చలిజ్వరము/విషయసూచిక
విషయసూచిక
జ్వరభేదములు
జ్వరము సామాన్యవ్యాధి—జ్వరము ప్లేగుకంటె 15 రెట్లు ప్రజలను జంపును—జ్వరము వలన కలుగు ధననష్టము—శరీరారోగ్య నష్టము—ప్రజల మూఢవిశ్వాసము—కలరా అమ్మవారు—కాలికురుపు మంత్రము—చలికుదుపు దయ్యము—వైద్యుల లోపము—సర్కారువారి ఉపదేశము ప్రజలకు హితవుగానుండదు—వైద్యులదే భారము—జననమరణముల లెక్కలు తప్పులు—జ్వరభేదములు—జ్వరపు పుల్ల—జ్వరపు పుల్లను ఉపయోగించువిధము—సామాన్యరేఖ—జ్వర పరిమాణమును కొలుచుట—సామాన్య విపరీత జ్వరములు—దినదినజ్వరము—దినమువిడిచి దినమువచ్చు జ్వరము—క్వయినా యొక్క గుణము—మూడుదినముల కొకసారి వచ్చు జ్వరము—ఎల్లప్పుడు విడువకుండు జ్వరము. 1-18
చలిజ్వరము యొక్క పూర్వచరిత్ర
నామాంతరములు—మన్యపు జ్వరము—వరుసజ్వరము—మలేరియా జ్వరము—దోమ జ్వరము—శీతకట్టు జ్వరము—చలిజ్వరము యొక్క ముఖ్య చిహ్నములు—చలిజ్వరము యొక్క పూర్వచరిత్ర—విషమ జ్వర భేదములు—సంతతజ్వరము—సతతకజ్వరము—అన్యేద్యుష్క జ్వరము—తృతీయక జ్వరము—చతుర్థక జ్వరము—రసగత జ్వరము—రక్తగత జ్వరము—మాంసగత జ్వరము—మేదోగత జ్వరము—అస్థిగత జ్వరము—మజ్జగత జ్వరము—శుక్రగత జ్వరము—అసాధ్యజ్వరము—విషమ జ్వరములలో చలిజ్వరములు జేరియున్నవి—ఐరోపా ఖండమునందలి చలిజ్వరము—పూర్వులు చలిజ్వరములకు చెడుగాలి కారణమనిరి—క్వయినా పట్టును ' చిం ను ' అను ఆమె కనిపెట్టెను—రక్తములో మలేరియా పురుగులు ' లేవ రన్ ' కనిపట్టెను—దోమలకు మలేరియాకు సంబంధమున్నదని ' మేన్ సన్ ' కనిపట్టెను—దోమకడుపులో మలేరియా పురుగులు పెరుగుట ' రాస్ ' కనిపట్టెను—పక్షులలోని చలిజ్వరమువంటి జ్వరము—దోమ మూలముననే చలిజ్వరపు పురుగు వ్యాపించుచున్నది. 19-38
మలేరియా పురుగు
మలేరియా పురుగు మూలపదార్థపు సముదాయము - మలేరియా పురుగు, ఇది మన నెత్తురులో బ్రతుకును - మన నెత్తురులోని కణములు - నెత్తురులోని తెల్లకణములు - నెత్తురులోని ఎర్రకణములు - నెత్తురులోని మలేరియా పురుగులు - ద్విఖండ సంతానవృద్ధి విధానము - ఒక దినము కనేకలక్షలు పిల్లలు పుట్టును - సంయోగ సంహిత సంతానవృద్ధి - మలేరియా పురుగు - ఆడు మలేరియా పురుగు - ఒక్క దోమకాటునకు వందలకొలది మలేరియా పురుగులు నెత్తురులో కలియును - మానవులును దోమలే మలేరియా పురుగుకు పోషకులు - మలేరియా పురుగుల జాతి భేదములు. 39 - 46
దోమ
వివిధజాతుల దోమలు - అనాఫలీసు క్యూలెక్సు దోమలను వేర్వేరుగ గుర్తించు విధము - ఆడు అనాఫలీసు దోమను గుర్తించు విధము - దోమయొక్క రూపభేదములు నాలుగు 1. గ్రుడ్డు. 2. నీటిపురుగు. 3. కామాపురుగు. 4. రెక్కలుగల పురుగు - దోమలగ్రుడ్లు - దోమలు నీటిపురుగులు - దోమగూడు - రెక్కలుగల దోమలు - దోమపిల్లలను పరీక్షించు విధము - దోమపిల్లలను పట్టుసాధనము - అనాఫలీసు దోమల యుపజాతులు, వాని నివాసస్థానములు - అనాఫలీసు దోమల నడవడికల సంగ్రహము - క్యూలెక్సు దోమపిల్లల నివాసస్థానములు - స్టిగోమియా దోమపిల్లల నివాసస్థానములు - దోమలయొక్క నైసర్గిక విరోధులు - దోమలను నశింపుజేయు ఇతర సాధనములు. 47-6
