చీనా - జపాను/2 వ అనుబంధము
శనివారపు సుబ్బారావుగారు
(2 వ అనుబంధము)
78
చీనా-జపాను
1914-18 యుద్ధములో జపాను, ఇటలీ దేశాలు రెండున్నూ జర్మనీకి వ్యతిరేకంగా ఇంగ్లీషువారితో ఏకమయ్యె ను. యుద్ధానంతరమందు వెర్సిల్లీసు సంధిద్వారా జర్మనీని అన్నివిధాల పీల్చిపిప్పిచేసి ఫ్రాన్సు, ఇంగ్లీషువారే హెచ్చుగా పంచుకొన్నారు.వీరితో పాటు సమానంగా ఆపంచుకోవడంలో ఇటలీ, జపానులను జూడనందున యిా రెండు దేశాలవారికి బ్రిటిషువారన్నా, ఫ్రాన్సువారన్నా అమెరికావారన్నాలోలోన కొంత అయిష్టం లేక పోలేదు. ఈ అయిష్టత వల్లనే యిా మూడు దేశాలు ఏకమై ఫాసిస్టుతత్వంతో సామ్రాజ్యకాంక్షను హెచ్చుచేసుకొని ఇరుగు పొరుగు దేశాలలో లోకువైన వాటిమిాద పడుతున్నాయి.
2 వ అనుబంధము
79
వాదతత్వం హెచ్చుగా ప్రచారంలోకి వచ్చి నేడు సామ్యవాదమంటే అన్నిదేశాలలోను బాగా ప్రచారం అవుతోంది. ఈ సామ్యవాదతత్వం ప్రచారంలోనికి వస్తే సామ్రాజ్యకాంక్షతోనున్న జర్మనీ, జపాను, ఇటలీ దేశాలకు వలస రాజ్యాలను సంపాదించుటకు ఆటంకం అగుననే భయంవుంది.
సామ్యవాదమంటే కార్మిక కర్షకులతో ఏర్పడి వారి ఆర్థిక సాంఘికరీత్యా మానవులంతా ఒకేరీతి సౌఖ్యాలను గౌరవాలను అనుభవించాలనే పరిపాలన అన్నమాట.
వలసరాజ్యాలున్న దేశాలవారికి కూడ సామ్యవాదమంటే భయంవుంది.ఎందుచేతనంటారా వలసరాజ్యములలోని ప్రజలలో సామ్యవాదతత్వం హెచ్చినా తమవలస రాజ్యాలను కోల్పోవలసిన స్థితి ఏర్పడుననే భయంవుంది.ఇం దువల్ల ఉన్నదేశాలు లేనిదేశాలు సామ్యవాదమంటే అయిష్టతతో వున్నాయి. లేని దేశాలైన జర్మనీ, జపాను, ఇటలీ, ప్రజలలో మధ్యరకపు ప్రజలే పరిపాలనను తమవశంచేసుకొని అటు శ్రీమంతులను, యిటు కార్మిక కర్షకులను తమ అదపుఆజ్ఞలలో నుంచుకొని శ్రీమంతులచేతధనమును వెచ్చించుతూ కార్మిక కర్షకులచేత వారి శరీరబలమును వలస రాజ్యాలకొరకు పాటుబడుటకు ఖర్చుపెట్టుచూ ఫాసిష్టుతత్వమును అమలులోనికి తెచ్చెను. 80
చీనా-జపాను
17,18 చ శతాబ్దములలో జపానులో రమారమి 2 1/2 కోట్ల కన్న హెచ్చుగా జనాభాలేదు. రాజకీయ దృష్టి రీత్యా జనాభా హెచ్చుట అవసరమనే ప్రచారం ఆదేశంలో సాగడంవల్ల 1846 లో 3 1/4 కోటి వరకున్ను 1882 లో 4 1/2కోటి వరకున్ను 1903 లో 6 కోట్లవరకు 1925 లో7 కోట్ల వరకు పెరిగింది. జనాభాతో పాటు వర్తక పరిశ్రమను విజ్ఞానమును పెంపొదింప జేస్తూ బ్రిటిషువారితో అన్నివిధాల సమానంగా నుంటూ బ్రిటిషువారు పశ్చిమమున బలంగానుంటే జపాను వారు తూర్పున బలంగా నుండుటకు యత్నిస్తున్నారు.
