తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/కుమార సంభవము

కుమార సంభవము (అనువృత్తము)

                         తృ తీ య స ర్గ ము

తే.గీ|| మదన! నీకుస్సంగాతి యీ - మాధవుండు
        చెప్పకయే వచ్చుదోడ, నేం - జెప్పనేల?
        అసలునౌదోడుపడుమని - యనిలునకును
        వెవ్వ డెప్పుడాదేశించు - నిద్ధవీర్య!. 21
తే.గీ|| అనిన నట్లగుగాకవి - యపమశరుడు
         విభునియాజ్ఞ నొదల శేష - నిధినిదాల్చి
         నడచె నైరావతాస్ఫాల - నమున బిరుసు
         గలుగుకరమున నింద్రుండు -గారవింప 22
తే.గీ|| శంకతోవసంతుడు రతి - జరుగవెంట
         దేహమసువులు దీఱిన - దీఱుగాక,
         దేవకార్యము తప్పక - దీర్తుననుచు
        మనసిజుం డీశ్వరాశ్రమ-మునకుజనియె 23
తే.గీ|| అంవనంబు పంయము - లైనమునుల
        తపములకు బ్రతికూల వ -ర్తనమువాడు,
        మదనునభిమాన భూతుడు - మాధవుండు
       పెల్లుగానాత్మగుణము ప - ర్తిల్లజేసె. 24
తే.గీ|| తీక్షకరుడు కాలంబు న - తిక్రమించి
        తా గులేర పాలిత దిశం - దమినిజేర
        గడగ దక్షిణ దిజ్ముఖ - గంధనహము
        నఱులెపుడు వ్యళీక ని - శ్వాసమునలె 25
తే.గీ|| బోదెనుండి చివుళ్లు పు - వ్వులును లూచె
        నల యశోకము, రవళించు - నందియలను
        దనుకు సుందరి పాద తా - డనము నుంత
        యైన గొరదయ్యెను వసం - తాగమమున 26
తే.గీ|| చివురు మొలకల గఱులుగా - నవరసాల
        సూన బాణంబుచేసి య - ద్దాని మీద

          నళుల సక్తిని మదను, నా - మాక్షరములు
          గాగనుంచె వసంతుడు - కమ్రఫణితి. 27
తే.గీ|| కర్ణికారంబు నన్నెచే - గడిమి నొంది
        తావిలేమిని మదికి జీ -దఱయె గూర్చు
        నరయ దఱచుగ సకల గు -ణాస్పదముగ
        నొక్కవస్తువు సృజియింప - నొల్లడజుడు. 28
తే.గీ|| నిరియమిని లేత చందురు - కరణి వక్ర
        ములును మిక్కిలి యెఱుపులై - యలరుమోదు
        గలు నపంతు జెరిన సన - స్థలులు కపుడు
        గలుగుగోటి నొక్కుల బోలె - వెలయుచుండె 2
తే.గీ|| అళుల యంటను కాటుక - నలన జిత్ర
        మైన తిలకంబు మొగమున - గాన మాని
        చిగురు మోవి లేతయరుణు - చెలువురక్తి
        నలరగై సేసికొనె నప్పు - డామనిసిరి. 3
తే.గీ|| ప్రేంకణపు బూదుమరముల్ - మృగవిలోచ
        నములరాలగ గనులుగా - నక మదమున
        బైరకెదురుగ నవి మర్మ - రారసములం
        బండు టాకులు రాలున - న్వనులదిరిగె. 31
తే.గీ|| గండు గోయిలల్ మావిమొ - క్కలను మెక్కి
        వగరు గల్గు కంఠబుల - బలుకసాగె
        ననియు మాననీమానము - లనియజేయు
        మన్మధుని అల్కులై యొప్పె - మాధసమున 32
తే.గీ|| ఇనము దొలగుటచే నొవ్వి - యెడలినట్టి
        మోపు లాపాండురంబులౌ - మోములుగల
       కింపురుష వనితలకు జ - నింప గొడగె
       వివిధసత్త్ర రేఖలయందు - స్వేద జలము 33
తే.గీ|| ఇటు, అదాటున మధుని వి - జృంభణమున
        స్థాణునాశ్రమ వాసు లౌ - తానసులకు
        జిత్తములు వికృతిం బొందు - జిట్టచివర
        కెట్టులో యాసికొని రొక్క - పట్టుదలను 34
        

