తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 37

రేకు: 0037-01 మలహరి సం: 01-227 తిరుపతి క్షేత్రం


పల్లవి: అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము
       లందు వెలుగొందీ ప్రభ మీరఁగాను

చ.1: తగ నూటయిరువై యెనిమిది తిరుపతుల గల
      స్థానికులును చక్రవర్తి పీఠకములును
      అగణితంబైన దేశాంత్రుల మఠంబులును
      నధికమై చెలువొందఁగాను

చ.2: మిగుల నున్నతములగు మేడలును మాడుగులు
       మితిలేని దివ్య తపసులున్న గృహములును
       వొగి నొరగుఁ బెరుూమాళ్ళ వునికి పట్టయివెలయు
       దిగువ తిరుపతి గడవఁగాను

చ.3: పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపాంది
       పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి
       చెదరకే వంక చూచిన మహాభూజములు
       సింహశార్జూలములును

చ.4: కదిసి సురవరలు కిన్నరులు కింపురుషులును.....
       గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు
       విదితమై విహరించు విశ్రాంతదేశముల
       వేడుకలు దైవారగాను

చ.5: యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద-
       యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁద
       అక్కజంబైన పల్లవరాయని మటము
       అలయేట్లపేడ గడవ
       చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి
      మొక్కుచును మోకాళ్ళముడుగు గడచిన మీఁద-

       
        సరుగననుఁ గానరాఁగాను

చ. 7: ప్రాకటంబైన పాపవినాశనములోని
        భరితమగు దురితములు పగిలి పారుచునుండ
        ఆకాశగంగ తోయములు సోఁకిన భవము
        లంతంత వీఁడి పారఁగను
        యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును-
        లెన్న నగ్గలమైవున్న వైష్టవులలో
        యేకమై తిరువేంకటాద్రీశుఁడాదరిని
        యేప్రాద్దు విహరించఁగాను

రేకు: 0037-02 ముఖారి సం: 01-228 భక్తి


పల్లవి:సిరి దొలంకెడి పగలు చీఁక టా యితఁడేమి
       యిరవు దెలిసియుఁ దెలియనియ్యఁడటుగాన

చ.1: తలపోయ హరినీలదర్పణంబో ఇతఁడు
      వెలుఁగుచున్నాడు బహువిభవములతోడ
      కలగుణం బటువలెనె కాఁబోలు లోకంబు
      గలదెల్ల వెలిలోనఁ గనిపించుఁ గాన

చ.2: మేరమీరిననీలమేఘమో యితఁడేమి
      భూరిసంపదలతోఁ బొలయుచున్నాడు
      కారుణ్యనిధియట్ల కాఁబోలు ప్రాణులకు
      కోరికలు దలఁపులోఁ గురియు నటుగాన

చ.3: తనివోనిఆకాశతత్వమో యితఁడేమి
      అనఘుఁడీ తిరువేంకటాద్రి వల్లభుఁడు
      ఘనమూర్తి అటువలెనె కాఁబోలు సకలంబు
      తనయందె యణఁగి యుద్బవమందుఁగాన

రేకు: 0037-03 ఆహిరి సం: 01-229 అథ్యాత్మ


పల్లవి: తనవారలు పెరవారలుఁ దానని యెడివాఁ డెవ్వఁడు
       తనుగుణముల దిగవిడిచినధన్యుం డాతఁడెపో

చ.1: తెగఁబడి మదనసముద్రము దేహముతోడనె దాఁటిన
      విగతభయుం డతఁ డెవ్వఁడు వీరుం డెవ్వఁడొకో
      పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి
      జగదేకప్రీతుండగుచతురుం డాతఁడెపో

చ.2: యేచినపరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన
      ధీచతురుం డతఁడెవ్వండు ధీరుం డెవ్వఁడొకో
      చూచిన మోహపుఁజూపులఁ జురుచూండ్ల కెడమియ్యని
      రాచఱికపు నెరజాణఁడు రసికుం డాతఁడెపో

చ.3: చావుకు సరియగు ద్రవ్యవిచారపు తుగులులఁ బాసిన
      పావనుఁ డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకో
      శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన -
      దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో

రేకు: 0037-04 దేవగాంధారి సం; 01-230 అథ్యాత్మ


పల్లవి:చెప్పుడుమాటలే చెప్పకొనుటగాక
       చెప్పినట్లఁ దాము నేయ రెవ్వరును

చ.1:దొడ్డయినశరీరదోషమైనయట్టి
      జడ్డు దొలఁగవేయఁజాల రెవ్వరును
      గడ్డబడి యీఁతకాండ్లాటగాని
      వొడ్డునడుమ నీఁద నోపరెవ్వరును

చ.2:శ్రీవేంకటేశుపైఁ జిత్త మర్పణ నేసి
      యీవిధు లన్నియు నెడయ రెవ్వరును
      చావు బుట్టగులేని జన్మముగలసర్వ.-
      దేవతామూర్తులై తిరుగ రెవ్వరును