చిత్రలేఖనము/BOOK II/మూడవ భాగము
మూడవ భాగము.
చెట్లు, వాటిని చిత్రించు విధము.
భారతభూమి సౌందర్యమునకు నిలయ మైయున్నది. దీనిప్రసిద్ధి పూర్వకాలమునందుకూడ లోకమునం దంతటను వ్యాపించియుండెను. ఈదేశమునం దన్నిదేశపు సృష్టిచిత్రములను చూడనగును. హిమాలయపర్వతపుచివరకు వెళ్లిన నుత్తరప్రదేశమువలె నుండును. మధ్యను సమతోష్ణముగ నుండును. కాబట్టి మన మనేకవిధము లైనదృష్టముల నెంచుకొని చిత్రించవచ్చును. ఇట్టిదృష్టములకు సొగసు కలుగజేయునవి వృక్షములే. వృక్షజాతులు మన దేశమునం దనేకము లున్నవి. చిత్ర లేఖనమునం దభ్యాసము కలుగజేసికొని మాతృభూమి యగుభారతదేశమున మంచి దృష్టముల నెంచుకొని చిత్రించి, జగత్తునం దంతటను ప్రసిద్ధిగాంచవచ్చును.
చిత్రకారులు చెట్లను వ్రాయవలెనన్న ప్రతివృక్షముయొక్క స్వభావమును గమనించవలెను. ఏలయన: అన్నిచెట్లు నొకేవిధముగ నుండవు. పుస్తకములను చదువుటవలనను, ఒక్క దినము ఈవిషయమున వినియోగించిన చెట్లను వ్రాయజాలరు. అందువలన ప్రతిదినమును జాగరూకతతో వివిధమైన చెట్లను గమనించుచుండవలెను.
వివిధవృక్షములు వివిధస్థలములయందు పెరుగును. వివిధకాలములయందు చిగుర్చును. పుష్పించును. కొన్నిచెట్లు యిండ్లవద్ద సాధారణముగ కనబడును. మఱికొన్ని అడవులయందు దృగ్గోచరమగును. ఇట్టిభేదములను గమనించుచుండిననేగాని తప్పులులేక వ్రాయుట యసంభవము. ఏలయన: తాను బోధపఱుచుకొనినది చిత్రకారుడు వ్రాయజాలడు. వేయేల? చెట్లు వానిస్నేహితులు కావలయును.
చెట్లుయాకారములు:- చెట్లు బల్లపరుపుగా నుండక గుండ్రముగ నుండును. ముఖ్యాధార మైన వేళ్లచే భూమియందు వృక్షము నాటబడియుండును. సాధ్యమైనంతవఱకు దీనిమొరడు తిన్నగ లేచుటకు ప్రయత్నించును. ఈ మొరడునుండియే కొమ్మలు లేచును. ఈకొమ్మలు మొదట వలముగాను పైకి వెళ్లినకొలది సన్నముగాను పరిణమించును. ఈసన్ననిభాగములయందు ఆకులు, పుష్పములు, పండ్లు మొదలగునవి కనబడును.
మనము చెట్లతో పరిచయము కలుగజేసికొనవలయునన్న మొదట వాటియొక్క వేళ్లు, మొండెము, కొమ్మలు, ఆకులు, ఫలములు మొదలగువాటివిషయమై కొంచెము నేర్చుకొనవలయును. ఇవి పైకి యెటుల కనబడునో అటుల వ్రాయవలెను. ఐనప్పటికిని వాటియొక్క జీవనము విషయమై కొంచెము నేర్చుకొనవలయును. కొమ్మ లెందు కటుల పెరుగునో అవి యెట్టిచర్మముచే కప్పబడియుండునో, దీనియొక్క ఆకార మేమియో ఏయేస్థలముయం దెటుల పెరుగునో నేర్చుకొనవలయును.
కొమ్మలు మొండెములనుంచి పెరుగును. ఇది మొండెమునుండి వెలువడునప్పు డనేకకోణములకు కారణమౌను. ఈకోణములు వివిధవృక్షజాతులనుబట్టి యుండును. గుగ్గిలపు చెట్టుయొక్క కొమ్మల కోణములు (angles) మామిడికొమ్మలకోణములకంటె చిన్నవిగ నుండును. కొన్నికొమ్మలు సమకోణములుగనే వెలువడును.
అడవియందు చెట్లు స్వేచ్ఛగా పెరుగును. మనుష్యసంచార ప్రదేశములయం దిటుల పెరుగజాలవు. ఏలయని మీరు నన్నడుగవచ్చును. మనుష్యులు చెట్లకొమ్మలను నఱికివేయుదురు. పశువులు దిగువనున్న కొమ్మలయాకులను భక్షించి కొమ్మలను కుఱుచగ చేసివేయును. ఇట్టిమార్పులు అడవియం దుండు చెట్లయందు కానరావు.
పర్వతములమీదను పెరుగు చెట్లకొమ్మలు మీదికి వంగియుండును. చదునగు నేలయందు పెరుగు చెట్లయందీమార్పులు కానరావు.
ఋతువులనుబట్టి యీచెట్లు చాలవఱకు మాఱుచుండును. శీతకాలమందు ఆకులను రాల్పును. వసంతమునందు చిగుర్చును. కొన్నిసమయములయందు కొన్నిచెట్లు చిగుర్చును. మఱికొన్ని సమయములయందు కొన్ని చిగుర్చును. కాన వీటివీటి నైజగుణములను జాగరూకతతో గమనింపవలెను. కొన్నిచెట్లు రాత్రులయం దాకులను ముడుచుకొనును. కొన్ని పగటిపూట నట్టిమార్పును చెందును. వీటివిషయమై వీలైనయెడల మనము తరువాతను నేర్చుకొందము.
మొండెము :- భూమిపైని కొమ్మలెటుల వ్యాపించియుండునో భూమియందు వేరులటుండును. ఈవేరులే మొండెమును నిలువబెట్టియుంచునని యిదివఱకే నేర్చుకొనియుంటిరి. ఈమొండెము శాఖలను, ఆకులను భరించుచున్నది. ఇదికాక దీనిద్వారానే వేళ్లనుండి కొమ్మలకు ఆకులకు ఆధారము వెళ్లుచున్నది.
