తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/అరసున్న

8

అరసున్న

తెలుఁగుభాషకుఁ దోడిభాషలగు ద్రవిడ కర్ణాటకములందుఁగాని, ప్రకృతులగు సంస్కృత ప్రాకృత భాషలందుఁగాని యరసున్న లేదుగదా! అట్టిచో నిది తెలుఁగున నెప్పుడు పుట్టినది? ఎట్లు పుట్టినది? భాషా లక్షణములను బరిశీలించుచుఁ బూర్వపూర్వకాలమునకుఁ బోనుపోను ద్రవిడ కర్ణాటాంధ్ర భాషల భేదము తక్కువతక్కువై మూఁడు నొక్కటిగానే యున్న కాలముగూడ నొకప్పు డుండుటను మనము గుర్తింపఁగలము. నన్నయకుఁ బూర్వకాలమున నీ యరసున్న యున్న దనుట కాధారము నాకుఁ గానరాకున్నది. నన్నయాదుల నాళ్ళనుండియే యరసున్న వెలయఁ జొచ్చినట్టు వారి గ్రంథములఁబట్టి గుర్తింప నగుచున్నది. సహజముగా బదమందున్న యొక యక్షరమునకో, కొన్ని యక్షరములతో ఆదేశమై వచ్చినదిగాని నాసిక్యహల్లు ఇతరహల్లుతో సంయుక్త మయినప్పు డేర్పడిన హల్ ద్విత్వము శిథిలము కాఁగా నందలి శిథిలానునాసికమే యరసున్నగా నన్నయాదుల కాలము నుండి మాటె నని చెప్పఁడగును. దీని కించుక వివృతి.


ద్రవిడ కర్ణాటభాషలలో సంయుక్తహల్లులు పూర్వాక్షరమునకు గురుత్వమును గల్పింపకుండఁ బెక్కులు గలవు. అట్టివానిలో పెక్కింటి ద్విత్వము తెలుఁగుఁదనము వేరుడి యేర్పడిననాఁటికి మాసిపోయినది. తెగఱ్గుం, నెగఱ్గుం ఇత్యాదులు తెగడున్, నెగడున్ ఇత్యాది రూపములు బడసినవి. హల్ ద్విత్వములో ద్వితీయ హల్లు లోపించినప్పు డిట్టి రూపము లేర్పడినవి. మొదటిహల్లు లోపింపఁగా నేఁటి మన యరసున్న యైనది. మెఱుమ్ మెఱుపు. దీనిమీఁద బహువచన ప్రత్యయమగు 'కళ్' గలయఁగా 'మెఱుమ్ గళ్' అయ్యెను. 'కళ్' ప్రత్యయయే తెలుఁగుఁదనమును బడయునాఁటికిఁ బెక్కుశబ్దములమీఁద 'గులు' గాను 'గలు' గాను, 'కులు గాను 'కలు' గాను మాటి, తొలియక్షరములగు 'గు' 'గ' కు 'క' లు పాత్రిపదికమునఁగలసి బహువచన ప్రత్యయముగా, 'లు' మాత్రమే మిగిలెను. అడుగులు, నుడుగులు, గొడుగులు, వెలఁగలు, ఈగలు, కొలఁకులు, వలఁకులు, చిలుకలు, ఎలుకలు ప్రభృతు లిట్టివే. క్రమముగా మెఱుమ్ముళ్, మెఱుముళ్, మెఱుముళు, మెఱుములు అను రూపము లేర్పడెను. ఇక్కడ వికల్పముగా శిథిలద్వీత్వ మేర్పడుటచే మకారమును ఊఁడి పలుకుట, తేల్చిపలుకుట యను భేదముచే రెండురూపము లేర్చడినవి. ప్రాకృతసంప్రదాయమునుబట్టి వర్గానునాసికములకు సున్న పెట్టుట యేర్పడఁగా 'మెఱుంగులు' అను రూప మేర్పడెను. ద్విత్వము: శిథిలము కానప్పుడు ప్రాయికముగా 'మెఱుంగులు' అను లిపియును, శిథిల మయినప్పుడు 'మెఱుగులు' అను లిపియును ఉండెను. లిపిలో అరసున్న ప్రాంత మున్నూజేండ్లకు ముందు లేనేలేదు, ఈ బహువచన రూపముననుండి ప్రత్యయావయవమగు 'గు' ప్రాతిపదికమునఁ జేరఁగా మెఱుంగు, మెఱుఁగు అని యేకవచన రూపములు పుట్టెను. నన్నయ నాఁటి కీపరిణామము ప్రబలమయి శిథిలద్విత్వ మను వ్యవహారము శిథిలము కాఁజొచ్చినది. ప్రాకృత సంప్రదాయము చొప్పున వర్గానునాసికము: తొలిహల్లుగాఁగల సంయుక్తాక్షరములందు అనునాసికమునకు బదులు సున్న నుంచుసంప్రదాయము పెంపొందఁ జొచ్చినది. కర్ణాటకభాషలో గొన్ని శబ్దముల ద్విత్వమునకు నిత్యముగాను, గొన్నింటికి వైకల్పికముగాను శైథిల్యముగలదు. అట్టిపదములు మన తెలుఁదనమును బొందునాఁటికి! గొన్ని యశిథిలద్విత్వములుగానే నిలిచినవి. కొన్నింట ద్విత్వము లోపించి మొదటిదో, రెండవదో ఏదో ఒకహల్లే నిలచినది. కొన్నింట ద్విత్వము విడఁబడి నడుమ నచ్చుగూడినది.కొన్నింట నాసిక్యముగానీ, తొలిహల్లు లోపించి తత్ స్థానమున నాసిక్యహ యేర్పడినది. కర్ణాటక శిథిల ద్విత్వముల కును, దెఁలుగు శిథిలద్వీత్వములకును గొన్నిభేదములు గలవు,

