వికీసోర్స్ కి సరిపోవుట మరియు నకలు హక్కులు

మార్చు

వికీసోర్స్ లో ఇప్పటివరకు ఇచ్చిన వివరణలు మూలములు బట్టి నాకు భాగవతాన్ని కంప్యూటర్ తో విశ్లేషించిన వివరాలు గల గ్రంథమని అర్థమైంది. అయితే ఇది ఇప్పటికే పుస్తక రూపంలో ముద్రించినట్లు తెలియలేదు. అలా కానట్లయితే వికీబుక్స్ లో వుంచడము మేలు. ఇంకొక ముఖ్యమైన విషయం నకలుహక్కులు. వికీ ప్రాజెక్టులలో చేర్చిన వివరమంతా ఏప్రయోజనానికైనా ఎవరైనా వాడుకోటానికి వీలువుంటుంది. దీనివనరులు CC-BY-NC-SA పరిమితిలో వున్నందున, ఆ లైెసెన్స్ మార్చుకుంటే తప్ప వికీలో వుంచుట మంచిది కాదు.--అర్జున (చర్చ) 05:49, 5 జూలై 2013 (UTC)Reply

  • నమస్కారం అర్జున రావు గారు. మీరు చూపుతున్న శ్రద్దకు ధన్యవాదాలు.

ఇక్కడ పెట్టబడు 'తెలుగు భాగవతము' నా "భాగవతము గణనాధ్యాయము" అనే అధ్యయనంలో భాగం. దీనితో సహా ఈ గణనాధ్యాయంలోనివి "సిసి లైసెన్సు నాన్ కమర్షియల్, యూజ్ ఎలైక్ (CC-BY-NC-SA)" కింద ఉన్నాయి. ఈ తెలుగు భాగవతంతో పాటు నా గణనాధ్యాయ సంకలనాదులు "తెలుగుభాగవతం.కం" (telugubhagavatam.com) అనే జాలికలో ఈ CC-BY-NC-SA లైసెన్సు కిందనే ప్రచురింబబడుతున్నవి. ఈ లైసెన్సు వివరాలు తెలుగుభాగవతం.కం లో చూడవచ్చు [1]. తెలుగుభాగవతం.కం ఒక లాభాపేక్ష రహితమైన వ్యాపారాత్మకముకాని (non commercial, non profit oriented) సంస్థ. ఇప్పటివరకు పుస్తకరూపంలో ఏవి ప్రచురించలేదు. వికీ బుక్స్ లో ఎందుకు పెట్టమంటున్నారో దయచేసి విరించండి. నా జిమైలు విఎస్ రావు50. వేగరి (ఈమైలు) అయితే నేను వెంటనే చూడగలుగుతాను.

      • క్షమించాలి లింకు చూపుట రాలేదు. శ్రమ తీసుకోగలరు.
పై వ్యాఖ్య సాంబశివరావు గారు సంతకచేయకుండా రాశారు.
  • లింకు ఇంతకముందే చూసి అనుమానం వచ్చి వ్యాఖ్య వ్రాశాను. వికీలో వున్నవి ఎవరైనా మార్పులు చేయవచ్చు. ఎవరైనా దేనికైనా వాడుకోవచ్చు. మీరు వాణిజ్యపరమైన వాడుకకు అనుమతించలేదు కాబట్టి, మీ గ్రంథము ఇక్కడ చేర్చితే మీరే అనుమతించినట్లు అవుతుంది. ఇక వికీబుక్స్ లో ఎందుకు సలహా ఇచ్చానంటే, మీ పనిలో ఆసక్తి గల ఇతరులు సహకరించటానికి అభివృద్ధిచేయటానికి వీలుంటుంది. వికీసోర్స్ లో మూలరూపము మార్చకుండ భద్రపరచటమే విధానం. --అర్జున (చర్చ) 12:10, 6 జూలై 2013 (UTC)Reply
  • మిత్రులు అర్జున రావు గారికి,

