నామాట

ఒకరోజు శ్రీ కృత్తి బాపిరాజు గారు (అమ్మ, బాపు, సిసింద్రీ సంపాదాకులు.) సిసింద్రీ అనే బాలల పత్రిక నాకు ఇచ్చారు. అందులో పిల్లలకు సంబంధించిన గేయాలు, కథలు, పద్యాలు, సామెతలు మొదలైన వెన్నో ఉన్నాయి.ఆ పత్రిక నన్నెంతో ఆకర్షించింది.వెంటనే పిల్లలకోసం ఏమైనా రాస్తే బాగుంటుందనిపించింది.'తెలిసి మెలగ మేలు తెలుగుబాల"అనే మకుటంతో ఐదు పద్యాలు రచించి సిసింద్రీ పత్రికకు పంపాను.తర్వాతిసంచికలో వాటిని ప్రచురించారు.ఆ స్ఫూర్తితో ఒక శతకం రాస్తే బాగుంటుందనిపించి అప్పుడప్పుడూ కొన్ని పద్యాలు రాశాను. 116 పద్యాలు రచించి వాటిని 108కి తగ్గించి శతకంగా ప్రచురించుదామనుకొనిదాదాపు సంవత్సరం అయింది. ఇటీవల మా కనిష్ఠ సోదరులు భగవాన్‌శ్రీశ్రీశ్రీ వేకంట కాళీకృష్ణ గరుమహరాజ్‌గారి పుస్తకం 'తిరుమలేశుని లీలావైభవం' ప్రచురితమవుతున్న సమయంలో నాశతకం సంగతి చెప్పాను.వెంటనే ముద్రించమని చెప్ప టంతో ఈ విధంగా పాఠకలోకం ముందు 'తెలుగుబాల శతకం' ఉంచుతున్నాను. 'తెలుగుబాల పేరుతో ఇంతకు ముందు కొన్ని శతకాలు వచ్చాయి. కానీ నా రచన నాది.

పూర్వం ప్రాథమిక పాఠశాలల్లో శతక పఠనం తప్పని సరిగా ఉండేది. పాఠ్యాంశాల్లో ఉన్నవాటినీ, పాఠ్యాంశాల్లో లేకపోయినా మంచి పద్యాలనుకొన్న వాటిని ఉపాధ్యాయులు పిల్లలకు నేర్పించేవారు. శతకాల్లో ఎన్నోనీతులుంటాయి. ప్రవర్తనా నియమావళిని క్రమబద్ధం చేసుకోవానికి, ఆత్మ విశ్వాసాన్నిపెంపొందింపచేసుకోవటానికి అవసరమైన ఎన్నోవిషయాలుశతకాల్లోఉంటాయి. శతకం ఒక నేస్తం లాంటిది. ఇంగ్లీషుపిచ్చి ముదిరిపోయి తెలుగు భాష మీదా మమకారం తగుతున్నఈ రోజుల్లోపిల్లలకు మనం తప్పని సరిగా శతకాలు నేర్పించాలి. ఈ ఉద్దేశంతోనే తెలుగు భాషామాధుర్యాన్ని, క్రమ శికణాయుతవున పవరనావశ్యకతను వివరిస్తూ ఈ శతకాన్నిరచించాను. ఇది సహృదాయుల మన్ననలు పొందుతుందని ఆశిసున్నాను.


డా|| గుమ్మా సాంబశివరావు


</poem>