తే-గీ|| పూల విల్లెక్కుపట్టి పూ - బోడి గూడి
         భవుని నెలవునకుంజిత్త - భవుడురాగ
         ద్వంద్వమ్లు కాష్ఠగతినొంది - తమకమునను
         భావమ్లను గ్రియలచేతల్ల్ - బయలు నఱచె 35
తే-గీ|| ఒక్క పూవోరలోదెనె - నువిదకిచ్చి
         మిగత దాద్రావె గండు తు -మ్మెద యొకండు
         స్పర్శసుఖమున ఱెప్పలు - వ్రాల్చు మృగిని
         కృష్ణసారము గొకెను - శృంగమునను. 36
తే-గీ|| ప్రేమచే గరేణువు పద్మ - రేణు గంధ
         మైన పుక్కిటి జలమును - దాని కొసగె
         సగము నమలిన బిసమును - జాయ కిచ్చి
         గార వించెను మిగుల జ -క్కవయొకండు 37
తే-గీ|| శ్రమ కణంబుల నించుక - జాఱి నట్టి
         సత్త్రరేఖల బుష్పాస - నమున నుడియు
         కనుల శోబ్నిలి పాడేడు - కాంతమోము
         చుంబనము గొనె గింపురు - షుం డొకండు. 38
తే-గీ|| నిండు పుష్ప గుచ్చములు పా - లిండులుగను
         నెలయు చివుళు లందములైన - పెదవులుగను
         గలిగి సాంపొందు తీగలో - టులను జెట్లు
         ప్రేమ శాఖాబుజముల బ -రిష్వజించె. 39
తే-గీ|| అట్టివేళ నచ్చరల గే - యముల వినియు
         భర్గు డాత్మాను సంధాన - పరుండ యయ్యె
         హృదయ నిగ్రహులకు విస్సు - బృందము దమ
         సంయ మంబును భంగిప - జాలవెన్న 40
తే-గీ|| తీగ యింటె గడప నంది - తివిరి నిలిచి
         ఎడమచేత బఆంగరుబెత్త - మొసగబట్టి
         తర్జనిని నోరుమూయుచు - దర్జనముల
         నల్లరింజేయ కుండ దా - నడచుచుండే. 41
తే-గీ|| కదల కుండెను జెట్లు, తు - మ్మెదలు తిరుగ
         వండజములు కూయవు; మృగ - తండమ్లును

         సంచరింపవు; నందికే - శ్వరుంజి యాజ్ఞ
         నవ్వనంబెల్ల జిత్తరు - పట్టు లిలొప్పె 42
తే-గీ|| పయినమందు జుక్కయెదురు - పట్టు దొలగు
         పగిది నందికేశ్వరు దృష్టి - పట్టు దొలగు
         చెంతనున్నట్టి సురపొన్న -చెట్టునెక్కి
         శూలి ధ్యానాప్పదముజొచ్దె - సుమశరుండు 43
తే-గీ|| దేవదారువేదికపయి - ద్వీపి చర్మ
         మునకు గూరుచుండి సమాధి - ముద్రబూని
         యున్న ముక్కంటి హరుని నా - సన్నకాయ
         పతనుడగు సుతనుందు భా- నజుడు గాంచె 44
తే-గీ|| పైసగము దేహమును జలిం - పక కదించి
         రెండు భుజమౌల గిదియించి - రెండుకేలు
         ఱెల్లకిల విరిదామర - వితమున నొడి
         నదుమ నిదికొని నీరాస - నమున నుండి 45
తే-గీ|| అహులచే జదలలెగగట్టి - యక్షమాల
         రెండుపేటల జెనియించు -వ్రేలవైచి
         కందకాంతిచే మిక్కిలి - కఱ్ఱియగును
         ముడులు గలయిఱ్ఱితోలుఇ క - ప్పుగలవాని 46
తే-గీ|| నిశ్చలోగ్ర తరకలు కొం - చియ్ము వెలుగ
         బొమలు పక్ష్మలంబులు నిశ్చ -.లములు గాగ
         గ్రిందికి బ్రసరించెడు - కిరణములను
         గంటె చూపుల నాసికా - గ్రమున నిలిపి 47
తే-గీ|| వాయువుల లోన గట్టుట - వలన నపుడు
         వాననడిలేని మేఘంబు - వలె దనర్చి
         యలలు లేని తటాకంపు - తనువుగలిగి
         సయిరలేమి నిష్కంపదీ - పంబువోలె 48
తే-గీ|| పునుక కంటి మార్గంబును - బొంగి యిచ్చి
         నలలేచిన కాంతి మొ - ల్కల వలనను
         దూటి పోగుకంటె నతిమృ - దుత్వమైన
         బాల చంద్రు శోబను నల్ల - పఱచు చుండ 49