క్షంతవ్యుడను సంతకచేయలేదు. దీనికి తె నుండి ఇం కి మారటానికి బద్దకం కూడా కారణమే నండి. ధన్యవాదాలు. మీరు చూపిన శ్రద్ధకి, అభిమానానికి శతధన్యవాదసుమాలు. అందరికి అన్నిరకాలుగా అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంతోనే వికీలో పెట్టా లనుకుంటున్నాం. వికి కాపీరైటు నిబంధనలు మాకు అంగీకారమేనండి. మీ సహృదయత వలన కాపీరైటు విషయంలో కొంత వివరం తెలిసింది, వికీ బుక్స్ తెలిసింది. భాగవత పాఠ్యంలో అక్షరదోషాలు దిద్దటం తప్పించి ఇతర అవసరాలు నాకు తెలిసి లేవండి. కనుక ఇప్పుడు వికీసోర్సులో పెడదాం. ఇక నా భాగవత గణనోపాఖ్యానానికి సహకరించటానికి ఎవరు ముందుకు రారు అని నమ్మకం ఏర్పడిందండి. ఏం చేస్తాం పోనీ లెండి. V Sambasiva Rao (చర్చ) 11:34, 9 జూలై 2013 (UTC)Reply

  • మీ స్పందనకు ధన్యవాదాలు. పోతన భాగవతం పుస్తకం చేర్చడానికి కొన్ని ప్రయత్నాలు జరుగగా, వాటిని ఒక చోటికి తీసుకురావటానికి ప్రయత్నం శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము తో ప్రారంభమైంది. అదే మూలం మీరు వాడినట్లయితే ప్రత్యేకంగా పేజీలు సృష్టించకుండా ఆ కృషికి సహకరించండి. మీ మూలము వేరైనట్లయితే ప్రత్యేకంగా చేర్చవచ్చు. అవసరమైతే ఆ మూలం నుండి నకలు చేసి అతికించవచ్చు. గణనోపాఖ్యానంలో విశేషాలను పుస్తకం రూపంలో వెలువరించాలనుకుంటే వికీబుక్స్ లో వ్యాసాలు వ్రాసి ప్రయత్నించండి. ఉదాహరణకు నేను తయారు చేసిన ఉబుంటు వాడుకరి మార్గదర్శిని చూడండి. శ్రీమహాభాగవతము, తెలుగు భాగవతము మధ్య గందరగోళాన్ని నివారించడానికి, వీలైతే విలీనం లేకపోతే తెలుగు భాగవతము ను తగినట్లుగా పేరు మార్చితే మంచిది. --అర్జున (చర్చ) 03:48, 10 జూలై 2013 (UTC)Reply
  • సాంబశివరావు గారు చొరవతో నాతో ఫోన్లో చర్చించినతరువాత తెలిసిన విషయాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. తెలుగు అకాడమీ వారి మహాభాగవతమునకు, సాంబశివరావు గారి సంకలనమునకు తేడాలుంటాయి. వారి గణాంకాల విశ్లేషణ వారు కూర్చిన పుస్తకానికి సంబంధించినవి మాత్రమే. వారి కూర్పు ప్రజలకు మరింత చేరువచేయటానికి వికీసోర్స్ లో వుంచాలనుకుంటున్నారు. అయితే వర్డ్ లేక ఎక్సెల్ ఫైళ్లలో వున్న సమాచారాన్ని లేక వారి వెబ్సైటు లో వున్న సమాచారాన్ని రూపం చెడకుండా వుండటానికి వికీ సింటాక్స్ వాడి ఎక్కించాలి. ఈపని విస్తృతి దృష్ట్యా బాట్ ద్వారా చేయడం మంచిది. దీనికి సంబంధించి సిఐఎస్ ఎ2కె ప్రోగ్రామ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో సంప్రదించమని సలహా. ప్రస్తుతానికి వ్యాసం పేరు అలానే వుంచి పనిమొదలైనప్పడు తగిన పేరుకు మార్చితే మంచిది. --అర్జున (చర్చ) 09:00, 10 జూలై 2013 (UTC)Reply
:::::

రాజ శేఖర్ గారికి, అయ్యా, (1) పోతన ఇతర రచనలు 3 అప్లోడు చేసా. కాని నారాయణ శతకం బమ్మెర పోతన పుటలో ఉంది, చూసుకోకుండా పెట్టాసా. అందుచేత వాడుకరి:వైజా సత్య గారికి కాని అర్జున గారికి కాని చెప్పి రెంటిలో ఒకటి తీసేయించండి. (2) కొన్ని లింకులు సరిగా పెట్టలేక పోయా, సరిచేసిపెట్టండి. (3) తెలుగు భాగవతం లోని భాగవతమ, భోగినీ దండకం, వీరభద్ర విడయాలకి లింకులు పోతన పుటలో పెట్టించండి, నాకు రాటం లేదు. అలాగే నారాయణ శతకం ఉంచిన దాని లింకులు తెలుగు భాగవతం, పోతన పుటలలో పెట్టించ పెట్టండి. Thanking you sir, in anticipation.V Sambasiva Rao (చర్చ) 15:42, 26 జూలై 2013 (UTC)Reply

