పు జరిగేటప్పుడు ధాతుగత డకారం ఱకారంగా మారేది. ఇది క్రీ. శ. ఎనిమిదో శతాబ్దినుంచీ కనిపిస్తున్నది. (ii) అ. క్రి. ధా. -చు>-పుః చమ్-పిన (EI 27.234-36.20, 625-50), ఈ మార్పు జరిగేటప్పుడు ధాతుగతచకారానికి నకారం ఆదేశమవుతుంది. (iii) ఆ.క్రి.ధా. + ఇంచు: రా-వ్- ఇంచి (తె.శా. 1.163-65, 26 892-922).
3.43. ప్రేరణార్థకాలు ; ప్రేరణార్థకక్రియలు రెండు విధాల ఏర్పడేవి : (i) సకర్మకధాతువుకు -ఇంచు ప్రత్యయంచేరిగాని [ఉదా. కట్ట్-ఇఞ్చి (భారతి 5.473-84.4,848), కావ్ -ఇఞ్చి (EI 30.69-71.4, 699-700), సకర్మకధాతుగతమైన చకారానికి పకారాదేశంవచ్చిగాని [ఉదా. కుడి-పిన (పై. 27 280-31.6 625-50),
పం-పు (పై. 211-25.7-8, 575-600)]. ఈమార్పులు జరిగేటప్పుడు పకారానికి ముందు నకారం అదేశం కావటమో (ఉదా. చొచ్-చు>చొన్-పు), ధాతుగతచకారానికి ముందున్న నకారం మకారంగా మారటమో (ఉదా. పన్-చు> పమ్-పు) జరిగేవి.
3.44. ప్రాతిపదికల పర్యాయరూపత : పదమధ్యసంధి : కాలార్థక ప్రత్యయాలు చేరేటప్పుడు క్రియాప్రాతిపదికల స్వరూపాల్లో కొన్ని రకాలమార్పులు వచ్చేవి.అవి పదమధ్యసంధులే అయినా ప్రాతిపదికల పర్యాయరూపత ఒకేచోట నిరూపించటంలో లాఘవ ముంది. కాబట్టి సంధి ప్రకరణంలోకాక వీటిని ఇక్కడే వివరిస్తున్నాం. ఈలాంటి మార్పులు ముఖ్యంగా ఎనిమిదిరకాలు. (1) భూతకాలిక ప్రత్యయాలైన ఇ, ఎలు గాని చేదర్ధక ప్రత్యయగతమైన ఇకారంగాని చేరినప్పుడు ధాతుగతయకారం సకారంగా మారేది. ఉదా. కేస్-ఇ. (పై. 30,69-71.5, 699-700), అఱిన్-ఇన (SII 10.599.25, 625-50), కేన్-ఇరి (పై. 47.2,7), వ్రాన్-ఎ (పై. 599.22, 625 -50), విడిస్-ఇన (శా. ప. మం. 1 2-3.15, 898-934). (2) ధాతుగతమైన ఉకారం ఇకారంగాను, ఇకారం అకారంగాను ప్రత్యయాదినున్న ఇ,ఎ,ల ముందు బహుళంగా మారేవి. ఉదా. (i) -ఉ>ఇ : కుడిప్-ఇన ( EI 27.230-31.6, 625-50), పొడిచ్>ఇ (SII 10.23.5, 719-20). ఉడిచ్-ఎ (భారతి 5.618, 897), చెఱిచ్ - ఇనను (తె. శా. 1.163.65.57-58, 892-922). ఈ మార్పుజరగని రూపాలు లేకపోలేదు. ఉదా. పొడుచ్-ఇ (SII 10.632.3, 725-75). (ii) 84
తెలుగు భాషా చరిత్ర
ఇ>అః కొలచ్-ఇ (పై. 6,250.7, 742-98), నడప్-ఇన (పై. 10.605. 15,8), కదప్-ఇనను (EI 30.280.84.14, 972). (3) ద్వితీయాక్షరగతమైన ఊనికలేని అచ్చులు లోపించటమో చ్యుతం కావటమో జరిగేది. ఉదా. నిల్స్ -ఇ (SII 6.585. 1, 633-63 ), నిల్ప్-ఎ (NI 1.287 4; 650), పల్క్-ఇన (EI 27.230 31.7, 625 -50 ), నిల్స్-ఇరి (SII 10.600.3-4, 8), నిల్-ఇనం (EI 11.337-47.23, 725). (4) ప్రత్యయాది ఇ, ఎ,ల ముందున్న ధాతుగతవకారం యకారంగా మారేది. ఉదా. పో-యె/పోయ్-ఎ. ( పై. 24.183-931.11, 825 ), పోయ్-ఇన (SII 6.102 23.24, 1006). (5) తుమర్థక ప్రార్ధనాద్యర్థక ప్రత్యయాలు చేరినపుడు ధాతుగతమైన అద్విరుక్త హల్లుకు ముందున్న అచ్చుదీర్థ౦గాను, ద్విరుక్తహల్లుకు ముందున్న ఆచ్చుహ్రస్వంగాను, పర్యాయరూపత పొందేవి. ఉదా. కొ-Ø-మ్మ్ (తె. శా. 1.163-65.32, 892,922 ), పో-Ø-మ్. (NI 8.245.5. 10), పొయ్య్-అ (SII 5.71.8-9. 1099 ). వీటిలోని 'పోము' అవ్యాకృతరూపమై 'పొమ్ము' సాధురూపంగా నిలిచింది; 'పోయ' సాధురూపమై 'పొయ్య' అసాధువై పోయింది. (6) తుమర్ధక ప్రత్యయం ముందున్న ధాతుతుగతచకారం వకారంగా మారేది. ఉదా. కావ్-అన్ (తె. శా. 1,163.65 73-74, 892-922). (7) 'ఈ'ధాతు తుమర్థకరూపం 'ఈయ్ అన్' ( పై. 44 ) అని కనిపిస్తుంది. ప్రత్యయాచ్చుముందు. యడాగమం జరిగిందన్నమాట. (8) ప్రత్యయాద్యచ్చు లోపించటంవల్ద ప్రాతిపదిక స్వరూపంలో వర్ణనమీకరణం జరిగి మార్చు వచ్చేది. ఇది రెండురకాలు (i) మన్-న (ప్రై. 74) వంటి రూపాల్లో పురోగామిసమీకరణమూ ఇడ్డ్-అ (శా. ప. మం. 1.2-3.41, 898-934). ఉన్న్-అ (భారతి 5.618. 12, 897), కొణ్న్-అ (SII 10.611.2.8) వంటి రూపాల్లో తిరోగామిసమీకరణమూ కనిపిస్తాయి.
3.45. భూతకాలిక సమాపక్రియ : భూతకాలిక సమాపక క్రియలకు ముఖ్యంగా రెండువర్గాల ప్రత్యయాలు చేరేవి. వాటిలో మొదటివర్గానికి చెందినవి 'ఇ, ఇతి, ఇన్, Ø ' అనే సపదాంశాలు. అందులో మొదటి రెండూ హలాది పురుష ప్రత్యయాలకు ముందురాగా, మూడోది అజాది పురుష ప్రత్యయాలకు ముందు వచ్చేది. నాలుగోది ధాత్వంత యకారానికి పురుష ప్రత్యయానికి మధ్య మాత్రమే వచ్చేది. ఉదా. ఇచ్ఛ్-ఇ-రి ( పై. 599.30.31, 625-50 ), ఇచ్చ్-ఇతి-రి. ప్రాచీనాంధ్రం : శాసన భాషా పరిణామం
85
AR 233/1949-50.8, 8), ఇచ్చ్-ఇతి-మి (SII 10-10-12, 1078), ఇచ్చ్-ఇన్-ఆణ్డు (AR 77/1956-57 14-15,1096), ఐ-0-రి (SII 6.102 35, 1006). పైవాటిలో 'ఇ' మధ్యమపురుష మహన్మహతీ బహువచనాలకు ముందువచ్చేది. -ఇతి- ఉత్తమ మధ్యమ పురుషల ఏకబహవచనాలకు ముందు వచ్చేది రెండోవర్గానికి చెందిన ప్రత్యయాలు 'ఇయె (న్) ఎ(న్-ఉ)' అనేవి పథమ పురుషైకవచనంలోను, ప్రథమ పురుషలోని ఆమహద్భహువచనానికి ముందూ వచ్చేవి. ఉదా :- ఇయె(న్) : పడ్ -ఇయె. (పై. 641.6, 8), పడ్-ఇయెన్ (పై. 632 3, 3,725-75) : -ఎ-: నిల్ప్-ఎ (NI 1.287.4,650); -ఎన్-:నిల్ప్-ఎన్ (భారతి 5.618 12,897), కట్ట్-ఎను (పై. 473-84. 7,848), -ఎన్- ప్రత్యయం బహుశా -(అ)న్ అనే పురషవాచక ప్రత్యయంతో కలిసి ఏర్పడ్డ సంసక్త సపదాంశం కావచ్చు.
3.46. క్తవదర్థకం : -ఇన, -న, ప్రత్యయాలు క్తవదర్ధంలో వచ్చే సపదాంశాలు. హలంతధాతువులమీద సాధారణంగా నిలిచే ప్రత్యయగత ఇకారం ధాతుగతయకారం తర్వాత నిత్యంగా లోపించేది. ప్రత్యయాచ్చు లోపించిన సందర్భాల్లో వర్ణసమీకరణంవల్ల వచ్చేకొన్ని మార్పులను ఇంతకముందే సూచించాం. ( § 3 43 ). ఉదా:- ఇచ్చ్-ఇన ( 27.225.28.4, 575-600 ), అయ్-న (పై. 24 183-93.5, 825), ఇడ్-అ (శా.ప.మం. 1 2-3 41,898-934).
3.47. క్త్వార్ధకం : క్త్వార్ధకంలో -ఇప్రత్యయం వచ్చేది. ధాతుగతయకా తర్వాత మాత్రం దానికి పాక్షికలోపం కలిగేది. ఉదా. అయ్-ఇ (EI 29 160-64.8, 680), ఆయ్ - Ø (శా. ప. మం, 1.2-3-27, 898-934). అయితే క్రీ. శ. ఎనిమిది తొమ్మిది శతాబ్దుల్లో కనిపించే పొడిచ్చి (SII 10,614, 7,8). పొడుచి (పై. 632.3, 725.75), పొడుచ్చి (పై. 626.4, 848-92) అనే రూపాలు ఆధారంగా మూలద్రావిడ భూతకాలిక ప్రత్యయం *-చి అప్పటికింకా నిలిచిఉందేమోనన్న సందేహం కలుగుతుంది. *పడియె.* పడె అనే భావితరూపాలకు బదులుగా శాసనాల్లో పడి-చె (పై. 629.9,835) వంటి రూపాలు కనిపించటం ఈ సందేహాన్ని దృఢపరున్తున్నది. ఈ రూపాలన్నీ రాయలసీమ దక్షిణ ప్రాంతాల్లోనే ఉండటం మరో విశేషం.3.48. తద్ధర్మార్థకసమాపకక్రియ : తద్ధర్మార్థక సమాపకక్రియలు రెండురకాల నిర్మాణంతో కనిపిస్తాయి : పురుషబోధక ప్రత్యయాలున్నవీ, లేనివీ.
86
తెలుగు భాషా చరిత్ర
(1) పురుష ప్రత్యయాలున్న వాటిలో '-తు. -దు, -డు, -0_' అనే సపదాంశాలు తద్ధర్మార్థక ప్రత్యయాలు, ధాత్వంతణకారం తర్వాత డాదిసపదాంశమూ, నకారం' తర్వాత తాదిసపదాంశమూ వచ్చేవి. ధాత్వంతాచ్చు తర్వాత దాది సపదాంశం కనిపిస్తుంది. 'కల' అనే అసంపూర్ణ క్రియమీద శూన్యసపదాంశం వస్తుంది. ఉదా. కొణ్-డు-మ్ (నేటి 'కొందుము'కు పర్యాయరూపం) (తె. శా. 1 163-65.34, 892-922), కొణ్-డ్-ఱు ( SII 10.633.4 8 ), కాన్-తు-రు (రా. ప. సం. 187-89. 20, 1018), ఉణ్డు-దు-రు (పై. 23), కల-Ø-ర్ (తె. శా. 1.163-65.72, 822- 922), కళా-Ø-ఱ్ ( EI 30.12.26.8). *కలవారునుంచి *కలారు అర్వాచీన కాలంలో ఏర్పడ్డదన్న సంప్రదాయవ్యాకర్తల ఊహ సరికాదని, కలరు కలారులు అన్యోన్యం పరిమాణాత్మక రూపాంతరాలని గ్రహించాలి (2) పురుష ప్రత్యయాలులేని తద్ధర్మార్థకసమాపక క్రియలలో -ఉ(న్) అనే అర్థక ప్రత్యయం కనిపిస్తుంది. ఉదాః-అగ్-ఉ (పై. 27.228-229.8. 600-25), వలయ్-ఉం (తె. శా. 1.163-65 30-31. 892-922).
3.49. తద్థర్మార్థక విశేషణం : తద్ధర్మార్థక విశేషణ ప్రత్యయాలు రెండు రకాలు: '-ఉ(న్)-,-Ø-'లు ఒకరకం; 'ఎడి,-ఎడు,-ఏ, -ఏట్టి'లు రెండోరకం. ఉదా. (i) పంప్-ఉ. (EI 27-221-25.7-8, 575-600), తెచ్చ్-ఉన్ (SII 4.1015.11. 1084), అన్-Ø (ఆం. ప. 1941-42.5,600.25), కల-Ø. (SII 6.585.11. 633-63 ), వణ్డ్ -ఎడి (పై. 4.1015.11, 1084), ఏళ్-ఎడు (శా. ప. మం. 12-3.30, 898-934). అ-ఏ (*అయ్యే అనటానికి బదులు తప్పుగా, SII 4.1029,10), 1100 ఆప్-ఏట్టి (*అనేటి అనటానికిబదులు తప్పగా, పై. 6 586.8, 1074). చివరి రెండు రూపాలనూ గమనించేది.3.50. విధ్యర్ధకం : నడుపునది (పై. 5.1144.7. 1069) అనే విధ్యర్థకరూపం ఒక్కటే లభించింది. ఇది ధాతుజవిశేషణంగా, విశేష్యాలకు ముందు వచ్చినప్పుడు విశేషణంగా, క్రియాపదంగా, కూడా భావించదగ్గది. నిర్మాణక్రమాన్నిబట్టి దీన్ని పురుషత్రయం చేరిన తద్ధర్మార్థక సమాపకక్రియగా పరిగణించవచ్చు. కాని ఆ క్రియారూపానికి దీనికిలాగా విధ్యర్థంలేదు. -అది అనేదాన్ని నిర్దేశసర్వనామ ప్రత్యయమని భావించవచ్చుగాని దీనికి పురుషబోధకత్వంలేదు. ప్రథమ మధ్యమ పురుషల్లో రెండు వచనాల్లోనూ ఇది ఒకే రూపంలో ఉంటుంది. కానీ
ప్రాచీనాంధ్రం : శాసనభాషాపరిణామం
87
ఉత్తమ పురుష రెండువచనాల్లోనూ దీనికి ప్రయోగంలేదు. 'ఉన్-అది' అనే ప్రత్యయాలద్వారా విధ్యర్థమిచ్చే క్రియాపదంగా వర్ణించవచ్చు. అందువల్ల దీని నిర్మాణ సంక్లిష్ణతను ఏదో ఒకవిధంగానే వర్ణించటం సరికాదు. దీనికి ఆధునిక రూపం 'నడిపేది'.
3.51. చేదాద్యర్ధకం '_ఇనన్, _నను' అనేవి చేదాద్యర్థక ప్రత్యయాలు. -నను లోని చివరి ఉకారం అపదాంశ మనవచ్చు. ధాత్వంతయకారం మీది ప్రత్యయాది ఇకారం లోపిస్తుంది. కొన్ని సమయాల్లో ఈ ప్రత్యయాద్యచ్చు లోపించి వర్జసమీకరణం జరిగినందువల్ల పదమధ్యసంధి కలుగుతుంది. ఉదాః కట్ట్-ఇనన్ (పై. 10.599 30, 625-50), కొణ్-ణన్ (పై. 631.8, 9/10), ఆయ్-ననుం (తె. శా. 1.163-65. 34-35,892-922).
3.52. ప్రార్ధనాద్యర్థకం : ప్రాతిపదిక పురుష ప్రత్యయాలమధ్య ఏ ప్రత్యయమూ చేరకుండనే ప్రార్థనార్థక క్రియరూపమేర్పడుతుంది. అలాంటి సమయాల్లో ధాతుగత దీర్ఘాచ్చుమీద అద్విరుక్త హల్లుగాని, హ్రస్వాచ్చుమీద ద్విరుక్తహల్లుగాని నిత్యంగా రావటం కద్దు. ఉదా కో-Ø-మ్మ్ ( పై.32), మను-Ø-ము (పై. 67), పో- Ø -మ్ (NI 1.245.5, 10).
3.53. తుమర్ధకం : -ఆ(న్), -అంగ మొదలైన సపదాంశాలు తుమర్ధంలో ధాతువులమీద చేరుతాయి. (o)గ అన్నది 'కా' అనే అసంపూర్ణక్రియారూపమే. ఇది ఉన్నా లేకపోయినా అర్థలోపంగాని భేదంకాని, లేదుకాబట్టి దీన్ని అంశాభాసంగానే పరిగణించాలి. ఉదా. ఏళ్-అన్ (EI 27.221-25 5, 575-600 ), ప్రవత్తి ౯ల్ -ఆ ( SII 10 23,2-3, 719-20), ఓప్ప్-అంగ (భారతి 5.473-84.3-4 848), నా-Ø (రా. ప. సం. 25-29.7, 1095). చివరిపదం *అనం అనే క్రియారూపంలో వర్ణవ్యత్యయం వచ్చినందువల్ల ఏర్పడ్డది. ప్రాతిపదికాంత దీర్ఘాచ్చుమీది ప్రత్యయాది అకారం లోపించింది.3.54. శత్రర్థకం : శత్రర్థంలో ధాతువుమీద చుప్రత్యయం వచ్చేది. ఉదా. ఏళు-చు (EI 27.231-34. 5-6, 625-650). శత్రర్థక క్రియారూపానికి ఉండు ధాతు రూపాలను అనుబంధించి వర్తమానకాలిక క్రియలను నిర్మించేవారు. వృత్తవర్తిష్యమాణ క్రియరూపాలు తెలుగులో డొంకతిరుగుండు నిర్మాణం వల్లనే ఏర్పడుతాయి.
