తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 334
రేకు: 0334-01 సామంతం సం: 04-196 శరణాగతి
పల్లవి : | ఊరకే వెదకనేల వున్నవి చదువనేల | |
చ. 1: | కోపము విడిచితేనె పాపము దానే పోవు | |
చ. 2: | ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు | |
చ. 3: | కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు | |
రేకు: 0334-02 లలిత సం: 04-197 అధ్యాత్మ
పల్లవి : | ఎప్పుడూను నడచేవె యేకాలమైనాను | |
చ. 1: | శ్రీపతి యాణాజ్ఞచేతఁ జిక్కనది జగము | |
చ. 2: | నరహరి రక్షణమే నడచీని లోకము | |
చ. 3: | సృష్టికిఁ గుర్తైనవాఁడు శ్రీవేంకటేశుఁ డింతే | |
రేకు: 0334-03 బౌళి సం: 04-198 వైష్ణవ భక్తి
పల్లవి : | {{Telugu poem|type=చ. 1:|lines=<poem> | |
పల్లవి : | ఇంత లేకుంటే నది యెక్కడి సుజ్ఞానము | |
చ. 1: | యెదిటి వారెరిఁగితే యేమీ ననక మరి | |
చ. 2: | క్రియయెరఁగనివారు కీడు సేసితేఁ దాను | |
చ. 3: | వొరసి యెవ్వఁడు దను నుబ్బించి పొగడిన | |
రేకు: 0334-04 మలహరి సం: 04-199 హరిదాసులు
పల్లవి : | పరమోపకారులు ప్రత్యక్షదైవములు | |
చ. 1: | పాపుదురు లోకములో పాపపంకమెల్లాను | |
చ. 2: | చెఱుతు రజ్ఞానమెల్లా జనులు తమ్ముఁజేరిన | |
చ. 3: | చెల్లఁబెట్టుదు రెందైనా చిల్లరకులమువారి | |
రేకు:0334-05 ధన్నాసి సం: 04-200 శరణాగతి
పల్లవి : | నాకుఁ గలపని యిదె నారాయణుఁడ నీవు | |
చ. 1: | జలధివంటిది సుమీ చంచలపు నామనసు | |
చ. 1: | కొండవంటిది సుమీ కొనకెక్కు నామనసు | |
చ. 1: | టీవులను ధరణివంటిది సుమీ నామనసు | |
రేకు: 0334-06 కాంభోది సం: 04-201 గురు వందన, నృసింహ
పల్లవి:
అంతటనే వచ్చి కాచు నాపద్బంధుఁడు హరి
వంతుకు వాసికి నతనివాఁడనంటేఁ జాలు
చ. 1:
బంతిఁగట్టి నురిపేటి పసురము లెడ నెడఁ
బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు
చెంతల సంసారము సేయు నరుఁడందులోనె
కొంత గొంత హరి నాత్మఁ గొలుచుటే చాలు
చ. 2:
వరుసఁ జేఁదు దినేవాడు యెడ నెడఁ గొంత
సరవితోడుతఁ దీపు చవిగొన్నట్టు
దురితవిధులు సేసి దుఃఖించు మానవుఁడు
తరవాత హరిపేరు దలఁచుటే చాలు
చ. 3:
కడుఁ బేదైనవాఁడు కాలకర్మవశమున
అడుగులోనే నిధాన మటు గన్నట్టు
యెడసి శ్రీవేంకటేశు నెరఁగక గురునాజ్ఞ
పొడగన్నవానిభక్తి పొడముటే చాలు