@V Sambasiva Rao గారు, మీ వ్యాఖ్య ఆలస్యంగా స్పందిస్తున్నందులకు క్షమించండి. మీరు ఎక్కడ అప్లోడ్ చేశారు, వాటి లింకులివ్వండి. సూచిక:Sri Mahabagavathamu Vol 1.pdf పాఠ్యీకరణ పూర్తికాలేదు. దానిగురించి మీకు ఆసక్తివున్నచో అది తొలిగా పూర్తి చేయడం మంచిది. అర్జున (చర్చ) 00:24, 13 జూలై 2021 (UTC)Reply

పుస్తక స్కాన్ ఆధారితం కాని తెలుగు భాగవతమును వికీబుక్స్ కు తరలింపు

మార్చు

 Y సహాయం అందించబడింది

వాడుకరి:V Sambasiva Rao గారు, మీరు తెలుగు భాగవతమును యదువంశము తో విస్తరిస్తున్నందులకు ధన్యవాదాలు. ఆయితే ఈ రూపంలో పుస్తకంలోలేని టీకా లాంటి వివరాలు గమనించాను. పుస్తకానికి యథాతథంకానివాటికి వికీసోర్స్ ప్రాజెక్టు సరియైనది కాదు. మీరు వీటికి వికీబుక్స్ వాడవచ్చు. ఇలా చేయటం వికీసోర్స్ సమగ్రతను కాపాడటానికి అవసరం. మీరు ఇప్పటికే చేర్చిన విషయాలను వికీబుక్స్ లోకి తరలించటం వీలవుతుంది. ఇప్పటికే వికీపీడియాలో చేర్చిన వేమూరి గారి నిఘంటువులను వికీబుక్స్ లోకి తరలించాము.(ఉదాహరణ b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు) మీకుగాని, ఇతరులెవరికైనా అభ్యంతరాలుంటే వారం రోజులలో తెలపండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 00:37, 11 జూలై 2021 (UTC)Reply

విషయపేజీలలో వాడుకరి సంతకాలు వివరాలు తొలగించాలి

మార్చు

ఇంకొకసంగతి, మీరు ఈ విషయమై పరిశోధించి మీ బ్లాగ్ ఇతరత్రా ప్రచరించినవాటిలో మీ పేరు, లేక ఇక్కడ చేర్చినప్పుడు మీ సంతకం లాంటి వివరాలు గమనించాని. వీటిని తొలగించాలి. పుస్తక తొలిపేజీలో పరిచయంలో దీనికై కృషిచేసిన వారి పేర్లు చేర్చివుంటే చాలు. --అర్జున (చర్చ) 00:43, 11 జూలై 2021 (UTC)Reply

పుస్తకాన్ని యథాతథంగా చేర్చిన విషయాలు

మార్చు

వాడుకరి:V Sambasiva Rao గారు, పుస్తకాన్ని యథాతథంగా చేర్చినవాటిని, వాటి మూల పిడిఎఫ్ లింకులు తెలిపితే, పిడిఎఫ్ వికీసోర్స్ లో చేర్చి వుంచి పుటలను సవరించటానికి వీలవుతుంది. గమనించండి.--అర్జున (చర్చ) 00:46, 11 జూలై 2021 (UTC)Reply