అన్నిచెట్లయొక్క మొండెములు ఒకేవిధముగ నుండవు. ఎవరో వ్రాసిన చిత్రములయందలి మొండెముల రూపములను మనము చూచి వ్రాయకూడదు. వీటిరూపములను సృష్టియందే చూచి వ్రాయ నభ్యసింపవలెను. మన మట్టిచెట్లను చూడనిది వ్రాసినయెడల అసందర్భములకు లోనగుదుము. మనస్నేహితు డొకడు న్యూయార్కును చూచి దానిని మనవద్దను వర్ణించుటను వినుటకును, మనమే స్వంతముగ నానగరమును చూచినదానికిని భేదములేదా? ఒకచిత్రమును చూచి వ్రాసినయెడల వివరములను వ్రాయజాలము. వ్రాసినయెడల సృష్టిననుసరించి యుండదు.
మామిడి, మఱ్ఱి మొండెములు సమముగ నుండవు. జామచెట్టుయొక్క మొరడు వంకరగాను నునుపుగాను ఉండును. గుగ్గిలపుచెట్టు సన్నముగన పొడవుగ నుండును. అరటిచెట్టు సన్నగను, పొరలుగ నుండును. ఇట్టివి మనము జాగరూకతతో నిత్యము గమనింపవలెను. ఒక్కొక్క జాతియొక్క వివిధవృక్షముల మొరడులు వివిధాకారములను దాల్చి యుండును కాని వానిజాతినైజములనుమాత్ర మతిక్రమింపవు.
ఇంకొకయంశమును గమనింపవలెను. ఎంతయెత్తుననుండి కొమ్మలు పుట్టునో చూడవలెను. కొబ్బరి, యీత, పోక, ఖర్జూరపుచెట్లమాట విడిచిపెట్టుడు. వాటికి కొమ్మలను పోలు ఆకులుతప్ప శాఖలుండనే యుండవు. కొన్నిచెట్ల కొమ్మలుబహుదిగువననుండి మొండెములను కప్పివేయును. దీనికి పనసచెట్టే నిదర్శనము. కొన్నిచెట్లయొక్క శాఖలు యెత్తుగ నుండును. మనుష్యులు సంచరించు స్థలములయందుండు చెట్లకొమ్మలు దిగువనే పుట్టును. ఏలయన: మనుజులు చిగుళ్లను కొట్టివేయుదురు. అందువలన ప్రక్కలయందు శాఖలు చిగుర్చును.
చెట్టుయొక్క మొండెమును చూచినవెంటనే అది యేజాతివృక్షమో సులభముగ పోల్చుకొనవచ్చును. చెట్ల యొక్క బెరడులు వివిధాకృతులను దాల్చియుండును. ఈవిషయమై యిదివఱకే చెప్పియుంటిని. గనుక నిక చెప్పవలసిన యగత్యము లేదు. జాగ్రత్తగ గమనించిననేగాని యిందు చెప్పినంతమాత్రమున నేర్చుకొనజాలరు.
చెట్టుయొక్క వివిధభాగములయందుండు బెరడుయొక్కలక్షణములను ఆకులురాల్పు కాలమునందు చూచుటకనుకూలముగ నుండును. అప్పుడు ఆకులేమియు మనకడ్డురావు. అందువలన చెట్టుయొక్క ప్రతిభాగమును స్పష్టముగ కన్పడును.
కొమ్మలు :- చెట్టుయొక్క మొండెమునుండి కొమ్మలు పైకివచ్చును. కాని ఒకేచెట్టుయందుండు కొమ్మలొక్క విధముగ నెప్పుడు నుండవు. బెర డొకేవిధముగ నుండును. కాని కొమ్మలయం దుండుబెరడుకంటె మొండెమునందుండు బెరడు గరకుగ నుండును. ఏలయన: కొమ్మలు లేతవి. బాలురదేహము కోమలముగా నుండును. వృద్ధులదేహమంత మృదువుగా నుండదు. అటులనే యీచెట్లయందుకూడ భేదము కాన్పించును.
కొన్నిచెట్లు చూచుటకు గుండ్రముగా నుండును. ఏలయన: క్రిందికొమ్మలు భూమివైపునకు వ్రాలియుండును. మీదికొమ్మలు సూటిగా లేచును. మధ్యనున్నకొమ్మలు క్రిందికొమ్మలకును, మీదికొమ్మలకును, మధ్యనుండు స్థలము నాక్రమించియుండును. అందువలన నిట్టి చెట్లకొమ్మలకోణములవిషయమై చెప్పుట కేమియు వీలులేదు. మీదికోణములు చిన్నవిగను క్రిందికోణములు పెద్దవిగ నుండునని చెప్పుటకుమాత్రము వీలు కలుగును.
కొన్నిచెట్లను దగ్గరగా పాతెదరు. అందువలన పెరుగుటయం దివి యనేకమార్పులను చెందును. ఈవిషయమందు మాత్రము మనము పైనిచెప్పిన ప్రకారము వర్తించుటకు వీలుండదు. ఎల్లపుడును సమయము ననుసరించియే మనము ప్రవర్తించుచుండవలెను. కొన్నిచెట్లయందు కొమ్మలు ఒకేచోటునుండి బయలువెడలును. ఇట్టిచెట్లు బహువిచిత్రముగ నుండును. 31 - 1 చూడుము.
మనవైపునకు వచ్చినకొమ్మలనుకాని, మనవైపునకు వ్యతిరిక్తముగ పెరుగుకొమ్మలనుకాని వ్రాయుట దుర్లభము. అప్పుడీకొమ్మలయొక్క వంకరలన్నియు చూపుచు వ్రాయుచుండవలెను. లేనియెడల చిత్రముయొక్క సౌందర్యమంతయు నశించును. ఇట్టికష్టములు వృక్షములకు ఆకులులేని కాలమునందు తటస్థించును. ఆకులున్నచో కొమ్మలంతగా కనబడవు. అందువలన నంతదుర్లభముగనుండదు. కనుక వేసవియందు చెట్లకొమ్మలను వ్రాయుట బహుసులభము.
ఆకులచే గప్పబడియున్న కొమ్మలు భారముచే వంగియుండును. ఆకులులేని కొమ్మ లంత వంగియుండవు.
