జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 9

ఆధ్యాయము 9

జర్మనీలోని ఓక మంచి ఉన్నత పాటేహశాల వర్ణనము

(గెటింజన్ పట్టణములోని ఓబర్ రియల్ షూలె.

ఈ బడిలో రియల్ జిమ్నేసియం బడిలోని పాఠక్రమమున్ను, ఓబర్ రియల్ షూలె లోని పాఠక్రమమున్ను ప్రత్యేక ప్రత్యేక తేరగతులలో నేర్పుతారు. ఇందులో 650 విద్యార్దులున్నారు. 23 ప్రత్యేక క్లాసులున్నవి. ఉపాధ్యాయల సంఖ్య 30; అందు చేతే 20 మంది విద్యార్థుల కొక ఉపాధ్యాయు డున్నాడన్నమాట. క్రింది తరగతులలో ఒకొక్క దానిలో 50 విద్యార్తులున్నారు. బడికయ్యె మొత్తము ఖర్చు 12500 పౌనులు. దీనిలో ఇంచు మించు సగము విద్యార్థులు జీతములవల్ల వస్తుంది. ఉపాధ్యయుల జీతాలు సంవత్సరమునకు 250 పౌనలనుంచి 500 పౌనులవరకు ఉన్నవి. ప్రథానోపాధ్యాయునికి డైరెక్టరని పేరు. ఇతనికి ప్రత్యేకముగా ఎక్కువ జీతము లేదు. సాధారణ ఉపాధ్యాయుని జీతేమే అతనికిన్ని ఇస్తారు. డైరక్టరు పనిని చూడడానికి

63

సంత్సరానికి 60 పౌనులు మాత్రము ఎక్కువగా ఇస్తారు. విద్యార్దులలో నూటికి 20 మందికి ఉచితముగా చదువు చెప్పుతున్నారు. తల్లి దండ్రుల మొదటి కొడుకుకు గాని కూతురుకు గాని నిండు జీతము చెల్లించవలెనన్నీ, రెండో కొడుకు లేక కూతిరికి నిండు జీతములో 3/4 వంతున్ను, మూడో కొడుకు లేక కూతురికి సగమున్ను చెల్లించవలెననిన్నీ, తరువాతి కొడుకులకు, కూతుళ్ళకు జీతము చెల్లించ నక్కర లేదనిన్నీ, జర్మినీలో ఒక పద్ధతి ఉన్నది. ఒక్క తల్లిదండ్రుల పిల్లలందరున్ను ఒకే బడిలో చదువుకోనక్కర లేదు. పిల్లలు వేర్వేరుగా విశ్వవిద్యాలయాలు, వృత్తి కళాశాలలు, ఉన్నత పాఠాశాలలలో చదువు కొంటూ ఉన్నా, ఇదే పద్ధతిగా జీతాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు వర్ణిస్తూ ఉన్న బడిని దాని కోసము కట్టిన భవనములోనికి మార్చినారు. దానిలోని వసతి, దాని ఆకారము దానిలోని విద్యా సాధన సామగ్రి, అంతా మిక్కిలి నవీన పద్ధతులమీద ఉన్నది. ప్రతి గదికిన్ని విద్యుచ్చక్తి చేత నడిచే గడియారమున్నది. ఈ గడి

64

యారాలన్ని టికీ మూలమైన గడియారములోని

వేళను నక్షత్ర పరిశోధన శాలలోని గడియారము ప్రకారము సరి చేస్తూ ఉంటారు. తల్లిగడియా రముఖరీదు 30 పౌనులు, పిల్లగడియారముల డయ లు 1- కి 2 పౌనులు ఖరీదు. అన్నీ ఏక కాలమండు ఒక టే వేళను చూపుతవి.

ఈబడిలో చెప్పే విషయాలలో శాస్త్రము, గణితము విశేషములు, శాస్త్ర విద్య అనుభవము మీర ఎక్కువ ఆధారపడి ఉంటుంది, పుస్తకాల విద్య తక్కువ. పిల్లలు క్లాసులలోకంటె శోధనాగారాలలో ఎక్కువకాల ముంటారు. ప్రతీ విద్యార్థికిన్ని ప్రత్యేకముగా ఒక టేబిలు విద్యు త్ప్రవాహము, గేసు, నీటి గొట్టములు, ఉంటవి. ఈ టేబిలుమీద విద్యార్థి తనపు స్తకాలు, కాగి తాలు ఉంచుకొని పరిశోధనలను చేసుకో వచ్చును. విద్యార్థులు ఉపాధ్యాయులు చేసే పరి శోధనలను చూడడమే కాకుండా, తాముకూడా చేస్తూ ఉంటారు. భూగోళ శాస్త్ర పాఠాలలోకూడా ఇ దేపద్ధతి అవలంబిస్తారు. ప్రతి విద్యార్థికిన్ని