శ్రీ అర్జున గారు నమస్కార పూర్వక ధన్యవాదాలు. యదువంశము వికీ బుక్స్ లోకి మార్చి పెట్టండి. ఇకపై పెట్టేవి బుక్స్ నందు పెడతానండి 2021-07-11T19:57:22‎ V Sambasiva Rao
వాడుకరి:V Sambasiva Rao గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. వికీబుక్స్ లో వికీసోర్స్ నుండి దిగుమతి చేయటకు అనుమతి అభ్యర్ధన నమోదు చేశాను. మీరు, ఇతరులు అక్కడ స్పందించండి. --అర్జున (చర్చ) 04:22, 12 జూలై 2021 (UTC)Reply
వాడుకరి:V Sambasiva Rao గారు, అలాగే మీరు చేర్చిన భాగవతానికి ఒకే పుస్తక మూలం లేనందున, దానిని కూడా వికీబుక్స్ కు తరలించడం గురించి కూడా స్పందించండి. --అర్జున (చర్చ) 04:30, 12 జూలై 2021 (UTC)Reply
మాన్యా నమస్కారం. . మీరు చూపుతున్న అభిమాననికి ధన్యలాదములు . . అయ్యా వికీ బుక్స్ లో వేద్దాం అంటున్నారు. కాని ప్రజలకు సోర్స్ లో ఉన్నట్లు డౌన్లోడింగు అవకాశం లేకపోతే బుక్స్ అని పెట్టిన ప్రయోజనం ఉండదు.. అట్టి అవకాశం బుక్స్ లో ఉందా. అలా ఉన్న ఏదైనా ఉదాహరణగా English ఐనా లేదా హిందీ ఐనా సరే దయచేసి చూపండి. . నేను పొతెభా. . పూర్తి అర్థ తాత్పర్యాలతో ప్రచురించగలను. ఇంకా మరికొన్ని derivated? పుస్తకాలు నావి ఉన్నాయి అవి కూడా పెట్టగలను. వికీసోర్సులో వద్దంటున్నారు కనుక ఆగుతున్నాను. దయచేసి సహాయంచేయండి. మీకు అభ్యంతరం లేకపోతే, వీలయితే చరణి (ఫోను) లో వివరిస్తే నాకు తొందరగా అర్థం అవుతుంది. నా సందోహాలు నవృత్తి చేసుకోగలను. గణనాధ్యాయి 06:01, 12 జూలై 2021 (UTC)
వాడుకరి:V Sambasiva Rao గారు, అన్ని వికీమీడియా ప్రాజెక్టులలో పేజీలో గల సమాచారాన్ని ముద్రించటానికి, పిడిఎఫ్ లో దిగుమతి చేసుకోవటానికి పేజీకి ఎడమవైపున వుండే పట్టీలో PDF రూపంలో దించుకోండి అనే ఆదేశం ద్వారా వీలుంటుంది. ఇక పేజీల సమూహాన్ని కూడా పిడిఎఫ్ లో దిగుమతి చేసుకోవడానికి గతంలో ఒక ఉపకరణం వికీమీడియాలో పనిచేసేది. దాని కొత్త రూపం తయారీలో వుంది. (ఉదాహరణ, సమూహపు పేజీల పుస్తకం ఉదాహరణ). చరవాణితో సంభాషించడానికి నాకు అభ్యంతరమేమి లేదు. కాకపోతే ఈ చర్చ అందరికి ఉపయోగం కావాలంటే చరవాణిలో చర్చించినవైనా ఇక్కడ చేర్చాలి.--అర్జున (చర్చ) 23:52, 12 జూలై 2021 (UTC)Reply
మాన్యా మరొక చిన్న మనవి. ఇది ఏక మూలమే నండి. మొత్తం పాఠమునకు రచయిత బమ్మెఱ పోతన మాత్రమే నండి. నేనువాడిని ఇంకా అనేకం ఉన్నాయి అవన్నీ సంకలనాలు మాత్రమే (వికీ సోర్సు లో కూడ పాత పుస్తకాన్ని కాపీ చేయడం లేదా సంకలనం.) నేను అదే సంతలనం చేస్తూ Addon Value గా అర్థాలు తాత్పర్యాలు ఇస్తున్నాను అంతే. ఏదీ నా స్వంత భావన కాని, సృజన కానీ లేదు. పోతన కాలంలో ఎలా ఉండేదో తెలియదు కాని పిమ్మట తాళపత్రాలు, వ్రాతప్రతులు, ప్రింటింగు వచ్చాయి అన్నిమాధ్యమాలలో పోతన భాగవత సంకలనాలు మాత్రమే నండి. ఇది నాకు తెలిసి పూర్తిగా Public Domain మాత్రమేనండి. 2021-07-12T12:52:12‎ V Sambasiva Rao
వాడుకరి:V Sambasiva Rao గారు, వికీసోర్స్ కు ముద్రిత పుస్తకం ప్రధానం. ఒకే రచయితవి వేరు సంకలనాలు ముద్రితమైతే వాటి స్కాను రూపాలను ఎన్నైనా వికీసోర్స్ లో చేర్చి పాఠ్యీకరణ చేయవచ్చు. మీరు చేర్చిన అర్థాలు, తాత్పర్యాలు మీ సృజనగానే పరిగణించాలి. వాటిని మీరు స్వేచ్ఛానకలుహక్కులలో విడుదల చేయటం వికీబుక్స్ లో చేర్చటానికి వీలుకల్పిస్తుంది. --అర్జున (చర్చ) 23:56, 12 జూలై 2021 (UTC)Reply
అర్జున గారికి, సాంబశివరావుగారు ఈ పుస్తకాన్ని కొన్ని సంవత్సరాల క్రిందట చేర్చితే; నేను ఇందులో ఒక చిన్న పాత్ర పోషించాను. తెలుగు భాగవతంతో పాటు వీరి చాలా ముఖ్యమైన రచనలు ముందుగా వీరి జాలగూడులో ప్రచురించబడినవి. వికీసోర్సు ప్రచురించబడిన రచనల వేదిక అని మీకు తెలిసిందే కదా. రచయిత స్వయంగా వీటిని తెలుగు వికీసోర్సులో చేర్చుతున్నారు కావున వీటిని వికీబుక్స్ కు తరళించ వలసిన అవసరం లేదు. గమనించండి. వికీసోర్సు మీద మంచి అభిప్రాయంతో మనకు అందజేస్తున్న ఉత్తమ రచనలను వేరొక చోటుకు తరళించాలన్న మీ ఆలోచన సరికాదు.--Rajasekhar1961 (చర్చ) 20:33, 12 జూలై 2021 (UTC)Reply

