చిత్రలేఖనము/BOOK II/నాల్గవ భాగము
పశువులు మేయుచున్నవి. నదియం దొకపడవ పోవుచున్నది. అందొకమనుజుడు కూర్చుండియున్నాడు. దూరమునందు పర్వతములు కానవచ్చుచున్నవి. ఆకాశమునందు సూర్యుడు తీవ్రముగప్రకాశించుచున్నాడు. కాని అచ్చటచ్చట మేఘములు కానవచ్చుచున్నవి. నదియందు చెట్లు, సూర్యుడు,మేఘములు ఇంక ననేక మైనవస్తువులు నీడలు ప్రతిఫలించుచున్నవి. ఇట్టిప్రదేశచిత్రములను వ్రాసి చూడుడు. మీ కెంతవఱ కభ్యాసము కలిగెనో మీకే తెలియును.
కాని ప్రారంభమునందు మన మిష్టము వచ్చినటుల వ్రాయకూడదు. సృష్టియం దుండువస్తువులను చూచి చిత్రించుట నభ్యసింపవలెను. ఇటులచేయుట కొకయుపాయము చెప్పెదను.
చిత్రలేఖనమునకు కావలసిన వస్తువులను, ఒకదర్పణమును నీతో నొకనిర్జనప్రదేశమునకు తీసికొనిపోయి, యొకచోట నాసీనుడవై కొంచెము ప్రక్క నొకవస్తువునకు నీయద్దమును చేరవేయుము. ఆ యద్దమునందు కొంతప్రదేశము కానవచ్చును. దానిని చూచి వ్రాయుట మీకు సులభముగ నుండును. అప్పుడు చిత్రించుట మీ కెంతయో యానందకరముగను, సులభముగను ఉండును.
వివిధము లైనరంగులను వేయకముందు మీరొకపనిని చేయవలసియున్నది. పెన్సిలుతో మీచిత్రములను వ్రాసినతరువాతను సిపియారంగుతో ప్రధానచ్ఛాయలను చిత్రించవలసియుండును. పిమ్మట సృష్టి ననుసరించి మీరు వివిధరంగులను చిత్రమునందు వేసి, అవియెండినతరువాతను వివరములను చిత్రించి పటమును పూర్తిచేయవచ్చును. ఇటులనే అన్నిచిత్రములను వ్రాయునది అభ్యాస మైనకొలదిని చిత్రమును చక్కగ వ్రాయగలుగుదురు. విద్య కంతము లేదని జ్ఞాపకముంచుకొనుడు.
నాల్గవ భాగము.
మానవుల ప్రతిరూపములను రంగులలో చిత్రించుట.
ఛాయాపటములను పెద్దవిగ పెన్సిలుతో వ్రాయువిధములను చెప్పితిని.ఇప్పుడు రంగులతో చిత్రించుమార్గములను వ్రాసెదను. ఈపనిని పూనుకొనుటకు నీకురంగులను పూయుటయందు చాలప్రావీణ్యము కలిగియుండవలెను. లేనియెడల నిట్టిచిత్రములు విచిత్రములుగ నుండును. ఇంతమృదు వైనచర్మపురంగు నెటుల వేయగలుగుదు నని చింతపడెదవు. అంత యెందుకు? నేను చిత్రములను వ్రాసినయెడక చిత్రలేఖనవిషమై తెలియనివారు కొంతమంది వచ్చి యీరంగుల నీకాగితముపై నెటుల నంటించగలిగితి నని నన్ననేకతరుణములయందు ప్రశ్నించిరి. బాగుగ నభ్యాసము గలమానవునినోటనుండి యిట్టివాక్యములు వెలువడునా? ఇట్టియభ్యాసము గలవా రీదిగువ చెప్పినటుల నభ్యసించినయెడల త్వరగా మనుజులరూపములను నీరురంగులతో చిత్రించగలుగుదురు. మనస్సే మూలము.చిత్రలేఖనమునం దభిరుచి గలవారు అతిత్వరితముగ నేర్చుకొన గలిగెదరు. అందువలన విసుగుజెందక సంతోషముగ నభ్యసింపవలెను. కాని ఛాయనుగుఱించి బాగుగ తెలిసియుండవలెను. దీనికి కావలసిన పరికరములవిషయమై మొదట కొంచెము చెప్పుట మంచిది.
కావలెనో వాటి నెటుల యెంచుకొనుటయో యిదివఱకే చెప్పియుంటిని. అన్నిరంగుల ------------- వ్రాయజాలము. దీనికి కొన్నిరంగు లున్నవి. వీటిని రెండుతరగతులుగ భాగించవచ్చును. -------------- చినబట్టలకు వేయునవి. (2) చర్మమునకు వేయునవి.
చర్మమునకు వేయురంగులు.
(1) తెలుపు. (Chinese White)
(2) ఇండియా పసుపు. (Indian Yellow)
(3) తేలికయైన ఎఱుపురంగు. (Light Red)
(4) చిందూర రంగు (Vermillion)
(5) ఇండియా ఎఱుపు (Indian Red)
(6) బ్రౌను మేడరురంగు.(Brown Madder)
(7) కోబాల్టు నీలి. (Cobalt Blue)
(8) బరంటు శయనారంగు. (Burnt Sienna)
(9) వేండిక్కు బ్రౌనురంగు. (Vandyke Brown)
వెనుకటిభాగమునకును, బట్టకును వేయురంగులు.(ఇదివఱకు చెప్పినవి విడిచిపెట్టబడినవి.)
(!) గెంభోజి పసుపు (Gamboge)
(2) గోపిచందనము రంగు. (Yellow Ochre)
(3) సిపియా (Sepia)
(4) క్రిమిజను వర్ణము. (Crimson Lake)
(5) కారుమైను ఎఱుపు. (Carmine)
(6) పరాసు నీలవర్ణము. (French Ultramine)
(7) గాజునీలి. (Smalt)
(8) ఇండిగో వర్ణము. (Indigo Tint)
(9) నీలివర్ణము (Prussian Blue)
ఈరంగులగుణములను చెప్పనవసరములేదు.కాని యేయేరంగు లెందుకు పనికివచ్చునోకొంచెము చెప్పెదను.
తెలుపు:- అంత యుపయోగకారి కాదు. కంటిగుడ్లకును, ఆభరణములకును లేసు (Lace) ను చిత్రించుటకును పనికివచ్చును. కాంతియందు మెరయునప్పుడు వస్తువులు తెల్లగ కనబడును. అట్టిసమయములం దిది సహాయపడును. ఏమైనా తప్పుగా చిత్రించినయెడల నీరంగును పూసి యిదివఱకు వేసినరంగులను కనబడకుండ చేయవచ్చును.
ఇండియా పసుపురంగు:- బట్టలకు వేయుటకు బహుచక్కగ నుండును. దీనిని తెలుపుతో కలిపినయెడల చక్కని సువర్ణవర్ణము లభించును. కొన్నిసమయములయందు చర్మమునకు వేయుటకుకూడ పనికివచ్చును.
గోపిచందనము రంగు:- కొన్నిసమయములయందు జుత్తునకును వెనుకటిభాగమునకును వేయుట కుపయోగ పడును.
బరంటుశయనారంగు:- బట్టలకును, పచ్చనిప్రదేశచిత్రముల వెనుకటిభాగమునకును పనికివచ్చును. ఇండిగో వర్ణముతో కలిపినయెడల నిది యాకుపచ్చనివెనుకభాగముల కత్యంతోపకారిగ నుండును.
వేండిక్కుబ్రౌనురంగు:- చిత్రకారులకు చాల సహాయకారిగ నుండును. కాని యీరంగును వేసి దానిపై మఱియొకరంగును పూసినయెడల నీరంగు చెదరిపోవును. దీనిని క్రిమిషనువర్ణముతో కలిపినయెడల నీడగలస్థలముల యందు వేయవచ్చును.
సిపియా:- నలుపు మట్టిరంగంత గాడమైనదికాదు. దీనిని అభ్యాసముచేయుటకు మిక్కిలి యుపయోగించెదరు. నీలిమందురంగుతో దీనిని కలిపినయెడల దూరమున నున్నవృక్షములకు నీడయం దున్నవెనుకభాగములకును, తెల్లని వస్త్రములమడుపులయందు వేయుటకు పనికివచ్చును. క్రిమిజనువర్ణముతో కలిపిన బ్రౌనుమేడగు రంగువలె కానవచ్చును. ఇండిగోరంగుతోను, క్రిమిజనురంగుతోను కలిపిన చక్కని నలుపురంగు లభించును.
బ్రౌనుమేడరు:- రంగును నీలితో కలిపినయెడల నీడను చిత్రించుట కుపయోగపడును.
క్రిమిజను(రక్త)వర్ణము:- వస్త్రములను చిత్రించుటకుపయోగపడును. ఇది గట్టిగా కాగితమునకు పట్టియుండదు.
కారుమైను ఎఱుపు:- చర్మమునకు పనికివచ్చును. గులాబిరంగు బట్టలకు, చర్మములకు వేయుటకు మిగుల యుపయోగపడును. ఇండియా ఎఱుపు ముఖమునందు ఛాయవేయుటకు పనికివచ్చును. నీలితో కిలిపికూడ దీనిని యుపయోగించవచ్చును.
చిందూర రంగును గులాబివర్ణముతో కలిపినయెడల సౌందర్య మైనచర్మపురంగుగ నుపయోగపడును.
కోబాల్టునీలి ననేకచోట్ల నుపయోగించెదరు. తెల్లని వస్తువులయందు ఛాయను చూపుటకు విస్తార ముపయోగించెదరు. ఇండియా ఎఱుపుతో కలిపినయెడల ముఖమునందు నీడను వేయుట కుపయోగపడును.