88
తెలుగు భాషా చరిత్ర
3.55. వ్యతిరేకార్థక క్రియారూపాలు : తద్ధర్మార్థక సమాపక క్రియకు వ్యతిరేకరూపం ధాతువుమీద -(ఆ)దు అనే ప్రత్యయాన్ని చేర్చటంవల్ల ఏర్పడేది. ప్రత్యయాది అకారం హలంతధాతువులమీద నిలిచి అజంతధాతువులమీద నిత్యంగా లోపించేది. ఉదా. చన్-ఆదు (తె. శా. 1.163-65,71, 892-922), లే-దు (EI 30. 280-84.13, 972). ధాతువుకు -(అ)ని ప్రత్యయంచేరగా వ్యతిరేకార్థక విశేషణాలు ఏర్పడేవి. ఉదా. పెట్-అని (*పెట్టని-కి బదులు తప్పుగా, SII 10.633 2-3,8), లే-ని (భారతి 5.792,10,848-49). వ్యతిరేకక్త్వార్థక క్రియలు ధాతువుకు -(అ)క ప్రత్యయంచేరి ఏర్పడేవి. ఉదా. ఓప్-అక (తె. శా. 1.163-65.74, 892-922). లే-క్ (పై. 3-4). పై మూడురకాల వ్యతిరేకక్రియల్లోనూ ప్రత్యయాది అకారం హలంత ధాతువుల తరవాత నిలిచి అజంతాల మీద నిత్యంగా లోపించేది. ఈ లక్షణం సపదాంశాల పరిపూరక ప్రవృత్తికి చిహ్మమేగాని ప్రత్యయాద్యకారం వ్యతిరేకార్థకంకాదని సూచించదు. అయితే సంప్రదాయ వ్యాకర్తలు (బా. వ్యా. 8.32,37; 39:47; ముఖ్యంగా 20) ఈ అకారాన్ని ఎందుచేతనో అలా భావించలేదు.
3.56. వర్తమానక్రియ : శత్రర్థక క్రియలకు ఉండు ధాతురూపాలను చేర్చి వర్తమాన క్రియలను డొంకతిరుగుడుగా నిర్మించేవారు. ఉదా. ఏళుచ్-ఉన్ఱి (EI 11.337--47. 9, 725), చేయుచ్ - ఉన్న (తె. శా. 1.163-65.15-16,892-922), వాద్ది౯లుచున్-ఉణ్డు (*వర్ధిలుచుండు-కు బదులు తప్పుగా, త్రిలింగ రజతోత్సవ సంచిక 352-64.23, 991).
3.57. భవిష్యత్క్రియ : ధాతువు తుమర్థక రూపాన్ని ప్రాతిపదికగా తీసుకొని దానిమీద అసంపూర్ణక్రియ అయిన 'కల'ను చేర్చి భవిష్యత్కాల క్రియలను డొంకతిరుగుడుగా నిర్మించేవారు. ధాతుగత ద్రుతం తరవాత 'కల'నిత్యంగా 'గల'గా మారేది. ఈరకం క్రియలు క్రీ. శ. పదకొండో శతాబ్ది శాసనాల్లో మాత్రమే లభించాయి. ఉదా. ఓయం-గల (SII 4,1009.8-9,1092), పొయ్య-గల (పై. 5.71 8-9, 1099), ప్రతిపాలింపం-గల ( పై. 6.109.17, 1076). 'కల' స్వతంత్ర క్రియగాకూడా శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా. కల-యంతకును (EI 4.314-22, 1075-76).3.58. ఉత్తమ పురుష : ఉత్తమపురుష ఏకవచన క్రియలు శాసనాల్లో లభ్యపడలేదు. '-మి/-ము' అనే సపదాంశాలతోటి బహువచనరూపాలు దొరికాయి.
ప్రాచీనాంధ్రం : శాసన భాషాపరిణామం
89
ఉదా కోణ్-మ్ (తె. శా. 1.163-65.34, 892-922), ఇచ్చితి-మి (SII 10.10.12, 1078), పరిహరించ్చితి-మి (పై. 651.15-16, 1091-92), '-మి/-ము'ల ప్రత్యయాంతాచ్చుతో వ్యవస్థితమై ఉంటుంది; -ఇతి- తరవాత -మి గాను, -డు-/-*దు-ల తరవాత -ము- గాను కనిపిస్తుంది.
3.59. మధ్యుమపురుష : ప్రార్థనార్థక క్రియరూపాల్లో మాత్రమే మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయం లభించింది. ఉదా. కొమ్-మ్ (తె.శా. 1.163-65.32, 892,922), పో-మ్ (NI 1,245.5, 10), బహువచనరూపం ఒక్కటే దొరికింది. ఉదా. ఇచ్చితి-రి (AR 233/1949-50.8,8).
3.60. ప్రథమపురుష : లింగభేదంమీద ఆధారపడి ప్రథమపురుషలో భిన్న ప్రత్యయాలు కనిపిస్తాయి. ఏకవచనంలో మహదమహద్భేదంతోనూ బహువచనంలో ప్రాణివాచక అప్రాణివాచక భేదంతోనూ పురుషభేదక ప్రత్యయాలు దొరుకుతున్నాయి. విశేష్యాల్లో కనిపించే ఈఅన్వయం క్రియల్లోకూడా కనిపిస్తుంది. మహాదేకవచనంలో -(ఆ)ణ్డు అనే పదాంశం కనిపిస్తుంది. ఉదా. కల-ణ్డు (త్రిలింగ రజతోత్సవ సంచిక 352-64.31, 991), ఇచ్చిన్-ఆణ్డు (AR 77/1356-57, 14-15, 1096). వీటిలోని రెండోరూపం కావ్యభాషలో క్రీ.శ. పదమూడో శతాబ్ది నుంచి మాత్రమే కనిపిస్తుంది. *ఇచ్చినవాణ్డు నుంచి ఈరూపం ఏర్పడటం క్రీ. శ. పదకొండో శతాబ్దిలో గోదావరీ మండలంలో ఆరంభమైనట్లు తోస్తుంది. అమదేహకవచనంలో '-అది, -అదు -దు' అనే సపదాంశాలు కనిపిస్తున్నాయి. ఉదా. ఇచ్చిన్-అది (SII 10.599.16 625-50 ), చన్-ఆదు ( 1.163-65.71, 892-922), లే-దు (EI 30.280-84.13, 972), క-యది (SII 10.647.38, 1097). ఇకారత సపదాంశం వ్యతిరేకక్రియల్లోను, ఉకారయుతం తద్ధర్మవిశేషణాల్లోను రిపూరక ప్రవృత్తిలో ఉన్నాయి. ఆజంత ప్రాతిపదికమీది త్యయాద్యచ్చు నిత్యంగా లోస్తుంది. ప్రాతిపదికాంతంలోని అచ్చు తరవాత యడాగమం (కావ్యభాషలో లాగా) రావడంకూడా కద్దు.మహన్మహతీవచనంలోని '-రి/-రు' అనీ సపదాంశాలు పరిపూరక ప్రవృత్తిలో ఉన్నాయి. ప్రాతిపదిక చివరి ఇకారం తరవాత -రి ఇతరత్రా -రు పురుష ప్రత్యయాలుగా కనిపిస్తాయి. ఉదా. కేసి-రి (పై. 47.2.7) కొణ్డ్-ఱు (పై. 633.4,8), తాగి-రి (EI 337-47.19, 725), కల-ర్ (తె. శా. 1.163
90
తెలుగు భాషా చరిత్ర
65.71-72, 892 922). పోదు-రు (AR 390/1932-33.39, 1081), పోవుదు-రు పై. 18-19). 'కొణ్డు'లోని శకటరేఫ సంధికారణంగా ఏర్పడ్డది. అప్రాణివాచక బహువచన రూపం ఒకటి మాత్రమే దొరికింది. ఉదా. ఇచ్చిన-వి (SII 10.12.9, 1087).
3.61. ఏవార్ధకం : ఏవార్థకంగా -అప్రత్యయం మాత్రమే కనిపిస్తుంది. ఉదా. పాఱక్-అ (AR 392/1904.9-10, 575-600), చిర్పలి-య (EI 27.231-34.5, 625-50 ). అజంత ప్రాతిపదికమీద యడాగమం రావటం గమనార్హం. ఈ ప్రత్యయాన్ని పునరుక్తంగా ప్రయోగించటం కూడా అత్యంత విరళంగా ఉండేది. ఉదా. తాన్-ఆ-య (తె.శా. 1.163-65.42,882-922), ఈ లక్షణం కావ్యభాషలోనే నిలిచింది.