Rajasekhar1961 గారు, గత స్పందనలో తెలిపినట్లు వికీసోర్స్ భౌతికంగా ముద్రిత రచనలను యథాతథంగా చేర్చడానికి ఉద్దేశించినది. ఎలెక్ట్రానిక్ ముద్రితాలను కూడా పిడిఎఫ్ రూపంలో చేర్చి పాఠ్యీకరణం చేస్తున్నది మీకు తెలుసు. (ఉదాహరణ). వికీపీడియాలో ఎలా బ్లాగులు విశ్వసనీయమూలాలు కావో, స్వంత జాలగూడులో చేర్చినవి ఇక్కడ మరల చేర్చడం అలాంటి కోవకే వస్తుందని నా అభిప్రాయం. ఈ వ్యాఖ్య వాడుకరి:V Sambasiva Rao గారు చేసిన కృషి, నాణ్యతపై అభిప్రాయం కాదని అర్ధం చేసుకోమని మనవి. వికీసోర్స్ నాణ్యత మదింపు చేయడానికి స్కాన్ ఆధారిత పేజీలను పరిగణించి తెలుగు భాషకు 39.22 శాతం (ఈనాటి గణాంకం, లింకు) గా వుంది. స్కాన్ ఆధారితం కాని పేజీలు చేర్చటం ఫ్రూప్ రీడ్ ఎక్స్టెన్షన్ అందుబాటులోకి వచ్చిన తరువాత చానా ఏళ్లక్రిందట నిలిపివేశాము. మరల ఇలా చేస్తే ఆ గణాంకం మరల తగ్గుతుంది. ఇంకొకవిషయం, వికీబుక్స్ ఏమీ పరాయి ప్రాజెక్టు కాదు, పుస్తకం వికీసోర్స్ లాగానే చదవటానికి అందుబాటులో వుంటుంది. శోధనయంత్రాల ఫలితాలలో వుంటుంది. ప్రస్తుతానికి పుస్తక రూపంలో దిగుమతి చేసుకోవటానికి వీలుపడదు. అంతే. --అర్జున (చర్చ) 00:13, 13 జూలై 2021 (UTC)Reply
@Rajasekhar1961 ఈ పేజీలో తొలి చర్చలో కూడా ఈ విషయం కొంతవరకు చర్చకువచ్చింది. అది కూడా గమనించండి. అర్జున (చర్చ) 00:25, 13 జూలై 2021 (UTC)Reply
@Rajasekhar1961 ; @[[వాడుకరి చర్చ:Arjunaraoc} అర్జున్]] గార్లు . . నమస్కారం మాన్యులారా .
"యదువంశం" బుక్స్ లోకి తరలిస్తాం అన్నారు దానికి అంగీకరిస్తున్నా అని గుర్తించి అభ్యర్థన పెట్టాను. అది ముందు కానివ్వండి.
గమనిక. .
తెలుగుభాగవతం వ్యక్తిగత బ్లాగు కాదండి. వ్యక్తిగత వెబ్ సైటు కాదండి, తెలుగుభాగవతం ఒక అంతర్జాతీయ సంస్థ (ఆర్గనైజేషను). తెలుగుభాగవతం.ఆర్గ్ ఆ సంస్తకు చెందిన ఒక జాలగూడు. మా సంస్థకు ఒక టస్టు (రిజిస్టర్డు) మున్నగునవి ఉన్నాయి. ఇది నా వ్యక్తిగతం కాదండి. నేను ఈ సంస్థకు చెందినవాడిని. ఆ సంస్థ మాది అని గర్వంగా చెప్పుకునే వారం ఉన్నాం. మాలో తమ Ph.D. papers పంచుకున్న వారు సైతం ఉన్నారు. నేను సాంబశివరావును తెలుగులో పిజి కాదు కనీసం యుజి కూడ కాదండి. దయచేసి ఇట్టి మా సంస్థను చిన్నబుచ్చకండి. కాపీరైటు నిబంధనలు గురించి వికీలో మేము పెడుతున్న సమస్త సమాచారం వికీ కాపీరైటు నిబంధనల ప్రకారమే పెడుతున్నాము. ఎట్టి కాపీరైటు నిబంధనలు అతిక్రమించము.
మరి శలవు. . .గణనాధ్యాయి 06:40, 13 జూలై 2021 (UTC)