పరాసు నీలము బట్టలకు వేయుదురు. గాజునీలి కోబాల్టునీలినుండి చేయబడును. ఇది యూదామిశ్రితమైన నీలివలె కానవచ్చును.
ఇండిగోరంగు ఆకుపచ్చమిశ్రిత మైననీలివలె కానవచ్చును. ఇది వెనుకభాగమునందు (back ground) వేయుటకు పనికివచ్చును. సిపియా (Sepia) తో కలిపినయెడల దూరమున నున్నచెట్లకు వేయవచ్చును. ఇంక ననేక విషయములయం దివి పనికివచ్చును.
నీలిరంగును ఆకాశమునకును వస్త్రములకును వేయవచ్చును. క్రిమిజనువర్ణముతో దీనిని కలిపినయెడల చక్కని యూదారంగు వచ్చును.
మనకు యిప్పుడు కావలసిన రంగులవిషయమై యిచ్చట చెప్పితిని. ఇదివఱకు మీరు చేసినయభ్యాసమునందు తక్కినవాటితో మీకుపరిచయము కలిగియే యుండవచ్చును. అందువలన నే నిచ్చట చెప్పవలసిన యవసరము లేదు.
కుంచెలు:- చర్మపురంగును వేయుటకు కుంచెలు సాధారణపు పరిణామమును గలిగియుండవలెను. ఇవి సేబిలు రోమముతో చేయబడియుండవలెను. వాటికొనలు సూదిగనుండిననే చిత్రించుట కనుకూలముగ నుండును. చేతితో కొనను నొక్కి విడిచినయెడల దానిపూర్వపు ఆకారమును దాల్చుచుచుండుట మంచిది. కొన్నిసమయములయందు కొనలేనికుంచెలు పనికివచ్చును. ఇట్టిపనులయందు వాడుటకు సాధారణముగ ప్రాతకుంచెల నుపయోగించెదరు. చిత్రములను కుంచెలతో చిత్రించునపుడు ప్రక్క నొక్కదన్నుపై చేతిముడుకు నుంచవలెను. ఇటుల చేసినయెడల నొప్పి యుండదు. చేయి వణకదు. చిత్రలేఖకుడు తాను చేయుచున్నపని నంతను స్పష్టముగ చూడగలుగును.
తరగతులు:- సాధారణముగ ముఖమును చిత్రించుట మూడుతరగతులుగ భాగింపబడినది. చిత్రమును పెన్సిలుతో వ్రాసి మొదటిపర్యాయము రంగును వేయుట మొదటితరగతి. రెండవతరగతియందు ముఖమునకు గుండ్రము నిచ్చుఛాయను, బుగ్గలకు రంగును, వెండ్రుకలకును, బట్టలకును, ప్రధానరంగును, ఛాయను వేయవచ్చును. రెండుమూడుతరగతులకు మధ్య చర్మపురంగును కొంచెము మృదువు చేయవచ్చును. చిత్రలేఖకున కభ్యాసము బాగుగ కలుగువఱకు మనుజుని ఎదుట నుంచుకొనకయే రంగును వేయకూడదు. బట్టకు రంగును ఎప్పుడయినను వయవచ్చును. మూడవతరగతియందు చిత్రమును మృదువుచేసి, తప్పులను దిద్దుకొని పూర్తిచేయవలయును.
ఎవరిచిత్రమును నీవు వ్రాయుచున్నావో ఆవ్యక్తి నీవు చిత్రించునంతకాలము నీదగ్గర కూర్చుండియుండవలెను. ఛాయాపటములను పెద్దవిచేయుటయందు వ్యక్తి నీదగ్గరనుండ నక్కరలేదు. వానిప్రతిరూప ముండిన చాలును.
తరగతి యనగా వ్యక్తిని దగ్గర నుంచి చూచుచు వ్రాయుట యని నాయర్థము. అందువలన పైజెప్పిన ప్రకారము వ్యక్తిని ముమ్మాఱు దగ్గరనుంచుకొని పటమును చిత్రించి పూర్తిచేయవచ్చును. వస్త్రములను, వెనుకభాగమును తదితరసమయములయందు చిత్రించవచ్చును.
రూపముయొక్క ఉనికి. (Position)
ఎవనిచిత్రమునైతే మనము వ్రాయుదుమో వానిముఖమును అనేకవైపులనుండి చూడవలెను. ఏవైపుననుండి ఆముఖము సౌందర్యముగ కనబడునో అచ్చోటనుండి చూచుచు మనము ప్రతిరూపమును వ్రాయవలెను. ఎవని ముఖమునందలి వివిధభాగములు పెద్దవిగ కనబడునో యట్టివానిముఖమును పూర్ణముగ వ్రాసిననే బాగుగనుండును. కారణ మేమన: పూర్ణముఖమును వ్రాసినయెడల వదనమునందలి యంగవికారము చాలవఱకు కప్పుపడిపోవును. సాధారణముగ కొంచెము ప్రక్కకు తిరిగియున్నముఖమును చిత్రించెదరు. ఏలయన: యిట్టిచిత్రమునందు పూర్ణముఖమును, ప్రక్కకున్న ముఖమును ప్రదర్శింపవచ్చును.
33- 1లో చెప్పిన యాకారము నెంచుకొనుటకు మిగుల జాగరూకత వహింపవలయును. ఎడమవైపునకు త్రిప్పినటుల చిత్రించవచ్చును. కాని ఏవైపునకు త్రిప్పినటుల వ్రాసినయెడల సౌందర్యముగ నుండునో చూచుకొనవలెను. దీనికి నేను చెప్పుకారణ మిది. ప్రతివాని ముఖముయొక్క రెండువైపుల నొకేవిధముగ నుండవు. ఒకవైపు మఱియొకవైపుకంటె సౌందర్యముగ నుండును. ఈసౌందర్యపువైపునే మన మెంచుకొనవలెను.
ఒకముఖముయొక్క యాకారమును చూచిన చాలదు. తలయొక్క స్థలమునుకూడ చూడవలయును. తల వెండ్రుకలే ముఖమునకు సౌందర్యము నిచ్చును. అందువలననే మనము కాపింగులను, గేరాలను ఉంచెదము. స్త్రీలు కురులు నెంతో యానందముతో పెంచెదరు. వారు జడను వేయుదురు. జుట్టు ననేకవిధముల కట్టెదరు. ఐరోపా దేశపుస్త్రీలు జుట్టు ననేకతరగతుల వంగునటుల చేసెదరు. ఈశిరోజములు ముఖమునకు సౌందర్యము నిచ్చు ననియే కదా మనము వాని నింతయాదరించెదము. అందువలన తలయొక్కసమస్య చాలముఖ్యమైనది. తల యేస్థితియందుండిన బాగుగ నుండునో చిత్రలేఖకుడు చూడవలెను. ఇది వయస్సునుబట్టియు, జాతినిబట్టియు, ముఖవర్చస్సును బట్టియు ఉండును.
చేతులు యిట్టిచిత్రములకు చాలసౌందర్యమును కలుగజేయును. వ్యక్తిని చూచి వీటిని వ్రాయుట యవసరములేదు. చిత్రకారుని యిచ్ఛప్రకారము ఈహస్తంబులను సౌందర్యముగవ్రాసి చిత్రమునకు వన్నె తేవచ్చును. రేఫేలే (Raflaelle) చిత్రకారుని యుద్దేశము ప్రకారము రెండుచేతులను చూపుటయే మంచిది. చిత్రలేఖకుని బుద్ధికుశలతనుబట్టి వీనిని వ్రాయవచ్చును. రెండవచేయి యేమయినదని యితరులడుగుటకు సందీయరాదు. పెన్సిలుతో వ్రాయునపుడే పైవిషయముల నన్నిటిని గమనింపవలెను. సగమురంగులు వేసినతరువాత విచారించినయెడల లాభమేమి? చేతులు కాలినతరువాత నాకులను వెదకిన వ్యర్థమేకదా?
దుస్తులు:- దుస్తులు నాగరికతనుబట్టి ప్రతినిమిషమును మాఱుచుండును. కురుల నటుల జాగరూకతతో పోషించెదమో దుస్తుల నటులనే యతిజాగరూకతతో ధరించెదము మంచి విలువగల శుభ్రములైనబట్టలను వేసికొనుటకు సదా కోరుచుందుము. ఇట్టిసౌందర్యమును కలుగజేయు బట్టలవిషయమై మనము కొంచెము నేర్చుకొనవలసియున్నది. దుస్తులతీరు ప్రతినిమిషమునను మాఱుచుండును. ఇప్పుడు మనకు సౌందర్యముగ కనబడునవి యిరువది సంవత్సరములపిమ్మట వికారముగ కానవచ్చును. ఇంతకుముందు దుస్తులతీ రెట్లుండునో కొంచెము చూచిన మంచిది. వివిధకాలములయందు మనుజు లెట్టిబట్టలను ధరించియుండిరో వ్రాయవలసియుండును.
మనహిందూడేశము బాల్యదశయం దుండినప్పుడు మనుజులు అడవులలో నివసించి ఆకులను ధరించుచుండెడివారు. వా రనేకవిధముల నభివృద్ధిజెంది వస్త్రములను నేయుట కనిపెట్టిరి. ప్రథమమున కౌపీనములను ధరించి పిమ్మట వస్త్రము నొకదానిని కట్టి దేహము నొకబట్టతో కప్పుకొనుచుండిరి. పిమ్మట పట్టువస్త్రములను నేయ మొదలిడిరి. ఆహా! ఆకాలమునందు హిందూదేశ మెంతయభివృద్ధియం దుండెను? అన్నిదేశములకును, విలువగల వస్త్రముల నెగుమతి చేయుచుండెను. కాని వారు మనవలె కోటులను, షర్టులను, పంట్లాములను పరదేశములయందు నేయబడు బట్టలను ధరింపలేదు. వారుగాక మనమా దేశభక్తులము? గ్రీకులదండయాత్ర మనవస్త్రములయందు చాలమార్పును కలుగజేసెను. అప్పటినుండి మనవారు అంగరకాలను తొడుగ మొదలిడిరి. తురకల నిరంకుశపాలనమునందు హిందువులు చాలవఱకు పరిపాలకుల దుస్తులనే ధరించుచుండిరి. ఇక నిప్పటి సంగతిని చెప్ప నక్కఱయే లేదు. మనజాతీయదుస్తులను విడిచి పెట్టి దొరలమై పోవుచున్నాము. సిగరెట్టును, బ్రాందీని, ఉపయోగించుచున్నాము. కాని దొరలవలె మనము మాసనమునం దభివృద్ధి కాలేదే?
"హేటును, బూటును, నీటుగావేసిన తెల్లతో లెక్కడ తేగలడు"
అని యొకానొక కవి యిందువలననే చెప్పెను. ఇప్పు డీసంగతులు మన కెందుకు? ప్రస్తుతాంశమును చూడుడు.
ఇప్పటి దుస్తులను మనము ప్రేమించెదము. పూర్వకాలపువాటిని నిరసించుచున్నాము. అందువలన మనము రూపములను చిత్రించునప్పుడు యిప్పటిబట్టలను చిత్రించవలయును. ఎప్పటికిని మార్పుజెందనట్టిదుస్తుల నెంచి మనము వ్రాసినయెడల నన్నికాలములవారికిని సంతోషపుచ్చినవార మగుదుము. స్త్రీచిత్రమును వ్రాసినయెడల కోకను ధరించినటుల ప్రదర్శించిన బాగుగ నుండును. చిత్రలేఖకుని విమర్శనమున కీవిషయమును విడిచిపెట్టుటయే మంచిది. ఒకానొకప్పుడొకస్త్రీ సుప్రసిద్ధచిత్రకారుడగు రేనాల్డ్సు (Reynolds) వద్దకు వెళ్లి "నాప్రతిని చిత్రించు" మని యడిగెనట. అందుపైని యాతడు "దుస్తులపై యేయేరంగులను వేయవలె" నని యడుగగా నామె "ఏరంగులు ---------గలవి" అని ప్రశ్నించెను. "కారుమైను, ఉలమైను" అని చిత్రకారుడు ప్రత్యుత్తరమిచ్చెను. "అట్లయినయెడల నాదుస్తులను కారుమైనుతోను, నాభర్తయొక్కదుస్తులను ఉలమైనుతోను చిత్రింపుము." అని యామె కోరెను. పెద్దింటిస్త్రీలు మిగులప్రకాశమాన మైనరంగులబట్టలను ధరించుట కిష్టపడెదరని పైకథవలన మనకు తెలియుచున్నది. కాన వారివారి యిష్టములప్రకారము చిత్రకారుడు చిత్రించుటను నేర్చుకొనవలెను. ఛాయయొక్క నిర్మాణమును నేర్చుకొనుటకుగాను సర్ జోషువా రేనాల్డ్సు, వేనిక్కల (Sir Joshna Reynolds & Vandyck) చిత్రములను చూడుడు.
రేనాల్డ్సు, బాలురయొక్కయు, స్త్రీలయొక్కయు దుస్తులకు తెలుపును, ఎఱుపు మిశ్రిత మైననలుపును వేయుచుండెను. పురుషులబట్టలకు గాడమైనరంగుల నుపయోగించెను.
సాధారణముగ రేనాల్డ్సుకంటె వేండిక్కు గాడమైనరంగుల నుపయోగించుచుండెను. ఈచిత్రకారుడు ఎఱుపును, నీలిని, పసుపుపచ్చను, బరంటుశయనా (Burnt Sienna) ను, ఆకుపచ్చను, పర్పులు (Purple) ను ఉపయోగించెను. అప్పుడప్పుడు ఎఱుపుమిశ్రితమైన దట్టమైన నారింజరంగు నుపయోగించి నీలిని ఛాయయందు కొంచె ముపయోగించుచుండెను.
నీలివస్త్రములను స్త్రీలు ప్రేమించెదరు. కాని యీరంగును బాగుగ పూయుట ప్రథమమున కొంచెము కష్టమనిపించెను. రేనాల్డ్సు వెలుతురు పడుచోటులయం దిట్టిచిత్రములయందు ఎఱుపును పసుపును వేయవలె నని చెప్పెను. ఈవాక్యములను వ్యర్థపుచ్చుటకు గైన్సుబరో (Gainsborough) తనచిత్రమునం దిట్టిచోట్ల గాడమైన బరంటుశయనాను వేసెను. కొందఱు రేనాల్డ్సుగారి వాక్యములను పూర్ణముగ వ్యర్థపుచ్చిరనియు మఱికొందఱు అంత బాగుగ తమచిత్రముల వివిధముగ చిత్రించలేకపోయిరనియు చెప్పుచున్నారు.
ఇట్టిరంగులను వేండిక్కుగారు ఎట్లుపయోగించిరో కొంచెము చూతము. వస్త్రమునకు నీలిని పూసి దానిదగ్గర నున్నచర్మపుఛాయగ బరంటుశయనాను పూసి ఎఱుపు వెనుకభాగమును నిర్మించి చిత్రమునకు సౌందర్యము నిచ్చి కీర్తిగాంచెను.
దుస్తలయందలిఛాయను బాగుగ ప్రదర్శించుటకుగాను రెంబ్రంటు (Rembrant) గారు నలుపువస్త్రములను సాధారణముగ చిత్రించుచుండిరట. అందువలన గొప్ప చిత్రకారులచే చిత్రింపబడిన పటములను మనము సదా పరిశీలించుచుండవలెను. 34 - చూడుము.
వెలుతురు :- చిత్రకారులు --------రును వెళ్లకూడదు. ఇట్టిగదుల కొక ------- కిటికీయును ఉండవలెను. చిత్రించు -------- మూయబడి యుండవలెను. కిటికీద్వారా ------- చాలును. ఇటుల చేసినయెడలగాలియు ----- లోనికిరాజాలవు.
ఈగదికి ఉండుకిటికీ ఆఱుఅడుగుల ------లెను. అచటనుండి వచ్చువెలుతురు రెచ్చో------ మునందు చిత్రకారుడును, వ్యక్తియు కూర్చుండియుండవలెను. వ్యక్తియొక్కముఖముపై వెలుతురు -----యెడల ముక్కును బాగుగ చిత్రించనగును. ఛాయను దట్టముగ చిత్రించవలసి యుండును. అందు --------- నౌపుగ నుండిన నీఛాయయొక్క గాడత కొంతవఱకు తగ్గిపోయి చిత్రమునకు గ్రొత్తసౌందర్యము ------- చిత్రములయందిట్టివి మనము సాధారణముగ చూచుచుండుము. చిత్రకారుని ఎడమవైపునుండి -------- నటుల చూచుకొనవలెను. ఏలయన: కుడిచేతిఛాయ కాగితముపైపడదు. అందువలన చిత్రలే-------గలుగదు. చిత్రమును వ్రాయునపుడు దగ్గర నెవరు నుండకూడదు. స్త్రీయొక్క ప్రతిరూపమును వ్రాయునపుడు మాత్రము మఱియొక మనుజుడైనను స్త్రీయైన నుండినయెడల నపవా దేమియు రాదు.
చిత్రములను వ్రాయుట:- మొదట మంచిప్రతిరూపమును పెన్సిలుతో వ్రాయవలయును. ముందు చిత్రింపబోవుచిత్ర మంతటికిని యిది యాధార మైయుండును. అందువలన పెన్సిలుతో వ్రాయుచిత్రమునందు తప్పు లున్నయెడల కష్టమంతయు వృథా యైపోవునుకదా! కాన దీనిని శుభ్రముగ పెన్సిలుతో వ్రాయుటయం దెంతకష్టమైనను పడవలెను.
పెన్సిలుతో వ్రాయునప్పు డనేకచోట్ల రబ్బరుతో చెరుపవలసియుండును. అందువలన కాగితము చెడిపోవును. దానిపై రంగును వేసినయెడల చాల దట్టముగ నంటుకొనును. ప్రథమమున నొకకాగితముపై చిత్రమును వ్రాసి మఱియొకకాగితముపైకి దానిని దించవలసియుండును. ప్రస్తుతము చిత్రమును వ్రాయుటను చెప్పెదను.
తలయొక్కస్థితి నొకగీతవలన తెలియజేయవలెను. పూర్ణముఖ మున్నయెడల తిన్ననిగీతను కొంచెము ప్రక్కకు త్రిప్పియున్న ముఖమునకు కొంచెము వంకరగీతయు వ్రాయవలసియుండును.ఈగీతకు సమకోణముగ నొకగీతనువ్రాయవలెను. ఈరేఖ కండ్లమధ్యద్వారా వెళ్లవలెను. ఈవిధముననే మెల్లగ ముక్కునకును, నోటికిని, గడ్డమునకును గీతలను గీయవలెను. వీటిసహాయముద్వారా ముఖముయొక్క రూపమును 33 - 2లో చూపినప్రకారము వ్రాయవలెను.
పిమ్మట చిత్రములను చక్కజేసికొని రావలెను.
ఈచిత్రము ముఖమునకు సమానముగ నున్నదో లేదో చూడవలసియున్నది. దీనికిగాను నీచిత్రమును ఒక అద్దమునందు ప్రతిఫలింపజేయుము. ఏమైన తప్పున్నయెడల వెంటనే తెలిసిపోవును.