మీదఁ బేర్కొన్న పదములలో వెలఁగలు, ఈగలు, కొలఁకులు, వలఁకులు అనువానిలో నిట్లే అరసున్నలు పుట్టినవి. వెలఁగచెట్టునకు అఱవమున 'వెలమ్' అని పేరు. 'వేలమ్ గళ్' నుండి 'వెలఁగలు' వచ్చెను. ఈఁగలు-ఈ పదములో 'ఈ' ప్రాతిపదికము, కళ్ ప్రత్యయము కలిసి పరిణామములఁబొంది తెలుఁగుఁదనము వచ్చునాఁటికి 'ఈగలు' బహువచన రూపముగాను, ఈఁగ ఏకవచనరూపముగాను నయ్యెను. ఆఅవమున ఈగకుఁ బేరు 'ఈ' అనియే. బహువచనమున నది 'ఈగళ్ అగును. కాని యిందు శిథిలద్విత్వతల్లోపాదిక మేదియు లేదుగదా, 'ఈఁగలు' అని తెలుఁగున నరసున్న యెట్లు వచ్చెను? అని ఆక్షేపము తోఁచును. పరిశీలింపఁగా నిందు శిథిలద్విత్వము కల దని యేర్పడును. మక్షికకు 'ఈ' అను పేరు. అది చేయుధ్వనినిబట్టి వచ్చెను. దాని ధ్వనియగు ఈ కారము అచ్చులలోని దగు తాలుజన్యమయిన 'ఈ' మాత్రమే కాదు. ఈ ఈకారము ప్రధానముగా నాసిక్యముగూడనగును. ఒక రేదేని చెప్పు చున్నప్పుడు వినువారు 'ఊఁకొట్టుట'లో ఊకారముకూడ నిట్లే ఓష్ఠ్యము మాత్రమే కాక నాసిక్యముగూడ నగును. ఈఁగలధ్వనిని, ఊఁ కొట్టుటను నుచ్చరించునప్పుడు ముక్కుతో నుచ్చరింపవలసియుండును. ముక్కు మూసికొని వీని సుచ్చరింపఁ గుదురదు. కావున ఈఁగల ధ్వనిలోని ఈ కారమునకును, ఊఁ కొట్టుటలోని ఊకారమునకును అంతమునఁగల నాసిక్యధ్వని 'గళ్' పరమయినప్పుడు కవర్గానునాసికమగు 'బ్'గా వినవచ్చును. అప్పుడు ఈజ్ గళ్, ఊజ్ కొట్టు పదములు వచ్చును. పూర్వోక్తవిధమున నివి వికల్పముగా శిథిలత్వములై యనునాసిక థానమున సున్నలఁ బొంది ఈంగలు, ఊం కొట్టు, ఈఁగలు, ఊఁ కొట్టు, రూపములం. బడసినవి.

