తెలుగువారి జానపద కళారూపాలు/అక్కన్న మాదన్నల భాగవత మేళం
అక్కన్న మాదన్నల భాగవత మేళం
గోల్కొండ తానీషా మంత్రులైన అక్కన్న మాదన్నల యాజమాన్యంలోనూ ఒక భాగవత మేళముండేదని మధురిమంగా పుంశ్చలీ విలాసంలో ఉదహరించబడిందని యస్వీ జోగారావు గారు తమ యక్షగాన వాఙ్మయంలో వివరించారు.
అక్కన్న మాదన్నల భాగవత మేళం కూచిపూడి భాగవతుల రీతిలో వుండి దేశ సంచారం చేసి, ప్రదర్శనాలను ప్రదర్శించింది. ఈ భాగవత దళం విజయాగరం ఆనెగొంది రాజ నగరాల్లో నాటకం ప్రదర్శించి నప్పుడు ఆ మేళ గాండ్రలో అంద గాడైన ఒక స్త్రీ పాత్ర ధారిని ఆనాటి రాజుగారి సోదరి వలచి వలిపించి అతనితో సాంగత్యం జరిపినట్లు ఒక ఇతి హాసముంది. దీనిని బట్టి ఆ భాగవత దళం ఎంత వుత్తమమో తెలుసుకోవచ్చు.