కొన్నిచెట్లకొమ్మలు పొడవుగ నుండును. కొన్నిచెట్లకొమ్మలు పొట్టిగ నుండును. కొన్నికొమ్మలు సన్నముగను, పొడవుగ నుండును. కొన్ని పొట్టిగను దళముగనుండును. ఇట్టివన్నియు బాగుగ సృష్టియందు చూచుచుండవలెను. ఏయేచెట్లు యేయేకాలములయం దెట్లుండునో బాగుగ గమనింపవలెను. లేనియెడల నిట్టివి చక్కగ ప్రదర్శింపలేకపోదుము.
ఆకులు:- చెట్లయొక్క అన్నిభాగములకంటె ఆకులు ముఖ్యములు. ఆకులులేనిచెట్టు భర్తలేనిస్త్రీవలె నుండును. మొండెమును, కొమ్మలును, అస్థిపంజరమునకును, ఆకులు మాంసచర్మాదులకును పోల్పబడినవి. మాంసమును చర్మమును అస్థిపంజరమున కెటుల సౌందర్యమును కలుగజేయునో ఆకులు చెట్ల నటుల నలంకరించును. ఇట్టియాకులను వ్రాయుటయర్ చాలదుర్లభము. చిత్రించుటలో ప్రవీణత యున్నవాడు చెట్లశాఖలనుగూర్చి విస్తారము తెలియస్క పోయినను వ్రాసివేయగలడు. కాని ఆకుల నటుల చిత్రింపలేడు. అప్రవీణు లగుచిత్రకారులు ప్రతియాకును చిత్రించెదరు. అది తప్పు. చాల దగ్గరగనున్న కొమ్మలయాకులుమాత్రము విడివిడిగ కన్పడును కాని దూరముగనున్న నటుల కనుపడవు. అన్నియు కలసిపోవును కాన అన్నిచెట్ల యాకారములు నొకేవిధముగ నుండవు. సాధారణముగచిత్రించి వివిధ మైనచెట్ల రూపములను చక్కగ ప్రదర్శింపవచ్చును. అందువలననే ప్రతిచెట్టు ---------- వునందును గమనించుచుండవలెనని మొదటనుండి చెప్పుచువచ్చితిని.
మొదట మన మొకచిన్నకొమ్మను వ్రాయుట నేర్చుకొనవలయును. ఇందు ప్రతియాకును ములనీడ నొకబాట చిత్రమును పూర్తిచేయవలెను. ఇం దభ్యాసమైనతరువాతను కొంచెము పెద్దకొమ్మను వ్రాయస్థలమునందు కొన్ని ఇట్టిచిత్రములయందు ప్రతియాకును వ్రాయక దానియాకారము వచ్చునటుల గీతలను గీయుచుండవలెను. ఇటుల వ్రాయునపుడు అది యేజాతిచెట్టుయొక్క కొమ్మయో తెలిసికొనగలుగునటుల వ్రాయుటకు ప్రయత్నించుచుండవలెను.
గుమ్మడియాకునైనను, ఆముదపు ఆకునైనను అనేకవిధముల నుంచి వ్రాయుచు కొమ్మలను వ్రాయుటకూడ అభ్యసింపవలెను. ఇట్టియాకులు గలకొమ్మలకును తక్కిన కొమ్మలకును చాల భేదముండును. అందువలన నిట్టివి తప్పులు లేకుండ వ్రాయవచ్చును.
ఏచెట్టు ఏకాలమునందు సుందరముగ కానవచ్చునో, ఆచెట్టు నట్టికాలమునందేవ్రాయుట నభ్యసింపవలెను. అసహ్యమును పుట్టించు వస్తువులకంటె కన్నులపండువుగ నుండువస్తువులను వ్రాయుటకు మనము సాధారణముగ కుతూహలపడుచుందుము.
సూర్యుడు ప్రకాశించునప్పుడు సూర్యకిరణములు చెట్లపై బడి వాటికి వన్నెవన్నెలరంగులను తెచ్చుచుండును. వాటినీడ భూమిపై బడుచుండును. మంచు పడుచున్నపుడు సృష్టియందలి వస్తువులు బాగుగ కనపడవు. చీకటిరాత్రిసంగతి నిక చెప్ప నక్కఱలేదు. చంద్రకాంతిలో సృష్టి యంతబాగుగ కన్పడదు. అందువలన సాయంకాలముననో, ప్రాత:కాలముననో బయటికి వెళ్లి యేదోయొకచోటను కూర్చుండి చెట్లను వ్రాయుట నభ్యసింపవలెను. ప్రారంభికుల కిదియే మంచిసమయము.
మొదట చెట్ల నెందుకు వ్రాయుట నభ్యసింపగూడదు? కొమ్మల నెందుకు వ్రాయవలెను? అని మీరు నన్ను ప్రశ్నింపవచ్చును. లోపలిమర్మములు తెలియనిది వ్రాసిన నేమిలాభము? అక్షరాభ్యాసము చేయనిది నవలలను, ప్రబంధములను చదువుటకు యత్నించుట నవ్వులచేటు కాదా? అందువలన మీరు మొదట యాకులను, తరువాత కొమ్మలను, పిమ్మట చెట్లను వ్రాయుట నభ్యసింపవలెను.
చెట్టును వ్రాయునపుడు చిన్నచిన్నకొమ్మలవిషయమై విస్తారము శ్రమపుచ్చుకొనక పెద్దకొమ్మలనే బాగుగ చిత్రమునందు చూపుటకు ప్రయత్నించవలెను. ఏలయన: దూరమునకంత చిన్నకొమ్మలు కానరావు. అటులనే చెట్లయాకులు విడివిడిగ కన్పడవు. అన్నియు కలిసిపోయినటులుండును. ఈకొమ్మలను ఆకులను విడివిడిగ వ్రాయుటయం దింకొకలాభ మున్నది. కొన్నిసమయములయందు ఒకేచెట్టును వ్రాసి అం దివియన్నియు చూపించవలసియుండును. జాగ్రత్తగ నేర్చుకొనిన దెప్పటికిని వృధాయైపోదు. అట్టియభ్యాసము నిన్ను కష్టములనుండి తొలగించవచ్చు నేమో ఎవరెఱుగుదురు? అనేకవిధము లగుచెట్లను వ్రాయవలసివచ్చునపుడు ఇవియన్నియు నీ కుపయోగించును.
