చెన్నపురీ విలాసము/పశ్చిమపద్ధతి

శ్రీరస్తు.

శ్రీవేణుగోపాలస్సహాయః

చతుర్థంబగు పశ్చిమపద్ధతి ప్రారంభము.

అందు బశ్చిమశాఖానగర ప్రకరణము.


———♦————
ప్రధమము

 
గీ.శ్రీ పూర్ణ తోట్లవల్లూ
  రూపవసద్వేణుగోపకొరుగృహద్వార
  ర్ధ్సాపితసమున్న తాద్భుత
  గోపురకృతికర్తనాగగోత్రారమణా.
 

వ.అవధరింపుము.


సీ.పల్లవరంబును బరశువాకయూఁజూళ
           మణలిసైదాపేట మాధవరము
  చేకారెళుంబూరు చెలగునందంబాక
           నుంగముపాక పరంగికొండ
  వ్యాసులవాడయు నడయారునల పెద్ద
          మెట్టుతానాంపేట మేటియైన
  కోటూరునను వెలి పేటలావీటికిఁ
         బశ్చిమంబైన దిగ్బాగమందు

గీ.సౌధహర్మ్యప్రతోళికా సదన నివహ
  హరిలేఖసమంబులై యభివిసారి
  తాయతాన్యోన్యమిళిత రథ్యాభుజాగ్ర
  లనఁజెలువొందుననుగు నెచ్చెలులనంగ.

పుస్తకసౌధప్రకరణము-ద్వితీయము

 
ఉ. పండితమందలంబులకుఁ బందువుసేయు నశేషకోశముల్‌
   కొండలఁబొలియెల్లెడలఁ గూటహృహంబులనొప్ప భారతీ
   భాండగృహంబునాఁగ నొకభాస్వరసౌధముచూడనొప్పును
  ద్దండతఁబ్రోలు పశ్చిమపుదండ నఖండవిభూతి తోటలో౯

క. ఆపుస్తల కోశముభువి
   భూప్తస్తవనీయలీలఁ బొలుపగులే
   జీపేరనందు లేనిమ
   హాపుస్తకభ్రపుష్పమైతనరారు౯

కొల్వుకూటపు ప్రకరణము-తృతీయము

గీ.పురికిఁబశ్చిమమునఁగలెక్టరుకచేరి
  విపులతర వాదపస్ఫురదుపవనమున
  నభినవమనోజ్ఞ రుచిర శోభానుభూతి
  బరగుబురేందిరావనీ భవనమనగ.

వినోదనభాప్రకరణము-చతుధ౯ము


మ.స్థలజంబుల్జలజంబులు న్వనజముల్‌ శైలాంబుద స్పర్శనా
   నలజంబుల్జలభూబిలాంబరదివానక్తంచరంబుల్విరా
   జిలనిప్పరుఁబురిన్వినోదసభవాసిం జేతనాచేతనా
   ఖిలనానావిధవస్తు సంచయనమా కీర్ణాబ్జజాండాకృతి౯.

