జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 16

వచ్చును. దీనికి తక్కినవిషయములలోవలెనే పరీక్ష జరుగుతుంది

ఒక ఫాక్టరీలో గాని, పారిశ్రామిక కంపెనీలో గాని ఏడేళ్ళయినా పని నేర్చుకొంటెనే తప్ప, ఎవరినీ ఈ“హాక్ షులే”లో అధ్యాపకుడుగా నియమించరు. ఈ అధ్యాపకులకున్ను ఆయా పరిశ్రమాధి కారులకున్ను మంచిపరిచయముంటుంది. ఆందు చేత విద్యార్థులకు ఆయా ఫాక్టోరీలలోనికి సులభముగా ప్రవేశమ దొరుకుతుంది.

అధ్యాయము 16

వాణిజ్య విద్య.

జర్మనీలో మొదట వాణిజ్య పాఠశాలను హాంబర్గు పట్టణములో 1771 సం.రములో స్థాపించినారు. తరువాత మరి 20 ఏళ్ళకు బర్లినుపట్టణములో వాణిజ్య సంఘమువారు మరిఒకటి స్థాపించినారు.యుద్ధసమయములోను, ఆతరువాతను, సాధా రణపాఠశాలలవలె వాణిజ్య పాఠశాలలను కూడా


153

ప్రారంభ, ఉన్నత, పాఠశాలలు గాను, విశ్వవిద్యా లయాలుగాను ఏర్పాటు చేసినారు. ఆయావృత్తులలో ఉండి, వివిధ తరగతులలో విద్యను సంపాదించినవారు వీటిలోవేశించ వచ్చును.

వాణిజ్య విద్యాలయము లను (1) ప్రారంభ వాణిజ్య పాఠశాశాలలు (3) ఉన్నత వాణిజ్య పాఠ శాలలు (8) వాణిజ్య కళాశాలలు -అనిమూడు భాగములుగా విభజింపవచ్చును. వీటి పరిపాలనమున్ను , వీటిలోనికి ప్రవేశమున్న కార్మిక వృత్తి. విద్యాలయములలో వలెనే ఉంటుంది.

ప్రారంబ వాణిజ్యపాఠశాలలు

వీటికి "కౌఫ్ మాని షేన్ బెరుఫ్ షూలె.. " అనగా దుకాణదారుల పాఠశాలలని పేరు. చిన్నపట్టణములలో ఈబడులలో చేరడానికి చాలినంత మంది పిల్లలు లేకపోతే సాధారణ వృత్తి పాఠశాల లలో ఈతరగతులుకూడా చేర్చు తారు. అప్పుడా పొఠశాలలను "కౌఫ్ మానీ షెస్' ఫాక్ క్లాసెస్"అంటారు. ఈ రెండు విధములైన పాఠశాలలలోను పాఠక్రమ మొక్కటే. నిర్బంధ ప్రారంభ విద్యను


154

పొంది, దుకాణాలమీద పని నేర్చుకొంటు ఉన్న

బాల బాలికలను వీటిలో చేర్చుకొంటారు. వీటిలో పిల్లలు మూడేళ్ళు చదువుకోవలెను; పిల్లలకు జీతము లివ్వరు. పరీక్ష ప్యాసయిన తరువాత దుకాణముల మీద గుమాస్తాలఉద్యోగములు చేయడమునకు వా రర్హు లవుతారు. ఒక్క ప్రషియా దేశములో ఇటువంటిబడులు 607 ఉన్నవి; వీటిలో 386 ప్రత్యేకముగానూ, 281 వృత్తి బడులకు చేరిన్ని ఉన్నవి. వీటిలోని పిల్లలసంఖ్య 130,225, ఆ సంఖ్యలో ఆడ పిల్లలు 55,591. జర్మను భాష, చిట్ఠా ఆవర్జాలు వ్రాయడము, టైపు రైటింగు, సంక్షిప్తలేఖనము, హణిజ్య శాసనముల ప్రథమ పాఠముల, వాణిజ్య భూగోళ శాస్త్రము, కసరత్తు, విహారములు- ఈ విషయములు తక్కినబడులలోవలె వీటిలో కూడా నిర్బంధములు,

ఉన్నత వాణిజ్య పాఠశాలలు,

ఇవీ (1) హంటెల్ షూలే (వాణిజ్య పాఠ శాలలు) (2) హెహెర్హంటెల్ సూలె (ఉన్నత వాణిజ్య పాఠశాలలు) అని రెండు విధము

155

లుగా ఉంటవి. మొదటి వాటిలో మాధ్యమిక పాఠ

శాలలలో ఆరేండ్లు చదువుకొన్న బాలురు చేర వచ్చును. రెండోవాటిలో ఒక “జిమ్నే సియము” ఆ రేళ్ళు చదువుకొన్న బాలురుగాని, ఒక "లిజ యము”లో చదువుకొని, అబిట్యుయెంట్ న్" పరీక్ష ప్యాను కానట్టి బాలికలు గానీ చేరవచ్చును . 1924 సంరములో మొదటి రకము బడులు 18,175 మంది విద్యార్థులతో 84న్ను రెండోరకమువి 5,007 మంది విద్యార్థులతో 73న్ను ఉండేవి. బడులలో వాణిజ్య పాఠశాలలలోని ఉపాధ్యాయు లకు శిక్షణమిచ్చే ఏర్పాటులున్ను ఉన్నవి,

ఈక్రిందిపట్టిక ఆయా తరగతులలో ఏయే విషయాలను ఎన్నెన్ని గంటలు ఈబడులలో నేర్పు తారో తెలుపుతుంది. వీటిలో నాలుగోతరగతి క్రింది తరగతి.