3.62. సందేహాద్యర్ధకం : అనిశ్చయ, సందేహార్థాలను సూచించే ప్రత్యయం -'(య్) ఏని(యు/న్)'. ఉదా. కలర్-ఏనియు (పై. 72-73), ఎవ్వి-యేనిన్ (పై. 54-55), ఎవ్వాండి-ఏని (SII 10.4.12,1008). -ఏని ద్రుతమా కళా అనే విషయం మీద సంప్రదాయపండితులు తీవ్రచర్చలు జరిపారు. (బా. వ్యా. 2.9;8.41,119; సోమయాజి 1948, పే. 307, 491, 552-54). క్రీ. శ. 9/10 శతాబ్దినాటి ఒకేశాసనంలో రెండురకాల రూపాలూ కనిపిస్తున్నాయి (చూ.పై.). ద్రుతరహితరూపమే ప్రాచీనమైనది. అనుచిత విభాగంవల్ల దీనికే 'నేని' అనే రూపాంతరం కలిగిందని (సోమయాజి, 1948, 307), వాస్తవానికి 'నేని' అనేదే మొదటిరూపమని పండితులు నిర్ణయించుకొని కొన్ని సమయాల్లో పురాతన కావ్యప్రయోగాలను కూడా దిద్దివేశారు. కాని 'నేని' అని వ్యాకరించదగ్గ సందర్భమేదీ శాసనభాషలో తటస్థ పడలేదు.3.63. సముచ్చయం : సముచ్చయార్థక పదాంశం శాసనభాషలో విశేష్యాలమీద, క్రియలమీద, సందేహాద్యర్థక ప్రత్యయంమీద, సముచ్చయార్థాన్నే ఇచ్చే అవ్యయంమీద కూడా బహురూపాలతో వస్తుంది. ఉదా. (i) విశేష్యాలమీద : అన్నియు- (పై. 6.585.4, 633-63), కళాకణ్ణుగ్-ఉమ్ (పై. 584.9-10.641), గళ్ళు-వు (NI 3.1152-55), నాలు-సు (AR 182/1933-34, pt JI p. 41.2-3,7) (భారతి 1948, 270-90 369-75.65-66, 892-922) గుడి-యిని (EI 30.280-84.6, 972), గుడి-యింని (SII
ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం
91
6.586.7,1074); గావుండా-ను (AR 489/1915.5, 972)-దేవొనొజ్జలక్-ఊ JAHRS 1.81-85.4 10), ఎప్పుడి - ఊను (SII 10.4.8, 1008), నవి యునుం (పై. 4.1016 5, 1087); (ii) క్రియలమీద : ఐ-యుము (భారతి 23.182-36.14, 641); (iii) సందేహాద్యర్థకం మీద : కలరేని-యు (తె. శా. 1.163-65.72-73, 892-922); (iv) అవ్యయాలమీద : మఱి-యు (పై. 54), మఱి-యును (EI 30.280..84.10,972).. వీటిలో-'ఉము' అనే సపదాంశం 'ప్రాచీనతమం. ఇది -'ఉను'గా మారటం క్రీ. క. ఏడోళతాబ్దీలో ఆరంభమయింది. ఏడు, ఎనిమిది, తొమ్మిది శతాబ్దులో మ్మాతమే దీనికి -'ఉవు' అనే రూపాంతరం మాండలికంగా ఉండేది. హలంతపదాలమీద ప్రత్యయగతమైన '-ము, -ను' అనే భాగాలు 7-11 శతాబ్దుల మధ్య వైకల్పికంగా లోపించేవి. అదేకాలంలో అజంత పదాలమీద ఈప్రత్యయానికి ముందు యడాగమం వస్తుండేది. దీర్ఘాచ్చుగల '-ఊ -ఊను" లాంటి సపదాంశాలు.. నేటి రూపాలకు పూర్వరూపాలు. -'యి అనే సపదాంశ౦ తీరాంధ్రంలో 9/10.11 శతాబ్దాలమధ్య మాండలికంగా వాడుకలో ఉండేది. -'యింని' అనేది క్రి. శ. పందొమ్మిదో శతాబ్ది వ్యవహారంలోని '-ఇన్ని' అనే రూపానికి పూర్వరూపం.
3.64. తద్దిత ప్రత్యయాలు : నిష్పాదక ప్రత్యయాలు రెండు రకాలు : కృత్ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయీలు అని. చెరిఏడు ప్రత్యయాలను శాసనభాష నుంచి వ్యాకరించవచ్చు. '-(అ)రి,-ఇక, -ఇక(ము), -కాఱు, -గార్,-పల. -ఱు' అనే తద్ధిత ప్రత్యయాలను విస్పష్టంగా పేర్కోవచ్చు. (1) 'చేసేవాడు' అనే అర్థంలో -(అ)రి ప్రత్యయం కనిపిస్తుంది. ఉదా. తల-వ్-అరి (EI 20.1-7,21.61-71 B. 2.4,3), కమ్మ్-అరి (పై. 7 27.234-36.21, 625-50), పూజా-రి (AR 233/1949-50.3,8), పుర-వ్-అరి (SII 5. 1058.4, 1084), ప్రాతిపదిక చివరి హ్రస్వాచ్చుమీద అగమాత్మకవకారం రావటం, దీర్ఘాచ్చు మీద ప్రత్యయాద్యచ్చు లోపించటం గమనించాలి. (ii) 'స్వార్ధం'లో -'ఇక' ప్రత్యయం వచ్చేది. ఉదా. మాన (పై. 4.1014.2, 1038) : మాన్-ఇక (ఉని 400/1082-08 విట £2 తపం. ౩.౨. 56,9.1072), (మ 'సమూహార్థం”లో “-ఇకము" వచ్చేది. ఉదా. రట్టడి (భారతి 5.706 18.1023); రట్టడ్-ఇకము (|| 4.1029.10, 1100), (iv) “కలవాడు అనే అర్థంలో 'కాఱ-కాఱు" వచ్చేది. ఉదా. అంక -కాఱు (పై. 6.102 5-6, 1006).నిబంధ-కాఱు (పై. 10.12.16, 1087), వ్రిత్తి-కాఱ్ 92
తెలుగుభాషా చరిత్ర
(AR 76/1956-57.10, 1086). ఇప్పటి-'కాడు/-గాడు'లకు ఇది పూర్వరూపం. దీని ప్రాచీనరూపం*కాన్ఱ్ అయి వుంటుంది. హల్పూర్వానునాసిక లోపాన్ని బట్టి ఇది కన్నడం నుంచి వచ్చిన ఎరువుమాట కావాలి. (v) 'చేసేవాడు' అనే అర్థంలోనే '-గార్' ప్రత్యయం వచ్చేది. కఞ్చ-గార్-లు (EI. 30.69.71 8,699_700). 'కాంస్యకార' శబ్ధభవమైన ఈశబ్ద౦లోని ప్రత్యయం కూడా ఆర్యభాషా భవమనే చెప్పాలి. కాఱు, కారుల” లోని రేఫభేదం ఇందుకు మంచి ఉపపత్తి. (vi) బహుశా దిగర్ధంలో “-పల” ప్రత్యయం వచ్చి వుండవచ్చు, లోపు ఉదా. (SII 10. 651.13, 1090-91). లో-పల్-ఇ (త్రిలింగ రజతోత్సవ సంచిక352-64.17,991), డా-పల వెల-పలవంటి మాటల్లో పోల్చి ఈ ప్రత్యయాన్ని వ్యాకరించటం జరిగింది (viii) 'స్వార్థం'లోనే 'ఱు' అనే ఆపదాంశం ఒకటి కనిపిస్తుంది. ఉదా. పొద-ఱు (EI 6.347-61.90, 1011) పొదశబ్దంతో ఈ ప్రత్యయంవల్ల వచ్చిన అర్థవిశేషమేమీ లేదు. బహుశా 'కూతు, కూతుఱు' శబ్దాలు కూడా ఇలాంటివేనేమో.
3.65. కృత్ప్రత్యయాలు : శాసనాల్లోదొరికే క్రియాపదాలతో మాత్రమే పోల్చి చూస్తే క్రియాధాతువునుంచి విశేష్యాలను తయారుచేసే కృత్ప్రత్యయాలు ఏడు లభిస్తున్నాయి. ఉదా. కూట్-అము-న (AR 75/1956-57.16, 1080), వాడ్- ఇక-లు (పై. 16-17). డిగ్గ్-ఇలి (SII 5.1058.6, 1084), తో-ట-ళు (పై. 10,599.11, 625 50). నంజు-డ్-లు. (పై. 4,1015.9,1084). తూఱ్-పు
(భారతి 5.935-48.11, 675), కొల్-వు-నన్. (పై. 618-6, 897). ఈ ప్రత్యయం వర్ణనాత్మకంగా వినిమాయక సపదాంశ౦. కాపళుు(NI 2.606-7.7,8) వంటి చోట్ల ధాత్వంత చకారస్థానంలొ వచ్చే పకారం కూడా వర్ణనాత్మకంగా వినిమాయక సపదాంశమే అయినా తులనాత్మకంగా కేవలం ఆదేశమే ఈ ప్రత్యయానికి ముందు మకారం ఆదేశం కావటం బహువిరళమైనా ఒక విశిష్టలక్షణమే.