వ.అదిమఱియు నకుంఠిత కుఠేరక కుటన్నటకురంటక ఘోఁటార్పుటఘటాఖుటీభంటాకి పరిగతకురవకావరణ వలయితంబును సరసర్జకపాల పల్లకీ పన్నక సహకార సైరేయ సప్తలాసప్తవర్ణ సౌ వీరతలాపారణీ సర్వతో భద్రసక్తు ఫలసహాది సకలసాలసముదయ సాంద ..కులంబును ద్విదళ విదళిత వేణుదళామిర విరచితా తరళతర మంటరోద్వేల్లితో త్ఫుల్లమల్లికాగోస్తనిల వల్యాలి వల్లికా నికుంజ మంజులంబును దరువరాంతర సరణికాపార్శ్వ సమంచిత విలుంఛిత శ్యామాయ మానవయవస ఋఏఖాలంకృతంబు సునుత్తాన ముఖ వ్యస్తకాండ పరంపరాతిర్య గానద్ధదండనిబిడ దారుపంజర దుర్గంఘ్యత రోభయపక్ష పథపరిష్కుృతంబు నై రుచిర విపులంబగు నుపవనంబునం బవ నాయన సహస్ర సంయుతం బై సహస్ర నయనుని కాయ్యంబు విడమెంచుచు నంబర తలచుంబి శిఖర కడంబకం బైత్ర్యంకా చలంబునుంబోలి యతి విశాలోన్నత భూమికాభ్యంతా భోగ భాగంబగుటఁ బద్మ భవాండ మంటపంబు బకుం బ్రతిబటంబై యొప్పు నొక్క మహాద్భుత ప్రాసాదంబున కుంబురోభాగంబు నుభయపార్శ్వ పరికల్పతబగు సోపానపరణినెక్కి చ ... .న్నగద గణిత స్నిగ్ధ శిలాగణ స్థగితంబగునంగనంబూనధ్యాసీనుండగు నొకరాజాధికారపురుషుని సయో గంబుం దర్పిత కోశ పత్రంబున నిజనామకంబు లిఖించి తత్సౌధగర్భంబు జొచ్చి యచ్చటచ్చట నిచ్చలు మచ్చిక పెచ్చు పెరుగ౯ గాంచి నన్మ ధ్య భాగంబుం సమున్నత ఫీఠీకోపరిస్యన్త పేర కాంతర్గతంబులై దదు పరిచ్ఛాద కంబులగు నచ్చంపుమించు టద్దంబు నుండి బయలునకుంగానఁదగుచు నొక్కచో మత్స్యంబు కచ్ఛపంబులు మొసళులు భేకంబులు జలూకంబులు నెండ్రులు నెఱ్ఱలు నంచలుం జక్కవలుం గొంగలుం లకుముకులు నీరుపాములు శంఖనఖంబులు శంఖంబులిజిల్వలుం గవ్వలుం దమ్ములుం దెమ్మలు నురుగులుం బురుగులు నత్తెలు ముత్తెంబులు ముత్తెం ' పుచిప్పలు కాకిచిప్పలు నుప్పులుం గవ్వలు చివ్వలు నాచులు బ్రోచులు మొదలగు జలీయద్రవ్యంబులును మఱియొక్క పట్టున రాచెట్టు రాపువ్వు ఏఅచిప్ప రాచిదపలుం ధాతువులును వివిధ లోహసారంబులు నానావర్ణ శిలాశకంబులు లోనగు పర్వతీయ పదార్థంబులు వేఱొక్క కెనల నీలపీత శుక్ల రక్త హరితకపిశ చిత్రవణ౯మృద్భే దంబులు బుట్టకూడు పుట్టగొడుగులును మొదలగు పార్థవ వస్తువులును నింకొక్క నిర్వ్యూహంబున నేనుంగులు సింగంబులు కురంగంబును లేళ్లు గుందేళ్ళు గండకంబులు శరభంబులు గొండ గొఱియలు పులులు చిఱుత పులులు రేచులుం గీచులు మన్నులుండున్నలుం దుప్పులు నేకలంబులు కొర్నాసులు గణుతులు న్నక్కలు గవయంబులు చమరంబులు మయూరంబులు మర్కటాఛ భల్లగోలాంగూల బ్రముఖంబులునగు నాటవిక జంతు జాలంబును నింకొక్క విటంకంబునం గపోత పొలికలంగల వింకకలరవ కలకంఠ కలహంస నీలకంఠ చాటకైర కీరకుక్కుటాది శకుంతల కులంబులును వేఱొక్క..