65

తన టేబిలు మీద చిన్న దేశపటముంటుంది,

గణితమును ప్రఫెసకు క్లీను ఏర్పాటు చేసిన కొత్తద్ధతి ప్రకారము నేర్పు తారు.ఈబడి డైరెక్టరు క్లీ నుశిష్యుడు. గణితములో గొప్ప పేరు గడించిన వారు. ఇంగ్లీషు, ఫ్రెంచిబడులలో జీవశాస్త్రము నంత బాగుగా చెప్పరు. జర్మను పాఠశాలలలో ఇండియాలోని అత్యు తమ కళాశా లలో కంటె ముచివైన జీవ శాస్త్ర పరిశోధనా లయములు, వస్తువ దర్శనశాల , తోటలును, ఉన్నవి. ఇటువంటి సౌకర్యములు లేకపోవడము చేతనే ఇంగ్లీషు విశ్వవిద్యాలయాలలో విద్యా ర్థులు సాధారణముగా జీవశాస్త్రమును అభిమాన విషయముగా తీసుకోరు.

యుద్ధము ముగిసిన తరువాత, ఆటలు, వ్యా యామక్రీడల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకొంటున్నారు. ఈబడిలో ఉర్న హాల్ అనబడే మిక్కిలి నవీన పద్ధతులమీద ఒక వ్యాయామరంగమును నిర్మించినారు. వ్యాయా మము కాగానే పిల్లలకు "వేడినీళ్ళతోనో , చన్నీళ్ళతోనో స్నానము చేయ

66

డానికి సదుపాయము లున్నవి, కసరత్తు కవాతు తక్కిన విషయాలతో సమాన స్థానము వహించి ఉన్నవి. పరీక్షలకు అవి ఎంత ముఖ్యములో, ఇవి అంత ముఖ్యములుగానే పరిగణిస్తారు. జర్మను బడులలో మిలిటరీ కవాతున్ను , తుపాకులు కాల్చడమున్ను నిషేధించబడినవి. పిల్లలకు మిలి టరీ స్వచ్ఛందదళములు లేవు.

నెలకొక రోజు నిర్బంధముగా పిల్లలు శాస్త్ర పరిశోధన విహారమునకు పోవలెను.ఈ దినమునకు "వండర్ టగ్” (Wander tag) అని పేరు. ఈదినమును "మొన్నటి యుద్ధ కాలములో గవర్న మెం టువా రేర్పాటు చేసినారు. బరువైనసంచి మోసు కొని బారులుగా పోవడమును పిల్లలకు నేర్పేవారు వయస్సుమీరిన పిల్లలను యుద్ధములోనికి తీసికొని పోవడమే ఈశిక్షణముయొక్క ఉద్దేశము. ఇప్పుడీ శాస్త్రపరిశోధన విహారములకు పిల్లలు తమ ఉపా ధ్యాయులతో కలసిపోతారు. చిన్న పిల్లలు దగ్గర నున్న పట్టణములకుపోయి ప్రకృతి పరిశీలనముతో కాలము గడుపుతారు. పెద్దపిల్లలు ఫాక్టరీలు,

67

నౌకాలయాలు, మొదలయిన కార్ఖానాలకు పో- తారు. ప్రతి విద్యార్థిన్ని తాను చూచినదంతా వ్రాసుకొని, విహారమును గురించి ఉపన్యాసము వాయవలెను. ప్రధానోపాధ్యాయుని యాజ మాన్యమున నడిపే బడి పత్రికలో వీటిలోకొన్ని టిని ప్రకటిస్తారు.

విద్యార్థులకు తమతమ సంఘము లున్నవి కాని ఇంగ్లాండులో ప్రతిబడి లోను ఉండే చర్చా సంఘము లున్నున, పఠనాలయాలున్ను జర్మనీలో లేవు.

ఆల్లిదండ్రుల సంఘములు .