తరువాత నాచిత్రముమీద నొకపలుచని కాగితమును వేసి కదలిపోకుండ పెంసిలుతో కాగితముద్వారా కనబడుచున్నచిత్రము నాపలుచనికాగితముపై వ్రాయుము. ఈవిధముగ మీరుచిత్రమును మఱియొకకాగితముపై ------- గలుగుదురు. ఇది యిట్లుండ నొకదళసరికాగితముపై గోపివందనపురంగును దట్టముగపూసి అదియూరిన --------- చిత్రమును తీసి దీనిపై వేసి పెన్సిలుతో గట్టిగ దిద్దవలెను. ఇటుల చేసినయెడల నీచిత్ర మున్న -------- గోపిచందనపుగీతలతో మఱియొకప్రతిరూపము వచ్చును.
నీవు చిత్రమును వ్రాయదలచితివో ఆకాగితముపై జాగరూకతతో నీచిత్రము నుంచి దానిపై ------------ కాగితముపై నంటుకొనును. అప్పు డీకాగితమును జాగరూకతతో తీసివేయవలెను. --------------పెన్సిలుతో నారంగు ననుసరించి చిత్రమును వ్రాయవచ్చును. చేతిరుమాలతో నీరంగును తుడిచి ------------- ప్పుడు నీచిత్రము రంగులువేయుట కనుగుణముగ నుండును. గోపిచందనమురంగు పూసినకాగిత-----------చినయెడల మఱియొకపర్యాయమునకు పనికివచ్చును. కాని యీమార్పులయందు చిత్రముయొక్క-----------పాడుచేయరాదు. పైజెప్పినదంతయు డ్రాయింగు కాగితమును శుభ్రముగ నుంచుకొనుట------------ వలన నభ్యసించినవారు కాగితమును శుభ్రముగ నుంచుకొందురు గాక. గొప్పచిత్రకారు లీవిధము------------చున్నారు.
ప్రథమమున వ్రాయు చిత్రమును పెద్దదిగనుచిన్నదిగను చేయుటకు యిదివఱకే యుపాయములను చెప్పినప్రకారము చిత్రకారులు తమతమ యిష్టములప్రకారమును, స్థితిగతులనుబట్టియు, తమచిత్రములను కాగితము యందు వ్రాసుకొనవచ్చును.
రంగులు పూయుట:- ఒక గొప్పచిత్రకారుడు "మొదట వెలుతురు పడినచోట్లయందు తెలుపును,-----------పచ్చను, తుదిని గాడమైన ఎఱుపును ఛాయ ననుసరించి వేయవలెను. ఎచ్చట ఛాయ దట్టముగ -----------గ్రేవర్ణమును పూయవలెను" అని చెప్పెను. ముఖము బల్లపరుపుగా నుండదు. ఇట్లుండినయెడల చిత్రించుట చాలసులభ మైపోయియుండును. కాని యిది గుండ్రముగ నుండును. అందువలన మనము ఎత్తుపల్లములను చిత్రించి ప్రకృతి ననుసరింపవలసియుండును. ఈయెత్తుపల్లములను చూపుటయేమిగులకష్టము. ఆభేదములను మనము బోధపఱుచుకొనుటకు మీమేజాబల్లలపై తెల్లనిరాతిప్రతిమను సదా యుంచుకొనుట మంచిది. ఇది మనకు మిక్కిలి సహాయకారిగ నుండును.
విద్యార్థి యీదిగువచెప్పినవి మొదట బోధపఱుచుకొనవలసియుండును.
ప్రకృతియందు గలవస్తువులు ఛాయనుబట్టియు రంగునుబట్టియు విడివిడిగ మనకు కానబడును. ఈఛాయ లేనియెడల నన్నియు వివిధరంగులుగల ఒకేవస్తువుగ కనబడును.
వెలుతురునం దుండువస్తువులనీడయం దుండువస్తువులు కొంచెము నల్లగ కానబడును. ఛాయకూడ దట్టముగ నుండును.
దూరముగ నున్నవస్తువులకంటె దగ్గరగనున్నవస్తువులు బాగుగ కనబడును. వీటిరంగులుకూడ దట్టముగ నుండును. దూరము వృద్ధియైనకొలదిని రంగుయొక్క దట్టము తగ్గుచుండును. మధ్య నున్నవస్తువుల సాధారణముగ కానవచ్చును.
దట్టమైనఛాయ నలుపువలెనుండును. గులాబివర్ణపువస్తువుయొక్క ఛాయ ఎఱుపుగ నుండును. వీటియంచులు బూడిదవర్ణపురంగును గలిగియుండును. అంచులయం దుండుబాగములు కొంచెము నల్లగ కానవచ్చును. ఈయంశములను ముఖమును చిత్రించునపుడే అనుసరించవలెను.
రంగులను సిద్ధముచేయుట:- చర్మమును చిత్రించుటకు ఈదిగువ చెప్పినరంగులను విడికుడికలయందు పలుచుగ నరుగదీసి సిద్ధముగ నుంచవలెను.
(1) ఇండియాపసుపు. (2) తేలికయైన ఎఱుపు. (3) వెర్మిలియను. (4) గులాబిరంగు. (Pink Madder) (5) బ్రౌను మేడరు. (6) ఇండియా ఎఱుపు. (7) కోబాల్టునీలి. (8) సిపియా.
ఈపైని చెప్పినవి కాక చర్మమునకు వేయు ఎఱుపు, నీలి, పసుపులతో తయారు చేసికొనియు యుండవలయును. ఎవరియుద్దేశముప్రకారము వారు రంగులను తయారుచేసుకొనవచ్చును. దీని కేమియు నిబంధన లేదు.
కొందఱు పైచెప్పినరంగు నుపయోగింతురు. మఱికొందఱు ఈరంగులద్వారా యితరరంగులను తయారుచేయుదురు. అందుకుగాను కొన్నిశుభ్రమైన కుడకలను మంచిజలమును దగ్గఱ నెల్లపుడు నుంచుకొనుట మంచిది.
ప్రథమతరగతి :- రంగులను వేయుట మూడుతరగతులుగ భాగింపవచ్చునని యిదివఱకే చెప్పియుంటిని. చక్కనిముఖమును చిత్రించుట నీదిగువ చెప్పెదను.
ఇదివఱకు చెప్పినప్రకారము చిత్రమును వ్రాసి రబ్బరుతో నైనను, రొట్టెతో ననను పెన్సిలుతో గీతలు వేయవలెను. కాని కొంచెము గీతలు కనబడుచుండవలెను. ఇటుల చేసినయెడల యీగీత లేమియు------- తరువాత కానరావు. పిమ్మట కుంచెతో ముఖ్యమైనచోట్ల రంగులు వేయవలెను. ఇటుల ప్రథమ----------- యెడల పెన్సిలుగీతలయవసర ముండదు. సిపియాతో కనుబొమలను, కోబాల్టుతోను సిపియాతోను------------ వేండిక్కుబ్రౌనురంగుతో కంటిపాపను చిత్రించవలెను. బ్రౌనుమేడరురంగుతో నాసికయొక్క -----------చిత్రింపవలెను. చేతినికూడ యీరంగుతోనే చిత్రింపవలెను. బ్రౌనుమేడరురంగుతోను, గులాబిరంగుతోను----------- ధ్రములను నోటియొక్క మధ్యభాగమును చూపవలెను.
పిమ్మట చర్మపురంగును ముఖమునకు వేసి తేలి యైనఎఱుపురంగును కోబాల్టును కలిపి ----------నాసికక్రిందను గడ్డమునకును చెవికిని యివ్వవలెను. కోబాల్టుతో క్రిందిపెదవిదిగువనను చిత్రించవలెను. తరువాత పెదవులకు చిందూరరంగును, గులాబిరంగును పూయవలెను. పిమ్మట జుట్టునకు రంగువేయవలయును. తెల్లనిబట్టదగ్గర నున్నచర్మమును కోబాల్టుతోను, సిపియాతోను చిత్రింపవలెను.
ఇంతటితో మొదట రంగులను వేయుట పూర్తియయ్యెను. వీటియం దేమైన తప్పు లున్నయెడల యింక ముందు రంగులు వేయుట వృథాయగును. అందువలన జాగరూకతతో బాగుగ నున్నదో లేదోగమనించి తృప్తిపొందవలెను.
తరువాత తేలిక యైనఎఱుపురంగును మీదినుండి క్రిందికి కండ్లుతప్ప తక్కినముఖ మంతటికిని పూయవలెను. పురుషులముఖమునకు ఇండియాఎఱుపుతోను కూడ చిత్రించవలసియుండును. మొదటిరంగు బాగుగా ఆరినతరువాతనే యీరంగు వేయవలెను.లేనియెడల చిత్ర మంతయు చెడిపోవును.
రెండవతరగతి:- తేలిక యైనఎఱుపుతో నొసటిమీదిఛాయను చిత్రింపవలెను. పిమ్మట కంటివద్దను, తేలికయైనఎఱుపురంగును కోబాల్టును కలిపి రంగునువేసి ఛాయయొక్క అంచును కోబాల్టుతో దిద్దవలెను. కంటియొక్క మీదిఅంచును తేలిక యైనఎఱుపురంగుతో చిత్రింపవలెను.
అన్నిఛాయలయొక్క యంచు గ్రేవర్ణముగ నుండు నని మాత్రము జ్ఞాపకముంచుకొనవలెను. దీనికి నిదర్శనమును చెప్పెదను.ఒకతెల్లనికాగితముపై నొకతెల్లనిపెన్సిలు నుంచినయెడల దానిచాయ దట్టముగ నుండును. ఈ ఛాయయొక్క అంచున గ్రేవర్ణపుగీతను చూడనగును. ఈగీత పగటిపూట బాగుగ కనబడును. దీపమువెలుతురునం దంతచక్కగ చూడలేము.