చలిజ్వర భేదములు
చలిజ్వరభేదములు నాలుగు - ద్వితీయక జ్వరములు - సామాన్య తృతీయక జ్వరములు - విష తృతీయక జ్వరములు - చతుర్థక జ్వరములు - మలేరియా పురుగుల జాతులు నాలుగు - ఒక దినముననే రెండుసార్లు జ్వరము వచ్చుట - తృతీయక జ్వరపు పురుగుల వలన దినదినము జ్వరము వచ్చుట - రెండు మూడు జాతుల జ్వరము ఏకకాలములో వచ్చుట - సామాన్య జ్వరపు పురుగుల యొక్కయు విషజ్వరపు పురుగుల యొక్కయు ఆకార భేదములు. 63-68
చలిజ్వర లక్షణములు
చలిజ్వర లక్షణము లనేకము లన్నిజాతుల జ్వరములకు సామాన్యములు - జ్వరమునకు సూచకములు - నిజమైన జ్వరలక్షణములు - శీతలదశ - ఉష్ణదశ - స్వేదదశ - విరామ కాలము - విషజ్వర లక్షణములు - చలి ప్రారంభించునప్పుడు మలేరియా పురుగు పిల్లలు ఉత్పత్తి యగుచుండును - జ్వరము తీవ్రముగా నున్నప్పు డివి క్రొత్తయెర్రకణములలో ప్రవేశించును - విరామకాలములలో నివి యెర్రకణములను తినుచుండును. 69-77
చలిజ్వర నిదానము
కొన్ని వైద్యశాలలో చేయబడు వైద్యము - అనేక విధములగు జ్వరములు - జ్వరపుగడ్డ పెరిగి ఉన్నదా ? లేదా ? - లేనియెడల చలిజ్వరము గుర్తించుటెట్లు ? - నెత్తురును పరీక్షింపవలెను - సందేహముగా నున్నప్పుడు చేయవలసిన చికిత్స - సన్నిపాత జ్వరము క్షయజ్వరము మొదలగునవి. 78-85
చికిత్స
మొదట విరేచనములకు మందు ఇయ్యవలెను - చలిజ్వరములకు క్వయినా సిద్ధౌషధము - క్వయినాను ఎప్పుడు ఎట్లు ఇయ్యవలెను ఒకప్పుడు రెండు మూడు సంవత్సరముల వరకు క్వయినా ఇయ్యవలెను - పది సంవత్సరముల పిల్లలకు మోతాదు - 5 మొదలు 10 సంవత్సరముల పిల్లలకు మోతాదు - 5 సంవత్సరముల లోపలి పిల్లలకు మోతాదు - జ్వరము తగ్గిన తరువాత చేయవలసిన చికిత్స - క్వయినా యందు మనప్రజలకు గల ద్వేషమునకు కారణములు - కొందరు స్వదేశవైద్యులు చేయు పద్ధతి - ఏ మందు త్వరలో వ్యాధిని కుదుర్చునో అదియే మంచి మందు - ప్రజలు క్వయినా యందలి ద్వేషమును విడువవలెను - మాత్రలు, ద్రావకము, పొడుము; వీనిలో నేది మంచిది - విషజాతుల చలిజ్వరములలో క్వయినాను నెత్తురులోనికి పిచ్చికారి చేయుట యుక్తము - చలిజ్వరముతో కూడ ఇతర వ్యాధు లున్నయెడల వానికి ప్రత్యేకముగ చికిత్స చేయవలెను. 86-98
చలిజ్వరమును నివారించు పద్ధతులు
క్వయినాయొక్క సాయముతో చలిజ్వరమును నివారించు పద్ధతులు - చలిజ్వరపు రోగులనందరను లెక్కించి వారల కందరకు క్వయినా యియ్యవలెను. తాముమాత్రము వారమున కొకసారి క్వయినా పుచ్చుకొనవలెను - క్వయినా యొక్క సాయము కోరకయే చలిజ్వరము నివారించు పద్ధతులు - అనాఫలీసు దోమలను నశింపు చేయవలెను - మనయిండ్లలో నుండు దోమల నివాసస్థానములు - ప్రతిమానవుని దోమకాటునుండి కాపాడవలెను - దోమలు ప్రవేశింపరాని ఇండ్లు ; దోమతెరలు - ఇతరులను చలిజ్వరపు రోగులను విడదీసి ప్రత్యేకముగ నివసింపచేయవలెను - గ్రామమున కర మైలుకంటె దూరమున నుండు నిండ్లలో నివసింపవలెను. - ఉపసంహారము - దొరతనమువారును ప్రజలును ఒండొరుల సాయము నపేక్షించుచు దేశక్షేమమునకు తోడ్పడవలెను. 99-112
పవిశిష్టము : - 113-116