డవి మానుసులు, బెక్కు దీవుల మనుసులును మఱియు నొక్క గోపానసి ననేక ద్వీపగత వివిధవర్ణ స్త్రీ పురుష నికరంబును మఱియొక్క యపవరకంబునం బెఱదీవుల వెలయాండ్రు గ్రోళ్ళిసల్పుటయు నింకొక్కనిద్దంపు టద్దంపు గూడులో నొక పెఱదీవి దొరలు దొరసానులును ననేక చరాచర నిర్జీవ సజీవ జీవలోకంబునుం గలిగి యుదరగతా శేషపదాధ౯ బృందంబుగావున ముకుంద తుందకంద రంబు చందంబునఁజెన్నొందుచు వైభవాశ్చర్యంబులకు వైజననంబును జిత్రంబులకుం బాత్రంబును నిఖిల వినోదంబులకు నిదానంబును విలాసంబులకు విశద లస్యరంగంబును నద్భుతంభులకు నధికలీలా సదనంబును ముఖ్య వస్తు వులకు మూల భవసంబునునగు నమ్మేడ వెడలి మరల నయ్యధికారి యొసగు చీటియా తోటలో వాకిటనున్న మేటి భటునకిచ్చి వానిం గడచి లోనికినడువ నెదుటఁబటుకరొరకాలాయన శలాలికా వికట ఘటితంబై పంజర ప్రాయంబగు నొక్క విశాలమంటపంబునఁ జిక్కి పూటపూటకు నెక్కుడుగాఁబాటించి గాటంబుగ దీటుకొల్పు జింక చివ్వంగి గొఱియ మేకలు లోనగు వాని మాసంబుల గ్రాసంబులు చేకొని మెక్కి పుటపుట నై పొగరొక్కి నిక్కి దిక్కులుచూచుచుం దమ్ముజూచుచున్న జనులుంజూచి యేచియిాసు రేచి తీండ్రించుచు వేండ్రంబుగ గాండ్రన నఱచు చుంగుత్తుకెత్తి వృత్తపింగళ క్రూరనయనాపాంగరంగంబుల నంగారంబులు గురియం గులాలచక్ర భంగికా భంగురంబుగ వ్యాప సవ్యంబుగ దదభ్యంతరంబునంబరిభ్రమించుచు నిబ్బరంబుగ నుబ్బి యబ్బురంబుగ బొబ్బ లిడు బెబ్బులులు రెండు నుదదంతికంబునఁ దాదృగ్విధ మంటపంబునఁదాదృశంబుగ సంక్షోభించు తరక్షు ద్వయంబును మఱియొక్క చక్కిశాలాస్తంభని బద్ధంబులగు ఋష్య గవయంబులును వేఱొక్క యెడంగడు బెడిదంబగు గర్తంబునంబడి వెడల నేరక బడిబడి నెగసి దిగంబడి దిగులువడి వడిదక్కి సుడివడిబడలువడు నుత్ఫుల్ల నిబిడరోమ పటల జటిలంబగుట వికటకంబళ కప౯టకంచుకా వృతంబగు వడువున గనంబడు నతి కఠోర నఖర భల్లంబగు నచ్ఛంభల్లంబును వేఱొక్క తావున విశాల శాలాంత రాళంబున లోహ శృంఖలం గట్టంబడి యయ్యింటి వెన్నుగాఁడి యొడిసిన మలుటకుంబలెమిగులఁ బొడవగు మెడ నెగయంర్త్తుచుఁ దన్నుం జూచు వారల వెక్కిరించు క్రియనిక్కి పెదవులల్లార్చుచుఁ మరగాళుగట్టినట్టుల తాళ ప్రమాణంబగు చరణ చతుష్ట యంబున ధరిణి నవష్టంభించి వెనుక కురచనగు తోక వ్రేలంగ్రాలుచున్న గండక మృగంబును మఱియొక్క నెల వునం జతుర్దండికాకూటంబున నిచ్చలుం బిచ్చలించు కొండమృచ్చులతోడం గచ్చుకొనుచుం గ్రీడించు మర్కటం బులును వేఱొండు దండనుద్దండంబగు శాలా మండలంబునం గండుమిాఱి మెండుగ నాశ్వాసించు నశ్వతరియు ను మఱియు నొక్కటెంకి మంట విటంకంబుల౯ వ్రేలు పేటికల కుహరతటంబుల విహరించు వివిధ విహంగమ విసరంబులును నింకొక్కపజ్జ దీఘ౯మంజూషంబున నామిషంబులు మెక్కి మత్తెక్కి నిదురించు కొండచిలువయు మఱియొక్క పెట్టెలోఁ దెట్టెలుగొని బెట్టెండొండం జుట్టుకొని చుట్టల క్రియనెట్టుకొనుచు బిట్టూర్పుచుం బుసకొట్టు తుట్టెలుం ద్రాఁచులుం మొదలగు సర్పంబులు నుంగనుపట్ట విస్మయంబునకుంబట్టగు నత్తోటగనుగొన్న వారలకు సకల భువనవిలో కనకౌతుకంబు సమకూరుటకు సందియంబు గలుగునె మఱియును,...2

      
మత్తకోకిల:
          తారహీరపటీర శారద తారహారతుషారమ
          దారనారదశారదాంచ దుదారపూ౯ యశోధనా
          సారసారసపత్రసన్నిభ చారుదీఘ౯వొలోచనా
          జతుథ౯ంబగు పశ్చమపద్ధతి సంపూణ౯ము.3