పిమ్మట బుగ్గలకు వెర్మిలియనును, గులాబిరంగును జాగ్రత్తగ నద్దవలెను. కంటికిని బుగ్గలకును మధ్య నుండు ఎత్తైనస్థలమును బాగుగ చూపవలెను. ఈరంగును కణతలవఱకును వేయవలసియుండును. పిమ్మట నొసటిని ముక్కు---------నీలిరంగును వేసి ఛాయను ప్రదర్శింపవలెను.
----------కోబాల్టును, ఆకుపచ్చను కలిపి కంటిదగ్గఱ రంగును వేయవలెను. క్రిందిదవడపై నీలితో నెత్తుపల్ల-----------పుడు. పిమ్మట నీలిరంగుతోనే కణతలకు రంగును అద్దుడు. కాని యీరంగుల నన్నిటిని వేయునపుడు-----------మఱచిపోరాదు. ఈరంగులను వేయుచు తెల్లగ కనబడు భాగములను విడిచిపెట్టి వాటి కనుగుణ-----------గీయవలెను.
----------భాగమును చిత్రించుట కిదియే సమయము. ఏలయన: దీనిరంగునుబట్టి ముఖమునకు వేసినరంగు---------మాఱుచుండును. ఇదివఱకు వెనుకభాగము తెల్లగ నుండెను. అందువలన ముఖముయొక్క రంగు---------బడుచుండెను. ఇప్పు డన్ననో వెనుకభాగము నలుపుగనో, ఎఱుపుగనో, నీలిగనో, గ్రేవర్ణముగనో---------యుండును. ఈదట్టమైన రంగులదగ్గఱ ముఖముయొక్క రంగులదట్టమంతయు మాయ మైపోవును.
---------లనుగూర్చి తరువాతను నేర్చుకొనవచ్చును కాని యిప్పుడు కొంచెము కావలెను.ముఖ్యముగా నీవిషయ---------శయనారంగుమిశ్రిత మైననీలిరంగును వేండిక్కుబ్రౌనుమిశ్రిత మైననీలిరంగును ఉపయోగించెదరు. ---------పలుచని రంగును వేసి దట్టము చేయవచ్చును. ఈభాగమును సమముగా వేయ నక్కఱలేదు.--------టుగనే చిత్రింపవలెను. ముఖమున కేవైపున ఛాయ దట్టముగ నుండునో ఆవైపున పలుచగను,--------పున దట్టముగను రంగును వేయవలెను.
----------మారు ముఖమును చిత్రించుటకు పూనుకొందుము. గడ్డమునకు పసుపును, తేలిక యైనఎఱుపురంగు-----------ఈరంగుతోనే కొంచెము కంటిదగ్గఱను వేయుట మంచిది. గ్రేరంగుతో కంటిగ్రుడ్లకు వేసి-----------వలెను. పిమ్మట పెదవులకు వెర్మిలియనును, గులాబిరంగును వేసి అచ్చట నిదివఱ కున్నరంగును దట్టము చేయవలెను. ముఖ్యముగ నిప్పుడు మొదట వేసిన రంగులను శుభ్రపఱుచుటయే ప్రధానమైనపని. ఈవిధముగ చర్మపురంగు నభివృద్ధిపఱిచి జుట్టును చిత్రించుటకు పూనుకొనవలెను. ఇదివఱకు వేసినరంగులను సిపియాతోను, న్యూట్రలు టింటు (Neutral Tint) తోను అభివృద్ధిపఱిచి వెండ్రుకలను ప్రదర్శింపవలెను.
వెండ్రుకల సమూహమును వాటిమెఱపును చక్కగ చిత్రించవలసియుండును. కనుక విద్యార్థి యీవిషయమై మిక్కిలి శ్రద్ధ వహించియుండుట మంచిది. మొదట బరంటుశయనారంగు గలవెండ్రుకలను చిత్రించువిషయమై చెప్పెదను. దీనికి వేండిక్కుబ్రౌనురంగును, సిపియాను కలుపవలెను. వేయునప్పుడు విస్తారము గీతలుగాను లేక యేకముగాను వేయగూడదు. కొంచెము కొంచెము గీతలుగా నుండవలెను. కొంచెము మెఱయునప్పుడు చిన్నగీతలు మాత్రము కానవచ్చును. మెఱయుచోటునందు పలుచని నీలిరంగును వేయవలెను. దానిమీదను చర్మపురంగును వేసి సిపియాతోను వేండిక్కు బ్రౌనురంగుతోను వెండ్రుకలను చిత్రింపవలెను. నల్లని వెండ్రుకలకు మొదట సిపియాను, నీలినివేసి ఇండిగోరంగును, క్రిమిజనులేకును, సిపియాను కలిపి నలుపు రంగును తయారుచేసి ఛాయ యున్న చోటులయందు వేసికొనిరావలెను. నలుపువెండ్రుకలు మెఱయుచోటునందు నీలిని వేయుడు.
మఱియొకవిధముగ జుట్టును చిత్రించవచ్చును. ప్రథమమున సిపియాను వేసి వేండిక్కుబ్రౌనురంగును సిపియాను కలిపి ఛాయ నివ్వవలెను. తరువాత గోపిచందనపురంగును, ఇండియాపసుపును, తేలికయైనఎఱుపును వేయవచ్చును. ఇట్టివెండ్రుకలు మెఱయుచోట పసుపును వేసి ఛాయను గ్రేవర్ణముతో నివ్వవలెను. ఈవిషయము నిటుల నుంచివేసి మెడను, చేతులను చిత్రించుట మంచిది.
చర్మమునకును, వెండ్రుకలకును మధ్యనుండు స్థలమునకు గ్రేవర్ణమును వేయవలెను. ఈరెంటికిని విస్తారము భేదమును కనబఱుపకూడదు. జుట్టుయొక్క అంచులకును యీరంగునే వేయవలెను. లేనియెడల ప్రతిమవలె నుండును కాని, జీవకళను కలిగియుండదు.
ప్రథమమున చర్మపురంగు వేసి వెలుతురు గలచోటున నీలిని, ఛాయయందు తేలికయైన ఎఱుపురంగును, నీలిని కలిపివేయవలెను. ఈవిధముగనే చేతులకును, ఇతరస్థలములకును రంగులను వేయవలెను. వేళ్లకు భేదమును చూపుటకు మధ్యను వేండిక్కుబ్రౌనురంగును, గులాబిరంగును వేయుట మంచిది. వ్రేళ్లకీరంగులు సౌందర్యము నిచ్చును. వ్రేళ్లకొనలును, వ్రేళ్లకణుపులును, అఱచేతులును ఇతరస్థలములకంటె కొంచెము గులాబిరంగుగ నుండును. అందువలన నీస్థలములకు గులాబిరంగును, వెర్మిలియను రంగును వేయవలెను.
పిమ్మట బట్టలకు ఏకముగ నొకేరంగును వేయవలెను. ఛాయ నిప్పు డిచ్చుట యవసరములేదు.
మూడవతరగతి:- ఇప్పుడు కాగిత మంతయు రంగులతో నిండియున్నది. చిత్రములయొక్క రూపు కొంతవఱకు తేలెను. కాని యింతటితో సరిపోలేదు. ముఖముగుండ్రముగ కనబడుటకు ఇంకను రంగులను వేయవలెను. ఛాయను కనపఱుపవలెను. పూర్తిచేయుటయే మిగిలియున్నది.
నీచిత్రమును కొంచెము దూరమునుండి చూడుము. ఎచ్చటెచ్చట రంగులను వేయవలయునో నీకే తెలియును. మీదినుండి (అనగా: కంటివద్దనుండి) రంగును వేసికొని రావలెను. కంటిమీదిరంగు విస్తారము ఊదాగ నున్నయెడల ఆకుపచ్చరంగుతో దిద్దుకొనుము. దిద్దుటలో విస్తారము ఆకుపచ్చగ నైపోయినయెడల చర్మపురంగును దానిపై వేయుము. కంటిపాపయందు వేయబడిన నీలియొక్క గాడత్వమును సిపియాతోను, కోబాల్టుతోను తగ్గించవచ్చును. తెల్లనిభాగములయందు విస్తారము నీలి యున్నయెడల, తెల్లనిరంగును వేసినయెడల మంచిది. కంటియందు ఆకుపచ్చరంగును వేసియుండిన చర్మపురంగుతో సవరింపవచ్చును. పిమ్మట కనుబొమ్మలను సిపియాతో దిద్ది నలుపు నచ్చటచ్చటవేసి వాటికి సౌందర్యమును కూర్చగలము. కంటినలువైపులు వేండిక్కురంగును వేసి దిద్దుకొన నగును. ప్రతిభాగమును గుండ్రముగ చేయవలెను. ఈరూపము నిచ్చునది ఛాయ యని మీ కిదివఱకే తెలియును. అందువలన ఛాయను తప్పులు లేకుండ చక్కగ చిత్రించుటయందు జాగరూకత వహించి యుండవలెను. ప్రతిఛాయకు గ్రేవర్ణపుఅంచు ఉండు నని మాత్రము మఱచిపోకూడదు. చాలవిస్తారము ఆకుపచ్చగ నుండిన ఊదాతోను, ఊదాగా నుండిన నాకుపచ్చతోను, నీలిగ నుండిన నారింజరంగుతోను దిద్దుకొనవలెను. చర్మపురంగు ఆకుపచ్చగ నుండిన నెఱుపుతో సవరించవలెను. గుండ్రముగ నున్నస్థలములయందు బూడిదవర్ణము పూయవలెను. నోటియొక్క యిరువైపులను ఛాయరంగును వేసి అంచులను నీలితో చిత్రించవలెను. గడ్డముయొక్క క్రిందిభాగమునం దుండు దట్ట మైనఛాయ నీలిమిశ్రిత మైనసిపియారంగుగ నుండును. నొసటిమీదిఛాయయొక్క అంచు ఆకుపచ్చగ నుండును. చెవియం దుండుఛాయ మిక్కిలి దట్టముగ నుండును. కనుక ఎఱుపుకూడ కొంచెము వేయవలసి యుండును. చిత్రించుట పూర్తియాయెను. ఇంకను ఏయంశముల ననుసరించి పైచెప్పిన దంతయు చెప్పబడెనో విద్యార్థి తెలుసుకొనుట మంచిది.
తెలుపు, పసుపు, పచ్చ, పలుచని ఎఱుపురంగులు ఛాయయందు కొంచె మెఱుపుగ కనబడును. నీలి చాలవఱ కుపయోగించితిమి. చర్మపురంగుపై నీలిని వేసినయెడల బూడిదవర్ణముగ మాఱి చిత్రమునకు సౌందర్యమును గలుగజేయును. పై చెప్పినచర్మపురంగు లన్నియు ప్రథమరంగుల (ఎఱుపు, నీలి, పసు పచ్చ) ననుసరించియే యున్నవి. సదుపాయముకొఱకు ఎఱుపునకు బదులుగా తేలిక యైన ఎఱుపురంగును, గులాబిరంగును, చిందూరపురంగును నుపయోగించితిమి. కాని ప్రథమరంగులుమాత్రము చాలును. ఈమూడురంగులతోనే చిత్రించుట కష్టమైనపని. అభ్యాస ముండిననే కాని యిటుల చేయజాలరు. అనేకరంగులు మనకు లభించుసమయమున నీమూడురంగులతోనే కాలము గడుపుట ఎందుకు?
వాటుమేన్సు డ్రాయింగు కాగితము (Whatman's Drawing Paper) మీదను వ్రాయుట యత్యానందముగ నుండును; కాని యీకాగితమును నున్నగచేయుట కుపాయ మాలోచింపవలసియున్నది.
నీచిత్రము నొక నున్ననిఫలకముపై నిదివరకు పైచెప్పినప్రకార మంటించి దానిపై నున్నని పలుచని కాగితమును (Tissue Paper) బిగువుగా తగుల్పవలెను. పిమ్మట నొకతాళముచెవితో నైనను, నున్నని యుంగరముతో నైనను, జాగరూకతతో నణచి వ్రాయవలయును. కాగితము చినిగిపోకుండ, గీతలు పడకుండ చూచుకొనవలెను. ఇటుల కొంతకాలము చేసినయెడల చిత్రము నున్నగ నైపోవును. ఇటుల నెంతచేసిన నంత నున్న నౌను.
వెలుతురుపడు చోటులను మొదట రంగువేసినప్పుడు విడిచివేయుటకంటె, రంగు పూర్తియైన పిమ్మట తీసివేయుట మంచిది. ఆస్థలమును నీటితో గుఱుతుపెట్టుకొనవలెను. శుభ్రమైనయొకకుంచెను శుభ్రమైననీటిలో ముంచి ఆస్థలము నలువైపుల నీటిగీతను గీయవచ్చును. తరువాత తడిగుడ్డతో నైనను, చిన్నరొట్టెముక్కతో నైనను మెల్లగ తుడువవలెను. ఇట్టిరొట్టెయందు రంగేమియు నుండరాదు. దీనిని తడిగుడ్డతో కప్పియుంచుట మంచిది. ఇట్టిదానితో ఆరేడు నిమిషములు చెరిపిన చాలును.
కంటిపాప మెరయుచుండును. అచ్చోట తెల్లగ కానవచ్చును. అందువలన నీస్థలమునందు తెలుపురంగును వేయవలెను. దట్టముగ తెలుపురంగు నరుగదీసి, సన్ననికుంచెతో నీరంగును తీసి జాగరూకతతో వేయవలెను. కండ్లు ముఖ్యము. అందువలన నీవిషయమై మిగుల శ్రద్ధను పుచ్చుకొనవలెను.
వెనుకభాగమునకు మెరుగు నివ్వవలె నన్న బంకను దీనిపై పూయవచ్చును. ఒకభాగము మంచిబంకను, ఏడు భాగముల పరిశుభ్రమైన నీటియందు కలిపి వేయవలెను. ఎంతకొంచెము బంక నుపయోగించిన నంతమంచిది. చిత్రము పూర్తియైనవరకు నీపనికి పూనుకొనరాదు.
పైచెప్పినవన్నియు సౌందర్య మైనముఖమును గూర్చియే. కొందఱిముఖములు ఆకుపచ్చగను, మఱికొందఱివి ఊదాగను ఉండును. కొందఱిముఖములను ఎఱుపుతో విస్తారము చిత్రింపవలసియుండును. విస్తారము నల్లగనుండు ముఖములయందు న్యూట్రల్‌టింటును, నీలిని, వేండిక్కుబ్రౌనును, బరంటుశయనాను వేయవలసియుండును.
తెలుపురంగు, లేసును, ముత్యములను, బంగారపువస్తువును చిత్రించుటకు పనికివచ్చును. ఏమైనతప్పులను దిద్దుకొనుట కీరంగు మిగుల నుపయోగపడును. కాని కొంచెమే యుపయోగింతురు. ఇదివరకు వేసినరంగు లేమైన కనబడకుండునటుల చేయవలయు నన్న నారంగులపై దీనిని దట్టముగ వేసిన చాలును.
కన్ను:- పెదవులును, కన్నులును, భావమును తెలియజేయును. మనుజుల నాకర్షించును. ముఖమున కివియే సౌందర్యము నొడగూర్చును. పెదవులకంటె కన్నులెక్కువముఖ్యమని నా యుద్దేశము. ఇట్టియవయవముల విషయమై కొంచెము నేర్చుకొనుట మంచిది. వీటిరూపు వయస్సునుబట్టి మారుచుండును. బాలురకండ్లు గుండ్రముగ నుండును. వయస్సు ఎక్కువైనకొలది గుండ్రము తగ్గుచుండును. మగవారికండ్లు జ్ఞానముతో నిండియుండును. కొంచెము మోటుగ నుండును. స్త్రీల వన్ననో, మృదువుగను, ప్రకాశముగ నుండి యొకవిధ మైనకరుణరసమును ప్రదర్శించుచుండును. విచారముగను, సంతోషముగను నుండుసమయమునం దీకన్నులదృష్టులు వివిధాకృతులను దాల్చుచుండును. వీటిద్వారా నిట్టిభావమును చూపుట మిక్కిలికష్టము. ఇట్టిసమయములయందు పురుషులకండ్లను కొంతవఱకు చిత్రింపవచ్చును. కాని స్త్రీలకండ్లను వ్రాయుట కష్టము. కొంచెము కొంచెము కదలిపోయిన యెడల భావమంతయు నశించును. అందువలన ప్రారంభమునందు విద్యార్థులు మిగులజాగ్రత్తగ నుందురుగాక!
స్త్రీలకండ్లయందు ప్రకాశమును కనుబఱుపవలెను. అందువలన ఛాయను, వివరములను చూపవలసియుండును. ఇది అన్నిటికంటెను కష్టము. కండ్లను చిత్రించునపుడు కొన్నిగీతలను విడిచివేయవచ్చును. భావమున కనుగుణముగ నుండుగీతలను మాత్రము విడిచిపెట్టుటకు వీలుండదు. ఇటులచేసినయెడల చిత్రమంతయు నశించును.
నొసటిమీద వెలుతురు పడుచున్నటులైన కొన్నిసమయములయందు నయనములు ఛాయచే కప్పబడి యుండును. ఇట్టిసమయమునందు వీటిని చిత్రించుట కొంచెము సులభమే. రోగులయొక్కయు, వృద్ధుల యొక్కయు, కండ్లు కొంచెము లోతుగ నుండును. అందువలన నీకండ్లపై ఛాయ దట్టముగ నుండును కాన వీటినిగూడ చిత్రించుట అంతకష్టము కాదు. కాని వృద్ధులకండ్లయందు వార్ధక్యమును, రోగులకండ్లయందు రోగమును చూపవలసి యుండును.
అన్నిస్థలములకంటె కండ్లవద్ద విస్తారము ఛాయయుండును. కాని యిది అన్నిఛాయలతోను కలసియుండి ముఖముయొక్క రూపమును పాడుచేయదు.
నల్లనిముఖముయొక్క కనుబొమలు సాధారణముగ నల్లగనుండును. కాని వీటిని అంతనల్లగ ప్రదర్శింప వీలుండదు. వీటిఅంచులు దట్టముగ నుండక గ్రేవర్ణముగ నుండును. మధ్యను మాత్రము నలుపును వేయవలెను. ఈవిషయమై నలుపును, లేక నలుపును, ఎఱుపును పసుపుపచ్చను ఉపయోగించెదరు. ముసలివారి కనుబొమలు మిగుల ఎత్తుగ నుండును. కొన్నిసమయములయందు పండిపోవును. రాలిపోవును. మఱికొన్ని సమయములందు విస్తారము దట్టముగ పెరుగును. ఇతరసమయములం దచ్చటఛ్ఛటమాత్రము రాలిపోవును. కనురెప్పవెండ్రుకలవిషయమై యేమియు చెప్పుటకు వీలులేదు. ఇవి వంకరగనుండును. క్రొత్తవారు వీటిని విస్తారము దట్టముగ చిత్రించెదరు. ఈ అభ్యాసమునుండి తప్పించుకొనవలెను.
కంటిలోపలిమూలయందు ఎఱ్ఱనిమాంసపుకండ కానవచ్చుచుండును. దీనిని చిత్రించుట కెంతయైనజాగ్రత్త కావలసియుండును. కంటిక్రింద నున్నచర్మము మిగుల పలుచగనుండును. ఛాయచే కప్పబడి యుండును. దీనికి గ్రేవర్ణమును ఊదాను వేసెదరు. ముసలికాలమునం దీరంగులు ఆకుపచ్చగ మాఱుచుండును.