3.66. స్థలనామ ప్రత్యయాలు : శాసనాల్లో దొరికిన భిన్న స్థల నామాలను మాత్రమే పొల్చి చూసినప్పుడు ప్రముఖంగా 44 రకాల స్థలనమప్రత్యయాలు లభిస్తున్నాయి. ఆయా ప్రత్యయాలకున్న సపదాంశాలను వివరించకుండా (గ్రంథ విస్తరభీతి తప్పదు కాబట్టి) ప్రకృతి ప్రత్యయ నిర్దేశ౦చేస్తూ ఒక్కొక్క ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాము: ఉదా. వుద్-అలి (EI 27,244-51 2,725-75), మ్లావ్-ఇండి (SII 6 584.4, 641), ఆత్త్-ఇలి (భారతి 12.86-96.13,709 ప్రాచీనా౦ధ్ర౦ : శాసనభాషా పరిణామం
93
-46 పణ్ట్-ఊర్. (E16-315-19.24,234), కొడ్-ఇంకి (పై. 15.249-52-7, 554), కన్ట్-ఏఱు (పై. 31.74-80.29, 869), నిడుం-గట్ట (భారతి 1.189-46.15, 686-709), పులి-కల్లు (IA 12.218 61, 934-45), నిడు-గాడు (CP 2.1914.15.28, 764.89), గారల-గుణ్ట (భారతి 15.97-115 29, 945), కడా-కుదురు (EI 15.248-52.17,554) , కొల్లి-కుఱ్ఱు (పై. 6 347-61-98, 1011). ఆతు-కూరు (పై. పై. 31.74.80.29, 669), తాన్ఱ-కొన్ఱ (IA 9.102-3.7,5 ), తామర-కొలన్-ఇ. (EI 28.57-71.108. 1022-66), ఒం-గోడు (పై. 15,249-52,17,554), నన్ది-గామ (IA 7.15-19.54. 946-70), పరు-వి (EI 3,277.14, 466), చెఞ్-చెరువ్ (భారతి 1.110-22.18-14, 395-410), కారమి-చేడు (భారతి 1.90-110.45,844-88), నలూ-చేరి (SII 1.31-36.19, 794.842), పరివ-తుర్హ (భారతి 7.297-318.45, 715-20), ఆఱు-తొఱె(పై.1.110-22,10-11, 395-410), కసుందల (SII 6.250.5, 742.38), పళ్ళి-నాణ్ట్-ఇ (భారతి 28 182-86.5 641), కొణ్ద-నూర్-ఇ (SII 6.250.5, 742.98), విరి-పర (EI 6.84-49,10,234), పెణుక-పఱ్ఱు (పై. 15.249-52.17, 554) ఉరువు-పల్లి (పై. 3.277.17,466), గొల్లి-పల్లు (SII 4 1016 2, 1087), దూద్రు. పాక (EI 27. 46.26,915-25), ఇలు-పాడ్-ఉనుం (SII 10.35.3,10), మల్క-పోరము. (EI 5.131-34 33, 918-25), అమ్మల-పూణ్డి (భారతి. 15.87-115.47, 945 ) చెఱు - వూరు (IA 20.15-16.13;632 ), ఇన్-పుఱోల్-.ఇ (వ్యా. సం. 301-10.1,600-25), చేర-మఙ్గలమ్బు-న (SII 10.631.6-7, 9/10),సోర_మడి(పై.8629 825 ), గో - మడువు ( IA 12.91-95.54, 945-70 ), పెను - మణ్డ (JA RS 20.135-201-7, 967 ), రావి-రేవు ( EI 4.193.98.20.506 ). ఏఱు-వ (పై. 29. 160-64,8, 680), కూడా-వాడ (పై 17.334-37.8, 610), గణ-శాల (పై. 5.139-42.28, 945-70).
3.67. వ్యక్తి నామ ప్రత్యయాలు: వ్యక్తినామ ప్రత్యయాలు ప్రధానంగా అయిదు రకాలు ; పురుష, స్త్రీ, ఉభయవాచకాలని, పునరుక్త, పూజ్యార్థకాలని. పురుషవాచక ప్రత్యయాలు మళ్ళీ అయిదు రకాలు : (1) మన్చ్య్-అణ్ణ (పై. 17.33 4-37.11,610), వినియ్-అణ్ణ ( పై. 27.234.36.21.22, 625-500), కౌమ్మ్-అన (SII 6.250. 7,742-98), ఆయ్త్-అన్న-యు(EI 30.280-84.7, శ్రీ తెలుగు భాషా చర్విత
+72), (1) విట్ట్-అప (50 6.250.7, 149.98 ఏ (1, మార్-అయ్య (07 8.1152-55,8ల,7%, కొచ్చ్‌ంఇయ ( 8] 827.288-00,4,600-28 3, కొజ్డ్- ఆయా-కు (57 8 160.4, 4208) ఎజ్-ఎయ (32 18,58-60.12, ₹49ల), వీట్‌లో ఇకారాది సపదాంశం గల రూపాలు పదకొండో శతాద్దికిముందు. బహు విరళంగాను పదకొండో శతాబ్దిలో-ముఖ్యంగా గోదావరీ మండలంలో _ చాలాబహు శంగాను కనిపిస్తాయి. ఎకారాదివి కన్నడనీమకు దగ్గరలో ఉన్న తెలుగు ప్రాంతాల్లో అధిక్రాధికంగా ఉండేవి ; [ప్రత్మ్యయగత ఎకార _పభావంవల్డ |పతయాద్యచ్చుతాలవీ] 'కరణంచెందిఉంటుంది. (1) మబున్గ-పిడుకు (వై. 27.281-84.8, 625-560), మాజ్-పిడుగు. ( వై. 28ిక-880.10-16, 02550 ). () అణంపోతుంలు (వ్యా. శం. 801-10.2, 600-256)
సంస్కృత సమమైన “అంబా” (ప్రత్యయంగల పదం ఒక్కటి మ్నాతమే స్రీనాచక (ప్రత్యయంతో దౌరికింది. ఊదా మేట్ జా ఆంబా (52 క180- 89.27.8ల6-45).
స్రీపురషోభయవాచకాలయిన (ప్రత్యయాలు అయిదు మ్మాతం లభించాయి. ఉదా, (1) పు, తాత్-అమ్మ (వై. 10-100-6.290,674):. స్రీ. కుల్ట్-అమ్మ ( 522 10.400.12-18,8 ); వు. వేజ్ _ అబ్ _ ఒజన్టు ( 52 27,240 కలి, 18.20,725) : స్రీ. బిజేక్.అవ్వూ. (౮4౩5 90.106-201. కి 9570); (ఫ్రుపు. దేవ్-అజ్జీ (గ 125.4 10) : స్త్రీ. భూమ్-అజ్జియును. (5౯ శ్1088.% 1095; (గూ పు,పడ్-అలు (పై, 6.1885.4 1090 : స్ర్రీ.మన్మత్- ఆప (వై. 10.560.1,7); (1) పు, కూచ-పోటింకి ( 3727.242.44.12,760 ): శ్రీ- సన్తి -పోటి (వై. 28క-86.7,025-50 ). పైవాటిలోని ఆబ్డు-అవ (ప్రత్యయాలు రెండూ మూలదక్షిణ (దావిడళబ్ధింేఆళ్/*4ఆజ్ (== శేవ్యక్రి) నుంచి ఏర్పడ్డవి. స్త్రీపురుషనామాలు రెంటిలోనూ పునరు క్త ప్రత్యయాలు కొన్ని సమ యాల్లో కనిపిస్తాయి. ఉదా, పు. విద్డ్-ఆమ్-ఆయ్య (22 1284, 650 ), తిక్క్-అప్-ఆయ్య ( ౨2 10.6 81048 ); . స్త్రీ. మీన్-వ్‌ఆ-అమ్మ (వై. ఈ,18ి,8, 10, పాంవ్-అక్-అమ్మంకు (మై. 111.9, 1084). అయితే ఈ పద్ధతి బహు విరళంగా ఉండేది.
పూజ్యతను నూచించటానికి బహువచన లు (ప్రత్యయాన్ని అధికంగా వాడే వారు. అదిగాక మరి నాలుగు (ప్రత్యయాలు శాసనాల్లో కనివిస్తాయి.. వాటిలో (ప్రాచీనాంధ్రం ; కాసనథాషా పరిణామం 0గ్ర
చివరిది (- గార్యు/-వారు) ఇప్పటికి. నిలిచింది. ఉదా, (1) జేయమ్-ఆయ్యరు (మై. 10.528.6, 9265-50). ఇది తమిళంనుంచి ఎరువుగా వచ్చింది. (11) కణమణ ఎయ్-ఆరు (హ్ 80 69-71.8, 899-700), ఇది *అవర్. శబ్దభవం కావచ్చు. (19 రేవణ-కాలు (థె. 2?.221-25.7,575-000), కుజ్జి.కాళ్ట (పై. 225 వి8ి,8, 575-600). “కుణ్ణిపొదాః' అనే సంస్కృతళద్దానికి ఇది ఎరువు అనువాద మనటం సంభావ్యం. (ప్రై పోశజ్యం-గార్-ఇ (తె. 5.127-81.29. 692.922), విట్టపరడ్డి*వార్ -ఇకి (వ22 6.250.8.742-94).... వీటిలో. రెండోది అధిక వూజ్యతను సూచిస్తుంది.
తి.68. పదజూలం : సంప్రదాయవ్యాకరణాలు భాషలోన్ని పదజాలాన్ని తత్సమ, తద్భవ,దేశ్యాలనే మూడు (ప్రధానభాగాల కింద విభజించాయి. అవి ఇచ్చిన నిర్వచనాలతోగాని వాటి విభజన (ప్రణాశికతోగాని నిమిత్తం లేకుండా, థెలుగుతోకి వన్చిన ఎరువుమాటలూ వాటి పదాంళాలు తెలుగు వర్ణమాలలో మార్చు లేకుండా ఇమిడిపోతే తద్భవమనీ, లేకపోతే తత్సమననీ, ఆరెండు రకాల పదాం శాలూ కలిసి ఏర్పడ్డపదం మ్మిశ్రమపదమనీ ఇక్కడ పరిగణిస్తున్నాం. పూర్వ వ్యాకరణాలు ప్రాతిపదికనేగాని [ప్రత్యయాలను ఈ సందర్భంలో గణించలేదు. ఇక్కడ పదాంళాలనుబట్టి విభజన జరుగుతుంది, ఆలేక్కన దేశ్యదేశ్యేతర పద జాలాన్ని పోల్చి చూస్తే తెలుగులో ఇమిడిపోయిన ఎరువు మాటలు క్రీ. శ. 8-10 శతాబ్ధులమధ్య మొత్తం పదజాలంలో నూటికి 20-26 పాళ్ళు ఉండగా 10, 11 శతాబ్దుల్లో నూటికి 50 ఫాన్ళ అయినాయి. కావ్యభాషా (ప్రభావమే ఇందుకు ముఖ్య కారణం. ఎరువు మాటల్లో అత్యధికభాగం సంస్కృత 1ప్రాకృతాలనుండి వచ్చినవే.