వివిధదూరములయం దుండుచెట్లు:- దూరముగ నుండుచెట్లయొక్క వివిధభాగము లంతబాగుగ కనపడవని యిదివఱకే చెప్పియుంటిని. ఒకచెట్లసమూహ మొకచోట నుండినయెడల భూమిలోనికి పెరిగిన యూడలతో నున్న మఱ్ఱిచెట్టువలె కనబడును. దూరముగను దగ్గరగ నుండుచెట్లకు చాలభేద ముండును. ప్రకృతిచిత్రము ననుసరించి మనము చిత్రించవలెనన్న దూరముగనున్నచెట్లు మనకెక్కువ కష్టము కలుగజేయును. ఆకాశపురంగునుబట్టియు, వేళనుబట్టియు, ఛాయనుబట్టియు చెట్లయొక్కరంగు మాఱుచుండును. అందువలన మనచిత్రమునం దవి యన్నియు చూపించవలసియుండును.
ఏయేచెట్లు ఎట్టిప్రదేశములయందు పెరుగునో గమనించవలెను. మఱ్ఱిచెట్టు ఇసుకనేలయందును, సరుగుడు --------- నేలయందును, జామచెట్లు రాళ్లయందును, ధాన్యము కొండమీదను పెరుగవు. అట్టిసమయము --------- చాలజాగరూకతతో మెలగవలెను. మనయిష్టముప్రకారము ఏదోయొకచెట్టు నెచ్చోటనో వ్రాసి------ రదగ్గరగ పుట్టును.కొన్నిదూరముగ నుండును. వీటిజాతి నైజమునుబట్టు యుండును. ఒకేజాతిచెట్ల నొకేవిధముగ వ్రాయజాలము. వృద్ధవృక్షములు బాలవృక్షములు నొకేవిధముగ నుండవు. బాలవృక్షములబెరడు మిగుల కోమలముగ నుండును. ఆకులు అంతదట్టముగ నుండవు. కాని ఆకులులేనికొమ్మలు మాత్ర ముండవు. మధ్యవయసుగలచెట్లయం దాకులు దట్టముగ నుండును. కాని అచ్చటచ్చట ఆకులులేనిశాఖ లుండును. వృద్ధవృక్షములయందు ఆకులు విస్తార ముండవు. బెరడు మిగుల కరకుగ నుండును. చాలకొమ్మలు విరిగిపోయియుండును. ఇట్టివణ్ణియు చూచుచుండవలెను.
వివిధపరికరముల నుపయోగించి చెట్లను వ్రాయుట.
అనేకపరికరముల నుపయోగించి చిత్తరువులును వ్రాయవచ్చునని పుస్తకప్రారంభమునందే చెప్పియుంటిని. వృక్షపటములను వ్రాయుటయందు ప్రసిద్ధిగాంచిన చిత్రకారులు, మెత్తని పెన్సిలును, నీరురంగులను, నూనెరంగులను ఉపయోగించెదరు. కాని యీపుస్తకమునందు నూనెరంగుల విషయమై చెప్పుటకు నిశ్చయించుకొనలేదు.
పెన్సిలును మనము సాధారణముగ చెక్కినటుల చెక్కగూడదు. పెన్సిలుయొక్క సీసమును గసి (Wedge) ఆకారముగ చెక్కవలెను. దీనితో మనయిష్టప్రకారము సన్నముగా గాని వలముగాగాని గీతలను గీయవచ్చును. కాన నిట్టిపెన్సిలుకొన మనకు చాలయుపయోగకరముగ నుండును. చెట్టుయొక్క మొండెమును వ్రాయునప్పుడు సన్నని గీతలును, దట్టమైనగీతలును కావలసియుండును. ఆకులను వ్రాయునప్పుడు సన్ననిగీత లుపయోగకరముగ నుండును.
ఆకులు వ్రాయుటయందు మిక్కిలి ప్రావీణ్యము గలిగియుండవలెను. వీటిని వ్రాయుట కనుగుణ మైనగీతల నభ్యసింపవలసియుండును. తఱుచుగ వ్రాయుచుండుటవలననే వచ్చును కాని పుస్తకములను చదివినంత మాత్రమున నలవడదు. సంగీతగ్రంథములను చదివినవారందఱును కృతులను పాడగలరా? అటులనే చిత్ర లేఖనమం దభ్యాసముండవలెను. కొందఱు సంగీతవిద్యార్థులు సంవత్సరములకొలది కష్టపడి సంగీతవిద్య నభ్యసించి బాగుగ గానము చేయలేకున్నారు. ఇట్టివిద్యలు పట్టుబడుట కష్టమగుటచేతను, వారు మంచిమార్గమున నభ్యసింపకపోవుటచేతను యీకళయందు ప్రవీణులు కాజాలక యున్నారు. అందువలన చిత్రలేఖనమును బహుశ్రద్ధాభక్తులతో నేర్చుకొనవలెను.
చాలయభ్యాసమువలన మనహస్తము నుపయోగించుట నేర్చుకొనవలెను. పెన్సిలును కొనవద్ద పట్టుకొనరాదు. మెల్లగ పెన్సిలుతో వ్రాయుట నభ్యసింపవలెను.
మొదట సన్ననిగీతలతో చెట్లపైయాకారములను వ్రాయవలెను. ఈవిషయము చాలముఖ్యము. పైయాకారమును చక్కగ వ్రాయనిది చెట్టును పూర్తిచేయరాదు. మొండెమును కనబడుచున్నకొమ్మలను మొదట చిత్రించవలెను. తరువాత నీచిత్రము బాగుగ నున్నదో లేదో చూచుకొని వివరములను కొంచెము దట్టమైనగీతలతో చిత్రింపవలెను. మనచిత్రమునుబట్టి యీగీతలు మాఱుచుండును. మోటుగ వ్రాయవలెనన్న దట్టమైన పెద్దగీతలతోను, నాజూకుగ చిత్రింపవలెనన్న సన్నని చిన్నగీతలతోను వ్రాయవలెను. ఏవిధమున వ్రాసినను ప్రకృతిచిత్రము ననుసరింపవచ్చును. వివిధజాతులచెట్లను చక్కగ పైజెప్పినరెండువిధముల వ్రాసి ప్రదర్శింపవచ్చును.
