తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 286
రేకు: 0286-01 సామంతం సం: 03-494 అధ్యాత్మ
పల్లవి : | నారాయణుఁడ నీ నామము మంత్రించి వేసి | |
చ. 1: | మదనభూతము సోఁకి మగువలుఁ బురుషులు | |
చ. 2: | పంచభూతములు సోఁకి భ్రమసి యజ్ఞానులై | |
చ. 3: | తమితోడ మాయాభూతము సోఁకి బహుజాతి - | |
రేకు:286-02 వసంతం సం 03-495 వైరాగ్యచింత
పల్లవి : | నీ శరణమే గతి నే నితర మెరఁగ | |
చ. 1: | పూఁచిన తొలుకర్మంబులు భోగించక పోవు | |
చ. 2: | కోరిన నా కోరికలు కొనసాగక పోవు | |
చ. 3: | మనసును వాకునుఁ జేఁతయు మానుమన్నఁ బోవు | |
రేకు:0286-03 ముఖారి సం 03-496 వైరాగ్యచింత
పల్లవి : | కడవ రాదు హరి ఘనమాయ! తెగి | |
చ. 1: | చూపుల యెదిటికి సోద్యంబైనది | |
చ. 2: | మనసు లోపలికి మర్మంబైనది. | |
చ. 3: | తగు మోక్షమునకుఁ దాపయైన దిదె | |
- రేకు:0286-04 రామక్రియ సం : 03-497 శరణాగతి
పల్లవి : | పంచేంద్రియములాల పంచభూతములాల | |
చ. 1: | కొందరికి మంచివాఁడ కొందరికిఁ గానివాఁడ | |
చ. 1: | దైవము నిర్మించినది ధరణిఁ బొడమినది | |
చ. 1: | తుంచి సగమటు వోవు తోడనే సగము వచ్చు | |
రేకు: 286-05 భైరవి సం : 03-498 శరణాగతి
పల్లవి : | అటమీఁద శరణంటి నన్నిటా మాన్యము నాకు | |
చ. 1: | ఏది పుణ్యమో నాకు నేది పాపమో కాని | |
చ. 1: | పుట్టినట్టి తెరువేదో పోయేటి జాడ యేదో | |
చ. 1: | చిత్త మెటువంటిదో జీవుఁ డెటు వంటి వాఁడో | |
రేకు: 0286-06 పాడి సం: 03-499 రామ
పల్లవి:
సౌమిత్రిసహోదర దశరథరామా
చేముంచి గుత్తిలో వెలసిన రఘురామా
చ. 1:
చెలిమి సుగ్రీవుతోడఁ జేసిన రామ తొల్లి
శిలనుఁ బడఁతిఁ గావించిన రామా
చెలరేఁగిన వానరసేనల రామా
శిలుగు మాయామృగముఁ జించిన రామా
చ. 2:
తరణివంశ తాటకాంతక రామా
నరనాథ కౌసల్యానందన రామా
సిరులఁ బెండ్లాడిన సీతారామా
గరిమతో సేతువు గట్టిన రామా
చ. 3:
రావణాది దనుజహరణ రామా
కావించి విభీషణునిఁ గాచిన రామా
దీవెన లయోధ్యలోఁ జెందిన రామా
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీరామా