చీనా - జపాను/1 వ అనుబంధము
ప్రస్తుతం చైనాలో మూడురకాల అధికారాలున్నాయి.ఒకటి నాన్కింగు ;రెండు కాంటన్;మూడు సోవియట్టు ప్రభు త్వాలు.నాన్కింగు ప్రభుత్వమే పెద్దదిగా ఉంది.దీని తరువాత సోవియట్తు పెద్దది.కాంటన్ ప్రభుత్వము చిన్నది. కాంటన్‌ప్రభుత్వము కీ||శే|| సన్‌యెట్టుసేను యొక్క పద్ధతిలో కూడిన ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటుం ది.నాన్కింగు ప్రభుత్వములో ప్రస్తుత అధికారులు జపాను ధాటీకి ఆగలేక ఏదోరీతిని జపానుతో సఖ్యత చేసు కోవాలంటూవుంటే అక్కడున్న యువకబృందానికి అదియుష్టము లేనందున యూవుభయులకు యూరీతి అంతః కలహాలునాయి. సోవియట్టులున్నచోట కార్మిక కర్షక ప్రభుత్వాన్నే బలపరచుకుంటూ మిగత యూనాన్కింగు, కాంటను ప్రభుత్వాలకు ప్రాకించి ఏక సోవియట్టు చైనాగా చేయాలనుకుంటున్నారు.చైనాలోని సోవియట్టులకు సోవియట్టు రష్యాయొక్క ఆంతరంగిక బలంవుందని సోవియట్టు రష్యాపై సామ్రాజ్యతత్త్వంతో కూడిన జపానుకు కోపంగా ఉంది.సోవియట్టు రష్యాలోని సామ్యవాదతత్త్వం ప్రక్కనున్న జపానులోనికి ప్రాకితే జపాను యొక్క సామ్రాజ్య ప్రాబల్యమునకు ముప్పుకలుగుతుందను భయంతో చైనానంతటిని జపానుయొక్క సామ్రాజ్యంలోనికి తీసుకొని రష్యాను అణచివుంచాలని జపానుకు ఉంది.చైనా స్వాతంత్ర్య
మును కాపాడుటలో లీగ్‌ఆఫ్ నేషన్సు(అంతర్జాతీయ సంఘం)యిదివరలో సహాయపడలేదు.అందువల్ల లీగ్‌పై చైనాకు మోజు పోయింది.ఇంతకూ నాన్కింగు, కాంటన్, సోవియట్టు ప్రభుత్వాలు మూడు ఏకమైతే ఏకొద్దో జపానుయొక్క సైనికబలాన్ని అడ్దుకొనగలదేమోగాని అటుల లేనంతవరలు చైనా జపానుకు లొంగక తప్పదేమో అనిపిస్తోంది.
ఇంతకు వైనాలో పాశ్చాత్యులలో బ్రిటిషు, అమెరికా, ఫ్రెంఛి వారికిన్ని తూర్పుననున్న జపాను అధికారానికి హక్కులున్నాయి.ఈ నాలుగు అధికారముల మధ్యను చైనా స్వాతంత్ర్యంగా నుండడానికి నలిగిపోతోంది.
1 వ అనుబంధము
73
74
చీనా-జపాను
1వ అనుబంధము
75
చైనాలోని మిగతా కాంటన్,కౌఇంగుటాంగు ప్రభుత్వాలకు అనగా డా||సన్‌యట్టు అనుచరుల ప్రభుత్వానికి, కౌఇంగుటాంగు సోవియట్టు అనుచరుల ప్రభుత్వానికి యిా నాన్కింగు ప్రభుత్వం లోబడదు.అందువల్ల యిారెంటి ని అణచుటకు నాన్కింగు ప్రభుత్వము ధ్వజం ఎత్తుతో ఉండడంవల్ల అంతంఃకలహములున్నాయి.నాన్కింగు ప్రభుత్వాన్ని ఎదుర్కొనుటకు నాన్కింగు, కౌఇంగుటాంగు ప్రభుత్వాలు రెండున్ను 1931 లో ఏకమై యత్నించ గా ఆయత్నంలో కొంత సఫలం కొంత విఫలం కలిగినది. చైనాలో హుఫే రాష్ట్రములోను,హనన్ రాష్టంలో చాల చోట్లలోను సోవియట్టు ప్రభుత్వం చాలా కట్టు దిట్టాలతో ఏర్పడి అభివృద్ధి మార్గంలోనే ఉంది.ఈ భాగాల సరి హద్దులలో“ఇక్కడ నుంచే చైనా సోవియట్టు గవర్నమెంటు ప్రారంభం” అనుగుర్తుగల సైనుబోర్డులను (వ్రాత మూలకంగా తెలిపే చిహ్నములను)కట్టుకొన్నారు.నాన్కింగు ప్రభుత్వంలో నున్నవారిలో కొద్దిమంది కూడిన పక్షం సోవియట్టునకు హెచ్చుమందితో కూడిన పక్షం నాన్కింగు ప్రభుత్వంతోటి సంబంధం పెట్టుకుంది.మొత్తానికి యిా కాంటన్ ప్రభుత్వం నాన్కింగు ప్రభుత్వంతో స్నేహంగా వుంటూ ఒకరికి మరొకరు తోడ్పడుతున్నారు.
నాన్కింగు, కాంటన్ గవర్నమెంటులు ఒకటే అనుకుందాము.ఈవుభయులు ఏకమై ప్రభుత్వంలో వృద్ధనాయ 76
చీనా-జపాను
కులకు జపానుతో సఖ్యము చేసుకోవాలనియు యువకబృందానికి సంపూర్ణ స్వాతంత్ర్య పరిపాలనలోనే వుండా లని అంతఃకలహాలున్నాయి.నాన్కింగు గవర్నమెంటు తత్వం కార్మిక కర్షక ప్రభుత్వానికి వ్యతిరేకమున్నూ ధనిక వర్గముతో కూడిన ప్రజాస్వామ్య పరిపాలనకు అనుకూలముగను ఉంది.ఇట్టిస్థితిలో జపాను సమయం దొరికిన పుడల్లా యిానాన్కింగు ప్రభుత్వాన్ని బెదరిస్తూ బలహీనం చేస్తోంది.దీనినిబట్టి చైనా సమస్య పర్యవసానం మున్ముందు ఏలావుంటుందో వుహింతురుగాక!
(కృష్ణా పత్రిక నుండి)1-7-36