ఈవిధముగనే సుద్దతోను, మసిబొగ్గుతోను వ్రాయవచ్చును. దేనితో వ్రాసినప్పటికిని ఈవిద్య నీవ్రేళ్లకొనయం దుండునటుల నభ్యసింపవలయును. మనుజునిరక్తి కంతములేదు. దీని నెంతయభ్యసించిన నంతయభివృద్ధినొందును.
నీరురంగులు వృక్షపటమునకు వన్నెతెచ్చును. ఇతరచిత్రములయందువలె దీనియందు రంగును సమముగ పూయుచు వచ్చినంతమాత్రమున లాభములేదు. మొదట నొకరంగును పలుచగ చెట్టునకువేసి యిది బాగుగ నారకముందు మఱియొకరంగును వేయవలసియుండును. ఏరంగును వేయవలసియుండునో మీరే యాలోచింపుడు. ఇందుకు ఏయేరంగులను కలిపిన నేరంగు వచ్చునో బాగుగ తెలిసియుండవలెను.
చెట్లను రంగులతో చిత్రించుటయం దొకయాకుపచ్చనే యుపయోగించుట తప్పు. అనేకరంగుల నుపయోగించవలసియుండును. రెండవపర్యాయము రంగును వేయునపుడు చాయను వెలుతురును చెట్టుచెట్టుకు భేదమును తెలియజేయవలెను. తడిగ నున్నపుడే రెండవమారు రంగువేసిన చెదరిపోవును. ఇది కొన్నిసమయములయందు లాభముగను, కొన్నితరుణములయందు నష్టముగను పరిణమించును. చెదరకుండ నుండవలె నన్న మొదట వేసినరంగు ఆరినవఱకును వేచియుండవలెను. మూడవపర్యాయము రంగును వేయునపుడు చెట్టుయొక్క జాతిని తెలియజేయునటుల చిత్రింపవలెను. దీనితో రంగును వేయుట పూర్తిచేయవచ్చును. ఈమూడుముక్కలతో మనపని సరిపోలేదు. మనము విసుకుదల లేకుండ చాలదినము లభ్యసింపవలెను. పెన్సిలుతో వ్రాయునపుడు ఛాయను, వెలుతురును, చెట్లజాతిభేదమును తెలియజేయవచ్చును. రంగులను పూసి వెలుతురును, జాతిభేదములను, రంగులను తెలియజేయవచ్చును. రంగులను పూసినచిత్రము ప్రకృతిచిత్రము ననుసరించి యుండును. అందువలన పటములను రంగులతో చిత్రించుటయే మంచిది.
కొన్నిసమయములయం దొకేరంగుతో చిత్రింపవలసియుండును. అప్పుడు వివిధతరగతులచాయను జాగరూకతతో చిత్రింపవలెను. ఇటుల చేయక ఛాయను వ్రాయవలసినచోటను దట్టముగను, వెలుతురును ప్రదర్శింపవలసిన చోటున పలుచగను చిత్రించి చిత్రమును పూర్తిచేసితి నని యుప్పొంగరాదు.
చెట్టెప్పుడును ఆకుపచ్చగ కనబడదని వేళనుబట్టియు, ఋతువు ననుసరించియు, ఆకాశపురంగునుబట్టియు, చెట్టురంగు మాఱుచుండు ననియు నిదివఱకే చెప్పియుంటిని. అన్నిచెట్టు లొకేరంగుగ నుండవు. జామచెట్టు రంగుకంటె మామిడిచెట్టురంగు దట్టముగ నుండును. మామిడిచెట్టురంగుకంటె పనసచెట్టురంగు గాడముగ నుండును. ఇట్టి భేదము లన్నియు మనచిత్రమునందు చూపుచు వివిధజాతులచెట్లను చక్కగ ప్రదర్శింప ప్రయత్నించవలెను.
వివిధతరగతుల చెట్లు.
వటవృక్షము :- ఇది హిందూదేశవృక్షములకు రాజు. దీనిని ప్రతిదినము మనము చూచుచుండుము. ఈవృక్షము బాగుగ పెరిగిన పెద్దమేడవలె నుండును. ఇది మనకు మిక్కిలి యుపయోగకారి. దీనియాకులయందు భుజించెదరు. దీనియూడలను దంతధావనము చేయునపు డుపయోగించెదరు. దీనిపాలు జిగురుగ నుపయోగపడును. దీని నీడయం దనేకులు బాటసారులు శ్రమ దీర్చుకొందురు. దీనిఫలములములు పక్షుల కాహారము. ఇట్టివృక్షమును చిత్రించుట మనము నేర్చుకొనుట విధాయకము.
ఈచెట్టునం దాకులు దట్టముగ నుండవు. కొమ్మలెల్లచోట్లను కనబడుచుండును.
మొండెము:- దీనిమొండెము మిగుల వలముగాను, కరకుగా నుండును. ఎచ్చటచూచినను తొఱ్ఱలు గుంపులు కానవచ్చుచుండును. అనేకమొండెములు కలసియున్నటులుండును. దీనిపై నొకవిధమైన తెల్లనినాచు పెరుగును. ఇది కొమ్మలయందుకూడ పెరుగును. అంతట నిది వ్యాపించనప్పటికిని అచ్చటచ్చట వృక్షమంతట వ్యాపించి చిఱుతపులి బజ్జెలువలె కాన్పించుచుండును.
కొమ్మలు:- ఇవియు వలముగాను, కరుకుగాను ఉండును. మొండె మంతయభ్యాసకరముగ నివి కానరానప్పటికిని గుంపులతో నిండియుండును. ఇది వంకరగ పెరుగును. సాధారణముగ నీకొమ్మలు భూమికి సమాంతరములుగ నుండును.
ఆకులు:- ఈయాకులు యించుమించు గుండ్రముగనుండును. వీటికాడలు పొట్టిగను, పసుపువర్ణముగను కానవచ్చును. ఇవి కొమ్మలయందు గుంపులుగుంపులుగ పండ్లతో కలసి పెరుగుచుండును. చిగుళ్లు సూదిగ నుండును. ఆకులు నీలమిశ్రితమైన గాడమైన ఆకుపచ్చనిరంగును కలిగియున్నవి. ఆకులు వార్ధక్యమునందు పసుపుపచ్చగనైపోవును. 31 - 2 చూడుము.
