చిరస్మరణీయులు, మొదటి భాగం/జస్టిస్ బద్రుద్దీన్ తయ్యాబ్జీ
77
30. జస్టిస్ బద్రుద్దీన్ తయ్యాబ్జీ
(1844-1906)
మాతృభూమిని విదేశీయుల పాలననుండి విముక్తం చేయాలన్న సంకల్పంతో మూడుతరాల వ్యక్తులు విముక్తి పోరాటంలో పాల్గొన్న విశిష్ట చరిత్ర కలిగిన తయ్యాబ్జీ కుటుంబలోని ప్రముఖులు జస్టిస్ బద్రుద్దీస్ తయ్యాబ్జీ.
మహారాష్ట్రలోని కాంబేలో1844 అక్టోబర్ 8న బద్రుద్దీన్ తయ్యాబ్జీ జన్మించారు. తండ్రి తయ్యాబ్ ఆలీ, తల్లి అమీనా తయ్యాబ్జీ. స్వదేశీ విదేశీ వ్యాపారాలలో తనదైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న తయ్యాబ్ ఆలీ బిడ్డలకు ఆదునిక, ఆంగ్ల భాషల్లో చదువులు చెప్పంచారు. చిన్న వయస్సులో ఉరూ, పర్షియన్, అరబ్బీ, గుజరాతి, మరాఠి భాషలను, కొద్దిగా ఆంగ్ల భాషను నేర్చుకున్న బద్రుద్దీన్ 1860లో లండన్ వెళ్ళి కొంతకాలం తరు వాత ఇండియా వచ్చి 1865లో మోతి బేగంను వివాహమాడారు. 1867లో మళ్ళీ లండన్ వెళ్ళి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకుని బొంబాయి వచ్చి ప్రాక్టిస్ అరంభించారు. అతి కొద్ది కాలంలోనే అత్యధిక సంపాదన గల బారిస్టర్‌గా పేరుగాంచారు.
బొంబాయి కార్పొరేషన్‌లో సాగుతున్న అవినీతికి, హద్దులు మీరిన ఆంగ్లేయ అధికారుల పెత్తనానికి, పేదల నివాస ప్రాంతాలలో కనీస సౌకర్యాల కల్పనలో అధికారగణం చూపుతున్న అలసత్వానికి వ్యతిరేకంగా త్రీస్టార్స్ గా ఖ్యాతిగాంచిన మిత్రులు
చిరస్మ రణయులు 78
ఫిరోజ్‌షా మెహతా, కాశీనాధ్ తెలంగ్ లతో కలసి 1871లో ప్రారంభించిన ఆందోళన ద్వారా ఆయన ప్రజాసేవారంగంలో అడుగుపెట్టారు. ఆ క్రమంలో 1873లో బద్రుద్దీన్ తయ్యాబ్జీ బొంబాయి కార్పోరేటర్‌గా, 1882లో బొంబాయి లెజిస్లేటి వ్ కౌన్సిల్ సబ్యునిగా ఎంపికయ్యారు. ప్రజా ప్రతినిధిగా భాధ్యాతలను నిర్యహిస్తూనే భారతీయుల భవిష్యత్తుకు విఘాతం కల్గించగల బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను, చట్టాలను ప్రతిఘటిస్తూ త్రీస్టార్స్‌తో కలసి విజయవంతంగా పలు పోరాలు చేస్తూ ప్రజాభిమానం మూటగట్టుకున్నారు.
1885 డిసెంబర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తరు వాత బద్రుద్దీన్ తయ్యాబ్జీ ఆ సంస్థతో పూర్తిగా మమేకమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ విధివిధాన నిర్ణయాలలో, నిర్మాణం రూపకల్పనలో బద్రుద్దీన్ ప్రధాన పాత్ర నిర్వహించారు. 1887లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాలకు బద్రుద్దీన్ అధ్యాక్షత వహించారు. ముస్లింలను కాంగ్రెస్‌కు దూరంగా ఉంచాలని ప్రయత్నించిన సర్ సయ్యద్ అహమ్మద్, సయ్యద్ అమీర్ ఆలీ, నవాబు అబ్దుల్ లతీఫ్ ల వాదనలను ఆయన సమర్ధవంతంగా తిప్పికొట్టారు . 1895లో ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే వరకు భారత జాతీయ కాంగ్రెస్ పెరుగుదల, పటిష్టతకు తయ్యాబ్జీ ఎంతగానో శ్రమించారు.
ప్రజా జీవనరంగాలన్నిటిని రాజకీయాలు మాత్రమే ప్రభావితం చేయలేవని భావించిన తయ్యాబ్జీ సాంఫిుక, విద్య, ఆర్థిక రంగాలలో పురోభివృద్దిని కోరుకున్నారు. ఆ దిశగా కృషిసాగిస్తూ ముస్లిం సమాజంలో సంస్కరణలను ఆశించారు. ఆడపిల్లలకు ఆధునిక విద్యఅవసరమన్నారు. ఆయన ఆశించిన సంస్కరణలన్నిటినీ తన కుటుంబం ద్వారా ఆచరించి చూపారు. ముస్లిం సమాజాన్ని అన్ని రంగాలలో ప్రగతిపదలో చూడాలన్న ఆకాంక్షతో సేవా-విద్య-ఆర్థిక సంస్థలను స్థాపించి పలు సేవలందించారు.
న్యాయశాస్త్ర ప్రవీణుడుగా ఖ్యాతిగడించిన తయ్యాబ్జీ 1902లో బొంబాయి హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1906లో అనారోగ్యం వలన ఇంగ్లాడ్ వెళ్ళారు. ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకాన్ని క్రమబద్దం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్ లు జారీ చేసింది.
ఈ విధంగా అటు జాతీయవాదిగా, ఇటు ప్రధాన న్యాయమూర్తిగా, మరోవైపు ప్రజా సేవకుడిగా అపూర్వ సేవలందించి 'ఆయన మొదట భారతీయుడు, ఆ తరువాత ముస్లిం, తుదకు విశ్వమానవుడు' అని చరిత్రచే ఘనంగా కీర్తించబడిన జస్టిస్ బద్రుద్దీన్ తయ్యాబ్జీ 1906 ఆగస్టు 19న ఇంగ్లాండులో కన్నుమూశారు.
సయ్యద్ నశీర్ అహమ్మద్