నోరు:- కన్నులవలెనే వయసునుబట్టి దీనియాకారము మాఱుచుండును. బాల్యమునం దిది గుండ్రముగగను, పుష్టిగను ఉండును. బాలురు స్తనములనుండి పాలనుపీల్చుటకు కీయాకారము మిగుల ననుగుణముగ నుండును. ఈవయస్సునందు నోరు భావమును ప్రదర్శింపదు. వీరు కండ్లతోనే సాధారణముగ నవ్వుచుందురు.
పండ్లు పుట్టినప్పటినుండి దీనిరూపు మాఱిపోవును. అచ్చటనుండి కండ్లతో గలసి యిది భావమును ప్రదర్శింపు చుండును. వార్ధక్యమునం దీపండ్లు రాలిపోవును. కాన పెదవులు లోపలికి క్రుంగిపోవును. అచ్చటనుండి నోటిరూపును, భావమును చెడిపోవును.
బాలురయొక్కయు, యుక్తవయస్కులయొక్కయు, నోళ్లు మిగుల పుష్టిగను, రక్తవర్ణముగ నుండును. సిగరెట్లను పీల్చిన నివి నల్లగ మాఱిపోవును. రెండు పెదవులకును మధ్య నుండుఛాయను, పెదవులకొనలయం దుండుఛాయను భావమును మిగుల శ్రద్ధతో ప్రదర్శించుట యవసరము.
కండ్లును, పెదవులును, భావమును వ్యక్తపఱుచును. కనుక కండ్లయం దెట్టిభావ ముండునో నోటియందు నట్టిభావమునే కనపఱుపవలెను.
ముక్కు:- కండ్లమధ్య నుండుస్థలమువద్ద ప్రారంభించును. ఇచ్చట లోతుగ నుండి కొనయందు మిగుల నెత్తుగ నుండును.ముక్కు మిగుల మెఱయుచుండును. ఈమెఱపు కొనయందు విస్తారము. నాసికారంధ్రముల యందు ఛాయ అతిదట్టముగ. దీనికిగాను నలుపును, వేండిక్కుబ్రౌనును, బరంటుశయనాను, నీలిని ఉపయోగించెదరు.
ముక్కుకూడ కొంతవరకు ముఖముయొక్క భావమును కనబఱుచును. కొన్నిసమయములయందు నాసికారంధ్రములు గుండ్రమైన యాకారమును దాల్చుచుండును. సంతోషసమయమునందు మిగులవెడల్పుగా నుండును.
నాసికవలన ఛాయ విస్తారముగ ముఖమునందు కానవచ్చును. ఈఛాయవలన ముక్కు యెత్తుగ నున్నటుల ప్రదర్శింపవలెను. ఈఛాయవలననే దీని కొకయాకారమును చిత్రమునం దియ్యవలెను.
చెవి:- దీనిని చిత్రించుటయందు సుప్రసిద్ధచిత్రకారులు శ్రద్ధవహించలేదు. వారి నడిగినయెడల "దీనికి భావము లేదు. అన్నియు ఒకేవిధముగ నుండును. దీని నెటుల చిత్రించినను రూపున కేమియు మార్పును గలుగజేయదు, అని చెప్పుచు వచ్చిరి. దీనికిభావము లేకపోవుట నిజమే. కాని అన్నిచెవులు ఒకేవిధముగ నుండు ననిననే నొప్పుకొనను. ఏవైపున వెలుతురు పడునో ఆవైపున నున్నచెవిని మిగుల జాగరూకతతో చిత్రించవలెను. సాధారణముగ నివి తలవెండ్రుకలచే కప్పబడి యుండును.
చెవియం ననేకము లెత్తుపల్లము లున్నవి. దీనిచర్మము మెఱయుచుండును. అందువలన నిందు ఛాయను చిత్రించుట కొంచెము కష్టము కాని మొత్తముమీద నిది అంతముఖ్యమైనది కాదు.
బాలురచెవులు గుండ్రముగ నుండును. వయస్సు ముదిరినకొలది నివి కోలనై పోవును.
జుట్టు:- ముఖమువలెనే యీజుట్టి సర్వదా యెకేరూపును దాల్చి యుండదు. వారివారి యిష్టములప్రకారము పురుషులు కాని స్త్రీలుకాని దీనిని దువ్వెదరు. ముఖముయొక్క ఛాయనుబట్టి దీనిఛాయ మారుచుండును. మెరయుచోటునం దనేకరంగులను వేసెదరు. దీనివిషయమై యిదివరకే చెప్పితిని.
పాపటను జాగ్రత్తగ చర్మపురంగుతోను, జుట్టునకు వేయురంగుతోను చిత్రించవలసి యుండును.
మెడ, భుజములు:- భుజములయొక్కయు మెడయొక్కయు రంగులు ముఖముమీద నుండునంతదట్టముగ నుండవు. సుందరాకారులయొక్క మెడయు భుజమును ముఖముయొక్క రంగులను చెందియుండును. ఇట్టిసమయములయందు ముఖములకు వేసినరంగులనే వేసి కొంచెము కళను తగ్గించవలెను. లేనియెడల ముఖముయొక్క ప్రాముఖ్యము తప్పిపోవును.
దురభ్యాసములు గలవారియొక్కయు, రోగులయొక్కయు మెడమీది దుమ్ములు స్పష్టముగ కనపడును. ఇవి ముఖముయొక్క సౌందర్యమును పోగొట్టును. అంగములకు వికృతాకారమును కలుగజేయును. అందువలన చిత్రకారుడు వీటిప్రాముఖ్యమును తగ్గించి పటముయొక్క సౌందర్యమును నులుపునుగాక!
మెడమీదిఛాయ దట్టముగ నుండును. దీనికి గ్రేవర్ణమును, ఎఱుపును ఉపయోగించెదరు.
భుజములను, మెడను, ఱొమ్మును, చిత్రించునప్పుడు ఛాయద్వారా స్నాయువులను ప్రదర్శించి అంగములకు గుండ్రతనము నివ్వవలెను.
చేతులు:- చేతులను సాధారణముగ చర్మపురంగుతో చిత్రించి గ్రేవర్ణముతో ఛాయ నిత్తురు. ఏచిత్రమునైన చూచి చిత్రించుటకు మంచిచిత్రము లేమియు లేవు. గొప్పచిత్రకారు లందఱు చేతులను, చిత్రించుటయం దంతశ్రద్ధను వహింపలేదు. చెవులవలెనే వీటికిని అశ్రద్ధతో విడిచివేసిరి. అందువలన మన కేమియు ఆధారములు లేవు.
దీనికి కారణ మిది. ముఖ ముండినచోటున నివి సందర్భానుసారముగ నుండును. అందువలన వీటిని చిత్రించెదరు. మనకు కావలసినది ముఖమే. ఇ వంతముఖ్య మైనవి కావు. అందువలన వీటి నెవరును చక్కగ ప్రదర్శింప లేదు. ఆకారమును మాత్రము చూపినారు.
స్త్రీలచేతులు పురుషులచేతులకంటె సౌందర్యముగ నుండును. పురుషునకు వలలో త్రోయువాటిలో ఇవి కూడ ముఖ్య మైనవి. అందువలననే పలుచోట్ల మనపూర్వపుకవులు వీటిని మోహనాస్త్రములుగ వర్ణించిరి. వేండిక్కును (Vandyck) లారెన్సును (Lawrence) మాత్రము వీటిని బాగుగ చిత్రించిరి.
ఇంకొకసంగతిని గమనించవలసియున్నది. కుడిచేతితో స్త్రీలు సదా పని చేయుచుందురు. అందువలన నీచేయి కొంచెము మోటుచేరి యుండును. అందువలననే ఎడమచేతి సౌందర్యము హెచ్చు.
దుస్తులు:- వస్త్రములనుకూడ జుట్టువలెనే చిత్రించవలెను. మొదటప్రధాన మైనముడుతలను తేలికైన రంగుతో చిత్రించుట మంచిది. ఇవి సమముగా నున్న వని నీకు తోచినపుడు గాడముగ రంగులను వేసి ముడుతలను, ఛాయను, వెలుతురును చూపుట మంచిది.
బట్టలను ఉన్నితోను, పట్టుతోను, నారతోను, దూదితోను నేయుదురు. చూచినవెంటనే దేనితో చేయబడినదో పోల్చివేయుదురు. ఈభేదములను చిత్రములందు చూపవలసియుండును. వీటిముడుతలనుబట్టి సాధారణముగ మనము వీటిని పోల్చెదము. తరువాతను, ఛాయను, వెలుతురును, మెఱుపును, మనము విమర్శింపవలెను. ఈ యంశముల విషయమై కొంచెము జాగ్రత్తగ నుండవలెను. చిత్రమునందు చూచినవెంటనే దేనితో చేయబడినవస్త్రమో మనము పోల్చి వేయవలెను.
తెల్లవస్త్రములయొక్క ఛాయ వెనుకభాగముయొక్క రంగునుబట్టి యుండును. వెనుకభాగము ఆకుపచ్చగ నుండిన ఛాయయందు కొంచె మాకుపచ్చను వేయవలసి యుండును. వీ లైన యారంగు నుపయోగించుట యుక్తము.
నీలిబట్టరంగు కొంచెము రక్తవర్ణముగను, రక్తవర్ణమిశ్రిత మైనసిపియాగను ఉండును. ఊదామిశ్రిత మైన నీలిబట్ట ఛాయ నారింజరంగుగ నుండును. కొంచెము ఛాయయున్నచోటులయందు కోబాల్టు ఉపయోగపడును. నల్లనిలేసుయొక్క ఛాయయందు గాడ మైననీలి కలిసియుండును. నల్లనిబట్టలకు, సిపియాను, క్రిమిజనులేకును, ఇండిగోరంగును కలిపి వేయుదురు.