సంస్కృతం నుంచి ఎరువుగొ వచ్చిన మాటల్లో ముఖ్యంగా రెండు మార్పులు శనిపిస్తాయి 2 ఒకటిఆర్థవిపరిణామం, రెండు సంస్కృత వ్యాకరణ విరుద్ధత. ఉదా. (గ్ర) అర్థవిపరిణామానికి ; వక్రమ్బు ( = అడ్డు, 2/2 1.267.2,0850), కరణమ్ (౫ (గ్రామాధికారి. 51! 10. 6క5.49-50,1060), జీవితంబు (= జీతం, కౌ,లా, 1.168-05.62-68, 892-929), నియోగముల్( జాజిల్హాలు 520 10.645. 58,1080) మొదలై నవి. (1) వ్యాకరణ విరుద్ధతకు : (ప్రధాని (ఫై. ఓ.1010., 105), మనోవల్లభి, వనజన్నేతి (22 4.581418. 21,1075=76), ఊరమారి
(527 8.108.29,107 మొదలై నవి, 96
తెలుగు భాషా చరిత్ర
3.69. మిశ్రపదాలు : క్రీ. శ. ఏడో శతాబ్దినుంచి 'మిశ్ర సమాసా'లని, 'వైరిపదా' లని, చెప్పబడే మిశ్రపదాలు లభిస్తూనే ఉన్నాయి. వ్యాకరణాలు నిషేధించినా ఈ పరిస్థితిలో మార్పులేదు. తత్సమ దేశ్యాలతో ఏర్పడ్డ మిశ్రపదాలు సంఖ్యాధికంగా ఉండేవి, తద్భవదేశ్యాలు కలిసిన పైవాటికన్నా సగానికి సగం తక్కువగా ఉండేవి. అయితే ఈ పదమిశ్రణం కావ్యభాషలోనూ పద్యశాసనాల్లోనూ అత్యల్పం; గద్యశాసనాల్లో అత్యధికం ఇది నాలుగు రకాలు. ఉదా. (i) దేశ్యతద్భవ మిశ్రణం; కణ్డసామి (EI 31.74-80.36,669), గొల్లపల్లు (SII 4.1016.2, 1087), మావ్వ౯లగరుడణ్డు (రా. ప. సం. 187-89.7-8,1018), మొగమాడువ్ (శా. ప. మం. 1.2-3 42, 898-934). (ii) దేశ్యతత్సమ మిశ్రణం : అమృతపడి (NI 8. 1072.17,1088), గణ్డభైరవ (SII 10.647.23-24, 1097), జయమాడ (పై. 6.109. 29,1076), పోర్ముఖరామ (పై. 10.599, 1-2, 625-50), మానవత్తి౯క (భారతి 3.33 -94.45,1060). (iii) తత్సమ తద్భవ మిశ్రణం : ఉదారబుద్ధి (SII 10.638.3,9/ 10), ఘనరాచమణి (NI 3.1152-55.20-30,7) చౌషష్టి (భారతి 5. 618.3,850), లోవా దణ్జు (SII 4.1161.5, 1072), సవ్వ౯బాద పరియారువు (రా. ప. సం. 71-72 19-20,847), (iv) దేశ్య తత్సమ తద్భవ మిశ్రణం : వేణవోజన్ఱు (EI 240-42.18-20, 725), దేవొనొజ్ఞలకూ (JAHRS 1.81-85.4,10).3.70. పదవిన్యాసక్రమం : ఉచ్చారణపద్ధతి, విరామం, స్వరం మొదలైనవి శాసనకాలంలో ఏవిధంగా ఉండేవో సరిగా తెలీదు కాబట్టి ఆనాటివాక్య నిర్మాణాన్ని గురించి విపులంగా చెప్పటం సాధ్యం కాదు. అయితే లేఖనంలోని పునరావృత రేఖలను బట్టి వాక్యాల ఆద్యంతాలను గుర్తించి వాటి నిర్మాణంలో కనిపించే కొన్ని ప్రత్యేకలక్షణాలను వివరించవచ్చు. ఉద్ధేశ్య విధేయపూర్వక వాక్యరచన సాధారణంగా ఉండేవి. కానీ అక్కడక్కడ ఆ క్రమం మారేది. కర్త సాధారణంగా ప్రథమావిభక్తిలో ఉండేది. కర్మ ప్రాణివాచకమయితే ద్వితీయా చతుర్ధుల్లో ఏదో ఒక దాంట్లోను, జడవాచక మయితే ప్రథమలోను ఉండేది. విధేయం ఉద్ధేశానికి ముందు, అవ్యయం క్రియకు మునుపు, విశేషణం విశేష్యానికి పూర్వాన, పరోక్షకర్మ ప్రత్యక్షకర్మకు వెనకా సాధారణంగా ఉండేవి. నామాఖ్యాన క్రియాఖ్యాన పద్ధతులు రెండూ ఉండేవి. కొన్ని సమయాల్లో ధాతుజవిశేవణాలను కూడా వాడని నామాఖ్యాన పద్ధతి కనిపిస్తుంది, సంస్కృత సాహితీ ప్రభావంవల్ల
ప్రాచీనాంధ్రం : శాసన భాషాపరిణామం
97
తెలుగులోకి వచ్చిన యత్తదర్థక కర్మణ్యర్థక ప్రయోగాలు చాలా విరళంగా ఉండేవి. ఈ సాధారణ పదవిన్యాస క్రమానికి విరుద్ధమైన ప్రయోగాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి.
3.71. క్రియాభ్యాసం : ప్రాచీనాంధ్రంలో మొట్టమొదట నామాఖ్యానమే గాని క్రియాఖ్యానం లేనేలేదని ఒక నమ్మకముంది (సోమయాజి 1948;143,144,150). అలాంటి క్రియాశూన్యత లేదని నిరూపించటానికే ఎక్కువ నిదర్శనలు లభిస్తాయి. నిజానికి ఇందుకు కావలసిన ఉదాహరణలన్నిటినీ ఇవ్వాలంటే శాసనాలన్నిటినీ ఎత్తి రాయాల్సి వుంటుంది. మచ్చుకు క్రీ. శ. ఏడోశతాబ్ది శాసనాలనుంచి కొన్ని మాత్రం రాస్తాం : బోళచేత శవణ గొణిరి (ఆం. ప. 1941-42,2,600-25), విషయబోళ కొజిలి (వై. క, కమ్మరి వినియణ వ్రాసె (SII 10.599 21-22, 625-50), కుమారశమ్మా౯రికి ఉదకపూవ్వ౯జ్కేసి ఇచ్చిరి (EI 30.69-71.5, 689-700 ), కఞ్చగార్లు కొట్టిరి (పై. 8), గొరవళ్
మెచ్చిచే నిచ్చిరి (NI. 3. 1152-55.35-36,7). ప్రథమపురుష బహువచనం, మధ్యమ పురుష బహువచనం, ప్రథమపురుమైక వచనం, ఉత్తమ పురుష బహువచనం, మథ్యమపురుషైక వచనం అనే దిగుడు వరసలో సమాపక క్రియలున్న పూర్ణ వాక్యాలు శాసనాల్లో కనిపిస్తాయి.
3.72. నామాభ్యాసం : క్రియాభ్యాసం కన్న విరళంగా నామాభ్యాసం కనిపిస్తుంది. ఇది మూడు విధాలు. (1) క్రియాపదరహితం : ఉదా. ఇన్దోఱు దీనికి సక్షి (ఆం. ప. 1941-42.4-5,600-25), పెగ్గడ మేడ వ్రాలు (SII 6.250.7, 742-98), దీని అరి నల్తుముడ్లు (AR 233/1949-50.9, 8).
(ii) ధాతుజ విశేషణయుక్తం : ఉదా. కుణ్డికాళ్ళుళ ఇచ్చిన పన్నస ఇరవదియది నాల్కు మఱున్తుఱ్లు నేల (EI 27.225-28.11.14,575-600), లోకమ నిల్పిన స్తానంబు (SII 10.56.2-3, 7 ). (iii) సార్వనామిక విశేష్యయుక్తం : ఉదా. నీవు నా ప్రాణసామానుణ్డవైన చెలివి (తె. శా. 1.163-65,26.27, 792.922).