పండ్లు:- ఈచెట్టుయొక్క పుష్పములు కానరావు. పండ్లు కొమ్మలకొనలయందు గుంపులుగుంపులుగ పెరుగును. వీటికి కాడలు లేవు. ఈఫలములు శాఖల కంటియుండును. ఒక్కొక్కటి యొక్కొక్క కప్పునందు నిర్మింపబడియుండును. ఈపండ్లు పక్వముగాకముందు ఆకుపచ్చగను, పక్వమైనతరువాత ఎఱుపుగ నుండును.
ఊడలు:- ఈయూడలవలననే యీచెట్టు పెద్దదిగ పెరిగి పెద్దభవనమునకు పోల్పబడుచున్నది. కొమ్మలనుండి యీయూడలు క్రిందికి సమముగ పెరుగును. ఇవి భూమికి తాకునప్పటికి బలముగ నభివృద్ధిపొందును. తరువాత భూమిలోనికి పెరిగి వేళ్లవలె గట్టిగ నాటుకొనును. పిమ్మట నేచెట్టునుండి యవి పెరుగునో యాచెట్టుకును, వీటికిని విడదీసివేసినప్పటికిని ప్రత్యేకవృక్షముగ నభివృద్ధినొందును. ఇటులనే అనేకఊడలు పెరిగి చెట్టు నెంతో యభివృద్ధి నొందించును. ఈవిధముననేకదా రాజ్యముయొక్క వివిధభాగములు అభివృద్ధినొంది మాతృదేశము నత్యున్నతస్థితికి తేవచ్చును. కొన్నిసమయములం దీయూడలవలెనే మాతృదేశములతో సంబంధమును విడదీసికొని స్వతంత్రజీవనము సలుపును. ఈయూడలు స్తంభములకును, ఆకులు కప్పునకును పోల్పబడినవి. పెద్దభవనము మనుజుల కెటుల నివాసయోగ్యమో యీచెట్టు బాటసారుల కటులనే యుండును. గొప్పరాజ్యముతోను పెద్దభవనముతోను పోల్పబడిన వృక్షరాజము మనదేశమునందు పెరుగుటవలన మనము గర్వపడవలసినదే.
ఈచెట్టును జాగరూకతతో చిత్రించినయెడల భవనమువలె కానవచ్చును. అలసిన బాటసారులకు నీడనిచ్చిన యీచెట్టుయొక్క ఛాయను బాగుగ ప్రదర్శింపవలెను. దీనిక్రింద నొకబాటసారి శ్రమ దీర్చుకొనుచున్నటుల వ్రాసిన నెంతయో చక్కగ నుండును.
మామిడిచెట్టు.
ఈచెట్టుయొక్క నామము లోకవిదితమే కదా. దీనిపండ్లను భక్షింపని హైందవుడుండునా? ఈప్రసిద్ధివృక్షములు హిందూదేశమునందు లెక్కకు మిక్కిలిగలవు. ఇవి సాధారణముగ సమూహములుగ నుండును. ఒక్కచెట్టు విడిగా కానవచ్చుటయరుదు. మనుజులు దీనిఫలములను తినుట కనేకచెట్ల నొకచోట బాతెదరు. అందువలన మనదేశమునందు మామిడితోపు లనేకములు కలవు.
ఈచెట్టును మఱ్ఱిచెట్టువలె పలుదిక్కుల వ్యాపించును. దీనికి ఊడలు లేవు. అందువలన నిది మఱ్ఱిచెట్టంత పెద్దదిగ పెరుగలేదు. వటవృక్షపుకొమ్మలవలెనే దీనిదిగువకొమ్మలును భూమికి సమాంతరముగ పెరుగును. కొన్ని సూటిగా నాకాశపువైపునకు వ్యాపించును. ఈవృక్షపుకొమ్మలయందనేకగుంపు లుండును. దీనిబెరడును మఱ్ఱిబెరడువలెనే కరకుగా నుండును. దీనిపైని నాచు లేచునుకాని వటవృక్షము నాచు అంత తెల్ల్గ నుండును. ఈచెట్టుయొక్క కొమ్మలు వంకరటింకరుగ నుండును.
ఆకులు:- మామిడియాకు సాధారణముగ ఒకటిన్నర అంగుళము వెడల్పును, ఎనిమిదిఅంగుళముల పొడవును గలిగియుండును. వీటికాడలును పొట్టిగను ఆకుపచ్చమిశ్రిత మైనపసుపురంగుగ నుండును. ఈయాకులు చదునుగ నుండవు. కొన్నిసమయములయం దివి నిలుచుకొనియుండును. వీటిరంగు గాడమైన ఆకుపచ్చ. చెప్ప----- తిని. ప్రతిఆకుయొక్క క్రిందిభాగముకంటె మీదిభాగము దట్టమైనరంగును గలిగియుండును. ----------- సూర్యునివైపునకును, క్రిందిభాగము భూమివైపునకును తిరిగియుండును.
వసంతకాలమునందు దీనిచిగుళ్లు చూచుట కత్యానందముగ నుండును. వీటి ----------- చిగిర్చుకాలమునందు కొన్నిమామిడిచె ట్లెఱ్ఱనిబట్టను దాల్చినట్లుండును. ఆకుపచ్చ ---------- కొన్నిచెట్లు సగము చిగిర్చును. మఱికొన్ని చిగిర్చవు. అందువలన వసంతకాలమున ----------- రంగులను కలిగియుండును.
పుష్పించుకాలమునం దివి యెట్లు కానవచ్చునో కొంచెము చూతము. చిగిర్చి ------------- చినచెట్లు చిగిర్చవు. అందువలన సంపూర్ణముగ పుష్పించినచెట్టునం దొకయెఱ్ఱనియాకైనను ---------- పుష్పమయమైయుండి పచ్చగ కానవచ్చును. అచ్చటచ్చట కొన్ని పచ్చని ఆకులు కానవచ్చుచుండును. ఫలించుకాలమును చూచుకొందము. ఈకాలమునం దన్ని మామిడిచెట్లును ఆకుపచ్చగనేయుండును. చిగుర్లన్నియు పచ్చని యాకులుగ మాఱును. అప్పుడు చెట్టున కనేకులాశ్రితు లుండెదరు. ఫలములతో నిండియున్న చెట్టుక్రింద నొక రిద్దఱు మనుజులుండినటుల వ్రాసిన బహుబాగుగ నుండును. అందువలన నాకాలమునందు మామిడిచెట్టుక్రిందనున్న చిన్నమొలక లన్నియు చచ్చి నున్నగ నుండును.