పసుపుపచ్చని బట్టలఛాయకు బరంటుశయనాను, వేండిక్కుబ్రౌనును ఉపయోగింతురు. బట్టకు వేయుటకు గెంబోజిని ఇండియాపసుపును ఉపయోగించుట మంచిది.
వెనుకభాగము:- వెనుకభాగములు సులభముగ చిత్రించవచ్చు నని యిదివరకు చెప్పి యుంటిని. సాధారణముగ వీటిని చిత్రించుట సులభమే. కాని యిందు ప్రవీణత కలుగజేసికొనుట కష్టము సర్ జోషువా రేనాల్డ్సు దొరగారు చిత్రము నంతను శిష్యులచేత వ్రాయించి వెనుకభాగములనుమాత్రము తామే చిత్రించుచు వచ్చిరట. ముఖమును బాగుగ చిత్రించుట వచ్చిననేకాని యీవిషయమై విద్యార్థులు తలపెట్టరాదు. కాని వారిసహాయార్థమై యిందు కొన్నియంశములను పొందుపఱుచుచున్నాను.
ముఖమే చిత్రమునందు ప్రధానము. అందువలన నీవెనుకభాగములు ప్రకాశమాన మైనరంగులతో చిత్రించరాదు. ఇటుల చేసినయెడల చిత్రముయొక్క ప్రాముఖ్యము తగ్గిపోవును. ఒకేవిధ మగురంగుతో దీనిని చిత్రించరాదు. వివిధ మైనరంగులను కలిపి మోటుగా పూయుట మంచిది. ఈరంగు కొన్నిభాగములయందు దట్టముగను, కొన్నిచోట్ల పలుచగను వేసినయెడల చిత్రమువెనుక నేదో యొకరంగు కాగిత మంటించినటుల కానరాదు.
చిత్రమువెనుక నేదైన ప్రదేశచిత్రము వ్రాసిన, అం దుండువస్తువులు తక్కువగా నుండవలెను. వీటికి గాడమైన రంగులను వేసి ప్రాముఖ్యము నివ్వకూడదు. ఈవిషయము ప్రదేశచిత్రపటములయందుకూడ పనికివచ్చును. ఇట్టి సమయమునందు ఆకాశపురంగు ఎఱుపుసంబంధ మైనదిగ నుండిన మంచిది. వేండిక్కును రీనాల్డ్సును వారిచిత్రముల వెనుకభాగములయందు ప్రదేశచిత్రములనే విశేషము చిత్రించిరి. ప్రధానచిత్రమునందు గాడ మైనరంగులను వేసియుండిన వెనుకభాగములకుగూడ కొంచెము దట్ట మైనరంగులను వేయవలెను. ఛాయ ముఖమునందు దట్టముగ లేనియెడల వెనుకభాగమునకు కొంచెము తేలికరంగు వేయుట మంచిది.
వెనుకభాగములకు నీలిని, ఎఱుపును పలుచగ వేయవచ్చును. ఎఱుపు వెనుకభాగమునం దుండునటుల చిత్రించుట యిందు చెప్పెదను. వెనుకభాగమునందు ఎఱుపువస్త్ర ముండినటుల వ్రాయవలె ననిన, ప్రధాన మైనముడుతలను, ఛాయను సిపియాతో మొదట చిత్రించి,పిమ్మట కారుమైను ఎఱుపును పలుచగ వేయవలెను. ఇది బాగుగ నారినపిమ్మట గెంబోజిపసుపును పలుచగ వేయుము. ఛాయను, ముడుతలను, సిపియాతోను, అమిజనులేకుతోను వేండిక్కుబ్రౌనుతోను బాగుగ కనుపడునటుల చేయవలెను. పిమ్మట నీరంగులపై సిపియాను వేండిక్కుబ్రౌనును వేసి చక్కచేయవలెను.
వెనుకభాగమునకు నీలిరంగును వేసినయెడల ముఖముయొక్క ప్రాముఖ్యము తగ్గిపోవును. కాని యీరంగుయొక్క గాడమును, యిండియా యెఱుపుతోను, సిపియాతోను తగ్గించవచ్చును.
పసుపుపచ్చనిరంగును వెనుకభాగమునకు వేసి, బరంటుశయనారంగుతోను, వేండిక్కుబ్రౌనురంగుతోను, సిపియాతోను ఛాయ నివ్వవలెను. పసుపురంగుయొక్క ప్రాముఖ్యమును తగ్గించవలె నన్న నీలిని వేయరాదు. ఇటుల వేసినయెడల అంతయు ఆకుపచ్చ నైపోవును. నీలితో కొంచె మెఱుపును కలిపి ఉపయోగించవచ్చును.
వెనుకభాగములయందు ప్రదేశచిత్రమును వ్రాయవలె నన్న దూరముగ నుండుస్థలమును, ఆకాశమును, కోబాల్టునీలితో చిత్రించవచ్చును. మేఘములకు తేలిక యైనఎఱుపురంగును, నీలిని, ఇండియాయెఱుపును పూయవచ్చును. దగ్గరనున్నస్థలములకు సిపియాను, ఇండిగోరంగును వేయవచ్చును. దూరముగ నున్న చెట్లకు పసుపును, తుప్పలకు గెంబోజియును వేయుట మంచిది. దగ్గర నున్నచెట్లకు ఆకుపచ్చను, బరంటు శయనారంగును వేయుట యుక్తము. గాడ మైనఆకుపచ్చ నెంతమాత్రము నుపయోగించరాదు.
మార్పులు, దిద్దుబాట్లు:- రంగులను వేయుటయం దనేకతప్పులకు లోనౌదుము. అందువలన దిద్దుట యనవసరము. కావలసినచోట్లయందే దిద్దవలెను కాని అనవసరముగ నీపనిని చేయరాదు. ఇటుల చేసినయెడల కాగితము చెడిపోవును. చిన్నదిద్దుబా టేమైన నున్నయెడల చిన్నతడిగుడ్డతో నైనను, రొట్టెతో నైనను చెఱపవచ్చును. ఈపనిని చేయునప్పుడు కాగితము కరకుగా నైపోయినయెడల గోరుతో నదిమిన నున్న నైపోవును. విస్తారము దిద్దుబా ట్లున్నయెడల సముద్రపుపాచి (Sponge) నుపయోగించుట యుక్తము. చెరుపునప్పుడు ఇతరస్థలములయందు ఈపాచి తగిలి చిత్రము చెడిపోవును. కనుక ఎంతవఱకు చెరుపవలయునో అంతవరకు మఱియొకడ్రాయింగు కాగితముపై కన్నము చేసి దాని స్థలమునం దుంచి తడిపాచిముక్కతో దానిపై వ్రాయవలెను. చిత్రముపై నొక్కచోటుననే దీనిని విస్తారముసే పుంచరాదు. పాచియందు విస్తారము జల ముండరాదు. చెరిపిన చోటున మఱియొకమారు చిత్రించవలె నన్న నిదివరకు చెప్పినపద్ధతి ననుసరించవలెను. స్పాంజితో చెరుపునప్పుడు కాగితము చెడిపోవచ్చును. అట్టి స్థలమునందు రంగులు వేయుట కష్టము. ఈస్థలమును బాగుచేయుటకు మఱియొక్క పద్ధతి యున్నది. చెడిపోయిన చోటును మంచియిసుకకాగితముతో (Sand Paper) మెల్లగ వ్రాసినయెడల కాగితమునకు తొలిరూపు వచ్చును.
చిన్నతప్పులను దిద్దుటయందు స్పాంజితోను, తడిగుడ్డతోను, రొట్టెతోను తుడుచుటకంటె జాగ్రత్తతోనచ్చోట తెలుపును వేసిన చాలును. ఈరంగు బాగుగ నారినతరువాత దీనిపై మీయిష్టమువచ్చినరంగులను వేయవచ్చును.
సమాప్తము:- పైనచెప్పిన వన్నియు బాగుగ తెలిసియుండవలెను. వీటిని కంఠపాఠము చేయు మని నా యుద్దేశముకాదు. ఈచిన్నగ్రంథమును దగ్గర పెట్టుకొని యిందు చెప్పియున్నప్రకారము చిత్రించుచున్నయెడల నదియే యలవడును. పిమ్మట నీవే స్వతంత్రుడవు కావచ్చును. అభ్యాసము చేసినకొలది నిపుణత్వము ఎక్కువ కాగలదు. గొప్పచిత్రకారులు వ్రాసి పూర్తిచేయునటువంటి చిత్రములను చూచి మనము విస్తారము నేర్చుకొనగలము. సుప్రసిద్ధ చిత్రకారుడు చిత్రించుటను చూచుటకంటె యీవిషయమున భాగ్యము కలదా?ఇట్టివి చూచుటవలన పూజ్యు లగునాపురుషులు ఎటుల రంగులను వేయుచుండిరో మనకు విశదమగును.
వివిధతరగతులయం దుండుచిత్రములను జాగ్రత్త చేసికొని వాటిసహాయముద్వారా రంగులను నేర్చుకొనుట మంచిది. ఎచ్చట నైన తెలియకపోయినయెడల కొంచెము వాటివైపున దృష్టిని నిగిడించిన చాలును. కష్ట మంతయు తొలగిపోవును.
ఇంతటితో నీవిషయము చాలింతము.
ఐదవ భాగము.
వివిధాంశములు.
నిలిచియున్ననీరు, ప్రతిబింబములు:- నిలిచి యున్ననీటియందు నలువైపుల నున్నవస్తువులు ప్రతిఫలించును. అందు కెరటములు లేనిసమయమున నెన్నియో చిత్రములను చూడ నగును. అట్టిచిత్తరువులను వ్రాయగలవాడే ధన్యుడు. కాని మనము కొంచెము దూరము నుండి చూచినయెడల నవి యన్నియు కానరావు. గాలివలన చిన్న