విద్యా విధానము ఉన్నత కార్మిక పాఠశాల లలోవలె ఉంటుంది.

158

........................................4తరగతి 3తరగతి 2 తరగతి 1తరగతి
1. మతము .................... 2 ...................3................. 2 .............1
2. జర్మను భాష ................... 5 ................ 5 ................4 ..............4
8. ఫ్రెంచి భాష (ఉత్తరములు
వ్రా యడము తోకూడా).............. 6 ................... 5 ................ 4 ............. 4

4. ఇంగ్లీషు భాష ( ” ) ............... 6 ...................5 ................ 4 ...............4
5. గణితము...............................2 ................... 3 ............... 3 ................3
6. వాణిజ్య గణీతము ..................4.....................4...................3..................2
7. పధార్థ విజ్ఞానశాస్త్రము ............0.....................2...................2..................0
8. రసాయన శాస్త్రము.................0....................0.....................2.................2
9. జీవశాస్త్రము..........................2.....................0....................0..................0
10. వస్తువులు నిలువచేయడము 0 .................. 0 .................. 0 ................2
11. వాణిజ్య భూగోళశాస్త్రము..........2...................2.....................2..................2
12. వాణిజ్య చరిత్రము.................2....................2....................2 ..................2
18. వాణిజ్య శాసనములు .............0....................0....................4...................4

157

14. దసూరి 2 2 2 2
15. సంక్షిప్త లేఖనము 0 2 1 0
16. కసరత్తు 2 3 2 3
17. చిత్ర లేఖనము 1 0 0 0
18. సంగీతము 1 0 0 0
19. వ్యాయామ క్రీడలు 2 2 2 2
20 స్పానిషు, ఇటాలియను
లేక రషియను భాష 0 0 2 2

కళాశాల వాణిజ్య విద్య.

ఆబి బ్యూరియెంటెన్ పరీక్ష ప్యాసయిన విద్యార్థులు వాణిజ్య కళాశాలలలో చేరవచ్చును. ఈకళాశాలలకు విశ్వవిద్యాలయాధికార మున్నది, అవి పట్టములనివ్వవచ్చును. ఇట్టి వాణిజ్య. కళాశా లలు అయిదున్నవి. ఫ్రెబర్గ్సు కళాశాలలో వేయి మంది విద్యార్థులున్నారు. వాణి జ్యేతర కళాశాల లలోకూడా వాణిజ్యమును నేర్పడమున్న ది. తక్కిన విశ్వవిద్యాలయాలలోవలెనే వాణి జ్య కళాశాలలలోను రెండు పరీక్షలున్నవి. ఒకటి డిప్లొమాపరీ క్ష. రెండోది డాక్టరుప క్ష. డిప్లొమా

158

పరీక్ష బ్రిటిషు విశ్వ ద్యాలయాలలోని వాణిజ్య (బి. ఎస్. సి.) పరీక్షకున్ను, డాక్టరు బిరుదము (పిఎచ్ , డి.) బిరుదమునకున్ను సరిపోతవి. మా చదువు మూడేళ్ళు. డిప్లొమా పుచ్చుకొన్న తరువాత ఏవిశ్వవిద్యాలయములో నై నా మరి రెం డేళ్ళు చదివి డాక్టరు బిరుదము పొందవచ్చును. విశ్వవిద్యాలయాలలో వాణిజ్యములో ఎక్కువగా పేరుపొందినవారు ఉన్యాసాలిస్తారు. ఇచ్చటి విద్య కేవల పుస్తక స్థవిద్య కాదు.

ఈ వాణిజ్య పాఠశాలలు, కళాశాలలోనే కాక , పగటి పూట వృత్తిని చూచుకొనే పెద్దవారికి సాయంకాలము ప్రత్యేకముగా బోధించే పాఠ శాలలు కూడా ఉన్నది. వాణిజ్యవృత్తి నవలంబిం చే వారి విద్య సాధారణ విద్య, అనుభవ వాణిజ్యము, వాణిజ్య విద్య - అని మూడు భాగాలుగా ఉంటుంది. కొన్ని బడులలో వాణిజ్య విద్య చెప్పి, తరువాత అను భవమిస్తారు. కోటీశ్వరులు కూడా తమపిల్లలకు చిన్న క్లాసులలో నుంచి, పెద్ద క్లాసులవరకు, వేగము వేగముగా వాణిజ్య విద్య చెప్పిస్తారు. మంచి వాణి

159

జ్య విద్య సంపాదించిన వాడు. జీవితములో బాగుగా

విజయు డౌతాడు.

అధ్యాయము 17

శ్రీవిద్య.

మొదటి నుంచిన్ని బాలురతో పాటు బాలి కలనున్న ప్రారంభ, మాధ్యమిక పాఠశాలలలో చేర్చుకొంటూనే ఉన్నారు. ఇద్దరికిన్ని పొఠక్రను మొక్కటే; కాని, చేతి పనులలో భేదముండేది. ఆ పిల్లలకు కుట్టు పసి, వంట, దాదిపని, వీటితో కూడిన గృహ నిర్వాహకత్వము నేర్పుతూ ఉండేవారు. ఉత్తమపాఠశాలలలో మాత్రము బాలబాలికలకు భేదముకల్పించినారు. బాలుర కు ద్దేశించిన ఉన్నత పొఠశాలలలోనికి, జిమ్నే సియములలోనికిని బాలిక లను చేర్చుకొనేవారు కారు. అందుచేత వారు ఆబి బ్యూరియెంటెన్ పరీక్ష ప్యాసయి కళాశాలలలో చేరడానికి వీలుండేది కాదు. కాని, ఉపాధ్యాయినీ వృత్తి నవలంబిం పదల చిన ఆడపిల్లలు కళాశాలలలో

160