ఫలములు :- ఈఫలము లన్నియు నొకేవిధముగ నుండవు. 31 - 3 చూడుము.
కొన్ని గుండ్రముగను, కొన్నిపొడవుగను, కొన్ని చిన్నవిగను, మఱికొన్ని పెద్దవిగను ఉండును. పండినప్పుడు గూడవీటిరంగు వివిధములుగ మాఱుచుండును. కొన్ని ఫలములు కాయలవలెనే యాకుపచ్చగ నుండును. ఇది చెట్టంతయు వ్యాపించకపోయినప్పటికిని పెరిగినంతమట్టుకు దట్టముగ నేదోయొకకొమ్మపై నభివృద్ధిపొందును.
వేళ్లు:- మామిడివేళ్లు భూమియందు చాలవఱకు వ్యాపించును. పైని చెట్టెంతపెరుగునో లోపల వేళ్లంత పెరుగును. ఈవేళ్లు అచ్చటచ్చట పైకికానవచ్చుచుండును.
జామి చెట్టు.
ఈచెట్టు మామిడిచెట్టంతబలముగ నుండదు. దీని మొండెము సన్నముగ నుండును. కాని వంకరగను ---------టును, మఱ్ఱిచెట్టును మించియుండును. దీనియం ------------నుండవు. దీని మొరడు నున్నగను ------------- దీనియాకులరంగు మఱ్ఱి
దీనిపండ్లు పచ్చిగ నున్నపుడు ఆకుపచ్చగను,పండినతర్వాత పసుపుగనుండును. దీనిపువ్వులు తెల్లగను సుందరముగ నుండును. ఫలము పక్వమైనకొలదిని పుష్పముశుష్కించును. 32 - చూడుము.
గనించివ్రాయుట నభ్యసింపవలెను. ఇకను తుప్పలను చూతము.
గులాభిమొక్క. }}
ప్రేమింతురు. కావున దీని ననుదినమును మనము చూచుచుందుము. ఈమొక్క ---------- చెట్టువలె పెద్దదికాదు. సాధారణముగ భూమికి శాఖలు తగిలియేయుండును. అందువలన దీని మొండెము కానరాదు. మొండెము లేదనికూడ చెప్పగలము. భూమిమట్టమువద్దనుండియే యనేకకొమ్మలుగ విడిపోయి తుప్పవలె పెరుగును. ఈకొమ్మలు సన్నముగను పొడవుగను ఉండును. విస్తారము పుష్పించుటకుగాను వీటికి సగమువఱకు నఱికివేయుదురు. అందువలన కోసివేయబడిన కొమ్మలను మన మనేకము చూచుచుందుము. అందువలననే యిది చాలకురుచగ పెరుగుచున్నది.
ఈతు ప్పంతటను వంకర యగుచిన్నముళ్లు పెరుగును. ఇంతచక్కనిపూవు లుండుచెట్టునకుగూడ ముళ్లుండవలెనా? ఆహా! ఎంతటివానికైనలోపము లుండకమానవు కదా!
దీనియాకులు చిన్నవిగను, సౌందర్యముగను ఉండును. ఈయాకుల యంచులు కరకుగ నుండును.
మామిడి, మఱ్ఱియాకులవలెగాక యివి ఆఱేసియాకులు గలసి యొకపెద్దయాకుగ తెలియబడుచున్నవి.
ఇవి నీలిమిశ్రిత మైనఆకుపచ్చనిరంగును కలిగియున్నవి. అందువలన నీతుప్పలు అన్నికాలములయందును గాడమైనరంగును కలిగియుండును. సాధారణముగా నొకపెద్దయాకునందు ఏడుచిన్నయాకు లుండును. కొన్నిసమయములయందు అయిదు మూడు చిన్నయాకులున్న పెద్దయాకును చూచుచుందుము.
పుష్పములు సాధారణముగ గులాబిరంగుగ నుండును. మృదువైన పుష్పదళము లనేకములు కలసి యొక పుష్పమగును. ఈచక్కనిమృదు వైనరేకులు చూచుట కెంతయో యానందకరముగ నుండును. దీనిపుప్పొడి పసుపు వర్ణముగ నుండును. ఈపుష్పమంతయు నొక యాకుపచ్చనిరంగు గలయండకోశముపై నిర్మింపబడియుండును.
పుష్పములు కొమ్మలకొనయందు గుంపులుగ నుండును. కొన్ని పుష్పించియుండును మఱికొన్ని మొగ్గలుగనే యుండును. కొన్ని అప్పుడే పుట్టుచుండును. ఇట్టికొమ్మను వ్రాసిన నెంతయో చక్కగ నుండును.
అనేకవిధము లైనగులాబిజాతు లున్నవి. కొన్ని పాదవలె ప్రాకును. వీటియందు పసుపువర్ణము గలపుష్పములు పుష్పించును. ఇటులనే బ్రహ్మజెముడు, కొబ్బరి, యీతచెట్టు మొదలగువానిని చూచుచు వ్రాయుచుండవలెను. ఎట్టివి యెటుల మీరు గమనింపవలయునో యిందు చెప్పితిని. కాని విపులముగ తెలిసికొనవలె నన్న వృక్షశాస్త్రమును చదివిన బోధపడును. చదివినంతమాత్రమున లాభము లేదు. ఈపుస్తకమును మీహస్తంబున నిడికొని ఆయాచెట్టును చూచుచు చదివిన లాభకరముగ నుండును.
ఇంకొకయంశమును చెప్ప మఱచితిని. చెట్లవిషయమై నే నింతవిపులముగ జెప్పినందులకు నన్ను నిందించ వలదు. సృష్టికి సౌందర్యము నిచ్చునవి చెట్లు. అందువలన మనము ప్రదేశచిత్రములను వ్రాసినయెడల చెట్లను సౌందర్యముగ చిత్రించవలసియుండును.