3.78. విలక్షణవాక్యరచన : ఇంతకు ముందు చెప్పిన సాధారణలక్షణాలు పూర్తిగా సరిపడని పదవిన్యాసక్రమం 9 రకాలుగా కనిపిస్తుంది. (i) కర్తలేనివి: ఉదా. వానపోతుల ముచ్చియకు ... ఇచ్చిరి ... నేల ( SII 10.598,(7}
98
తెలుగు భాషా చరిత్ర
29-31, 625.50), శవన బోళకు...మఱుపొలము పన్నస ఆడి యిచ్చితిరి (AR 283/1949-50.4-8 8). (ii) కర్మలేనివి : కఞ్చగార్లు కొట్టిరి (EI 30.69-71.8, 699-700), ప్రభురామున్ఱుక్ఱోచె ( NI 2.606-7.13-14, 8 ) మంగడ్ల కొమ్మన కొలచి పెట్టె కట్టె ( SII 6.250.7. 742-99 ). (iii) వాక్యాంతంలో కర్త : ఉదా. ప్రసాదచేసిరి తొల్బకామి రట్టగుళ్ళు ( EI 27 236-33 12-15, 700-25), దీవియ పెట్టెం బద్మావతియును (పై. 4.314-18.21, 1075. 76). రెండోవాక్యం పద్యశాసనంలోది. (iv) వాక్యాంతంలో కర్మ ఉదా. గణ్డర ముత్రాజు ... పొడిచిపడియె ఱోజ్కుళాకు ( SII 10.640. 3-6, 9/10), మల్లణ్డెత్తించె గుడియు మఠంబునుం గాత్తి౯కేయునకు (శా.ప.మం. 1.2-3-27-29, 898.934). రెండోది పద్యశాసనంలోని వాక్యం. (V) కర్మ-కర్త-క్రియ : ఉదా. శ్రీసతికి దత్తి హంగుణువుళ దేవణయిచె (AR 182/1933-34, pt. II, lc, 41 1-8,7). (vi) కర్తృ పద పునరుక్తి : ఉదా. పెటనివారు... ఆఱిసినవారు పాపంబు గొణ్డు వెటనివారు (SII 10.633.2-5, 8) (vii). విశేష్యం -విశేషణం : ఉదా. నిల్పె విద్ధమయ్య విప్రకవచమ్బు (NI 1.287.4,650), శ్రీయుద్ధమల్లు ణ్డెత్తించె నమితతేజుండు (శా. ప. మం. 1.2.43-44, 898-934). వీటిలో రెండో వాక్యం పద్యశాసనంలోనిది. (viii) పరోక్షకర్మ, ప్రత్యక్షకర్మ ; ఉదా. గణ్డుదేవరకు నముదునకు దారపోచి యిచ్చినాణ్ణు (AR 77/1956-57. 13-15, 1096) (ix) క్రియ-అవ్యయం : ఉదా. సితమణి బన్దమిచ్చె సన్మణియుతముగన్ (RPS 25-29.6,1065). ఇది పద్యశాసనంలోది.
3.74. యత్తదర్ధక యోగం : సంస్కృత మర్యాదానుసారి అయిన యత్తదర్థక ప్రయోగం గల వాక్యాలు నాలుగే లభిస్తున్నాయి. ఈరకం వాక్యాలు క్రీ. శ. 9/10 శతాబ్దినుంచి మాత్రమే-అందులోనూ విరళాతి విరళంగా-కనిపిస్తున్నాయి. ఉదా. నీకేమి వలయు దాని వేణ్ణికొమ్మ్ (తె.శా. 1.163-65.30-32, 892-922), ఎవ్వణ్డేని రక్షిఞ్చు వానిద ధమ్ము౯వు (JAHRS 1.81-85.7, 10); ఈవృత్తి ఎవ్వా౦డేని అపవారించిన నాని పితృపితాంమహంలు 60 వేలే౦డ్లు నయకనరకానం పడుదురు ( SII 10.4.12-14 1008 ); వేగినాణ్టి కెవ్వరు రాజులైరి వారుం భూవ౯స్థితిం దప్పక పాలించువారు ( పై. 6.102.34 88, 1006). ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం
99
3.75. కర్మణి ప్రయోగము : సంస్కృత భాషాప్రభావంవల్ల తెలుగులోకి వచ్చిన కర్మణి ప్రయోగంగల వాక్యాలు మూడుమాత్రమే క్రీ. శ. తొమ్మిది శతాబ్ది నుంచి దొరుకుతున్నాయి. ఉదా. పట్టం కట్టబడిన వాన్ఱు (పై. 10.629.5-6, 625); అతని చేయంబడిన ధమ్ము౯వుల (తె. శా. 1.163-65,55-56, 892-922); వైదుంబుళచేతం బట్టం కట్టబడి యేలి (SII 10. 640 4-5,9/10).
3.76. పదబంధాలు : కావ్యభాషలో కనిపించేరకం పదబంధాలు శాసనాల్లో కొన్ని కనిపిస్తాయి. ఉదా. విడిచిన బసిణ్డి నూఱు గద్యాణంబులు (JAHC 3,16-21.14-16, 678); ప్రసాదచేసిరి (EI 27-236-38.12-13, 700-25 ); సురలోకంబేజ్గె (SII 10.639.10, 825); సుఖంబుణ్డి (తె. శా. 1.163-65.23-24, 892-922 ); సుఖంబుమనువారు (పై. 68),అతని కొఱ్పించిన చెఱువులు (పై. 53-54); అతనిచేయంబడిన ధమ్ము౯వులు (పై. 55. 56), నీ చేసిన యుపకారంబునకుం (పై. 27-29); చలిపందిరిచేసె (SII 6.586.8-9, 1074); చెఱువునుం గుడియించి సేయించె (పె.7); తమ ప్రతిష్టసేసిన ... ఈశ్వరాలయంబునకు (పై. 10.644.66-70, 1060); తను వేయించిన...తటాకంబున (పై. 61-65); విజయదిత్య దేవరత్తించిన... మణ్డపము (పై. 11.8-11, 1089) వెలకుం గొనివిడిచిన యిల్లు (పై. 651,13, 1090-91).
పోలిక : 'పోలు' ధాతురూపాలతో పోలికను చెప్పేవారు. ఉదా. ఈశ్వరునకుం గాత్తి౯ కేయుణ్డుం బోలె (భారతి 5.618.3, 850); బెజయితదేవని కూంతు సరియ పోల్పం గాంత లెందు (RPS 28-29 11,1065), భూమిదేవిం బోల్ రేవలదేవికనిన సోమలదేవి (పై. 4-4). దొరికిన ఈ మూడు ప్రయోగాలూ పద్యశాసనాల్లోవే.సంవాదం : ఆంగ్లంలోలాగా తెలుగులో ప్రత్యక్షపరోక్ష సంవాద పద్ధతిలేదు. సంవాద పద్ధతి ఉందిగాని ఇందువల్ల క్రియారూపాదుల్లో ఏవిధమైన మార్చురాదు. ఒక్కకొరవి శాసనంలో మాత్రమే (తె. శా. 1.]163-65..... 892-922) సంవాదవాక్యలు లభించాయి. ఉదా. నీవు నా ప్రాణసమానుణ్డవైన చెలివి (26-27), నీచేసిన యుపకారంబునకుం బ్రత్యుపకారంబు చేయవలయుం (27-30), నీకేమి వలయుం దాని వేణ్డికొమ్మ్ (30-32): నీ శ్రీ నాకెల్లం గలద్ (32-33), ఏమి
100
తెలుగు భాషా చరిత్ర
లేకున్న వేణ్ణికొణ్డుమ్ (33-34), పరోపకారంబుపొణ్డె నా నీ కొరవి యన్నది... (35-36).
3.77. మణిప్రవాళశైలి : సంస్కృతాంధ్ర పదబంధాల్ని మేళవించి వాక్యరచన చేయటానికి 'మణిప్రవాళశైలి' అని పేరు. పాల్కుర్కి సోమనాథుడి కాలం నుంచి తెలుగు సాహిత్యంలో ఈపద్ధతి విరళంగానే కనిపిస్తుండేది. శాసనాల్లో క్రీ. శ. ఏడో శతాబ్దినుంచి ఈరకం వాక్యాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఉదా. క్షేత్రం ఖణ్డుగవడ్ల సహితమ్ ( EI 10. 100-8.28, 674 ), ... ఏఱువ విషయం బేళన్ తస్య మాతాదత్తం ... శతపంచాశత్ క్షేత్రమ్ (పై. 29.160-64. 8-9,680); రేవశమ్మ౯స్య గుడి (SII 10.603.2-8); ... కొడుకు పల్లవా చార్జ్యస్య లికితం ( EI 27.203-6.24-26, 850 ); కొఱ్ఱబోయు తటాక౭ (పై. 9.47.59,945-46).
3.78. పృథక్కరణం : జాతి ద్రవ్యాదుల్ని పృథక్కరించి చెప్పటానికి సప్తమీవిభక్తి ప్రత్యయాన్నో, అనుబంధాన్నో వాడటం చాలా ప్రాచీన కాలంనుంచి వాడుకలో ఉంది. ఉదా. శ్రీ సోఱమహారాజు ల్లొళన ఇన్సుఱోలి అణపోతులు (వ్యాా. నం. 301-10.1-2, 600-25); బాదిరాజుల అన్దు పళ్ళెయరి కొడుకు (EI 27.203-6.6-8, 850).