జపాను 1891 నుంచి క్రమేణా వారు ఫార్మోజ్ కొరియా, మంచూకో ప్రదేశాలను ఆక్రమించి చైనాదేశాన్ని కబ ళించుటకు 1931 నుండి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈయత్నాలవల్ల చైనా జపానుదేశాలకు యుద్ధం1931 నుండి జరుగుతూనేవుంది. అటు రష్యాతో డీకొని 1904 లో జపానే జయము గాంచెను.దీని వల్ల జపానుకు రష్యాకు మైత్రి సంభవించలేదు. అందుకు తగినట్లు జపాను కుండే సామ్రాజ్యకాంక్షకు రష్యాయొక్క సోవియట్టు తత్వం వ్యతిరేకం.ఇందువల్ల యిా రెంటికి బలమైన విరోధమే హెచ్చు అవుతోంది.చైనాను జపాను దిగ మ్రింగ డానికి చేసే యత్నాలలో బ్రిటిషువారు జపానును గట్టిగా అడ్డగించలేదు. 2 వ అనుబంధము
81
సంవత్సరాలు | జనాభా | సంవత్సరాలు | జనాభా |
1872 | 26,801,154 | 1926 | 39,349,000 |
1882 | 28,459,628 | 1930 | 40,759,000 |
1901 | 32,475,253 | 1933 | 41,806,000 |
1911 | 34,674,377 | 1934 | 42,217,000 |
1921 | 38,033,000 | 1935 | 42,621,000 |
దామాయిషాను ఏడాదికి 4లక్షల చొ||జనాభాను పెంచగలిగెను.
ఇటలీ తన జనాభాకు తగిన ఆర్ధిక సౌష్టవమును కలిగించుటకు ఆఫ్రికా దేశమును,మహమ్మదీయ రాజ్యా లను, క్రమేణ భారత దేశమును కబళించాలనే కాంక్ష పుట్టినది. ఇందుకు తగినట్లుగా ఇటలీని పరిపాలించె మస్సోళినీ నియంత(1935-40)మధ్య మహాసంగ్రామం రాక తప్పదనియు, ఈ యిరువదవ శతాబ్దిలో శాంతి అనేది వుందదనియు చాటుచుండెను.దీనికి తార్కాణమే 1936 లో ఆఫ్రికాలోని అబిసీనియా దేశమును కబళించెను. ఇదివరకే ఆఫ్రికాలో కొన్ని ప్రదేశాలు ఇటలీ 82
చీనా-జపాను
క్రింద వున్నాయి.ఇటలీ యిారీతిగ సామ్రాజ్యకాంక్షను పెంచుతూవున్నా, ఆబీసియాను మ్రింగినా బ్రిటిషు, ఫ్రాన్సు, దేశాలవారు గట్టిగా తమ అదుపు ఆజ్ఞలో ఇటలీని యుంచలేకపోయారు.
జర్మనీకి వలసరాజ్యాల కాంక్ష మొదటనుంచీలేదు.జర్మనీ తనచుట్టుపట్లనుండే దేశాలన్నిటికి ఆధిపత్యాన్ని సంపా దించాలనే కోరికతో వుండెను.
1884 నుండి జర్మనీ దేశములోని ఫాబ్రి అను ఆయన వలసరాజ్యాలకు ఆందోళన చేయుటకు గ్రంధముల ద్వారాను ,పత్రికద్వారాను, సభలవల్ల అమిత ఆందోళన చేసెను.ఈ ఆందోళనవల్ల ప్రజలలో అలజడి కలిగినది. దానివల్ల 1884, 1914 సమ్||మధ్య జర్మనీ ఆఫ్రికాలోను, పసిఫిక్ మాహాసముద్రంలో జపాను ఆస్ట్రేలియా మధ్యను కొన్ని వలస రాజ్యాలను బిస్‌మార్కు పరిపాలనలో సంపాదించెను.