( ఏల్ టెర్న బెయ్ గాట్ Elternbeirat)

జర్మ నీ ప్రతిబడిలోసు శాసనము ప్రకా రము ఒక తల్లిదండ్రులనంఘ ముంటుంది. దీనిలోని సభ్యులను పిల్లల తల్లిదండ్రు లెన్ను కొంటారు. 50 మంది పిల్లలకొక సభ్యుడు చొప్పున బడిలోని పిల్లలసంఖ్యను బట్టి ఈ సంఘములొ సభ్యుల సంఖ్య కూడా ఉంటుంది గృహవిద్యకున్ను పాఠశాలా విద్యకున్ను సామరస్యము కల్పించడము, పిల్లల

68

తల్లిదండ్రులలొ బడిలొని పనినిగురించి ఉత్సాహము పుట్టించడము, ఔన్నత్యమును ఎక్కువ స్థాయిలో ఉంచడము, అనేవి ఈసంఘము ఉద్దేశములు, ఈసంఘములు , కొన్ని మంచిపని చేస్తవి. బడిలొని తరగతులలోనికి పోవడానికి తల్లిదండ్రులకు హక్కున్నది. యుద్ధమునకు పూర్వ మిట్టి ప్రశంసకే అవ కాశము లేకుండేది. ఇప్పుడు స్వాతంత్ర్యము ఇంకా ఎక్కువ అయినది. విద్యా ర్తులు తమ లొ ఒక రిని తమకుబదులుగా మాట్లాడుడానికి ఎన్ను కొంటారు.వీనికి " స్పీకర్” (Sprecher) అని పేరు. ఈవిద్యా పాఠక్రమమును గురించిన్ని, కాలమును గురించిన్న, తమ ఉపాధ్యాయునితోను తలిదంషుల సంఘముతోను విద్యార్థుల కోరికలను తెలుపుకోవచ్చును. విద్యా తమకోరికలను అమలులో పెట్టుకొనుట కధికారము లేదుగాని, వాటినివి నేటట్లు చేయగలరు,

ప్రతిబడికిన్ని “లాండ్ "షేమ్' (Landsheim) అనే ఒక గృహ ముంటుంది. ఇది పట్టణమునకు

69

కొంతదూరములో, పల్లెటూళ్ళమధ్య ఉంటుంది.

టెర్ముకు ఒక వారము రోజులు ప్రతి తరగతి వారున్న ఈ ఇంటికిపోయి అక్కడ నే నివసిస్తారు. ఇక్కడ పిల్లలు తమ తిండికోసము సొమ్మిచ్చుకోవలెను. రోజున్ను రెండు.గంట లిక్కడ పాఠములు జరుగు తవి; తక్కిన కాలము పిల్లలు ఏదో ఒక అనుభవము సంపాదించుకొంటూ ఉంటారు. పదార్థవిగ్నాన శాస్త్రము చెప్పే ఉపాధ్యాయును సాధాణ వస్తు వులతో టెలిఫోనులు నిర్మించగా, ఒకరితో ఒకరు దూరమునుండి మాట్లాడు కొంటారు. బోధించే ఉపాధ్యాయుడు నక్షత్రప పరిశోధనము చేయిస్తాడు. ఈగృహమున కనుబంధముగా ఒక పొలము కూడా ఉంటుంది, దానిమీద పిల్లలు పని చేస్తారు. పట్టణాలలో ఉండే బాలురకు పల్లె టూరిజీవనము ఏలాగు ఉంటుందో చూపి నిజమైన జీవనముతో వారికి పరిచయము కలిగించడమే ఈగృహము ఉద్దేశము. ఇక్కడ పిల్లలకు మనసుకు వచ్చినంత మంచిగాలి, వ్యాయామము:, లభించడమే కాకుండా, వారు స్వయముగా పని చేసు


70

కోవడమునకున్ను , నిరాడంబర జీవనము చేయడ మునకున్ను అలవాటు పడు తారు.

అధ్యాయము 10

.

జర్మనీలోని పబ్లికువసతి పాఠశాలలు

.

( లాండ్ షుల్ హేమ్ landschulheim. )

కిందటి శతాబ్దము అంతమున డాక్టరు లీట్సు అనే ఆయన ఇంగ్లాండులోని విద్యా పద్ధతి మీద ఉత్సాహముచూపి “లాండ్ షుల్ హేమ్” అనే పేరుగల మూడు వసతి బడులను స్తాపించినాడు. వాటిలో ఒక టి చిన్న పిల్లలకున్న, రెండోది ఈడు వచ్చిన పిల్లలకున్ను, మూడోది మధ్య వయస్సు పిల్లలకున్ను, ఉద్దేశింపబడ్డవి. చిన్న పిల్లల వసతి బడి ఇంగ్లాండు లోని వసతి ప్రారంభ పాఠ శాలల కున్ను, తక్కిన రెంనున్ను ఇంగ్లీషు పబ్లికు పాఠశా లలలోని రెండు భాగములకున్న సరిపోతవి. వీటిలో క్లాసు చదువు తక్కువగాను, ఆటలు, వ్యాయా ఎక్కువగాను ఉంటవి. ఈ బడులలో

71