3.79. కాలస్థల నిర్జేశం : 'ఉండు' ధాతువు క్త్వార్ధకరూపంతో ఆరంభదశను, చతుర్ధీ ప్రత్యయంతో అంతిమదశనూ నిరూపిస్తూ కాలస్థలనిర్దేశం చేయటం అనాదిసిద్ధంగా ఉంది. ఉదా. ఒంగోడునుండి ఱిగదేబుపళ (i)కు పోవు పన్థా (భారతి 1.139-36.16-17,696-709); చేబ్రోలనుండి బెజవాడ జాత్రకు వచ్చి (శా. ప. మం. 1.2-3.22-23, 899-934). ఈక్త్యార్ధకరూపం కాలక్రమాన 'నుంచి'గా మారి నేటి వాడుకలోకి వచ్చింది.3.80 ఉపసంహారం : శాసనైకాధారమయిన ప్రాచీనాంధ్రభాషను శాస్త్రీయపద్ధతుల్లో పరిశీలించినప్పుడు ఇంతకాలంగా లోకంలో ప్రామాణికవాక్యాలుగా చెలామణి అవుతున్న కొన్ని దుర్భమలు తొలిగిపోతాయి. నన్నయ్యకు ముందు తెలుగుభాష 'ద్రవస్థితి'లో ఉండేదనీ (సోమయాజి 1948; 36,143.233, 234), దాన్ని అతడు సంస్కరించి 'ప్రమాణీకరించా'డనీ ( పై. 98,148-55,203-29,235), చాణుక్యులకాలంలో తెలుగు 'రాజభాష'గా 'అధికారభాష'గా
ప్రాచీనాంధ్రం : శాసన భాషా పరిణామం
101
ఉండేదని, తెలుగుమీద మొదట ప్రాకృతప్రభావమూ తరవాత సంస్కృత ప్రభావమూ అధికంగా ఉండేవనీ అనుకొనేవారు. అత్యంత ప్రాఛీన శాసనకాలంనాటికే తెలుగు ప్రత్యేక భాషగా విలక్షణ నిర్మాణంతో ఉండేదని తెలుస్తుంది. భాష ఎప్పుడూ తనకు స్వతస్సిద్ధమయిన వ్యవస్థతోనే ఉంటుంది. ఆ వ్యవస్థను గుర్తించి వర్ణించటమే వ్యాకరణాల పని వ్యవస్థే లేనప్పుడు వర్ణన సాధ్యం కానేకాదు; వర్జన సాధ్యమైనప్పుడు ఆ వ్యవస్థ, ద్రవస్థితి అనే మాటలకు అర్ధమేలేదు. రాజాదుల ఆజ్ఞలు కొన్ని తెలుగులో ఉన్నంతమాత్రాన తెలుగు రాజభాషగా ఉండేదని చెప్పలేము. పరిపాలన సౌలభ్యంకోసం గాని, తమ దానధర్మాదులను తమను ప్రస్తుతించుకోటానికి గాని తెలుగులో శాసనాలువేసి ఉంటారు. ఇప్పటి అధికారభాష ఆంగ్లమైనా సామాన్య ప్రజలకు తెలియవలసిన విషయాలను ప్రభుత్వం తెలుగులో ప్రకటించటానికి ఆనాటి పరిస్థితికి భేదంలేదు. అలాగే ప్రాకృత ప్రభావం తొలిదశ లో ఎక్కువగా ఉన్నదనటానికి గూడా ఆధారాలు దొరకలేదు.
3.81. ప్రాగాంధ్రదశ : దొరికిన శాసనాల్లో అత్యంత ప్రాచీనమైన దాని కాలంనాటికే తెలుగులో కొన్ని ప్రధాన పరిణామాలు జరిగేయి. ధాతువుకూ ప్రత్యయాలకూ మధ్య అచ్చులు చేరటం. వర్ణవ్యత్యయ అచ్సంకోచాలవల్ల పదాదిని సరళాలూ సంయుక్తాక్షరాలు ఏర్పడటం, వర్జసమీకరణంవల్ల పరుషాలు ద్విరుక్తం కావటం, తాలవ్యీకరణంవల్ల కకారం చకారం కావటం వంటివి కొన్ని ప్రధాన పరిణామాలు.
3.82. ప్రాక్సాహిత్యదశ : చరిత్రకాలంలో జరిగిన మార్పులను బట్టి క్రీ. పూ. 200- క్రీ. శ. 1100 మధ్యనున్న తెలుగుభాషాచరిత్రను మూడుదశలుగా విభజించవచ్చు మొదటిది. క్రీ. పూ. 200- క్రీ. శ. 6 శతాబ్ధుల మధ్యదశ; దీని ప్రాక్సాహిత్యదశ అనవచ్చు. ఈకాలంలో ఱకారం ప్రత్యేకవర్ణంగా ఉండేది. రేఫఱకారాలు ఓకే వర్ణంగా మిళితం కావటం మధ్యాంధ్రదేశంలో ఆరంభమయింది. దేశీయమైన పరసవర్ణాదేశానికి బదులు అనుస్వారాన్ని ఉపయోగించి లేఖనపద్ధతిని సులభీకరించటం మొదలయింది. పదాంతసంధి ఉండేదికాదు. పదమధ్యసంధులు మొదలైనాయి. గసడదవాదేశం వైకల్పికంగా ఉండేది. మొత్తంమీద తరవాతి కాలంలోని భాషకు నిరూపకమైన విలక్షణనిర్మాణక్రమం, ప్రత్యేకభాషాక్రమం ఏర్పడ్డాయి. సంస్కృతసంపర్కం, ప్రభావం బాగా ఉండేవి.3.83. సాహిత్యదశ : క్రీ. శ. 7-9 శతాబ్దుల మధ్యకాలంలో తెలుగుభాషలో సాహిత్యదశ ఆరంభమయింది. వ్యావహారిక సాహిత్య మాండలికాలు
102
తెలుగు భాషా చరిత్ర
ఏర్పడటం, పద్యశాసనాలు తలచూపటం, లేఖనం నుంచి నిర్మాణ్మక్రమం వరకూ అన్నిటిలోనూ కొత్త పరిణామాలు వచ్చి స్థిరపడటం ఈ ద్వితీయదశలోని ప్రధాన లక్షణాలు. సంస్కృత ప్రభావంవల్ల రేఫమీది హల్లుల్ని ద్విరుక్తంచేసి రాయటమనే సంప్రదాయం వచ్చింది. అరసున్న కొత్త ధ్వనిగా స్వతంత్రంగా మొలకెత్తింది. పద్య శాసనాలవల్లనే దాన్ని పునర్నిర్మించటం సాధ్యమయ్యేది. ద్విరుక్తాద్విరుక్తహల్లులున్న జంటమాటలు పుట్టుకొచ్చాయి. పదాదిన యవకారాలను వాడటం మొదలైంది. ఱకారం వర్ణత్వం కోల్పోయి అచ్చులమధ్య డకారంగానూ, సంయుంక్తాక్షరాల్లో రేఫగానూ పరిణమించింది. అజ్మధ్య డకారం ణకారంగా మారటం ఆరంభమయింది. సంయక్తాక్షరాల్లో రేఫ వకారపరంగా ఉంటే వకారం లోపించటం, ఇతర హల్లులతో ఉంటే తానే జారిపోవటం మొదలయింది. 'న్ఱ’ అనే సంయుక్తధ్వని 'ణ్ణ'గా మారింది. వ్యుత్పత్తులు స్పష్టంగా తెలిసిన దేశ్యపదాల్లో పదాదిసరళాలు కనిపించటం ప్రారంభమయింది. శకటరేఫ ప్రత్యేకవర్ణత్వం పోగొట్టుకుని రేఫతో మేళనం పొందింది. అత్సంధి వైకల్పికంగా ఉండేది. గసడదవాదేశం బహుళంగా మారింది. దృతసంధి పద్యరచనల్లో నిత్యంగాను, గద్యంలో వైకల్పికంగాను ఉండేది. అమహదేకవచన ప్రత్యయం 'బు' అనేది 'ము, వు, మ్ము'లుగా పరిణమించింది. మిశ్రసమాస కల్పనం జోరుగా సాగింది. కర్మణి ప్రయోగమూ, యత్తదర్ధక ప్రయోగమూ సంస్కృతంనుంచి ఎరువుగా వచ్చిపడ్డాయి. 'మణిప్రవాళశైలి' ఆచారంలోకి వచ్చింది. నాలుగోవంతు మాటలు ఎరువుగా వచ్చాయి.
3.84. కావ్యభాషాదశ : క్రీ. శ. 10, 11 శతాబ్దుల్లో కావ్యభాషా ప్రభావంవల్ల వాడుకభాషలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఇది భాషాచరిత్రలో కావ్యభాషాదశ. ఈ కాలంలో బయలుదేరిన మార్పులు క్రీ.శ. 1100 నాటికి భాషలో స్థిరపడలేదు. ఈ దశలో వచ్చిన పెద్దమార్పు పదజాలానికి సంబంధించింది. ఎరువుమాటల సంఖ్య మొత్తంలో సగానికి సగంగా ఉంది. తద్ధర్మార్థక విశేషణ ప్రత్యయం 'ఎడి/-ఎడు' అనేది 'ఏ/-ఏటి'గా మారటం మొదలయింది. మహద్వాచకాల ప్రథమపురుషైకవచనంలోని తచ్చబ్ధవకారం లోపించటం ఆరంభమయింది. అమహత్ప్రత్యయం 'ము' లోపించటం, దానికి ముందున్న స్వరం దీర్ఘం కావటం మొదలయింది. నామాంతంలోని '-ఇయ'లో ఆద్యచ్చు లోపించటం మొదలయింది. వర్ణవ్యత్యయంవల్ల రెండు హ్రస్వాచ్చులు పక్కపక్కల చేరినప్పుడు అవి దీర్ఘాచ్చుగా మారటం ఆరంభమయింది.