1914-18 మహాసంగ్రామములో సంపాదించిన వలసరాజ్యాలను వెర్సల్లీసు సంధిద్వారా కోల్పోయెను. వీటిని ఇంగ్లండు, ఫ్రెంచివారే హెచ్చుగా పంచుకొన్నారు.వెర్సల్లీసు సంధిలో జర్మనీని, ఆర్థిక, సాంఘిక, రాజకీయంగా బ్రిటిషు, ఫ్రాన్సు, అమెరికావారు క్రుంగిపోవునట్లు జేసిరి.ఆదుస్థితిలో 2 వ అనుబంధము
83
జర్మనీ తన పౌరషమును తిరిగి జూపి ప్రాపంచకంలో తానుకూడ మరో సామ్రాజ్యమునకు తీసిపోనని తెలుపు టకు హిట్లరునియంతకు 1933లో పరిపాలన వశపరచెను.అప్పటినుంచి హిట్లరు నియంత వెర్సల్లీసు సంధి ద్వారా ఏర్పడ్డ క్రొత్తదేశాలలో, 1లితూనియో 2 డాన్‌జిగ్ 3 పోలండు 4 జెకోస్లోవియా 5 అస్ట్రియా 6 హంగేరీ 7 రుమేనియా 8 యుగోస్లోవియా దేశాలను తనలో ఏకం చేసుకొనుటకు నేడు యత్నించుచుండెను.ఈ దేశాలను జర్మనీ నుండి వెర్సల్లీసు సంధిలో విడదీసి వేరువేరు దేశాలుగ ఏర్పటుచేసి అంతర్జాతీయ సంఘంలో ప్రాతినిధ్యం యిచ్చి ఫ్రాన్సు, ఇంగ్లీషు, అమెరికా వారు పెట్టుబడి పెట్టి రాజ్యాలను నడుపుకోమని చెప్పిరి.ఇతర దేశాల పెట్టుబడి వీరికి చాలదు. స్వతహాగా ఆర్థికంగా నిలబడేస్థితిలో లేవు.పైగా ఈ దేశాలలో దిగువరీతిగ జర్మనీ వారున్నారు.
- లట్ లియాలో.................75,000
- డాన్‌జిగ్.....................360,000
- పోలండు....................1,350,000
- జెకోస్లోవియా.................3,500,000
- ఆస్ట్రియా....................6,300,000
- హంగరీ.....................600,000
- రుమేనియా..................800,000
- యుగోస్లోవియా................700,000
86
చీనా-జపాను
♦ గుర్తులలో 1,2 అంకెలు మంచూరియాను జయించుటకు ముందు వుండే అంకె ! వ నెంబరులోను మంచూరియాను జయించక వుండే అంకె 2వ నెంబరులో కనబడును.
3 వ అంకె ఇటలీ అబిసీనియాను జయించుటకు పూర్వము 4 వ అంకె ఇటలీ అబిసీనియాను జయించాక వున్న అంకె.
దేశాలు | అసలుదేశంలో నున్న జనాభా | వలస రాజ్యాలలో నున్న జనభా |
గ్రేటు బ్రిటను | 44,888,377 | 451,456,179 |
ఫ్రాన్సు | 41,834,923 | 63,609,872 |
బెల్జియం | 8,247,950 | 9,485,091 |
హాలండు | 8,290,398 | 60,970,239 |
పోర్చుగల్ | 6,825,883 | 8,913,071 |
అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
122,775,046 | 15,129,284 |
యూరిపియన్ రష్యా | 133,769,700 | 32,088,700 |
జపాను | 68,194,900 | (1)♦27,343,675 (2)♦61,588,655 |
ఇటలీ | 42,621,000 | (3)♦2,484,638 (4)♦7,984,638 |
జర్మనీ | 66,044,161 |
- గుర్తులలో 1 వ అంకె జపాను మంచూరియాను జయించుటకు ముందు 2 వ అంకె జయించాక 3 వ అంకె ఇటలీ అబిసీనియాను జయించుటకుముందు 4 వ అంకె జయించాక తెలుపును.
(అంధ్ర పత్రిక నుండి 11-5-37)
-----
శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామినాయుడు గారిచే సరస్వతీ పవర్ ప్రెస్ నందు ముద్రింపబడియె, రాజమండ్రి-705_1937