వాడుకరి:V Sambasiva Rao గారు , ముందుగా ఒక మనవి, మీరు చర్చలకు ఒకే ఖాతా వాడడం మంచిది. మిమ్ములను గాని, మీ సంస్థనుగాని కించపరచే ఉద్దేశ్యం ఏ మాత్రము నాకులేదు. దానిని సూచించే వ్యాఖ్యను నా గత స్పందనలో చేశాను. అయినా మీరు నొచ్చుకున్నట్లుంది, క్షమించండి. వికీసోర్స్ ప్రాజెక్టు సమగ్రత, అభివృద్ధి మాత్రమే నా ఉద్దేశ్యం అని గ్రహించండి. వికీసోర్స్ లో చేర్చేవాటికి విశ్వసనీయత, ప్రామాణికత ముఖ్యం. వాటికి కనీస ఆధారం భౌతిక పుస్తక రూపంలో ముద్రణ అయిన వాటిని, ఇటీవలి కాలంలో ఎలెక్ట్రానిక్ రూపంలో ముద్రించిన పిడిఎఫ్ లు గలవాటిని వాడుతున్నాము. మీరు కాపీరైట్ గురించి స్పష్టత ఇచ్చాక, అది సమస్య కాదు ఇని ఇప్పటికే తెలిపాను. వికీబుక్స్ లో తరలించటానికి కనీసం చర్చ పూర్తయిన తరువాత, వికీమీడియా ఫౌండేషన్ అధికారులు అనుమతి ఇవ్వాలి. కనీసం 15-20 రోజులు పడుతుంది. ఇప్పటిలో పుస్తకాన్ని వికీసోర్స్ లో అప్లోడ్ చేసి మీరు మూలాన్ని యథాతథంగా చేర్చితే వికీసోర్స్ కు ఉపయోగంగా వుంటుంది. దీనిగురించి మీకు సహాయం కావలిసివస్తే అడగండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 01:08, 14 జూలై 2021 (UTC)Reply
అర్జున గారు, మన గణాంకాల కోసం మంచి మనసుతో మన తెలుగు వికీసోర్సులో పుస్తకాలను చేరుస్తున్న సాంబశివరావు వంటివారిని వెనుకకు పంపే ఆలోచనగా అనిపిస్తున్నది. వికీబుక్స్ అసలు ప్రారంభదశలో ఉన్నది (ఆంగ్లంతో సహా). తెలుగు వికీసోర్సులో వీటిని ఇంకా మరికొన్నింటిని మనం చేరుస్తున్న వారికి మనం ప్రోత్సాహించాలి. తెలుగు భాగవతం.ఆర్గ్ సంస్థ గురించి సాంబశివరావు గారు ఇప్పటికే తెలియజేశారు. ఆ సంస్థయొక్క రచనలను తెలుగు వికీసోర్సులో ఉంచాలనుకోవడం మన అదృష్టం. ఇక నారాయణీయం, యదువంశం మొదలైనవి కూడా ఇక్కడే ఉంచేందుకు మనం అంగీకరిస్తే మంచిది. అర్జునరావు గారు మనం ఇంకా పెద్ద కాపీహక్కుల సమస్యలున్నాయి. డిజిటల్ లైబ్రరీ రచనల గురించి. వాటి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వికీసోర్సు నుండి సమాజం అంగీకారం లేకుండా వికీబుక్స్ లోకి తరలించవద్దు.--Rajasekhar1961 (చర్చ) 14:36, 13 జూలై 2021 (UTC)Reply
@Rajasekhar1961 గారు, మీరు ఆంగ్ల వికీసోర్స్ లో కూడా కృషి చేసినవారు, చాలా ఏళ్లుగా తెలుగు వికీసోర్స్ లో కృషి చేసివుండి ఇలా వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా వుంది. గణాంకాలను సూచించింది. స్కాన్ ఆధారం కాని పుస్తకాలను చేరిస్తే, వికీసోర్స్ విశ్వసనీయత, ప్రామాణికత, అభివృద్ధి తగ్గుతుందని తెలపటానికే నండి, నాకేమీ ఇతర ప్రయోజనాలు లేవు. మంచి పుస్తకాలు వికీసోర్స్ లో ఉంచటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. గత 8 సంవత్సరాలనుండి తెలుగు అకాడమీ పుస్తకము వున్నా కూడా , దానికి అవసరమైన మూలాన్ని చేర్చడానికి సాంబశివరావు గారు లేక ఇతరులు స్కాన్ లేకుండా చేర్చిన పాఠ్యాలు ఉపయోగపడినా ఎందుకు, ఎవరూ ఆ పని పూర్తి చేయలేదు అని మనందరము ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవటం మంచిది. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కాపీరైట్ గురించి చర్చ జరిగింది. ఒక పరిష్కారం వెలువడింది. దానిప్రకారం పని జరుగుతున్నది కావున అది సమస్యగా నేను పరిగణించుటలేదు. ప్రాజెక్టు సమగ్రతను కాపాడాలనే, అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలకు ఎంతో బలహీనంగా వున్న సముదాయం బూచి చూపించకండి సార్. అర్జున (చర్చ) 01:20, 14 జూలై 2021 (UTC)Reply
నమస్కారం అర్జున్ గారు, రాజశేఖర్ గారు.
మేము పెట్టినవి అన్ని వికీ స్పూర్తికి, నియమాలకు అనుగుణంగానే ఉన్నాయని గమనించండి..
వికీ సోర్స్ అన్నారు దాని విశ్వనీయత ప్రామాణికత అవీ అన్నారు . వాటికి, వికీ ప్రోజెక్టు విషయంలో కూడా, ఎట్టి భంగం మేము కలిగించలేదు కలిగించము. ఇవి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు అవసరాలు కావండి. అవును వికీ బహు దొడ్డ సంస్థ. నా స్వంతం కాదు. ఇందులో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కడూ ప్రతీ సంస్థకూ సలహాలు ఇవ్వరాదు కదండి. ఐనా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏమైనా అభ్యంతరాలు ఉంటే, సంబంధించిన ఋజువులతో సహా చెప్పండి లేదా తగిన వేదికపై ఎక్కడిదైనా పరవాలేదు లేవనెత్తండి. ఇతర స్వార్థప్రయోజనాలు ఉన్నాయనడానికి అవకాశం ఇవ్వకండి. నాకు అవసరమైతే అదే చేస్తాను కాబట్టి ఇక్కడకూడా చెప్తున్నాను.
ఇంకొక చిన్న విషయం మీ దృష్టులకు తెస్తున్నాను. దయచేసి చూడండి. విశ్వసనీయత, ప్రామాణికతలతో పాటు నిబద్ధతలు మాకు మా సంస్థలలోని విషయ సంపత్తికి ఉన్నాయి కాబట్టే అనేక మాధ్యమాలలో ఉన్నాం. ఎక్కడే ఇబ్బందులు వచ్చినా తీరుస్తున్నారు. మాకు కాని మా సంస్థకు కాని వికీలో పెట్టడం వలన ప్రత్యేక ప్రయోజనాలు కాని పెట్టకపోతే వచ్చే నష్టాలు కానీ లేవు. పూర్తి అయాచితం నియమంగాపెట్టుకుని చేస్తున్నాం. వికీ స్పూర్తి విధానాలు మాకు అనుకూలంగానూ అద్భుతంగానూ ఉన్నాయి కాబట్టి పెడుతున్నాం. వికీ గణాంకాలు అవీ మేము చూడటంలేదు. ఆ అవసరం లేదు. మా గణాంకాలు కావలంటే అంతర్జాలం లో చూసుకోవచ్చు లేదా వ్యక్తిగంతగా అడగండి.
మరి శలవు. . .
గణనాధ్యాయి 05:45, 14 జూలై 2021 (UTC)
:::::::

