జీవశాస్త్ర సంగ్రహము/అభిప్రాయములు

A FEW OPINIONS.

Dr. C. B. Rama Row, B. A., M. D., Writesː-

I have glanced through your Manual of Biology in Telugu * * * * * I have no hesitation in saying, that you have done a lasting service to the Telugu speaking people, by opening to them a new door to knowledge and by giving to familiar plants and animals new interest and significanae.

I hope that other Telugu graduates will follow the good example you have set and give before long to our people more scientific information in our mother tongues.

Madras, 12-12-08.

M. R. Ry. T. Narayanasawmi Garu, L. M, & S., Asst. Examiner in Telugu, University of Madras, Statesː-

My perusal of the book makes me heartily congratulate the author, no less than the Telugu - reading population whom he has placed under a deep debt of gratitude by supplying to them a useful and interesting scientific subject - the like of which was hitherto unknown- * * * * * It is written in a simple and lucid style. The illustrations are nicely executed and explanatory of the subject, and the glossary is a great help to the readers.

It bespeaks very highly of the author, that he could produce a book of such high merit, considering the short leisure he has, as a student of Medicine.

I recommend the book heartily to the people for whom it is written and wish the author every success.

Madras 18-12-08

M. R. Ry. M. Subrayudu Garu, B. A. pleader, Tanuku, Writesː-

I have studied your Biology no less than thrice. Not being satisfied with that, I made two Matriculation students to study the same book. With my help here and there, they could easily understand the contents therein. I am of opinion that it will be very useful to students who have studied up to Matric. It can be prescribed as a text book for the class.

The style is pure and simple. I sincerely believe that nobody can make a better attempt in this direction than the author of this book.

It is easy to write a novel or a drama, but it is very difficult to write a book like your Biology. I cannot really comprehend how you could find proper Telugu words for all the technical English words in your book.

Your book is a thorough success.

I hope you will spare no trouble to favour the public with another useful book like your Biology.

8-7-08

కొందరి అభిప్రాయములు.

డాక్టరు సీ. బి. రామారావు. బి. ఏ., యెం. డి. గారు

ఇట్లు వ్రాయుచున్నారు:-

మన మనుదినమును చూచుచుండు జంతువులయందును, వృక్షములయందును క్రొత్తక్రొత్త విషయములను కనుబరచి, వానికి నూతనోజ్జీవమునిచ్చి శాస్త్రజ్ఞానము సంపాదించు వారికి తమరు క్రొత్తదారిని చూపియున్నారు. ఇందుచే ఆంధ్రజనుల కెల్లరకును శాశ్వతమైన ఉపకారమును చేసితి రనుటకు సందేహములేదు. * * తెలుగుదేశమునందు పట్టపరీక్షలనొందిన మహాజనులందరును, తమరుకనుబరచిన మంచిమార్గమును అనుగమించి మన దేశభాషలందు నిజమైనజ్ఞానమును త్వరలోనే ప్రజలకిచ్చుదురుగావుత. 12-12-08.

మహారాజశ్రీ ఆచంట లక్ష్మీపతిగార్కి.

అయ్యా,

తమచే వ్రాయబడిన జీవశాస్త్ర మనుగ్రంథమును మొదటినుండి చివరవరకు మిక్కిలిఉత్సాహముతో చదివితిని. ప్రారంభించినప్పుడు నాకీగ్రంథము బోధపడునో కాదో యని సంశయముతోనుంటిని కాని 25 పుటలు అనగా వికారిణిని గురించిన ప్రకరణమును ముగించునప్పటికి గ్రంథముయొక్క యుద్దేశమును పూర్ణముగా గ్రహింపగలిగితిని. పిమ్మట కడవరకు గ్రంథమును ముగించువరకు విడువలేక పోవునంతటిఆశ పుట్టినది.

తమరు వృక్షముల వివాహసంబంధములను వర్ణించుచు వ్రాశిన ప్రకరణము మిక్కిలి చోద్యముగనున్నది. నేను ఇదివరకు రావిచెట్లకు వేపచెట్లకు పెండ్లిండ్లుచేయుటయు, తాడిచెట్లను జువ్విచెట్లు కౌగలించుకొనుటయు చూచి యిట్టివియే చెట్లయొక్క వివాహ సంబంధము లనుకొనుచు వచ్చితిని. ఇట్టి అబద్ధపుపెండ్లిండ్లు చూచుచు సంశయపడు నాబోటి తెనుగుదేశస్థులందరు తమగ్రంథమును జదివి యందు వివరముగ బోధింపబడిన నిజమైన స్త్రీపురుషవివక్షత మొదలగు వ్యాపారములు వృక్షాదులకుకూడ గలవని చక్కగ గ్రహింతురుగాక.

ఇంతసులభశైలిని, ఇన్ని విచిత్రాంశములను, ఇంత వివరముగ వ్రాయగలిగిన మీసామర్థ్యతను నేను ఎంత కొనియాడినను నాకు తృప్తితీరదు. మీరు వ్రాయదలచిన ఇతరభాగములునుగూడ త్వరలోముగించి మాబోటివారలకు జ్ఞానదానము చేయగలరని వేడుకొనుచున్నాను.

పోడూరి సంగయ్య.
కృష్ణాజిల్లా.
7-7-08.

శ్రీయుత టి-నారాయణస్వామి, యల్. యం. & యs. గారు ఇట్లు వ్రాయుచున్నారు:-

తెనుగుభాష నభ్యసించువారల కింతవరకును తెలిసియుండనట్టియు, మిక్కిలి యుపయుక్తమైనట్టియు, మనోహరమైనట్టియు, శాస్త్రజ్ఞానము నిచ్చినందులకైనది. గ్రంథకర్తగారు ఆంధ్రమహాజనుల కృతజ్ఞతకు నెంతయు పాత్రులని నిస్సంశయముగా జెప్పవచ్చును.

గ్రంథకర్తగారు వారికిగల కొద్దివిశ్రాంతి కాలములో నింతటి యుద్గ్రంథమును నింత చక్కగ రచియింపగలిగి రనునదియే వారి సద్గుణములగూర్చి హెచ్చుగ ఘోషించుచున్నది.