తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/నీ పాపము కూల
నీ పాపము కూల
ఇలా ఎన్నో దీవెన వాక్యములు దూషణలుగ మారియున్న ఈకాలములో కూడ ఒకే ఒక దీవెన తిట్టుకాక దూషణగకాక మద్యలో మిగిలిపోయినది. "నీ పాపము కూల" అను వాక్యము స్వచ్చమైన దీవెనే అయినప్పటికి అది ఊత పదముగ మిగిలిపోయినది. ఇప్పటికి కొన్ని పల్లెప్రాంతములలో కొన్ని ప్రాంతీయ భాషలందు "నీ పాపము కూల" అనియు, అదేపదమునే "నీ పాసుకూల" అనియు అనుట వినుచున్నాము. ఇంతకుముందుచెప్పిన ఏడు దీవెనలను ఎక్కువగ ఆడవారే తిట్లరూపములో ఉపయోగిస్తుండగ, నీపాసుకూల అనే వాక్యమును మగవారే ఎక్కువగ వాడుచున్నారు. పూర్వము గురువులు, స్వాములు, మహర్షులు తమ శిష్యులను, భక్తులను పాపమునుండి విముక్తి గావించుటకు వాడిన దీవెనయే "నీ పాపము కూల" అనుమాట. నీ పాపము కూల అనుమాట కాలక్రమమున 'నీపాసుగూల' అను మాటగ కూడ మారిపోయినది.
-***-