తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 13
రాగము: గుండక్రియ రేకు: 0013-01 సంపుటము: 1-77
॥పల్లవి॥ ఏఁటి విజ్ఞాన మేఁటి చదువు
గూఁటఁబడి వెడలుగతిగురుతు గనలేఁడు
॥చ1॥ ఏడుమడుకలచర్మ మింతయునుఁ దూంట్లై
గాడఁబెట్టుచుఁజీము గారఁగాను
పాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణి
వీడఁదన్ను కచనెడి వెరవు గనలేఁడు
॥చ2॥ కడుపునిండిన మహాకష్టంబు నలుగడల
వెడలుచును బెనుమురుకి వేయఁగాను
యిడుమఁ బొందుచు సుఖంబిందుకే వెదకీని
వొడలు మోవఁగ జీవుఁడోపననలేఁడు
॥చ3॥ వుదకమయమగుకన్ను లురికి యేమైనఁగని
మదవికారము మతికి మరుపఁగాను
యిది యెరిఁగి తిరువేంకటేశుఁగని జీవుఁడా-
సదమలానందంబు చవిగానలేఁడు
పల్లవి: | అతిదుష్తుఁడ నే నలసుఁడను | |
చ. 1: | ఎక్కడ నెన్నిట యేని సేసితినొ | |
చ. 2: | ఘోరపుఁబాపము కోట్లసంఖ్యలు | |
చ. 3: | యేఱిఁగి చేసినది యెఱఁగక చేసిన | |
రేకు: 0013-03 కన్నడగౌళ సం: 01-079 వెరాగ్యచింత
పల్లవి: | దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట | |
చ. 1: | ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులు | |
చ. 2: | యీకాంతలు నీద్రవ్యము లీకన్నూలవెడయాసలు | |
చ. 3: | దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తము | |
రేకు: 0013-04 శంకరాభరణం సం: 01-080 దశావతారములు
పల్లవి : | ఆదిమపూరుషుఁ డచ్యుతుఁడచలుఁడనంతుఁడమలుఁడు | |
చ. 1: | ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములోఁ | |
ు
చ. 2: | అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటిన రూపము | |
చ. 3: | క్షీరపయోనిధి లోపల శేషుఁడు పర్యంకముగా | |
రేకు: 0013-05 దేసాళం సం: 01-081 వైరాగ్య చింత
పల్లవి : | అప్పులవారే అందరును | |
చ. 1: | ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ | |
చ. 2: | యేది దలంచిన నేకాలంబును | |
చ. 3: | యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీ | |
రేకు: 0013-06 శంకరాభరణం సం; 01-182 వైరాగ్య చింత
పల్లవి:
పాపములే సంబళమెపుడూ యీ-
యాపదఁబడి నే నలసేనా
చ.1:
ఎన్నిపురాణము లెటువలె విన్నా
మన్న మనువు దిమ్మరితనమే
నన్ను నేనే కానఁగలేనట నా
విన్న వినుకులకు వెఱచేనా
చ.2:
యెందరు వెద్దల నెట్లఁ గొలిచినా
నిందల నామతి నిలిచీనా
కందువెఱిఁగి చీకటికిఁ దొలఁగనట
అందపుఁబరమిఁక నందేనా
చ.3:
తిరువేంకటగిరిదేవుఁడే పరమని
దరి గని తెలివిఁక దాఁగీనా
తిరముగ నినుఁ జింతించినచింతే
నిరతము ముక్తికి నిధిగాదా