కొంత కాలమునకు దీర్ఘముమీఁది సున్న సూఁదిపలుకుట మాసి తేలఁబలుకుటే నిలిచెను. కాలక్రమమున ఈంగలు, ఊంకొట్టు రూపములు పోయి ఈఁగలు, ఊఁకొట్టు రూపములే నేఁటికి మిగిలినవి. లేపటి కాలమున నీఁక నీయరసున్నలుగూడ సంతరింపనున్నవి. నన్నయకుఁ బూర్వకాలమునను, నించుక తర్వాతి కాలముననుగూడ నేఁటి యర్థానుస్వారము అనునాసిక సంయుక్తాక్షరముగా నుంచుటను. నా సంయుక్తాక్షరము పూర్వాక్షరమునకు గురుత్వమును గూర్శక శిధిలముగా నుండుటను బెక్కు శాసనములు నిరూపించుచున్నవి. నన్నయకుఁ బూర్వపు శాసనములలో పండరంగశాసనమందును. యుద్ధమల్ల శాసనమందును నీ తీరును జూడవచ్చును. నన్నయకుఁ దర్వాతి వానిలో దక్షిణ హిందూదేశశాసనసంచయమువాల్యుంలో ననేక పద్యశాసనము లిట్టి తీరులవి గలవు. మాదిరి కోకటి రెండు పద్యములు జూపుచున్నాఁడను. క్రీ. 1065 నాఁటి శాసనము.

గీ. సకలవసుమతీశమకుటలసద్రత్న
కిరణరు చివిరాజిచరణు ణయిన

క్రీ. 1128 వ నాఁటిశాసనము

క. సూరికవిస్తుతు జ్ఞానముండు
చారుచతుర్దాన్వయాబ్దిచంద్రుణ్ణు గుల ని
స్తారకుడ్లు సుజననిధి రిపు
హరణగజరిఫుబుద్ధవమ్మ" (బుద్ధవర్మ) జనించెను.

ఈ పై పద్యమున అనునాసికసంయుక్తహల్లు ఒకచోటననునాసిక

స్థానమున సున్నతో నుండుట గాననగును. ఇది యనునాసికములు

తెలుఁగుమెఱుంగులు

77

సున్నలుగా లిపిలో మార్పుచెందుచున్న కాలము. సున్న లుంచుట యింకనుఁ బ్రబలముగాలేదు. 'స్తుతుణు' అనియున్న విధమునఁ గాక, తర్వాత 'అనఘుండు' అని 'జ్ఞు' కు బదులు 'ండు' ఉన్నది. నేను మీఁదఁ బేర్కొన్న విధమునఁ దెలుఁగునఁ గల యరసున్నలు ప్రాయికముగా సంయుక్త హల్ లోపమువలన నేర్పడినవిగాఁ గుదురుచున్నవి. అరసున్నలు గల శబ్దముల నిఁక నీ విధమున సమన్వయించి చూచెదను.

ప్రొఫెసరు శేషగిరిశాస్త్రిగారు పూర్వము అర్ధానుస్వారమునుగూర్చి యొక గ్రంథము రచించి ప్రకటించిరి. వెనుక ఎప్పుడో నేను దానిని చూచితిని. ఇటీవల నా కది యెక్కడను గానరాలేదు. దీనిని నేను వ్రాయుటలోఁ బూర్వ మెప్పుడో పనిచేసియుండవచ్చును. కాని వారి గ్రంథమున అర్ధానుస్వారము పుట్టుటకు నే నిప్పుడు చెప్పిన ప్రక్రియ యున్నట్టు లేదు. అక్షరలో పస్థానీయముగా అరసున్న వచ్చె నని వారు వ్రాసియుందు రని స్మరించుచున్నాను. ద్విత్వ శైథిల్యాదికమును వారు గుర్తించియుండరు. 'ఆంధ్ర శబ్దతత్త్వ' మని పోరు ప్రకటించిన వేటొక గ్రంథమున నేఁజూచితిని, అందు వారు కొలఁకులు మొదలగు శబ్దరూపములు 'కళ్' ప్రత్యయము కలయుటచేత నేర్పడిన వని నిరూపించిరి. జహుకాలమునకుఁ బూర్వము వారు కొంత ప్రశస్తపరిశోధనము నెలపి గ్రంథములఁ బ్రకటించిరి. కాని వానిమీఁద నింక నెంతో మంచి పరిశోధనము పెంపొందవలసియున్నది.

  • * *