అర్జున గారు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి శాసనసభ ఉపన్యాసాలు చేర్చారు. అవి స్కాన్ ఆధారితమైనది కాదు కదా. అలాగే ఒక అంతర్జాతీయ సంస్థ 10 సంవత్సరాలకు పైగా బహుళ ప్రాచుర్యం పొందిన భాగవతం.ఆర్గ్ వంటి సంస్థ యొక్క ప్రామాణికను మీరు శంకించాల్సిన అవసరం లేదు. వారిలో ముఖ్యమైన కీలకమైన వ్యక్తి సాంబశివరావు గారు స్వయంగా తానే ఈ పని చేస్తున్నారు. ఇంక మీకు దేనిగురించి అనుమానమో స్పష్టంగా తెలియజేయండి. వీరు చేరుస్తున్న పుస్తకాలకు వీరి వెబ్‌సైటు మాలంగా చేర్చడానికి సమస్య ఏమిటి స్పష్టంగా తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 22:37, 15 జూలై 2021 (UTC)Reply

@Rajasekhar1961 గారు, నేను గత స్పందనలో తెలిపినట్లు, పిడిఎఫ్ రూపం భౌతిక పుస్తకం స్కాను నుండి లేక నేరుగా ఎలెక్ట్రానిక్ రూపంనుండి కాని వున్నట్లైతే వికీసోర్స్ లో చేరుస్తున్నాము. ఇలా చేయడంవలన పాఠ్యీకరణలో దోషాలు ఇతరులు సరిదిద్దడానికి ప్రామాణికతకు ఆధారంగా వుంటుంది. సాంబశివరావు గారి సైటు నుండి చేర్చిన విషయాలు అలా చేయటానికి వీలుకాదు కదా. అదే అర్ధంలో నేను ప్రామాణికత పదాన్ని వాడాను. గమనించండి. అర్జున (చర్చ) 03:41, 20 జూలై 2021 (UTC)Reply
మాన్యులారా ఆత్మీయ రాజశేఖర్ గారు, అర్డున్ గారు నమస్కారములు.
మేము మామూలు వికీయనులము. మీరు వికీ బాధ్యులు. మీరు చేస్తున్న కృషి సామాన్యమైనది కాదు. అది తెలసి కూడ.
మన తెలుగుభాగవతం పుస్తకాల గురించి చిన్న అవగాహనా రాహిత్యం, తరం మార్పు వలన కావచ్చు, నేను కఠినంగా రెండుమార్లు మాట్లాడాను. మన్నింపదగిన వాడను.
వీటిని ఎక్కడ ఉంచాలంటే అక్కడకి బదలీ చేసిపెట్టండి. ఇదే నా అభ్యర్థన. ప్రతి దాని పేరు చివర దయచేసి “పీఠికల సహితం” అని చేర్చిపెట్టండి. ఏదైనా ముందు వివరణ ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పండి పెడదాము.
కొందరు, వికీయనులు కదా అక్కడ ఎందుకు పెట్టరాదు, అనడంతో మొదలెట్టాను. నాకు ఈ నియమాలు ఏవి ఎక్కడ ఉన్నాయి కనబడ లేదు / తెలియటం లేదు. మా ఉద్దేశం అన్నట్లు అనిపిస్తుంటే. అర్థం కాలేదు. ఇప్పుడు ఆంగ్లం వికీకి వెళ్ళి చూసాను, కొద్దిగా అర్థం అయింది. అంతే నండి. గణనాధ్యాయి 07:24, 16 జూలై 2021 (UTC)
వాడుకరి:V Sambasiva Rao గారు, మీ స్పందనకు, తరలింపు అంగీకారానికి ధన్యవాదాలు. వికీబుక్స్ కు తరలించిన తరువాత అవసరమైన మార్పులు అక్కడ మీరే చేయవచ్చు. --అర్జున (చర్చ) 03:48, 20 జూలై 2021 (UTC)Reply
@V Sambasiva Rao గారు, తొలిగా యుదువంశము ను వికీబుక్స్ లోకి తరలింపు పూర్తయింది. మీరు ఒకసారి సరిచూసుకొని ఏమైనా సందేహాలుంటే తెలపండి. అర్జున (చర్చ) 06:57, 3 ఆగస్టు 2021 (UTC)Reply
స్పందనలు లేనందున, తరలింపు సమస్యలు లేవని నమ్ముతున్నాను. వికీసోర్స్ లో యుదువంశము తొలగించుతున్నాను. అర్జున (చర్చ) 09:20, 12 ఆగస్టు 2021 (UTC)Reply
Return to "తెలుగు భాగవతము" page.