చిత్రలేఖనమునందు మంచిప్రావీణ్యము కలుగజేసికొనవలెనని యెల్లప్పుడును పుస్తకములను డ్రాయింగు పరికరములను వెంటను కొనిపోవలెను. ఎచ్చట దేనిని చూచిన దానిని చిత్రమును వ్రాసివేయుచుండవలెను. గోవులు మేయుస్థలమునకు పోయి చూచినయెడల మన మనేకవిధములైన యవస్థలలొ వాటిని చూడగలము.కొన్నిశయనించి యుండును. మఱికొన్ని మేయుచుండును. కొన్ని నిలువబడియుండును. పరుగెత్తునటుల, నడచునటుల మనమువాటిని చూతుము. అట్టిసమయమునందు వాటిని చూచి వ్రాయుచుండిన నెంత యభ్యాసము కలుగునో యాలోచింపుడు.
ఇటులనే మనుజులను, గుఱ్ఱములను, గాడిదలను, కుక్కలను వ్రాయుట నభ్యసింపవచ్చును. అట్టిచిత్రములను పారవేయక జాగరూకతతో నుంచిన ప్రదేశచిత్రములను వ్రాయునప్పు డివి యన్నియు మన కెంతయో యుపయోగకరముగ నుండును. పైజెప్పినవిధముననే యనేకవిధము లనవృక్షములను వ్రాయుట నభ్యసించిననేకదా ప్రవీణులము కాగలుగుదుము.
ఒక జలప్రవాహ మున్నది. దానిప్రాంతములయందు వివిధవృక్షము లున్నవి. ఆవృక్షముల నీడయందు ఒకబాటసారి విశ్రమించియున్నాడు. కొంతదూరమున కొందఱుపిల్ల లాడుకొనుచున్నారు. మఱియొక---------పశువులు మేయుచున్నవి. నదియం దొకపడవ పోవుచున్నది. అందొకమనుజుడు కూర్చుండియున్నాడు. దూరమునందు పర్వతములు కానవచ్చుచున్నవి. ఆకాశమునందు సూర్యుడు తీవ్రముగప్రకాశించుచున్నాడు. కాని అచ్చటచ్చట మేఘములు కానవచ్చుచున్నవి. నదియందు చెట్లు, సూర్యుడు,మేఘములు ఇంక ననేక మైనవస్తువులు నీడలు ప్రతిఫలించుచున్నవి. ఇట్టిప్రదేశచిత్రములను వ్రాసి చూడుడు. మీ కెంతవఱ కభ్యాసము కలిగెనో మీకే తెలియును.
కాని ప్రారంభమునందు మన మిష్టము వచ్చినటుల వ్రాయకూడదు. సృష్టియం దుండువస్తువులను చూచి చిత్రించుట నభ్యసింపవలెను. ఇటులచేయుట కొకయుపాయము చెప్పెదను.
చిత్రలేఖనమునకు కావలసిన వస్తువులను, ఒకదర్పణమును నీతో నొకనిర్జనప్రదేశమునకు తీసికొనిపోయి, యొకచోట నాసీనుడవై కొంచెము ప్రక్క నొకవస్తువునకు నీయద్దమును చేరవేయుము. ఆ యద్దమునందు కొంతప్రదేశము కానవచ్చును. దానిని చూచి వ్రాయుట మీకు సులభముగ నుండును. అప్పుడు చిత్రించుట మీ కెంతయో యానందకరముగను, సులభముగను ఉండును.
వివిధము లైనరంగులను వేయకముందు మీరొకపనిని చేయవలసియున్నది. పెన్సిలుతో మీచిత్రములను వ్రాసినతరువాతను సిపియారంగుతో ప్రధానచ్ఛాయలను చిత్రించవలసియుండును. పిమ్మట సృష్టి ననుసరించి మీరు వివిధరంగులను చిత్రమునందు వేసి, అవియెండినతరువాతను వివరములను చిత్రించి పటమును పూర్తిచేయవచ్చును. ఇటులనే అన్నిచిత్రములను వ్రాయునది అభ్యాస మైనకొలదిని చిత్రమును చక్కగ వ్రాయగలుగుదురు. విద్య కంతము లేదని జ్ఞాపకముంచుకొనుడు.
నాల్గవ భాగము.
మానవుల ప్రతిరూపములను రంగులలో చిత్రించుట.
ఛాయాపటములను పెద్దవిగ పెన్సిలుతో వ్రాయువిధములను చెప్పితిని.ఇప్పుడు రంగులతో చిత్రించుమార్గములను వ్రాసెదను. ఈపనిని పూనుకొనుటకు నీకురంగులను పూయుటయందు చాలప్రావీణ్యము కలిగియుండవలెను. లేనియెడల నిట్టిచిత్రములు విచిత్రములుగ నుండును. ఇంతమృదు వైనచర్మపురంగు నెటుల వేయగలుగుదు నని చింతపడెదవు. అంత యెందుకు? నేను చిత్రములను వ్రాసినయెడక చిత్రలేఖనవిషమై తెలియనివారు కొంతమంది వచ్చి యీరంగుల నీకాగితముపై నెటుల నంటించగలిగితి నని నన్ననేకతరుణములయందు ప్రశ్నించిరి. బాగుగ నభ్యాసము గలమానవునినోటనుండి యిట్టివాక్యములు వెలువడునా? ఇట్టియభ్యాసము గలవా రీదిగువ చెప్పినటుల నభ్యసించినయెడల త్వరగా మనుజులరూపములను నీరురంగులతో చిత్రించగలుగుదురు. మనస్సే మూలము.చిత్రలేఖనమునం దభిరుచి గలవారు అతిత్వరితముగ నేర్చుకొన గలిగెదరు. అందువలన విసుగుజెందక సంతోషముగ నభ్యసింపవలెను. కాని ఛాయనుగుఱించి బాగుగ తెలిసియుండవలెను. దీనికి కావలసిన పరికరములవిషయమై మొదట కొంచెము చెప్పుట మంచిది.
కావలెనో వాటి నెటుల యెంచుకొనుటయో యిదివఱకే చెప్పియుంటిని. అన్నిరంగుల ------------- వ్రాయజాలము. దీనికి కొన్నిరంగు లున్నవి. వీటిని రెండుతరగతులుగ భాగించవచ్చును. -------------- చినబట్టలకు వేయునవి. (2) చర్మమునకు వేయునవి.